Brahmapuranamu    Chapters   

ద్వాదశోధ్యాయః

సోమోత్పత్తి వర్ణనమ్‌

లోమ హర్షణ ఉవాచ -

ఉత్పన్నాః పితృకన్యాయాం విరజాయాం మహౌజసః | సహుషస్య తు దాయాదాః ష డింద్రోపమతేజసః || 1

యతి ర్యయాతిః సంయాతి రాయాతిర్యాతిరేవచ | సుయాతిః షష్ఠస్తేషాం వై యయాతిః పార్థివోభవత్‌ || 2

కకుత్థ్సకన్యాం గాం నామ లేభే పరమధార్మికః | యతిస్తు మోక్ష మాస్థాయ బ్రహ్మభూతోభవ న్మునిః || 3

నూతుడిట్లనియె-పితృకన్యయగు విరజయందు మహాతపస్వియగు సహుషుని. కింద్రతల్యులైన యార్వురు కుమారులుదయించిరి. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, యాతి, నుమాతి అనువారు. అందు యయాతి రాజయ్యెను. అప్పరమ ధార్మికుడు కకుత్ద్స కన్యను గోవు యనునామెను వివాహమాడెను. యతి మునియై మోక్షమార్గమందుండి బ్రహ్మీభావమందెను. (1-3)

తేషాం యయాతిః పంచానాం విజిత్య వసుధా మిమామ్‌ | దేవయానీ ముశనసః సుతాం భార్యా మవాప సః || 4

శర్మిష్ఠా మాసురీం చైవ తనయాం వృషపర్వణః | యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత || 5

ద్రుహ్యం చానుంచ పురుం చ శర్మిష్ఠావార్షపర్వణీ | తసై#్మ శక్రో దదౌ ప్రీతో రథం పరమభాస్వరమ్‌ || 6

అంగదం కాంచనం దివ్యం దివ్యైః పరమవాజిభిః | యుక్తం మనోజవైః శుభ్రై ర్యేన కార్యం సముద్వహన్‌ || 7

యయాతిసోదరులైదుగురరాజ్యముం గెల్చుకొని ఉశనసుని (శుక్రుని) తనయను దేవయానిని భార్యగ గైకొనెను. మఱియు వృషపర్వుడను నసురుని కుమార్తె శర్మిష్ఠంగూడ పత్నిగ గైకొనెను. దేవయాని యదువును తుర్వసుని గనెను. శర్మిష్ఠ ద్రుహ్యుని అనువును-పురపును గాంచెను. దేవేంద్రు డాతనికి (యయాతికి) ప్రీతుడై, దివ్యమైన, భుజకీర్తిని దివ్యములు మనోజవము లైన తెల్లని యశ్వములc బూన్చిన స్వర్ణమయమైన రథమునొసంగెను.

న తేన రథముఖ్యేన షడ్రాత్రే ణాజయ న్మహీమ్‌ | యయాతి ర్యుధి దుర్ధర్ష స్తథా దేవా న్స దానవాన్‌ || 8

సరథః కౌరవాణాం తు సర్వేషా మభవ త్తదా 7 సంవర్తమసునామ్నస్తు కౌరవా జ్జనమేజయాత్‌ || 9

కురోః పుత్రస్య రాజేంద్రజ్ఞః పారీక్షితస్యహ | జగామ సరధో నాశం శాపా ద్గర్గస్య ధీమతః || 10

ఆ రథముతో విజయయాత్ర సేసి యుద్ధమునం దజేయుడై యయాతి ఆరుదినములలో మహీమండలమెల్ల జయించెను దేవదానవుల నిగ్రహించెను. సంవర్తవసు నామకమైన అరథము కౌరవులదాయెను. కురువంశీయుడును. కురువంశీయుడును పరీక్షుతుని కుమారుడునునగు జనమేజయునినుండి గర్గశాపమున నారథ మంతరించెను.

గర్గస్య హి సుతం బాలం సరాజా జనమేజయః | కాలేన హింసయామాస బ్రహ్మహత్యా మవాప సః || 11

స లోహగంధో రాజర్షిః పరిధావ న్నితస్తతః | పౌరజానపదై స్త్యకో సలేభే శర్మ కర్హిచిత్‌ || 12

తతః స దుఃఖసంతప్తో నాలభ త్పంవిదం క్వచిత్‌ | విప్రేంద్రం శౌనకం రాజా శరణం ప్రత్యపద్యత || 13

యాజయామాస చ జ్ఞానీ శౌనకో జనమేజయమ్‌ | అశ్వమేధేన రాజానం పావనార్ధం ద్విచోత్తమాః || 14

సలోహగంధో వ్యనశ త్త స్యావ భృధమేత్య హ | నచదివ్యరధో రాజ్ఞో వశ శ్చేదిపతే స్తదా || 15

దత్తః శ##క్రేణ తుష్టేన లేభే తస్మా ద్బృహద్రధః | బృహధ్రథా త్క్రమేణౖవ గతో బార్షద్రధం నృపమ్‌ || 16

తతో హత్వా జరాసంధం భీమస్తం రధముత్తమమ్‌ | ప్రదదౌ వాసుదేవాయ పీత్యా కౌరవనందనః 17

బాలుడైన గర్గుని కుమారుని జనమేజయుడు కాలవశమున చంపి బ్రహ్మహత్యా పాపము నందెను. దానిచే లోహగంధియై (ఇనుప వాసన గొట్టు మేనుగలవాడై) యారాజర్షి యిందందు వెఱ్ఱిఫరుగులు పెట్టుచు పౌర జానపద పరిత్యక్తుడై దుఃఖ సంతప్తుడై శాంతినెచటను పొందడాయెను. ద్విజశ్రేష్ఠుడగు శౌనకుని శరణమందెను. జ్ఞానియైన శౌనకుడు పవిత్రతకై అతనిచే నశ్వమేధము జేయించెను. అపబృధస్నానము కాగాసే యతని దుర్వాసన పోయెను. అయ్యయాతి దివ్యరథము చేదిరాజునకు జిక్కగ నింద్రుడు తుష్టుడై దానిని కొనివచ్చి బృహద్రధున కిచ్చెను. బృహద్రధనుండి యదియాతని కొడుకునకు జరాసంధునికి దక్కెను. భీముడు వానిని చంపి యాయరదమును వాసుదేవున కర్పించెను.

సప్తద్వీషాం యయాతిస్తు జిత్వా పృధ్వీం ససాగరామ్‌ | విభజ్య పంచధా రాజ్యం పుత్రాణాం నాహుషస్తదా || 18

యయాతి ర్దిశి పూర్వస్యాం యదుం జ్యేష్ఠం న్యయోజయత్‌ | మధ్యే పూరుంచరాజాన మభ్యషించత్స నాహుషః || 19

దిశి దక్షిణ పూర్వపూర్వస్యాం తుర్వసుం మతి మాన్నృపః | తై రియం పృథివీ సర్వా సప్తద్వీసా సపత్తనా || 20

యథప్రదేశ మద్వాపి ధర్మేణ ప్రతిపాల్యతే | ప్రజా స్తేషాం పురష్తాత్తు వక్ష్యామి మునిసత్తమాః || 21

సహుషి నూనుడగు యయాతి నసాగరము సప్తద్వీపము నగు వసుంధరనెల్ల గెలిచి యైదుభాగములసేసి పుత్రుల కొసంగెను తూర్పుదిశను జ్యేష్టుడగు యదువును, నడుమ పూరుని నభిషేకించెను. అగ్నేయమున తుర్వసు నుంచెను. వారిచే నీవిశ్వంభర నేటికిని ధర్మముతో పరిపాలింపబడుచున్నది. బ్రాహ్మణులారా! అదేశముల గూర్చి ముందుచెప్పగలను.

ధను ర్న్యస్య పృషత్కాంశ్చ పంచభిః పురుషర్షభైః | జరావానభవద్రాజా భారమావేశ్యబంధుఘ || 22

విక్షిప్తశస్త్రః పృదివీం చచార పృధివీపతిః | ప్రీతిమానభవద్రాజా యయతిరపలాజితః || 23

ఏవం విభజ్య పృధివీం యయాతిర్యదుమబ్రవీత్‌ | జరాం మో ప్రతిగృష్ణీ ష్వ పుత్ర కృత్యాంతరేణవై || 24

తరుణ స్తవ రూపేన చరేయం పృధివీమిమామ్‌ | జరాం త్వయి సమాధాయు తం యదుః ప్రత్యువాచహ || 25

యయాతి తన ఐదుగురు కుమారులు దురంధరులు రాజ్యభారము వహించగా వార్ధకదశలో ధనుర్భాణసన్యాసము జేసి భూమియందు సంచరించుచు సంప్రీత మనస్కు డయ్యెను. ఇట్లు భూవిభాగముచేసి యాతడు తన కుమారుని యదుపుం జూచి నా ముసలితన మీపు గ్రహించి నీ ¸°వనము నాకిమ్ము నాముసలితనమును నీయందుంచి నీరూపములో యువకుడవై కార్యాంతరము వలన నీభూమిపై నంచరింతును. అయయాతితో యదువిట్లు బదులు పలికును.

యదురువాచ-

అనిర్దిష్టా మయా భిక్షా బ్రాహ్మణస్య ప్రతిశ్రుతా | అనపాకృత్య తాం రాజ న్న గ్రహీష్యామి తే జరామ్‌ || 26

జరాయాం బహవో దోషాః పానభోజనకారితాః | తస్మాజ్జతాం నతే రాజ న్గ్రహీతు మహ ముత్సాహే || 27

సంతి తే బహవః పుత్రా మత్తః ప్రియతరా నృప | ప్రతిగ్రహీతుం ధర్మజ్ఞ పుత్ర మన్యం వృంశీష్వవై || 28

న ఏవముక్తి యదునా రాజా కోపసమన్వితః | ఉవాచ వదతాం శ్రేష్టో యయాతి ర్గర్హయ స్సుతమ్‌ 29

యదునిట్లనియె - ఒక బ్రాహ్మణునికై నేనిత్తునని ప్రతిజ్ఞcజేసిన భిక్ష నింతదాక యీయలేదు. అది చెల్లింపక నీజరాభార-మెట్లు స్వీకరింపగలను? అదిగాక ముదిమియందన్నపాన నిమిత్తమయిన దోషములనేకములు గలవు. కావున నీ ముసలితనమ మేను గ్రహింప నుత్సహింపను. రాజా! నాకంటెను ప్రియతములైన పుత్రులు నీకనేకులు గలరు. ధర్మజ్ఞా! నీ జరాభారము గ్రహీంప మరొక్కని కోరుకొమ్ము. అనవిని వక్తలలో శ్రేష్ఠుండగు యయాతి కోపవశుడై తనయుని గర్హించుచు నిట్లనియె.

యయాతిరువాచ -

క ఆశ్రమ స్తవాన్యోస్తి కో వాథర్మొ విధీయతే | మా మనాదృత్య దుర్బుద్ధే యదహం తవదేశికః || 30

ఏవముక్త్వా యదుం విప్రాః శశా పైనం స మన్యుమాన్‌ | ఆరాజ్యా తే ప్రజా మూఢ భవిత్రీతి న సంశయః || 31

ద్రుహ్యంచ తుర్వసుం చైవా ప్యనుం చ ద్విజసత్తమాః | ఏవ మేవాబ్రవీ ద్రాజా ప్రత్యాఖ్యాతశ్చ తైరపి || 32

శశాప తా సతిక్రుద్ధో యయాతి రపరాజితః | యధావ త్కధితం సర్వం మయాస్య ద్విజసత్తమాః || 33

ఏవం శప్త్వా సుతాన్సర్వాం శ్చతురః పురుపూర్వజాన్‌ | తదేవ వచనం రాజా పూరు మప్యాహ భోద్విజాః || 34

తరుణస్తవ రూపేణ చరేయం పృథివీ మిమామ్‌ | జరాం త్వయి నమాధాయ త్వంపురో యది మన్యసే || 35

దుర్బుద్ధీ! నన్ను నిరాకరించిన, నీకు మరి యాశ్రమమేమి యున్నది? ధర్మమేమి యున్నదిరా! నేను నీకు దేశికుడను గద! నీనంతతికి రాజ్యముండదు సందేహము లేదని శపించెను. అట్లే కొడుకులందరినడిగెను. వారు నల్వురు కాదనినం త నిట్లేశపించెను ఇదప వానిం బూరుని గూర్చి యదేమాట చెప్పెను.

న జరాం ప్రతిజగ్రాహ పితుః పూరుః ప్రతాపవాన్‌ | యయాతిరపి రూపేణ పూరోఃపర్యచరన్మహీమ్‌ || 36

న మార్గమాణః కామానా మంతం నృపతిసత్తమః | విశ్వాచ్యా సహీతో రేమో వనే చైత్రరధే ప్రభుః || 37

యదా చ తృప్తః కామేషు భోగేషు చ నరాధిపః | తదా పూరోః నకాశాద్వై స్వాం జరాం ప్రత్యపద్యత || 38

ఆ పూరుడు తండ్రి ముదిమిని స్వీకరించి తండ్రికి దన¸°వన మొసంగెను. దాన యయాతి భూమియందు తిరుగుచు, కామముల యంతయును వెనకుచు విశ్వాచితో గూడి చైత్రరధోద్యానమందు స్వేచ్చావిహారము లొనరించుచు పెక్కు కాలము క్రీడించెను. తృప్తుడైన తరువాత వచ్చి పూరునకాతని ¸°వన మిచ్చివేసి తనముదిమిం దాను గ్రహించెను.

యత్రగాధా మునిశ్రేష్ఠా గీతాః కిల యయాతినా | యాభిః ప్రత్యాహరే త్కామాన్సర్వశోంగాని కూర్మవత్‌ || 39

న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి | హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే || 40

యత్పృధివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః | నాలమేకస్య తత్సర్వ మితి కృత్వా న ముహ్యతి || 41

యదా భావం న కురుతే సర్వభూతేషు పాపకమ్‌ | కర్మణా మనసా వాచా బ్రహ్మసంపద్యతే తదా || 42

యదా తేభ్యో న బిభేతి యదా చాస్మా న్న బిభ్యతి | యదా నేచ్చతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా || 43

యా దుస్త్యజా దుర్మతిభి ర్యా న జీర్యతి జీర్యతః | యోసౌ ప్రాణాంతకో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖమ్‌ || 44

జీర్యంతి జీర్యతః కేశా దంతా జీర్యంతి జీర్యతః | ధనాశా జీవితాశా చ జీర్యతో పి న జీర్యతి || 45

యచ్య కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్‌ | తృష్ణాక్షయసుఖ సై#్యతే కలాం నార్హంతి షోడశీం || 46

మునిశ్రేష్టులారా! ఆ సమయమున యయాతిచే గానము చేయబడిన గాధ (అనుభవము)ల విన్నవాడు, తాబేలు తన అవయవములను లోపలికి ముడుచుకొనిన విధముగ తనకు కలిగిన కామము (కోరిక) లను సంకోచింపచేసి కొనును. ఒకప్పుడును కోరికల యనుభవముచే కామముతీరదు. పైగా హవిస్సుచే అగ్ని పెంపొందినట్లు పెంపొందును. భూమియందు గల ధాన్యసంపడ, బంగారము, పశువులు, స్త్రిలు ఇవన్నియు నొక్కనికి గూడ తృప్తి నీయ జాలవని తెలిసినవాడు మోహపడడు. ఎపుడు సర్వభూతములపై త్రికరణము (మనస్సు, వాక్కు, శరీరము) లచే పాపాలోచన చేయడో; అపుడా జీవుడు బ్రహ్మయే యగును. ఎప్పుడెవ్వడెవ్వరివల్లగాని జడియడో, తనవలన నెవ్వరు గాని జడియకుందురో, ఎప్పుడెవవ్వడేదియు కావలయునని గాని యక్కర లేదనిగాని యనడొ యపుడాతడు బ్రహ్మ భావమందును, దుర్మతులకేది వదిలించుకొనఠానిదో, యేది నరునికి ముదిమి కదిపిన కొలది తాను ముదిమిcగొనదో, ఏది ప్రాణాంతక మయిన రోగమో ఆ తృష్ణ (ఆశ) అనుదానిని వదిలించుకొన్న వానికే సుఖము. జరితుడైన కొలది కేశములు జర్జిరితములగును. జుట్టు నెఱియును దంతములు జరితములగును కాని ధనాశ, జీవితాళమాత్రము జరితములు గావు. లోకమున కామసుఖముగాని దివ్యమయినది అనగా స్వర్గాది తేజోమయ లోకములలోగల్గు సుఖముగాని తృష్ణాక్షయమువలన గలుగు సుఖముయొక్క పదునారవకళ##కేని సరికాదు.

ఏవముక్త్వా స రాజర్షిః సదారః ప్రావిశ ద్వనమ్‌ | కాలేని మహతా చాయం చచార విపులం తపః || 47

భృగుతుంగే గతిం ప్రాప తవసోంతే మహాయశాః | అనశ్నన్‌దేహ ముత్సృజ్య సదారః స్వర్గ మాప్తవాన్‌ || 48

తస్య వంశే మునిశ్రేష్ఠాః పంచరాజర్షి సత్తమాః | యైర్వ్యాప్తా పృధివీ సర్వా సూర్యస్యేవ గబస్తిభిః || 49

యదోస్తు వంశం వక్ష్యామి శృణుధ్వం రాజసత్కృతమ్‌ | యత్రనారాయణో జజ్ఞే హరి ర్వృష్ణి కులోద్వహః || 50

సుస్థః ప్రజావా నాయుష్మా న్కీ ర్తిమాంశ్చ భ##వేన్నరః | యయాతి చరితం నిత్యమిదం శృణ్వ స్ధ్విజో త్తమాః || 51

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే సోమవంశే యయాతిచరితం ద్వాదశోధ్యాయః

అనిచెప్పి రాజర్షియైన యయాతి భార్యతో నడవి బ్రవేశించెను. (వానప్రస్థాశ్రమము స్వీకరించెను.) చాలకాలము విపుల తపమానరించి అంతమందు భృగుతుంగ (పర్వతశిఖర) మందుండి నిరాహారియై మేను విడచి పత్నితో స్వర్గమునకేగెను. సూర్యుడు కిరణములచే నావరించినట్లాతని వంశీయులు రాజర్షులయిదుగు రభిలభూమండలమావరించిరి. పృష్టికులవర్ధనుడై నారాయణుడు శ్రీకృష్ణుడుగ నవతరించిన, రాజన్యులచే పొగడ్తగాంచిన యదు వంశమున కీర్తించెదను. వినుడు! బ్రాహ్మణోత్తములారా! ఈ యయాతి చరితము నిత్యము వినునతడు స్వస్థుడు, సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు కాగలడు.

శ్రీ బ్రహ్మ మహాపురాణమందు సోమవంశమున యయాతి చరిత నిరూపణమను పండ్రెండవ యధ్యాయము సమాప్తము.

Brahmapuranamu    Chapters