Sanathana Dharmamu    Chapters    Last Page

ఆచార్యవాణి

(ప్రధమ సంపుటము)

సనాతన ధర్మము

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి

తమిళ ఉపన్యాసములకు

తెనుగు అనుకృతి - ''విశాఖ''

ప్రకాశకులు

కంచి శ్రీ మహాస్వామి శతాబ్ది ప్రచురణలు

'గురుకృప'

18A, అజీజ్‌ నగర్‌ రెండవవీధి,

కోడంబాక్కం, చెన్నై - 600 024.

ప్రథమ ముద్రణము : సెప్టెంబరు 1993

ద్వితీయ ముద్రణము : నవంబర్‌ 1997

తృతీయ ముద్రణము : జనవరి 1999

వెల : రూ|| 50/-

విజ్ఞప్తి

ఆచార్యవాణి (ప్రథమ సంపుటము) మహాస్వామి వారి అమృతహస్తములచే ది.24.11.93న ఆవిష్కరింపబడినది. అనతి కాలమునకే ప్రతులన్నియూ వినియోగించబడినవి. ఎక్కువభాగము ముఖ్యులైన భక్తులకు ఉచితముగనే పంచబడినవి. మిగిలిన ప్రతుల అమ్మకములపై వచ్చిన స్వల్పమొత్తము పునర్ముద్రణకు సరిపోనందున పునర్ముద్రణలో జాప్యము జరిగినది.

ఈ మధ్య ఆచార్యవాణి (రెండవ సంపుటము) ''వేదములు'' అనుపేర విడుదలయిన తరువాత అనేకమంది భక్తులు మొదటి సంపుటమునకై వత్తిడి చేయుటచే మరల ప్రయత్నమారంభించితిమి. ప్రయత్నము చేయవలయునే కాని, సాఫల్య మొనర్చుటలో మహాస్వామివారి అనుగ్రహము మా వెన్నుదంటియుండునన్నది మా యనుభవము.

మా సోదరుడు చి|| సురేష్‌ ముఖ్యభూమిక వహించుటచేత ఈ ఆచార్యవాణి (ప్రథమ సంపుటము) 'సనాతన ధర్మమ'ను పేర పునర్ముద్రింప బడినది. ఈ మహత్కార్యమున పాలుపంచుకొనిన యావన్మందికిని, శ్రీ చరణులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులను ప్రసాదింపవలెనని వారి పాదుకలనంటి ప్రార్థించుచున్నాను. అస్తికమహాశయులు మా ఈ ప్రయత్నమును ఆదరించి, ఆశీర్వదించెదరుగాక!

చెన్నై

24.11.97 చల్లా విశ్వనాధశాస్తి

గ్రంధప్రాప్తి స్థానములు :

1. కంచికామకోటిపీఠము - కాంచీపురము

2.''గురుకృప'', 18A, అజీజ్‌ నగర్‌ రెండవవీధి, కోడంబాక్కం, చెన్నై - 600 024.

ఫోన్‌ : 044-4849728, 4847152.

3. సి-68, బాలాజీ టవర్స్‌, 1-1-538,

గాంధీనగర్‌, హైదరాబాద్‌ - 80.

ఫోన్‌ ః 040-7668023.

4. ఆధ్యాత్మిక పుస్తక విక్రయ కేంద్రములు, స్కందగిరి

కాచిగూడ మరియు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.

శ్రీః

శ్రీచంద్రమౌళీశ్వరాయ నమః

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య

జగద్గురు శ్రీశంకర భగవత్పాదాచార్య పరంపరాగతమ్‌

శ్రీకామకోటి మహాసంస్థానమ్‌

కాంచీపురమ్‌ - 631 502.

యాత్రాస్థానమ్‌ - కాంచీపురమ్‌ 8-8-93

సర్వప్రాణి హితమయినవి, సర్వధర్మమూలమయినవి యగు వేదవేదాంగముల యొక్కయూ, షడ్దర్శనములయొక్కయూ సార భూతములైన సిద్ధాంతములు మా గురుదేవులు - బ్రహ్మవిదులైన శ్రీమహాస్వామి వారు - అతి చిన్నమాటలలో సులభగ్రాహ్యముగా తమ అనేక అనుగ్రహ భాషణములలో విడమరచి చెప్పియున్నారు. అవి ''దైవత్తిన్‌ కురల్‌'' అను పేర ద్రవిడ భాషలో ఆరుసంపుటములుగా వెలువరించబడియున్నవి.

అందు కొన్ని విషయములు ఇతఃపూర్వమే తెనుగింపబడియున్ననూ, ఇంకనూ ఎంతయో తెనుగింపవలసియున్నది. ఇప్పుడు ''ఆచార్యవాణి''యను పేర నారంభింపబడిన పుస్తక పరంపరలో ప్రధమ సంపుటమున అద్వైతము, సామాన్యధర్మములు, గురుసంప్రదాయము మొదలగు అంశములపై శ్రీమహాస్వామివారొసగిన సందేశములు అనువదింపబడి ప్రచురింపబడుచున్నవని తెలుసుకొని ఎంతయో సంతుష్టులమయినాము.

తెనుగువారికి మహోపకారమయిన ఈ కార్యక్రమములో పాలుపంచుకొనిన అనువాద కర్తలు, బొంబాయి నగరవాసులు శ్రీ విశాఖకు, ప్రచురణకు వలసిన ద్రవ్యసహాయమొనరించిన తెనాలి మండలీకాశ్రమపు నిర్వాహకులు, చెన్నపురి నివాసులయిన చావలి శ్రీరాంకు, సంవిధానకర్త చెన్నపురివాసియైన చల్లా విశ్వనాధశాస్త్రికి గురుకృపచేతనూ, పరమేశ్వరానుగ్రహము వలననూ సర్వాభీష్ఠఫలసిద్ధియగుగాక యని నారాయణ స్మృతిపూర్వకముగా ఆశీర్వదించుచున్నాము.

ఇతి నారాయణ స్మృతిః

(కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీమజ్జయేంద్ర సరస్వతీ శ్రీచరణులొసగిన శ్రీముఖము)

Sanathana Dharmamu    Chapters    Last Page