Sri Matsya Mahapuranam-2    Chapters   

శ్రీ

శ్రీవేదవ్యాస మహర్షి ప్రణీతము

శ్రీ మత్స్య మహాపురాణము

(అనేక శ్రౌతస్మార్త ధర్మసంగ్రహాత్మకము)

ఆంధ్రానువాద సహితము

(ద్వితీయ సంపుటము)

అనువాదకులు :

శ్రీ పాతూరి సీతారామాంజనేయులు ఎం.ఏ.,

(తెలుగు-సంస్కృతము)

ప్రకాశకులు :

శ్రీ వేంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు 500 020.

ప్రథమ ముద్రణము సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

1987-ఏప్రిల్‌

ప్రతులు : 2000 కాపీలు మూల్యము : రూ. 81 - 00

వ్రతులకు : ముద్రణ :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ సహజ ప్రింటర్స్‌,

గురుకృప బాకారం, ముషీరాబాదు,

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు - 500 048.

హైదరాబాదు - 500 020. ఫోన్‌ : 6 8 0 4 1.

 

శ్రీ మత్స్య రూప నారాయణ స్తుతి

ప్రళయ పయోధిజలే

ధృతవానసి వేదమ్‌ |

విహిత వహిత్ర చరిత్ర మఖేదమ్‌ |

కేశవ! ధృత మీన శరీర !

జయ జగదీశ ! హరే !

తా. మీనరూపము ధరించిన కేశవా ! పూర్వతర కల్పమునందు సృష్టి ప్రక్రియలో బ్రహ్మకు వేదములు సాయముగా ఉండెను. కల్పావసానమున అవి ప్రళయ మహాసాగర జలములో అస్తవ్యస్తములయినచో మరల జరుగవలసిన సృష్టిలో బ్రహ్మకు ఈ శబ్దరాశి అందకపోవును. అట్టి చిక్కు రాకుండ నీవు ఈ అవతారము దాల్చితివి. ఓడయందు నరకులు నిలిపి కాపాడినట్లు నీవయినే వానిని నిలిపి అనాయాసముగ కాపాడితివి. ఈ మహాకార్యము నీకు తప్ప మరి ఎవరికి సాధ్యము ! జగదీశా! హరీ ! నీవు సర్వోత్కృష్టుడవయి వర్ధిల్లుచున్నావు. ఇట్టి నీకు వందనములు.

(జయదేవుడు - గీత గోవింద కావ్యము)

పఠితలకు మనవి

ఈ శ్రీమత్స్య మహాపురాణపు ప్రథమ సంపుటము వెలువడి పఠితల చేతులకు అందిన అనతి కాలములోనే ఈ ద్వితీయ సంపుటము కూడ ముద్రణము ముగిసి వెలువడుటకు శ్రీమత్స్యరూప జనార్దనుని కృపయు శ్రీజగద్గురువుల ఆశీస్సులను హేతువులు.

ఇందలి తారకోపాఖ్యానము నారసింహాద్యవతార వృత్తాంతములు భగవదుపాననాంగములుగా చాల అద్బుతాంశములు. నర్మదా వారాణసీ మాహాత్మ్యములు తీర్థక్షేత్ర మహిమలతో పాటు బాణాసుర త్రిపుర సంహారాది కథల ద్వారమున అనేక తాత్త్వికాంశముల నందించుచున్నవి. రాజధర్మాధ్యాయము మన భారతీయుల రాజ్యపాలన (Public Administration) విషయక భావనల (Concepts) ను కరతలామలకముగా చూపుచున్నవి. ఇందు ఋషులు ఉపయోగించిన రాజ నైతిక పారిభాషిక పదములు (Political technical terms) అధ్యయనీయాంశములు. ఈ ప్రకరణమునందలి శాంతిప్రకరణము మన ప్రాచీన నిబంధకారులు ఎల్లరును ప్రమాణముగా గ్రహించినట్టిది. గోత్ర ప్రవరాధ్యాయములు పరమ ప్రామాణికములగు ఆర్ష సంప్రదాయాంశములను అందజేయుచున్నవి. గృహ వాస్తుశాస్త్ర-ప్రాసాద (దేవాలయ) శాస్త్రాధ్యాయములు మన భారతీయుల వాస్తుశాస్త్ర జ్ఞానమునకు ఎత్తిన ధ్వజములుగా నున్నవి. భవిష్యద్రాజవంశాను కీర్తనాధ్యాయములు చారిత్రిక సత్యములను అనేకములను ప్రామాణికముగా అందజేయుచున్నవి. షోడశ మహాదానాను కీర్తనమునందలి ఆయా దానములను నిర్దనులును భావనాత్మకముగ యథాశక్తిగా ఆచరించి తరించవచ్చును. ఏమయినను అవి ప్రధానముగా రాజులను మహా ధనికులకు ఉద్దేశించి చెప్పబడినట్లు తోచును. ఇందలి విషయానుక్రమణికాధ్యాయము విలక్షణమయినది. 290 అధ్యాయములందలి సకలాంశములను 108 సంఖ్యలోనికి ఇమిడ్చి ఈ అనుక్రమణికా పారాయణము కూడ శ్రీమత్స్యనారాయణ నామాష్టోత్తర శతక పారాయణముగా ఋషులు మనకు ఇచ్చినట్లయినది.

ఇది ఆంధ్రభాష నెరిగిన సకల జనులకును ఇహపర సాధకమయి మోదప్రదమగు గాక! అని ఆశించు శ్రీవేంటేశ్వర ఆర్ష భారతీ ట్రస్ట్‌ పక్షమున --

హైదరాబాదు

ది. 30-3-1987 శ్రీ పాతూరి సీతారామాంజనేయులు

[శ్రీ ప్రభవ వత్సరాది] శ్రీ జంధ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

 

 

Sri Matsya Mahapuranam-2    Chapters