Sri Matsya mahapuramu-2    Chapters   

పంచో త్తర ద్విశతతమోధ్యాయః.

కృష్ణాజినదానమ్‌

మనుః కృష్ణాజినప్రదానన్య విధిం కాలం మమానఘ |

బ్రాహ్మణం చ తథా೭೭ చక్ష్వ తత్ర మే సంశయో మహా&.1

మత్స్యః :వైశాఖీ పూర్ణిమాస్యాంతు గ్రహణ శశి సూర్యయోః|

పూర్ణమాసీ తు యా మాఘే హ్యాషాఢీ కా ర్తికీ తథా. 2

ఉత్తరాయణం ద్వాదశీవా తస్యాం దత్తం మహాఫలమ్‌ | ఆహితాగ్ని ర్ద్విజో యస్తు తద్ధేయం తస్య పార్థివ. 3

యథా యేన విధానేన తన్మే నిగదతశ్శృణు | గోమయే నోపలిప్తే తు శుచౌ దేశే నరాధిప. 4

ఆదావేవ సమాస్తీర్య శోభనం శస్త మావికమ్‌| తత స్స శృఙ్గం సఖుర మాస్తరే త్కృష్ణమార్గకమ్‌. 5

కర్తవ్యం రుక్మశృఙ్గం తద్రౌప్యదన్తం తథైవ చ| లాఙ్గాలం మౌక్తికైశ్ఛన్నం తిలయుక్తం తథైవ చ. 6

తిలైస్తు స్థిగితం కృత్వా వాససా77చ్ఛాదయే ద్భుధః| సువర్ణనాభం తత్కుర్యా దలఙ్కృత్య విశేషతః. 7

రత్నై ర్గన్దైర్యథాశక్త్యా తస్య దిక్షుచ విన్యసేత్‌ | కాంస్యపాత్రాణి చత్వారి తేషు దద్యా ద్యథా క్రమమ్‌. 8

మృన్మయేషు చ పాత్రేషు పూర్వాదిషు క్రమేణ తు | ఘృతం క్షీరం దధి క్షౌధ్ర మేవం దద్యా ద్యథావిధి. 9

చమ్పకస్య తథా శాఖా మవ్రణం కుమ్భమేవ చ | బాహ్యోపస్థాపనం కృత్వా శుభచిత్తోనివేశ##యేత్‌. 10

రెండు వందల ఐదవ అధ్యాయము.

కృష్ణాజిన దానము.

(కృష్ణాజినమనగా నల్లని మచ్చలుగల ఇఱ్ఱి అను మృగపు చర్మము)

కృష్ణాజినమును ఎట్టి బ్రాహ్మణునకు ఏకాలమున ఏ విధానమున దానమీయవలయునో తెలుపుమని మునువడుగ మత్స్యడిట్లు తెలిపెను: వైశాఖ పూర్ణిమ చంద్ర సూర్యగ్రహణములు మాఘ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ కార్తిక పూర్ణిమ ఉత్తరాయనము ద్వాదశితిథి- ఈ కాలములందు ఇది దానమిచ్చుట మహాఫలదము; ఆహితాగ్ని యగు విప్రుడు దానయోగ్యుడు; విధానమిక తెలిపెదను; వినుము! నరాధిపా! గోమయముతోఅలికిన శుచి ప్రదేశమున మొదట ప్రశన్తము శోభనమునగు కంబళము (తివాచీ) పరచవలెను; కొమ్ములు గిట్టలుకల కృష్ణాజినమును దానిపై పరచి దానికి బంగరు కొమ్ములు వెండి దంతములు ముత్తెములతో నూవులతో తోక కుచ్చు అమర్చి నూవులతో ఆచర్మము కప్పి దానిపై నూతన వస్త్రమును ఉంచి దాని నడుమ బంగరునుంచి రత్న గంధాదులతో యథాశ క్తిగ అలంకరించవలయును; వీటియందు నాలుగు దిక్కు లందు నాలుగు కాంస్యపాత్ర లుంచవలెను. అట్లే నాలుగు మట్టి పాత్రలందు వరుసగా తూర్పు మొదలుగనే నేయిపాలు పెరుగు తేనె పోయవలెను. సంపెంగ కొమ్మను రంధ్రములేని కడవను వీనికి బయటగా శుభచిత్తమతో ఉంచవలెను:

నవ్యవస్త్రం శుభం పీతం సర్వాఙ్గేషునివేశ##యేత్‌| తథా మృన్మయ పాత్రాణి పాదయోస్తస్య దావయేత్‌. 11

యాని పాపాని కాయేన మయా లోభా త్కృతానివై | లోహపాత్రాది దానేన ప్రణశ్యంతు మమాశు వై. 12

తిలపూర్ణం తతః కృత్వా వామపాదే నివేశ##యేత్‌| యాని పాపాని కామ్యాని కామోత్థాని కృతాని వై. 13

కాంస్య పాత్ర ప్రదానేన తాని నశ్యంతు మే సదా| మధుపూర్ణం తు తత్కృత్వాం పాదే వై దక్షిణ న్యసేత్‌. 14

పరాపవాదపైశున్యా త్పృష్ఠమాంసస్య భక్షణాత్‌| తత్రోత్థితం చ మే పాపం తామ్రపాత్రా త్ప్రణశ్యతు. 15

కన్యానృతం గవాం చైవ పరదార ప్రదర్షణమ్‌. రౌప్యపా త్రప్రదానే క్షిప్రం నాశం ప్రయాతు మే. 16

ఊర్ధ్వపాదే చ యే కార్యే తామ్రస్య రజతస్య చ| జన్మాన్తరసహస్రేషు కృతం పాపం కుబుద్ధినా. 17

సువర్ణపాత్రదానాత్తు నాశయాసు జనార్దన| హేమాముక్తావిద్రుమం చ దాడిమం బీజపూరకమ్‌. 18

అశ్వత్థపత్రం శ్రవణ ఖురే శృఙ్గాయకాని చ| ఏవం కృత్వా యతోక్తేన సర్వశాకఫలానిచ. 19

ఈ చర్మపు అన్ని అంగములందు వేరువేరుగ క్రొత్త పసుపు పచ్చని వస్త్రములను పాదములకడ మృణ్మయ పాత్రములను ఉంచవలెను. నేను లోభముచే చేసిన కాయిక పాపములన్నియు నేచేయు ఈ లోహ పాత్రాది దానముచే శీఘ్రమే నశించుగాక !

అను మంత్రముతో లోహపాత్రమును దాని ఎడమ పాదముకడ నూవులతో నింపి ఉంచవలెను; నేను కామవశమున చేసిన పాపములు నేచేయు ఈ కాంస్య పాత్ర దానముతో నశించుగాకయనుచు తేనెతో నింపిన కంచు పాత్రను చర్మపు కుడి పాదముకడ ఉంచవలెను. పరుల నిందించుట వారిపై కొండెములు చెప్పుట వృష్ఠమాంస భక్షణము- వీనిచే కలిగిన పాపము తామ్ర పాత్ర దానముచే నశించుగాక! కన్య విషయమున అనృతము పలుకుటవలన గోవులను పరదారలను అవమానించుట వలన కలిగిన పాపము నేచేయు ఈరాగి వెండి పాత్రల దానమున నశించుగాక! అనుచు ఈ రాగి వెండి పాత్రలు చర్మపు పై (ముందరి) ఎడమ- కుడి పాదములకడ ఉంచవలెను. జన్మాన్తర సహస్రములందు దుర్భుద్ధితో నే జేసిన పాపమంతయు నేజేయు ఈ స్వర్ణపాత్ర దానమును నశించుగాక; జనార్దనా! యనుచు బంగరు పాత్ర నుంచవలెను; బంగారు ముత్తెములు పగడములు దానిమ్మపండ్లు మాదీఫలములు ప్రశ స్త పాత్రమందుంచి చెవులయందు గిట్టలయందు కొమ్ముల నడిమిచోటునందు ఇంకను సర్వశాక ఫలములతో కూడ ఉంచవలయును.

తత్ప్రతిగ్రహవిద్విద్వా నాహితాగ్ని ర్ద్విజోత్తమః | స్నాతో వస్త్రయుగచ్ఛన్న స్స్వశక్త్యా చాప్యలఙ్కృతః.

ప్రతిగ్రహస్చ తస్యోక్తంఃపుచ్ఛదేశే మహీపతే| తత ఏవం సమీపే తు మన్త్ర మేన ముదీరయేత్‌. 21

కృష్ణః కృష్ణ గళో దేవః కృష్ణోజినధర స్తథా| తద్దానా ద్ధూతపాపస్య ప్రీయతాం మే వృషధ్వజః. 22

అనేన విధినా దత్వా యథావ త్కృష్ణమార్గకమ్‌ |

న స్పృశే త్తం ద్విజం రాజ & చితియూప సమో హి సః. 23

దానే చ శ్రాద్ధకాలే చ దూరతః పరివర్జియేత్‌| స్వగృహా త్ప్రేష్య తం విప్రం మజ్గళస్నాన మాచరేత్‌. 24

పూర్ణకుమ్బేన రాజేన్ద్ర శాఖయా చమ్పకస్య తు| కృత్వా చాచార్యః కలశం మన్త్రేణానేన మూర్ధని. 25

ఆప్యాయస్వ సముద్రజ్యేష్ఠా ఋచో వాచ్యాస్తు షోడశ | అహతే వాససీ వీత ఆచాన్త శ్శుచితా మియాత్‌. 26

తత్సర్వం కుమ్భసహితం నీత్వా క్షేప్యం చతుష్పథే| కృతేనానేన యా తుష్టి ర్న సా శక్యా సురై రపి. 2

వక్తుం హి నృపతిశ్రేష్ఠ తథాప్యుద్దేశత శ్శృణు | సమగ్రభూమిదానస్య ఫలం ప్రాప్నోత్యసంశయమ్‌. 28

సర్వలోకాంశ్చ చరతి కామచారీ విహఙ్గవత్‌| ఆభూతసవ్ల్వువం యావ త్స్వర్గం ప్రాప్నో త్యసంశయమ్‌. 29

న పితా పుత్త్పమరణం వియోగం భార్యయా సహ| ధనదేశపరిత్యాగం న చై వేహాప్నుయా త్క్వచిత్‌. 30

కృష్ణేప్సితం కృష్ణమృగస్య చర్మ ద్విజాయ దద్యాచ్చ సమాహితాత్మా|

యథోక్త మేత స్మరణం న శోచే త్ప్రాప్నో త్యభీష్టం మనసః ఫలం తత్‌. 31

ఇతి శ్రీమత్స్య మహాపురాణ కృష్ణాజినప్రదానికో నామ

పంచో త్తర ద్విశతతమోధ్యాయః.

ఈ దానము గ్రహించు ఆహితాగ్ని యగు బ్రాహ్మణుడును స్నానము చేసి దోవతి ధరించి ఉత్తరీయము వేసికొని యథాశక్తిగా అలంకరించుకొనవలయును; అతడు దీనిని తోకవైపున ప్రతిగ్రహించవలయును; దానమంత్రమిది: "నల్లని కృష్ణాజినమా! నల్లని కంఠము కలవాడు కృష్ణాజినము దాల్చినవాడునగు వృషభధ్వజుడు నీదానముచే ప్రీతినందు గాక! నా పాపములు తొలగుగాక!" ఇట్లు కృష్ణాజిన దానమయిన తరువాత దాత ఆ విప్రుని తాకరాదు; ఏవయన అతడపుడు చితియందలి యూపకాష్ఠముతో సమానుడు; అతనిని దానకాల శ్రాద్ధకాలములందు దూరముగా విడువదగును; (తాక రాదు) అంతట ఆ విప్రుని అతని ఇంటికి పంపి దాత మంగళస్నానము చేయవలయును; చంపక శాఖతో కూడిన కుంభ మందలి జలముతో ఆచార్యుడు ఆ కుంభమును దాత శిరము పైగానుంచి అతని తలపై "అప్యాయన్వ" "సముద్రజ్యేష్ఠాః" అను ఈ మొదలగు పదునారు ఋక్కులతో జలము ప్రోక్షించవలెను; తరువాత దాత క్రొత్త వస్త్రములను (జతనుండి చించని వానిని (ఒకటి దోవతిగా -మరియొకటి ఉత్తరీయముగా) ధరించి ఆచమించినచో శుచియగును; ఆ కుంభమును మిగిలిన పదార్థశేషమును నాలుగు త్రోవలు కలిసినచోట పారవేయవలెను; దీనిచే కలుగు భగవత్ప్రీతి ఇంతయని చెప్పుట దేవతలకును శక్యముకాదు; ఐనను ఉద్దేశ (నామగ్రహణ) మాత్రమున చెప్పెద వినుము ; సమగ్ర భూదాన ఫలముబ్బును; ఐందు సంశయమేలేదు; కామచారియై పక్షివలె సర్వలోక సంచారియగును; ఆ ప్రళయాంతముగా స్వర్గప్రాప్తుడై సుఖించును; వానికి పితృ పుత్త్ర భార్యాదులతోడి వియోగము సంభవించదు; ధనత్యాగ దేశ త్యాగములు కలుగవు; కృష్ణునకును ఇష్టమగు కృష్ణమృద చర్మమును సమాహితచిత్తుడై విప్రునకు దానమిచ్చినచో ఈ యథోక్త దానఫలమున శోకరాహిత్యమును మనో భీష్టఫలసిద్ధియు కలుగును.

[గమనిక :ఇందు చెప్పినవానిలో "ఆప్యాయస్వ" అనునది (ఋగ్వేద-1 మం.91 సూక్తము) మొదలుగ ఎనిమిది ఋక్కులున్నవి "సముద్రజ్యేష్ఠాః" (ఋగ్వేద- 7

మం. 49 సూక్తము) మొదలగు నాలుగు ఋక్కులున్నవి. ఇవి మొత్తము పండ్రెండే;

మూలమునందు షోడశ (పదునారు) అని యున్నది; ఇది "ద్వాదశ"(పండ్రెండు) అని యుండవలెనేమో; సంప్రదాయమున తెలియ వలెను. ]

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మను మత్స్య సంవాదమును కృష్ణాజిన ప్రదాన విధానమను రెండు వందల ఐదవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters