Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

1 శ్రీ మహాభాగవత ప్రాశస్త్యము శ్రీమత్‌ క్షీరార్ణవ శేషశాయి యగు శ్రీహరి అవతారముల ఔన్నత్యమును, భక్తరక్షణ పరాయణత్వమును వర్ణించు ఇతివృత్తము గల పురాణము శ్రీ మహా భాగవతము, ఈ పురాణము గూర్చి పలుకునప్పుడు పోతన రచించిన క్రింది పద్యములు జ్ఞాపకమునకురాక మానవు.
2- భాగవత నిర్వచనములు

అష్టాదశ పురాణములలో పేర్కొనబడిన భాగవతము శ్రీ మన్నారయణ అవతార కథలను వివరించు శ్రీ మహా భాగవతమా?దేవీ మహాత్మ్యమును వర్ణించు దేవీభాగవతమా? అను సందేహము పండితులకు కలిగి వాదోపవాదములు పెక్కులు జరిగినవి. ఈ సందేహ నివృత్తికై భాగవత నిర్వచనములను పరిశీలింపవలెను.

3. భాగవతములో భగవంతుడు

ఏ భక్తుడైనను తొట్టతొలుత ఎదుర్కోనవలసిన రెండు ప్రశ్నలు త్యాగరాజు తనకు తాను ప్రశ్నించుకొనెను.

4. భాగవతము భగవద్గీతల యందలి కర్మయోగము, భక్తియోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము అను ఈ నాలుగు యోగములు ముక్తికి సాధనములని వేదములు ఉపనిషత్తులు, పురాణములు, దర్శనములు మొదలగు వానియందు చెప్పబడియున్నది.
5. శ్రీ మహాభాగవత భగవతత్త్వ నిర్ణయా నంతరము, ''నిన్నెట్లారాధించేదిరా''? అను ప్రశ్నకు సమాధానముగా భక్తి యోగమును విచారింపవలయును భగవంతుని భక్తితో ఆరాధించవలెను. ''భక్త్యా భాగవతం జ్ఞేయమ్‌'' భక్తి భావముతోనే వాఙ్మయావతారమై భాగవతమును గ్రహింపనగును. భగవద్గీతలో శ్రీకృష్ణుడు
6. కర్మయోగము

విశాల దృక్పథముతో నిర్వచించినచో భూతములకు అస్తిత్వము కలుగజేయు సృష్టి వ్యాపారమే కర్మ యగును.

7. ధ్యానయోగము పతంజలి మహర్షి ''యోగః చిత్తవృత్తి నిరోధః'' అని ధ్యాన యోగమును నిర్వచించెను. అనగా విక్షేప లక్షణముగల మనస్సు యొక్క వృత్తులను నిరోధించుటయే ధ్యానయోగము.
8. జ్ఞానయోగము ఎందుకనగా లోకములో ఇతర విద్యలు కార్య కారణముల చేతను, తర్కము చేతను, పంచేంద్రియములు మనస్సుచేతను గ్రహింప వీలగునవి. కాన కార్యకారణముల నధిగమించినది ఆధ్యాత్మవిద్య. అందులకే భాగవతమున

Sri Bhagavadgeetha Madanam-1    Chapters