Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టాదశో%ధ్యాయః సూతః: శ్రుత్వాత మాగతం రాజా మంత్రిభిః సహితః శుచిః|పురః పురోహితంకృత్వా గురుపుత్రం సమభ్యయాత్.
1 కృత్వార్హణాం నృపః సమ్య గ్దత్తాసన మనుత్తమమ్ | పప్రచ్ఛ కుశలం గాం చ వినివేద్య పయస్వినీమ్.
2 స చ తాం నృపపూజాం వై ప్రత్యగృహ్ణా ద్యథావిధి | పప్రచ్ఛ కుశలం రాజ్ఞే స్వం నివేద్య నిరామయమ్. 3 స కృత్వా కుశలప్రశ్న ముపవిష్టః సుఖాసనే | వుకం వ్యాససుతం శాంతం పర్యపృచ్ఛత పార్థివః.
4 కిం నిమిత్తం మహాభాగ నిఃస్పృహస్య చ మాం ప్రతి | జాతం హ్యాగమనం బ్రూహి కార్యం త న్మునిసత్తమ.
5 శుకః : వ్యాసే నోక్తో మహారజ కురు వారపరిగ్రహమ్ | సర్వేషా మాశ్రమాణాం చ గృహస్థాశ్రమ ఉత్తమః.
6 మయా నాంగీకృతం వాక్యం మత్వా బంధం గురోరపి | న బంధో%స్తీతి తేనోక్తో నాహం తత్కృతవా న్పునః.
7 ఇతి సందిగ్ధమనసం మత్వా మాం మునిసత్తమః | ఉవాచ వచనం తథ్యం మిథిలాం గచ్ఛ మా శుచః.
8 యాజ్యో%స్తి జనక స్తత్ర జీవన్ముక్తో నరాధిపః | విదేహో లోకవిదితః పాతి రాజ్య మకంటకమ్.
9 కుర్వ న్రాజ్యం తథా రాజా మాయాపాశై ర్నబధ్యతే | త్వంబి భేషి కథం పుత్ర వనవృత్తిః పరంతప.
10 వశ్య తం నృపశార్దూలం త్యజ మోహం మనోగతమ్ | కురు దారా న్మహాభాగ పృచ్ఛవా భూపతిం చ తమ్. 11 సందేహం తే మనోజాతం కథయిష్యతి పార్థివః | తుచ్ఛ్రుత్వా వచనం తస్య మామేహి తరసా సుత. 12 సంప్రాప్తో%హం మహారాజ త్వత్పు రే చ తదాజ్ఞయా | మోక్షకామో%స్మి రాజేంద్ర బ్రూహి కృత్యం మమానఘ. 13 తప స్తీర్థవ్రతేజ్యాశ్చ స్వాధ్యాయ స్తీర్థసేవనమ్ | జ్ఞానం వా వద రాజేంద్ర మోక్షంప్రతి చ కారణమ్. 14 పదునెనిమిదవ అధ్యాయము జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట సూతుడిట్లనియెను : జనకుడు తన గురుపుత్రుడగు శ్రీ శుకుని రాకవిని శుచియై మంత్రిపురోహితులనుగూడి యతని సన్నిధికేగి అతనికి తగిన యాసనమొసంగి పూజించి పాడియావునొసంగి క్షేమసమాచారము లడిగెను. శుకుడును రాజపూలందుకొని తన కుశలము తెలిపి రాజు క్షేమముగూర్చి యడిగెను. కుశలప్రశ్నల పిదప తన యాసనమున స్మాత్మశాంతితో సుఖముగ గూరుచున్న శుకునికాంచి, మనిసత్తమా! నిష్కాముడగు నీవు మా యింటికేమి కోరి వచ్చితివో సెలవిమ్ము అని రాజు ప్రశ్నించెను. శ్రీ శుకుడిట్లనియెను : మహీశా! ఆశ్రమములలో గృహస్థాశ్రమ ముత్తమోత్తమమైనది. కనుక భార్యను పరిగ్రహింపుమని మా తండ్రి యనెను. ఇది బంధము గల్గించదని నా తండ్రి యెంతయో చెప్పెను. కాని యతడే సంసార బద్ధుడగుటవలన నేను నా తండ్రి మాట పెడచెవిని బెట్టితిని. ఈ విషయమున నా మనస్సు సందిగ్ధముగ నుండెను. ''నీవు విచారింపకుము. మిథిలకు రాజగు జనకుడు విదేహుడు; జీవన్ముక్తుడు; యాజి; లోకవిదితుడు; నిష్కంటకముగ రాజ్యమేలువాడు. ఐనను మాయాపాశబద్ధుడుగాడు. శాంతిగ నేలుబడి సాగించుచున్నాడు. ఆ జనకుని సందర్శించినచో నీ మానసమందలి ప్రమోహము విడివడును. భార్యను జేపట్టుము. నా మాట నమ్ముము. కాదేని రాజునడిగి తెలిసికొనుము. ఆ రాజు నీలోని సందియమును సరిగ దీర్చగలడు. అతని మాటలు విని తిరిగి నన్ను జేరుము.'' అని పలికెను. నా తండ్రి యాజ్ఞచే నీ పురమునకు వచ్చితిని. నేను మోక్షార్థిని. కర్తవ్య ముపదేశింపుము. ముక్తికి కారణము తపమా? వ్రతమా? యాగమా? స్వాధ్యాయమా? తీర్థసంసేవనమా? ఇందు తగినదేవో తెలుపుము. జనకః: శృణు విప్రేణ కర్తవ్యం మోక్షమార్గశ్రితేన యత్ | ఉపనీతో వసే దాదౌ వేదాభ్యాసాయవై గురౌ 15 అధీత్య వేదవేదాంతా న్దత్వా చ గురుదక్షిణామ్ | సమావృత్త స్తు గార్హస్థ్యే సదారో నివసే న్మునిః. 16 నాన్యవృత్తిస్తు సంతోషీ నిరాశీర్ గతకల్మషః | అగ్ని హోత్రాది కర్మాణి కుర్వాణః సత్యవా క్ఛుతిః. 17 పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ | తాపసా షడ్రిపూన్ జిత్వా భార్యాం పుత్రే నివేశ్య చ. 18 సర్వానగ్నీ న్యథా న్యాయ మాత్మ న్యారోప్య దర్మవిత్ | వసే త్తుర్యాశ్రమే శాంతః శుద్దే వైరాగ్యసంభ##వే. 19 విరక్తి స్యాధికారో%స్తి సంన్యాసే నాన్యథా క్వచత్ | వేదవాక్య మిదం తథ్యం నాన్యథేతి మతి ర్మమ. 20 శుకాష్ట చత్వారింశ##ద్వై సంస్కారా వేదబోధితాః | చత్వారింశ ద్గృహస్థస్య ప్రోక్తా స్తత్ర మహాత్మభిః. 21 అష్టౌ చ ముక్తికామస్య ప్రోక్తా స్తత్ర మహాత్మభిః | ఆశ్రమా దాశ్రమం గచ్ఛే దితి శిష్టానుశాసనమ్. 22 జనకుడిట్లనియె: విప్రవర్యా! వినుము. మోక్షకామి ముమ్మెదట నుపనీతుడై వేదాభ్యాసమునకు గురుకులమందు వసింపవలయును. అచట సాంగవేదములను వేదాంతములను చదివి గురుదక్షిణ లొసంగి సమావర్తన సంస్కారమంది కామియై భార్యనుగూడి ప్రజాతంతువును కొనసాగించవలయును. అపుడిత డితర వృత్తులొనర్పరాదు. అగ్ని కార్యములు జరుపవలయును. మితహిత సత్యభాషిగావలయును. నిరాశుడు సదాశుచి సత్యసంతోషి కావలయును. ఆరోగ్యవంతులైన పుత్త్రపౌత్రులతో నభివర్ధిల్లవలయును. కళకళలాడుచుండవలయును. ఆ పిదప తన సర్వస్వమును భార్యను పుత్త్రులకప్పగించి లోని శత్రువుల నరికట్టి తపమునకు వానప్రస్థము స్వీకరించవలయును. పిమ్మట నగ్నుల నాత్మారోహణము చేసికొని పరమవైరాగ్యజ్యోతితో నుద్దీపించుచు శాంతితో సంయమియై తురీయాశ్రమము స్వీకరించవలయును. విరక్తునకు మాత్రమే సంన్యాసాశ్రమమున కధికారము గలదు. ఇది నిజమైన వేదవాక్కు. దీనికిక తిరుగులేదని నా యభిప్రాయము. నరునకు జన్మ మొదలుకొని నలువదియెనిమిది సంస్కారములు గలవని పెద్దలందరు. అందు గృహస్థాశ్రమము నలువదవదని తెలిసినవారందరు. ముముక్షువునకు శమము మున్నగు నెనిమిది సంస్కారములు చెప్పబడినవి. ఒక యాశ్రమమునుండి క్రమముగ రెండవ యాశ్రమము జేరవలయునని శిష్టులందురు. శ్రీశుకః: ఉత్పన్నే హృది వైరాగ్యే జ్ఞానవిజ్ఞానసంభ##వే | అవశ్య మేవవస్తవ్య మాశ్రమేషు వనేషు వా. 23 జనకః : ఇంద్రియాణి బలిష్ఠాని నని యుక్తాని మానద | అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్తాననేకశః. 24 భోజనేచ్ఛాం సుఖేచ్ఛాం చ శ##య్యేచ్ఛా మాత్మజస్య చ | యతీ భూత్వా కథం కుర్యా ద్వికారే సముపస్థితే. 25 దుర్జరం వాసనాజాలం న శాంతి ముపయాంతి వై | అత స్త చ్ఛమనార్థాయ క్రమేణ చ పరిత్యజేత్. 26 ఊర్థ్వం సుప్తః పత త్యేవ న శయానః పత త్యధః | పరివ్రజ్య పరిభ్రష్టో న మార్గం లభ##తే పునః. 27 యథా పిపీలికా మూలా చ్ఛాఖాయా మధిరోహతి | శ##నైఃశ##నైః ఫలం యాతి సుఖేన పదగామినీ. 28 విహహాంగ స్తరసా యాతి విఘ్నశంకా ముదస్యవై | శ్రాంతో భవతి విశ్రమ్య సుఖం యాతి పిపీలికా. 29 మనస్తు ప్రబలం కామ మజేయ సుకృతాత్మభిః | అతః క్రమేణ జేతవ్య మాశ్రమా నక్రమేణచ. 30 గ్రహస్థావ్రమ సంస్థో %పి శాంతః సుమతి రాత్మవాన్ | న చ హృష్యే న్న చ తపేల్లాభాలాభే నమో భవత్. 31 విహితం కర్మ కుర్వాణ స్త్యజం శ్చింతాన్వితం చ యత్ | ఆత్మలాబేన సంతుష్టో ముచ్యతే నాత్ర సంశయః. 32 పశ్యాహం రాజ్యసంస్థో%పి జీవన్ముక్తో యథా%నఘ| విచరామి యథాకామం న మే కించిత్ప్రజాయతే. 33 భుంజానో వివిధా న్భోగా న్కుర్వాన్కార్యా ణ్యనేకశః | భవిష్యామి యథా%హం త్వంతథా ముక్తో భవానఘు 34 కథ్యతే ఖలు య ద్దఋశ్యమదృవ్యం బధ్యతే కుతః | దృశ్యాని పంచభూతాని గుణా స్తేషాం తథా పునః. 35 శుకుడిట్లనియె: జ్ఞానవిజ్ఞానకారణమైన నిర్మలవైరాగ్యతేజము హృదయపూర్వకముగ నిండివెల్గుచుండగ నరుడాశ్రమము లన్నియును క్రమముగ నడుపవలయునా? కాకొకేసారి వనములందుండవచ్చునా? జనకుడిట్లనియెను : ''ఇంద్రియ వాసనలు మిక్కిలిగ బలవత్తరములైనవి. అవి దురంతములు. ఒక్క చందాన లొంగవు. అపక్వహృదయుని హృదయమున వికారములు రేకెత్తించుచుండును. ఒకవేళ సంన్యాసాశ్రమమున తుష్టికరభోజనము కమ్మనిసెజ్జ పుత్రోత్సాహము గావలయుననెడు కామము గల్గినచో నదెట్లు తీరును? పూర్వవాసనల జాలము లతి బలవత్తరములైనవి. అవి శాంతిగనుండనీయవు. ఆ వాసనలడగుటకు సక్రమముగ నభ్యాసము సాధన చేయవలయును. పైని నిద్రించువాడు క్రింద పడవచ్చునుగాని క్రిందివాడు పతితుడుగాడు! సంన్యాసియై పతితుడైనవానికి మఱి సద్గతులు లేవు. చీమ వేరునుండి కొమ్మల దనుక మెలమెల్లగ ప్రాకి సుఖముగ ఫలమనుభవించగలదు. పక్షి తన పోవుదారి కడ్డుండదని యెగిరియెగిరి తుదకు శ్రమజెందును. కాని, చీమ నడుమ విశ్రమించుచు సుఖముగ ముందునకు సాగును. మనస్సు బలవత్తరమైనది. విషయలంపటులగు మూర్ఖులకు అది వశము గాదు. వారు కామము నణపజాలరు. కావున ఆశ్రమముల క్రమముననే సంస్కృతిని గెలువవలయును. గృహస్థాశ్రమము నందున్నవాడు సైతమాత్మవంతుడు శాంతుడు సుమతి ధీరుడు హర్షశోకరహితుడు సర్వసముడునై యుండవచ్చును. అతడు దిగులొందక విహితకార్యము లాచరించుచు సర్వారంభములు వదలి కల్గినదానికి సంతసించుచు నిత్యతృప్తుడై యుండవచ్చును. అట్లున్నవాడు నిశ్చయముగ ముక్తుడుగాగలడు. నేను రాజ్యమేలుచున్నను జీవన్ముక్తుడనై యే చింతయు చీకును లేకుందును. నన్నేదియు నంటజాలదు. నేను నానా భోగము లనుభవించుచునే పలు కార్యము లొనర్చుచునేయుందును. నీవు నటులే దేనియందును భ్రాంతి పెట్టుకొనకుండుము. దృశ్యవస్తువులన్నియును మాయచే బంధింపబడును. కాన యదృశ్య వస్తువెన్నడును బంధింపబడదు. పంచభూతములును వాని గుణములును దృశ్యములే. ఆత్మగమ్యో%నుమానేన ప్రత్యక్షో న కదా చ న | కథం బధ్యతే బ్రహ్మ నిర్వకారో నిరంజనః. 36 మనస్తు సుఖదుఃఖానాం మహతాం కారణం ద్విజ| జాతేతు నిర్మలేహ్యస్మి స్పర్వం భవతి నిర్మలమ్. 37 భ్రమ న్సర్వేషు తీర్థేషు స్నాత్వాపునఃపునః | నిర్మలం న మనో యావ త్తావ త్సర్వం నిరర్తకమ్. 38 న దేహో న చ జీవాత్మా నేంద్రియాణి పరంతప | మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః. 39 శుద్ధో ముక్తః స దైవాత్మా నవై బధ్యేత కర్హిచిత్ | బంధమోక్షౌ మనః సంస్థౌ తస్మిన్ శాంతే ప్రశామ్మతి. 40 శత్రు ర్మిత్ర ముదాసీనో భేదాః సర్వే మనోగతాః | ఏకాత్మత్వే కథం భేదః సంభ##వే ద్ద్వైతదర్శనమ్. 41 జీవో బ్రహ్మ సదై వాహం నాత్ర కార్య వాచారణా | భేదబుద్ధిస్తు సంసారే వర్తమానా ప్రవర్తతే. 42 అవిద్యేయం మహాభాగ విద్యా చ త న్నివర్తనమ్ | విద్యావిద్యేహి విజ్జేయే సర్వదైవ విచక్షణౖః. 43 వినా%%తపంహి చ్ఛాయాయా జ్ఞాయతే చ కథం సుఖమ్ | అవిద్యయా వినా తద్వ త్కథం విద్యాం చ వేత్తివై. 44 గుణాగుణషు వర్తంతే భూతాని చ తథైవ చ | ఇంద్రియా ణీంద్రియార్థేషు కో దోష స్తత్ర చాత్మనః. 45 మర్యాదా సర్వరక్షార్థం కృతా వేదేషు సర్వశః | అన్యథా దర్మనాశః స్యా త్సౌగతానా వివానఘ. 46 ధర్మనాశే వినష్టః స్యా ద్వర్ణాచారో%తివర్తితః | అతో వేదప్రదిష్టేన మార్గణ గచ్ఛతాం శుభమ్. 47 శ్రీ శుకః : సందేహో వర్తతే రాజ న్న నివర్తతి మే క్వచిత్ | భవతా కథితం తత్తచ్ఛణ్వతో మే నరాధిప. 48 ఆత్మను జేరలేక మనోవాక్కులు వెనుదిరిగివచ్చును. ఆ యాత్మ ననుమానప్రమాణమున గ్రహించవలయును కాని, యది ప్రత్యక్షముగ గనబడదు. నిర్వికారము నిరంజనము బ్రహ్మమునగు ఆత్మ యెట్లు బాధింపబడగలదు? ఈ మనస్సే సుఖదుఃఖముల కన్నిటికి పాదు. ఇది నిర్మలముగనున్న నంతయు చల్లబడదు. ఎల్ల పుణ్యతీర్థములు దిరుగుచు వానిలో మునుగుచున్నను మానసము పవిత్రము గానంతవఱకన్నియు వ్యర్థములే. మనుజుని బందమోక్షములకు చిత్తమే మూలము. అంతేకాని, దేహము జీవాత్మ ఇంద్రియాలివేవియును గావు. ఆత్మ నిత్యము; శుద్ధము; బుద్ధము; ముక్తము. ఇది దేనిచేతను బంధింపడదు. చిత్తమునందలి బంధమోక్షములడగినచో సకలమును శాంతించును. వీడు మిత్రుడు వీడు శత్రుడు వీ డుదాసీనుడు అను భేదములన్నియు మనోగతములే. ఏకాత్మత్వమునందు భేదమన్నదే లేదు. ద్వైతమందే భేదములన్నియు దోచును. అద్వైతమున నంతయు నొకటే. ఈ జీవరూపుడనగు నేను బ్రహ్మమే. ఇందులకు తిరుగన్నది లేనేలేదు. ఈ మాయసంసారమందు తగుల్కొనుటవలననే క్షుద్రబుద్ధులు పుట్టుచుండును. మహాభాగా! ఇదంతయు నవిద్యయే సుమా! విద్యాజ్యోతిలో మాయలు వ్రీలిపోవును. విచక్షణమతులు విద్యావిద్యల భేదమును చక్కగ గుర్తించవలయును. వేడిమిలేనిచో నీడవలని సౌఖ్యమెట్లు దెలియును? అవిద్యయేలేనిచో విద్యాసౌఖ్యమెట్లు బోధపడును? గుణములు గుణములందు భూతములు భూతములందు ఇంద్రియము లింద్రియములందు ప్రవర్తిల్లుచుండగ నికనాత్మకు దోషమెక్కడిది? ఎల్ల వేదములందును దర్మ సంస్థాననార్థమై లోక కల్యాణమునకు నియమములు గలవు. అవియే లేనిచో బౌద్ధమతమునవలె ధర్మచ్యుతి గలిగి తీరని నష్టము వాటిల్లును. దానిచే వర్ణాచారములు చెడిపోవును. కావున వేదోక్తమార్గ మనుసరించుట శుభప్రదము. శుకుడిట్లనియె: ఓ మనుజేశ్వరా! మీరింతగ ప్రబోధించినను నాసందియమేలొకో తీరుటలేదు. వేదధర్మేషు హింసా స్యా దధర్మ బహుళాహి సా | కథం ముక్తిప్రదో ధర్మో వేదోక్తో బత భూపతే. 49 ప్రత్యక్షేత త్వనాచారః సోమపానం నరాధిప | పశూనాం హింసనం తద్వద్భక్షణం చామిషస్యచ. 50 సౌత్రామణౌ తథా ప్రోక్తః ప్రత్యేక్షేణ సురాగ్రహః | ద్యూత క్రీడా తథా ప్రోక్తా వ్రతాని వివిధాని చ. 51 శ్రూయతేస్మ పురా హ్యాసీ చ్ఛశబిందుః నృపోత్తమః | యజ్వా ధర్మపరో నిత్యం వధ్యానః సత్యసాగరః. 52 గోప్తా చ దర్మసేతూనాం శాస్తా చోత్పథగామినామ్ | యజ్ఞాశ్చ విహితా స్తేన బహవో భూరిదక్షిణాః. 53 చర్మణాం పర్వతో జాతో వింధ్యాచల సమః పునః | మేఘాంబు ప్లావనా జ్జాతా నదీ చర్మణ్వతీ శుభా. 54 సో%పి రాజా దివం యాతఃకర్తి రస్యాచలాభువి | ఏవం ధర్మేషు వేదేషు న మే బుద్ధిః ప్రవర్తతే. 55 స్త్రీసందేన సదా భోగే సుఖ మాప్నోతి మనవః | అలాభే దుఃఖ మత్యంతం జీవన్ముక్తః కథంభ##వేత్. 56 జనక ఉవాచ: హింసా యజ్ఞేషు ప్రత్యక్షా సా% హింసా పరికీర్తితా | ఉపాధియోగంతో హింసా నాన్యథేతి వినిర్ణయః. 57 యథార్ద్రేందనసంయోగా దగ్నౌ దూమః ప్రవర్తతే | తద్వియోగా త్తథా తస్మి న్నిర్ధూమత్వం విభాతివై. 58 అహింసాం చ తథా విద్ధి వేదోక్తాం మునిసత్తమ | రాగిణాం సా%పి హింసైవ నిఃస్పృహాణాం న సా మతా. 59 అరాగేణ చ యత్కర్మ తథా% హంకార వర్జితమ్ | ఆకృతం వేదవిద్వాంసః ప్రవదంతి మనీషిణిః. 60 గృహస్తానాం తు హింసైవ యా యజ్ఞే ద్విజసత్తమ | అరాగేణ చ యత్కర్మ తథా%హాంకార వర్ణితమ్. 61 సా%హింసైవ మహాభాగ మముక్షూణాం జితాత్మనామ్. 62 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే%ష్టాదశో%ధ్యాయః. వేదధర్మములందు హింసయుండును. అది యధర్మము. అట్టి వేదధర్మమెట్లు ముక్తినీయగలదు? సోమపానము పశువధ మాంసభక్షణము ప్రత్యక్షముగ ననాచారములు. సౌత్రామణియజ్ఞమున సురాపానము జూదము నానావ్రతములు ఇవన్నియును చెప్పబడినవి. తొల్లి శశబిందువను రాజు గలడు. అతడు ధర్మిష్ఠుడు; వదాన్యుడు; సత్యవాది; యాజియని వింటిని. అతడు ధర్మసేతు సంరక్షకుడు పెడత్రోవలు బట్టువారిని గట్టిగ శాసించువాడు. భూరిదక్షిణ లొసంగి పెక్కు యాగము లొనరించినవాడు. అతని యాగపశువుల తోళ్లు వింధ్యాచలమట్లు గుట్టగ పెరిగినవి. వానిపై మొయిళ్ళు గురియుటచే నచటినుండి చర్మణ్వతీనది ప్రవహించినది. ఆ రాజు స్వర్గసీమకేగెను. అతని కీర్తి భూమిపై నిలిచినది. కాని యిటువంటి వేదధర్మములు నా మతి కెక్కవు. స్త్రీలతోడి కలయికవలన నరునకు క్షణిక సుఖము గల్గును. ఆ కొలది సుఖమునకే వాడు వెంపరలాడుచుండునతడు జీవన్ముక్తుడగు టెట్లు? జనకుడిట్లనియె: ''యాగమందు జరుగు హింస హింసయనబడదు. కామ రాగములతో జేసినచో నదే హింసయగును. నిప్పులో పచ్చి తడి కట్టెలు వేసినచో నిలువరాని పొగ వెలువడును. ఎండుకట్టెలు వేసినచో నవి గనగన మండును. వేదోక్తమగు హింస నహింసగ నెఱుంగుము. రాగులకదే హింసయగును. కాని విరాగులకు గాదు. అహంకార మమకారములు విడనాడి చేసిన పనిని వేదవిదులగు మనీషులు ఆకృతమందురు. రాగముతో కర్తృత్వ బుద్ధి గృహస్థులు చేయు హింస హింసయే అగును. రాగ గర్వములు కర్మసంగము వదలి విజితాత్ములును ముముక్షులునగువారు చేసిన కర్మము హింసయగును. అకర్మయగును.'' ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందలి యష్టాదశాధ్యాయము