Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తధశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

éరాజధర్మాః-విషనిర్హ రణోపాయాః.

మనుః : రక్షోఘ్నాని విషఘ్నాని యాని ధార్యాణి భూభుజా |

అథేదానీం సమాచక్ష్వ తాని ధర్మవతాం వర. 1

మత్స్యః : బిల్వాటకీ యవక్షారం పాటలా బాహ్లికోషణాః |

శ్రీపర్ణీ సల్లకీయుక్తో నిక్వాథః ప్రోక్షణం పరమ్‌. 2

సవిషం ప్రోక్షితం తేనన సద్యో భవతి నిర్విషమ్‌ | యవసైన్ధవపాననీయ వస్త్రశ య్యాసనోదకమ్‌. 3

కవచాభరణం ఛత్త్రం బాలవ్యజన వేశ్మనామ్‌ | శేలుః పటోలాతివిషా శిగ్రుమూర్వా పునర్నవా. 4

సమంగావృషమూలంచ కపిత్థవిషశోణితమ్‌ | *సహదేవా హరిద్రేతు విషననాశం ప్రకీర్తితమ్‌. 5

లక్షాప్రియఙ్గుమఞ్జిష్ఠా సమమేలాహరేణుకా | యష్ట్యాహ్వా మధునా యుక్తా బభ్రుపి త్తేన కల్పితాః. 6

నిక్షి పేద్గోవిషాణస్థం సప్తరాత్రం మహీతలే | తతః కృత్వా మణిం హేమ్నా బద్ధం హస్తే ధారయేత్‌. 7

సంసృష్టం సవిషం తేన సద్యో భవతి నిర్విషమ్‌ | మనోహ్వయా శమీపత్రం తుమ్బికా శ్వేతసర్షపాః. 8

కపిత్థకుష్ఠమఞ్జిష్ఠాః పిత్తేన శ్లక్‌ష్ణకల్పితాః | శునో గోః కపిలాయాశ్చ సౌమ్యాక్షిప్తో7పరో7గదః. 9

విషజిత్పరమం కార్యం మణిరత్నం చ పూర్వవత్‌ | మూషికా జతుకా చాపి హస్తే బద్ధా విషాపహా. 10

హరేణుమాంసీ మఞ్జిష్ఠా రజనీమధుకామధు | అక్షత్వక్సురసంలాక్షా శ్వపిత్తం పూర్వవద్బువి. 11

వాదిత్రాణి పతాకాశ్చ పిష్టైరేతైర్విలేపితాః | శ్రుత్వా దృష్ట్వా సమాఘ్రూయ సద్యో భవతి నిర్విషః. 12

రెండు వందల పదునేడవ అధ్యాయము.

విష నిర్హ రణోపాయము.

ధర్మ విద్వరుడవగు మత్స్య ప్రభూ! రాక్షస-విషనాశకములగు వేనిని రాజు తన దుర్గమున నిలుపుకొని వలయునో తెలుపుమనిన మనువుతో మత్స్యుడిట్లనెను: బిల్వాటకీ- యవక్షారము-పాటలా-బాహ్లికము-ఊషణము-శ్రీపర్ణి- సల్లకి- ఈ అన్నిటితో కాచిన కషాయమును నవిష పదార్థములపై చిలుకరించినచో అవి నిర్విషములగును; యవలు సైంధవము పానీయములు వస్త్రములు శయన సామగ్రి ఆసన సామగ్రి- ఉదకము-కవచములు ఆభరణములు ఛత్త్రములు వింజామరములు నివాస గృహములు ఇట్టివి విష సంయుక్తములయ్యెననిపించినచో వాటిపై ఈ కషాయమును చల్లవలయును. శేలువు-పాటలీ-అతివిష శిగ్రువు- మూర్వా-పునర్నవ-సమంగా- వృషమూలము-వృషము శోషితము- సహదేవ-హరిద్ర-ఇవియు విష నాశకములు; లాక్ష-ప్రియంగువు-మంజిష్ఠ ఏలా- హరేణుకా-అతి మధురము-ఇవి ముంగిన పిత్తముతో కలిపి భావనచేసి ఎద్దుకొమ్ములో ఈ మిశ్రమును పోసి దానినేడు అహోరాత్రములు నేలలో పాతిఉంచి తీసి దానిని పూసలుగా చేయవలెను; వానిని బంగరు దారములో గ్రుచ్చి చేతికి కట్టుకొనిన విషయుక్త పదార్థములను తాకినను అవి వెంటనే నిర్విషములగును; మననోహ్వయా శమీ పత్రము తుంబికా శ్వేత సర్షపములు కపిత్థము కుష్ఠము మంజిష్ఠా- ఇవి కుక్క పిత్తముతోగాని కపిల గోపిత్తముతో గాని నున్నగా అరగదీసి పూసినచో ఇదియు ఒక విధమగు విషనాశకమగు ఔషధమగును; మూషికా-జతుకా-ఈ రెండు ఓషధులతో కూడ పైవలెనే పూనలనుచేసి హస్తమందు ధరించినను విషహరౌషధముగా పనిచేయును; హరేణువు-మాంసి-మంజిష్ఠ- మధుకా-మధువు-అక్షత్వక్‌- సురసము-వీనిని శ్వ(కుక్క) పిత్తములతో వెనుకటివలె గోశృంగములో నింపి భూమియందుంచి తీసి సిద్ధపరచిన పిష్టము పూసిన వాద్యముల (ధ్వనుల)ను వినినను పతాకలను చూచినను వాసన చూచినను సవిష పదార్థములు నిర్విషములగును.

త్ర్యూషణం పఞ్చలవణం మఞ్జిష్ఠా రజనీద్వయమ్‌ | సూక్ష్మైలా త్రివృతా పత్రం విడఙ్గానీనన్ద్రవారుణీ. 13

మధుకం వేతననం క్షౌద్రం విషాణచ నిధాపయేత్‌ | తస్మాదుష్ణామ్బునామాత్రం ప్రాగుక్తం వినియోజయేత్‌.

విషభుక్త జ్వరం యాతి నిర్విషే పిత్తదోషకృత్‌ | శుక్లం సర్జరసోశీరసర్షపా ఏలవాలుకైః. 15

సువేగాతస్కరసురౌ కుసుమై రర్జునస్యతు | ధూపో వాసగృహే హన్తి విషం స్థావరజఙ్గమమ్‌. 16

*మహాదనన్తశఠం తద్వత్ప్రోక్షణం విషనాశనమ్‌.

న తత్ర కీటా న విషం దర్దురా న సరీసృపాః | నకృత్యాకర్మణాం చాపి ధూపోయం యత్ర దహ్యతే. 17

శిఖిపిచ్ఛబలాకాస్థి సర్షపాశ్చన్దనం ఘృతమ్‌ | ధూపో విషఘ్న శ్శయన వస్త్రగేహే తథా7పిచ. 18

పూర్వోక్తం భూషణాద్యంచ స్నానేనామ్భసి యోజయేత్‌ | క్వాథోవా7ర్జునకుసుమశ్వేతాపామార్గ సర్షపైః. 19

న దధ్యాఢ్యఘృతై ర్యుక్తః కామో నాన్యక్రులద్ధయః | కల్పితై శ్చన్దనక్షీర పలాశద్రుమవల్కలైః. 20

మూర్వైలావాలుసరసా నాకులీ తణ్డులీయకైః | క్వాథస్సర్వోదకార్యేషు కాకమాచీయుతో హితః. 21

రోచనాపత్ర నేపాళీ కుఙ్కుమై స్తిలకాన్వహ9 | విషైర్న బాధ్యతే సాధు నరనారీనృపప్రియః. 22

చూర్ణైర్హరిగ్రా మఞ్జిష్ఠా కిణిహీక ణనిమ్బజైః | దిగ్ధం నిర్విషతామేతి గాత్రం సర్వవిషార్ధితమ్‌. 23

పిప్పలి మిరియాలు శొంఠి అను ఊషణత్రయము సాముద్ర లవణ సైంధవ లవణ బిడాల లవణ సౌవర్చల లవణములనె%ు పంచలవణములు మంజిష్ఠ పసుపు - మ్రానిపసుపు సూక్ష్మైలా - త్రివృతా పత్రము - వాయు విడంగములు ఇంద్రవారుణీ - మధుకము - వేతనము - తేనె - ఇవి అన్నియు కలిపి కొమ్మునందుంచవలెను; దానినుండి తీసిన మాత్రలను వేడి నీటితో కలిపి సేవించినచో సవిషాహారము జీర్ణమగును; విషములేని దానిని తినినపుడు ఇది సేవించినచో పైత్య దోషము చేయును; శుక్లము నర్జరసము ఉశీరము సర్షపములు ఏలావాలుకములు సువేగ - తస్కరము - సురము- అర్జుకుసుమములు - వీనిపొగవేసినచో ఇంటియందలి స్థావర (పదార్థముల) విషమునను జంగమ (చరప్రాణుల) విషమునను కూడ విరిగిపోవును; ఈ పొగ వ్యాపించుచోట కీటక ములుకాని విషములుకాని కప్పలుకాని సరీసృపములుకాని ఆభిచారిక కృత్యముల ప్రభావములు కాని శక్తిహీనములగును; నెమలిపింఛము కొంగ ఎముకలు నర్షపములు చందనము-నేయి- వీటి పొగ శయనాసన వస్త్ర గృహములందు వ్యాపించినచో విషమును విరుచును; చందనము పాలచెట్టు మోదుగచెట్టుల బెరడు మూర్వా - ఏలవాలుకము సురసము - నాకులి - తండులీయకము - వీనితో కాచిన కషాయము అన్ని విధములగు (స్నాన పానాది) ఉదక కార్యములందును కాకమాచి రసముతో కలిపి వినియోగించినచో విషహరమును హితకరమునగును; గోరోచనము తాళిసపత్రి - నేపాళి - కుంకుమపూవు - వీని చూర్ణములో తిలకము ధరించినచో అతడు విషబాధలనందడు; నరులకును నారులకునను నృపులకును ప్రీతిపాత్రుడునగును; హరిద్ర-మంజిష్ఠ-కిణిహి పిప్పలి వేపచెక్క - వీని చూర్ణముతో పూసిన పదార్థములు నవిషములయినను నిర్విషములగును; సర్వ విషముల స్పర్శందిన శరీరము కూడ విషదోష రహితమగును.

శిరీషస్య ఫలంపత్రం పుష్పం త్వజ్మూల మేవ చ | గోమూత్రఘృష్టో హ్యగద స్సర్వకర్మకర స్స్మృతః.

ఏకవీరమహోషద్య శ్శృణుచాతః పరం నృప | వన్థ్యాకర్కోటకీ రాజన్విష్ణుక్రాన్తా తథోత్కటా. 25

శతమూలీ సితానన్దా(న్తా) బలామోచా పటోలికా | సోమాపిణ్డా నిశాచైవ తథాదగ్ధరుహాచయా. 26

స్థలే కమలినీ యాచ విశాలీ శఙ్ఖమూలికా | చణ్డాలీహస్తిమగధా గో7జాపర్ణోకరమ్భికా. 27

రక్తచైవ మహారక్తా తథా బర్హిశిఖాచయా | కోశాతకీ ననక్తమాలం ప్రియాలం చ సులోచననీ. 28

వారుణీ వసుగ్ధాచ తథావై గన్ధనాకులీ | ఈశ్వరీ శివగన్ధాచ శ్యామలా వంశననాళికా. 29

జతుకాశీ మహాశ్వేతా శ్వేతాచ మధుయష్టికా | వజ్రకః పారిభద్రశ్చ తథావై సిన్ధువారకాః. 30

జీవానన్దా వసుచ్ఛిద్రా నతనాగరకణ్టకా | నాళంచ నాళీజాతీ చ తథాచ వటపత్రికా. 31

కార్తస్యరం మహాననీలా కున్దురు ర్హంసపాదికా | మణ్డూకవర్ణీ వారాహీ ద్వే తథా తణ్డులీయకే. 32

సర్పాక్షీ లవళీ బ్రాహ్మీ విశ్వరూపా సుఖాకరా | రుజావహా వృద్ధికరీ తథా చైవతు శల్యదా. 33

పత్రికా రోహిణీచైవ రక్తమాలా మహౌషదీ | తథామలకవన్ధాకం శ్యామచిత్రఫలాచ యా. 34

కాకోలీ క్షీరకాకోలీ పీలుపర్ణీ తథైవచ | కేశినీ వృశ్చికాలీచ మహానాగా శతావరీ. 35

తథా గరుడవేగా చ జలే కుముదినీ తథా | స్థలే చోత్పలినీ యాచ మహాభూమిలతాచయా. 36

ఉన్మాదినీ సోమరాజీ సర్వరత్నాని పార్థివ | విశేషా న్మరకతాదీని కీటపక్షం విశేషతః. 37

జీవజాతాశ్చ మణయ స్సర్వే ధార్యాః ప్రయత్నతః | రక్షోఘ్నాశ్చ విషఘ్నాశ్చ కృత్యావైతాళనాశనాః. 38

విశేషా న్నరనాగాశ్చ గోఖరోష్ట్రసముద్భవాః | సర్పతిత్తిరి గోమాయువస్త్రమణ్డూక జాశ్చయే. 39

సింహవ్యాఘ్రర్‌క్ష మార్జార ద్వీపివానర సమ్భవాః | కపిఞ్జలా గజవాజి మహిషైణభవాశ్చయే. 40

ఇత్యేవమేతై స్సకలై రుపేతం ద్రవ్యైశ్చ సర్వైస్స్వ పురం సురక్షితమ్‌ |

రాజా77వసేత్తత్ర గృహం సుశుభ్రం గుణాన్వితం లక్షణసమ్ప్రయుక్తమ్‌. 41

ఇతి శ్రీమత్స్యమహాపురాణ రాజధర్మే విషిర్హరణోపాయకథనం

నామ సప్తదశోత్తరద్విశతతమో7ధ్యాయః.

శిరీషవృక్షపు ఫలము పత్రము పుష్పము బెరడు వేరు-ఇన్నియు గోమూత్రముతో అరగదీసిచో సర్వవిషహర మగు ఔషధమగును; ఏకవీరుడవగు మనూ! ఇకమీదట మహౌషధులు (అనేక వ్యాధులపై పనిచేయ ప్రసిద్ధ మూలికలు) చెప్పెదను; వినుము; వంధ్య - కర్కోటకి - విష్ణుక్రాంత - ఉత్కట - శతమూలి - సీత - నంద-బల- మోచా-పటోలిక -సోమ-పిండా - పనపు - దగ్ధరుహ - మెట్టతామర - విశాలి - శంఖమూలిక - చాండాలీ - హస్తిమగధా - గోజాపర్ణీ - కరంభికా - రక్తా - మహారక్తా - బర్హిశివా - కోశాతకీ - నక్తమాలము (కానుగ) - ప్రియాలము - సులోచని - వారుణీ - వసుగంధా - గంథనాకులీ - ఈశ్వరీ - శివగంధా - శ్యామలా - వంశనాళిక - జతుకాళీ - మహాశ్వేతా - శ్వేతా - మధుయష్టికా- వజ్రకము - పారిభద్రము- సిందువారము- జీవానందా - వసు- చ్ఛిద్రా - నతము - నాగరకంటక - నాలము - జాలీ - జాతీ వటపత్రికా - కార్తస్వరము - మహానీలా - కుందురు - హంసపాది- మండూకపర్ణి - వారాహీ - రెండు విధములకు తండు లీయకములు (చిర్రి) సర్పాక్షి-లవలి (రాచఉసిరిగ) బ్రాహ్మి (సరస్వతి) విశ్వరూపా - సుఖాకరా - రుజాపహా - వృద్ధికరీ- శల్యదా - పత్త్రికా రోహిణి - నక్తమాల - శొంఠీ- ఆమలకము - వందాకము - నల్లఉమ్మెత్త - చిత్రఫల - కాకోలీ- క్షీరకా కోలీ - పీలుపర్ణి - కేశినీ - వృశ్చికాలీ - మహాననాగ - శతావరీ- గరుడి - వేగా - నీటికలువ - మెట్టకలువ - మహాభూమిలతా- ఉన్మాదినీ సోమరాజీ- సర్వరత్నములు- విశేషించి గరుడపచ్చ మొదలగువి- కీటపక్షములు (పురుగుల రెక్కలు) జీవజాతములు (వేరువేరు క్రిమికీటకాదులు) మణులు-ఇవన్నియు ప్రయత్నముతో సేకరించి నిలువయుంచు కొనవలయును. రక్షస్సులను విషములను కృత్యలను బేతాళులనను నశింపజేయు సామగ్రిని విశేషించి నరగజ హయ గోఖర సర్పతిత్తిరి గోమాయు - వస్త్ర - మండూకముల నుండి లభించునవియు సింహవ్యాఘ్ర ఋక్ష మార్జాల ద్వీపి వానర కపింజల మహిషముల నుండియు ఇర్రిననుండియు లభించునవియు అగు ఈ పదార్థముల సేకరించవలెను; ఇట్టి ద్రవ్యములతో కూడినదై సురక్షితమును అతి శుభ్రమును సర్వగుణయుక్తమును సర్వలక్షణ సహితమునగు గృహమందు రాజు నివసించవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మములందు

విషనిర్హరణోపాయకథనమను రెండు వందల పదునేడవ అధ్యాయము.

!7;9

Sri Matsya mahapuramu-2    Chapters