Upanyasamulu    Chapters   

శ్రీః

జగద్గురు

శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరుల

ఉపన్యాసములు.

కేసరి సుందరరామ శర్మ,

సంపాదకుడు.

1939.

కాపీరైట్‌.) (వెల 0-4-0.

శ్రీః

అంకితము

క|| శ్రీచంద్ర శేఖర గురు

శ్రీ చరణ సరోజములకు, * శిష్యోద్ధరణ

ప్రాచు ర్యాచరమములకు,

ఈ చిఱుపొత్తంబు భక్తి * నేనర్పింతు.

ఇట్లు

శ్రీజగద్గురు పాదసేవకుడు,

శ్రీః

అంకితము

క|| శ్రీచంద్ర శేఖర గురు

శ్రీ చరణ సరోజములకు, * శిష్యోద్ధరణ

ప్రాచు ర్యాచరమములకు,

ఈ చిఱుపొత్తంబు భక్తి * నేనర్పింతు.

ఇట్లు

శ్రీజగద్గురు పాదసేవకుడు,

కేసరి సుందరరామశర్మ.

తొలిపలుకు.

శ్రీ జగద్గురు కామకోటి పీఠాధిపతులు నెల్లూరికివిచ్చేసిన అక్టోబరు తే 30 ది దొరఁకొని వారుకావించిన యుపన్యాసములు అనేకములు. వారు ఉపన్యసించిన తావులును, ఉపన్యసించిన విషయములును అనేకములే. ఏవో కొన్ని తక్క తక్కిన యుపన్యాసములన్నియు వినుభాగ్యము నాకును లభించినది. కాని వారి వాక్సుధాధారల సర్వము తనివిదీఱఁగ్రోలినవారు, వారిసన్నిధి నేనాఁడు విడనాడక వారివెన్నంటియున్న శ్రీయుత కోట నరసింహార్య ప్రభృతులు కొందఱనియే నాతలంపు. శ్రీవారి యుపన్యాసముల సంక్షేపముగా నప్పటప్పటికి వ్రాసికొనుచుండిన వారలిర్వురు. ఒకరు చిరంజీవి కేసరి సుందరరామశర్మగారు, వేఱొకరు కళాశాలలో నాయొద్ద జదువుకొనుచున్న విద్యార్థి చిరంజీవి గాదిరాజు వేంకటరమణయ్యగారు. వీరిర్వురు నొండొరుల వ్రాఁతసరిచూచుకొని కొఱంతలఁ బూరించుకొని విషయము సమగ్రము గావించు కొనుచుండెడివారు. వ్రాసికొనుభారము సముగాఁబంచుకొన్నను ప్రాయికముగా విషయములఁ బత్త్రికలకు వ్రాయుచుండినవారు శ్రీ సుందరరామశర్మగారే. ఎట్టి గహనమైనయర్థము నైనను, శ్రోతలకుఁ గరతలామలకముగావించు ప్రజ్ఞలో అన్యులను శ్రీవారి వెనుకనే పేర్కొనవలయుననుట యీయుపదేశములువిన్న సహస్రాధిక సంఖ్యాకులకు శ్రోతృజనులకెల్లరకు విశదము. శ్రీవారివాక్కులు ప్రసన్నము లైనను, ఒక్కొక్కతఱి నారు వివరించు నర్థములు అతిగభీరములు - కావున లేఖకులు వ్రాసికొను తీవరమునఁజేసి ఒక్కొక్కయెడఁ జెప్పిన యానుపూర్వి యొకింత సడలియుండవచ్చును- విషయము ఒకకొంత లుప్తమై యుడవచ్చును. కాని, శ్రీవారి యమోఘోపదేశములకు ఈపాటిరూపు కల్పించి సారము చెడకుండ జిజ్ఞాసువుల కుపాదేయములఁ గావించిన సుందరరామశర్మగారి శ్రద్ధా పరిశ్రమములు కొనియాడఁదగియున్నవి- ఈయువవతంసుని భక్త్యుత్సాహములులేకున్న శ్రీవారి వాఙ్ముఖములు పాఠకులకు దుర్లభములై యుండెడివి కదా!

శ్రీవారి భాష తేటతెనుఁగు- అమృతనిష్యందము- వారిముఖమున వెలువడిన మాట లట్లట్లు వ్రాసికొనుటకుఁ దెనుఁగున సంక్షిప్తలేఖనము (Short Hand) లేమి దీఱని కొఱంత. అదియే యున్నయెడల శ్రీవారి వచనములు యథాక్షరము మనకు లభించియుండెడివి - కాని నేనువిన్న పె క్కుపన్యాసముల విషయమున సుందరరామశర్మగారు గావించిన యీసంగ్రహము శ్రీవారి భావములకు సన్నిహితమై, సముచితమై, సారమై శోభిల్లుచున్నది - ఇందుకు శర్మగారి నేనెంతయేని అభినందించుచున్నాను-

ఈ యుపన్యాసములు శ్రీవారివాక్కులు స్వయముగా విన్నవారికి జ్ఞాపకములై, యితరులకుఁ ప్రబోధకములై, జిజ్ఞాసువుల అందఱకు మిగుల నుపయోగపడఁగలవని తలంచుచున్నాను-

నెల్లూరు, దుభా9. సుబ్రహ్మణ్యశర్మ,

9-2-39. ప్రధానాంధ్రపండితుఁడు

మహారాజాగారి కళాశాల, నెల్లూరు.

విజ్ఞప్తి.

జగద్గురువులు శ్రీకామకోటి పీఠాధీశ్వరులగు శ్రీమచ్చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వాములవారు ఈ సింహపట్టణమునఁ గావించిన మహోపన్యాసముల నప్పటప్పటికి నేను 'స్వతంత్ర' పత్త్రికకు వ్రాయుచుంటిని. వానిని జదివినయనేకుపలు అవియెల్లఁ బుస్తకరూపముగానుండిన ప్రజలకు మిగులముపయుక్తములగునని నాతోడనాకుచ్చిరి. ఆహెచ్చరిక ప్రకారము శ్రీవారి యుపన్యాసములలోఁగొన్నింటి నీ ప్రథమసంపుటమున సంతరించియున్నాను. తక్కినవియు కాలక్రమమున రెండవసంపుటమునఁ బ్రకటింపగలను. శ్రీవారు సర్వజ్ఞులు. వారిమాట యొక్కొక్కటియు వారియనుభూతినుండి వెలువడినది గాని యన్యముగాదు. అట్టివాని సమగ్రముగ సంగ్రహించుటలో నెంతవానికిఁ బొరలు దొరలవచ్చునన్న నాబోఁటి యల్పజ్ఞు విషయమునుగూర్చి చెప్పవసినదేమున్నది. అయినను నావ్రాతఁలఁదిలకించి శ్రీవారే యొకపరి సెలవిచ్చిన మెచ్చుకోలు పురస్కరించుకొనియు, వారియనుగ్రహము కాంక్షించియు ఈ గ్రన్ధముద్రణకార్యమున కుపక్రమించితిని. మిత్రులతొందరచే గ్రన్థమనతి కాలముననే ప్రకటించుటవలన యిందు అచ్చుతప్పులును, పెల్లుగనుండవచ్చును, కాబట్టి పాఠకులు మన్నింతురుగాక!

శ్రీ వారు వ్యావహారికభాష నాశ్రయించి యుపన్యసింతురు. అట్టి వానిని నేను కొన్ని వాకృతముగావింపఁజూచితిని, కాని ముంద్రింపవసినవేగమునఁజేసి యన్నింటిని సంపూర్ణముగా నట్లొనర్ప సాధ్యముకాదయ్యెను. కొన్నియెడల శ్రీవారి వాక్కుల నట్లేయుండనిచ్చుట ప్రసాదహేతుననియు డోంచి వారిమార్పనైతిని. నాయీవ్రాఁతలలో నేదేని గుణలేశమునుండి అది శ్రీ వారిపలుకులకుఁ జెందినదనియు, దొసంగులెల్ల నాయవియనియు పాఠకులు గ్రహింతురుగాకయని వేఁడుచున్నాను.

ఏతద్గ్రన్థ ముద్రణవిషయమున ధనసహాయమొనర్చిన బ్రహ్మశ్రీకోట నరసింహపంతులు (రిటైర్డు సబ్‌జడ్జి) మ-రా-రా-శ్రీ జెజవాడరామచంద్రారెడ్డి బి.ఎ.సి.బి.ఇ., శ్రీయుత డా||మల్లవరపు శ్రీనివాసరావు (యల్‌.యం.పి) శ్రీయుత ఏయ&. రామకృష్ణయ్యగార్లకును నావ్రాఁతనెల్లఁదమ పత్త్రికయందుముద్రించి నాకన్నివిధములఁ దోడ్పడి "స్వతంత్ర" పత్త్రికాసంపాదకులు మ-రా-రా-శ్రీ వెన్నెలకంటి అంజయులుగారికిని నాకృతజ్ఞతను దెలుపుకొనుచున్నాను.

మఱియు నేను కోరినవెంటనే యీచిఱుపొత్తమునకుఁదొలిపలువ్రాసియిచ్చిన "అభినవతిక్కన" బిరుదంకితులగు బ్రహ్మశ్రీ దురాసుబ్రహ్మణ్యశర్మగారికి ప్రత్యేకముగ నాకృతజ్ఞతాపూర్వక నమస్కారములర్పించుచున్నాను.

విక్రమసింహపురి,} కేసరి సుందరరామశర్మ

9-2-39,

కేసరి సుందరరామశర్మ.

Upanyasamulu    Chapters