Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ ఏకోనవింశాధ్యాయః

(బ్రహ్మయాగవృత్తాంతము)

శ్లో|| ఇన్ద్రాద్యాశ్చ హవిర్భుజో7త్ర పరమానన్దేన నృత్తేక్షణాత్‌

నోజగ్ముః సురసిన్ధురోధషి కృతం యజ్ఞ విధాత్రాఖిలాః|

జానన్పుత్రముఖేన హేతుమయమేవాగత్య తిల్వాటవీం

వైయాఘ్రాంఘ్రినిదేశతః స అమరాన్ని న్యేముఖం దీక్షితైః|

యజ్ఞములో హవిస్సును భుజించెడి ఇంద్రాదులు అచ్చట నృత్తముజూచుటవలన పరమానందమునుపొంది గంగానదియొడ్డున బ్రహ్మచేయుచున్న యజ్ఞమునకెవ్వరును వెళ్ళలేదు. దానికి కారణము కుమారునివలన తెలిసికొని బ్రహ్మయే తిల్లవనమునకు వచ్చి వ్యాఘ్రపాదునియాజ్ఞవలన దేవతలను, దీక్షితులను యజ్ఞమునకు తీసికొనివెళ్లెను.

శ్లో|| ఏతస్మిన్న న్తరే బ్రహ్మా యియక్షుశ్చతురాననః|

భాగీరథ్యాస్తటం ప్రాప్య తత్రా న్తర్వేదినామని||

దేశే విశాలాం విధివత్‌ శాలామకృత సానుగః|

ఇంతలో చతుర్ముఖ బ్రహ్మ యజ్ఞముచేయదలచి గంగా నదియొడ్డునకేగి అచ్చట అంతర్వేది అనుపేరుగల ప్రదేశమున అనుచరులతో కలిసి విశాలమైనశాలనుయథావిధిగానిర్మించెను.

శ్లో|| తత్ర సంభృతసమ్భారః పుణ్య చాహని దీక్షితః|

ఆజుహావ హవిర్బాగహేతోః సేన్ద్రానథామరాన్‌||

అచ్చట సంబారములను సమకూర్చుకొని పవిత్రమైన దినమున దీక్షలో ప్రవేశించి హవిర్భాగములు తీసికొనుటకు ఇంద్రుడు మొదలగు దేవతలను పిలిచెను.

శ్లో|| ఆహుతా అపి తే ధాత్రా వాసవాద్యా దివౌకసః|

ఆజగ్ముర్త్నె వతద్యజ్ఞం హవిర్భాగే నిరాదరాః||

ఇంద్రాదిదేవతలు బ్రహ్మపలిచినను హవిర్భాగమందు ప్రీతిలేక ఆయజ్ఞమునకు రాలేదు.

శ్లో|| తతః కిమేతదిత్యాశు స విచార్య చతుర్ముఖః|

తిల్లారణ్యస్థతాన్సర్వాన్దదర్శ జ్ఞానచక్షుషా||

అనంతరమాచతుర్ముఖుడు ఇదియేమని ఆలోచించి వెంటనే జ్ఞానదృష్టిలో తిల్లారణ్యములోనున్న వారినందరిని చూచెను.

శ్లో|| దేవతా హవిరాదాతుమానయేత్యథ నారదమ్‌|

ప్రాహిణో త్తద్వనం బ్రహ్మా జ్ఞానార్ణవసుధాకరః||

పిమ్మటజ్ఞానసముద్రమునకు చంద్రుడైన బ్రహ్మ దేవతలను హవిస్సుతీసికొనుటకు తీసికొనిరమ్మని నారదుని ఆవనమునకు బంపెను.

శ్లో|| స్కో7పి వేగాత్సమాగత్య నమస్కృత్య నటేశ్వరమ్‌|

సవిధే తస్య దేవస్య పరమానన్దనిర్భరాన్‌||

విలోక్య దేవాంస్తానేవమబ్రవీన్నా రదో మునిః|

ఆనారదమునియు వేగముగా వచ్చి నటేశ్వరునకకు నమస్కరించి ఆదేవుని సమీపమున పరమానందముతో నిండిన దేవతలను జూచి వారితో నీవిధముగా బలికెను.

శ్లో|| యుష్మదాగమ హేతోర్మాం ప్రాహిణోత్పద్మ సమ్భవః|

సమాగచ్ఛత తత్రేతి ప్రణనామ పునఃపునః||

మిమ్ములను తీసికొనివచ్చుటకై బ్రహ్మ నన్ను పంపెను. అక్కడకు రండు అని మరలమరల నమస్కరించెను.

శ్లో|| నారదోక్తం వచశ్శ్రుత్వా సర్వే దేవాః కృతస్మితాః||

ప్రత్యూచురేవం నృత్తేశభక్తిభావితభావనాః||

నారదుడుచెప్పిన మాట విని దేవతలందరు చిరునవ్వు నవ్వి నటేశునియందు భక్తితో వ్యాపించిన చిత్తము గల వారై వానికి సమాధానము చెప్పిరి.

శ్లో|| ఆనన్దతాణ్డవసుధామాకణ్ఠం పిబతాం హి నః|

అపవర్గే7థవా స్వర్గే హవిర్భాగే చ నాదరః||

ఆనందతాండవామృతమును కంఠమువరకు త్రాగు చున్న మాకు హవిర్భాగమందుగాని, స్వర్గమందుగాని, మోక్షమందుగాని ప్రీతిలేదు.

శ్లో|| నారదో7పి నిశ##మ్యైవం వాక్యమేతద్దివౌకసామ్‌|

పిత్రే నివేదయామాస ప్రతిపాలయతే సురాన్‌||

నారదుడును దేవతలయీమాటనిట్లువిని దేవతలకొరకు నిరీక్షించుచున్న తండ్రికి చెప్పెను.

శ్లో|| లోకేశో7పి వచశ్శ్రుత్వా నారదస్య మహాయతేః|

అనేష్యామ్యహమేవేతి ప్రాప తిల్లవనం జవాత్‌||

మహాబుద్ధివంతుడగు నారదుని మాటవిని బ్రహ్మ నేనే తీసికొనివచ్చెదనని వేగముగా తిల్లవనముకు వచ్చెను.

శ్లో|| ఆయాన్తం దూరతో దృష్ట్వా ప్రాప్తదీక్షావిధం విధిమ్‌|

గౌరవాదాశు తే ప్రితాః ప్రతిజగ్ముర్దివౌకసః||

దీక్షను స్వీకరించి వచ్చుచున్న బ్రహ్మను దూరము నుండి చూచి యాదేవతలు ప్రీతిజెంది గౌరవముతో వెంటనే ఎదురేగిరి.

శ్లో|| ఆన్వితసై#్తస్త త స్తీర్థే శివగఙ్గాభిధానకే|

కృతస్నానవిధిర్దేవం ప్రణనామ సభాపతిమ్‌||

పిమ్మట వారితో కలిసి శివగంగయును పేరుగల తీర్థమున స్నానముచేసి దేవుడగు సభాపతికి నమస్కరించెను.

శ్లో|| తతః ప్రణమ దేవేశం మూలస్థాననివాసికమ్‌|

మునినా వ్యాఘ్రపాదేన సహ తస్యాశ్రయం య¸°||

అనంతరము మూలస్థానమందున్న దేవదేవునకు నమస్కరించి మునియగు వ్యాఘ్రపాదునితో వానియాశ్రమమునకేగెను.

శ్లో|| తత్రాసౌ పార్శ్వయోర్దృష్ట్వా వాసవప్రముఖాన్‌ సురాన్‌|

బద్దాఞ్జలిపుటో బ్రహ్మా జగాద మధురం వచః||

అచ్చట నాబ్రహ్మ ప్రక్కలయందు ఇంద్రాదిదేవత లను జూచి నమస్కరించుచు తీయనిమాట పలికెను.

శ్లో|| అద్యాహమమరాస్సేన్ద్రాః!యజ్ఞంకర్తుంకృతక్షణః|

యుష్మాభిర్భుజ్యతాం తత్ర హవిరగ్నౌ వషట్కృతమ్‌|

ఇంద్రాదిదేవతలారా! నేడు నేను యజ్ఞముచేయుటకు నిరీక్షించుచుంటిని. మీరక్కడ అగ్నిలో హోమముచేయబడిన హలిస్సును భుజింపుడు.

శ్లో|| ఇతి తస్య వచః శ్రుత్వా బ్రహ్మణో నాకవాసినః|

కేవలం నతమూర్ధానస్తస్థురేవాకృతో త్తరాః||

ఈవిధముగా నా బ్రహ్మమాటవిని దేవతలు సమాధానము చెప్పక కేవలము తలలుపంచుకొని నిలబడిరి.

శ్లో|| దృష్ట్వా స్థితిమిమాం ధీరాం దేవానాంపద్మసమ్భవః|

అజానన్ని భావజ్ఞః ప్రాహైరావతవాహనమ్‌|

దేవలయొక్క ధైర్యముతో కూడిన ఈస్థితిని చూచి భావమునెరిగిన బ్రహ్మ ఎరుగనివాడువలె ఇంద్రునితో పలికెను.

శ్లో|| దివౌకసాం స్థితేరస్యాః హేతురశ్రావి నారదాత్‌|

తథైవ దృష్టశ్చాస్మాభిః త్వం కిమత్ర కరిష్యసి||

దేవతలయీస్థితికి కారణమును నారదునివలనవింటిని. అట్లే మాకు కనబడినది నీవిక్కడ నేమిచేయుదువు?

శ్లో|| ఇత్యుక్తో దేవదేవేన బ్రహ్మణా పద్మయోనినా|

భేత్తాగిరీణాం ప్రాహేదం భీతోలోకపితామహమ్‌||

పద్మసంభవుడు, దేవదేవుడునగు బ్రహ్మ ఇట్లడుగగా పర్వతములను భేదించిన ఇంద్రుడు భయపడుచు బ్రహ్మతో నిట్లనెనె.

శ్లో|| ప్రసీద దేవదేవేశ! ప్రజాపతిపితః! ప్రభో!

నాపరాద్ధమిహాస్మాభిః శృణు తత్వంవదామ్యహమ్‌||

ప్రజాపతితండ్రియగు దేవదేవ! ప్రభూ! అనుగ్రహింపుము. దీనిలో మాతప్పులేదు. నేను నిజము చెప్పుచుంటిని. వినుము.

శ్లో || అనన్దతాణ్డవామ్భోధౌ అగాధే చ నిమజ్జితాః|

స్వాధికారే తథాహారే విహారే చ మనో న నః||

మేమగాధమైన యానందతాండవసముద్రములో ముంచబడితిమి. మామనస్సు మాయధికారములయందుగాని ఆహార మందుగాని విహారమందుగాని లేదు.

శ్లో|| క్షన్తవ్యమేతదాహూతాః నాగచ్ఛన్నమరా ఇతి|

యదాదిష్టం తు భవతా కరిష్యామో7ధునై వతత్‌||

పిలువగనే దేవతలు రాలేదని తప్పును క్షమింపుము. నీవాజ్ఞాపించిన దానినినపుడే చేసెదను.

శ్లో || వినయోదితమాకర్ణ్య వ్యాఘ్రపాదౌ బిడౌజసః|

యదాహ వజ్రీ తత్సత్యమితి బ్రహ్మాణమబ్రవీత్‌||

వినయముతో దేవేంద్రుడు చెప్పిన మాట విని వ్యాఘ్రపాదుడు 'ఇంద్రుడు చెప్పినది నిజము' అని బ్రహ్మతో పలికెను.

శ్లో || తథాపి సేవావసరే సేవన్తాం తాణ్డవేశ్వరమ్‌|

స్వస్వాంశేన తథా యజ్ఞే భాగన్స్వాన్స్వాంశ్చ భుంజతామ్‌||

ఐనను సేవాసమయమున మీమీయంశలతో నటేశ్వరునిసేవింతురు గాక అట్లే యజ్ఞములో మీమాభాగములను భుజింతురుగాక.

శ్లో || త్రిసహస్రమమీ కిస్తు మునయః ప్రథితౌజసః|

అనువ్రజస్తు త్వాం బ్రహ్మన్నలఙ్కుర్వన్తు సంసదమ్‌||

కాని బ్రహ్మా! ప్రసిద్ధమైన తేజస్సుగల ఈ మూడువేల మంది మునులు నీవెంట వచ్చి సభనలంకరించెదరుగాక.

శ్లో || వ్యాఘ్రపాదవచశ్శ్రుత్వా విబుధాస్సహవాసవాః|

తంప్రశస్య తథా గన్తుం యజ్ఞం ధాత్రానుమేనిరే||

ఇంద్రాదిదేవతలు వ్యాఘ్రపాదుని మాటవిని వానిని పొగడి ఆవిధముగా బ్రహ్మతో యజ్ఞమునకేగుట కంగీకరించిరి.

శ్లో || తతో మాధ్యన్దినిం నేత్రైరనుగృహ్య పితామహః|

సేన్ద్రైస్సురైశ్చ మునిభిస్సహ శాలాం వివేశ హ||

పిమ్మట బ్రహ్మ కన్నులతో వ్యాఘ్రపాదునను గ్రహించి ఇంద్రాదిదేవతలతోను మునులతోను యజ్ఞశాలను ప్రవేశించెను.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీ మహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్య్మే

బ్రహ్మణఃతిల్లవనప్రాప్తిర్నాను ఏకోనవింశాధ్యాయః

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters