Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తసప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

విష్ణువిజయాయ కాలనేమినో నారాయణా న్తికగమనం-తయో స్సంవాదశ్చ.

శ్రీమత్స్యః: పఞ్చ తన్నాభ్యవర్తన్త విపరేతేన కర్మణా l వేదో ధర్మః క్షమా సత్యం శ్రీశ్చ నారాయణాశ్రయాః. 1

స తేషా మనుపస్థానా త్సక్రోధో దానవేశ్వరః l వైష్ణవం పద మన్విచ్ఛ న్య¸° నారాయణాన్తికమ్‌.2

స దదర్శ సువర్ణస్థంశఙ్ఖచక్రగదాధరమ్‌ | దానవానాం వినాశాయ భ్రామయన్తం గదాం శుభమ్‌.3

నజలామ్బెదసదృశం విద్యుత్సదృశవాససమ్‌ l స్వారూఢం స్వర్గపక్షాభ్యం శిఖినక కాశ్యపం ఖగమ్‌. 4

దృష్ట్వా దైతగ వినాశాయ రణ స్వస్థమివ స్థితమ్‌ l దానవో విష్ణుమక్షోబ్యం బభాషే లుబ్ధమానసః. 5

అయం సరిపురస్మాకం పూర్వేషాం ప్రాణనాశనః l అర్ణవావాసినశ్చైవ మధోర్వై కైటభస్యచ. 6

అయం స విగ్రహోస్మాక మశామ్యః కిల కథ్యతే l అనేన సంయుగేష్వద్య దానవా బహవో హతాః. 7

అయం స నర్ఝృణో లోకే స్త్రీ బాలేనిరపత్రవః l యేన దానవ నారీణం సీమన్తోద్దరణం కృతమ్‌. 8

అయం స విష్ణు ర్దేవానాం వైకుణ్ఠో7యం దివౌకసామ్‌ l అనన్తో భోగినామప్సు స్వపన్నాద్య స్స్వయమ్బువః. 9

అయంస నాధో దేవానా మస్మాభిర్‌ వృథతాత్మనామl అసగ క్రోధం సమాసాద్య హిరణ్యకశిపు ర్హతః. 10

అస్య చ్ఛాయాము%ుప్రాశ్రింతగ దేవా మఖముఖే స్థితాః l అజ్యం మహర్షిభిర్దత్త మశ్నువన్తి తరిదా హుతమ్‌. 11

ఆయం స నిధనే హేతు స్సర్వేషా మమరద్విషామ్‌ l యస్య చక్రే ప్రవిష్టాని కులాన్య స్మాక మహవే. 12

అయం స కిల యుద్దేషు సురార్థే త్యక్తజీవితః l సవితుస్తేజసా తుల్యం చక్రం క్షిపతి శత్రుషు. 13

అయస స కాలో దైత్యానాం కాలభుత స్సమాస్థితః l అతి క్రాన్తసగ కాలస్య ఫలం ప్రాప్స్యతి కేశవః. 14

నూట డెబ్బది ఏడవ అధ్యాయము.

విష్ణుని గెలువదలకచి కాలనేమి అతని కడకుపొవుట-

వారిరువుర సంవాదము.

శ్రీమత్స్యుమనువుతో ఇంకను ఇట్లు చెప్పెను. కాలనేమి అచరించు ఈ విరుద్ధ కార్మాచరణమునకు భయపడి అతనిని సేవించుటకై అతని కొలువునకు పోక అతనివైపు తిరుగనైన తిరుగక ఉండినవి ఐదు తత్త్వములు మాత్రముండెను. అవి 1. వేదము 2. ధర్మము 3. క్షమ 4. సత్యము 5. శ్రీ (సర్వకామపూర్ణతా సిద్దమగు సచ్చిదానంతదా లక్షణము) ఈ ఐదును తను సేవింపరానందున అ ధానవేశ్వరుడు సక్రోధుడై విష్ణు సానమును వెదకుకొనుచు (పోయి పోయి) నారాయణుని కడకు పోయెను. అతనికి అచట నారాయణుడు కనబడెను. అతడు (ప్రణవ- రూపుడగు) గరుడుని (సర్వవాక్తత్ణ్వ మూలరూపుని ) అదిష్ఠించియుండెను. శంఖచక్ర గధాధరుడు- దానవుల వినాశమునకై శుభరూపముగు గదను త్రిప్పుచున్నవాడు- సజల మేఘ సమానుడు-మెరపువంటి వస్త్రము దాల్చినవాడు-బంగరు రెక్కలును శిఖము కలిగి కశ్యప (వినతా ) పుత్త్రుడగు పక్షిని గరుడుని చక్కగా ఆరోహించినవాడు; దైత్య వినాశమునకై నెమ్మదితో కూర్చున్నట్లు కనబడుచు ఎవరికిని కలవరపరచ నలవికాక రణరంగమునందు ఉన్న విష్ణుని ఉద్దేశించి (సర్వ తత్త్వములను తన వశము చేసికొనవలెనని) లుబ్దమానసుడగు ఆ దానవుడు ఇట్లు పలికెను: మా పూర్మలకు ప్రాణనాశకుడగు శత్రువు ఇతడే ; సముద్రమునందు వసించు అసురులను-మధుని-కైటభుని-కూడ చంపినవాడు ఇతడే ; మా (దానవులకు) అణచనలవికానిదై (ముర్తీభవించిన) కలహము ఇతడే ; (అతని మూలముననే మాకు సదా దేవతలతోడి యుద్దములు సంభవించుచున్నవి;)అని మావారు చెప్పుచున్నారు; ఇతనిచే యుద్దములందు దానవులనేకులు హతులయిరి. ¨ఇతడు స్త్రీల విషయమునను బాలుర విషయమునను దయలేక అ స్త్రీల భర్తలను చంపెను; ఆ బాలుర తండ్రులను చంపెను; కాని అ తప్పునకై సిగ్గుపడుటలేదు; ఇతడే దానవ నారుల పాపటలు తొలగించినవాడు; దేవతలకు విష్ణువును స్వర్గవాసులకు వైకుంఠుడును ఇతడే ; నాగులలోఅతంతుడును (శ్రేష్ఠుడును- సర్వజీవ జ్ఞాన కర్మాతటకములగు) జలములందు నిదురించువాడునుస్వయం భూబ్రహ్మకుకూడ మొదటివాడును ఇతడే; మాచేతులలో వ్యథ పరచబడిన మనస్సులుగల దేవతలకు రక్షకుడితడే ; ఇతని క్రోధమునకు పాత్రుడయియే హిరణ్యకశిపుడు చంపబడెను; ఇతని నీడ నాశ్రయించియే దేవతలు యజ్ఞారంభములందు నిలుచుచున్నారు; మహర్షులచే ప్రాతర్మధ్యాహ్న సాయం సవనములందుమూడు విధములుగా హవనము చేయబడిన అజ్యమును వారు గ్రహించి అనుభవింపగలుగుచున్నారు. దేవ శత్రువులకు అందరకు మరణహేతు భూతుడీతడే కదా! దేవతల నిమిత్తమయియుద్దములందు ప్రాణత్యాగమునకైన సిద్దపడి సూర్య సమానతేజోవంతమగుచక్రము ప్రయోగించువాడితడే కదా! దైత్యులప కాలయముడై యుండు కాలాత్మకుడు ఈతడే కదా! ఈ కేశవుడుగడచిన కాలమున చేసిన తన పనులకు ఫలమనుభవించును లెమ్ము.

______________________________________________________________________________

¨అ -177 శ్లో. 8; విలక్షణమగు సమాహార ద్వంద్వము-(అపాణినీయము) మత్స్య-177-8శ్లో. అయం స నిర్ఝృణో లోకే - స్త్రీ బాలనిరపత్రపః ఇచట -అయం లొకే స్త్రీషు బాలేషు చ విషయే నిర్ఝృణ ః - నిరపత్రపశ్చ - అని అన్వయము రావలయుమును - కాని ' స్త్రీ బాలవిషయే నిరపత్రపః'అని చెప్పరాదు; కాని ఈ పాఠము అన్ని ప్రతులందు%ు ఇట్లేయున్నిది- ఇది కుదురదు; '-ఇతడు స్త్రీలయందును బాలురయందును దయలేనివాడై ఆ స్త్రీల భర్తలను ఆ బాలుర తండ్రులనుచంపెను కాని తాను చేసిన ఆ పనులకు సిగ్గుపడడు- అని చెప్పవలెను. అందులకై స్త్రీబాలే ' అను పాఠముండవలెను. ' స్త్రియశ్చ బాలశ్చ- ఏతేషాం సమాహారః స్త్రీబాలమ్‌' ఇది అపాణినీయము.

దిష్ట్యే దానీం సమక్షం మే విష్ణు రేష సమాగతఃl అద్య మద్బాహనిష్పిష్టో మామేవ ప్రణమిష్యతి. 15

యాస్యామ్మపచితిం దిష్ట్యా పూర్వేషా మద్య సంయుగే l ఇమం నారాయణం హత్వా దానవానాం భయావహమ్‌. 16

క్షిప్రమేవ హనిష్యామి రణ 7మరగణాం స్తతః l జాత్యన్తరగతో హ్యేష బాధతే దానహన్మృథే. 17

ఏషో7నన్తః పురాభూత్వా పద్మనాభ ఇతి శ్రుతిః l జఘానైకార్ణవే ఘోరే తావుభౌ మధుకైటభౌ. 18

ద్విధాభూతం వపుః కృత్వా సింహిస్యార్థం నరస్యచ l పితరం మే జఘానైకో హిరణ్య కశిపుం పురా. 19

శుభం గర్బమదత్తైన మదితి ర్దేవతారణిః త్రీన్దోకా స్త్స జహారైకః క్రమమాంణ స్త్రిభిః క్రమైః. 20

భూయస్త్విదానీం సమ్ప్రాప్తే సజ్గ్రామే తారకామయే l మరూసహి సమాగమ్య స దేవో వినశిష్యతి. 21

éఏవమక్త్వా బహావిధం క్షిపన్నారాయణం రణ l వాగ్బిర ప్రతిరూపాభి ర్యుద్దమేవాభ్యరోచయత్‌. 22

క్షిప్యమాణో7సురేన్ద్రేణ న చూకోప గదాధరః l క్షమాబలేన మహతా సస్మితం చేదమబ్రవీత్‌. 23

అల్పం దర్పబుం దైతగ స్థిరమక్రోధజం బలమ్‌ l హతస్త్వం దర్బజైర్దోషైర్హత్వాయద్బాషసే క్షమామ్‌. 24

అధీరస్త్వం మమ మతోధిగేతత్తవ వాగ్బలమ్‌ l నయత్ర పురుషాస్సన్తి తత్ర గర్ణన్తి యోషితః.25

అహం త్వాం దైతగ పశ్యామి పూర్వేషాం మార్గగామినమ్‌ l ప్రజాపతికృతం సేతుం భిత్త్వాక స్సస్తిమాన్వ్రజేత్‌. 26

అద్య త్వాం నాశయిష్యామి దేవవ్యాపారఘాతకమ్‌ l స్వేషు స్వేషుచ స్థానేషు స్థావయిష్యామి దేవతాః. 27

నా అదృష్టముకొలదిని ఈ విష్ణువు ఇపుడు నా ఎదుటనున్నాడు. ఇపుడు నా భుజములనడుమ నలిగిపోయి ఇతడే నన్నే నమస్కరించును. నా అదృష్టవశమున ఇపుడుయుద్దమున దావభయావహుడగు ఈ నారాయణుని చంపి నాపూర్వలకు పూజ జరిపెదను. తరువాత శీఘ్రముగా అసురగణములను చంపెదను. మాకు పరజాతివారగు దేవతల పక్షమవలంభించి ఇతడు దానవులను యుద్దమున బాధపెట్టుచున్నాడు. ఇతడు అనంతుడుగా పూర్వముండుచునే తన నాభియందు జన్మించిన పద్మము వలన పద్మనాడుడని ప్రసిద్దినొంది అసమయమందే ఘోరమగు ఏకార్ణవమున మదుకైబభులను సంహరించెను. పూర్వము సగము నరుడగు సగము సింహముగా రెండు విధములగు దేహము ధరించిమాతండ్రియగు హిరణ్యకశివుని సంహరించెను. దేవతలనెడు అగ్నికి అరణియగు అదితి ఇతనిని తన శుభగర్బముగా ధరించి కనెను. అపుడతడుమూడడుగులతో ముందునకు అడుగులు వేయుచు తానొక్కడే మూడు లోకములను హరించెను. మరల ఇపుడు గూడ ఈ తారకామయ సంగ్రామము తటస్థించినది. దీనిలో నితడు నాతో తారసిల్లుచున్నాడు ఇపుడీ దేవుడు నశించి తీరును. ఇట్లా రణరంగమునందునారారుణుని సాటిలేని అనరానిమాటలతో బహువిధములుగా అతనితో యుద్దము చేయుటకు ఇష్టపడెను. అమరేంద్రుడు తను దిట్టుచున్నను అ గదాధరుడు కోపింపలేదు. మహాక్షమాబలముతో ఉండి చిరునవ్వుతో ఇట్లు పలికెను: దైత్యా!దర్బముతో కూడిన బలము అల్పీమయినది; అక్రోధముచే (క్షమచే) సిద్దించినబలము స్థిరమయినది; నీవు క్షమను విడిచి మాటలాడుచున్నావు కావున నీదర్పము వలన కలిగిన దోషములతో నీవు తప్పక చత్తువు; నీవు ధీరుడవుకావని నాకు తోచుచున్నది; ఛీ! నావాగ్బలము పనికిమాలినది; మగవారు లేనిచోట మాత్రమే స్త్రీలు గర్జల్లుచుందురు. దైత్యా! నీవును నీపూర్వుల మార్గమునే యనుసరింతువని నాకు కనబడుచున్నది; ప్రజాపతి ఏర్పరచిన ధర్మసేతువును భేదించినవాడెవ్వడు శుభము పొందును? దేవతల ప్రవృత్తులనే భంగపరచుచున్న నిన్నిపుడే చంపుదును. దేవతలను వారివారి స్థానములందు నిలుపుదును.

శ్రీ విష్ణునా సాకం కాలనేమినో యుద్దమ్‌.

ఏవం బ్రువతి వాక్యంతు మృథే శ్రీవత్సధారిణి l జహాస దానవః క్రోధాద్ద్వస్తాం పశ్చక్రేచసా 77యుదా9. 28

స బాహుశత ముద్యమ్య సర్వాస్త్రగ్రహణం రణ l క్రోధాద్ద్వి గుణరక్తక్షో విష్ణుం వక్షసగతాడయత్‌. 29

దానవాశ్చాపి సమరే మయ తార పురోగమాః l ఉద్యతాయుధ నిస్త్రింశా విష్ణు మభ్యద్రవ న్రణ. 30

స తాడ్యమనో7తి బలై ర్దైత్యై స్సర్వోద్యతాయుదైః l నచచాల తతో యుద్దేకమ్పమాన ఇవాచలః. 31

సంసక్తసగ సుపర్ణేన కాలనేమీ మహాసురః l సర్వప్రాణన మహతీం గదా మద్యమ్య బాహుభిః. 32

ఘోరాం జ్వలన్తీం ముముచే సంరబ్దోగరుడోపరి l కర్మణా తేన దైత్యస్య విష్ణు ర్విస్మయ మావిశత్‌ . 33

యదా తేన సుపర్ణసగ పాతితా పమూర్ద్ని సాగదా l సుపర్ణం వ్యథితం దృష్ట్వా క్షతంచ వపురాత్మనః. 34

క్రోధసంరక్తనయనో వైకుణ్డ శ్చక్రమాదదే l వ్యవర్దతచ వేగేన సువర్ణేన సమం విభుః. 35

శ్రీవత్సధారియగు విష్ణువు అరణరంగమందు ఇట్లు పలుకుచు ఉండగనే దానవుడు క్రోధముతో నెవ్వెను; తన అన్ని హస్తములతోను అయుధములు గ్రహించెను. వాడు సాయుధములగు తననూర భుజములను పైకెత్తి క్రోధముతో రెండింతలుగ కనులెర్రజేయుచు విష్ణుని రొమ్మున కొట్టెను. మయతారాది దానవులును తమతమ ఆయుధములనో ఖడ్గములనో ఎత్తిపట్టుకొని విష్ణునకభిముఖులయి పరుగెత్తిరి. అతబలులగు దైత్యులందరు తమతమ సర్వాయుధములతో ఉద్యతులై కొట్టుచున్నను కదలని కొండవలెనే విష్ణువు చలించకుండెను . కాలనేమి మహాసురుడు గరుడునిపై తలపడి తన పూర్ణబలముతో ఘోరమునుమండు (ప్రకాశించు)చున్నదియు పెద్దదియు అగుగదను భుజములతో ఎత్తి క్రుద్దుడగుచు గరుడునిపై విడిచెను. దైతగుని ఈ పని నారాయణనకు ఆశ్చర్యము కలిగించెను. గరుడుని తలపై అగద పడగనే అతడు బాధను పొందుటయు తన శరీరము కూడ గాయపడుటయు చూచుకొని వైకుంఠుడు క్రోధరక్తలోచనుడై చక్రము పూనెను; గరుడుడు(త్సాహమున) వృద్దినందగా అతనితోపాటు అప్రభుడుతానునువృద్దినందెను.

భుజాశ్చాసగ వ్యవర్ధన్త వ్యాప్నువన్తో దిశోదశ l ప్రదిశ##శ్చైవ ఖంగాం వై పూరయామాస కేశవః.36

వవృధేచ పునర్లోకా న్క్రాన్తుకామ ఇవౌజసా l తర్జనాయాసురేన్ద్రాణాం వర్దమానం నభస్తలే. 37

ఋషయ స్సహగ్దర్వా స్తుష్టువుర్మధుసూదనమ్‌ l సర్వాన్నిరీటెన లిహ న్త్సాభ్రి మమ్బర మమ్బరై.ః. 38

పద్బ్యా మాక్రమ్య వసుధాందిశ్శ్చాక్రమ్య బాహుభిః l స సూర్యకరతుల్యాభం సహస్రార మరిక్షయమ్‌. 39

దీప్తాగ్ని సదృశం ఘోరం దర్శనేన సుదర్శనమ్‌ l సువర్ణరేణుపర్యన్తం వజ్రనాఢం భయావహమ్‌. 40

మేదోస్థిమజ్జారుధిరైస్సిక్తందానవసమ్బవైఃl అద్వితీయం ప్రహరణంక్షుర పర్య న్తమణ్డలమ్‌. 41

స్రగ్ద్రమమాలావితతం కామగం కామరూపిణమ్‌ l స్వయం స్వయమ్బువా సృష్టం భయదం సర్వవిద్విషామ్‌.

మహర్షిరోషై రావిష్టం నితగ మాహవజృమ్బితమ్‌ lప్రక్షేపాద్యస్య ముహ్యన్తిలోకా స్సస్థాణుజజ్గమాః. 43

క్రవ్యాదానిచ భూతాని తృప్తిం యాన్తి మహామృథే l తదప్రతిమకర్మాణం సమానం సూర్యవర్చసా. 44

చక్రముద్యమ్య సమరే కోపదీప్తో గదాధర:l స ముష్ణన్దానవం తేజ స్సమరే స్వేన తేజసా. 45

చిచ్చేద బాహూంశ్చక్రేణ శ్రీధరః కాలనేమినః l తచ్చ వక్త్రశతం ఘోరం సాగ్నిపూర్ణట్టహాసివై. 46

తస్య దైత్యసగ చక్రేణ ప్రమమాథ బలాద్దరిః l స చ్చిన్నబాహుర్విశిరా న ప్రాకమ్పత దానవః. 47

కబన్దో7వస్థిత స్సజ్ఖ్యే విశాఖ ఇవ పాదపః l సంవితతగ మహాపక్షౌ వాయో ః కృత్వా సమ ఞ్జవమ్‌. 48

ఉరసా పాతయామా సగరుడుః కాలనేమినమ్‌ l స తస్య దేహో మిముఖో విబాహుశచ పరిభ్రమ9. 49

నిపపాత దివం త్యక్త్వా క్షోభయ న్తరణీతలమl తస్మిన్నిపతితే దైత్యే దేవా స్సర్షిగణా స్తథా. 50

సాధుసాధ్వితి వైకుణ్ఠం సమేతా ః ప్రతగపూజయ9 l

అతని భుజములు దశదిశలనిండ వ్యాపించుచు వృద్ధనందెను. ప్రదిశలను దిశలను భూమ్యంతరిక్షములను కూడ కేశవుడు తన మూర్తి తో నింపివేసెను. మరల ఒక మారు లోకములను తన తేజస్సుతో అక్రమింప గోరువాడువలె అతడు వృద్దినందెను. అసురేంద్రుల భయపెట్టుటకై వర్దిల్లుచున్న మధుసూదనుని చూచి అంతరిక్షమందుండి ఋషులునుగంధర్వులునుఅతనిని స్తుతించిరి. శ్రీధరుడు గదాధరుడునగు నారాయణడు తన పాదములతో భుమినాక్రమించి బాహువులతో దిక్కులాక్రమించి సూర్యకిరణ సమతేజోవంతమును వేయి అరలు కలదియు శత్రునాశకమును దీప్తాగ్నిసమానమును ఘోరమును అయియు చూచుటకు ఇంపుగొలుపుచుండుటచే సుదర్శనమను పేరుకలదియు తన అంచులందు బంగారు రేణువుల పూతక దియు నాభియందు (నడుమభాగమునందు ) వజ్రముకలదియు భయజనకమును దానవులనుండి కలగిన మేదస్సు(మెదడు కాదు) ఎముకలు మజ్జరక్తము - నీటితో తడిసినదియు అయుధములతో సాటిలేనిదియు వాడియగు అంచులతో ఏర్పడిన మండలాకారము కలదియు పూలదండల మాలికలతో వ్యాప్తమును (నారాయణుని) సంకల్పా నుసారము పోవునదియు కామరూపమును సయంభూ బ్రహ్మ స్వయముగా సృష్టించినదియు సర్వదేవశత్రువులకునుభయప్రదమును మహర్షుల రోషమును ప్రవేశించినదియు సర్వదా దేవదానవ యుద్దములందు విజృంభించునదియు తను విసరి నంతమాత్రమున స్థావర చర భూతములకుబుద్దిమోహము కలిగించునదియు మహాయుద్దములందు మాంసాహారి ప్రాణులకును భూతములకును తృప్తికలిగించునదియు సాటిలేని పనులు నెరవేర్చునదియు సూర్యసమాన వర్చశ్శాలియు అగుచక్రము నైత్తి తన తేజముతోనే దానవుల తేజస్సులను హరించుచు కోపదీప్తుడయి దానితో కాలనేమి దానవుని బాహువులను ఛేదించెను. హరి ఆచక్రముతోనే భయంకరములును అగ్నితో నిండినవై మండుచున్నట్లు అట్టహాసము చేయుచున్నవియుఅగు ఆ దానవుని నూరుముఖములను (శిరములను) మథించెను (నరకెను.) కాని తలలును భుజములునుతెగినను ఆ దానవుడుచలించలేదు. కొమ్మలు తెగిన చెట్టువలె వాని మొండెమట్లే యుండెను. అంతట గరుడుడువాయుసమాన వేగముతో వచ్చి తన మహాపక్షములనువిప్పి వచ్చి తన పక్షముతో కాలనేమిని పడగొట్టెను. బాహువులును ముఖములును లేనివాని శరీరము అపుడు అంతరిక్షమును విడిచి భూతలమును కలవరపెట్టుచు నేలబడెను. అదైత్యుడు పడగానే దేవతలునుఋషులును 'సాధు సాధు' అనుచు ఒక్కుమ్మడిగా వైకుంఠుని తమ వాక్కులతో పొగడి పూజించిరి.

అపరే యేతువై దైత్యా యుద్దే దృష్టపంపా కమాః. 51

తే సర్వే బాహుభి ర్వ్యాప్తా న శేకు శ్చలితుం రణ l కాంశ్చి త్కేశేషు జగ్రాహ కాంశ్చి త్కణ్ఠష్వపీడయత్‌.

చకర్త కస్యచిదన్వక్త్రం మధ్యే7 గృహ్ణాదథాపరమ్‌ l తే గదాచక్రనిర్దగ్దా గతసత్త్వా గతాసవః.53

గగనాద్బ్రష్టసర్వాజ్గా నిపేతుర్దరణీతలే l తేషు సర్వేషు దైత్యేషు హతేషు పురుషోత్తమః. 54

తుస్థౌ శక్రప్రియం కృత్వా కృతకర్మా గదాధరః l తస్మిన్విమర్దే నిర్వాత్తే సజ్గ్రామే తారకామయే. 55

తందేశమాజగామాశు బ్రహ్మా లోకపితామహ ః l సర్వైర్బ్రహ్మర్షిభి స్సార్దం గన్దర్వై శ్చాప్సరోగణౖః.

దేవ దేవో హరిందేవం పూజయన్వాక్యమబ్రవీత్‌ l కాలనేమివధానన్తరం బ్రహ్మాదికాతవిష్ణుస్తుతిః.

బ్రహ్మా : కృతం దేవ మహత్‌ కర్మ సురాణాం శల్య ముద్దృతమ. 57

వధేనానేన దైత్యానాం వయంచ పరితోషితాః l యో7యం త్వయా హతో విష్ణో కాలనేమి ర్మహాసురః. 58

త్వమేక్యో7స్య రణ హన్తా నాన్యః ; కశ్చనవిద్ణ్యతే l ఏష దేవాన్పరిభవన్లోకాంశ్చ సచరాచరా9. 59

ఋషీణాం కధనం కాత్వా మామపి ప్రతిగర్జతి l తదనేన దవాగ్య్రేణ పరితుష్టో7స్యి కర్మణా. 60

యదయం కాలకల్పస్తే కాలనేమి ర్నిపాతితః l తదాగచ్చస్వభద్రం తే గచ్చామ దివ ముత్తమమ్‌. 61

బ్రహ్మర్ష యస్త్వాం తత్రస్థాః ప్రతీక్షన్తే సదోగతాఃl కిఞ్చాహం తవ దాస్యామి వరం వరయతాం వర . 62

సురేష్వపి చ దైత్యేషు వరాణాం వరదో భవా9 l నిర్యాతయైత త్త్రైలోక్యం స్పీతం నిపాతకణ్డకమ. 63

అస్మిన్నేవ మృథే విష్ణో శక్రాయ సుమహాత్మనే l మత్స్య ః : ఏవ ముక్తో భగవతా బ్రహ్మణా హరిరవ్యముః . 64

é దేవాఞ్చక్రముఖా స్త్సర్వా సువాచ శుభయా గిరా l

అంతవరకును యుద్దమన తమతమ పరాక్రమము చూసిన దైత్యులందరు ను నారాయణుని బాహువులు తమపై క్రమ్ముకొనగా రణమున కదలనైన లేకపోయిరి. విష్ణువు కొందరను చెవులు పట్టియు బాధించెను. ఒకని ముఖమును నరకెను . ఇంకొకని నడుము పట్టివేసెను. ఇట్లు వారందరును చక్రముతో గదతోను నిర్దగ్దులయి బలము తరిగి ప్రాణములు పోయి గగనము నుండి తమ దేహములు జారిపోగా ధరణీతలముపై పడిరి . ఇట్లా దైత్యులందరును హతులుకాగా గదాధరుడగు పురుషోత్తముడు ఇంద్ర ప్రీతి కలిగించి కృతకృత్యుడై (తన పని తానుచేసి ) రణరంగమును నిలిచెను.

ఇట్లు ఆ తారకామయమను యుద్దము ముగియగానే లోక పితామహుడగు బ్రహ్మ బ్రహ్మర్షి గంధర్వాప్సరో గణములతో కూడ అచటకి వచ్చెను. అతడు ఆ దేవదేవుడగు హరిని పూజిం (సుత్తిం ) చుచు ఈ వాక్యము పలికెను: దేవా ! ఈ దానవ వధతో నీవు మహాకార్యము నెరవేర్చితివి. దేవతల హృదయమునుండి శల్యము పెకలించినట్లయినది. మేమును సంతసించితిమి. నీవు చంపిన ఈ కాలనేమిని చంపగలవాడు నీవు తప్పమరి ఎవ్వరును లేరు. వీడు సచరాచర లోకముల నవమానపరచుచు బాదించుచు ఎవరిని లెక్క పెట్టక ఋషులకు నాశమునువ్యథనుకలిగించి నామీద కూడ విజృంభించి గర్జించుచున్నాడు. వాడు అట్టివాడు కావునను నీవు అంతటి వానిని చంపితివి కావునను నీవు చేసిన మహాకార్యముతో నేను పరితుష్టి చెందినాను. కాలునితో(కాల పురుషునితోను) సమానుడగు కాలనేమి మరణించినాడు; కావున మనమిక ఉత్తమమగుద్యులోకమునకు పోవుదము; లోకక్షేమమునకు గాను నీకును శుభముగుగాక!పూజ్యుడగు భగవన్‌ ! అచ్చట ద్యులోకమునందు (అందునను బ్రహ్మలోకమున ) సదస్సు (మునులుఋషులు మొదలగువారు సమావిష్టులగు తావు) నందు ఉన్న బ్రహ్మర్షులు నీకై వేచియున్నారు. మరియు ఒక విషయము; వరములను కోరువారలలో ఉత్తముడవు నీవు; (ఏలయన నీవు వామనావతారమునందు వలె ఎవరినైనఏదయిన వేడినను లోకకళ్యాణము కొరకే యాచింతువు.)దేవతలకును దానవులకునువరమునిచ్చువాడవుకూడ నేవే ; ఇట్టి నీకు నేను కూడ వరమీయ దలచియు ఏమీయగలను? ఇపుడిట్లు నిష్కంటకమయి సర్వ సంవత్సమృద్ధమగుఈ త్రైలోక్యమును సుమహాత్మడగు ఇంద్రునకు ఈ యుద్దరంగ మందే అప్పగించుము. అని ఇట్లు భగవానుడగు బ్రహ్మ పలుకగా అవ్యయుడగు హరి ఇంద్రాది దేవతలనందరనుద్దేశించి శుభ వాక్కుతో ఇట్లు పలికెను:

శ్రీవిష్ణుః: శ్రూయతాం త్రిదశాస్సర్వే యావన్తో7త్ర సమాగతాః. 65

శ్రవణావహితైః శ్రోత్రైః పురస్కృత్య పురన్దరమ్‌ l అస్యభి స్సమరే సర్వే కాలనేమిముఖా హతాః. 66

యామ్యాం యమః పాలయతా ముత్తరాంచ ధనాదిపః l ఋక్షైస్సహ యథాయోగంగచ్ఛతామపి చన్ద్రమాః. 68

విరోచనశ్చ దైత్యేశ స్స్వర్బానుశచ మహాబలః l స్వాం దిశం భజతాం శక్రో దిశంవరుణ ఏవచ. 69

అబ్దం ఋతుముఖే సూర్యో భజతా మయనై స్సహ l ఆజ్యభాగాః ప్రవర్తన్తాం సదసై#్య రభిపూజితాః. 70

హూయన్తామగ్నయో విపై#్ర ర్వేదదృష్టేన కర్మణా l దేవాశ్చ బలిహోమేన స్వాధ్యాయేన మహర్షయః. 71

శ్రాద్దేన పితరశ్చైవ తృప్తిం యాస్తు యథాసుఖమ్‌ l వాయుశ్చ వాయుమార్గస్థస్త్రిధా దీప్యతుపావకః 72

త్రీంస్తు వర్ణాంశ్చ లోకాంస్త్రీం స్తర్పయాం శ్చాత్మజై ర్గుణః l క్రతవస్స మ్ప్రవర్తన్తాందీక్షణీయైర్ద్విజాతిభిః. 73

దక్షిణ శ్చోపపాద్యన్తాంయాజ్ఞికేభ్యః పృథక్పృథక్‌ l గాశ్చసూర్యోరసాన్త్సోమో వాయుః ప్రాణాంశ్చ ప్రాణిషు. 74

తర్పయన్తః ప్రవర్తన్తాం మన్త్రైస్సర్వై స్సుకర్మభిః l యథావదానుపూర్వ్యేణ మహేన్ద్రమలయోద్బవాః 75

త్రైలోక్యమాతరస్సర్వా స్సముద్రంయాన్తు సిన్దవః l దైత్యేభ్య స్త్యజ్యతాం భీశ్చ శాన్తిం వ్రజత దేవతః.

స్వస్తివో7స్తు గమిష్యామి బ్రహ్మలోకంసనాతనమ్‌ l స్వగృహే స్వర్గలొకే వా సజ్గ్రామే వా విశేషతః. 77

విస్రమ్బెహి నకర్తవ్యో నిత్యంక్షుద్రా హిదానవా ః l ఛిద్రేషు ప్రహరన్త్యేతే న తేషాం సంస్థితి ర్ద్రువా. 78

సౌమ్యానాం ఋజుభావానాంభవతామార్జవం ధనమ్‌ l శ్రీమత్స్యః ; ఏవముక్త్వా సురగణా న్విష్ణు స్సత్యపరాక్రమః. 79

జగామ బ్రహ్మణా సార్థం బ్రహ్మలోకం మహాయశాః l ఏతదాశ్చర్య మభవత్సజ్గ్రామే తారకామయే. 80

దానవానాంచ విష్ణోశ్చ యన్మాం త్వం పరిపృష్టవా 9. 80u

ఇతి శ్రీమత్సమహాపురాణ దేవదానవసజ్గ్రామే శ్రీ విష్ణుకృతకాలనేమివధో నామ

సప్తస ప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

ఇచ్చట కూడియున్న సర్వదేవతలారా! ఇంద్రుడు ప్రధానుడుగా మీరందరునువినుటకు అవహితములగు చెవులతో సరిగ వినుడు. మేము కాలనేమి ప్రభృతి దానవులనందరు సంహరించితిమి. వారందరును విక్రమవంతులును ఇంద్రునికంటె గొప్పవారును; ఈ మహా సంగ్రామమందు తప్పించుకొనినవారు దైత్యేశుడగు విరోచనుడను మహా బలుడగు స్వర్భానుడు (రాహువు) నుఈ ఇద్దరుమాత్రమే ; ఇంద్రయమ వరుణ కుభేరులుతమతమ దిక్కులకు పోయి వానిని పాలింతురుగాక! నక్షత్రముల అమరికతో కూడి చంద్రుడును పోయి యథాకాల యోగముగ వానితో వర్తల్లుగాక! సూర్యుడు ఋతువులతో అరంభించుచు అయనములతో కూడ సంవత్సరమునాశ్రయించియుండుగాక! (మూర్తుడగు రవికి అముర్తమగు సంవత్సరమును దాని అవరువములగు కాలపరిమాణ విశేషములును అత్మ -తదంశ భుత-తత్త్వములు) సదస్సులు (యజ్ఞశాలయందలి ఋత్విక్కులు) మంత్రములతో అభిపూజించి వేల్చు హవిస్సులు ఎప్పటివలె ప్రవర్తిల్లుగాక! వేదమునందుకనబడల విహితకర్మవిధానానుసారమువిప్రులు అగ్నులందు వేల్తురుగాక! వాయువు తన సప్తమార్గములందునిలిచి ప్రవర్తించుగాక !తనకు స్వాభావికములగుసత్త్వరజస్తమోగుణత్రయముతో కూడి వానికి ప్రతీకములగు శుక్ల రక్త కృష్ణ వర్ణత్రయముతో కూడి వెలుగుచు అగ్ని ఆమూడు వర్ణములనుమూడు లోకములనుకూడ తృప్తి నందించుగాక! తనకు కస్వాభావికములగు సత్త్వరజస్తమె%ాగుణత్రయముతో కూడి వానికి ప్రతీకములగు శుక్ల రక్తకృష్ణ వర్ణత్రయముతో కూడి వెలుగుచు అగ్నిఅముడు వర్ణములను మూడు లోకములనుకూడ తృప్తి నందించుగాక! (ఏలయన సద్బ్రాహ్మణగృహస్థులకుగల జీవన వృత్తులలో ముఖ్యమయినది యాజనము-ఆదివారికి లభించనిచో వారి జీవనము ప్రతిబద్దమగును. (రవి గోవులను (అవులవంటి పశువులు- గ్రహములు - తేజఃకిరణములు - వేదాత్మక వాక్కు - అవియన్నియు గోశబ్దమునకు అర్థముగా ఇచట చెప్పకొనవలయను. ) చంద్రుడు రసద్రవ్యములను వాయువు ప్రాణుల ప్రాణములను తమతమ విషయమునందు వేదములచే చెప్పబడిన మంత్రార్థానుసారము ప్రవర్తిల్లు సుకర్మములకు ఫలరూపముగా తృప్తినందింతురుగాక! మహేంద్ర మలయాది పర్వతములనుండి ప్రభవించిన త్రైలోక్య మాతృమూర్తులగు నదులన్నియు ఎప్పటివలె తమతమ క్రమముతో సముద్రమునకు పోవుగాక! దేవతలారా! మీరు దైత్యులనుండి భయములేక యుండుడు; శాంతిపొందుడు; మీకందరకును శుభమగుగాక! సనాతనమగు (శాశ్వతమగు) బ్రహ్మలోకమునకు పోవుచున్నాను; పోయివత్తను;ఒక ముఖ్య విషయము చెప్పుచున్నాను; స్వగృహమందేకానిండు; స్వర్గలోకమందే కానిండు; విశేషించి సంగ్రామరంగమందే కానిండు; మాకు ఏమి లెమ్మను నమ్మికతో నుండగూడదు; ఏలయన దానవు ఎల్లపుడు క్షుద్ర స్వభావులుగా నుందరు; ఛిత్రములందు (ఆవకాశముదొరకినప్పుడెల్ల- అవకాశము లభించిన ప్రతియొక చోట) దెబ్బతీయుదురు; వారు తిన్నగా నుండుట స్థిరమయినది కాదు; (వారి చిత్త వృత్తి అస్థిరుయినది.) మీరు అందరు సౌమ్యులు; ఋజ (అపక్ర) భావులు; ఇట్టి మీకు అర్జవము (ఋజుత్వము- కపటములేని వర్తనము) ధనము; అని ఇట్లు దేవతలతో పలికి మహా యశుడును సతగ పరాక్రముడును అగు విష్ణువు బ్రహ్మతో కూడి బ్రహ్మలోకమునకు పోయెను దానవులకునువిష్ణువునకును జరిగిన తారకామయమనుసంగ్రామమునందు జరిగిన ఆశ్చర్యము ఇది ; నీవు నన్నడిగిన విషయము నీకు ఇట్లు తెలిపితిని.

(గమనిక: ఈవృత్తాంతమునందలి కాలనేమి విషయ వర్ణనమంతయు వైదిక ధర్మమునకువిరుద్దముగా నడుచుచు ప్రకృతి ధర్మములను తమ వశముచేసికొని లోకకల్యాణము సాధింతుము. అను ఈనాటి వైజ్ఞానికులవంటి వారిని సూచించుచున్నదని అ భావనతో అధ్యయనము చేయవలయును; కాలనేమిన్‌ - కాలనియమిన్‌ - కాలదేశాత్మకమగు ప్రకృతిని వశీకరించి నిరుమించి తన అదుపులో ఉంచుకొనగోరువాడు.)

ఇది శ్రీమత్స్య మహాపురాణమున తారకామయమను దేవదానవ సంగ్రామమును

విష్ణుకృత కాలనేమి వధమను నూటడెబ్బది ఏడవ అధ్యాయము.

నారాయణనాభి వద్మోద్బవ వృత్తాంతము ముగిసినది.

Sri Matsya mahapuramu-2    Chapters