Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ ఏకాదశో7ధ్యాయః

(తాండవమహిమకథనము)

శ్లో || విష్ణోర్యోగజనిద్రయోక్షితశివానన్దోత్థనృత్తస్య తత్‌

ద్రష్టుం నృత్తమహీశ్వరః స వచసాగాద్వ్యా ఘ్రపాదాశ్రమమ్‌

ఏతౌ తిల్లవనే సమానలషితౌ శ్రీమూలనాథం మునీ

సేవేతే స్మ హరిశ్చ యోషిదభవచ్ఛమ్భోర్ని దేశా ద్వనే||

యోగమువలన కలిగిన నిద్రచే శివుని యానందనృత్తమునుజూచిన విష్ణువుయొక్క మాటచే సర్పరాజు ఆనృత్తమును జూచుటకు వ్యాఘ్రపాదాశ్రమమునకేగేను. ఒకేకోరిక గల యామునులిద్దరు తిల్లవనమున శ్రీమూలనాథుని సేవించుచుండిరి. హరియు నీశ్వరుని యాదేశముచే వనమున స్త్రీ యయ్యెను.

సూతః :

శ్లో || ఏవం నివసత స్తస్మిన్‌ మూలస్థానే మహౌజనః |

ప్రాదురాసన్నిమిత్తాని శోభనాని తపోధనాః ||

సూతుదు :

తపోధనులారా! మూలస్థానమున నీవిధముగా నివసించుచున్న మహాతేజోవంతుడైన మునికి శుభశకునములు కనబడినవి.

శ్లో || #9; తతః పతఞ్జలిః శ్రీమాన్‌ సర్వశాస్త్రవిశారదః |

ఆజగామ మునిః కర్తుమత్ర తీవ్రతరం తపః ||

పిమ్మట సర్వశాస్త్రములలో ప్రవీణుడైన శ్రీయుతుడగు పతంజలిముని యక్కడ నెక్కువ తీవ్రమైన తపస్సు చేయుటకు వచ్చెను.

ఋషయః :

శ్లో || ఇతి సంవసత స్తత్ర యోగతత్పరచేతసః |

మునేరస్య కథం ప్రాప సకాశం స పతఞ్జలిః ||

ఋషులు :

ఈవిధముగా నచ్చట యోగమందు లగ్నమైన చిత్తముతో నివసించుచున్న వ్యాఘ్రపాదునిదగ్గర కా పతంజలియెట్లు వచ్చెను?

సూతః :

శ్లో || క్షీరోదన్వని విస్తీర్ణే లహరీమాలికావృతే|

ముక్తాప్రవాలశోభాభిః సర్వదిక్షు గవాక్షితే||

కల్పక స్తబకోద్భాసిమౌలిభిస్సురసత్తమైః |

వేదైస్త్సువధ్భిరఖిలైః స్తూయమానో మునీశ్వరైః

ఫణామణి ప్రభాదీపమాలాపం క్తి సుశోభితే|

శేతే స్మ శేషశయనే భగవాన్‌ కమలాపతిః ||

సూతుడు :

కెరటముల మాలికలచే ఆవరింపబడి ముత్యముల యొక్కయు పగడములయొక్కయు కాంతులు అన్నిదిక్కుల యందు కిటికీలుగాగల విశాలమైన పాలసముద్రమున కల్పవృక్షపు పూలగుత్తులతో సుందరమైన సిగలుగల దేవశ్రేష్ఠులు, సమస్తవేదములు, మునులు, స్తుతించుచుండ భగవంతుడగు లక్ష్మీపతి పడగలమీది మణుల కాంతులనెడు దీపపంక్తులచే అలంకరింపబడిన శేషశయనమున పరుండెను.

శ్లో || #9; జాతు సన్త్యజ్య తాం దివ్యాం యోగనిద్రాం సకారణాత్‌||

ఉత్థాయ తత ఆసీనః తత్ర దధ్యౌ చిరం ప్రభుః ||

ఆప్రభువొకప్పుడేదియో కారణమువలన దివ్యమైన యోగనిద్రను విడచి లేచి పిమ్మట కూర్చుండి చాలసేపు ధ్యానము చేసెను.

శ్లో || తదానీం నిజభోగస్థమానన్దగురువిగ్రహమ్‌|

తం ధ్యాననిరతం వోఢుం న శశాక ఫణీశ్వరః ||

అప్పుడు తనశరీరముమీద కూర్చుండి ధ్యాననిమగ్నుడై ఆనందముచే బరువైన శరీరముగల యావిష్ణువును ఆదిశేషుడు మోయలేకపోయెను.

శ్లో || తతశ్శివశివేత్యేవ వదన్‌ సురచితాఞ్జలిః |

అలక్షితపరానన్దో మణిదీప ఇవాజ్వలత్‌||

పిమ్మట 'శివశివ' యనియే పలుకుచు నమస్కరించుచు కనబడని పరమానందము ననుభవించుచు మణిదీపమువలె ప్రకాశించెను.

శ్లో || #9; తం దృష్ట్వా కమలా దేవీ భీతిమాప తదా హృది |

శయ్యాగత స్తదా తస్య సో7పి శేషో భయాకులః ||

అపుడు వానిని జూచి లక్ష్మీదేవి హృదయమున భయము చెందెను. వానికి ప్రక్కగానైన శేషుడుగూడ భయముచే కలతజెందెను.

శ్లో || తతస్స పుండరీకాక్షో దృష్ట్వా భీతిం తయోః పరామ్‌|

ఆమీలితే చ నితరామున్మిమీల విలోచనే||

పిమ్మట నాపుండరీకాక్షుడు వారిద్దరియొక్క అధికమైన భయమును జూజి కొంచెము మూసియున్న కన్నులను పూర్తిగా తెరచెను.

శ్లో || #9; అన్ధకారం ప్రపఞ్చస్య సంహర్తుమఖిలం క్షణాత్‌

ఉదితౌ భాస్కరౌ బిభ్రరుదయాద్రిరివాబభౌ ||

ప్రపంచములోని చీకటి నంతను క్షణములో బోగొట్టుట కుదయించిన ఇద్దరు సూర్యులను ధరించిన ఉదయాద్రి వలె నతడు ప్రకాశించెను.

శ్లో || #9; చక్రపాణిః ప్రసన్నాత్మా పుల్లతామరసాననః |

ఆనన్థస్య తదా ముద్రాం శ##నై స్త్యక్త్వా దయా నిధిః ||

సన్ద్యాం ప్రాభాతికీం దేవీం సముపాస్య యథావిధి|

స్తూయమానస్సురై స్తత్ర దివ్యే మాణిక్యమణ్డపే||

బద్ధముక్తావితానాంశుశోభిసింహాసనం శుభమ్‌|

అలఞ్చకార స తదా భగవానబ్ధిజాసఖః ||

దయాసముద్రుడగు చక్రపాణి అప్పుడానందముద్రను మెల్లగా విడచి ప్రసన్నరూపుడు, విడిచిన తామరపువ్వువంటి ముఖముగలవాడునై ప్రభాతకాలమందలి సంధ్యాదేవిని యథావిధిగా నుపాసించి దేవతలు స్తుతించుచుండ నక్కడ దివ్యమైన మాణిక్యమండపమున భగవంతుడగు నాలక్ష్మీపతి ముత్యములు కట్టిన చాందినీయొక్క కాంతులతో సుందరమైన శుభ##మైన సింహాసనము నలంకరించెను.

శ్లో|| శివానన్దామృతం దివ్యం పాయంపాయమశేషతః |

సుఖాయమానహృదయః త్యక్తకృత్యః పరః పుమాన్‌||

నీచైర్వేగేన గచ్ఛన్తం నదీపూరమివాతతమ్‌|

శ##నైశ్శనైర్మహీముచ్చైః ప్రాపయన్నివ యత్నతః ||

అఖణ్డానన్దకం భావం శమ్భుతత్పరమాత్మనః |

న్యవర్తయదమేయాత్మా భగవాన్పంకజేక్షణః ||

ఇతర కార్యములు విడిచి దివ్యమైన శివానందమనెడి యమృతమును పూర్తిగా త్రాగిత్రాగి హృదయమున సుఖించుచున్న పరమపురుషుడు, పరిమాణములేనివాడు, పద్మాక్షుడనగు నాభగవంతుడు వేగముగా పల్లమునకు బోవుచున్న విశాలమైన నదీప్రవాహమునువలె భూమిని మెల్లమెల్లగా ప్రయత్నముతో పైకెత్తుచున్నటుల శివునియందు లగ్నమైన తన యఖండానందభావమును మరలించెను.

శ్లో || నివృత్తభావే తద్భావాత్‌ బుద్ధ్వా పూర్వభరాన్వితః |

భారస్య లాఘవాత్తర్హి ఫణిరాట్‌ సాధు నిశ్వసన్‌ ||

అర్చయన్‌ స్వఫణారత్నకిరణౖః కుసుమైరివ|

ప్రణిపత్య చిరం భూమౌ తతో మన్దం వ్యజిజ్ఞపత్‌||

పూర్వము బరువుతోకూడిన సర్పరాజు బరువు తగ్గుటవలన విష్ణువు భావము శివభావమునుండి మరలినటుల తెలిసికొని బాగుగా నిట్టూర్చి పువ్వులతో పూజించినటుల తన పడగలమీది రత్నకిరణములచే పూజించి చాలసేపు సాష్టాంగముగా నమస్కరించి మెల్లగా విన్నవించెను.

శేషః :

శ్లో || ఆద్య కిం భగవన్నస్మద్భోగశయ్యాతలే శుభే|

వినిద్రేణ స్థితం దేవ!నై వస్వాపః కృత స్త్వయా||

శేషుడు :

దేవ! శుభమగు నాశరీరూపమైన ప్రక్కమీద నేడు నిద్రలేకుండ మెలకువతో నుంటివేల?

శ్లో || అహేతుకమచిన్త్యంతదేతచ్ఛ్రోతుంకుతూహలమ్‌|

అస్తి మే దేవ! విశ్వేశ! ప్రష్టుం చాపి బిభేమి తత్‌ ||

దేవ! విశ్వేశ! కారణములేనిది ఊపింపరానిదియునగు నావిషయమును నాకు విన గుతూహలము గలదు. కాని అడుగుటకు భయపడుచుంటిని.

శ్లో || సత్యం భగవతో నిత్యం కృపా యది మమోపరి|

ఏతత్కారణమాచక్ష్వ రక్ష మాం మాధవ! ప్రభో! ||

ప్రభూ! మాధవ! నీకు నాయందు నిజముగా నెల్లప్పుడు దయ యున్నయెడల ఆకారణమును నాకు జెప్పుము. నన్ను రక్షింపుము.

శ్లో || తేనానన్తేన భగవాన్‌ విజ్ఞప్తః స దయానిధిః |

ముదితో విహసన్‌ మన్దం జగాదై వంపరః పుమాన్‌||

ఆయనంతు డిట్లు విన్నవింప దయానిధి, భగవంతుడు నగు నాపరమపురుషుడు సంతోషించి మెల్లగా నవ్వుచు నిట్లు పలికెను.

విష్ణుః :

శ్లో || #9; శేష! త్వం చ భయం ముఞ్చ భీరు! పద్మాననే! ప్రియే |

యువయోః కథమత్రాసీత్‌ భయమేతాదృషం మహత్‌||

విష్ణువు :

శేష! నీవు భయమును విడువుము. పద్మముఖీ ప్రియురాలా! పిరికిదానా! నీవుకూడ భయమును విడువుము. మీయిద్దరకు నిట్టి మహాభయమిచ్చట నెట్లు వచ్చినది?

శ్లో || #9; కరుణానిధినేశేన సామ్ప్రతం మయి యః కృతః |

స ప్రసాదో మహేశస్య వక్తుం నైవాత్ర శక్యతే ||

దయానిధియగు ఈశ్వరు డిప్పుడు నామీద చూపిన యనుగ్రహమును మహేశ్వరుడు చెప్పలేడు.

శ్లో || #9; తథాపి కథయామ్యద్య విస్తరేణ తదద్భుతమ్‌||

శృణు నాగపతే! ప్రాజ్ఞ ! సావధానేన చేతసా||

ఐననాయద్భుతము నిప్పుడు వివరముగా జెప్పెదను నాగపతీ!బుద్ధిమంతుడా!సావధానచిత్తుడవై వినుము.

శ్లో || #9; ఇహాస్మిన్నేవ దివసే సేవాయై జగతాం గురోః

అయాసిషమహం శైవం శైలం సర్వసురార్చితమ్‌||

నే నీరోజుననే జగద్గురువగు శివుని సేవకొరకు దేవత లందరిచే పూజింపబడు కైలాసమునకు వెళ్లితిని.

శ్లో || కైలాసభూషణో దేవః తదా బాలేన్దుశేఖరః |

వినతం మాం సమాయాతం దృష్ట్వా పుల్లముఖా మ్బుజః ||

అహూయ నికటం మన్దం నయనాఞ్చలసంజ్ఞయా|

సన్నివేశ్య చ మామత్ర ప్రీతచేతా బభూవ సః ||

కైలాసమున కాభరణమైన భగవంతుడగు నాచంద్రశేఖరుడు అచ్చటకు వచ్చి నమ్రుడనైయున్న నన్నుచూచి ముఖపద్మము వికసింప కనుసంజ్ఞచే మెల్లగా దగ్గరకు పిలచి నన్నక్కడ కూర్చుండబెట్టి మనస్సున ప్రీతిజెందెను.

శ్లో || #9; దత్తే హస్తే మయా తస్మాత్సముత్థాయ మహీధ రాత్‌|

తారనాదైర్మహాశంఖై ః దలయద్భిరివావనిమ్‌||

మురజస్య నివాదేన నన్దిహస్తాహతస్య చ |

సిద్ధగన్ధర్వయక్షైశ్చ హృష్టయా గణ సేనయా||

వేదైస్త్సువద్భిరనిశమాగమై స్తత్వమూర్తిభిః |

సేవ్యమానశ్శవై శ్శమ్భుః అఖిలైర్దివ్యయోగిభిః ||

గీయమానాపదానశ్చ నారదేన మహాత్మనా|

తస్య పృథ్వీధరేన్ద్రస్య మూలమాప ముదాన్వితః ||

శివుడు, నేను చేయూతనొసగ నాపర్వతమునుండి లేచి భూమిని బ్రద్దలు చేయుచున్నటుల పెద్ద ధ్వనిచేయు మహాశంఖములచేతను, నందివాయించెడు మురజవాద్యపు ధ్వనిచే తను, సిద్ధగంధర్వయక్షులచేతను, సంతోషించిన గణసేనచే తను, యథార్థరూపములతో స్తుతించుచున్న వేదములచేతను, సమస్త దివ్యయోగులచేతను సేవింపబడుచు మహాత్ముడగు నారదుడు పూర్వచరిత్రను గానముచేయుచుండ మెల్లగా సంతోషముతో నాపర్వతము మొదటికి వచ్చెను.

శ్లో || ఉపవిష్టం చ తత్రాశు దివ్యభూమౌస శఙ్కరః |

విలోక్య విహసన్‌ కిఞ్చిజ్జగాదైవం ఫణీన్ద్ర మామ్‌||

ఫణీంద్రా! అక్కడ దివ్యభూమిపై కూర్చుండిన నన్ను జూచి శంకరుడు వెంటనే మెల్లగా నవ్వుచు నాతో నీవిధముగా పలికెను.

శ్లో || దేవదారువనే దివ్యే యే వసన్తి మునీశ్వరాః |

తేషాం మనః ప్రవిజ్ఞాతుం గచ్ఛావ స్తత్ర కేశవ! ||

కేశవ! దివ్యమైన దేవదారువనములో నివసించు మునీశ్వరుల మనస్సును తెలిసికొనుట కచ్చట కేగుదము.

శ్లో || #9; తత్కారణాదహం చారు రూపం కిమపి మోహనమ్‌

అఙ్గీకరోమి నేత్రాణాం చన్ద్రోదయసమద్యుతి||

అందువలన నేను కన్నులకు చంద్రోదయమువలె ప్రకాశించుచు మోహింపజేయు సుందరమైన రూపము నొక దానిని ధరించుచుంటిని.

శ్లో || #9; కురు త్వం చ తతః కాన్తం కాన్తారూపం మమో చితమ్‌|

ఇత్యుక్త్వా స్వం వపుర్దివ్యమలంచక్రే మహేశ్వరః ||

నీవుకూడా అంతకంటె సుందరమైన నాకుదగిన కాంతారూపమును ధరింపుము. అని పలికి మహేశ్వరుడు దివ్యమైన తన శరీరము నలంకరించుకొనెను.

శ్లో || అథ దేవో మహాదేవః సర్వాభరణభూషితః |

సురాసురశిరోరత్నరోచిర్నీరాజితః ప్రభుః ||

పాదారవిన్దసంస్పృష్టదివ్యమాణిక్యపాదుకః |

సమ్బద్ధచారుధవలకౌపీనోద్భాసివిగ్రహః ||

వక్షస్థలసముద్భాసియజ్ఞసూత్రవిభూషితః |

మహాభుజశిరోబద్ధభస్మధారావిరాజతః ||

వామదక్షిణహస్తోద్యత్క పాలడమరూజ్వలః |

సౌన్దర్యకలికావల్లి కన్థరాపరిశోభితః ||

అధరోష్ఠదలోద్భాసివక్త్రపద్మస్మితాఙ్కురః |

లావణ్య సిన్దులహరీకర్ణపాశమనోహరః ||

జగన్మోహనసంనద్ధలసన్నయనవిభ్రమః |

ఘర్మామ్బుబిన్దుసంశోభిఫాలదేశేన్దుమణ్డలః ||

సువృత్తేన లసద్భాసితిలకేనాతిశోభితః |

అరాలమధుపశ్రేణీరుచిరస్నిగ్ధకున్తలః |

మూర్త్యా పరమయా శేష! పరిభూతప్రవాలయా|

ప్రవాలశిఖరీవేషః శ##నైర్గన్తుం ప్రచక్రమే|| 46

శేష! పిమ్మట ప్రభువగు మహాదేవుడు సర్వాభరణములచే నలంకరింపబడినవాడు, దేవదానవుల తలలమీద రత్నకాంతులచే నీరాజన మీయబడినవాడు, దివ్యమైన మాణిక్య పాదుకలను పాదపద్మములకు ధరించినవాడు, సుందరమై తెల్లనైన కౌపీనముతో ప్రకాశించు శరీరము గలవాడు, రొమ్ముమీద ప్రకాశించు యజ్ఞోపవీతముచే అలంకరింపబడిన వాడు, దీర్ఘమైన భుజముల శిరోభారములపై విభూతి రేఖలచే ప్రకాశించువాడు, కుడియెడమచేతులలో డమరుకమును, కపాలమును ధరించినవాడు, సౌందర్యమనెడు మొగ్గకు తీగయైన మెడతో ప్రకాశించువాడు, పెదవియనెడు దళముతో విలసిల్లు ముఖపద్మమున చిరునవ్వు రూపమైన మొలక గలవాడు, సౌందర్యరూపమైన సముద్రమున కెరటములవంటి చెవులతో సుందరమైనవాడు, లోకమును మోహింపజేయుటకు సిద్ధపడి ప్రకాశించు నేత్రముల విలాసముగలవాడు, స్వేదబిందువువలె శోభిల్లు ఫాలభాగమందలి చంద్రబింబమును దాల్చినవాడు, గుండ్రముగా విలసిల్లు బొట్టుతో మిక్కిలి శోభిల్లువాడు, కుటిలమైన తుమ్మెదలబారులవలె అందమైన చిక్కనైన ముంగురులు గలవాడు, పగడమును తిరస్కరించిన శ్రేష్ఠమైన ఆకారముతో ప్రవాళపర్వతవేషముగలవాడునై మెల్లగా వెళ్ల నారంభించెను.

ఇతి స్కాన్దే మహాపురాణ సనత్కుమార సంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

మూఢవశేషసంవాదే భిక్షాటనప్రసంగోనామ

ఏకాదశో7ధ్యాయః

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters