Varahamahapuranam-1    Chapters   

ఓమ్‌

శ్రీ వరాహ మహా పురాణము

ప్రథమ సంపుటము

(తెలుగు తాత్పర్యముతో)

తాత్పర్య రచయిత

ఆచార్య శలాక రఘునాథశర్మ

తెలుగుశాఖ

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము

అనంతపురం - 515003

ప్రకాశకులు

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు - 500 020.

శ్రీ వరాహ మహాపురాణము

ప్రథమ సంపుటము - తెలుగు తాత్పర్యముతో

ప్రథమ ముద్రణము - 1998

ప్రతులు - వేయి

సర్వస్వామ్యములు ప్రకాశకులవి

మూల్యము : రూ. 120/-

ప్రతులకు :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టు

గురుకృప

1-1-140/1, ఆశోకనగర్‌

హైదరాబాదు - 500 020

______________________________________________________________________________

ముద్రణ :

ఫోన్‌ : 31575

శ్రీ లక్ష్మీగణపతి బైండింగ్‌ వర్క్స్‌,

మెయిన్‌ రోడ్‌, కొవ్వూరు - 534 350

సౌజన్య సంభావనము

బహు కాలమునకు పూర్వము అస్మద్గురువర్యులు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు నన్నీ వరాహపురాణ రచనా కార్యక్రమమునకు పురికొల్పిరి. వారి ఆశీస్సువలన ఈ గ్రంథమీనాటికి ఒక స్వరూపమునకు వచ్చుచున్నది.

పురాణ వాఙ్మయము విలువను గుర్తించి, నిర్వ్యాజమగు ప్రేమాదరములతో దానిని తెలుగు భాషలో తెలుగులిపిలో అందించు శుభ సంకల్పమును దైవికముగా పొంది అత్యంతశ్రధ్ధాసక్తులతో సమర్థతతో నిర్వహించుచున్న మాన్యవరేణ్యులు శ్రీ పి. వేంకటేశ్వర్లు గారి పూనిక సర్వాంధ్రలోకమునకు సతతము అభినందనీయము. ఈ పవిత్ర కార్యక్రమములో కొంత పుణ్యమునాకును దక్కించిన వారి సౌజన్యమును ఎల్లవేళల హృదయమున పదిలపరచుకొందును. ఈ రచనలో నేను చేసిన జాప్యమును వారు సహించిన తీరు వారి క్షమా గుణమెంత మిన్నులు ముట్టినదో వక్కాణించును. వారికి, వారివారికి సర్వవేళల భగవానుడు ఇష్టకామ్యార్థములను ప్రసాదించి ముక్తిభాక్కులను జేయుగాక అని ప్రార్థించుచుందును.

కొవ్వూరునందలి శ్రీలక్ష్మీగణపతి బైండింగ్‌ వర్క్సువారు ముద్రణ పరిశ్రమలో అగ్రగణ్యులనదగినవారు. ఈ గ్రంథమును సర్వాంగసుందరముగా తీర్చిదిద్దుటలో వారి దీక్షాదక్షతలు ప్రత్యేకించి చెప్పుకొనదగినవి. తదధిపతులకు, సిబ్బందికి సకల శ్రేయములు కలుగుగాక.

 

బహుధాన్య గురుపూర్ణిమ. శరశర్మ

9-7-98.

 

Varahamahapuranam-1    Chapters