Sri Devi Bagavatham-2    Chapters   

అథద్వాచత్వారింశోధ్యాయః

నారద ఉవాచః : హరే రుత్కీర్తనం భద్రం శ్రుతంతత్‌ జ్ఞానముత్తమమ్‌ | ఈప్సితం లక్ష్మ్యుపా ఖ్యానం ధ్యానం స్తోత్రం వదప్రభో. 1

నారాయణ ఉవాచ : స్నాత్వా తీర్ధే పురాశక్రో ధృత్వాధౌతే చ వాససీ |

ఘటం సంస్ధాప్య క్షీరోదే షడ్డేవా న్ప ర్యపూజయత్‌. 2

గణశం చ దినేశం వహ్నింవిష్ణు శివం శివామ్‌ | ఏతాన్‌ భక్త్యా సమభ్యర్చ్య పుష్పగంధాదిభిస్తదా. 3

ఆవాహ్య చ మహాలక్ష్మీం పరమైశ్వర్యరూపిణీమ్‌ | పూజాం చకార దేవేశో బ్రహ్మణా చ పురోధసా. 4

పురః స్ధితేషు మునిషు బ్రాహ్మణశు గురౌహరౌ | దేవా దిషు సుదేశే చ జ్ఞానానందే శివే మునే. 5

పారిజాతస్య పుష్పం చ గృహీత్వా చందనో క్షితమ్‌ | ధ్యాత్వా దేవీం మహాలక్ష్మీం పూజయామాస నారద. 6

ధ్యానం చ సామవేదోక్తం యద్దత్తం బ్రహ్మణ పురా | హరిణాతేన ధ్యానేన తన్నిభోధ పదామి తే. 7

సహస్ర దళ పద్మస్ధ కర్ణికా వాసినీం పరామ్‌ | శరత్పార్వణ కోటీం దుప్రభాముష్టికరాం పరామ్‌. 8

స్వతేజసా ప్రజ్వలంతీం సుఖదృశ్యాం మనోహరామ్‌ | ప్రతప్తకాంచననిభశోభాం మూర్తిమతీం సతీమ్‌. 9

రత్న భూషణ భూషా ఢ్యాం శోభితాం పీతవాససా | ఈష ద్ధాస్యాం ప్రసన్నాస్యాం శశ్వత్సుస్ధిర¸°వనామ్‌. 10

సర్వసంపత్ర్ప దాత్రీం మహాలక్ష్మీం భ##జేశుభమ్‌ | ధ్యానేనానేన తాంధ్యాత్వా నానాగుణ సమన్వితామ్‌. 11

సంపూజ్యా బ్రహ్మవాక్యేన చోపచారాణీ షాడశ | దదౌ భక్త్యా విధనేన ప్రత్యేకం మంత్రపూర్వకమ్‌. 12

ప్రశస్తాని ప్రకృష్టాని వరాణి వివిధాని చ | అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా. 13

అసనం చ విచిత్రం చ మహాలక్ష్మీ ప్రగృహ్యతామ్‌ | శుద్ధం గంగోదకమిదం సర్వనందిత మీప్సితమ్‌. 14

పాపేధ్మ వహ్ని రూపంచ గృహ్యతాం కమలాలయే | పుష్పచందన దూర్వాది సంయుతంజా హ్నవీజలమ్‌. 15

నలువది రెండవ అధ్యాయము

లక్ష్మీ చరితము

నారదు డిట్లనియెను : శ్రీహరి గుణనామ సంకీర్తనము - ఉత్తమ - జ్ఞానము - లక్ష్మీ చరిత్రముల - గూర్చి చక్కగ వింటివి. ప్రభూ! ఇపుడు లక్ష్మి ధ్యానము - స్తోత్రము నాకు తెలుపుము. నారాయణు డిట్టు లనియెను : పూర్వము దేవేంద్రుడు పాలసంద్రములో స్నానముచేసి తెల్లని దుస్తులు దాల్చి కలశము స్థాపించి యార్గురు దేవతల నర్చించెను. ఇంద్రుడు భక్తిమీర గణపతిని సూర్యుని అగ్నిని శివను శివుని విష్ణుని గంధపుష్పాక్షతలతో నర్చించెను. పరమైశ్వర్యరూపిణియగు లక్ష్మీదేవి నావాహవముచేసి యింద్రుడు బ్రహ్మను పురోహితునిగ నియోగించి దేవిని పూజించెను. ఇంద్రుని ముందు మునులు - బ్రాహ్మణులు గురుడు హరి యాసినులై యుండిరి. జ్ఞానానందుడగు శివుడు దేవతలును తగినచోట్ల నుండిరి. నారదా! మంచిగందములో తడిసిన పారిజాత పుష్పముము తీసికొని మహాలక్ష్మి నీ క్రింది విధముగ ధ్యానించి యింద్రుడు పూజించెను. మహాలక్ష్మీ ధ్యానమును మునుపు విష్ణువు బ్రహ్మకు తెలిపెను. అది సామవేదమందు గలదు. దానిని నీకు తెల్పుదును వినుము. సహస్రదళకమలమందలి కర్ణికయను పీఠికనెవైన లక్ష్మీదేవిని శరత్కాల పూర్ణిమనాటి చంద్రకోటుల కాంతిని దెగడు మేని లావణ్యకాంతిగల దేవిని తన దివ్యతేజముతో మహోజ్జ్వలముగ వెలుగుచున్న ప్రియదర్శింనిని మనోహారిణిని సతీమతల్లిని జాళువా మెఱుగునకు ప్రతిరూపముగ ప్రకాశించు హిరణ్యవర్ణను రూపు దాల్చిన దివ్యమూర్తిని పట్టువస్త్రము దాల్చి రత్నభూషణములు మిఱుమిట్లు గొలుప మందహాసముతో సుప్రసన్నవదనముతో విరాజిల్లుచు తఱుగని పరువాల సంపదగల పూలమున్నిటి పట్టిని ఎల్లమేలు సంపదలు గురియు మహాలక్ష్మిని ధ్యానించుచున్నాను. ఇట్టి ధ్యాన శ్లోకములతో నానా సుగుణములుగల లక్ష్మి నింద్రుడు ధ్యానించెను. బ్రహ్మ చెప్పిన ప్రకార మింద్రుడు లక్ష్మిని షాడశోపచార పూజిలతో పూజించెను. ప్రతి వస్తువును మంత్రపూర్వకముగ దేవి కర్పించెను. విశ్వకర్మ దివ్యమైన యాసన మేర్పరచెను. అది మేలుజాతి నవరత్నములతో శ్రేష్ఠముగ సిద్ధముచేయబడినది. అట్టి విచ్చిత్రాసనమును లక్ష్మి గ్రహించుగాక! గంగోదకము పవిత్రమైనది విశ్వ పూజ్యము. విశ్వప్రియము. పాపపు కట్టెలకు నిప్పు వంటిది. ఓ కమలాలయా! అట్టి గంగాజలమును గ్రహింపుము. పూలు-చందనము-దర్బలతో గూడిన గంగాజలము శంఖమందు గలదు.

శంఖగర్బ స్థిరం స్వర్ఘ్యం గృహ్యతాం పద్మవాసిని | సుగంధి పుష్పతైలం చ సుగంధామలకీఫలమ్‌. 16

దేహసౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరేః ప్రియే | కార్పాసజం చ కృమిజం వసనం దేవి గృహ్యతామ్‌. 17

రత్న స్వర్ణ వికారం చ దేహభూషా వివర్ధనమ్‌ | శోభాయై శ్రీకరంరత్న భూషణం దేవిగృహ్యాతామ్‌. 18

సర్వసౌందర్యబీజం చ సద్యఃశోభాకరం పరమ్‌ | వృక్ష నిర్యాసరూపం చ గంధ ద్రవ్యాధి సంయుతమ్‌. 19

శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతామ్‌ | సుగంధి యుక్తం సుఖదం చంధనం దేవి గృహత్యామ్‌. 20

జగచ్ఛక్షుః స్వరూపం చ పవిత్రం తిమిరాపహమ్‌ | ప్రదీపం సుఖరూపం చ గృహ్యాతాం చ సురేశ్వరి. 21

నానోపహారరూపం చ నానారససమన్వితమ్‌ | అతిస్వాదుకరం చైవనైవేద్యం ప్రతిగృహ్యతామ్‌. 22

అన్నం బ్రహ్మ స్వరూపం చ ప్రాణరక్షణ కారణమ్‌ | తుష్టిదం పుష్టదం చైవ దేవ్యన్నం ప్రతిగృహ్యతామ్‌. 23

శాల్యన్నజం సుపక్వం చ శర్కరాగవ్య సంయుతమ్‌ |

స్వాదుయుక్తం మహాలక్ష్మి పరమాన్నం ప్రగృహ్యతామ్‌. 25

నానా విధాని రమ్యాణి పక్వాన్నాని ఫలాని చ | సురభిస్తన సంత్యక్తం సుస్వాదు సమనోహరమ్‌. 26

మర్త్యామృతం సుగవ్యం చ గృహ్యతా మచ్యుతప్రియే | సుస్వాదు రససంయుక్త మిక్షువృక్ష సముద్బవమ్‌. 27

అగ్విపక్వ మతిస్వాదు గుడం చ ప్రతిగృహ్యతామ్‌ | యనగో ధూమసస్యానాం చూర్ణరేణు సముద్బవమ్‌. 28

సుపక్వం గుడగవ్యాక్తం మిష్టాన్నం దేవిగృహ్యతామ్‌ | సస్యచూర్ణో ద్బవం పక్వం స్వస్తికాదిసమన్వితమ్‌. 29

మయా నివేదితం భక్త్యా నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ | శీతావాయు ప్రదం చైవ దాహే చ సుఖధం పరమ్‌. 30

పద్మవాసినీ! అట్టి శంఖతీర్థము నర్ఘ్యముగ గ్రహింపుము. ఓ హరిప్రియా! మంచిపూల యత్తరు - ఉసిరికపొడిని నీ శరీర కాంతి పెరుగుటకు గ్రహింపుము. ఓ దేవీ! ఈ మేల్మి వస్త్రము ధరింపుము. ఓ దేవీ! మెమ్మేని సోయగము నినుమడింప జేయునట్టి రత్న స్వర్ణమయమైన శోభలు చిందునట్టి రత్న భూషలు గ్రహింపుము తల్లీ! సకల శృంగారములకు మూలము పరమశోభాకారమగు గంధపుచెట్లు సుగంధ ద్రవ్యముతో చేయబడినది అయిన పవిత్రధూపమునో కృష్ణ ప్రియ! గ్రహింపుము. దేవీ! పరిమళాలు పరవశించు మంచిగంధము-చందనము గ్రహింపుము. ఓ సురేశ్వరీ! లోకైక దీపాంకురా! పవిత్రము-కటికిచీకట్లు పాపునది - జగములకు చూపు వెల్గు గల్గించునది - సుఖకరమైనదగు దీపము గ్రహింపుము. ఓత్రైలోక్యకుంటుబినీ! రుచికరము పలురసములతో చేయబడినది ఉపహారములతో తియ్యనైన నైవేద్యము అరగింపుము. తల్లీ! ఓ దేవీ! అన్నము బ్రహ్మస్వరూపము - ప్రాణములు గాపాడునది తుష్టి-పుష్టి గల్గించునది. ఇట్టి యన్నము గ్రహింపుమమ్మా! ఓ మహాలక్ష్మీ! మంచి యావుపాలు - పంచదార - శాల్యన్నము పండ్లరసము సుగంధ ద్రవ్యములు గలిపి తియ్యగ వండిన పరమాన్నము గ్రహించుము. పంచదార ఆవు పాలు కలిపి మనోహరముగ కమ్మగ భక్తితో వండిన స్వస్తికమును గ్రహింపుము దేవీ! పలు విధములైన యందమైన పండిన పండ్లును ఆవు పాలతో చేసిన తియ్యని పిండి వంటకములును మానవుల కమృతమువంటి పాలు-నెయ్యిని అచ్యుతప్రియా! అరగింపుము. మేలైన చెఱకు రసముతో చేయబడినది తియ్యగ వంట వంటి సిద్దము చేయుబడినదియగు గుడమును స్వీకరింపుము. తల్లీ! యవలు-గోధుమర్వ మంచి గుడము అవు పాలు నెయ్యి కలిపన వండిన మధురాన్నము భుజింపగదే తల్లీ! అహ్మ శ్రీరంగధామేశ్వరీ నేను భక్తి నర్పించు నైవేద్య మారంగింపుమమ్మా! మండు వేసవిలోన సుఖము చేకూర్చు చల్లని కమ్మతెమ్మెరలు వీచునట్టి వింజామరము ఇదిగో.

కమలే గృహ్యాతాం చేదం వ్యజనం శ్వేత చామరమ్‌ | తాంబులం చ వరం రమ్యం కర్పూరాది సువాసితమ్‌. 31

జిహ్వా జాడ్వ చ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ | సువాసితం సుశీతం చ పిపాసానాశకారణమ్‌. 32

జగజ్జీవన రూపం చ జీవనం దేవి గృహ్యతామ్‌ | దేహ సౌందర్య బీజం చ సదాశోభా వివర్దనమ్‌. 33

కార్పాసజం చ కృమిజం చ వసనం దేవి గృహ్యతామ్‌ | రత్న స్వర్ణ వికారం చ దేహభూషా వివర్ధనమ్‌. 34

శోభాధారం శ్రీకరం చ భూషణం దేవిగృహ్యతామ్‌ | నానా ఋతుషు నిర్మాణం బహుశోభాశ్రయం పరమ్‌. 35

సురభూవ ప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యాతాం |

శుద్ధిదం శుద్ధిరూపం చ సర్వ మంగళ మంగళమ్‌. 36

గంద వస్తూద్బవం రమ్యం గంధం దేవి ప్రగృహ్యతామ్‌ | పుణ్యతీర్థోకం చైవ విశుద్ధిదం సదా. 37

గృహ్యతాం కృష్ణకాంతే త్వం రమ్య మాచమనీయకమ్‌ | రత్నసారాది నిర్మాణం పుష్పచందన చర్చితమ్‌. 38

వస్త్రభూషణ భూషాడ్యం సుతల్పం దేవిగృహ్యతామ్‌ | యద్యద్ద్రవ్య మపూర్వం చ వృథివ్యా మపి దుర్లభమ్‌. 39

దేవభూషార్హ భోగ్యం చతద్ద్రవ్యం దేవి గృహ్యతామ్‌ | ద్రవ్యాణ్యతాని దత్యా చ మూలేన దేవ పుంగవః. 40

మూలం బజాప భక్త్యా చ దశలక్షం విధానతః | జపేన దశలక్షేణ మంత్రసిద్ధి ర్బభూవ మ. 41

మంత్రశ్చ బ్రహ్మణా దత్తః కల్పవృక్ష శ్చ సర్వతః | లక్ష్మీ ర్మాయా కామవాణీ జేంతా కమలవాసినీ. 42

వైదిరో మంత్రరాజోయం ప్రసిద్ధః స్వాహయాన్వితః | కుబేరోనేన మంత్రేణ పరమైశ్వర్యమప్తవాన్‌. 43

రాజరాజేశ్వరో దక్షః సావర్ణిర్మను రేవచ | మంగళో నేన మంత్రేణ సప్తద్వీ పే వనీతపతిః. 44

ప్రియ వ్రతోత్తాన పాదౌ కేదారో నృప ఏవచ | ఏతే సిద్దా శ్చ రాజేంద్రా మంత్రేణానేన నారద. 45

దేవి! నోటి దుర్వాసన పోగొట్టును రుచికరమైన తియ్యని కప్పురపు విడెమిదిగో! గ్రహింపుము. దప్పిక దీర్చునట్టి చల్లని సువాసనలుగల పానీయము గలదు. జగములకు జీవనము గల్గించునట్టి ఈ పానీయము త్రాగుమమ్మా! దేహ సౌందర్యమును శోభ నినుమడింపజేయు వస్త్రము గలదు. ఓ పద్మినీదేవీ! ఆ పట్టు వస్త్రము గ్రహింపుము తల్లీ! మేని సొబగు నెక్కువ జేయునట్టి రత్న సువర్ణభూషలు గలవు. ఓ హిరణ్మయీదేవీ! శ్రీకరమైన శోభకు నిలయమెన సొమ్ములు దాల్చుమమ్మా! ఆయా ఋతువులందలి పూలు రంగురంగుల శోభలు వెలార్చును. అట్టి పూలతో సురప్రియముగ చక్కగ నల్లిన పూలమాల నో దేవి! గ్రహింపుము. సర్వమంగళ మంగళము-స్వచ్చము-శుద్దికరమును-మంచిచందనముతో చేయబడినదగు మంచిగందమునో దేవీ! గ్రహింపుము. నిర్మలము-స్వచ్చము-పవిత్రమునగు తీర్థోదకమును ఓ కృష్ణప్రియా! నీ వాచమనమునకు గ్రహింపుము.రత్నసార నిర్మతము పూలు పఱటి చందనము చిల్కరింపబడినది మైలైన వస్త్రముభూషణములతో నొప్పునదియగు పూలసెజ్జ నో దేవి గ్రహింపుము. తల్లీ! ఈ భూమియందు దుర్లభములు నపూర్వములునైన ద్రవ్యములు పెక్కులు గలను. దేవీ! దివ్యాలంకరణమున కట్టి భోగ్యవస్తువులు స్వీకరింపుము. ఈ ప్రకారముగ నాయా పవిత్ర వస్తవు లాయా మంత్రములతో నింద్రుడు లక్ష్మికి సమర్పించెను. అతడు లక్ష్మీమూలమంత్రము పరమభక్తితో పదిలక్షలు యథావిధిగ జపింతెను. పదిలక్షలు జపముచే మంత్రసిద్ధి గల్గెను. ఈ మంత్రమును బ్రహ్మ యుపదేశించెను. ఇది తల్పతరువు వంటిది. ఈ మంత్రమున లక్ష్మి-మాయ-కామ-వాణీ-భీజమంత్రములు గలవు. కమలవాసిని శబ్దము చతుర్ధీ విభక్తిలో నుండవలయును. దాని చివర స్వాహాశబ్దము చేర్పవలయును. ఇది వైదిక మంత్రరాజము ''ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమల వాసన్యై స్వాహా'' అనునది మూలమంత్రము. ఈ మంత్రము జపించి యేడు దీవులకు పతియయ్యెను. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కేదారుడును మహారాజు లైరి. నారదై! ఈ మంత్ర ప్రభావమున రాజేంద్రులను సిద్ధులైరి.

సిద్దే మంత్రే మహాలక్ష్మీః శక్రాయ దర్శనం దదౌ | రత్మేంద్రసార నిర్మాణ మిమానస్ధా వరప్రదా. 46

సప్త ద్వీపవతీం పృథ్వీం చా దయంతీ త్విషా చ సా | శ్వేత చంపకవర్ణాభా రత్న భూషణభూషిత. 47

ఈషద్ధాస్య ప్రసన్నాస్యా భక్తాను గ్రహకాతరా | బిభ్రతీ రత్నమాలాం చ కోటి చంద్రసమ ప్రభామ్‌. 48

దృష్ట్వా జగత్ర్పసూం శాంతాం తుష్టా వైతాం పురందరః |

పులకాంచిత సర్వంగః సాశ్రునేత్రః కృతాంజలిః. 49

బ్రహ్మణా చ ర్వాప్రదత్తదేన స్తోత్రరాజేన సంయుతః | సర్వభీష్ట ప్రదే నైవ వైదికేనైవతత్ర చ. 50

నమః కమలవా సిన్యై నారాయణ్యౖ నమో నమః | కృష్ణ ప్రియాయై సతతం మహీలక్ష్మ్యె నమోనమః. 51

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః | పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః. 52

సర్వ సంవత్సరూపిణ్యౖ సర్వారాధ్యైనమోనమః | హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమోనమః. 53

కృష్ణపక్షః స్థితాయై చ కృష్ణేశాయై నమోనమః | చంద్రశోభా స్వరూపాయై రత్న పద్మే చ శోభ##నే. 54

సంపత్త్య ధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః | నమో వృద్ధి స్వరూపాయై వృద్ధిదాయై నమోనమః. 55

వైకుంఠే యా మహాలక్ష్మీర్యా లక్ష్మీః క్షీరసాగరే | స్వర్గ లక్ష్మీ రింద్రగేహే రాజలక్ష్మీ ర్నృపాలయే. 56

గృహలక్ష్మీ శ్చ గృహిణాం గేహే చ గృహ దేవతా | సురభిః సాగరే జాతా దక్షిణా యజ్ఞకామినీ. 57

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయా | స్వాహా త్వం చ హవిర్దానే కవ్యదానేస్వధాస్మృతా. 58

త్వం హి విష్ణు స్వరూపా చ సర్వాధారా వసుంధరా | శుద్ధ సత్త్వ సూరూపాత్వం నారాయణ పరాయణా. 59

క్రోధ హింసా వర్జితా చ వరదాశారదా శుభా | పరమార్థ ప్రదా త్వం చ హరిదాస్య ప్రదా పరా. 60

మంత్రసిద్ధి బొందివ తరువాత దేవేంద్రునకు దివ్య దర్శనభాగ్యము గలిగించెను. దేవి వర మిచ్చుటకు రత్నసారి నిర్మితమైన విమాన మెక్కి వచ్చెను. వరలక్ష్మీదేవి తన దివ్యకాంతులచేత నేడు దీవుల వఱకు వ్యాపించిన నేలను కాంతి శ్రీలతో నింపివేసెను. శ్రీదేవి రత్నభూషణ భూషిత - తెల్లని చంపకమువంటి శరీరకాంతి గలది. చిర్న గవులు చిందించు ప్రసన్నవదనము గలది - భక్తులను గాపాడుటలో నుత్సాహము గలది. కోటిచంద్రుల కాంతులవంటటి కాంతిగల రత్నాలమాలికను చేతధరించియున్నది. పరమశాంతస్వరూపిణీ - తుష్టిరూపిణి - త్రిజగన్మానతయగు లక్ష్మీదేవి నింద్రుడు దర్శించెను. అతని కన్నుల వెంట నానందబాష్పములు జూలువార మే నెల్ల పులకింపగ చేతులు మోడ్చి నమస్కరించెను. శ్రీకమలనాసినీ! నారయణీ! కృష్ణప్రియా! మహాలక్ష్మీ! నీకు నమస్కారములు తల్లీ! శ్రీపద్మ పత్రేక్షణ-పద్మాస్య-పద్మవాసిని-పద్మిని-యైన వైష్ణవీదేవికి నమస్కారములు. సర్వ సంపత్స్వరూపిణీ - సకల లోకారాధ్య - హరిభక్తి ప్రదాయిని హర్షదాయినియగు సర్వమాంగల్యయుక్తకు నమస్కారములు. శ్రీకృష్ణుని వక్షఃస్థలము నివాసముగ గలది - కృష్ణప్రియ-చంద్రశోబా స్వరూపిణి - రత్న పద్మముల శోభగల లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను. సంపదల కధిష్ఠానదేవి-మహాదేవి-వృద్ధి స్వరూపిణ-వృద్దిదాయిన యగు లక్ష్మీదేవికి నమస్కారములు. అలవైకుంఠమున మహాలక్ష్మియు-క్షీరసాగరమందు లక్ష్మియు-స్వర్గమున స్వర్గలక్ష్మియు-రాజుల భవనములందు రాజలక్ష్మి యునగు దేవికి నమస్కారములు. గృహస్ధుల యిండ్లలోని గృహలక్ష్మియు - గృహములలోని గృహదేవతయు - సాగరమందు బుట్టిన సురభియు - యజ్ఞకామినియగు దక్షిణయునైన లక్ష్మికి నమస్కారములు. శ్రీదేమాతయగు అతి కమలాలయ - కమల - హవిస్సు వేల్చుటందు స్వాహాదేవి - కవ్యము వేల్చుటందు స్వధాదేవి యగు దేవికి నమస్కారములు. తల్లీ! నీవు విష్ణు స్వరూపిణివి - సర్వాధారవు - వసుంధరవు - శుద్ధసత్వ స్వరూపిణివి - నారాయణ పరాయణువు తల్లీ! నీవు వరలక్ష్మీవి-శారదవు-సుభాంగివి-హింసాక్రోధములు లేనిదానవు-పరమార్థ ప్రదాయినివి - హరిభక్తి గల్గించు పరాదేవతవు.

యయా వినా జగత్సర్వం భస్మీభూత మసారకమ్‌ | జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయావినా. 61

సర్వేషాం చ పరామాతా సర్వబాంధవరూపిణీ | ధర్మార్ధ కౌమమోక్షాణాం త్వం చ కౌరణరూపిణీ. 62

యథా మాతా స్తనాధానాం శిశూనాం శైశ##వే సదా | తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. 63

మాతృహీనః స్త నాంధస్తు స చ జీవతి దైవతైః | త్వయా హీనో జనః కో7పిన జీవత్యేవ నిశ్చితమ్‌. 64

సుప్రసన్న స్వరూ పాత్వం మాంప్రసన్నా భవాంబికే | వైరి గ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని. 65

ఆహం యావత్త్వయా హీనో బంధు హీన శ్చ భిక్షుకః | సర్వ సంపద్వి హీనశ్చ తావదేవ హరిప్రియే. 66

జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌ భాగ్యమీప్సితమ్‌ | ప్రభావం చ ప్రతాపం చ సర్వాధి కారమేవచ. 67

జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్య మేవచ | ఇత్యుక్త్వా చ మహేంద్ర శ్చ సర్వేః సురగణౖఃసహ. 68

ప్రణనామ సాశ్రునేత్రో మూర్ద్నా చైవ పునః పునః | బ్రహ్మా చ శంకరశ్చైవ శేషో ధర్మ శ్చ కేశవః. 69

సర్వే చక్రుః పరీహారం చ సురార్థే చ పునః పునః | దేవభ్య శ్చ వరం దత్వా పుష్పమాలాం మనోహరామ్‌. 70

కేశవాయ దదౌలక్ష్మీః సంతుష్టా సురసంసది | యయుర్దేవా శ్చ సంతుష్టాః స్వం స్వంస్ధానం చ నారధ. 71

దేవీ య¸° హరేః స్థానం హృష్టా క్షీరోదశాయినీ | యయతు శైవ స్వగృహం బ్రహ్మేశానౌ చ నారద. 72

దత్త్వా శుభాశిషం తౌ చ దేవేభ్యః ప్రీతిపూర్వకమ్‌ | ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. 73

కుభేరతుల్యః న భ##వే ద్రాజరాజేశ్వరో మహాన్‌ | ''పం చ లక్షజపేనైన స్తోత్ర సిద్ధి ర్బవే న్నృణామ్‌'', 74

సిద్ధ స్తోత్రం యది పఠేన్నాస మేక్‌ చ సంతతమ్‌ | మహాసుఖీ చ రాజేంద్రో భవిష్యతి న సంశయః. 75

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ద్వి చత్వారింశోధ్యాయః.

లక్ష్మీదేవీ! నీవు లేనిచో జగమంతయు కళాహీనము - భస్మీభూతము | జీవన్నృత మగును. కలుముల తల్లీ! నీవు సర్వులకు తల్మివి - పరాదేవతవు - వసుధైక కుటుంబినివి - ధర్మారధ కామమోక్షెములకు నీవు మూలకారణ రూపిణివి. చిఱుత ప్రాయముగల శిశువులకు తల్లి పాలిచ్చి పెంచును. అటులే నీవు నన్ని విధముల నెల్లరిని గాపాడు తల్లివమ్మా! పాలు త్రాగు చిట్టిపాప తల్మి లేనప్పటికిని దైవయోగమున పెరిగి పెద్ద యగును. కాని తల్లీ! నీ దయ పొందలేనివా డెవ్వడును బ్రతుక జాలడు. ఓ అంబా! నీవు సుప్రసన్న స్వరూపిణివి. మా యెడల ప్రసన్ను రాలవుగమ్మా అమ్మా! వైరులచేత జిక్కిన మా రాజ్యము తిరిగి మా కిప్పింపుము తల్లీ! ఓ హరివల్లభా! నీ దయ పొందలేనివాడు బలధుపహీనుడు బిచ్చగాడు ధన హీనుడు నగును. ఓ ముకుందప్రియా! మాకు జ్ఞానము ధర్మము సకల సౌభాగ్యములు ప్రభావము ప్రతాపము సర్వాధికారము లొసంగుము తల్లీ? యుద్ధములందు పరాక్రమము విజయము పరమైశ్వర్యమును మాకు ప్రసాదింపుము. అని యింద్రుడు సురగణములనుగూడి లక్ష్మీదేవిని ప్రార్ధించెను. ఇంద్రుడు తలవంచి యానందబాష్పములతో పలుమార్లు లక్ష్మికి నమస్కరించెను. అటు పిదప బ్రహ్మ శివుడు శేషుడు ధర్ముడు కేశవుడు మొదలగు దేవత లందఱు నింద్రుని మేలుగోరి లక్ష్మీదేవికి నమస్కరించిరి. లక్ష్మిదేవత లందఱికిని వరము లొసంగెను. మనోహరమైన పుష్పమాలను లక్ష్మి శ్రీవిష్ణుని మెడలో నలంకరించెను. దేవతల సభలో నీ విధముగ లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యెను. నారదా! దేవత లెల్లరు సంతోషించి తమ తమ నెలవుల కరిగిరి. లక్ష్మీ దేవి తర్వాత క్షీరసాగరశయనుడగు హరి సన్నిధికి సంతోషముతో నేగెను. నారదా! బ్రహ్మ శివులును తమ లోకముల కరిగిరి. వారిర్వురును దేవతలకు శుభాశీస్సులు ప్రీతితో నొసంగిరి. ఈ లక్ష్మీస్తోత్రము మహాపుణ్యమైనది. దీనిని మూడు సంధ్యలందును చదివిన నరుడు కుబేరునితో సమాను డగును. మహీరాజ రాజేశ్వరుడుగాగలడు. ఈ లక్ష్మీస్తోత్రము నైదు లక్షలు జపించినవారికి స్తోత్రసిద్ధి యగును. స్తోత్రమున సిద్ధి బొందిన పిదప నొక నెలవఱకు పఠించినచో నతడు మహీసుఖి-రాజేందరుడు గాగలడు. ఇది నిజము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున నలువదిరెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters