Sri Matsya mahapuramu-2    Chapters   

చతుష్షష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

యుగపరిమాణాదికథనమ్‌.

శ్రీమత్స్యః: చత్వార్యాహుస్సహస్రాణి వర్షాణాం తత్కృతం యుగమ్‌ l తస్యతావచ్ఛతీ సన్ద్యా ద్విగుణా రవినన్దన. 1

యత్ర ధర్మశ్చతుష్పద స్త్వధర్మః పాదవిగ్రహః l స్వధర్వనిరతా స్సన్తో జాయన్తే యతం మానవాః . 2

విప్రాస్థసితా ధర్మపరా రాజవృత్తౌ స్థితా నృపాః l కృష్యామభిరతా వైశ్యా శ్శూద్రా శ్శుశ్రూషవ స్థ్సితా. 3

తదా సత్యంచ శౌచంచ ధర్మశ్చైవ వివర్ధతే l సద్భిరాచరితం కర్మ క్రియతే ఖ్యాయతే చవై. 4

ఏతత్కార్తయుగం వృత్తం సర్వేషామేవ పార్థివl ప్రాణినాం కర్మసంజ్ఞానమపి వై నీచకర్మణామ్‌. 5

త్రీణీ వర్షసహస్రాతి త్రేతాయుగ మిహోచ్యతే l తస్య తావచ్చతీ సన్ద్యా ద్విగుణా పరివర్తతే . 6

ద్యాభ్యామధర్మః lపాదాభ్యాం త్రిభిర్దర్మో వ్యవస్థితః l శ్రుతం సత్యంచ సత్త్వంచ క్షమా ధర్మోవిధియతే . 7

త్రేతాయాం వికృతిం యాన్తి వర్ణాస్త్వేతే న సంశయః l చాతుర్వర్ణ్య స్య వైకృత్యాద్యాన్తి దౌర్బల్యతాం జనాః.

ఏష త్రేతాయుగగతిర్విచితద్రా దేవనిర్మితా l ద్వాపరసగతు యా చేష్టా తామపి శ్రోతుమర్హసి. 9

ద్వాపరం ద్విసహస్రాతి వర్షాతి రవినన్దనl తస్య తావచ్చతీ సన్ద్యా ద్విగుణాయుగముచ్యతే. 10

తత్రచార్థపరా స్సర్వే ప్రాతినో రజసా హతా ః l సర్వే నైకృతికాః క్షుదా జాయన్తే రవినన్దన. 11

ద్వాభ్యాం ధర్మస్థ్సితః పద్భ్యమధర్మ స్త్రిభి రుచ్చ్రతః l విపర్యయాచ్చనైర్ద ర్మః క్షయమేతికలౌ యుగే. 12

బ్రాహ్మణ్యభావసగ తతో తథౌత్సుక్యం వ్యశీంగతే l వ్రతోపవాసాన్త్యజ్యన్తే ద్వాపరే యుగపర్యయే. 13

నూట అరువది నాలుగవ అధ్యాయము.

యుగ పరిమాణాది కథనము.

(పై ప్రశ్నములకన్నిటికి సమాధానము చెప్పవలెననిన సృష్టి ప్రళయములకును ప్రపంచ స్థితి ప్రవృత్తికిని ఆశ్రయమయి సర్వ పరిణామములకును పరిపాకములకును హేతువయి యున్నది కాలము కావున కాల పరిమాణ విశేషములగు యుగముల పరిమాణాదికము చెప్పుబడుచున్నది.)

శ్రీమత్స్యడు మనువును కిట్లు చెప్పనారంభించెను; నాలుగువేల దివ్య వర్షములు కృతయుగము; నాలుగు వందల దివ్యవర్షములు సంధ్యయు అంతయే సంధ్యాంశమును; ఈ యుగమును ధర్మము చతుష్పాదమయి అధర్మము పాదము (1/4) కంటె తక్కువగా నుండును . మానవులు స్వధర్మనిరతులగు సజ్జనులుగా నుందురు; విప్రులు విప్ర ధర్మపరులుగా క్షత్త్రియులు క్షత్త్రియ ధర్మపరులుగా వైశ్యులు కృషిపరులుగా శూత్రలు సేవాపరులుగా ఉందురు. సతగశౌచ ధర్మములు వృద్ధినందును. సజ్జను పలాచరించిన కర్మమునందరు మెచచి అచరింతురు. ఎంత నీచకర్ములగువారు కూడ తమ తమ కర్మలను ఎరిగి ఆచరించుటతో కృతయుగమును సర్వప్రాణుల నడువడులు నిట్లే యుండును.

మూడువేల దివ్యవర్షములు త్రేతాయుగము; మూడు వందల దివ్య వర్షములు దాని సంధ్య; అంతయే దాని సంధ్యాంశము; మూడు పాదములతో ధర్మమను రెండు పాదములకు తక్కువగా ఆ ధర్మమును ఆ యుగమున ఉండును శాస్త్రాధ్యయనము సత్యము బలము నిబ్బరము (సత్త్వము) క్షమ-ధర్మము ఇవి విధింపబడియును ఆ యుగమున అయావర్ణములవారు వాని అచరణము సరిగా చేయరు. దానిచే జనులు దుర్బలు లగుదురు. ఇది త్రేతాయుగపు నడక.

ఇక ద్వాపరయుగ ప్రవృత్తిని వినుము; దాని పరిమాణము రెండువేల దివ్య వర్షములు; రెండు వందల దివగవర్షములు దాని సంధ్యాకాలము; అంతయే దాని సంధ్యాంశము; ఆయుగమున మానవులురజోగుణులయి అర్థము (ధనము) నకు ప్రాధాన్యము నిత్తురు. అందరునుమోసగాండ్రును క్షుద్రులు నగుదురు; రెండు పాదముల ధర్మముండగా ఆధర్మము మూడు పాదములకు తక్కువగా నుండును. దీనిచేత క్రమముగా కలియుగము నాటికి ధర్మము క్షయమునందును. ద్వాపరయుగము క్రమముగా గడచు కొలదిని బ్రాహ్మణ్యమునం దాసక్తి తగ్గును; వ్రతోపవాసాదికము విడువబడును.

తథా వర్షసహస్రంతు వర్షణాం ద్వేశ##తే తథాl సంధ్యయా సహ సజ్ఖ్యతం క్రూరం కలియుగం తథా. 14

యత్రాధర్మశ్చతుష్పాద స్స్యాద్ధర్మః పాదవిగ్రహః l కామినస్తమసా చ్ఛన్నాజాయన్తే యత్ర మానవాః. 15

నైవాతిసా త్త్వికః కశ్చిన్న సాధుర్నచ సత్యవాక్‌ l నాస్తికా బ్రహ్మభక్తా వా జాయన్తే తత్ర మానవాః. 16

అవాజ్కారగృహీతాశచ ప్రక్షీణ స్నేహబన్దనాఃlవిప్రాంశ్శూద్రసమాచారా స్సన్తి సర్వేకలౌయుగే. 7

ఆశ్రమాణాం విపర్యాసః కలౌ సమ్పరివర్తతే l వర్ణానాం చైవ సన్దేహో యుగాన్తే రవినన్దన. 18

విద్యాద్ద్వాదశసాహస్రీం యుగాఖ్యాం పూర్వనింటితామ్‌ l; ఏవం సహప్రపర్యన్తం తదహో బ్రహ్మముచ్మతే.

తతో7హని గతే తస్మిన్త్స ర్వేషామేవ జీవినామ్‌l శరీరనిర్వృతిర్దృష్ట్వా లోకసంహారబుద్ధినా. 20

దేవదానాకగ సర్వాసాం బ్రహ్మాదీనాంమహీపతేl దైత్యగానాం దానవానాంచ యక్షరాక్షనపక్షిణామ్‌ . 21

గన్దర్వాణామప్సరసాం భుజౌజ్గానాంచ పార్థివ l పర్వతానాం నదీనాంచ పశునాంచైవ సత్తమ. 22

తిర్యగ్యోనిగతానాంచ సత్త్వానాం క్రిమిణాం తథా l మహాభుతపతిః ప ఞ్చహృత్వా భూతాని భూతాని భూతకృత్‌.

జగత్సంహరణార్థాయ కురుతే వైశసం మహత్‌l భూత్వాసూర్యశ్చక్షుషీ చాదదానో భూత్వావాయుః ప్రాణినాం ప్రాణజాలమ్‌. 24

భుత్వా వహ్నిర్నిర్దహ న్త్సర్వలోకా న్బూత్వా మేఘోభూయ ఉగ్రో7ప్యవర్షత్‌. 24 ||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నారాయణనాభిపద్మోద్భవకథనే చతుర్యుగపరిమాణ

వర్ణనం నామ చతుష్షష్ట్యుత్తరశతతమోద్యాయః.

కలియుగమన్నింటిలో క్రూరమయినది; దాని పరిమాణము ఒక వేయి దివ్య సంవత్సరములు; నూరు దివ్య సంవత్సరములుకలిసంధ్య . అంతయే దాని సంధ్యాంశమును. దీనియందు అధర్మము నాల్గుపాదములుండను; ధర్మముపాదముకంటె తక్కువగా నుండును; మానవులు కాముకులు తమోగుణులు నగుదురు; అతి సాత్త్వికుడు సాధుస్వభావుడు సత్యవచనుడు అరుదుగా నుండును జనులు నాస్తికులును బ్రహ్మబంధనము లేనవారు నగుదురు; విప్రులందరును శూద్రుల ప్రవర్తనముతో నుందురు; ఆశ్రమ ధర్మము వ్యత్త్యస్తమగును; యుగాంతకాలము నాటికి వర్ణములు ఉన్నావా లేవాయను సందిగ్ద స్థితికి వచ్చును. పండ్రేండువేల దివ్య వర్షములు ఒక చతుర్‌ (మహా) యుగము; వేయి చతుర్ముగములు బ్రహ్మకొక పగలు; అది గడువగానే సర్వప్రాణుల శరీర నాశము చేయదలచి పలోక సంహారము చేయు సంకల్పముతో మహా భూతాధిపతియగు నారారుణుడు బ్రహ్మాది సర్వదేవతలును దైత్య దానవ యక్షరాక్షస పక్షి గంధర్వాప్సరో భుజంగ పర్వత నదీ పశు ప్రభృతులును ఇంకను తిర్యగ్యోని గత సమస్త ప్రాణులను కృములను- మొదలగు వానినుండియు సమస్త జడ భగవాను తాను సూర్యుడై ప్రాణుల నేత్రములను వాయొవై ప్రాణములను ఉపసంహరించి అగ్నియై సర్వలోకములను దహించి తరువాత భయంకర మేఘమయి వర్షించును.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున పద్మోద్భవ కథనమున చతుర్యుగ పరిమాణ వర్ణనమును

నూట అరువది నాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters