Sri Matsya mahapuramu-2    Chapters   

షడశీత్యుత్తరశతతమో7ధ్యాయః.

నర్మదామాహాత్మ్యమ్‌-జ్వాలేశ్వర మహిమా-బాణాసుర కథా.

మార్కణ్డయః : నర్మదాతు నదీశ్రేష్ఠా పుణ్యాత్పుణ్యతమా హితా|

మునిభిస్తు మహాభాగై ర్విభక్త ధర్మకాజ్ఞిభిః. 1

యజ్ఞోపవీతమాత్రాణి ప్రవిభక్తాని పాణ్డవ | తేషు స్నాత్వా తు రాజేన్ద్ర సర్వపాపైః ప్రముచ్యతే. 2

జ్వాలేశ్వరం పరం తీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ | తస్యోత్పత్తిం కథయత శ్శృణు పాణ్డవనన్దన. 3

పురా మునిగణా స్సర్వే సేన్ద్రాశ్చైవ మరుద్గణాః | స్తువన్తిస్మ మహాత్మానం దేవదేవం మహేశ్వరమ్‌ . 4

స్తూయమానస్తు తైః ప్రాప్త స్తత్ర దోవే మహేశ్వరః | విజ్ఞాపయన్తి దేవేశం సేన్ద్రాస్తే సమరుద్గణా. 5

బయోద్విగ్నా విరూపాక్షః పరిత్రాయస్వ నః ప్రభో|

ఈశ్వరః స్వాగతంతు మునిశ్రేష్ఠాః కిమర్థ మిహ చాగతాః 6

కిం దుఃఖం కోత్ర సన్తాపః కుతోవో భయమాగతమ్‌|కథయధ్వం మహాభాగా ఏతమి(ది)చ్ఛామి వేదితుమ్‌.

ఏవ ముక్తాస్తు రుద్రేణ ప్రోచుస్తే శంసితవ్రతాః | ఋషయః అతి ఘోరో మహాధీరో దానవో బలదర్పితః. 8

బాణో నామేతి విఖ్యాతో యసై#్యత త్త్రిపురం పురమ్‌ | గగనే సతతం దివ్యం భ్రమతే తస్య తేజసా. 9

తతో భృతా విరూపాక్ష త్వామేవ శరణం గతాః | త్రాయస్వ మహతో దుఃఖా త్త్వం మి నః పరమా గతిః.

ఏవం ప్రసాదం దేవేశ సర్వేషాం కర్తమర్హసి | యేన దేవా స్సదన్ధర్వా స్సుఖ మేధన్తి శఙ్కర. 11

పరాం నిర్వృతి మాయాన్తి తత్ప్రభో కర్తుమర్హసి |

దేవదేవః : ఏతత్సర్వం కరిష్యామి మా విషాదం గమిష్యథ 12

అచిరేణౖవ కాలేన కుర్యా యుష్మత్సుఖావహమ్‌ |

నూట ఎనుబది ఆరవ అథ్యాయము.

జ్వాలేశ్వతీర్థ మహిమాను వర్ణనము-బాణాసుర త్రిపుర దాహకథ.

మార్కండేయు డిట్లనెను: పాండవా! నదీశ్రేష్ఠయగు నర్మదపుణ్యమగు వానిలో పుణ్యతమమయినది; దానిని ధర్మకాంక్షులు మహాభాగులునగు మునులు యజ్ఞోపవీతములంత సన్నని ప్రవాహములుగాను తీర్థములుగాను విభజించిరి. వాటియందు స్నానమొనర్చినవాడరు సర్వపాపముక్తులగుదురు. జ్వాలేశ్వరము త్రిలోక విశ్రుతమగు పరమ తీర్థము; దాని యుత్పత్తిని తెలిపెదను వినుము; పూర్వము సర్వమునులును ఇంద్రాది మరుత్‌(దేవ)గణములును మహాత్ముడు దేవదేవుడునగు మహేశ్వరుని స్తుతింపసాగిరి. వారుస్తుతించునంతలో మహేశ్వరదేవుడటకు వచ్చెను. ఇంద్రాది దేవతలు భయోద్వేగములతో దేవేశుడగు విరూపాక్షునకు ప్రభూ! మమ్ములను రక్షించుమని మనవిచేసిరి. ఈశ్వరుడు వారితో ''మునిశ్రేష్ఠలారా! మీకు స్వాగతము. మీరేల ఇటకు వచ్చితిరి? దుఃఖమేమి? సంతాపమేమి? దేవివలన మీకు భయమగుచున్నది? మమాభాగులారా! నేనది తెలియగోరుచున్నాను; చెప్పుడు;'' అనగా రుద్రవచనమునువిని ప్రశస్తనియమవంతులగు ఆమునులు ఇట్లనిరి: అతిఘోరుడు మహాధీరుడు బలదర్పితుడునగు బాణుడను దానవుడు విఖ్యాతుడు కలడు; త్రిపురమను ఈ పురము వానిది; ఇది వానితేజముచే సతతము గగనమున తిరుగుచుండును; వానివలన నుండి భయపడి విరూపాక్షా; నిన్ను శరణ దిమితి; మాకు పరమగతివి నీవే కావున మమ్మీ మహాదుఃఖమునుండి రక్షించుము; ఈవిధముగానే దేవేశా! నీవందరను అనుగ్రహింప వేడుచున్నాము; దేనిచే దేవతలును గంధర్వులును సుఖముగా వర్ధిల్లుదురో శంకరా! ప్రభూ పరమ సుఖ మందుదురో అట్టి అనుగ్రహమును తాము చూపవలయును;'' అనెను.

మార్కణ్డయః ఆశ్‌ఆసయిత్వా తాన్త్సర్వా న్నర్మదాతట మాశ్రితః. 13

చిన్తయామాస దేవేశ స్తద్వధం ప్రతి పాలణ్డవ | అథ కేన ప్రకారేణ హన్తవ్య స్త్ర పరో మయా. 14

సస్మార నారదం దేవో బ్రహ్మర్షిం వృషభద్వజః | స్మృతమాత్ర స్సమాగమ్య ప్రోవాచ ప్రణతో మునిః.

నారదః : ఆజ్ఞాపయ మహాదేవ కిమర్థం సంస్మృతో హ్యహమ్‌|

కిం కార్యం తు మహాదేవ కర్తవ్యం కథయస్వ మే. 16

ఈశ్వరః : గచ్ఛ నారద తత్రైవ యత్ర తత్త్రైపురం మహత్‌ |

బాణస్య దానవేన్ద్రస్య శీఘ్రం గత్వా చ తత్కురు. 17

తా భర్తృదేవతా స్తత్ర స్త్రియ శ్చాప్సరసాం సమాః |

తాసాం వై తేజసా విప్ర భ్రమతే త్రిపురం దివి. 18

తత్ర గత్వాతు విప్రేన్ద్ర మతిమన్యాం ప్రబోధయ | దేవస్య వచనం శ్రుత్వా ముని స్త్వరితవిక్రమః. 19

స్త్రీణాం హృదయనాశాయ చతిత స్తత్పురం ప్రతి | శోభ##తే తత్పురం దివ్యం నానారత్నోపశోభితమ్‌. 20

శతయోజనవిస్తీర్ణం తతో ద్విగుణ మయాతమ్‌ | తతోపశ్యద్ధి తత్త్రైవ బాణంతు బలదర్పితమ్‌. 21

మణికుణ్డలకేయూరముకేటేన విరాజితమ్‌ | మేమహార శ##తైరత్నై శ్చంద్రకాంతై ర్విభూషితమ్‌. 22

రశనా తస్య రత్నాభ్యా బాహూ కనకమణ్డితౌ | చన్ద్రకాన్త మహావజ్రమణి విద్రుమభూషితే. 23

ద్వాదశార్కద్యుతినిభే నివిష్టం పరమాసనే | ఉత్థితో నారదం దృష్ట్యా దానవేన్ద్రో మహాబలః. 24

బాణః : దేవర్ష త్వం స్వయం ప్రాప్తో అర్ఘ్యం పాద్యం నివేదయే |

సోభివన్ద్య యథాన్యాయం క్రియతాం కిం ద్విజోత్తమ. 25

చిరాత్త్వా మాగతో విప్ర స్థీయతా మిద మాసనమ్‌ | ఏవం సమ్భాషయిత్వాతు నారదం ఋషిసత్తమమ్‌. 26

తన్య భార్యా మహాదేవీ హ్యనౌమ్యాతు నామతః |

అనౌపమ్యా: భగవ న్కేన ధర్మేణ దేవా స్తుష్యన్తి నారద. 27

వ్రతేన నయమేనాపి దానేన తసపాపి వా |

ధర్మజా! ఇట్లు వారినందర నోదార్ఛి దేవేశుడు నర్మదాతీరమందు కూర్చుండి వానిని వాని త్రూరములను నేను ఎట్లు వధించి నశింపచేయవలయునానయని ఉపాయమాలోచించెను. అంత వృషభధ్వజుడుగు మహాదేవుడు బ్రహ్మర్షియగు నారదుని స్మరించెను. స్మరించినంతటనే వచ్చి ఆముని ప్రణతుడై ''మమాదేవా! ఆజ్ఞనిమ్మ; నన్నేల స్మరించితిరి? మహాదేవా! నేజేయవలసిన పనిఏమి? నాకుసెలవిండు''. అనెను. ఈశ్వరుడిట్లనెను: నారదా! నీవీ మహాత్రిపురములున్నచోటికి పొమ్ము. దనావేంద్రుడగు బాణుని ఈ పురములకు పోయినే జెప్పినట్లు చేయుము; అందలి స్త్రీలందరు పతిని దేవతగా భావించు ఉత్తములును సౌందర్యము నందప్సరనలవంటివారును; వారి తేజముననే త్రిపురము గగనమున తిరుగుచున్నది; విప్రేంద్రా! నీవటకుపోయి వారికి మతిభేదమును ప్రబోధించుము; అనగా వినినారదుడు అచటి స్త్రీలందురు బుద్ధి భ్రంశము కలిగించుటకై బయలుదేరి త్వరితగతితో ఆపురమునకు పోయెను; ఆ దివ్యపురము నానా రత్నములతో శోభిల్లుచుండెను. నూరు యోజనముల వెడల్పు రెండువందల యోజనముల పోడవుతో నుండెను. అంతట అతనికిచట బలదర్పితుడగు బాణుడు కనబడెను. వాడు మణికుండలముతో భుజకీర్తులతో కిరీటముతో వందలకొలది బంగర హారములతో చంద్రుని మనోహరములగు రత్నములతో రత్న సమృద్ధి గల మొలనూలితో కనకాభరభములుగల బాహువులతో ప్రకాశించు చుండెను. చంద్రకాంతములతో మహావజ్రములతో మణులతో పగడములతో అలంకృతమయి పండ్రెండుగురు ఆదిత్యులతో సమమయి వెలుగు ఉత్తమాసనమునవాడు కూర్చుండియుండెను. మహాబలుడగు ఆదానవేంద్రుడు నారదుని చూచిలేరి దేవర్షీ! నీవు స్వయముగా వచ్చితివి; అర్ఘ్యపాద్యముల సమర్పింతును; అనుచు అవి అర్పించెను. శాస్త్రన్యాయానుసారము అభివందనము చేసెను. ద్విజోత్తమా! నేనేమి చేయవలయును? చాల కాలమునకు వచ్చితిరి; విప్రా! కూర్చుండుడు; ఇదిగో ఆసనము;'' అని ఇట్లు పలుకరించెను; తరువాత ఋషి సత్తముడగు నాదునితో అతని భార్యయును మహాదేవియు (పట్టపురాణి) అగు 'అనౌపమ్య' అనునామో ''నారదా! ఏ ధర్మముచే నియమముచే దానముచే తపముచే దేవతలు సంతుష్టులగుదురు?'' అని యడిగెను.

అనౌపమ్యాయై నారదోక్తదానవిశేషాః.

నారదః : తితధేనుం చ యో దద్యా ద్బ్రాహ్మణ వేదపారగే. 28

ససాగరవనద్వీపా దత్తా భవతి మేదినీ | సూర్యకోటిప్రతీకాశై ర్విమానై స్సర్వకామికైః. 29

మోదతే సుచిరం కాల మక్షయం కృతశాసనమ్‌ | ఆమ్రామలకపిత్థాని బదరాణి తథైవచ. 30

కదమ్బచమ్పకాశోకా ననేకవివిద్రమా9 | అశ్వత్థపిప్పలం చైవ కదళీవటదాడిమా9. 31

పిచుమన్దం మధూకంచ ఉపోష్య స్త్రీ దదాతి యా | స్తనౌ కపిత్థసదృశా వూరచ కదళీసమౌ. 32

అశ్వత్థే వన్దనీయాచ పిచుమన్దే సుగన్దినీ | చమ్పకే చమ్పకాభా స్యా దశోకే శోకవర్జితా. 33

మధూకే మధురం వక్తి వటేచ మృదుగాత్రికా | బదరీ సర్వదా స్త్రీణాం మమాసౌభాగ్యదయినీ. 34

కుక్కుటీ కర్కటీచైవ ద్రవ్యషషీ నశస్యతే | కదమ్బమిశ్రకనకమఞ్జరీపూజనం తథా. 35

అనగ్నిపక్వాశనంచ నాళాకేరస్య భక్షణమ్‌ | ఫలానాంచ పిత్యాగ స్సన్ద్యామౌనం తథైవచ. 36

ప్రథమం క్షేత్రపాలస్య పూజా కార్య ప్రయత్నతః | తస్యా భవతి వై భర్తా ముఖప్రేక్ష స్సదానఘే. 37

అష్టమీచ చతుర్థీచ పఞ్చమీ ద్వాదశీ తథా | సజ్క్రాన్తి ర్విషువచైవ దినచ్ఛిద్రముఖం తథా. 38

ఏతాంస్తు దివసా న్దివ్యానుపవసన్తి యా స్త్రియః | తాసాంతు ధర్మయుక్తానం స్వర్గవాసో న సంశయః. 39

కలికాలుష్యనిర్ముక్తా స్పర్వపాపావివర్జితాః | ఉపవాసరతాం నాదీం నోపసర్పతి తాం యమః 40

అనౌపమ్యా : అస్మిన్కృతేన పుణ్య పురా జన్మకృతేన వా |

భబదాగమనం జాతం కిఞ్చత్పృచ్ఛా మ్యహం మునే. 41

అస్తి వన్ద్యావశిర్నామ బలిపత్నీ యశస్వినీ | శ్వశ్రూ ర్మమాపి విప్రేన్ద్ర న తుష్యతి కదాచన. 42

శ్వశురో మే సర్వకాలం దృష్ట్యా చాపి న తుష్యతి | అస్తి కుమ్భీనసీ నామ ననాన్దా పాపకారిణీ. 43

దృష్ట్వా చైవాజ్ఞుళీభఙ్గం సదాకాలం కరోతి మే | దివ్యేనతు పథా೭೭యాతి మమ సౌఖ్యం కథం వద. 44

ఉషరే న ప్రరోహన్తి బీజాంకురాఃక థంచన | యేన వ్రతేన చీర్ణేన భవన్తి పశగా మమ. 45

తద్ర్వతం బ్రూహి విప్రేన్ద్ర దాసభావం ప్రజామి తే |

నారదుడు అనౌపమ్యకు దాన విశేషములు తెలుపుట.

నారదుడు అనౌపమ్యకు ఇట్లు చెప్పెను: వేద పారంగతుడగు విప్రునకు తిలధేను దానము (ఇది లోగడ చెప్పబడినది) చేసినచో సముద్రవన ద్వీప సహితముగా భూమినంతను దానిమిచ్చినట్లుగును; దీని దాతలు తమ శాసనము అందరపై చెల్లుచుండ కోటి సూర్య సమతేజము గలిగి అన్ని కోరికలను తీర్చ విమానములపయి సంచరించుచు అతి చిరకాలము ఆనందింతురు. తీయమామిడి ఉసిరిగ వెలగ రేగు కదంబము సంపెంగ అశోకము పున్నాగము పిప్పలము అరటి మర్రి దానిమ్మ పిచుమందము ఇప్ప మొదలగువృక్షములను ఉపవాస పూర్వకముగా దానమీయవలయును. వెలగ (దానము) చే వెలగ పండ్లవంటి స్తనములు అరటిచే అరటికంబములవంటి తొడలు కలుగును; దానిచే అందర వందనము లందుకొనుము. పిచుమందవృక్షముచే సుగంధి దేహము సంపెంగచే ఆ పూవువంటి చాయ అశోకముచే శోకరాహిత్యము ఇప్పచే తీయని మాటలు మర్రిచే మృదు శరీరము రేగుచే స్త్రీలకు సౌభాగ్యము సిద్దించును; కుక్కుటియు కర్కటి (దోన)యు దానయోగ్యములే; ద్రవ్య షష్ఠి? ప్రశస్తముకాదు; (దానవ్రత సందర్భములో) వడిమి పూలతో కలిపిన ఉమ్మెత్త పూలతో పూజ చేయవలయును; అగ్నియందు పక్వము కాని యాహారమును కొబ్బరికాయను తినవలయును ఇతర ఫలములు తినక విడువవలయును; సంధ్యా సమయములందు మౌనముతోనుండవలయును; అందుకు మొదట యఘాశక్తిగా క్షేత్రపాలుని పూజించవలయును; ఇట్లు జరిపిన స్త్రీకి భర్తవశుడై సదా ఆమె ఆజ్ఞకై ఆమె మొగమువైపు చూచుచుండును; అష్టమి చతుర్థి పంచమి ద్వాదశి సంక్రాంతి (రవిరాశి ప్రవేశదినము) విషువత్‌ (రాత్రింబవళ్ళు సమాన పరిమాణముతో నుండి దినము) ఛిద్ర తిథుల (అష్టమి-ద్వాదశి-షష్ఠి-చతుర్థి-చతుర్థశి) ఆరంభకాలము. ఇవి దివ్యదినములు; దీనియందుపవసించి ధర్మము నాచరించు స్త్రీకి నిస్సంశయముగా స్వర్గవాసము లభించును; ఇట్టి స్త్రీలు కలిదోష ముక్తలయి సర్వపిపరహితలగుదురు; ఇట్లు ఉపవాసములయందాసక్తిగల స్త్రీదగ్గరకు యముడు రానైన రాజాలడు; అని నారదుడు అనౌసపమ్యతో చెప్పెను.

అది విని ఆమె యతనినిట్లడిగెను. విప్రేంద్రా! నారదమునీ! నేను ఈ జన్మమందును పూర్వజన్మమందును చేసిన పుణ్యఫలముగా మీరు ఇటకు వచ్చితిరి; చిన్నమాట అడుగుచున్నాను; బలిచక్రవర్తికి పత్నియు కీర్తిశాలినియు అగు వింధ్యావళి యున్నదికదా! ఆమె మాయత్తగారు; ఆమెకు నా విషయమున సంతోషమేలేదు; మా మామగారును నన్నెప్పుడును చూచుచు (నాగుణము లెరిగి) ఉండియు నాయందు నంతుష్టుడు కాడు; కుంభీనసియను నా ఆడుబిడ్డ యున్నది; ఆమె చేయునవన్నియు పాపపు పనులే; నేను కనబడిన చాలు-నిరతము ఆమె మెటికలు విరచుచుండును; (ఇవి తొలగి) దివ్య మార్గమున నాకు సౌఖ్యము లభించు ఉపాయము తెలుపుము; చపుటి పర్రలో విత్తనములు ఎట్లును ఎన్నడును మొలకెత్తవు ఆ వ్రతము తెలుపుము; అనెను.

నారదః : యదేతత్తే మయా పూర్వం వ్రతముక్తం శుభాననే. 46

అనేన పార్వతీ దేవీ చీర్ణేన వరవర్ణిని | శజ్కరస్య శరీరస్థా విష్టోర్లక్ష్మీ స్తథైవచ. 47

సావిత్రీ బ్రహ్మణశ్చాపి వసిష్ఠస్యాప్యరున్ధతీ | ఏతేనోపోషితేనేహ భర్తా స్థాస్యతి తే వశే. 48

శ్వశ్రూశ్వశురయోశ్చైవ ముఖబన్డో భవిష్యతి | ఏవం శ్రుత్వాతు సుశ్రోణి యథేష్టం కర్తుమర్హసి. 49

నారదస్య వచశ్శ్రుత్వా రాజ్ఞీ వచన మబ్రవీత్‌ | ప్రసాదం కురు విప్రేన్ధ్ర దానం గ్రాహ్యం యథేప్సితమ్‌.

సువర్ణమణిరత్నాని వస్త్రాణ్యాభరణాని చ | తవ దాస్యామ్యహం విప్ర యచ్చాన్యదపి దుర్లభమ్‌. 51

ప్రగృహాణ ద్విజశ్రేష్ఠ ప్రీయేతాం హరిశజ్కరౌ | నారదః | అన్యసై#్మ దీయతాం భ##ద్రే క్షీణవృత్తిస్తు యో ద్విజః. 52

అహం సర్వత్ర సమ్పన్నో మద్భక్తిః క్రియతామితి | మార్కణ్డయః : ఏవం తాసాం మనో హృత్వా సర్వాసాంతు పతివ్రతాత్‌. 53

జగామ భరతశ్రేష్ఠ స్వకీయం స్థానకం పునః | తతో హ్యహృష్టహృదయా అన్యతోగతమానసాః. 54

పురే ఛిద్రం సముత్పన్నం బాణస్యతు మహాత్మనః. 54

ఇతి శ్రీమత్స్య మహాపురాణ నర్మదామహాత్మ్యే జ్వాలేశ్వర తీర్థమహిమానువర్ణనే నారదస్య బాణపురప్రవేశకథనం నామ షడశీత్యురశతతమోధ్యాయః.

నారదుడు అనౌపమ్యతో ఇట్లు పలికెను : శుభాననా! నేను ఇంతవరకును నీకు చెప్పిన వ్రతము ఏది కలదో దానిని పార్వతి యాచరించి ఓవర వర్ణినీ! శంకరుని అర్త శరీరమందుండగలిగెను. లక్ష్మి విష్ణుని శరీరమందును సావిత్రి బ్రహ్మ శరీరమందును అరుంధతి వసిష్ఠ శరీరమందును ఉండగలిగిరి; ఈ ఉపవాసవ్రత ఫలముగా నీభర్త నీవశముందుండును; నీ యత్తమామల నోళ్ళు మూతపడును; విప్రేంద్రా! నాయందనుగ్రహము చూపుము; నీకిష్టమయినన్ని దానములు స్వీకరింపుము; విప్రా! బంగారము మణులు రత్నములు వస్త్రములు ఆభరణములు-ఇవియేకాదు-ఇంకను దుర్లభమగునవి ఏవియున్నను అవన్నియు నీకిత్తును; ద్విజశ్రేష్ఠా! హరి శంకరులు ప్రీతినందునట్లు అవి గ్రహించుము. అన నారదుడిట్లనెను. శుభరూపా! జీవనాధారములేని మరెవరికైన విప్రునకుఇమ్ము; అన్ని విషయములందును సంపన్నడను; నాయందుభక్తిమాత్రము చూపుము; అని ఇట్లు నారదుడు పతివ్రతమునుండి వారందరు మనస్సులను హరించి పెడత్రోవ పట్టించి భరతశ్రేష్ఠా! ధర్మజా! మరల తన స్థానమునకు పోయెను; తరువాత నుండి ఆత్రిపురస్త్రీలు హర్షములేని (ఆసంతృప్త) హృదయములతో కూడినవారును మరి ఇతరములంరు వ్యాప్తములగు మనస్సుగల వారునునయిరి. దానిచే మహాత్ముడగు ఆ బాణాసులని త్రిపురమునందు ఛిద్రములు (లోపములు) ఏర్పడెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మహాత్మ్యమున జ్వాలేశ్వర మాహాత్మ్యమున నారదుడు బాణపుర స్త్రీల మనస్సులు విరచులయను నూట ఎనుబది యారవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters