Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ సప్తదశో7ధ్యాయః

(ఆనన్దతాణ్డవ ప్రదర్శనము)

ప్రకరణసారః :

శ్లో|| శ్రీవ్యాఘ్రాజ్ఘ్రిపతఞ్జలీ నటపతేః. నృత్తం దిదృక్షూ శుభం |

త్రైసాహస్రికదీక్షితానుపగతాన్‌ సమ్పూజ్య తై ర్బోధితౌ ||

సాకం తై ః సునిమిత్రపూర్ణదివసే, దైవైరశేషైర్వృతం |

ఆద్రాష్టాం నటరాజమాగతముమా, శ్లిష్టం ప్రసన్నే7మ్బరే ||

మంగళప్రదమైన నటరాజునృత్తమును జూడగోరిన యావ్యాఘ్రపాదపతంజలు లిరువురు దగ్గరనున్న మూడువేల మంది మునిపుంగవులను పూజించి వారిచే బోధింపబడి వారి తోకూడ మంచి శకునములతోకూడిన దినమున చుట్టును సమస్తదేవతలు సేవింప పార్వతితో కలిసివచ్చిన నటరాజును నిర్మలమైన యాకాశమున జూచిరి.

శ్లో|| విష్ణ్వాదీన్‌ సురసత్తమాన్‌ మునిగణాన్‌ మర్త్యానశేషాన్పశూ |

నాత్మానన్దద తాణ్డవేన భగవానన్వగ్రహీచ్ఛఙ్కరః ||

వై యాఘ్రిఙ్ఞ్రిపతఞ్జలీ స్వకథయ త్పృష్టశ్చ తాభ్యాం శివః |

శబ్దార్థం చ చిదమ్బరస్య సతతం మేనే7త్ర మస్తుం పురే ||

విష్ణువు మొదలగు దేవతాశ్రేష్ఠులను, మునులను, సమస్తమానవులను పశువులను ఆత్మానందమునిచ్చు తాండవ మును జూపి శంకరు డనుగ్రహించెను. వ్యాఘ్రపాదపతంజలులడుగగా చిదంబరశబ్దమున కర్థము బాగుగా దెలిపెను. ఆ పట్టణమున నివసింపగోరెను.

శ్లో|| యస్మాత్సర్వం సముత్పన్నంచరాచరమిదంజగత్‌ |

ఇదం సమో నటేశాయ తసై#్మకారుణ్యమూర్తయే||

ఎవనినుండి యీస్థావరజంగమాత్మకమైన ప్రపంచము పుట్టినదో అట్టిదయామయుడైన నటరాజునకు నమస్కారము.

సూతః :

శ్లో #9; ఏవం తపస్యతో స్తత్ర శమ్భుతాణ్డవదర్శనాత్‌ |

వాఘ్రపాదపతఞ్జల్యోః కాలో7నన్తో గతో7భవత్‌ ||

సూతుడు :

శివతాండవదర్శనముకొరకీవిధముగా వ్యాఘ్రపాదపతంజలులు తిల్లవనమున తపస్సు చేయుచుండగా చాలకాలము గడచినది.

శ్లో|| తతస్తౌ శుద్ధయోగేన సంయుతౌ శమ్భునేరితమ్‌ |

దినం శ్రీమద్వినిశ్చిత్య పూర్ణోల్లాసౌ బభూవతుః ||

పిమ్మట పవిత్రయోగనిష్ఠులైన వారిద్దరును ఈశ్వరుడు తెలిసిన తాండవదర్శనదినమును శుభ##మైనదానినిగా నిశ్చయించి పరిపూర్ణోత్సాహమును జెందిరి.

శ్లో|| సుధాక్షీరేక్షుసదృశం పఞ్చాక్షరమయం రసమ్‌|

పాయంపాయంభృశంతృప్తే మునిద్వన్ద్వేతపస్యతి ||

ఏకదా తు తయోః పార్శ్వమాజగ్ముస్తాణ్డవార్థినః |

పూర్వమేవ సమాయాతాస్త్రిసహస్రమునీశ్వరాః ||

అమృతముతోను పాలతోను చెరకురసముతోను సమానమైన పంచాక్షరీరూపమైన రసమును త్రాగిత్రాగి మిక్కిలి తృప్తిచెందిన మునులిద్దరు తపస్సు చేయుచుండగా తాండవమును జూడగోరి పూర్వమే వచ్చిన మూడువేల మంది మునీశ్వరులోకప్పుడు వారిదగ్గరకు వచ్చిరి.

శ్లో|| ఆత్మదర్శనదృప్తాంస్తాంస్తాపుభౌ మునిపుఙ్గవౌ |

ఊచతుః పరమేశానతాణ్డవాదర్శనోత్సుకౌ ||

పరమేశ్వరుని తాండవమును పరిపూర్ణముగా జూడ గోరిన యామునిశ్రేష్టులిద్దరును ఆత్మదర్శనముచే గర్వించిన యామూడువేలమంది మునులతో పలికిరి.

శ్లో|| #9; దినే తస్మిన్‌ సమాయాతే సమాయాత తపోధనాః |

తపశ్చర న్తస్సంయాత స్వాన్స్వాన్సామ్ప్రత మాశ్రమాన్‌ ||

తాపసులారా! ఇపుడు మీమీయాశ్రమములకేగి తపస్సుచేయుచు ఆరోజు వచ్చినతోడనే రండు.

శ్లో|| దుర్వారజన్కమతమసాం దిననాథోదయం పరమ్‌

లోచనానాం తపఃపాకమీశనృత్తమహోత్సవమ్‌ ||

వయం సర్వేత్ర పవ్యామిత్యుక్త్వాతాన్విసృజ్యతౌ |

తమేవ వాసరం దివ్యం గణయన్తౌ భభూవతుః ||

తొలగింపరాని జన్మమ నెడి యంధకారమున కత్కృష్టమగు సూర్యోదయమును, కన్నులతపస్సునకు ఫలమునైన శివతాండవ మహోత్సవమును మనమందర మిచ్చట చూచెదము. అని చెప్పి వారిని పంపి ఆమునులిద్దరును ఆశుభదినమును లెక్క పెట్టుకొనుచుండిరి.

శ్లో|| యథా క్షుధాపరిక్లాన్తాః ధేనూనామిద తర్ణకాః

చాతకా ఇవ మేఘనామాగం గగనా న్తరే ||

తథా వ్యాపశ్యతాం దాన్తౌ క్లాన్తౌ తావృషిపుఙ్గవౌ |

స్మరన్తౌతాణ్డవంశమ్బోః నిన్యతుః కాలమన్తరమ్‌ ||

ఆకలితో బాదపడుచున్న లేగదూడలు ఆవులరాకను చూచునటుల, చాతకములాకాశమున మేఘముల రాకను చూచువిధమున, అలసినవారును. వినీతులునగు నామునిశ్రేష్ఠులిద్దరును ఆకాశమున శివునిరాకనుచూచుచు శివతాండవమును తలచుకొనుచు దర్శనమువరకు మధ్యకాలమును గడపిరి.

శ్లో|| కథితస్య తతస్తస్య వాసరస్యేన్దుమౌలినా|

పూర్వేద్యురుదయం ప్రాప హరిదశ్వో దివాకరః ||

కైలాసాద్భగవానీశః ప్రాప్తస్తిల్లవనం కిల|

ఆనన్దతాణ్డవం కర్తుమితి జానన్నివాత్మనా ||

ఈశ్వరుడు కైలాసమునుండి తిల్లవనమున కానంద తాండవముచుయుటకు వచ్చునని తెలిసినవాడువలె పడిగల గుఱ్ఱములుగల సూర్యుడు ఈశ్వరుడు చెప్పిన దినమునకు ముందు రోజు ఉదయించెను.

శ్లో|| #9; భగవత్యుదితే భానౌ కృతనిత్యక్రి¸° మునీ |

శ్వస్తావదావయోరాశా సేత్స్యతీతి కృతక్షణౌ ||

నిర్విఘ్నతాయై విఘ్నేశమవన్దేతాంహరాత్మజమ్‌ |

పూజాభిర్దివిధాభిశ్చ స్తోత్రైరాగమగర్భితైః ||

సూర్యుడుదయింపగనే ఆమునులిద్దరును నిత్యకర్మలాచరించి మరునాడు తమకోరిక ఫలించునని నిశ్చయించి విఘ్నము కలుగకుండుటకై శికుమారుడైన విఘ్నేశ్వరునకు నమస్కరించి పలువిధముల పూజలుచేసి వేదగర్భితములైన స్తోత్రము లతో నుతించిరి.

శ్లో|| అన్యేద్యుః ప్రత్యుషస్యేవ తోరాశ్మవాసినోః|

ప్రాదురాసన్నసిమిత్తాని శోభనాని తపోధనాః ||

తపోధనులారా! మరునాడు ఉషఃకాలముననే ఆ మునులిద్దరకు శుభశకునములైనవి.

శ్లో|| ద్రక్ష్యామ్యమరదుష్ప్రేక్ష్యమహమానన్దతాణ్డవమ్‌ |

ఇతీవ మత్వా భగవానుదీయాయ వమోనిధౌ ||

దేవతలకుగూడ చూచుటకు లభింపని యానందతాండవమును నేను చూచెదను. అనితలచినటుల సూర్యభగవానుడు సముద్రమున నుదయించెను.

శ్లో|| భాసయన్కకుభస్సర్వాః భానుభిః కనకోజ్జ్వలైః |

వాసరస్య తతో మధ్యం ప్రాప వేగేన భానుమాన్‌ ||

సూర్యుడు బంగారమువలె ప్రకాశించు కిరణములతో అన్నిదిక్కులను ప్రకాశింపజేయుచు తొందరగా పగటి మధ్య భాగమునకు చేరెను.

శ్లో|| లోకచూడామణౌ మధ్యమహ్నః ప్రప్తే దివాకరే|

నిరీయతుర్మునీ స్వస్మాదాశ్రమాత్ప్రీతమానసౌ||

లోకమునకు శిరోభూషణమువంటి సూర్యుడు దిన మధ్యభాగమునకు చేరగనే ఆమునులిద్దరును సంతుష్టమనస్కులై తమయాశ్రమములనుండి బయలుదేరిరి.

శ్లో|| అత్రాన్తరే జగత్స్వామీ ప్రణవాత్మా నటేశ్వరః|

ఆయాత ఇతి తత్రోచ్చైః ప్రదధ్మఃకాకలాదయః ||

ఇంతలో లోకప్రభువు ప్రణవస్వరూపుడునగు నటేశ్వరుడు వచ్చెనని యక్కడ కాకలాదివాద్యములు గట్టిగా మ్రోగెను.

శ్లో|| ఆనన్తరం శుశ్రువిరే సతాలరవమాంసలాః |

మృదంగశంఖపణవశృఙ్గవంశాదినిస్వనాః||

పిమ్మట తాళములు, మద్దెలలు, శంఖములుస పణవములు, కొమ్ముబూరాలు, పిల్లనగ్రోవులు మొదలగువాని పెద్దధ్వనులు వినబడినవి.

శ్లో|| అథ తౌ సర్వవాద్యానాం శ్రుత్వా తారధ్వనింపురః|

ప్రాప్తౌ మహీతలం వేగాత్పరమానన్దమోహితౌ||

పిమ్మట వారిద్దరును ఎదుట సమస్తవాద్యముల పెద్దధ్వనిని విని మిక్కిలి యానందముచే మోహితులై వేగముగా నాప్రదేశమునకు వచ్చిరి.

శ్లో|| సహస్రమూర్ధా వ్రఖ్యాతో భానుకమ్పో గణశ్వరః|

సహశ్రశృఙ్గో విశదశ్శైలరాజ ఇవాపరః||

శంఖాన్నివేశ్య వక్త్రేషు చన్ద్రమణ్డలసన్నిభాన్‌|

జగదణ్డం స్వనేనాశు మహతా దలయన్నివ ||

తారమోఙ్కారముఖరం తత్ర దధ్మౌమహాద్భుతమ్‌|

వేయిశిఖరములతో స్వచ్ఛమైన మరియొక పర్వతరాజువలె వేయితలలుగలిగి ప్రసిద్ధుడైన భానుకంపగణాధిపతి వెంటనే ముఖములయందు చంద్రబిమ్బములవంటి శంఖమురానుంచుకొని పెద్దధ్వనితో బ్రహ్మాండమును బ్రద్దలుచేయినటుల గట్టిగా ఓంకారమును పలుకునటుల అద్భుతముగా పూరించెను.

శ్లో|| ఈశప్రసాదలాభేన వేదే గాంధర్వసంజ్ఞితే|

సుశిక్షితస్య బాణస్య మేరుశృఙ్గసమాకృతేః||

విలసత్కమలాకారైః పాణిభిః కటకోజ్జ్వలైః||

అహతస్య మృదఙ్గస్య విపులస్య ధ్వనిర్మహాన్‌|

అధశ్చకార సహసా ఘోషం ధీరం పయోనిధేః ||

ఈశ్వరానుగ్రహముచే గాంధర్వవేదమును బాగుగా నభ్యసించి మేరుశిఖరమువలెనున్న బాణుడు కంకణములతో ప్రకాశించుచు అందమైన తామరపువ్వులవలెనున్న చేతులతో పెద్దమద్దెలను వాయించెను. దానిధ్వని యాకస్మికముగాపుట్టి గంభీరమైన సముద్రఘోషమును మించెను.

శ్లో|| తావుభౌ పఞ్చవాద్యానాంవేదానాం చ ధ్వనింపురః||

తారం చ నూపురారావం పాదపద్మస్య శూనినః||

గానం చ దేవజాతీనాంకర్ణాయుష మశృణ్వతామ్‌||

అపశ్యతాంచమహతీంపుష్పవృష్టింనభశ్చ్యుతామ్‌||

ఝంకా%ుర్వద్భృఙ్గసఙ్ఘాతై స్సమన్తాదనుసేవితామ్‌||

ఆమునులిద్దరు ఎదుట ఐదురకములవాద్యధ్వనిని, వేదధ్వనిని, శివునిపాదపద్మపు నూపురధ్వనిని, చెవులకింపైన గంధర్వాదిదేవజాతుల గానమును వినిరి. తేనెత్రాగుటకు వచ్చిచేరుచున్న జుమ్ముమను తుమ్మెదలతోకూడ ఆకాశమునుండి పడుచున్న పెద్దపుష్పవర్షమును చూచిరి.

శ్లో|| పిపాసయా యదా వాయురనుభూయ సరోరుహమ్‌||

పుష్పవృష్టిం తథా దృష్ట్వా తౌ తదా ప్రీతమానసౌ||

నమస్కృత్య దిశేతసై#్య వృష్టిః పౌష్పీ యతోపతత్‌||

దప్పికతో తామరపువ్వుననుభవించి వాయువు సంతసించినటుల ఆమునులిద్దరు పుష్పవృష్టిని చూచి పుష్పవర్షముపడు దిక్కునకు నమస్కరించి మనస్సున సంతసించిరి.

శ్లో|| బద్ధాఞ్జలిపుటౌ ప్రీత్యా మోదమానముఖామ్బుజౌ|

ప్రసీద భగవన్‌! దేవ!గిరిజాప్రాణవల్లభ!||

నటరాజ! మనస్తుభ్యం దర్శయ త్వత్పదామ్బుజమ్‌||

ఇత్యానన్దరసే మగ్నౌ పులకాఞ్చితవిగ్రహౌ||

అమేయవైభవం శుద్ధం చన్ద్రచూడం శశంసతుః||

వారు ప్రీతితో దోసిలి బంధించి ముఖమున సంతోషముదోప దేవా! పార్వతీప్రాణవల్లభా! అనుగ్రహింపుము. నటరాజ! నీకు నమస్కారము. నీపాదపద్మమును చూపుము. అనియానందరసమున మునిగి శరీరము పులకరింప ఊహింపరాని వైభవముగలవాడు, పరిశుద్ధుడునగు చంద్రశేఖరుని పొగడిరి.

శ్లో|| తయోరథ మహాదేవః స్వపాదాబ్జనిషేవిణోః||

వ్యాఘ్రపాదపతఞ్జల్యోః జ్ఞానదృష్టిం దదౌ తదా||

పిమ్మట ఈశ్వరుడు తలపాదపద్మములనే సేవించుచున్న ఆవ్యాఘ్రపాదపతఞ్జలులకప్పుడు జ్ఞానదృష్టినిచ్చెను.

శ్లో|| అథ మోహస్య జననీ జగత్సంసారకారిణీ||

మాయాయవనికామున్యోరపనీతా దయాలునా||

తతః ప్రాదురభూ త్తేజః సహస్రార్కసమప్రభమ్‌||

పిమ్మట నామునులిద్దరకును మోహమును కలిగించునది జగత్తను సంసారమును సృజించునదియునగు మాయారూపమైన తెర యాదయామయుడగు శంకరునిచే తొలగింపబడినది. పిమ్మట వేయిమంది సూర్యులతో సమానమైన కాంతిగల తేజస్సు కనబడెను.

శ్లో|| సహస్రచన్ద్రసంకాశమనిరూపితతాత్వికమ్‌||

మేరుమన్దరసంకాశం యోగిహృత్పద్మగోచరమ్‌||

చర్మచక్షురనిర్గ్రాహ్యం తత్తేజః సమజృమ్భత||

వేయిమంది చంద్రుల కాంతితో సమానమైనది, యథార్థస్వరూపము తెలియబడనిది, మేరుమందరపర్వతములవలె ఉన్నతమైనది, యోగుల హృదయకమలములయందు గోచరమగునది, చర్మనేత్రములతో చూచుటకు శక్యముకానిదియునగు నాతేజస్సు వ్యాపించెను.

శ్లో|| తస్యతేజోవితానస్యమధ్యేనిక్షిప్తవైభవమ్‌||

శాన్తంచిదమ్బరేరూపంశై వమావిర్బభూవహి||

ఆతేజోమండలముమధ్యలో వైభవముతో కూడినది, శాంతమైనదియునగు చిదంబరములోని శైవరూప మావిర్భవించెను.

శ్లో|| విధూతజన్మపాప్మానౌ తావుభౌ మునిసత్తమౌ|

ఆపాదచూడం తద్రూపమారేభాతే నిరీక్షితుమ్‌|

వాచామగోచరాకారే తస్మిన్నద్భుతసంసది||

ఆమునులిద్దరును జన్మయందలి పాపము పోయినవారై చెప్పుటకు శక్యముగాని రూపముతో నద్భుతమైన యాసభలో నాశివరూపమును పాదములనుండి తలవరకు జూడనారంభించిరి.

శ్లో|| చిదమ్బరసభామధ్యే శివసాయుజ్యకారిణి||

స్ధాపితై కపదామ్భోజం నిశ్చలం వాగగోచరమ్‌||

శివసాయుజ్యమును గలుగజేయు నాచిదంబరసభామధ్యమును ఒక కాలిని మోపినది, చలింపనిది, మాటలతో జెప్పశక్యముకానిది.

శ్లో|| తిర్యక్కుఞ్చితవామాఙ్ఘ్రి లసన్మాణిక్యనూపురమ్‌|

ఆపాదమ స్తకంభూషాపునరు క్తప్రభోదయమ్‌||

అడ్డముగా వంచబడిన యెడమపాదమందు మాణిక్యములతోపొదగబడిన అందెగలది, పాదములనుండి తలవరకు భూషణములచే మరల కాంతి గలుగజేయబడినది.

శ్లో|| ఊరూరుదణ్డయుగలం చలద్వ్యాఘ్రాజినామ్బరమ్‌||

ఫణామణిప్రభాహారికటిసూత్రసముజ్జ్వలమ్‌||

పెద్దస్తంభములవంటి రెండుతొడలుగలది, కదలుచున్న పులితోలు బట్టగలది పడగలమీది మణుల కాంతులచే మనోహరమైన మొలత్రాడుతో ప్రకాశించునది.

శ్లో|| ప్రత్యుప్తనపరత్నాఢ్యనాభికల్యాణభూషణమ్‌||

యజ్ఞసూత్రప్రభాశోభిశిలాఘనభుజాన్తరమ్‌||

నవరత్నములు పొదిగిన నాభికళ్యాణభూషణమును ధరించినది, యజ్ఞోపవీతపు కాంతిచే ప్రకాశించుచు రాతివలె కఠినమైన రొమ్ముగలది.

శ్లో|| కిఞ్చిదాకుఞ్చితోద్భాసివామపాణిసరోరుహమ్‌||

దత్తాభయకరాబద్ధఫణికఙ్కణభూషితమ్‌||

కొంచెమువంచబడి ప్రకాశించుచు తామరపువ్వువలె నున్న ఎడమచేయిగలది, అభయహస్తమున కలంకరింపబడిన సర్పకంకణముగలది.

శ్లో|| చలడ్డమరుదీప్తాగ్ని భూషితాన్యభుజద్వయమ్‌||

కాలకూటప్రభాసఙ్గనీలబన్ధురకన్ధరమ్‌||

కదలెడు డమరుకముచేతను జ్వలించు అగ్ని చేతను ఇతరమైన రెండుచేతులయందు అలంకరింపబడినది, కాలకూటపు కాంతిసంబంధముచే నీలవర్ణముగలిగి సుందరమైన మెడగలది.

శ్లో|| తాటఙ్కశఙ్ఖభూషాభ్యాం విలసత్కర్ణపాశకమ్‌||

అనతిస్ఫుటసమ్భూతమన్దస్మితశశిప్రభమ్‌||

తాటంకశంఖాలంకారములచే ప్రకాశించు కర్ణపాశములుగలది, మిక్కిలి స్పష్టముగాకుండ నుదయించిన చిరునవ్వు అనెడు చంద్రుని కాంతిగలది.

శ్లో|| ప్రపుల్లరమణీయాబ్జపరిపన్థిముఖచ్ఛవి

పార్వతీవదనామ్భోజమధుపాయితలోచనమ్‌||

వికసించి సుందరముగానున్న తామరపువ్వును బోలిన ముఖకాంతి గలది, పార్వతీముఖపద్మమున తుమ్మెదలైన కన్నులుగలది.

శ్లో|| భ్రూవల్లరీసముద్భాసిబాలచన్ద్రార్కభాసురమ్‌||

గఙ్గౌపన్నగముగ్ధేన్దుయుతపిఙ్గజటాధరమ్‌||

లతలవంటి కనుబొమలతో నందమైన బాలచంద్ర సూర్యరూపమైన కన్నులతో ప్రకాశించునది, గంగతోడను, సర్పముతోడను, బాలచంద్రునితోడను, కూడిన గోరోజనపురంగు జటలుగలది.

శ్లో|| కపాలకృతమాలార్కధుత్తూరధ్రోణధారకమ్‌|

ఆపాదమస్తకమ్భాసిసితభస్మవిలేపనమ్‌||

పుఱ్ఱలదండను, జిల్లేడు, ఉమ్మెత్త, తుమ్మి పూవులను ధరించినది, పాదమునుండి తలవరకు ప్రకాశించు తెల్లని భస్మపు పూతగలది.

శ్లో|| చలత్పిఙ్గజటాభారపిశఙ్గీకృతదిఙ్ముఖమ్‌|

మధ్యే సహస్రభానూనాం భానుబిమ్బమివోదితమ్‌||

é కదలుచున్న గోరోజనపురంగు జటాసమూహముచే దిఙ్ముఖములను గోరోజనపురంగుగలవానినిగా జేయునది, వేయి కిరణములమధ్య నుదయించిన సూర్యుడవలెనున్నది.

శ్లో|| ఏవమత్యద్భుతం దిప్యం రూపమానన్దతాణ్డవమ్‌||

దృష్ట్వాతతశ్చ తత్వార్శ్వే శివాం పరమసున్దరీమ్‌||

ఈవిధముగా నత్యద్భుతమైనది దివ్యమైనదియునగు ఆనందతాండవరూపమును చూచి పిమ్మట ఆరూపము ప్రక్క మంగళరూపురాలు, మహాసౌందర్యవంతురాలు.

శ్లో|| సతటిద్ఘ నసచ్ఛాయహల్లకోజ్జ్వలకు న్తలామ్‌||

సిన్దూరతిలకోధ్బాసిఫాలపట్టవిరాజితామ్‌||

మెరపుతోకూడిన మేఘమువలె ప్రకాశించు ఎఱ్ఱకలువతోకూడిన జుట్టగలది, సింతూరపుబొట్టుతో విలసిల్లు విశాలమైన నుదురుగలది.

శ్లో|| సౌన్దర్యసిన్ధులహరీసదృక్షభ్రూవిభూషితామ్‌||

నిశాతశమ్బరారాతిశరవారిజలోచనామ్‌||

సౌందర్యమనెడు సముద్రముయెక్క కెరటములవలెనున్న కనుబొమలతో సుందరముగానున్నది, మన్మథుని పదనైన బాణమగు పద్మమువంటి కన్నులుగలది.

శ్లో|| తత్తద్విభూషణోద్భాసికర్ణనాసామనోహరామ్‌||

వ్రవాలవిద్రుమజపాపరిపన్ధిప్రభాధరామ్‌||

ఆయాయాభరణములతో విలసిల్లు నాసికాకర్ణములతో మనోహరమైనది, చిగురు, పగడము, మంకెనపువ్వులవలె ఎఱ్ఱని కాంతిగలది.

శ్లో|| ముక్తాఫలసమచ్ఛాయదన్తపం క్తిసుశోభితామ్‌||

శఙ్ఖపూగలసత్కణ్ఠదివ్యమఙ్గలభూషణామ్‌||

ముత్యములవంటి పలువరుసతో విలసిల్లునది, ఆకారమునశఙ్ఖమువలెను, వర్ణమునపోక కాయవలెను, ప్రకాశించు కంఠమున దివ్యమైన మంగళాభరణములుగలది.

శ్లో|| బాలవంశలతామిత్రబాహుపాశోపశోభితామ్‌||

పాణిపద్మోద్ధృతోత్ఫుల్లకల్హారపరిభాసురామ్‌||

లేతవేణులతవలె మృదువై పొడవైన బాహువులుగలది వికసించి పరిమళించు ఎఱ్ఱకలువపూవును చేతిలో ధరించి విలసిల్లునది.

శ్లో|| పీనోత్తుఙ్గస్తనద్వన్ద్వవిజ్వలత్తారహారకామ్‌||

ఆవర్తరుచిరాకారనతనాభిసముజ్జ్వలామ్‌||

బలసి ఎత్తైన స్తనములమీద పరిశుద్ధమై ప్రకాశించు ముత్యాలహారమును ధరించినది, సుడివలె అందమైన ఆకారముగల లోతైన బొడ్డుగలది.

శ్లో|| నానారత్నఖలాత్కుర్వన్మేఖలాసమలఙ్కృతామ్‌||

కమనీయదుకూలా ప్తకాఞ్చీదామపరిష్కృతామ్‌||

వివిధరత్నములచే గలగలధ్వనించు ఎనిమిదిపేటల మొలనూలును ధరించినది, సుందరమైన పట్టుబట్టమీద ఒంటిపేట మొలనూలు అలంకారముగా ధరించినది.

శ్లో|| స్మరారామకదల్యాభచారూరు స్తమ్భమణ్డితామ్‌||

గారుత్మతమణిప్రఖ్యజానుమణ్డలమణ్డితామ్‌||

మన్మథుని తోటలోని అరటి స్తంభములవంటి అందమైన తొడలుగలది మరకతమణులవంటి గుండ్రని మోకాళ్లుగలది.

శ్లో|| కామకాహలికాకారజఙ్ఘాకాణ్డవిరాజితామ్‌||

ఉత్ఫుల్లపఙ్కజచ్ఛాయపాదస్ఫురితనూపురామ్‌||

మన్మథుని కాహళికయను వాద్యమువంటి పొడవైన పిక్కలుగలది, వికసించిన పద్మములవంటి పాదములయందు కదలుచున్న అందెలుగలది.

శ్లో|| వారివాహతనుచ్ఛాయామానన్దమధురస్మితామ్‌||

చిత్రభానోర్యథా జ్వాలాం ప్రభామివ విభావసోః||

వాచమర్థస్య చ యథా దివసస్యేవ శర్వరీమ్‌||

అవినాభూతసమ్బన్ధామిచ్ఛాజ్ఞానక్రియాత్మికామ్‌||

శివస్య నటరాజస్య శక్తిం పృథగివస్థితామ్‌||

మేఘమువంటి శరీరచ్ఛాయగలది, ఆనందముతో సుందరమైన చిరునవ్వుగలది, అగ్నితోజ్వాలకువలెను, సూర్యునితో తేజస్సుకువలెను, అర్థముతో వాక్కునకువలెను, పగటితో రాత్రికివలెను, ఈశ్వరునితో విడచియుండని సంబంధముగలది, సృష్టికి కారణమగు ఇచ్ఛాజ్ఞానక్రియలను శక్తిత్రయముయొక్క రూపమును దాల్చినది, నటరాజగు శివునియొక్క వేరుగానున్న శక్తివలె ప్రకాశించునది.

శ్లో|| ఆంకూరయద్భిఃకన్దర్పమానన్దప్రతిపాదకైః||

సదర్పైర్లలితైర్మన్దైరలసైరవలోకనైః||

అనాదినిధనం శమ్భుమ న్తికస్థం మహేశ్వరమ్‌||

ఆనన్దపారవశ్యేన నాటయన్తీం నిరన్తరమ్‌||

మన్మథవికారము నంకురింపజేయునవి, ఆనందమును గలిగించునవి, గర్వముతోగూడినవి, సుందరమైనవి, మందములైనవి, అస్పష్టములునగు చూపులతో ఆద్యంతములలేనివాడు, సుఖమునిచ్చువాడునగు దగ్గరనున్న మహేశ్వరుని ఆనందముతో పరవశుడై ఎడదెగకుండ నాట్యముచేయునటుల చేయుచున్నది.

శ్లో|| సాకూతైః మధురైః స్మేరైః సాచీకృతవిలాసిభిః||

తదీయైర్మిశ్రయన్తీం స్వానాలోకానపి లోచనైః||

అభిప్రాయగర్భితములు, సుందరములు, చిరునవ్వుతో గూడినవి, అడ్డముగాత్రిప్పబడి విలాసముతో గూడినవియునగు శివునిచూపులతో తనచూపులనుగూడ కలుపుచున్నది.

శ్లో|| శివకామాం మహాదేవీం తైలోక్యజననీం శివామ్‌||

ఆవిర్భూతాం సభేశేన జగన్మఙ్గల హేతవే||

తాం చ తత్ర తపస్యన్తౌ మువీ సన్తావపశ్యతామ్‌||

లోకకల్యాణమునకై నటరాజుతోకూడ నచ్చట నావిర్భవించినది మూడులోకములకు తల్లి మంగళస్వరూపురాలు మహాదేవియునగు నాశివకామసుందరినిగూడ తపస్సుచేయుచున్న సత్పురుషులగు వ్యాఘ్రపాదపతంజలులచ్చట జూచిరి.

శ్లో|| పిపాసురివ పానీయం బుభుక్షిత ఇవాశనమ్‌

నిస్స్వో నిధిమివాసంఖ్యం రుగ్ణో వైద్యమివ ప్రియమ్‌||

దృష్ట్వా తదద్భుతంశమ్భోః తౌ తత్రానన్దతాణ్డవమ్‌||

ఆనన్దాతిశయాత్కిఞ్చిదజ్ఞాసిష్టాం న చ క్షణమ్‌||

దప్పికగొన్నవాడు మంచినీటిని చూచినటుల, ఆకలిగొన్నవాడు అన్నమును చూచినవిధమున, పేదవాడు పెన్నిధిని కనుగొనినరీతి, రోగి ప్రియమైన వైద్యుని గాంచినవిధమున నామునులిద్దరు నచ్చట అద్భుతమైన శివుని ఆయానందతాండవమును జూచి ఆనందాధిక్యముచే క్షణకాలము మైమరచిరి.

శ్లో|| తతః ప్రబుద్ధౌ సహసా దయయా పరమేష్ఠినః||

సాష్టాఙ్గమఙ్గ్రిషు తయోస్తావృషీ సంప్రణమతుః||

పిమ్మట పరమేశ్వరుని దయచే నామునులిద్దరు వెంటనే తెలివినొంది పార్వతీపరమేశ్వరుల పాదములకు సాష్టాజ్గముగా నమస్కరించిరి.

శ్లో|| పునస్సముత్థితౌ తత్ర మౌలిబద్ధనిజాఞ్జలీ||

హర్షాశ్రుపూర్ణనయనౌ హృష్యత్పులకభూషణౌ||

వాచామగోచరే దివ్యే స్వసంవేద్యే మనోహరే||

ఆనన్దసాగరే మగ్నావస్తుతామీశ్వరం స్తవైః||

మరలలేచి శిరస్సున నంజలిఘటించి సంతోషముచే కన్నీరు వెడల శరీరము పులకరించి మాటలచే జెప్పుటకుశక్యము కానిది అనుభవముచేతనే తెలిసికొనదగినది దివ్యమైనదియునగు నానందసాగరమున మునిగి స్తోత్రములతో నీశ్వరుని నుతించిరి.

శ్లో|| నమోస్త్విదమనన్తాయ జగదానన్ద హేతవే|

నమో నటాయ నాథాయ నాట్యవేదవిధాయినే||

అంతములేని లోకముయొక్క ఆనందమునకు కారణమైన వానికి నమస్కారము. నాట్యవేదమునేర్పరచి నటుడై రక్షకుడైనవానికి నమస్కారము.

శ్లో|| నమఃపరాపరజ్ఞాయ పరాత్పరతరాయ చ|

పరమాత్మస్వరూపాయ భవాయ భవహారిణ||

పరమాత్మకు ప్రపంచమునుగూడ నెరిగినవాడు సర్వప్రపంచాతీతుడు పరమాత్మస్వరూపుడు భక్తులను సంసారమునుండి విజిపించువాడు సర్వస్వరూపుడునగువానికి నమస్కారము.

శ్లో|| నమోగుణాయ గుణినే నమః కైవల్యహేతవే

నమస్త్రిదశవన్ద్యాయ నమస్త్రిపురహారిణ|

సృష్టికిపూర్వము నిర్గుణుడు సృష్టికాలమున ప్రకృతి సంబంధముచే సగుణుడు మోక్షమునకు కారణభూతుడు దేవతలకుగూడ నమస్కరింపదగినవాడునై త్రిపురసంహారముజేసిన వానికి నమస్కారము.

శ్లో|| నమో భసితభూషాయ నమశ్చన్ద్రార్ధధారిణ|

నమః శ్యామార్ధదేహాయ నమో నాగేన్ద్రహారిణ||

భస్మమునలంకరించుకొని అర్ధచంద్రుని శిరమునదాల్చి పార్వతిని తనశరీరమున సగభాగముగా జేసికొని నాగేంద్రుని హారముగా ధరించినవానికి నమస్కారము.

శ్లో|| నమో మహ్యామ్బువాయ్వగ్ని పుష్పవత్ఖాత్మరూపిణ|

నమోవేదా న్తవేద్యాయనమోనాదా న్తమూ ర్తయే||

భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, సూర్యచంద్రులు యజమానుడునను నెనిమిది రూపముల దాల్చినవాడు ఉపనిషత్తులచే తెలియదగినవాడు నాదాతీతమైన రూపముగల వాడునగు వానికి నమస్కారము.

శ్లో|| నమోనారాయణార్చ్యాయ నమో నరకహారిణ|

నమో నారదగీతాయ నమో నన్దిసుతాయ చ||

నారాయణునకుగూడ పూజింపదగినవాడు, నరకమును బోగొట్టువాడు నారదునిచే గానముచేయబడినవాడు నందిచే స్తుతింపబడినవాడునగు వానికి నమస్కారము.

శ్లో|| నమో దభ్రసభేశాయ నమో దహరవాసినే|

నమోదక్షాధ్వరహృతే నమో దైత్యేన్ద్రహారిణ||

దభ్రసభానాయకుడు, దహరాకాశమున నివసించువాడు, దక్షయజ్ఞమును ధ్వంసముచేసినవాడు, దైత్యేంద్రుడగు జలంధరుని చంపినవాడునగు వానికినమస్కారము.

శ్లో|| నమసై#్త్రలోక్యనాథాయ శ్రీకణ్ఠాయ నమోనమః|

నమశ్శివాయ శాన్తాయ నమః కల్యాణదాయినే||

మూడులోకములకు రక్షకుడు గరళమును కంఠమున ధరించినవాడు, నిర్వికారుడు, శుభములనిచ్చువాడు, శాంతుడువగు వానికి నమస్కారము.

శ్లో|| ఇతి స్తుత్వా నటేశానం దయమానవిలోచనమ్‌|

బద్ధాఞ్జనిపుటౌ ప్రీతౌ ప్రార్థయామాసతుర్మునీ||

అని దయతోజూచు నటేశ్వరుని స్తుతించి నమస్కరించుచు ఆమునులిద్దరును ప్రీతితో ప్రార్ధించిరి.

శ్లో|| అద్య దృష్టం సురశ్రేష్ఠ తవ తాండవమద్భుతమ్‌|

చిదమ్బరం చ విశ్వేశ దర్శయేహ శుభాస్పదమ్‌||

దేవతాశ్రేష్ఠుడవగు విశ్వేశ! ఇప్పుడద్భుతమగు నీతాండవమును జూచితిమి. శుభములకు తావైన చిదంబరమును గూడ చూపుము.

శ్లో|| కారణశ! విభో! దేవ! భస్మీకృతమనోభవ|

ఆనన్దాధార జగతామిదమానన్దతాణ్డవమ్‌||

ప్రకాశ##యేతి దేవాశ్చ బ్రువన్తి స్మ సమన్తతః||

జగత్కారణభూతుడవు! సర్వవ్యాపకుడవు మన్మధుని భస్మముచేసినవాడవు లోకములయానందమున కాధారభూతుడవునగు దేవా! ఈ యానందతాండవమును చూపుమని దేవతలందరుకూడ అడుగుచున్నారు.

శ్లో|| ఇతి దేవైస్తు విజ్ఞప్తో నటరాజః కృపానిధిః|

స్మయమానముఖామ్భోజః పశ్యన్నద్రీంద్రజా ముఖమ్‌||

అనన్తకామఫలదాదఖిలామరదుర్లభాత్‌|

అపవర్గప్రదాదస్మాదస్మత్తాణ్డవదర్శనాత్‌|

సర్వే భవన్తు సుఖినస్సర్వే సన్తు జితై నసః||

ఈవిధముగా దేవతలు విన్నవింప దయానిధియగు నటరాజు ముఖమున చిరునవ్వుగలుగ పార్వతిముఖమును చూచుచు అన్నికోరికలను దీర్చునది దేవతలందరకు దుర్లభ##మైనది మోక్షమునిచ్చునదియునగు ఈమాతాండవమును జూచి అందరు సుఖమును పొందెదరుగాక అందరిపాపములు తొలగుగాక.

శ్లో|| సర్వే కృతార్థా జాయన్తాం సర్వే ముక్తా భవన్తుచ|

ఇతి కృత్వా దయామ్భోధిః చిత్తే సఙ్కల్పమీశ్వరః||

తదానీం దర్శయామాస సర్వేషాం తత్ర తాణ్డవమ్‌||

యద్దుర్లభంచిరాత్కాలా త్తపోభిరతిదుష్కరైః||88

అందరును కృతార్థులగుదురుగాక అందరును ముక్తిని పొందెదరుకాక అని మనస్సున సంకల్పించి దయాసముద్రుడగు ఈశ్వరుడు కష్టసాధ్యములగు తపస్సులుచేసినను చిరకాలము లభింపని తాండవదర్శనమునపుడు వారికందరకు గలుగజేసెను.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

ఆనన్దతాణ్డవ దర్శనం నామ సప్తదశోధ్యాయః

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters