Sri Matsya mahapuramu-2    Chapters   

పంచవింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- రాజ్ఞో దండోపాయస్యావశ్యా కర్తవ్యతా.

శ్రీ మత్స్యః: దణ్డప్రణయనార్థాయ రాజా సృష్ట స్స్వయమ్భువా |

దేవభాగా నుపాదాయ సర్వభూతాది గుప్తయే. 1

తేజసా యద( దా) ముం కశ్చి న్నైవ శక్నోతి వీక్షితుమ్‌| దతా భవతి లోకేషు రాజా భాస్కరవ త్ప్రుభుః. 2

యదా7స్య దర్శనే లేకః ప్రసాద ముపగచ్ఛతి | నయనానన్దకారిత్వా త్తదా భవతి చన్ద్రమాః. 3.

యథా యమః ప్రియే ద్వేష్వే ప్రాప్తే కాలే ప్రయచ్ఛతి |

తథా రాజ్ఞా విధాతవ్యాః ప్రజా స్తద్ధి యమవ్రతమ్‌. 4

వరుణన యథా పాశై ర్భద్ధ ఏవ ప్రదృశ్యతే | తథా పాపా న్నిగృహ్ణీయా ద్వ్రత మేతద్ధి వారుణమ్‌. 5

పరిపూర్ణం యథా చన్ద్రం దృష్ట్వా హృష్యన్తి మానవాః |

తథా ప్రకృతయో యస్మి న్త్స చన్ద్రప్రతిమో నృపః. 6

ప్రతాపయుక్త స్తేజస్వీ నిత్యం స్యా త్సర్వకర్మసు | దుష్టసామన్తహింస్రేషు రాజా77గ్నేయ వ్రతే స్థితః. 7

తథా సర్వాణి భూతాని బిభ్రతః పార్థివం వ్రతమ్‌ | ఇన్ద్రస్యార్కస్య వాతస్య యమస్య వరుణస్య చ. 8

చన్ద్రస్యాగ్నేః పృథివ్యాశ్చ తేజోవ్రతం నృపశ్చరేత్‌ |

వార్షికాం శ్చతురో మాసా న్యథేన్ద్రో7ప్యథ వర్షతి. 9

తథా7భివర్షే త్స్వం రాజ్యం కామ మిన్ద్రవ్రతం స్మృతమ్‌ |

అష్టౌమాసా న్యథా77దిత్య స్తోయం హరతి రశ్మిభిః. 10

తథా హరేత్కరం రాష్ట్రా న్నిత్యమర్కవ్రతం హి తత్‌ |

ప్రవిశ్య సర్వభూతాని యథా చరతి మారుతః. 11

తథా చారైః ప్రవేష్టవ్యం వ్రతమేతద్ధి మారుతమ్‌. 11U

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే దణ్డోపాయ విచారే రాజ్ఞ స్సర్వదేవతా స్వరూప కథనం నామ పంతవింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఇరువది యైదవ అధ్యాయము.

రాజు దండోపాయమును అవశ్యమాచరించవలెననుట.

రాజునకు లోకపాలురతోడి సామ్యము.

శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో నిట్లు చెప్పెను: సర్వ భూతములను అధిగోపనము (వాటియందు తాను అధిష్ఠాతగానుండి రక్షణము)చేయుటకై దండోపాయము నాచరించుటకుగా స్వయం భూబ్రహ్మ సకల దేవతాంశములను ఉపాదానకారణము( ముడి నరకు)గా తీసికొని రాజును సృష్టించెను; ఈతని తేజస్సుచే ఈతని నెవ్వరును తేరిపార చూడనైన జాలకు కావున రాజు భాస్కరుడువలెనే లోకములందు ప్రభువనబడుచు రాజ రవిగా వెలుగొందుచున్నాడు; ఎపుడు (ఎందుచే) ఈతని దర్శనమున లోకము ప్రసాదమును (హాయిని) పొందునో అపుడు (అందుచే) అతడు జన నయ నానందకరత్వ గుణముచే (రాజ) చంద్రుడగుచున్నాడు; ఎట్లు యముడు తగిన కాలము వచ్చినపుడు ప్రాణులకు ప్రియ (మగు సుఖ) మును ద్వేష్య(మగు దుఃఖ)మును ఇచ్చుచున్నాడో అట్లే ప్రజలకును రాజు యమ (వ్రతసమాన) వ్రతమును ఆచరించవలసి యుండును; (రాజు ప్రజలలో మంచి వారినాదరించవలెను ; దుష్టులను దండించవలయును; వరుణుడు ఎల్లరును పాశములతో బంధించువాడుగానే కనబడుచున్నాడు; అట్లే రాజుకాడ పాపులను వారిపాపముల ననుసరించి నిగ్రహించ(దండించ)వలెను; ఇది రాజాచరించ వలసిన దారుణవ్రతము (కర్మము) ; పరిపూర్ణుడగు చంద్రుని చూచి నంతనే మానవుడు ఎట్లు హర్షమందునో అట్లే ఎవని విషయమందు ప్రకృతులు (ప్రజలును రాజోద్యోగులును) హర్షింతురో అట్టివాడే చంద్ర సమానుడగు రాజు; రాజు ఆగ్నేయ (అగ్నిసమాన) వ్రతము నందుండి ప్రతాపయుక్తుడును తేజస్వియునై పాపకర్ములగు మానవుల విషయమందును దుష్టులగు సామంతుల విషయమందును హింస్రప్రాణుల విషయమందును ప్రవర్తించవలయును; ధర(భూమి తనంత తానై సర్వభూతములను ధరించునట్లే సర్వభూతములను ధరించు పోషించు -రక్షించు- అదుపులోనుంచు) ఇంద్రార్కవాయు యమవరుణ చంద్రాగ్ని పృథివుల తేజోవ్రత రూపమగు పార్థివవ్రతమును రాజు ఆశ్రయించి చరించుచు వర్తించవలయును; ఇంద్రుడు వర్షర్తు మాసముల నాలుగింటి యందును వర్షించునట్లే రాజు కూడ తన రాష్ట్రమందు ఇచ్చకు వచ్చునట్లు మిక్కిలిగా వర్షించి ఇంద్ర వ్రతవర్తి కావలెను; ఆదిత్యుడు సంవత్సరమందలి ఎనిమిది మాసములపాటు కిరణములతో తోయమును లాగికొనునట్లే రాజును తన రాష్ట్రమునుండి పన్నులను లాగికొనవలెను; ఇది రాజు పూనవలసిన యర్కవ్రతము; మారుతుడు సర్వభూతములయందును ప్రవేశించు సంచరించునట్లే రాజుకూడ చారుల ద్వారమున సర్వభూతముల యందును ప్రవేశించవలయును; ఇది రాజవలబించు మారుత( వాయు) వ్రతము.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున రాజధర్మునన రాజు దండోపాయమును ప్రయోగించుట అవశ్యకర్తమనుటయు రాజునకు లోకపాలురతోడి సామ్యమును అను రెండు వందల ఇరువది యైదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters