Devi Kathalu         Chapters          Last Page
 
శుకమహర్షి పరాశర పుత్రుడైన వ్యాసమహర్షి ఒకనాడు సరస్వతీ నదీతీరంలో సంచరిస్తూ, తనకు సంతానం లేదని చింతాక్రాంతుడై ఉన్నాడు. అలా ఉండగా, సమీపంలోని ఒక చెట్టు కొమ్మపై రెండు చిలుకలు అతనికి కనిపించాయి. తల్లి చిలుక తన సంతానమైన చిన్ని చిలుకకు తన నోటితో ఆహారం అందిస్తూ, తన...
మధుకైటభులు శ్రీహరి యోగనిద్రా ముద్రితుడై ఉండగా, ఒకనాడు అతని రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే మధుకైటభులు. వారిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నారు. తమకు మరణం లేని జీవితాన్ని వరంగా...
హయగ్రీవుడు ఒకనాడు బ్రహ్మాదిదేవతలు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు స్వర్గలోకానికి వెళ్ళి, రాక్షసుసతో యుద్ధం చేశాడు. భయంకరంగా సాగిన దేవాసుర సంగ్రామంలో ఎందరో రాక్షసులను సంహరించాడు. యుద్ధంలో తీవ్రంగా అలసిపోయాడు. ఏకాంత ప్రదేశానికి చేరుకుని తన...
భండాసురుడు పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా, పర్వత రాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై నియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మథుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి...
మహిషాసురుడు 'దనువు' అనే పేరుగల మహారాజునకు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరూ పెరిగి పెద్దవారైనారు. చాలకాలం వారిద్దరిలో సంతానం కలుగలేదు. సంతానం కోసం రంభుడు పంచాగ్ని మధ్యంలోను. కరంభుడు...
సుదర్శనుడు కోసల దేశాన్ని పాలకుడైన ధ్రువ సింధు మహారాజు సూర్యవంశంలో జన్మించినవాడు. అతడు ధర్మాత్ముడు , సత్యసంధుడు. వర్ణాశ్రమ ధర్మరక్షణ తన కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తున్న ఉత్తమ ప్రభువు. అతని రాజ్యంలో అన్ని వర్ణాలవారూ తమ తమ జాతులకు...
సత్యవ్రతుడు

కోసల దేశములో దేవదతద్తుడనే వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలనూ ఆకళింపు చేసికొని, ప్రశాంత జీవనం గుడుపుతూ వచ్చాడు. నగరంలోని సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ...

సుకన్య

సూర్యవంశంలో ఇక్ష్వాకుడనే రాజునకు శర్యాతి అనే సోదరుడున్నాడు. శర్యాతి కుమార్తె సుకన్య. సుకన్యను ఆ రాజు చ్యవనుడనే మహర్షికిచ్చి వివాహం చేశాడు. చ్యవనమహర్షి వృద్ధుడు, అంధుడు, అలాంటి వానికి శర్యాతి మహారాజు తన...

నవరాత్రి మహిమ

ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|
శరద్వసంత నామానౌ తస్మాత్‌ దేవీం ప్రపూజయేత్‌||

పంచ శక్తులు

పరాశక్తి అయిన జగన్మాత లోకసంరక్షణార్ధం వేఱువేఱు సందర్భాలలో వేఱువేఱు నామరూపాలతో ఆవిర్భవించింది. ఆయా దేశకాలాలలో తన దైన "దివ్య ప్రణాళిక" ను నిర్వహించే నిమిత్తం 'దుర్గ'గా , 'రాధ'గా, 'లక్ష్మి' గా, 'సరస్వతి'గా, 'సావిత్రి'గా...

దేవి అంశావతారాలు

లోకయాత్ర ధర్మబద్ధంగాను, వేదవిహితంగాను సాగాలనే సత్సం కల్పంలో , వివిధ సందర్భాలలో దేవీ తన అంశావతారాలను అనుగ్రహించింది. దేవికి ప్పతిరూపాలుగా స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణాదేవి, మంగళ చండిక మానసాదేవి, షష్ఠీ దేవి అనే వారు...

వేదవతి

మనువులలో ఒకడైన దక్షిణసావర్ణి వంశం తామర తంపరగా అభివృద్ధి చెందింది. ఆ వంశంలో ఇంద్రసావర్ణి కుమారుడైన వృషధ్వజుడు శివభక్తి పరాయణుడు. నిరంతరం పరమశివుని ధ్యానించేవాడు. అయితే అతడు తక్కిన దేవతలను చిన్నచూపు...

గాయత్రీ దేవి

పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు...

పార్వతీ దేవి

్హదక్షప్రజాపతి కుమార్తె సతీదేవి. దక్షుడు ఆమెను శివుని కిచ్చి వివాహం చేశాడు. దక్షప్రజాపతి దక్షుడే. ప్రపంచ సృష్టి కార్యక్రమ నిర్వహణ దక్షుడే. కాని, అహంకారి అజ్ఞానంతో చేయి కలిపి దక్షుని హృదయాన్ని ఆక్రమించింది. అతడు అనుచితాలు ఆచరించసాగాడు.... 

తులసి ్హగంధమాదన పర్వతంపై నిరంతరం విహరించే మాధవీ ధర్మధ్వజులనే దంపతులకు కార్తీక పూర్ణిమా శుక్రవారం నాడు ఒక ఆడపిల్ల పుట్టింది. సద్యో¸°వనంతో, పూర్వజన్మ స్మృతి జ్ఞానంతో జన్మించిన ఆ యువతికి తల్లిదండ్రులు '్హపద్మిని'్హ అని పేరు పెట్టుకున్నారు...
గంగా ,లక్ష్మీ,సరస్వతులు ్హ్హలక్ష్మీ దేవి, గంగాదేవి, సరస్వతీ దేవి అనే దేవతామూర్తులు ముగ్గురూ పూర్ణాంసతో మహావిష్ణువులో తాదత్మ్యం చెందారు. వారి కళలు మాత్రం భారతభూమిలో నదులుగా అవతరించాయి...
మణి ద్వీపము

 

్హతక్షక విషాగ్ని వలన తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించిన కారణంగా జనమేజయ మహారాజు సర్పజాతిపై ప్రతీకార వాంఛతో సర్పయాగం ప్రారంభించాడు. మంత్రశక్తి ప్రభావం వల్ల ఎక్కడెక్కడి పాములూ వచ్చి అగ్నికుండంలో ఆహుతి కాసాగాయి. కొండకోనల్లో,...
భువనేశ్వరి

్హదేవీ కథలను వినిపిస్తున్న వ్యాసమహర్షికి అలసట కలగడం లేదు. వింటున్న జనమేజయునకు తనివి తీరడం లేదు. జనమేజయుని కోరికపై వ్యాసమహర్షి భువనేశ్వరీ మహిమావిశేషాలను మరికొంత వివరించ సాగాడు...

Devi Kathalu         Chapters          Last Page