Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోనాశీత్యుత్తరశతతమోధ్యాయః.

వారాణసీమాహాత్మ్యప్రారమ్భః.

ఋషయః : శ్రుతో న్దకవధ స్సుత యథావ త్త్వదుదీరితః |

వారాణస్యాస్తు మహాత్మ్యం శ్రోతుమిచ్ఛామ సామ్ప్రతమ్‌ 1

భగవాన్పిజ్గళః కేన గణత్వం స(గణశత్వ) ముపాగతః | అన్నదత్వంచ సమ్ప్రాప్తో వారాణాస్యాం మహాద్యుతిః.

క్షేత్రపాలః కథం జాతః ప్రియత్వంచ కథం గతః | ఏత దిచ్ఛామ కథితం శ్రోతుం బ్రహ్మసుత త్వయా.

సుతః శృణుధ్వం వై యథా లేభే గణశత్వంచ పిజ్గళం |

అన్నదత్వం చ లోకానాం స్థానం వారాణసీం మహాత్‌. 4

పూర్ణభద్రసుత శ్శ్రీమా నాసీ ద్యక్షః ప్రతాపవా9 | హరికేశ ఇతి ఖ్యాతో బ్రాహ్మణో ధార్మకశ్చ హ. 5

తస్య జన్మ ప్రభృత్యేవ శ##ర్వే భక్తి రనుత్తమా | సదాసీ త్తన్నమస్కార స్తన్నిష్ఠ స్తత్పరాయణః. 6

ఆసీనశ్చ శయానశ్చ గచ్ఛం స్తిష్ఠ న్ననువ్రజ9 | భుఞ్జానోథ పిబన్వాపి రుద్రమేవాన్వచిన్తయత్‌. 7

తమేవంయుక్తమనసం పూర్ణభద్రః పితాబ్రవీత్‌ |

న త్వాం పుత్త్ర మహం మన్యే దుర్జాతో యస్త్వ మన్యథా. 8

న హి యక్షకులీనానా మేతద్వృత్తం భవత్యుత | గుహ్యకా బత యూయం వై స్వభావక్రూరచేతసః. 9

క్రవ్యాదాశ్చైవ కింభక్షా హింసాశీలాశ్చ పుత్త్రక | మైవం కార్షీ ర్న తే వృత్తి రేవం దృష్టా మహాత్మనా. 10

స్వయమ్భువా యథాదిష్టా త్యక్తవ్యా యది నో భ##వేత్‌ | ఆశ్రమాన్తరజం కర్మ న కుర్యు ర్గృహిణస్తు తత్‌.

హిత్వా మనుష్యభావంచ కర్మభి ర్వివిధై శ్చర | యత్త్వ మేవం విమార్గసస్థో మనుష్యా జ్ఞాత ఏవ చ. 12

అథవా ద్వివిధం తేషాం కర్మ తజ్జాతిసంశ్రయమ్‌ | మయాపి విహితం పశ్య కర్మైత న్నాత్ర సంశయః. 13

నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

వారాణసీ మహాత్మ్యము

పింగళుడు గణశుడు - అన్నదాత - క్షేత్రపాలకుడు- అగుట

ఋషులు నూతుని ఇట్లడిగిరి: సూతా ! నీవు చెప్పగా అంధకవధ వృత్తాంతమును వింటిమి. ఇపుడు వారాణసీ వృత్తాంతమును వినగోరుచున్నాము. భగవానుడగు పింగళుడు ఏ యోగ్యతచే గణములలోనివాడు అయ్యెను? ఆ మహాతేజశ్శాలి ఈ వారాణసియందు అన్నదాతయు ఆ క్షేత్రమునకు పాలకుడును ఎట్లు అయ్యెను? శివునకు ప్రియుడె ట్లయ్యెను? బ్రహ్మసుతా ! ఇది నీవు చెప్పగా వినవలయునని మాకు కుతూహలముగా నున్నది. అన సూతు డిట్లు చెప్పసాగెను.

పింగళుడు గణశు డెట్లయ్యెనో అన్నదాత ఎట్లయ్యోనో తెలిపెదను వినుడు? లోకములలో వారాణసి పూజ్యమగు స్థానము; (ఇది ఇట్లుండ) పూర్ణభద్రుని కుమారుడు పూజ్యుడు వ్రతాపవంతుడు నగు హరికేశుడు అను యక్షు డొకడుండెను. అతడు బ్రాహ్మణుడు (వేదో క్త విషయముల నెరగి వాటియందు పూజ్యతా భావము కలవాడు ) ధర్మానుష్ఠాన పరుడు; అతనికి పుట్టుక మొదలు శివునియందు అత్యుత్తమభక్తి ఉండెను. అతడు ఎప్పుడను అతనినే నమస్కరించును. అతనియందు చిత్త ముంచును; అతడే తనకు గమ్య మనుకొనును; కూరుచుండియు పోవుచుండియు పండుకొనియు నిలుచుండియు ఒకరి వెనుక పోవుచుండయు తినుచుండియు త్రావుచుండియు రుద్రునే అనుచింతించుచుండును; ఇట్లు సమాహిత మనస్సుకల అతనితో తండ్రియగు పూర్ణభద్రుడిట్లనెను; నీవు నా కుమారుడవని నాకు తోచుట లేదు; నీవు మరి యొక విధముగా తప్పుగా జన్మించితివి. ఏలయన యక్ష జాతీయులకు ఈ నడువడియుండనే ఉండదు సుమా! గుహ్యకులగు(యక్షులగు) మీరు (మనము ) స్వభావముచే క్రూరచిత్తులుగా నుందురు(ము); యక్షులు మాంసాహారులు నీచాహారులు హింసాశీలురు నగుదురు, నీవు ఇట్లు చేయకుము; ఇది నీకు తగిన నడువడి కాదు; మహాత్మడు స్వయం భూ ప్రజాపతి మాన కేది యాదేశించెనో దానిని విడువదగదు? మన ధర్మమేదియో అది గ్రాహ్యము; గృహస్థు లగువారు మరియొక (బ్రహ్మచర్య వానప్రస్థ సంన్యాసములవంటి) ఆశ్రమ విధులను పాటించరు కదా! అట్లే మనమును మన జాతి ధర్మమును విడువరాదు; కనుక నీ వీ మనుష్య స్వభావమును విడిచి మనకు తగిన వివిధ కర్మల నాచరించుము; ఇట్లు నీవు (వేరగు)మార్గమునందు ఉన్నావనిన నీవు మనుష్యుని వలన జన్మించియుందువు; నేను కూడా ఆయా కర్మల నాచరించుచున్న మాట నిజమే; కర్మము స్వజాతీయము పరజాతీయమునని రెండు విధములు; మనుష్యు లాచరించు కర్మములు వారి జాతికి విహితములు; నేను మన జాతికి విహితములగు కర్మము లాచరించుచున్నాను; కాని నీవు నీ జాతిధర్మము విడిచి మనుష్యుల వలె ఆచరించుచున్నావు; ఇది మనకు తదగు.

సూతః : స ఏవ ముక్త్వా తం పుత్త్రం పూర్ణభద్రః ప్రతాపవా9 |

ఉవాచ నిష్ఠురం క్షిప్రం గచ్ఛ పుత్త్ర యథేఛ్ఛసి. 14

తత స్స నిర్గత స్త్యక్త్వా గృహం సమ్బన్దిన స్తథా | వారాణసీం సమాసాద్య తపస్తేపే సుదుశ్చరమ్‌. 15

స్థాణుభూతో హ్యనిమిష శ్శుష్కకాష్ఠోపలోపమః | సన్నియమ్యేన్ద్రియగ్రామ మవా క్తిష్ఠతి నిశ్చలః. 16

అథ తసై#్యవ మనిశ న్తత్పరస్య తదాశిషః | సహస్రమేకం వర్షాణాం దివ్యమప్యభ్యవర్తత. 17

వల్మీకేన సమాక్రాన్తో భక్ష్యమాణః పిపీలికైః | వజ్రసూచీముఖై స్తీక్‌ష్ణ ర్విధ్యమాన స్తథైవచ. 18

నిర్మాంసరుధిరత్వక్చ కున్దశ##జ్ఖేన్దుసప్రభః | అస్థిశేషోభవచ్ఛర్వం దేవం వై చిన్తయన్నపి 19

ఏతస్మిన్నస్తరే దేవీ విజ్ఞావయతి శజ్కరమ్‌ | దేవీ: ఉద్యానం పునరేవేదం ద్రష్టు మిచ్ఛామి సర్వదా. 20

క్షేత్రస్య చైవ మాహాత్మ్యం శ్రోతుం కౌతూహలం హి మే |

యతశ్చ ప్రియమేత త్తే తదస్య ఫలముత్తమమ్‌. 21

ఇతి విజ్ఞాపితో దేవః పార్యత్యా పరమేశ్వరః | శర్వః పృష్టో యథాతథ్యా మాఖ్యాతు ముపచక్రమే. 22

నిర్జగామచ దేవేశః పార్వత్యా సహ శజ్కరః | ఉద్యానం దర్శయామాస దేవ్యా దేవః పినాకధృక్‌. 23

ప్రతాపవంతుడగు పూర్ణభద్రుడు ఇట్లు పలికి అనంతరము నిష్ఠురముగా ''పుత్త్రా! త్వరగా వెడలిపొమ్ము; నీ ఇచ్చ వచ్చినచోటికి పోవచ్చును?'' అనెను. అంతట అతడు ఇట్లు చుట్టములను విడిచి బయలు వెడలి వారాణసి చేరి అట దుశ్చరతప మాచరించెను. అతడు మొద్దు అయ్యెను; ఎండిన కొయ్యవలె రాతివలె నయ్యెను; రెప్పవాల్చ కుండెను; ఇంద్రియ నిగ్రహముతో మౌనముతో నిశ్చలుడై యుండెను. ఇట్లతడు అనిశము శివపరుడయి శివునే కోరుచు వేయి దివ్యవత్సరములు గడపెను. అతనిపై పుట్టలు క్రమ్మెను; అతనిని చెద పురుగులు తినెను. వాడి ముక్ములుగల వజ్రసూచీ ముఖములను (వజ్రపు సూదివంటి ముక్కుగల) పురుగులు కుట్టెను. అతని శరీరము మాంసము రక్తము లేక చర్మము మాత్రము మిగిలి శంఖములవలె చంద్రుడువలె తెల్లగ నయ్యెను; శరీరము అంతయు అస్థిశేషమయ్యెను. ఐన నతడు దేవుడని ధ్యానించుచునే ఉండెను.

ఈ నడుమ కాలములో పార్వతీదేవి శంకరునితో '' ఈ (కనబడుచున్న) ఉద్యానమును ఎప్పుడును చూచుచునే ఉండవలెననియు ఈ వారాణసీ క్షేత్ర మహాత్మ్యము వినవలయుననియు నాకు కుతూహలము; నీ కిది అత్యంత ప్రియము అగుటను బట్టి ఈ క్షేత్రము ఉత్తమ ఫలము నిచ్చునదయియుండవలయును. ఇట్టి ఈ వారాణసీ మహిమము తెలియ వేడెదను.'' అని విజ్ఞప్తి చేసెను. హరుడు ప్రశ్నానుగుణముగా వారణసీ మహిమ మామెకు చెప్పదలచెను. అందులకై ముందుగా దేవేశుడా శంకరుడు దేవితో కలిసి బయలుదేరి ఆ పినాకధారి దేవి కుద్యానము చూపుచు ఇట్లు వర్ణించసాగెను.

దేవ్యా సహ దేవదేవస్య ఉద్యానగమనం తద్వర్ణనం చ.

దేవేదేవః ప్రపుల్లనానావిధగుల్మశోభితతం లతాప్రతానావనతం మనోహరమ్‌ |

విరూఢపుషై#్పః పరితః ప్రియజ్గుభి స్సుపుష్పితైః కణ్టకితైశ్చ కేతకైః. 24

తమాలగుల్మై ర్నిచితం సుగన్ధిభి స్సకర్ణికారై ర్విపులై శ్చ సర్వశః |

అశోకపున్నాగవరైవ్చ పుష్పితై ర్ద్విరేఫమాలకులపుష్పసఞ్చయైః. 25

క్వచిత్ప్రపుల్లామ్బుజరేణురూషితై ర్విహజ్గమై శ్చారుకలప్రణాదిభిః|

ప్రమత్తదాత్యూహరుతైశ్చ వల్గుభిః క్వచిచ్ఛ మాయూరగణౖశ్చ సేవితమ్‌. 26

క్వచిచ్చ చక్రాజ్గరుతైః ప్రణాదితం క్వచిచ్చ కాదమ్బకదమ్బకై ర్యుతమ్‌ |

క్వచిచ్చ కారణ్డవనాదనాదితం క్వచిచ్చ మత్తళికులాకులీకృతమ్‌. 27

మదాకులాభి స్త్వమరాజ్గనాభి ర్ని షేవితం చారుసుగన్ధిపుషై#్పః |

క్వచి త్సుపుషై#్ప స్సహకారవృక్షై ర్లతోపగూఢై స్తిలకైశ్చ వృక్షకైః. 28

ప్రగీతవిద్యాధరసిద్ధచారణం ప్రనృత్యగీతానుగతాప్పరోగమణమ్‌ |

ప్రహృష్టనానావిధపక్షిసేవితం ప్రమత్తహరీతకులోపనాదితమ్‌. 29

మృగేన్ద్రనాదకులసత్త్వమానసైః క్వచిత్క్వచిద్ద్వన్ద్వకదమ్బకై ర్మృగైః |

ప్రపుల్లనానావిధచారుపజ్కజై స్సపరస్తడాగై రుపశోభితం క్వచిత్‌. 30

నిబిడనిచులనీడం నీలకణ్ఠాభిరామం మదముదితవిహజ్గం భృజ్గనాదాభిరామమ్‌ |

కుసుమితతరుశాఖానీలమ త్తద్విరేఫం నవకిసలయశోభాశోభితప్రా న్తశాఖమ్‌ 31

క్వచిచ్చ దన్తిక్షతచారువీరుధం క్వచిత్లతాలిజ్గితచారువృక్షకమ్‌ |

క్వచిద్విలాసాలసగామిబర్హిణం నిషేవితం కిమ్పురుషవ్రజైః క్వచిత్‌. 32

పారావతధ్వనినికుజితచారుశృజ్గై రభ్రజ్కషై స్సితమనోహరచారురూపైః |

ఆకీర్ణపుష్పనికరప్రవిము క్తహాసై ర్విభ్రాజితం త్రిదశ##దేవకులై రనేకైః. 33

పుల్లోత్కరైః ఫలసహస్రవితానయుక్తై స్తోయావహై స్త మనోశోభితదేవమార్గమ్‌ |

మార్గాన్తరాగళితపుష్పవిచిత్రభ క్తిసమ్బద్ధగుల్మవిటపై ర్విహగై రుపేతమ్‌. 34

శృజ్గాగ్రై ర్నీలపుషై#్పః స్తబక భరనత ప్రా న్తశాఖై రశోకైర్మత్తాళిప్రాన్తగీత శ్రుతిపురజననైర్భాషితాన్తర్మనోజ్ఞైః |

దేవీ ! చూడుము; ఈ యుద్యానము మిగుల బాగుల వికసించిన తీగల గుబురులతోను పొదలతోను శోభితము; తీగల సమూహముతో వ్యాప్తము; ఇది బాగుగ పూలు పూచిన ప్రియంగు వృక్షములతోను చక్కగా పూచియు తమకు స్వాభావికమగుముండ్లతో కూడిన చెట్లతోను గగుర్పాటు చెందినదివలె మనోహరముగా నున్నది; మంచి వాసనల ఇచ్చు తమాలవన వాటితోను వృక్షపు గుబురులతోను విపులములగు కర్ణికారము (పచ్ఛగన్నేరు)లతోను పూచిన అశోకపున్నాగ వృక్షకములతోను వ్యాప్తమయియున్నది. ఇచటి పుష్ప సమూహములన్నియ తుమ్మెదల వరుసలతో కల్లోలితమయియున్నవి. విప్పారిన పద్మములు పుప్పొడితో నిండిన ఒడళ్ళు కలిగి అస్పష్టమయియు మనోహరమగు కూతలు కూయు ఇంపగు వివిధ పక్షలుఇట ఉన్నవి. మనోహరములును మిగుల మత్తిల్లినవియునగు దాత్యూహములు నల్లని కంఠముగల పక్షులు) అందమగు నెమళ్ళు ఇంపుగ కూయు చక్రవాకములు కాదంబముల (ఒక విధమగు హంసలు ) నీటి కాకులు చక్కని సువాసన లీనుపూలు అలంకరించుకొన్న దేవతాస్త్రీలు పూచిన తీయ మామిడి చెట్లు వాటికి అల్లుకొన్న తీవలు తిలక వృక్షములు బిగ్గరగ ఇంపుగా పాడు విద్యాధర సిద్ధచారుణులు ఆ పాటలకు సరిగదా నృత్యమొనరించు అప్సరసలు మిగులు హర్షముతో ఆడుకొను నానావిధ పక్షులు మిగుల మత్తిల్లిన హారీత పక్షులు సింహముల గర్జాధ్వనులు విని కలవరపడు వనమృగములు తమతమ ప్రియులతో ప్రియురాండ్రతో జతలుగా తిరుగు జింకలు బాగుగ వికసించిన నానావిధములగు మనోహర పద్మములతో శోభించు సరస్సులు తటాకములు ఈ ఉద్యానమునకు అందమునిచ్చుచున్నవి. ఈ ఉద్యానము దట్టముగా ఉన్న ప్రబ్బలి చెట్లతో నీలమయి నెమిళ్ళతో మనోహరమయి మదమెక్కి సంతోషముతో ఉన్న పక్షుల గుంపుల కూతలతో ఇంపుగొలుపుచు పూచిన చెట్ల కొమ్మలందు మరుగయి ఉన్న మత్తిల్లిన తుమ్మెదలతో నిండి లేత చిగురాకుల శోభలతో శోభించు కొమ్మల రెమ్మల కలియున్నది. ఏనుగలచే త్రుంచబడిన అందమగు తీగలు పెనవేసినకొనిన చిరుచెట్ల ఒయ్యారపు నెమ్మది నడకలు నడుచు నెమిళ్ళు కలిగినదై ఈ వనము కింపురుషులు ఎల్లప్పుడును తన్నాశ్రయించుగా అందగించుచున్నది. దీనియందు దేవతాశ్రేష్ఠుల ఇండ్లును ఎన్నియో ఉన్నవి. వాని అందమగు శిఖరములందు పావురములు కూయుచున్నవి. ఆ ఇండ్లు ఆకాశమున ఒరయునంత ఎత్తయినవి. తెల్లనయి మనస్సునకు ఇంపుగొలుపు అందమగు రూపము కలవి; అంతటను వ్యాపించిన పుష్పరాశులు విపులమగు నవ్వుగా భాసించుచున్నవి. ఇచటి జలాశయములందు కలువలు వికసించి ఉన్నవి. ఈ సరస్సుల చుట్టును వేలకొది అగురు వృక్షములుండుటచే వాని కొమ్మలు పందిరివలె వానిపై క్రమ్మికనబడుచున్నవి. అందుచే ఇచటి ఆకాశమును కడు శోభించుచున్నది. చెట్ల వరుసల నడుమనున్న త్రోవలలో జారిపడి యున్న పూల వరుసలతో పలురీతుల పట్టికలు ఏర్పడి కనబడుచున్నవి. వాటిచే ఇచటి పొదలును చిరుచెట్లును అందముగా ఉన్నవి. ఇచటి పర్వతముల శిఖరముల కొనలయందలి అశోక వృక్షములు తమయందు మరుగుపడియున్న పూవులతో నిండి బరువగు పూలగుతులతో వంగిన రెమ్మలు కల అశోక వృక్షములు తమ పూలపై మూగు మత్లిల్లిన తుమ్మెదల గుంపుల గీతములతో చెవికింపు గొలుపుచు అందముచే కండ్ల కింపుగొలుపుచు మనోహరమయియున్నవి. ఈ శ్వేతశోక పుష్పములతోను పూచిన తిలక పుష్పములతోను రాత్రులందలి వెన్నెల ఏకమయి మిగుల తెల్లగ కనబడుచుండును. నీడలందు (చెట్ల సమీపమున) నిదురించి మేలుకని లేచి నిలుబడిన లేళ్ళు మెల్లగా వచ్చి దర్భల మొలకల కొనలను కొరుకుచున్నవి.

రాత్రౌ చన్ద్రస్య భాసా కుసుమితతిలకై రేకతాం సమ్ప్రయాతం చాయాసుప్త ప్రబుద్దస్థితహరిణకులా లుప్తదర్భాజ్కరాగ్రమ్‌ 35

హంసానాం పక్షపాతప్రచలితకమలస్వచ్ఛవిస్తీర్ణతోయం తోయానాం తీరజాని ప్రవికచకదళీవాటనృత్యన్మ

యూరమ్‌ | మాయూరైః పక్షచన్ద్రైః క్వచిదపి పతితై రఞతక్ష్మాప్రదేశం దేశే దేశే వికీర్ణప్రముదితవిలసన్మ త్తహారీతవృక్షమ్‌. 36

సారజ్గైః క్వచిదుపశోభిత ప్రదేశం సఞ్చన్నై ః కుసుమమయైః క్వచి ద్విచిత్రమ్‌ |

హృష్టాభిః క్వచిదపి కిన్నరాజ్గనాభిః క్షీబాభి ర్మధురసుగీతవృక్షఖణ్డమ్‌. 37

సంసృష్టైః క్వచిదుపలి ప్తకీర్ణపుషై#్ప రావాసైః పరివృతపాదపం మునీనామ్‌ |

ఆమూలోత్పలనిచితైః క్వచిద్వశాలై రుత్తుజ్గైః పనసమహాద్రుమై రూపేతమ్‌. 38

పుల్లాతిముక్తకలతాగృహలీనసిద్దం సిద్ధాజ్గనాకనకనూపురనాదరమ్యమ్‌ |

రమ్యం ప్రియజ్గుతరుమఞ్జరిస క్తభృజ్గం భృజ్గావళీసచలతామ్రకదమ్భపుష్పమ్‌. 39

పుష్పోత్కరానలవిఘూర్ణితపాతపాగ్ర మగ్రేసరై ర్బువి నివాతితవంశగుల్మమ్‌ |

గుల్మాన్తర ప్రభృతిలీనమృగీ సహస్రం సంముహ్యతాం తను భృతా మపవర్గదాతృ 40

చన్ద్రాంశుజాలధవళై స్తిలకై ర్మనోజ్ఞై స్సిన్దూరకుజ్కుమకుసుబ్భనిభై రశోకైః

చామీకరప్రతిసమైరథకర్ణికారై పుల్లారవిన్దరచితం సువిశాలశాఖైః. 41

క్వతిదఞ్జనచూర్ణభైః క్వచిదఞ్జన సన్నిభైః | క్విచత్కాఞ్చనసజ్కాశైః పుషై#్పరాచితభూతలమ్‌. 42

పున్నాగేషు ద్విజగణవితతం రక్తాశోక స్తబభరనమితమ్‌ |

రమ్యోపా న్తశ్రమహరపవనం పుల్లాబ్జేషు భ్రమరవిలసితమ్‌ (ఇదంభ్రమరవిలసితవృత్తమ్‌.) 43

సకలభువనభర్తా లోకనాధ స్తదానీం తుహినశికరిపుత్ర్యా సార్ధ మిష్టైర్గణశైః |

వివిధతరువిశాలం మత్తహృష్టాన్యపుష్ట ముపవనతరురమ్యం దర్శయామాస దేవ్యాః. 44

హంసల రెక్కల వినరులచే మిగులు కదలియాడుచున్న కమలములతో నిండి విశాలమును స్వచ్ఛమునునగు జలముకల సరస్సులు ఆ సరస్సుల తీరములందు మొలిచి పెరిగిన అరటి చెట్ల వరుసల నడుమ నృత్యము చేయు నెమిళ్ళు ఆటనట రాలిపడిన నెమిలి పంచెపు ఖంములతో వన్నెలు వన్నెలుగా కనవచ్చు ప్రదేశములు ఆయా ప్రదేశములందు వ్యాపించి మత్తిల్లి మిగుల సంతనమున ఆడు హారీత పక్షులు కలది ఈ ఉద్యానము. వ్రేళ్ళు తమకాశ్రయమొనర్చుకొని తావులతో నిండిన వన్నెలపూలతో కప్పువడిన చెట్ల గుబురుల నడుమ మత్తలయి హర్షముతో మధురముగా పాడు కిన్న రాంగనలతో ఇది మనోహరము; చక్కగ అలికి పూవులు వెదజల్లిన మునుల ఆవాస ప్రదేశములును ఆ ఆవాసముల పరి నరములందలి వృక్షములును చెట్ల వేళ్ళ మొదలు పండ్లతో నిండి విశాలములయి ఎత్తయిన పనస వృక్షములును ఇటనున్నవి; చూడుము. ఇందలి అతి ముక్తలతా గృహములందు సిద్ధులు (దేవజాతులు ) విహరించుచున్నారు. ఇందు సిద్ధ స్త్రీల బంగరుటందెల మనోహర నాదములు వినవచ్చుచున్నవి. మనోహర ప్రియంగు వృక్ష పుష్ప మంజరులందు తుమ్మెదలు మ్రోయుచు ఆడుచున్నవి. తమ్మెదల క్రీడలతో కడిమి పూలందముగ కనవచ్చుచున్నవి. పుష్పరాసులతో నిండిన వృక్షములు కొనలు గాలిచే అందముగ కదలుచున్న ఏనుగుల మందల నాయకులు (అగు పెద్ద ఏనుగులు) పడగొట్టిన వెదురు పొదలు-పొదలనడుమ దాగిన ఆడులేళ్ళు- కలది ఈ వనము; మోహవశులగు పాంచభూతిక దేహధారులును ఇట తపమొనరించినచో వారికి ముక్తి లభించును. చంద్ర కిరణములవలె తెల్లనయి ఇంపగు తిలక పుష్పములతో సిందూరము వలె కుంకుమ పూవులవలె కుసుమ పూలవలె ఉన్న రక్తాశోక పుష్పములతో బంగరువలె మెరయు కర్ణికార (పచ్చగన్నేరు) పుష్పులతో నిండిన ఆయా చెట్ల విశాలములగు కొమ్మలు విప్పారిన తెల్లని ఎర్రని పచ్చని తామర పూలతో రచింపబడిన వేమోయనునట్లు కనబడుచున్నవి; చూడము; వెండిరేకులవలె పగడములవలె బంగారు పూలవలె మెరయు పూవులతో ఇచటి నేలలు నిండియున్నవి. పున్నాగ వృక్షములందలి పక్షుల మందల కూతలతో నిండిన రక్తాశోకపు పూలగుత్తులతో వంగిన కొమ్మలు కలిగి మనోహరమలగు పరిసరములందు వీచుగాలి శ్రమహరము కాగా వికసించిన పద్మములపై ఆటలాడు తుమ్మదలతో ఈ వనమెంత యందముగనున్నదో చూడుము. అని ఇట్లు సకల భువననాథుడును లోక నాథుడును నగు పరమేశ్వరుడు అపుడు పార్వతితోను తనకు ప్రీతిపాత్రులగు గణశులతోను కూడి విహరించుచు వివిధ వృక్షములతో విశాలమయి మత్తిల్లి ఆనందముతోనున్న కోకిలలో నిండిన ఉపవన వృక్ష రామణీయకమును దేవికి చూపెను.

దేవి: ఉద్యానం దర్శితం దేవ శోభయా పరయా యుతమ్‌ |

క్షేత్రస్య తు గణా న్త్సర్వా న్పున ర్వక్తు మిహార్హసి. 45

అస్య క్షేత్రస్య మహాత్మ్య మవిముక్తస్య వై తథా | శ్రుత్వాపి హి న మే తృప్తి రతో భూయో వదస్వ మే.

దేవదేవః ఇదం గుహ్యతమం క్షేత్రం సదా వారాణసీ మమ |

సర్వేషామేవ జన్తూనాం హేతుర్మోక్షస్య సర్వదా. 47

అస్మి న్త్సిద్ధా స్సదా దేవి! మదీయవ్రతమాస్థితాః | నానాలిజ్గధరా నిత్మం మమ లోకాభికాజ్‌క్షణః. 48

అభ్యస్యన్తి పరం యోగం ముక్తాత్మానో జితేన్ద్రియాః | నానావృక్షసమాకీర్ణే నానావిహగనాదితే. 49

కమలోత్పలపుష్పాఢ్యే సరోభి స్సమలజ్కృతే | అప్సరోగణగన్థర్వై స్సదా సంసేవితే శుభే. 50

రోచతే మే సదా వాసో యేన కార్యేణ తచ్ఛృణు | మన్మనా మమ భక్తశ్చ మయి సర్వార్పితక్రియః. 51

యథా మోక్ష మిహాప్నోతి హ్యన్యత్ర న తథా క్విచత్‌ |

ఏతన్మమ పురం దివ్య ం గుహ్యాద్గుహ్యతమం మహత్‌. 52

బ్రహ్మాదయో విజానన్తి యేచ సిద్ధా ముముక్షవః | అతః ప్రియతమం క్షేత్రం తస్మాచ్చేహ రతి ర్మమ. 53

అవిముక్తం మయా తస్మాన్మోక్ష్యతే న కదాచన | మహేతేత్ర మిదం తస్మా దవిముక్త మిత స్మృతమ్‌. 54

నైమిషేచ కురుక్షేత్ర గజ్గాద్వారేచ పౌష్కరే | స్నానాత్సం సేవనాద్వాపి న మోక్షః ప్రాప్యతే యతః. 55

ఇహ సమ్ప్రాప్యతే యేన తత ఏత ద్విశిష్యతే | ప్రయోగేవా భ##వేన్మోక్ష ఇహవా మత్పరిగ్రహాత్‌. 56

ప్రయాగాదపి తీర్థాగ్ర్యా దిదమేవ మహ త్స్మృతమ్‌ |

అంతట దేవి ఈశ్వరునితో ఇట్లెనెను: దేవా ! పరమశోభాయుతమగు ఉద్యానమును చూపితివి; ఈ క్షేత్ర గుణమల నన్నిటిని మరల తెలుప వేడుచున్నాను. ఈ అవిముక్తక్షేత్ర మహాత్మ్యమును అట్లు ఎన్నిమారులు వినినను నాకు తృప్తియగుటలేదు. కావున మరల తెలుప ప్రార్థించుచున్నాను. అనగా మహాదేవుడనెనె: ఈ వారణసీ క్షేత్రము నాది; ఇది పరమ రహస్యమగునది; ఇది సర్వప్రాణులకును సదా మోక్షహేతువు; దేవీ! ఇందు నాలోకము కోరి నానా విధములగు నా చిహ్మముల దాల్చి శైవవ్రతమవలంబించిన వారెప్పుడును సిద్ధింనందుదురు; ఇంద్రియములను మనస్సును నిగ్రహించికొని వారు ఉత్తమయోగ సాధన చేయుచుందురు. నానావృక్ష వ్యాప్తము నానా పక్షి నాదయుతము కమల కువలయ పుష్పపూర్ణ నరోలంకృతము సదా అప్సరో గంధర్వగణ సేవితమునగు ఈ శుభ స్థానమునందు సదా నివాసము నాకు ఇష్టము; దీనికి హేతువు తెలిపెద వినుము; నాయందే మనస్సుంచి నా భక్తుడై సకల క్రియలను నాయందే అర్పించువాడు ఇచట ముక్తినందును; మరియొకచోట ఇట్టిది కాదు. ఇది నాది, పురములలో దివ్యమయినది; గుహ్యములగు వానిలోనెల్ల గుహ్యతమము; చాల గొప్పది; దీని తత్తవ్వము బ్రహ్మాది దేవతలును మముక్షువులగు సిద్ధులును మాత్రమే ఎరుగుదురు; ఈ చెప్పిన కారణముల చేతనే ఇది నాకు ప్రియతమ క్షేత్రము; దీనియందు నాకు ఆసక్తియు అధికము. నేను దీనిని ఎన్నడును విడువను; ఇది అంతటి మహాక్షేత్రము; అందుచేతనే దీనికి 'అవిముక్తము' (విడువబడనిది) అని పేరు; నైమిశ కురుక్షేత్ర గంగాద్వార పుష్కర తీర్థ క్షేత్రములందు స్నానమాడినను వానిని సేవించినను ముక్తి లభించదు; ఇచటి లభించును; కావుననే ఇది విశిష్టమయినది; నా సొంతములగుటచే ప్రయాగమునందు కాని ఈ వారాణసి యందు కాని విముక్తి లభించును; ప్రయాగము తీర్థశ్రేష్టమే; కాని ఇది అంతకంటెను గొప్పది.

జైగిషవ్యః పరాం సిద్ధిం యోగత స్సుమహాతపాః 57

అస్య క్షేత్రస్య మహాత్మ్యా ద్భక్త్యాచ మమ భావనాత్‌ | జైగిషవ్యో మహాశ్రేష్టో యోగినాం స్థాన మిష్యతే.

ధ్యాయత స్తత్ర మాం నిత్యం యోగాగ్ని ర్దీప్యతే భృశమ్‌ | కైవల్యం పరమం యాతో దేవానామపి దుర్లభమ్‌.

అవ్యక్తలిజ్గై ర్మునిభి స్సర్వసిద్ధాన్తవేదిభిః | ఇహ సమ్ప్రాప్యతే మోక్షో దుర్లభోన్యత్ర కర్హిచిత్‌. 60

తేభ్యశ్చాహం ప్రయాచ్ఛామి యోగైశ్వర్య మనుత్తమమ్‌ | ఆత్మనాచైవ సాయుజ్య మీప్సితం స్థానమేవచ. 61

కుబేరస్తు మహాయక్ష స్తథా శర్వార్పితక్రియః | క్షేత్రసంసేవనాదేవ గణశత్వ మవాప హ 62

సంవర్తో భవితా యశ్చ సోపి భక్తో మమైవ హి | ఇహైవారాధ్య మాం దేవి! సిద్ధిం యాస్యత్యనుత్తమామ్‌. 63

పరాశరసుతో యోగీ ఋషి ర్వ్యాసో మహాతపాః | ధర్మకర్తా భారతస్య సంస్థా వేదప్రవర్తకః. 64

రంస్యతే సోపి పద్మాక్షి క్షేత్రేస్మి న్నునిపుజ్గవః | బ్రహ్మా దేవర్షిభిస్సార్ధం విష్ణు ర్వాయు ర్దివాకరః. 65

దేవరాజ స్తథా శక్రో యే చాన్యేపి దివౌకసః | ఉపాసన్తే మహాత్మాన స్సర్వే మామిహ సువ్రతే. 66

అన్యేచ యోగిన స్సిద్ధా స్థ్సాణురూపా మహావ్రతాః | అనన్యమనసో భూత్వా మామిహోపాసతే సదా. 67

అలర్కశ్చ పురీమేతాం మత్ప్రాసాదా దవాప్స్యతి | సచైనాం పూర్వవత్కృత్వా చాతుర్వర్ణ్యసమాకులామ్‌.

స్ఫీతా ఞ్జనపదాకీర్ణాం భూత్వాచ సుచిరం నృపః | మయి సర్వార్పితగుణో మామేవ ప్రతిపద్యతే. 69

తతఃప్రభృతి చార్వజ్గి యేపి క్షేత్రనివాసినః | గృహిణో లిజ్గినో వాపి మద్భక్తా మత్పరాయాణాః 70

మత్ర్రసాదా ద్గమిష్యన్తి మోక్షం పరమదుర్లభమ్‌|

మహా తపశ్శాలియగు జైగిషవ్యుడు ఇట ఉత్తమ సిద్ధినందెను. ఈ క్షేత్రపు మహాత్మ్యమువలనను ఇచట భక్తితో నన్ను భావన చేయుటవలనను జైగిషవ్యుడు మహాశ్రేష్ఠయోగి అయ్యెను; కావుననే ఈ వారాణసి యోగుల స్థానమనబడుచున్నది. ఇట నన్ను సదా ధ్యానించువానికి యోగాగ్ని మిగుల దీప్తినందును; అట్టివాడు దేవతలకును దుర్లభమగు కైవల్య ముక్తినందును. సర్వా సిదక్ధాంతవేత్తలయి బాహ్య చిహ్నములేవియు ధరించని (అవధూత) యోగులు అగు మునులు మరెచ్చటను దుర్లభమగు ముక్తినిచట పొందుదురు. అట్టివారికి నేను సర్వోత్తమమగు యోగ సంపదను నాతోడి సాయుజ్యమును వారు కోరిన స్థానమును ఇత్తును. మహాయక్షుడగు కుబేరుడును అట్లు సకల క్రియలను శివునకు అర్పించి ఈ క్షేత్రమును సేవించుట చేతనే గణశుడు అయ్యెను. ఇకమీదట నా భక్తుడుగా జనించబోవు సంపర్తుడును దేవి! ఈ క్షేత్రమందు నన్నారాధించినందుననే మహోతత్తమ సిద్ధినందును. పరాశర సుతుడు యోగి మహాతపస్వి భారతముతో ధర్మనిర్మాత వేద వ్యవస్థా ప్రవర్తకుడు ముని పుంగవుడు అగు వ్యాసుడును పద్మాక్షీ! ఈ క్షేత్రమునందే ఆనందము నందును; ఓ సువ్రతా! బ్రహ్మయు దేవర్షులు విష్ణువు వాయువు రవి దేవరాజగు ఇంద్రుడు ఇతరులగు దేవతలు ఇట్టి సర్వమహాత్ములును నన్నిచట ఉపాసింతురు. ఇతర యోగులును సిద్ధులును స్థాణురూపులును మహావ్రతులును అనన్య మనస్కులయి నన్నిచట సదా ఉపాసింతురు. అలర్కుడు నాయనుగ్రహమును ఈ పురిని పొదును; (ఆశ్రయించును.) అతడు దీనిని తన పూర్వులలెనే చతుర్వర్ణ ప్రజలతో నిండిన దానినిగా సమృద్ధి కలదానినిగా జనపదముల (గ్రామముల)తో చుట్టుకొనబడిన దానినిగా చేసి చాలకాలము రాజుగానుండి తన సకల గుణములను నాయందే అర్పించి నన్నే పొందును. మనోహరాంగీ! అది మొదలుకొని (అటు తరువాత కూడా) ఈ క్షేత్రమునందు నివసించువారు గృహస్థులేకాని (సంన్యాసాది) చిహ్నముల దాల్చినవారే కాని నా భక్తులయి నన్నే ఆశ్రయించి నా ప్రాసాదమున పరమ దుర్లభమగు ముక్తి నందుదురు.

విషయాసక్తచిత్తోపి త్యక్తధర్మరతి ర్నరః 71

ఇహ క్షేత్రే మృతస్సోపి సంసారం న పున ర్విశేత్‌ | యే పున ర్విర్మామా ధీరా స్సత్త్వస్థా విజితేన్ద్రియాః.

వ్రతినశ్చ నరారమ్భా స్సర్వే తే మయిభావితాః | దేహభజ్గం సమాసాద్య దీమన్త స్సజ్గవర్జితాః. 73

గతా ఏవ పరం మోక్షం ప్రసాదాన్మమ సువ్రతే | జన్మాన్తరసహస్రేషు యఞ్జన్యోగీ యమాప్నుయాత్‌. 74

తమిహైవ పరం మోక్షం మరణా దధిగచ్ఛతి | ఏవం సజక్షపతో దేవి క్షేత్రస్యాస్య మహాఫలమ్‌. 75

అవిముక్తస్య కథితం మయా తే గుహ్యభాషితమ్‌ | అతః పరతంర నాస్తి సిద్ధిగుహ్యం మహేశ్వరి. 76

ఏత ద్బుద్ధ్యన్తి యోగజ్ఞా యేచ యోగేశ్వరా భువి | ఏతదేవ వరం జ్ఞాన మేతదేవ పరం శివమ్‌. 77

ఏత దేవ పరం బ్రహ్మ ఏతదేవ పరం పదమ్‌ |

వారాణసీతు భువనత్రయసారభూతా రమ్యాపురీ మమ సదా గిరిరాజాపుత్త్రి. 78

అత్రాగతా వివిధదుష్కృతకారిణోపి పాపక్షయాద్విరజసః ప్రతిభాన్తి మర్త్యాః |

ఏతత్స్మృతం ప్రియతమం మమ దేవి నిత్యం క్షేత్రం విచిత్రతరుగుల్మత్మనికాయపుష్పమ్‌. 79

అస్మిన్మృతా స్తనుభృతః పదమాప్ను వన్తి మూర్ఖా೭೭గమేనరహితాపి న సంశ##యెత్ర |

ఇంద్రియ విషసుఖములం దాసక్తిగల చిత్తముగలవాడే ఐనను ధర్మమం దాసక్తిని విడిచనవాడే ఐనను మనవుడు ఈ క్షేత్రమునందు మరణించినచో అంతమాత్రముననే మరల సంసారమున (జనన మరణ ప్రవాహమున) ప్రవేశించడు. ఇక మరి మమత లేక స్థిరచిత్తులయి సత్త్వగుణలై జితేంద్రియులయి కర్మల ననుష్టించువా రయినను అనుష్ఠించనివా రయినను వివేకవంతులయి సంగమును విడిచి నాయందు భావనను నిలిపినవా రయినచో ఇచట దేహత్యాగ మొనర్చినవారు నా ప్రసాదమున ఉత్తమ(కైవల్య)ముక్తిని పొందియే తీరుదురని చెప్పవలసిన దేమి? వేలకొలది జన్మములందు యోగ మనుష్ఠించిన యోగి దేనిని పొందునో (ఆ సిద్ధిని) పరమ మోక్షమును ఇట మరణించినంతనే పొందును. దేవి! ఇట్లు నేను నీకు రహస్య వచనమగు ఈ అవిముక్త క్షేత్ర మహాఫలమును తెలిపితిని. మహేశ్వరీ! ఇంతకంటె ఉత్తమమగు రహస్యసిద్ధి మరి లేదు. దీనియందలి రహస్యమును ఈ భూలోకమున యోగజ్ఞులును యోగేశ్వరులను నగువారు మాత్రమే ఎరుగగలరు. ఇదే పరమమగు జ్ఞానము; ఇదే పరమ శుభకరము; ఇదే పరబ్రహ్మత త్త్వము; ఇదే పరమపదము. గిరిరాజ పుత్త్రీ! వారాణసి లోకత్రయసారము; నాకు సదా ఆనందకరము; ఇచ్చటికి వచ్చినవారు వివిధ దుష్కృతముల నాచరించిరవా రయినను మర్త్యులు పాపక్షయమంది రజోదూరులయి ప్రకాశింతురు. అద్భుతము గొలుపు వివిధ వృక్షలతా గుల్మములును అందలి పూవులును కలిగి ఒప్పు ఈ క్షేత్రము దేవీ! నాకు సదా ప్రియతమము; మూర్ఖులును శాస్త్రజ్ఞానము లేనివారును అగు ప్రాణులు కూడా ఇట మృతినందిన మాత్రమున పరమపద మందుదురు; సంశయము లేదు.

దేవ్యా సహ దేవదేవస్య యక్షవర ప్రదానాయ తత్సమీపగమనమ్‌.

సూతః: ఏతస్మిన్నన్తరే దేవో దేవీం ప్రాహగిరీన్ద్రజామ్‌. 80

దాతు ప్రసాదం యక్షాసు వరం భక్తాయ భామిని | భక్తో మమ వరారోహే తపసా హతకిల్బిషః 81

అహో వర మాసౌ లబ్ధుమస్మత్తో భువనేశ్వరి | ఏవముక్త్వా తతో దేవ స్సహ దేవ్యా జగత్పతిః 82

జగామ యక్షో యత్రాస్తే కృశో ధమనిసన్తతః |తతస్తం గుహ్యకం దేవీ దృష్టిపాతై ర్నిరీక్షతే. 83

శ్వేతవర్ణం విచర్మాణం స్నాయుబద్ధాస్థిఞ్జరమ్‌ | దేవీ ప్రాహ తదా దేవం దర్శయన్తీచ గుహ్యకమ్‌. 84

సత్యం నామ భవా నుగ్రో దేవై రుక్తస్తు శజ్కర | ఈదృశేచాస్య తపసి న ప్రయచ్ఛసి యద్వరమ్‌. 85

అత్ర క్షేత్ర మహాదేవ పుణ్య సమ్యగుపాసితే కథమేవం పరిక్లేశం ప్రాప్తో యక్షకుమారకః 86

శీఘ్రమస్య వరం యచ్ఛ ప్రసాదా త్పరమేశ్వర | ఏవం మన్వాదయో దేవా వద న్తిపరమర్షయః. 87

'దుష్టాద్వాచాథతుష్టాద్వా సిద్ధిస్తూభయతో భ##వేత్‌ | భోగప్రాప్తి స్తథా రాజ్యమన్తే మోక్ష స్సదాశివాత్‌'. 88

ఏకముక్త స్తతో దేవ స్సహ దేవ్యా జగత్పతిః | జగామ యక్షో యత్రస్తే కృశోధమనిసన్తతః 89

తం దృష్ట్వా ప్రణతం భక్త్యా హరికేశో వృషధ్వజః | ద్వివ్యం చక్షు స్తదా తసై#్మ యేనాపశ్య త్సశజ్కరమ్‌.

సూతః : అథ యక్ష స్తదాదేశా చ్ఛనై రున్మీల్య చక్షుషీ|

అపశ్య త్సగణం దేవం వృషం శ్వేత ముపాశ్రితమ్‌. 91

దేవదేవః వరం దదామి తే పూర్వం త్ర్యైలోక్యే దర్శనం తథా |

సావర్ణ్యంచ శరీరస్య పశ్య మాం విగతజ్వరః. 92

ఇట్లు చెప్పుచు ఇంతలోనే మహాదేవుడు భక్తుడగు యక్షునకు వర మీయదలచి గిరిరాజ పుత్త్రియగు మహాదేవితో ఇట్లనెను. భామినీ ! భువనేశ్వరీ! అహో! వరారోహా! (మహాసుందరీ!) ఇతడు మనవలన వరమందదలచి తపముచేతన పాపముల నశింపజేసికొనినాడు. ఇట్లు పలికి జగత్పతియగు ఆ దేవుడు దేవితో కలిసి యక్షుడు కృశుడై నాడులు మాత్రము ఎడము లేక కనబడు దేహముతో నున్న చోటికి పోయెను. చర్మమే లేక తెల్లని వర్ణము కలిగి నన్నని నాడులతో అమరిన అస్థిపంజరము మాత్రమే మిగిలియున్న ఆ గుహ్యకుని నిరీక్షించుచు దేవి అతనిని పరమేశ్వరునకు చూపుచు ఇట్లనెను: శంకరా! నిన్ను దేవతలు ఉగ్రుడు అందురు; అది సత్యమే; ఏలయన ఇత డింత తప మొనర్చినను ఇంతవర కీతనకి వర మీయలేదే! పుణ్యప్రదమగు ఇటువంటి క్షేత్రమును చక్కగా సేవించియు ఈ యక్ష కుమారుడు ఇంతవర కింత పరిక్లేశ మందవలసిన పని ఏమి? ప్రసాదము చూపి పరమేశ్వరా! శీఘ్రమే ఇతనికి వరము నిమ్ము; మనువు మొదలగు దేవతలును పరమ ఋషులును ఇట్లు చెప్పుదురు; (ఏమనిన) ''వాక్కుతో సదాశివుని దూషించినను (స్తుతించి) సంతోషింపచేసినను ఈ రెండి విధముల గూడ భోగప్రాప్తియు రాజ్యమును అంతమున మోక్షమును లభించును;'' ఇట్లు దేవి పలుకగా దేవుడగు ఆ జగత్పతి ఆ యక్షుడు కృశుడై ధమనులతో నిండి కూర్చండచిన తావునకు (అతి సమీపముగా) దేవితో కూడ పోయెను. భక్తుడగుచు ప్రణతుడు అగు అతనిని చూచుచునే హరికేశుడు (పచ్చని వెంట్రుకలు కలవాడు) వృషభ ధ్వజుడు నగు శివుడు అతనికి దివ్యనేత్ర మొనగెను. దానితో అత డతని చూడగలిగెను. అంతట యక్షుడును శివుని ఆదేశమున మెల్లగా కన్నులు విప్పి శ్వేత వృషభమందు ఉన్న శివుని అతని వెంట నున్న ప్రమథగణమును చూచెను. దేవదేవు డతనితో ''నీకు అపూర్వమగు వరము (నీ వడుగకయే) ఇచ్చుచున్నాను; త్ర్యైలోక్యమందును నీవు నన్ను (త్రైలోక్యము శివ మయమునుగా) చూతువు; నీ శరీర వర్ణము నా శరీర వర్ణముతో సమాన మగును. సంతాపరహితుడవయి నన్ను చూడుము'' అనెను.

సూతః : తత స్స లబ్ధ్వాతు వరం శరీరేణాక్షతేనచ | పాదయోః ప్రణతస్తసై#్మ కృత్వా శిరసి చాఞ్జలిమ్‌ . 93

ఉవాచథ తదా తేన వరదోస్మీతి చోదితః | భగవ న్భక్తి మవ్యగ్రాం త్వయ్యనన్యాం విధత్స్వ మే. 94

అన్నద స్సర్వోలోకానాం గణశత్వం తథాక్షయమ్‌ | అవిముక్తంచ తే స్థానం పశ్యేయం సర్వదా యథా.

ఏత దిచ్ఛామి దేవేశ త్వత్తో వర మనుత్తమమ్‌ | దేవదేవః జరామరణనిర్మక్త స్సర్వరోగవివర్జితః. 96

భవిష్యసి గణాధ్యక్షో వరద స్సర్వపూజితః | అజయ్యశ్చాపి సర్వేషాం యోగైశ్వర్యసమన్వితః. 97

అన్నదాశ్చిపి లోకేభ్యః క్షేత్రపాలో భవిష్యసి | మహాబలో మహాసత్త్వో బ్రహ్మణో మమ చ ప్రియః. 98

త్ర్యక్షశ్చ దణ్డపాణిశ్చ మహాయోగి తథైవచ | ఉద్భ్రమ స్సమ్భప్రమశ్చైవ గణౌ తే పరిచారకౌ. 99

తవాజ్ఞాశ్చ కరిష్యేతే లోకస్యోద్భ్రమసమ్భ్రమౌ |

సూతః : ఏవం స భగవాం స్తత్ర యక్షం కృత్వా గణశ్వరమ్‌. 100

జగామ వాసం దేవేశ స్సహ తేన మహేశ్వరః 101

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ వారాణసీ మహాత్మ్యే దేవీదేవసంవాదే క్షేత్ర పాలకవరప్రదానం నామ ఏకోనాశీత్యుత్తరశతతమోధ్యాయః.

అంతట అత డిట్లు వరమంది శరీరము అక్షతము (ఏ లోపమును లేనిది) కాగా శివుని పాదములందు ప్రణతుడయి తన శిరమున దోయిలి ఘటించెను. నేను వర మిత్తును కోరుకొమ్మని శివు డడుగగా ఆ యక్షుడు ''భగవన్‌! నాకు నీయందు అవ్యగ్రము (స్థిరము) అనన్యమునకు భక్తి కలుగనిమ్ము; సర్వ లోకముల వారికి అన్నము పెట్టువాడను శాశ్వతముగ నీ గణములలోనివాడను అయి నీ అవిముక్త క్షేత్రమును సదా చూచుచుండుదును గాక! దేవేశా ! నీ నుండి నేను కోరు సర్వోత్తమ వర మిదయే.'' అనెను. దేవదేవుడు '' నీవు జరామరణములును ఏ రోగములను లేక వరదుడును సర్వపూజితుడును గణాధ్యక్షుడును ఎవరికిని అజయ్యుడును లోకములకు అన్నదాతయును క్షేత్రపాలుడును మహాబలుడును మహానత్త్వుడును బ్రహ్మకును నాకును ప్రీతిపాత్రుడను త్రినేత్రుడును దండపాణియు (చేతియందు దండము ధరించి లోకరక్ష చేయువాడు) మహాయెగియు అగుదవు. ఉద్భ్రముడు సంభ్రముడు అను గణనాయకులు నీకు పరిచారకులయి నీ ఆజ్ఞలను పాటించి లోకములకు ఉపకార మొనర్తురు.'' అనెను. ఇట్లు దేవేశుడగు మహేశ్వర భగవానుడు అచ్చట ఆ యక్షుని గణశ్వరునిగా చేసి వానితో కూడి తన నివాసమున కేగెను.

[గమనిక: ఈ అధ్యాయమునందు చెప్పిన విషయములకు యోగపరమగు రహస్యార్థములు కలవు. అవి కావలసినవారు శ్రీనాధ రచిత కాశీఖండమున ద్వితీయాశ్వాసమునందలి 114 నుండి 133 వరకు గల పద్యములు చూచునది.]

ఇది శ్రీ మత్య్స మహాపురాణమున అవిముక్త క్షేత్ర మహాత్మ్యమును క్షేత్రపాలక వరప్రదానమను నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters