Sri Devi Bhagavatam-1
Chapters
అథ సప్తదశో%ధ్యాయః జనమేజయ ఉవాచ : కథం తాశ్చ స్త్రియః సర్వా భృగూణాం దుఃఖసాగరాత్ |
ముక్తా వంశః పునస్తేషాం బ్రాహ్మణానాం స్థిరో%భవత్. 1 హైహయైః కిం కృతం కార్యం హత్వా తాన్ బ్రాహ్మణానపి | క్షత్రియై ర్లోభసంయుక్తైః పాపాచారైర్వదస్వతత్.
2 న తృప్తి రస్తి మే బ్రహ్మ న్పిబతస్తే కథామృతమ్ | పావనం సుఖదం నౄణాం పరలోక ఫలప్రదమ్.
3 వ్యాస ఉవాచ : శృణు రాజ న్ర్పవక్ష్యామి కథాం పాపప్రణాశినీమ్ | యథా స్త్రియస్తు తా ముక్తా దుఃఖాత్తస్మా ద్దురత్యయాత్.
4 భృగుపత్న్యో యదా రాజన్హిమవంతం గిరిం గతాః | భయత్రప్తా నిభగ్నాశా హైహయైః పీడితా భృశమ్.
5 గౌరీం తత్ర తు సంస్థాప్య మృణ్మయీం సరితస్తటే | ఉపోషణ పరాశ్చక్రుర్నిశ్చయం మరణం ప్రతి.
6 స్వప్నే గత్వా తదా దేవీ ప్రాహ తాః ప్రమదోత్తమాః యుష్మాసు మధ్యే కస్యాశ్చి ద్భవితా చోరుజః పుమాన్.
7 మదంశశక్తి సంభిన్నః స వః కార్యం విధాస్యతి | ఇత్యాదిశ్య పరాంబా సా పశ్చాదంతర్హితా%భవత్. 8 జాగృతాస్తు తతః సర్వా ముదమాపు ర్వరాంగనాః | కాచిత్తాసాం భయోద్విగ్నా కామినీ చతురా భృశమ్.
9 దధార చోరుణౖ కేన గర్భం సా కులవృద్ధయే | పలాయనపరా దృష్టా క్షత్రియై ర్ర్బాహ్మణీయదా.
10 విహ్వలా తేజసా యుక్తా తదా తే దుద్రుపుర్భృశమ్ | గృహ్యతాం వధ్యతాం నారీ సగర్భా యాతి సత్వరా.
11 ఇతి బ్రువంతః సంప్రాప్తా కామినీం ఖడ్గపాణయః సా భయార్తా తు తాన్దృష్ట్వా రురోదసముపాగతాన్.
12 గర్భస్య రక్షణార్థం సా చుక్రోశార్తిభయాతురా | రుదతీం మాతరం శ్రుత్వా దీనం త్రాణవివర్జితామ్.
13 నిరాధారాం క్రందమానాం క్షత్రియై ర్భృశతాపితామ్ | గృహీతామివ సింహేన సగర్భాం హరిణీం యథా.
14 పదుహేడవధ్యాయము ఔర్వుని జన్మవృత్తాంతము జనమేజయుడు వ్యాస మునీశా! ఆ భృగుపత్నులు తమ దుఃఖసాగర మెట్లు తరించిరి? భార్గవుల వంశము తిరిగి యెట్లు వృద్ధిగాంచెను? లోభపాపాత్ములగు హైహయ రాజులు విప్రులను జంపిన పిమ్మట నేమిచేసిరో తెలుపుము. మహాత్మా! నీ లలిత వచనామృతము నరులకిహపర సాధకము. దానినెంత క్రోలినను నాకు తనివి తీరుట లేదు. అనగా వ్యాసుడిట్లనెను : రాజా! విప్రస్త్రీలు దాటరాని దుఃఖమెట్లు దాటిరో దానికి సంబంధించిన పాపహరమగు దివ్యకథ వినిపింతును. శ్రద్ధగా వినుము. అట్లు హైహయులచే పీడితులైన భృగు స్త్రీలు భగ్నహృదయులై భయత్రస్తలై హిమగిరి గుహలకేగిరి. వారెల్లరును పావన గంగాతీరమునందు మట్టితో గౌరమ్మ తల్లిని పూజించిరి. వారు చావునకు తెగబడి యుపవాసములు జేసిరి. అంత నొకనాడు వారి కలలో శ్రీలోకైకమాత దర్శన మొసంగినది. 'మీలో నొకరితకు తొడలనుండి నా దివ్యాంశముతో నొక దివ్య పురుషుడుద్భవింపగలడు. అతడు మీ కాగల కార్యములన్నియు చక్కపెట్టగలడు' అని పరాంబిక పలికి యంతర్ధాన మొందెను. ఆ పరాంగనలెల్లరు మేలుకొని సంతోషించిరి. వారందఱిలో భయ వ్యాకులత్వములు గల యొక కామిని గలదు. ఆమె కడు నేర్పరి. ఆమె తన వంశము నిలువబెట్టు కొనుటకు తన పెందొడలో గర్భము దాల్చెను. ఆమె హైహయులకు వెఱచి పారిపోవుచు వారి కంటబడెను. 'ఆమె నుండి దివ్యకాంతులు విరియుచున్నవి. ఆమె భీతితో పారిపోవుచున్నది. పట్టుడు - కొట్టుడు. ఈమె గర్భిణి' యని హైహయులు కేకలిడి పల్కుచు కత్తులు చేబూని యామెను జేరిరి. ఆ భయార్త తన్ను సమీపించువారిని గనెను. ఆమె యే రక్షణము లేక గర్భరక్షణ కొరకు దీనముగ నెలుగెత్తి వాపోయెను. ఆమెకపుడు నా' యనువాడు లేకుండెను. ఆ గర్భిణి సింహము చేత జిక్కిన లేడిపిల్లవలె హైహయులచేత చిక్కి బాధలు పెట్టబడెను. సాశ్రునేత్రాం వేపమానాం సంక్రుధ్య బాలకస్తదా | భిత్త్వోరుం నిర్జగామాశు గర్భః సూర్య ఇవాపరః. 15 ముష్ణన్దృష్టీః క్షత్త్రియాణాం తేజసా బాలకః శుభః | దర్శనా ద్బాలకస్యాశు సర్వే జాతా విలోచనాః. 16 బభ్రమ ర్గిరి దుర్గేషు జన్మాంధా ఇవ క్షత్రియాః | చింతితం మనసా సర్వైః కి మేతదితి సాంప్రతమ్. 17 సర్వే చక్షు ర్విహీనా యజ్జాతాః స్మ బాలదర్శనాత్ | బ్రాహ్మణ్యా స్తు ప్రభావో%యం సతీవ్రతబలం మహత్. 18 క్షణాద్వా%మోఘ సంకల్పాః కిం కరిష్యంతి దుఃఃతాః | ఇతి సంచింత్య మనసా నేత్రహీనా నిరాశ్రయాః. 19 బ్రాహ్మణీం శరణం జగ్ము ర్హైహయా గతచేత సః | ప్రణముస్తాం భయ త్రస్తాం కృతాంజలి పుటాశ్చతే. 20 ఊచుశ్చైనాం భయోద్విగ్నాం దృష్ట్యర్థం క్షత్త్రియర్షభాః | ప్రసీద సుభ##గే మాతః సేవకాస్తే వయం కిల. 21 కృతాపరాధా రంభోరు క్షత్రియాః పాపబుద్ధయః | దర్శనాత్తవ తన్వంగి జాతాః సర్వే విలోచనాః. 22 ముఖం తేనైన పశ్యామో జనాంధా ఇవ భామిని: | అద్భుతం తే తపోవీర్యం కిం కుర్మః పాపకారిణః. 23 శరణం తే ప్రపన్నాః స్మో దేహి చక్షూంషి మానదే | అంధత్వం మరణా దుగ్రం కృపాం కర్తుం త్వమర్హసి. 24 పున ర్దృష్టి ప్రదానేన సేవకాన్ క్షత్రియాన్కురు | ఉపరమ్య చ గచ్ఛేమ సహితాః పాపకర్మణః. 25 అతః పరం న కర్తవ్య మీదృశం కర్మ కర్హిచిత్ | భార్గవాణాం తు సర్వేషాం సేవకాః స్మో వయంకిల. 26 అజ్ఞానాద్యత్కృతం పాపం క్షంతవ్యం తత్త్వయా%ధునా | వైరం నాతః పరం క్వాపి భృగుభిః క్షత్రియైః సహ. 27 కర్తవ్యం శపథైః సమ్య గ్వర్తితవ్యం తు హైహయైః | సుపుత్రా భవ సుశ్రోణి ప్రణతాః స్మో వయంచ తే. 28 ప్రసాదం కురు కల్యాణి న ద్విష్యామః కదాచన | ఇతి తేషాం వచః శ్రుత్వా బ్రాహ్మణా విస్మయాన్వితాః. 29 ఆమె కన్నుల నీరునిండ ఏడ్చెను. అట్లు విలపించు తన తల్లినిగాంచి యొక బాలకు డామె తొడ చీల్చుకొని వచ్చి చండకోపముతో రెండవ సూర్యునివలె భాసిల్లుచు తన తీక్ష తేజముతో క్షత్రియుల చూపుల వెలుగు లార్పివేసెను. ఆ బాలుని చూడగానే వారు గ్రుడ్డివారైరి. 'పుట్టు గ్రుడ్డి వారివలె మనకీ దురదృష్టమేమ' నితలపోయుచు వారు గిరి దుర్గములు పట్టి సాగిరి. మన మందఱ మొకేసారి యీ బాలుని జూచినంతనే గ్రుడ్డివారమైతిమి. దీనికి కారణమా బ్రాహ్మణ స్త్రీ పాతివ్రత్య ప్రభావమే యగును. వారు మనచే పీడింపబడిరి. వారిమోఘ సంకల్పులు. క్షణములో నేదైన చేయజాలుదురు అని కనువెలుగులేని దిక్కులేని - హైహయులు తలంచిరి. వారు దిక్కుగానక బ్రాహ్మణ స్త్రీని శరణు వేడిరి. భయకంపితురాలగు నామెకు దోసిలొగ్గి నమస్కరించి భయగ్రస్తయగు నామెను చూపువెల్గుకొఱకిట్లు ప్రార్థించిరి : 'కళ్యాణీ! మమ్ము దయజూడుము. మాకు కన్నులు గనిపించుటలేదు. మేము పుట్టంధులవలె నీ మోము జూడజాలకున్నాము. నీ తపో వీర్య మత్యద్భుతము. మేము పాపులము. ఇకేమి చేయగలము? మేము నిన్నే శరణు బొందితిమి. మాకు చూపు ప్రసాదింపుము. గ్రుడ్డితనము చావు కంటె చెడ్డది. మాపై దయబూనుటకు నీవే తగుదువు. మేము సుక్షత్రియులము. మా కనుచూపు తిరిగి వచ్చిన పిదప నీకు సేవకులమై యుండగలము. ఇకనుండి పాపములు చేయక మా యిండ్ల కేగగలము. ఇకమీద నిట్టి నీచకార్యముల కేవిధముగ నొడిగట్టము. ఎల్ల భార్గవులకును సేవకులమై మెలంగుదుము. మేము తెలివి తక్కువ తనముతో మీ యెడల తప్పు చేసితిమి. మమ్ము క్షమింపుము. ఇకమీద భార్గవుల జోలికి బోము. ఇక క్షత్రియులకు మీకు పొరపొచ్చెము లుండవు. తల్లీ! హైహయులమగు మేము శపథము చేసి చెప్పుచున్నాము. మీకు చేయెత్తి మ్రొక్కుదుము. మీరింక మీద పుత్రవంతులై సుఖ ముండును. కల్యాణీ! మమ్ము దయజూడుము. ఇంకెన్నడును మిమ్ము ద్వేషింపము'' అను హైహయుల దీనవాక్కులు విని బ్రాహ్మణి యచ్చెరువందెను. తానహ ప్రణతాన్దుఃస్థా%నాశ్వాస్య గతలోచనాన్ | గృహీతాం న మయా దృష్టి క్షత్త్రియాః కిల. 30 నాహం రుషా%న్వితా సత్యం కారణం శృణుతాద్యయత్ | అయంచ భార్గవో నూన మూరుజః కుపితో%ద్యవః. 31 చక్షూంషి తేన యుష్మాకం స్తంభితాని రుషావతా | స్వబంధూ న్నిహతాన్ జ్ఞాత్వా గర్భస్థానపి క్షత్త్రియైః. 32 అనాగసో ధర్మపరాం స్తాపసా న్ధన కామ్యయా | గర్భానపి యదా యూయం భృగూనఘ్నంస్తు పుత్రకాః. 33 తదా%య మూరుణా గర్భో మయా వర్షశతం ధృతః | షడంగ శ్చాఃలో వేదో గృహీతో%నేన చాంజసా. 34 గర్భస్తేనాపి బాలేన భృగు వంశ విపృద్ధయే | సో%పి పితృవధాన్నూనం క్రోధేద్ధో హంతు మిచ్ఛతి. 35 భగవత్యాః ప్రసాదేన జాతో%యం మమ బాలకః | తేజసా యస్య దివ్యేన చక్షూంషి ముషితాని చ. 36 తస్మా దౌర్వం సుతం మే%ద్య యాచధ్వం వినయాన్వితాః | ప్రణిపాతేన తుష్టో%సౌ దృష్టిం వః ప్రతిమోక్ష్యతి. 37 స సంతుష్టో బభూవాథ తానువాచ విచక్షుషః | గచ్ఛధ్వం స్వగృహా న్భూపా మమాఖ్యానకృతం వచః. 39 అవశ్యం భావి భావాస్తే భవంతి దేవనిర్మితాః | నాత్ర శోకస్తు కర్తవ్యః పురుషేణ విజానతా. 40 పూర్వ వదృషయః సర్వే ప్రాప్నువంతు యథాసుఖమ్ | వ్రజంతు విగత క్రోధా భవనాని యథాసుఖమ్. 41 ఇతి తేన సమాదిష్టా హైహయాః ప్రాప్తలోచనాః | ఔర్వ మామంత్ర్య జగ్ముస్తే సదనాని యథారుచి. 42 బ్రాహ్మణీ తం సుతం దివ్యం గృహీత్వా స్వాశ్రమం గతా | పాలయామాస భూపాల తేజస్విన మతంద్రితా. 43 ఏవం తే కథితం రాజ న్భృ గూణాంతు వినాశనమ్ | లోభావిష్టైః క్షత్రియైశ్చ యత్కృతం పాతకం కిల. 44 కన్ను వెల్గులు పోగొట్టుకొని దీనార్తులై వినతులైన రాజులతో ఆమె ఇట్లనెను : 'క్షత్రియులారా! మీ చూపులను నేను బోగొట్టలేదు. నాకు మీ యెడల కోపము లేదు. ఇందు సత్య మేదో మీరే తెలిసికొనుడు. ఈ భార్గవ బాలుడు నా తొడల నుండి యుదయించెను. ఇతడే మీ యెడల కుపితుడయ్యెను. ఈతడు తన బంధువులను మా గర్భములందున్న శిశువులను సైతము మీరు చంపుట తెలిసికొనెను. ఇతడే మిమ్ము గ్రుడ్డివారిని జేసెను. మీరు ధనాశకు బానిసలైతిరి. ఏ పాప మెఱుగక ధర్మవర్తనులైన భార్గవులను వారి స్త్రీల గర్భములను శిశువులను మీ పొట్టన పెట్టుకొంటిరి. అపు డీ బాలుడు నా యూరుగర్భములో నూఱండ్లు పెరిగెను. అందితడు వేద వేదాంగము లభ్యసించెను. ఇతడు భృగు వంశాభివృద్ధికి జన్మించెను. మీరితని పితరులను చంపితిరి. ఆ కోపమున మిమ్మితడు నాశము చేయదలచుచున్నాడు. ఈ కుమారుడు శ్రీదేవీ వరప్రసాదమున నాకు గల్గెను. ఇతని మిఱుమిట్లుగొల్పు దివ్యతేజము గనలేక మీ చూపుకాంతులు మాసిపోయెను. ఇత డౌర్వుడన విఖ్యాతి గాంచగలడు. ఈ నా నందనుని వినయముతో సాగిలపడి వేడుకొనుడు. మీకు నేత్రదానము చేయగలడు'' అను బ్రాహ్మణి సాంత్వవచనములు వినిన పిదప హైహయులు సవినయముగ మునిసత్తముడగు నౌర్వునకు మ్రొక్కి తమపై కన్ను తెరచుమని సంస్తుతించిరి. ఔర్వు డంత గ్రుడ్డివారి స్తోత్రమునకు గుండె కరుగగ వారి కిట్లనెను : రాజులారా! మీరు మీ మీ యిండ్ల కేగుడు. నా యీ పరమచరిత్రము మీరు చెప్పుకొనుడు. దైవయోగమున కానున్నది తప్పక జరుగును. తెలివిగల పురుషుడెప్పుడును దేనికిని విచార మొందడు. మీరు కోపమువీడి మీమీ యిండ్ల కేగుడు. ఇక ఋషు లందఱును పూర్వ మట్లు స్వాత్మ విచారమున సుఖ ముందురు గాక!'' అను మహావాక్కులు వినినంతనే హైహయులు చూపులు వెలుగొందెను. వారౌర్వునొద్ద ననుమతి గైకొని తమ ఇండ్ల కేగిరి. బ్రాహ్మణియు దివ్యశక్తిగల తన కుమారుని వెంటగొని తన యాశ్రమ మేగెను. ఆమె బ్రహ్మతేజస్సంపన్నుడగు తన కుమారుని కంటికి ఱప్పవోలె పోషించుచుండెను. రాజా! ఈ విధముగ నీకు భృగువంశజులనాశమును లోభాత్ములగు రాజు లొనర్చిన పాపకృత్యమును దెల్పితిని. అనగా - జనమేజయ ఉవాచ : శ్రుతం మయా మహత్కర్మక్షత్రియాణాంచ దారుణమ్ | కారణం లోభ ఏవాత్ర దుఃఖదశ్చోభయోస్తు సః. 45 కించి త్ర్పష్టు మిహేచ్ఛామి సంశయం వాసవీసుత | హైహయాస్తే కథం నామ్నా ఖ్యాతాభువి నృపాత్మజాః. 46 యదో స్తు యాదవాః కామం భరతా ద్భారతా స్తధా | హైహయః కో%పి రాజా%భూ త్తేషాం వంశే ప్రతిష్ఠితః. 47 తదహం శ్రోతుమిచ్ఛామి కారణం కరుణానిధే | హైహయాస్తే కథం జాతాః క్షత్రియాః కేన కర్మణా. 48 వ్యాస ఉవాచ : హైహయానాం సముత్పత్తిం శృణుభూపసవిస్తరామ్ | పురాతనీం సుపుణ్యాం చ కథాం పాపప్రణాశినీమ్. 49 కస్మిం శ్చి త్సమయే భూప సూర్యపుత్రః సుశోభనః | రేవంతేతిచ విఖ్యాతో రూపవానమిత ప్రభః. 50 ఉచ్చైఃశ్ర వసమారుహ్య హయరత్నం మనోహరమ్ | జగామ విష్ణు వైకుంఠం భాస్కరాత్మజః. 51 భగవద్దర్శనాకాంక్షీ హయారూఢో యదాగతః | హయస్థ స్తు తదా దృష్టో లక్ష్మ్యా%సౌ రవినందనః. 52 రమా వీక్ష్య హయం దివ్యం భ్రాతరం సాగరోద్భవమ్ | రూపేణ విస్మితా తస్య తస్థౌ స్తంభితలోచనా. 53 భగవానపి తం దృష్ట్వా హయారూఢం మనోహరమ్ | ఆగచ్ఛంతం రమాం విష్ణుః పప్రచ్ఛ ప్రణయాత్ర్పభుః. 54 కో%య మాయాతి చార్వంగి: హయారూఢ ఇవాపరః | స్మరతేజ స్తనుః కాంతే మోహయ న్భువనత్రయమ్. 55 ప్రేక్షమాణా తదా లక్ష్మీ స్తచ్చిత్తా దైవయోగతః | నోవాచ వచనం కించిత్పృషా%పి చ పునః పునః. 56 అశ్వాసక్తమతిం వీక్ష్య కామినీమతి మోహితామ్ | పశ్యంతీం పరమప్రేవ్ణూ చంచలా క్షీంచ చంచలామ్. 57 జనమేజయు డిట్లనెను : హైహయుల ఘోరకృత్యములు వింటిని. ఆ యురువర్గముల వారంతగ నిడుములు పడుటకు లోభ##మే కారణము. మునీశా! నా కొక సందియము గల్గుచున్నది. దానిని దీర్చుకొనదలచితిని. నా రాజులకు భూమిపై హైహయులను పేరెట్లు వచ్చెను? యదువంశజులను యాదవులనియు భరత వంశజులను భారతులనియు నందురు. అటులే వీరి వంశమందు హైహయు డెవడేని గలడా? ఆ రాజులే పని చేయుట వలన హైహయులన బరగిరో ఆ కారణ మెఱుగగోరు చున్నాను. అనగా వ్యాసు డిట్లనెను : రాజా! హైహయుల జన్మము వివరింతును. వినుము. వారి కథ పురాతనము - పుణ్యము - పాపనాశకము. ఒకప్పుడు రేవంతుడనువాడు రూపమున తేజమున సాటిలేని వాడుండెను. అతడు సూర్య తనయుడు. అతడొకనా డుత్తమహయమగు నుచ్చైఃశ్రవ మధిరోహించి విష్ణుధామమగు వైకుంఠధామ మేగెను. అతనిని లక్ష్మీదేవి చూచెను. ఆ యుచ్చైశ్శ్రవము సాగరము నుండి లక్ష్మికి తోబుట్టువుగ బుట్టెను. ఆమె దాని మేని జిగిసొబగుల కచ్చెరువంది చూచెను. ఆ గుఱ్ఱమెక్కి వచ్చునట్టి యందగానిని గాంచి శ్రీహరి లక్ష్మితో నిట్లు పలికెను : ఓ కాంతా! ముల్లోకములను మోహపెట్టుచు రెండవ వలరాజువలె నొప్పి గుఱ్ఱమెక్కి యేతెంచు నత డెవ్వడు? లక్ష్మి గుఱ్ఱమునే చూచుచు దానియందే తగిలిన మనస్సుగల దగుటచే విష్ణువెన్ని మార్లు పిలిచినను పలుకలేదు. అట్లు చపలాక్షి - చంచల - యగు లక్ష్మి మనస్సు మోహవశమున గుఱ్ఱము సొంపులో తగుల్కొనుట విష్ణువు గనెను. తామాహ భగవా న్ర్కుద్ధః కిల పశ్యసి సులోచనే | మోహితా చ హరిం దృష్ట్వా పృష్టానైవాభిభాషసే. 58 సర్వత్ర రమసే యస్మా ద్రమా తస్మా ద్భవిష్యసి | చంచలత్వా చ్చలేత్యేవం సర్వథైవ న సంశయః. 59 ప్రాకృతా చ యథా నారీ నూనం భవతి చంచలా | తథా త్వమపి కల్యాణి స్థిరా నైవ కదాచన. 60 త్వం హయం మత్సమీపస్థా సమీక్ష్యయది మోహితా | బడబా భవ వామోరు మర్త్యలోకే%తి దారుణ. 61 ఇతి శప్తా రమాదేవి హరిణా దైవయోగతః | రురోద వేపమానా సా భయభీతా%తి దుఃఃతా. 62 తమువాచ రమానాథం శంకితా చారుహాసినీ | ప్రణమ్య శిరసా దేవం స్వపతిం వినయాన్వితా. 63 దేవదేవ జన్నాథ కరుణాకర కేశవ | స్వల్పే%పరాధే గోవింద కస్మాచ్ఛాపం దదాసిమే. 64 న కదాచి న్మయా దృష్టః క్రోధస్తే హీదృశః ప్రభో | క్వగత స్తే మయి స్నేహః సహజో నతు నశ్వరః. 65 వజ్రపాత స్తు శత్రౌ వై కర్త వ్యో న సుహృజ్జనే | సదా%హం వరయోగ్యా తే పాపయోగ్యా కథం కృతా. 66 ప్రాణాం స్త్యక్ష్యామి గోవింద పశ్యతో%ద్య తవాగ్రతః | కథం జీవే త్వయా హీనా విరహానలతాపితా. 67 ప్రసాదం కురు దేవేశ శాపాదస్మా త్సుదారుణాత్ | కదా ముక్తా సమీపం తే ప్రాప్నోమి సుఖదం విభో. 68 హరిరువాచ : యదా తేభవితా పుత్రః పృథివ్యాం మత్సమః ప్రియే | తదామాం ప్రాప్యతన్వంగి సుఃనీత్వాంభవిష్యసి. 69 ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే సప్తదశో%ధ్యాయః. అపుడు విష్ణువు తీవ్రకోపముతో లక్ష్మి కిట్లనెను : ఓ సులోచనా ! ఏమి చూచుచున్నావు? నేనెంతగ పిలిచినను విననంతగ గుఱ్ఱమును గాంచి మోహపరవశ##వైతివి. నీ వెల్లెడల రమించుటవలన రమయను పేరున చంచలత్వము గల్గుట వలన చంచలయను సార్థకనామమున నొప్పుదువు. కళ్యాణి ! నీవును సామాన్యరమణివలె చంచలవై యొకచో నిలుకడగనుండక పరిభ్రమింపగలవు. వామాక్షీ! నేను నీ దగ్గఱ నుండగనే నీ వా గుఱ్ఱమును గాంచి మోహ మందితివి. కనుక నీవును కష్టాలకు నెలవగు నేలపై ఆడు గుఱ్ఱమ వగుదువు గాక! అట్లు దైవయోగమున విష్ణువు శపింపగా లక్ష్మి గడగడలాడుచు భీతితో దుఃఃంచెను. ఆమె శంకతో వినయముతో తన పతియగు శ్రీపతికి తల యొగ్గి మ్రొక్కి యిట్లనెను : దేవదేవా! జగన్నాథా! గోవిందా! దయాసాగరా! ఈ కొలది తప్పున కింతగ శపించితివి! నీలో నింతటి కోపము దాగియున్నదని నే నెన్నడు నెఱుగను. నా మీద నీకున్న సహజమైన ప్రేమ యేమైనది? వజ్ర మెప్పుడైన తన శత్రులమీద పడును గాని తన వారిమీద పడునా? నేను నీ వరమునకు తగినదానను. శాపమున కెట్లు తగుదును? గోవిందా! నే నిప్పుడే నీ ముందే నీవు చూచుచుండగానే ప్రాణాలు తీసికొందును. నీవు లేనిచో నా యెడదలో పెను వేడిమంటలు రగుల్కొనును గదా? విభూ! ఈ నీ ఘోరశాపము దప్పించుకొని నీ సుఖకరమగు సన్నిధానము నేనాడు చేరగలనో దయచేసి తెలుపుము. హరి యిట్లనెను : భూలోకమున నీకు నా వంటి కుమారుడు గల్గినపుడు నీవు మరల నన్ను బొంది సుఃంపగలవు అని లక్ష్మి ననుగ్రహించెను. ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు ఔర్వుని జన్మ వృత్తాంతమను సప్తదశాధ్యాయము.