Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

ద్వితీయోధ్యాయః

(క్షేత్రప్రశంసనము)

శ్లో|| కైలాసే ప్రణిపత్య శమ్భుముమయాశ్లిష్టం చ నన్దీ పురా|

ప్రాక్షీద్దేవ! తవ ప్రియాణి కథయ స్థానాని లోకేషు మే|

తేషు ప్రేష్ఠచిదమ్బరస్య చరితం శుశ్రూషురస్మి ప్రభో|

యత్రైకక్షణవాసతో జనిమతాం ముక్తిః కరస్థాధ్రువా||

నంది పూర్వము కైలాసమున పార్వతితో గూడియున్న శివునకు నమస్కరించి ''దేవ! లోకములలో నీకు బ్రియమైన స్థానములను జెప్పుము. ప్రభూ! వానిలో ప్రియతమమై ఒక క్షణమచట నివసించినను ప్రాణులకు ముక్తిని దప్పక సులభముగా నొసగునట్టి చిదంబరముయొక్క చరిత్రను వినదలచితిని'' అవి యడిగెను.

శ్లో|| చూడామణిం ప్రసన్నాభంశివంకై లాసభూభృతః|

ప్రణిపత్య పురా నన్దీ పరమేశం వ్యజిజ్ఞపత్‌ ||

కైలాసపర్వతమునకు శిరోభూషణమై ప్రసన్నమైన కాంతిగలిగి మంగళప్రదుడగు పరమేశ్వరునకు నమస్కరించి పూర్వము నంది విన్నవించెను.

నన్దీ ఉవాచ :

శ్లో|| చరాచరాత్మకే విశ్వే దేవ! శంకర! స న్తతమ్‌|

త్వమేవ కరుణారూపో విహరన్‌ ప్రతిభాసి మే||

నంది పలికెను :

దేవ! శంకర! స్థావర జంగమ రూపమైన ప్రపంచమునదయా స్వరూపుడవై విహరించుచు నీవే నాకు గనబడుచుంటివి.

శ్లో|| మహాంశ్చ పరమాణుశ్చ సకలం త్వం మహేశ్వర|

త్వమేవ సర్వలోకానాం సృష్టిస్థిత్యన్తకారణమ్‌||

మహేశ్వర! మహా స్వరూపము పరమాణు స్వరూపము నమస్తము నీవే. లోకముల సృష్టి స్థితి లయములకు కారణము నీవే.

శ్లో|| తృణం చ న చలత్యేవ భవచ్ఛక్త్యా వినా శివ!

దేవస్య కరుణాదృష్ట్యా ప్రాప్యతే సుఖమక్షయమ్‌||

శివ! నీ శక్తి లేకుండ గడ్డిపరక కూడ గదలనేకదలను నీకరుణా కటాక్షముచే నాశములేని సుఖము లభించును.

శ్లో|| కదాచిదపి సేవ తే లభ్యతే యది మానవైః|

క్షణమాత్రేణ తే ముక్తాః పాశైర్జన్మనిబన్ధనైః||

మానవులకు నీ సేవ ఒక్క పర్యాయమైనను లభించినచో వారు క్షణములో జన్మకు గారణమైన పాశములనుండి విడుదల చెందుదురు.

శ్లో|| దుష్కరై ః కిం తపోభిశ్చ తేషాం కిం తీర్ధసేవనైః|

కిం జపైః కిము హోమైశ్చ కిం కర్మాచరణౖ స్తదా||

వారికి దుష్కరమైన తపస్సు లెందుకు? తీర్థ సేవనము లెందుకు? జపము లెందుకు? హోమము లెందుకు? ధర్మాచరణము లెందుకు?

శ్లో|| ఉపవా సైః కిమన్యైశ్చ కాయక్లేశానుబంధిభిః|

ఇతిహాసైః పురాణౖశ్చ కిం శాస్త్రాగమచి న్తనైః||

ఉపవాసములతో నేమి ప్రయోజనము? శరీర క్లేశమును గలిగించు ఇతర సాధనములతో నేమి ప్రయోజనము? ఇతిహాసములతో గాని పురాణములతో గాని వేద శాస్త్రచింతనముతో గాని యేమి ప్రయోజనము?

శ్లో|| అసిద్ధాః సిద్ధయో యూస్తు తపోభిరపి దుష్కరైః|

క్షణమాత్రేణ సిద్ధ్యన్తి తవ పాదాబ్జ సేవయా||

మిక్కిలి దుష్కరమైన తపస్సులచేత గూడ సిద్ధింపని సిద్ధులు నీ పాద పద్మముల సేవచే క్షణములో సిద్ధించును.

శ్లో|| సేవయా పరయా దేవ! తవ లోకా నిరాకులాః|

లభ##న్తే సర్వకార్యాణి సర్వం త్వన్మయమేవ హి||

దేవ! ఉత్కృష్టమైన నీ సేవచే లోకులు కలత జెందక సమస్త కర్మ ఫలములను బొందుదురు. సమస్తము నీవే గదా.

శ్లో|| యత్ర యత్ర ప్రదృశ్యేతే తవపాదౌ శుభోద¸°|

తత్ర తత్రైవ సిద్ధ్యన్తి సిద్ధయః సర్వసమ్పదామ్‌||

మంగళప్రదమైన యావిర్భావముగల నీపాదము లెచ్చటెచ్చట గనబడునో అచ్చటచ్చటే సర్వసంపదలు సిద్ధించును.

శ్లో|| సర్వేషు లోకేశు మహ త్తరాణి స్థానాన్యనేకాని తవేశ! సన్తి

ఉక్తానిచైకం పునరేవ తేషు పృచ్ఛామి దేవేశ! తదుచ్యతాం మే||

ఈశ! సమస్త లోకములయందు నుత్కృష్టమైన నీ స్థానము లనేకములు కలవు. వానినిగూర్చి చెప్పితిని. వానిలో నొక్క దానిని గూర్చి మరల అడుగుచుంటిని. దానిని గూర్చి నాకు జెప్పుము.

శ్లో|| పుణ్ణరీకపురం నామ విద్యతే భువి యత్పురమ్‌|

ఇచ్ఛామి తస్య మహాత్మ్యం శ్రోతుం త్వద్వదవామ్బుజాత్‌||

భూమిలో పుండరీకవురమను నేపురము గలదో దాని మాహాత్మ్యమును నీ ముఖపద్మమునుండి వినగోరుచుంటిని.

శ్లో|| కథం హి వైభవం తస్య వైభవశ్రావిణో మమ|

మహతా విస్తరేణౖవ కథయస్వ మహేశ్వధ!||

మహేశ్వర! వైభవమును వినగోరు నాకు దాని వైభవ మెట్టిదో చాల వివరముగానే చెప్పుము.

శ్లో|| నన్దినోక్తం పచశ్ర్శుత్వా ప్రసన్నవదనశ్శివః|

ప్రోవాచ భగవాన్ర్పీతః పార్వతీపతిరవ్యః||

నంది పలికిన మాటను విని ప్రీతిజెంది ప్రసన్న ముఖుడు నాశ రహితుడునగు పార్వతీపతి పలికెను.

మహేశ్వర ఉవాచ:

శ్లో|| గణపర్య! మహాబుద్ధే! సాధు తుష్టోస్మస్యహం తవ|

మాహాత్మ్యమఖిలం తస్య ప్రవక్ష్యామి సవి స్తరమ్‌||

మహేశ్వరుడు పలికెను :

గణవర్య! మహామతీ! నేను నీయెడల చాల సంతసించితిని ఆపుర మాహాత్మ్యము సంతను విస్తరముగా జెప్పెదను.

శ్లో|| మయా వినా తు వక్తాపి త్వత్తఃశ్రోతాపి నా స్తిహి|

పుణ్డరీకసమాఖ్యస్య పురస్యాద్భుతసమ్పదః||

ఏలననగా, అద్భుతమైన సంపదగల యీ పుండరీక పురమునుగూర్చి నాకంటె మరియొకడు చెప్పువాడును లేడు నీకంటె వినువాడును లేడు.

శ్లో|| శ్రోతుమప్యఖిలం తస్య వైభవం నైవ కశ్చన|

సాక్షాత్తస్య స్వరూపస్య వక్తా నా స్తీతి కిం పునః||

దాని వైభవము నంతను వినుటకుగూడ నెవ్వడును లేనేలేడు. దాని రూపమును స్పష్టముగా జెప్పువాడు లేడని చెప్ప బనియేమి?

శ్లో|| జానన్తి పరమం గుహ్యం యే రూపం మమ నిర్మలమ్‌|

పుణ్డరీకపురస్యాస్య ప్రభావం తేపి నైవ హి||

ఉత్కృష్టము, రహస్యము, నిర్మలమునగు నారూపము నెరిగినవారుకూడ నీవుండరీక పుర ప్రభావము నెరుగరు.

శ్లో|| యస్య స్మరణమాత్రేణ కోటిజన్మసమార్జితైః|

కల్పిషైస్సకలైర్ఘోరైః నరస్సద్యః ప్రముచ్యతే||

మానవుడు దానిని స్మరించినంతనే కోటి జన్మలయందు లభించిన ఘోరమైన సకలపాపములనుండి వెంటనే విముక్తుడగును.

శ్లో|| అహమప్యస్య నై వాస్మి శక్తో వైభవవర్ణనే|

స్థానానామపి సర్వేషాం తన్మే ప్రియతమం సదా||

నేనుగూడ దాని వైభవమును వర్ణించుట కశక్తుడను. అన్ని స్థానములలో నది నా కెల్లప్పుడు మిక్కిలి ప్రియమైనది.

శ్లో|| తచ్చ యోజనం విస్తీర్ణమాయామోపి తథావిధః

మునిభిర్మమ సర్వైర్హి సేవితం కాలనాశనమ్‌||

అది ఒక యోజనము వెడల్పు ఒక యోజనము పొడవు గలది, నా మును లందరిచేతను సేవింపబడినది, మృత్యువును బోగొట్టునది.

శ్లో|| మహతా గౌరవేణౖవ మల్లోకమతివర్తతే|

నాస్త్యేవ సదృశ్యం తస్య త్రిషు లోకేషు తచ్ఛృణుః||

ఎక్కువ గౌరవముచే నాలోకమును మీరినది. దానికి సమానమైనది మూడు లోకములలోను లేనేలేదు. దానిని వినుము.

శ్లో|| న శక్నోమి వ్రభావేన స్తోతుం కృత్స్నం నిర న్తరమ్‌||

గోపురాణ్యపి చారూణి మమ మూర్త్యన్తరాణి హి||

దానిని ప్రభావముతో సంపూర్ణముగా నిరంతరము వర్ణింపలేను. అందమైన గోపురములుకూడ నాయోక్క మూర్తులే.

శ్లో|| అశేషసంపదాధారే నిరుపాధౌ మమ ప్రియే|

పుణ్యరాశిలతోద్యానే విద్యావా సే శుభోదయే||

కలావిలాసినీక్రీడావిధౌ సౌధోపమే పురే|

కాలరాత్రిసమే నిత్యం కలేః పాపస్వరూపిణః||

క్షణమప్యత్ర యే మర్త్యాః నివస న్తి కృతాదరాః|

సంసారదు స్తరామ్భోధేరుత్తీర్ణాస్తే గణోత్తమ||

గణోత్తమ! సమస్త సంపదలకు తావైనది, కపటము లేనిది, నాకిష్టమైనది పుణ్యరాసులనెడు తీగల కుద్యానమైనది, విద్యకు నివాసమైనది, శుభోదయము గలది, కళలనెడు స్త్రీల క్రీడకు మేడవంటిది, ఎల్లపుడు పాపస్వరూపముగల కలికి కాళరాత్రి వంటిదియునగు నాపురమున క్షణకాల మైనను ఆదరముతో నివసించు మానవులు దాటుటకు శక్యము కాని సంసారమనెడు సముద్రమును దాటుదురు.

శ్లో|| తఏవ కృతకృత్యాశ్చ మమ నిత్యం ప్రియంకరాః|

విధూతజన్మపాప్మానో విశ్వపావన హేతవః||

వారే కృతకృత్యులు, నాకు నిత్యము ప్రీతి గలిగించువారు, అనేక జన్మలలోని పాపము తొలగినవారు. లోకమును పవిత్రముగా జేయుటకు కారణభూతులు.

శ్లో|| తే మాం నిత్యం ప్రవశ్యన్తి దృష్ట్యా జ్ఞానస్వరూపయా|

అన న్తమపరిజ్ఞేయమాధారం జగతాం ప్రభుమ్‌||

వారు జ్ఞాన దృష్టితో అంతము లేనివాడను తెలిసికొనుటకు శక్యము కానివాడను లోకముల కాధారమైనవాడను ప్రభువునగు నన్ను నిత్యము చూచెదరు.

శ్లో|| వన్దనీయా మమాప్యేవ సత్యజ్ఞానస్వరూపిణః|

అత్యన్తశుద్ధజన్మానో వాగగో చరవైభవాః||

వారు సత్య జ్ఞాన స్వరూపుడనగు నాకుగూడ నమస్కరింప దగినవారు, మిక్కిలి పవిత్రమైన జన్మ గలవారు, మాటల కందని వైభవము గలవారు.

శ్లో|| పుణ్డరీకపురే మర్త్యాః క్షణమాత్రం వస న్తి యే|

మమ లోకే మహీయ న్తే సతతంతేమహామతే||30

మహామతీ! క్షణమాత్రమైనను పుండరీక పురములో నివసించు మానవులు ఎల్లప్పుడు నాలోకములో విరాజిల్లెదరు.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమార

సంహితాయాం మహేశ్వరనిన్దిసంవా

దే చిదమ్బరమాహాత్మ్యే క్షేత్ర

ప్రశంసనం నామ ద్వితీయోధ్యాయః

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters