Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టనవత్యుత్తరశతతమోధ్యాయః.

కశ్యపగోత్రప్రవరవిరణమ్‌.

శ్రీ మత్య్సః : మరీచేః కశ్యపః పుత్త్రః కశ్యపస్య తథా కులే |

గోత్రకారా నృషీ న్వక్ష్యే తేషాం నామాని మే శృణు. 1

ఆశ్రాయణి రృషిగణో మేషకీరిటకాయనాః | ఉదగ్రజా మాఠరాశ్చ భోజా వినయలక్షణాః. 2

శాలహలేయాః కౌరిష్ఠాః కన్యకా శ్చాసురాయనాః | మన్దాకిన్యాం వై మృగయా శ్వ్రుతయో భీరుపాయనాః. 3

దేవయాన గోమయాన హ్యథ చ్ఛాయాభయాశ్చయే | కాత్యాయనా శ్శాక్రయాణా బర్హియోగగదాయనాః. 4

భవనన్దీమహాచక్రి ర్దాక్షపాయన ఏవ చ | యోధయానా కార్తివయో హస్తిదానా స్తథైవచ. 5

వాత్య్సాయనా నికృతజా హ్యాశ్వలాయనిన స్తథా | ప్రాగాయణాః పౌలమౌలి రాశ్వవాతాయని స్తథా. 6

కౌబేర కాశ్చశ్యాకారా అగ్నిశర్మాయనాశ్చ యే | మేషపాః కైకరసపా స్తథా చైవతు బభ్రవః. 7

ప్రాచేయో జ్ఞానసంజ్ఞేయా ఆగ్నాప్రసేవ్య ఏవచ | శ్యామోదరా వైవశపా స్తథా చైవోద్బలాయణాః. 8

కాష్ఠా హారిణమారీచా ఆజిహాయన హాస్తికాః | వైకర్ణేయాః కాశ్య పేయా స్సాసిసాహారితాయనాః. 9

మాతఙ్గినశ్చ భృగవ స్త్ర్యార్షేయాః పరికీర్తితాః | వత్సారః కశ్యపశ్చైవ నిద్రువశ్చ మహాతపాః. 10

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | ఏతే స్వసాజ్ఱ్యమిత్రస్య తే వంశా యే ప్రకీర్తితాః. 11

వత్సారః కాశ్యపశ్చైవ సర్వేహ్యేతే మహాతపాః | పరస్పర మవై వాహ్యా గోత్రోక్తాః పరికీర్తితాః. 12

నూట తొంబది ఎనిమిదవ అధ్యాయము.

కశ్యపగోత్ర ప్రవరాను కీర్తనము.

మత్స్య జనార్ధనుడు వైవస్వత మనువుకిట్లు చెప్పెను:

మరీచి ప్రజాపతి (ఋషి) పుత్త్రుడగు కశ్యపుని సంతతివారగు గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొందును; వీరిలో మొదటి వర్గమువారు; ఆశ్రాయణులు మేషులు కిరీటకాయనులు ఉదగ్రజులు మాఠరులు (వినయమే తమ లక్షణముగా గల) భోజులు శాలహలేయు కౌరిష్టులు కన్యకులు ఆసురాయణులు (మందాకినియందలి) మృగయయులు శ్రుతయుల భీరు (భౌత) పాయనులు దేవయానులు గోమయానులు ఛాయభయుల కాత్యాయనులు శాక్రాయణులు బర్హిర్యోగులు గదాయనులు భవనంది మహాచక్రి దాక్షపాయనులు యోధయానులు కార్తివులు హస్తిదానులు వాత్స్యాయనులు నికృతిజులు ఆశ్వలాయనులు ప్రాగాయణులు పౌలమావి ఆశ్వవాతాయని కౌబేరకులు శ్యాకారులు అగ్నిశర్మాయనులు మేషవులు కైకరనడులు తులభ్రవులు ప్రాచేయు జ్ఞాన సంజ్ఞేయులు అగ్నులు ప్రాసేవ్యులు శ్యమోదరులు వైవశుపులు ఉద్బలాయణులు కాష్ఠులు హారిణులు మారీచులు అజిహాయనులు హాస్తికులు వైకర్ణేయులు కాశ్యపేయులు సాసిసులు హారితాయనులు మాతంగులు భృగువలు-ఈ ఋషుల వర్గముల (గోత్రముల వారల)కు వత్సా(త్స)రుడు కశ్యపుడు నిధ్రువడు అనువారు ప్రవర ఋషులు: ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసినకొనరాదు.

అతః పరం ప్రవక్ష్యామి ద్య్వాముష్యాయణ గోత్రజా | అనసూయో నాకురయ స్సునయో రాజవర్తపః. 13

శైశిరోదవహిశ్చైవ సైరన్ద్రీరోవసేవకిః | యామునిః కద్రుపిజ్గాక్షిః స్సజాతమ్వి స్తథైవచ. 14

దివావాష్ట్రాశ్వ ఇత్యేతే భక్త్యా జ్ఞేయాశ్చ కాశ్యాపాః | త్ర్యార్షేయాశ్చతథా వంశాః కీర్తితాః ప్రవరాశ్శుభాః. 15

వత్సారః కశ్చపశ్చైవ మహాతపాః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 16

సంయాతిశ్చ నభశ్చోభౌ పిప్పల్యోథ జలన్ధరః | భూజాతపురః పూర్యశ్చ కర్దమో గర్దభీముఖః. 17

హిరణ్యబాహుః కైరాతా ఉభౌ కాశ్యపగోభిలౌ | కులహో వృషకణ్ఠశ్చ మృగకేతు స్తథోత్తరః. 18

నిదాఘమసృణౌ భత్స్యా మహాన్తః కేరలాశ్చయే | శాణ్డిల్యో దానవాశ్చైవ తథావై దేవజాతయః. 19

పైప్పలాది స్సప్రవరా ఋషయః పరికీర్తితాః | త్ర్యార్షేయాభిమాతాశ్చైషాం ప్రవరాః పరికీర్తితాః. 20

అసితో దేవలశ్చైవ కశ్యపశ్చ మహాతపాః పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 21

ఋషిప్రధానస్య తు కశ్యపస్య దాక్షాయణీఃభ్య స్సకలం ప్రసూతమ్‌ |

జగత్సమగ్రం మనుసింహ ముఖ్యం తత్తే ప్రవక్ష్యామ్యహ ముత్తరేణ. 22

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే కశ్యపగోత్రపవ్రర వివరణం నామ అష్టనవత్యుత్తర శతతమోధ్యాయః.

రెండవ వర్గమువారు: ఇక మీదట ద్వ్యాముష్యాయణ గోత్రముల వారిని పేర్కొందును; అనసూయుడు నాకు రయుడు సునయుడు రాజవర్తపుడు శైశిరోదవహి సైరంధ్రి రోపసేవకి-యాముని కద్రుపింగాక్షి సజాతంబి వావాష్ట్రాశ్వుడు-అను ఈ ఋషులు (గోత్రముల వారల)కు వత్సారుడు కశ్యపుడు వసిష్ఠుడు అనువారు ప్రవర ఋషులు; వీరు పరస్పరము వివామ సంబంధములు చేసినకొనరాదు.

ఇక మూడవ వర్గమువారు: సంయాత్రినభుడు పిప్పల్యుడు జలంధరుడు భుజాతపూరుడు పూర్యుడు కర్దముడు గర్దీముఖుడు హిరణ్యబాహువు కైరాతుడు కాశ్యపుడు గోభిలుడు కలహుడు వృషకంఠుడు మృగకేతుడు ఉత్తరుడు నిదాఘుడు మనృణుడు భత్స్యులు కేరలులు శాండిల్యుడు దానవులు దేవజాతులు పైప్పలాది-ఈ వర్గముల వారలకును ఈ ఋషుల గోత్రముల వారలకును అసితుడు దేవలుడు కశ్యపుడు అను మువ్వురును ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారు పరస్పరము వివాహ సంబంధములు చేసినకొనరాదు. ఋషి ముఖ్యుడగు కశ్యపునకు దక్షపుత్త్రికల వలన సకల జగత్తును జనించినది; ఆ ముఖ్య విషయము నీకు ఇకముందు చెప్పెదను.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున కశ్యపగోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters