Sri Matsya mahapuramu-2    Chapters   

త్రినవత్యుత్తశతతమోధ్యాయః

నర్మదా మహిమానువర్ణన సమాప్తిః

మార్కణ్డయః : తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర హ్యజ్కుశేశ్వర ముత్తమమ్‌ |

దర్శనా త్తస్య దేవస్య ముచ్చతే సర్వాపాతకైః. 1

తతో గచ్చేత్తు రాజేన్ద్ర నర్మదేశ్వర ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్త్స్వర్గలోకే మహీయతే. 2

అశ్వతీర్థం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్‌ | సుభగో దర్శనీయశ్చ భోగవా న్జాయతే నరః . 3

పైతామహం తతో గచ్ఛేద్బ్రహ్మణా నిర్మితం పురా |

తత్ర స్నాత్వా నరో భక్త్యా పితృపిణ్డంతు దాపయేత్‌. 4

తిలదర్భవిమిశ్రతం తు హ్యుదకం తత్ర దాపయేత్‌ | తస్య తీర్థ ప్రభావేన సర్వం భవతి చాక్షయమ్‌. 5

సావిత్రీతీర్థ మాసాద్య యస్తు స్నానం సమాచరేత్‌ | విధూయ సర్వపాపాని బ్రహ్మలోకే మహియేతే. 6

మనోహరం తు తత్రైవ పరమశోభనమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్పితృలోకే మహీయతే. 7

తతో గచ్చేత్తు రాజేన్ద్ర మానసం తీర్థ ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్రుద్రలోకే మహీయతే. 8

తతో గచ్ఛేచ్చ రాజేన్ద్ర కురుతీర్థ మనుత్తమమ్‌ | విఖ్యాతం త్రిషు లోకేషు సర్వపాపప్రణాశనమ్‌. 9

యన్యాన్ప్రార్థయతే కామా న్పశుపుత్త్ర ధనానిచ | ప్రాప్నుయా త్తాని సర్వాణి తత్ర స్నాత్వా నరాధిప.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర త్రిదశజ్యోతి రుత్తమమ్‌ | యత్ర తా ఋషికన్యాస్తు తపోతప్యన్త సువ్రతాః. 11

భర్తా భవతు సర్వాస మీశ్వరః ప్రభు రవ్యయః | ప్రీతస్తాసాం మమాదేవో దణ్డరూపధరో హరః. 12

వికృతానన భీభత్స ర్వ్రతీ తీర్థ ముపాగతః | తత్ర కన్యా మహారాజ వరయ న్పరమేశ్వరమ్‌. 13

అస్మాకం దేవదేవస్య కన్యాదానం ప్రదీయతామ్‌ | తీర్థం తచ్చ మహారాజ దశకన్యేతి విశ్రుతమ్‌. 14

తత్ర స్నాత్వార్చయే ద్దేవం సర్వపాపైః ప్రముచ్యతే |

నూట తొంబది మూడవ అధ్యాయము.

అంకుశేశ్వర తీర్థాది మహిమానువర్ణనము-నర్మదా మాహాత్మ్య సమాప్తి.

మార్కండేయుడు ధర్మజునకు ఇట్లు చెప్పెను; తరవాత అంకుశేశ్వరమను ఉత్తమ తీర్థము; అచటి ఆ అంకుశేశ్వరుని దర్శించినంతనే సర్వపాపముక్తుడగును, తరువాత నర్మదేశ్వర తీర్థము; అ ఉత్తమ తీర్థమున స్నానముచే స్వర్గ లోకప్రాప్తియగును; తరువాత అశ్వతీర్థము; అటకేగి స్నానమాచిరించినచో చూడ ఇంపగు రూపము కలుగును; భోగవంతుడగును; స్త్రీలకు ప్రీతిపాత్రుడగును; తరువాత పూర్వము బ్రహ్మ స్వయముగా నిర్మించిన పైతామమా తీర్థము; అందు స్నానమాడి భక్తితో పితరులకు పిండాదానము చేసి తిలదర్భ విమిశ్రమగు జలముతో తర్పణము వదలినచో ఆ తీర్థ ప్రభావమున ఆ పితృ కార్యమక్షయ ఫలప్రదమగును; తరువాత సావిత్రీ తీర్థము, దానియందు స్నానమాడిన వారు బ్రహ్మలోక ప్రాప్తులగుదురు. అచ్చటనే మనోహరమును పరమ శోభనమునగు మనోహర తీర్థముగలదు; అందు స్నానమాడినచో పితృలోకప్రప్తిచే సుఖించగలరు; తరువాత మానస తీర్థము. అందు స్నానమాడినచో రుద్రలోక ప్రాప్తియగును. తరువాత అనుత్తమమగు కురు తీర్థము. అది త్రిలోక విశ్రుతమును సర్వపాప ప్రణాశనమును. లోకమునందు మానవులు పశుపుత్త్ర ధానదికములను వేటిని వేటిని కోరుచుందురో అవన్నియు ఈ తీర్థమున స్నానమాడినచో సిద్ధించును. తరువాత ఉత్తమమగు త్రిదశ జ్యోతిస్తీర్థము. అందు ప్రసిద్ధలగె ఋషికన్యలు (కొందరు) మంచి వ్రత నియమముల నవలంబించి తమ కందరకును లోక ప్రభుడును అవ్యయుడునగు ఈశ్వరుడు పతి కావలయునను సంకల్పముతో తపమాచరించిరి. అంటత మహాదేవుడగు హరుడు వారిని మెచ్చి ప్రశస్తమగు (పలాశ) దండమును ధరించి బ్రహ్మచారియై వికృతమగు మొగము కలిగి అసహ్యము గొలుపు రూపముతో వచ్చెను. అయినను వారు పరమేశ్వరుని (గుర్తించి) వరించిరి; ఋషి కన్యలమగు మేము దేవదేవుడగు శివునకు పత్రులుగా దానము ఈయబడవలయును అని తపమాచరించిన ప్రదేశమగుటచే దీనకి ఋషి (దశ) కన్యాతీర్థమను నామము ప్రసిద్ధమయ్యెను. ఇందు స్నానమాడి శివునర్చించినచో సర్వ పాపముక్తియగును.

తతో గచ్ఛేచ్చ రాజేన్ద్ర స్వర్ణబిన్దు త్వితి స్మృతమ్‌. 15

తత్ర స్నాత్వా నరో న్దుర్గతిం న చ వశ్యతి | అప్సరేశం తతో గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్‌.

క్రీడతే నాగలోకస్థో హ్యప్సరై స్సహమోదతే | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర నరకం తీర్థ ముత్తమమ్‌. 17

తత్ర స్నాత్వార్చయే ద్దేవం నరకంచ న గచ్ఛతి క్ష భారభూతిం తతో గచ్చే ఉపవాసనరో జనః. 18

ఏత త్తీర్థం సమాసాద్య చావతారం తు శామ్భవమ్‌ | అర్చయిత్వా విరూపాక్షం రుద్రలోకే మహియతే. 19

అస్మిం స్తీర్ఠే నర స్స్నాత్వా భారభూతౌ మహాత్మనః | యత్ర తత్ర మృతస్యాపి ధ్రువం గాణశ్వరీ గతిః.

*ఋషికన్యేతి.

కార్తికస్యతు మాసస్య హ్యర్చయిత్వా మహేశ్వరమ్‌ | అశ్వమేధా ద్దశగుణం ప్రవదన్తి మనీషిణః. 21

దీపకానాం శతం తత్ర ఘృతపూర్ణం తు దాపయేత్‌ |

విమానై స్సూర్యసఙ్కాశై ర్వ్రజతే యత్ర శఙ్కరః. 22

వృషభం యః ప్రయచ్ఛేత్తు శఙ్ఖకున్దేన్దు సన్నిభమ్‌ | వృషయుక్తేన యానేన రుద్రలోకం స గచ్ఛతి. 23

ధేను మేకాంతు యో దద్యా త్తస్మిం స్తీర్థే నరాధిప | పాయసం మధుసంయుక్తం భక్ష్యాణి వివిధాని చ. 24

యథాశక్త్యాతు రాజేన్ద్ర బ్రాహ్మణా న్భోజయే త్తతః | తస్య తీర్థప్రభావేన సర్వం కోటిగుణం భ##వేత్‌. 25

నర్మదాయా జలం పీత్వా సమభ్యచర్చ్య వృషధ్వజమ్‌ | దుర్గతిం న చ పశ్యన్తి తస్య తీర్థప్రభావతః. 26

ఏత త్తీర్థం సమాసాద్య యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌ | సర్వపాపవిశుద్ధాత్మా వ్రజతే యత్ర శఙ్కరః. 27

జలప్రవేశంయః కుర్యా త్తస్మిం స్తీర్థే నరాధిప | హంసయుక్తేన యానేన రుద్రలోకం స గచ్ఛతి. 28

యావ చ్చన్ద్రశ్చ సూర్యశ్చ హిమవాంశ్చ మహోదధిః | గఙ్గద్యా స్సరితో యావత్తావత్స్వర్గే మహీయతే.

అనాశకంతు యః కుర్యా త్తస్మిం స్తీర్థే నరాధిప | గర్భవాసేతు రాజేన్ద్ర న పున ర్జాయతే పుమా&. 30

తరువాత స్వర్ణిబిందుతీర్థము; అందు స్నానమాడిన వారికి దుర్గతి కలగదు; తరువాత అప్సరస్‌ తీర్థము; ఇందు స్నానమాడినవారు నాగలోకమును పొంది అందు అప్సరసలతో సుఖింతురు; తరువాత (అ) నరక తీర్థము; అందు స్నానమాడి శివునర్చించిన వారికి నరకప్రాప్తి యుండదు; తరువాత భారూతి తీర్థము; ఇందు స్నానమాడి ఉపనాసమాచరించి శాంభ వావతారమగు విరూపాక్షదేవుని అర్చించినచో రుద్రలోక ప్రాప్తులగుదురు; ఈ భారభూతితీర్థమునందు స్నానమాడినవారు మహాత్ములు; ఏలయన-వారు ఇందేకాక మరి ఎచ్చట మరణించినను గణశ్వరులుగానయి శివసాంనిధ్య మందుట నిశ్చయము. ఇచ్చట కార్తికమాసమున మహేశ్వరుని ఆర్చించినచో అశ్వమేధమునకు పదింతలుగా ఫలము కలుగునని విద్వాంసులందరు; అందు నేతిదీపములు నూరు వెలిగించినచో సూర్య సమానప్రకాశ విమానములపై శంకరుని సంనిధికేగును; శంఖమువలె మొల్లపూవువలె చంద్రనివలె తెల్లనగు వృషమును ఇచ్చట దానమిచ్చినచో రుద్రలోక ప్రాప్తుడగును; ఈ తీర్థమున గోదాన మొకటియైన చేసినన తెనెతో పాయనముతో కూడ వివిధ భక్ష్యములను యథాశక్తిగా బ్రాహ్మణులను భుజింప జేసినచో ఈ తీర్థప్రభావమున ఈ పుణ్యకార్యములలో ప్రతియొకటియు కోటిగుణితమగు ఫము నిచ్చును; ఈ తీర్థము నాశ్రయించి యుండి ప్రాణత్యాగము చేసినవాడు శంకరలోకమున కేగును; ఇచట నర్మదా జలముత్రావి వృషధ్వజునర్చించినచో దుర్గతి కలుగదు; ఈ తీర్థమున (పాణత్యాగమునకై) జలప్రవేశము చేసినచో హంసలను పూంచిన విమానముపై రుద్రలోకమేగును; చంద్రసూర్యులు హిమాలయము మహాసముద్రము గంగాది నదులు ఉన్నంత వరకు స్వర్గలోకమున సుఖపడును; నిరాహారతావ్రతముతో ఇచట ప్రాణత్యాగము చేసిన వారికి పునర్జన్మముండదు.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర ఆషాఢీతీర్థ ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్నిన్ద్రస్యార్ధసనం లభేత్‌. 31

స్త్రియా స్తీర్థం తతో గచ్ఛే త్సర్వపాపప్రణాశనమ్‌ | తత్రాపి స్నాతమాత్రస్య ధ్రువం గాణశ్వరీ గతిః. 32

ఐరణ్డ్యా నర్మదాయాశ్చ సఙ్గమం లోకవిశ్రుతమ్‌ | తచ్చ తీర్థం మహాపుణ్యం సర్వపాపప్రణాశనమ్‌. 33

ఉపవాసపరో భూత్వా నిత్యవ్రత పరాయణః | తత్ర స్నాత్వా నరో రాజ న్ముచ్యతే బ్రహ్మహత్యయా. 34

తతో గచ్చేచ్చ రాజేన్ద్ర నర్మదోదధిసఙ్గమమ్‌ | జామదగ్న్య మితి ఖ్యాతం సిద్ధో యత్ర జనార్దనః. 35

యత్రేష్ట్వా బహుభి ర్యజ్ఞై రిన్ద్రో దేవాధిపోభవత్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్ర్మదోదధిసఙ్గమే. 36

త్రిగుణం చాశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవః | పశ్చిమస్యోదధేస్సన్ధౌ స్వర్గద్వారవిపాటనమ్‌. 37

తత్ర దేవా స్సగన్ధర్వా ఋషయ స్సిద్ధచారణాః | ఆరాధయన్తి దేవేశం త్రిసన్ధ్యం విమలేశ్వరమ్‌. 38

తత్ర స్నాత్వ నరో రాజ న్రుద్రలోకే మహీయతే | విమలేశం పరం తీర్థం న భూతం న భవిష్యతి. 39

తత్రోపవాసం కృత్వా యే పశ్యన్తి విమలేశ్వరమ్‌ | సప్తజన్మకృతం పాపం హిత్వా యాన్తి శివాలయమ్‌.

తరువాత ఆషాఢీ తీర్థము; ఇది ఉత్తమము; అందు స్నామాడినచో ఇంద్రుని అర్ధాసనములభించును; తరువాత స్త్రియాతీర్థము. ఇది సర్వపాప ప్రణాశకము. ఇందు స్నానమాత్రముచే గణశ్వరుడై రుద్రలోకమున సుఖించును. తరువాత ఐరండీ (ఉపనది) నర్మదా నదుల సంగమపు తీర్థము. ఇది లోక విశ్రుతము. ఇందు అనుదినము స్నానము చేయుచు వ్రత పరాయణుడై ఉపవాసము చేయుచుండినచో బ్రహ్మ హత్యాదోష ముక్తి యగును. (ఈ పేరు లోగడ కూడ వచ్చినది). తరువార నర్మదా సాగర సంగమ తీర్థము. దీనికే జామ దగ్న్య తీర్థమనియు నామాంతరము. ఇచట జనార్దనుడు సన్నిహితుడై యుండును. అతడిచ్చట సిద్దినందెను. ఇచ్చట బహుయజ్ఞము లాచరించినందుననే ఇంద్రుడు దేవాధిపతికాగలిగెను. ఇందు స్నానమాడిన నరుడు అశ్వమేధ ఫలమునకు మూడింతల ఫలమందును. ఇది పశ్చిమ సముద్రపు సంధియందు ఉన్నది. స్వర్గ ద్వారమును తెరచు పవిత్ర ప్రదేశమిది. ఇచట దేవగంధర్వ ఋషి సిద్ధచారణాదులు ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యలయందు దేవేశుడగు విమలేశ్వరుని ఆరాధింతురు. ఇందు స్నానమాడిన వారు రుద్రలోక ప్రాప్తులగుదురు. ఈ విమలేశ స్థానములకంటె గొప్పదియగు తీర్థము ఇదివరకు లేదు. ఇకముందుండదు. ఇచట ఉపవసించి విమలేశ్వరుని దర్శించినవారు సప్త జన్మకృతమగు పాపములనుండి ముక్తులయి శివస్థానముచేరి సుఖింతురు.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర కౌశికీతీర్థ ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరోరాజ న్నుపవాస పరాయణః. 41

ఉపోష్యరజనీమేకాం నియతో నియతాశనః | తీర్థస్యాస్య ప్రావేన ముచ్యతే బ్రహ్మహత్యయా. 42

సర్వతీర్థాభిషేకం చ యః పశ్యే త్సాగరేశ్వరమ్‌ | యోజనాభ్యన్తరే తిష్ఠ న్నావర్తే సంస్థిత శ్శివః. 43

తం దృష్ట్వా సర్వతీర్థాని దృష్టాని తు న సంశయః | సర్వపాపవినిర్ముక్తో యత్ర రుద్రస్స గచ్ఛతి. 44

నర్మదాసఙ్గమం యావ ద్యావచ్చామరకణ్టకమ్‌ | తత్రాన్తరే మహారాజ తీర్థకోట్యో దశస్స్మృతాః. 45

తీర్థా త్తీర్థాన్తరే తత్ర ఋషికోటి రన్వితే | సాగ్నిహోత్రాశ్చ విద్వాంస స్సర్వే ధ్యానపరాయణాః. 46

సేవన్తే నర్మదాం రాజన్నీప్సితార్థప్రదాయినీమ్‌ | యస్త్విదం పఠతే నిత్యం శృణుయాద్వాపి భావతః. 47

తస్య తీర్థాని సర్వాణి హ్యభిషిఞ్చన్తి పాణ్డవ | నర్మదా చ సదా ప్రీతా భ##వేత్తస్య న సంశయః. 48

తస్య ప్రీతో భ##వే ద్రుద్రో మార్కణ్డయో మహామునిః | వన్ధ్యాచ లభ##తే పుత్త్రం దర్భగా సుభిగా భ##వేత్‌.

భర్తారం లభ##తే కన్యా యశ్చ య ద్వాఞ్ఛతే ఫలమ్‌ | తదేవ లభ##తే సర్వం నాత్ర కార్యా విచారణా. 50

బ్రాహ్మణో వేద మాప్నోతి క్షత్త్రియో విజయీ భ##వేత్‌ |

వైశ్యస్తు లభ##తే లాభం శూద్రః ప్రాప్నోతి సద్గతిమ్‌. 51

మూర్ఖస్తు లభ##తే విద్యాం త్రిసన్ధ్యం యః పఠేన్నరః | నరకంతు న పశ్యేత్తు వియోనిం నైవ గచ్ఛతి. 52

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మార్కణ్డయ యుధిష్ఠిరసంవాదే నర్మదామహిమానువర్ణనం నామ

త్రినవత్యుత్తర శతతమోధ్యాయః.

తరువాత కౌశికీ తీర్థము. ఇది ఉత్తమము. ఇందు స్నానమాడి శ్రద్ధతో ఒక అహోరాత్రము ఉపవసించి నియమపరుడై ఆహార నియమము పాటించినచో ఈ తీర్థ ప్రభావమున బ్రహ్మహత్యాదోష మోచనమగును. ఇచట సర్వ తీర్థ స్నానము చేసిన పుణ్యఫలమునిచ్చు సాగరేశ్వర తీర్థము కలదు. ఇచట సాగరేశ్వరుడను శివుడు ఉన్నాడు. ఈ శివుడు సముద్రమునుండి యోజనము లోపలగా సముద్ర జలపు సుడుల నడుమనున్నాడు. ఆ తీర్థమును అందలి విమలేశ్వరుని దర్శించినచో సర్వ తీర్థ దర్శనము చేసినట్లే యగును. తత్ఫలముగా సర్వపాప ముక్తియగును. రుద్రత్వము ప్రాప్తించును.

నర్మా తీర్థ మాహాత్మ్య ఫలశ్రుతి.

నర్మదా నదికి ఆది స్థానమందున్న అమరకంటక పర్వత ప్రాంతము మొదలుకొని నర్మదా సాగర సంగమము నకు నడుమ పదికోట్ల తీర్థములున్నవి. తీర్థమునకును తీర్థమునకును నడుమ కోట్లకొలది ఋషులును ఉన్నారు. వారందరును అగ్నిహోత్రపరులు. ధ్యానపరాయణులు. విద్వాంసులు. వీరందరును అట ఉండుచు ఈప్సిత ఫలప్రదాత్రి యగు నర్మదను సేవించుచుందురు. ఈ నర్మదా తీర్థ మాహాత్మ్యమును ఎవరు శ్రద్ధా భావముతో విందురో పఠింతురో అతనిని ఈ సమస్త తీర్థములను తమయందలి జలముతో అభిషేకించును. అన్ని తీర్థములయందు స్నానమాడినంత పుణ్యము లభించును. అతనియందు నర్మదకు ప్రీతి కలుగుట నిస్సంశయము. రుద్రుడును మార్కండేయుడును అతనిపై ప్రీతులగుదురు. ఇది వినుటచే చదువుటచే గొడ్రాలికిని సంతి కలుగును. దుర్భగ (మగని ప్రీతికి నోచుకొనని స్త్రీ) కూడా సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగును. కన్యకు తగిన భర్తతో త్వరగ పెండ్లియగును. కోరిన కోరికలన్నియు తీరును. ఇందు సంశయము లేదు. బ్రాహ్మణునకు వేదార్థ జ్ఞానసిద్ధియు క్షత్త్రియునకు విజయమును వైశ్యునకు ధనలాభమును శూద్రునకు సద్గతియు లభించును. దీనిని మూడు సంధ్యలయందును పఠించుచుండినచో మూర్ఖడును విద్యావంతుడుఅగును. నరకమునకు పోవరు. హీనయోనులందు జన్మించరు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మార్కండేయ యుధిష్ఠిర సంవాదరూపమగు నర్మదా మాహాత్మ వర్ణనమను నూట తొంది మూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters