Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకచత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- దుస్వప్నసుస్వప్న కథనం - తత్పలంచ.

మనుః స్వప్నాఖ్యానం కథం దేవ గమనే ప్రత్యువస్థితే| దృశ్యన్తే వివిధాకారాః కథం తేషాం ఫలం భ##వేత్‌. 1

శ్రీ మత్స్యః : ఇదానీం కథయిష్యామి నిమిత్తం స్వప్నదర్శనే| నాభింవినా7న్యగాత్రేషు తృమవృక్షసముద్భవః. 2

చూర్ణనం మూర్ధ్ని కాంస్యానాం ముణ్డనం నగ్నతా తథా| మలినాన్బురధారిత్వ మబ్యఙ్గః పఙ్కదిగ్ధతా. 3

ఉచ్చా త్ప్రపతనం చైవ డోలారోహణ మేవ చ| అర్జనం పక్వమాంసానాం హయానా మపి మారణమ్‌. 4

రక్తపుష్పద్రుమాణాం చ చుమ్బనం స్యా త్తథైవచ| వరాహరక్షఖరోష్ట్రాణాం తథా

చారోహణక్రియా. 5

భక్షణం పక్వమాంసానాం తైలస్య సృసరస్యచ| నర్తనం హసనం చైవ వివాహో గీతమేవచ. 6

తన్త్రీవాద్యవిహీనానాం వాద్యానా మపి వాదనమ్‌| స్రోతో7వగాహగమనం స్నానం గోమయవారిణా. 7

పఙ్కోదకేన చ తథా మహీతోయేన చాప్యథ| మాతుః ప్రవేశో జఠరే చితారోహమ మేవచ. 8

శక్రధ్వజాభిపతనం పతనం శశిసూర్యయోః| దివ్యాల్తినరిక్షభౌమానా ముత్పాతానాం చ దర్శనమ్‌. 9

దేవద్విజాతి భూపాలగురూణాం క్రోధ ఏవ చ| ఆలిఙ్గనం కుమారీణాం పురుషాణాం చ మైథునమ్‌. 10

హానిశ్చైవ స్వగాత్రాణాం విరేకమనక్రియా| దక్షిణాశాబిగమనం వ్యాధినా 7భి భవ స్తథా11

ఫలాపహానిశ్చ తథా పుష్పహాని స్తథైవచ| గృహాణాం చైవ పాతశ్చ గృహసమ్మార్జనం తథా. 12

క్రీడా పిశాచక్రవ్యాద వానరరక్షనరై రపి| పరా దభిభవశ్చైవ తస్మాచ్చ వ్యసనోద్భవః. 13

కాషాయ వస్త్రధారిత్వం తద్వత్త్స్రీక్రీజనం తథా| సై#్నహపానావగాహౌ చ రక్తమాల్యానులేపనమ్‌. 14

ఏవమాదీని చాన్యాని దుస్సవప్నాని వినిర్దిశేత్‌| ఏషామ కథనం ధన్యం భూయః ప్రస్వాపనం తథా. 15

కల్కస్నానం తిలైర్హోమో బ్రాహ్మణానాం చ పూజనమ్‌| స్తుతిశ్చ వాసుదేవస్య తథా తసై#్యవ పూజనమ్‌. 16

నాగేన్ద్రమోక్షశ్రవణం జ్ఞేయం దుస్స్వప్ననాశనమ్‌|

రెండు వందల నలుబది యొకటవ అధ్యాయము.

దుఃస్వప్నములు- సుస్వప్నములు- వాని ఫలము.

రాజు యుద్ధ యాత్రకై పోవుటకు ముందుగా కలుగు స్వప్నములు ఫలముల ప్రతిపాదనము ఎట్టిది దేవా! స్వప్నములు వివిధ రూపములలో కనబడును గదా! వాని ఫలములు ఎట్లుండును! అనిని మనువుతో మత్స్యుడిట్లనెను ; ఇకమీదట స్వప్న దర్శన నిమిత్తక ఫలములను తెలిపెదను! నాభియందు కాక అన్యావయవములలదు తృణములు వృక్ష ములు మొలచుట తలపై కాంస్య( కంచు) పాత్రాదికము పడి పగులుట తల బోడియగుట నగ్నత్వము మలిన వస్త్రధారణము నూనెతో తలంటుకొనుట బురద పూసికొనుట ఎత్తునుండి పడుట ఊయెల నెక్కుట ఉడికించిన మాసము తె చ్చు కొనుట గుర్రములను చంపుట ఎర్రని పూలను చెట్లను ముద్దుపెట్టుకొనుట పందులను ఎలుగుబంట్లను గాడిదలను ఒంటెలను ఎక్కుట పక్వమాంసములనో తైలమునో ఫలములనో తినుట నర్తించుట నవ్వుట పెండ్లి జరుగుట పాడుట తంత్రీరహిత వాద్యములను మ్రోగించుట నదిలో స్నానమాడకపోవుట గోమయ జలముతో బురద నీటితో మట్టి కలిసిన నీటితో స్నానమాడుట మాతృగర్భమున ప్రవేశించుట చితిపై ఎక్కుట ఇంద్రధ్వజము పడుట చంద్రసూర్యులు పడుట దివ్యాంతరిక్ష భౌమోత్పాతములు కనబడుట దేవతలు విప్రులు రాజులు గురువులు కోపించుట కన్యలను కౌగిలించుట పురుషులతో సంభోగించుట తన అవయవములకు హానియగుట (రాలుట- విరుగుట) తనకు వేరేచనమగుట వాంతియగుట దక్షిణముగా పయనించిట వ్యాధి వచ్చుట పండ్లు రాలుట పూలు రాలుట ఇండ్లు పడుట ఇండ్లు ఊడ్చుట పిశాచములతో మాంసాహార ప్రాణులతో వానరులతో ఎలుగుబంట్లతో నరులతో ఆడుకొనుట పరులవలన అవమానము వ్యసనము కలుగుట తాను కాషాయ వస్త్రములు ధరించుట స్త్రీలు క్రీడించుట నూనె త్రాగుట నూనెతో స్నానమాడుట ఎర్రని పూలు దాల్చుట ఎర్రని గంధములు పూసికొనుట- ఈ మొదలగులవి దుఃస్వప్నములు ;వీని నితరులకు చెప్పక మరల నిద్రించుట మంచిది; కల్కముతో (ఓషదీ చూర్ణముతో ) స్నానము తిలలతో హోమము బ్రాహ్మణు పూజనము వాసుదేవస్తుతి పూజనములు గజేంద్రమోక్ష కథా శ్రవణము చేయుటచే దుఃస్వప్న దర్శనదోష శాంతి.

స్వప్నాస్తు ప్రథమే యామే సంవత్సర విపాకినః. 17

షడ్భి ర్మాసైర్ద్వితీయే చ త్రిభి ర్మాసై స్తృతీయకే| చతుర్థే మాసమాత్రేణ పచ్యమేతే నాస్తి సంశయః. 18

అరుణోదయవేళాయాం దశాహేన ఫలం భ##వేత్‌| ఏకస్యాం యది వా రాత్రౌ శుభం వా యది వా 7శుభమ్‌. 19

పశ్చాద్దృష్టస్తు య స్స్వప్న స్తస్య పాకం నివిర్దిశేత్‌| తస్మాత్తు శోభ##నే స్వప్నే పశ్చా త్స్వాపో న శస్యతే. 20

శైలప్రాసాద నాగాశ్వ వృషభారోహణం హితమ్‌| ద్రుమాణాం శ్వేతపుష్పాణాం గమనే చ తథా ద్విజ. 21

ద్రుమతృణోద్భవో నాభౌ తథా చ బహుశీర్షతా | తథైవ బహుబహుత్వం పలితేద్భవ ఏవ చ. 22

సుశుక్లమాల్యధారిత్వం సుశుక్లామ్భరధారణమ్‌| చన్ద్రార్కతారాగ్రహణం పరిమాకర్గమ(ర్జన) మేవచ. 23

శక్రధ్వజాలిఙ్గనం చ తదుచ్ఛ్రాయక్రియా తథా| భూమ్యమ్భుదీనాం గ్రసనం శత్రూణాం చ వధ క్రియా. 24

జయో వివాదద్యూతేషు సఙ్గ్రామే చ తథా నృప| భక్షణం చార్ధ్రమాంసానాం మత్స్యానాం పాయసస్య చ. 25

దర్శనం రుధినస్యాపి స్నానం వా రిధిరేణవా| సురారుధిర మద్యానాం పానం క్షిరస్య వా7ప్యథ.26

ఆన్త్రైర్వా వేష్టనం భూమౌ నిర్మలం గగనం తథా| ముఖేన దోహనం శన్తం మహిశీణాం తతా గవామ్‌. 27

సింహీనాం హస్తినీనాం చ బడబానాం తథైవచ| ప్రసాదో దేవవిప్రేభ్యో గురుభ్యశ్చ తతా శుభః. 28

అమ్భసా త్వభిషేకస్తు గవాం శృఙ్గాశ్రితేన చ | చన్ద్రాద్భష్టేన వా రాజ& జ్ఞేయో రాజ్య ప్రదో హి సః. 29

రాజ్యాభిషేకశ్చ తథా ఛేదనం శిరస స్తథా| మరణం వహ్నిదాహశ్చ వహ్నిదాహో గృహాదిషు. 30

లభ్దిశ్చ రాజ్యలిఙ్గానాం తన్త్రీ వాద్యాభివాదనమ్‌| తథోదకానాం తరమం తథా విషమలఙ్ఘనమ్‌. 31

హస్తినీబడబానాం చ గవాం చ ప్రసవో గృహే | ఆగోహమ మథాశ్వానాం రోదనం చ తథాశుభమ్‌. 32

వరస్త్రీణాం తథా లాభ స్తదావిహ్గన మేవచ| నిగళై ర్భన్ధనం ధన్యం తథా విష్ఠానులేపనమ్‌. 33

జీవతాం భూమిపాలానాం సుహృదా మపి దర్శనమ్‌| దర్శనం దేవతార్చానాం విమలానాం తథా7మ్భసామ్‌. 34

శుభాన్యథైతాని నరస్తు దృష్ట్వా ప్రాప్నోత్యయత్నా ద్ధ్రువ మర్థలాభమ్‌| స్వప్నాని వై ధర్మభృతాం వరిష్ఠ వ్యాదే ర్విమోక్షం చ తథా 77తు రోపి. 35

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మత్స్య మనుసంవాదే స్వప్నాను కీర్తనం నామ

ఏకచత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాత్రి ప్రథమయామమున వచ్చిన స్వప్నములు సంవత్సరమునకును ద్వితీయయామ మందలిని ఆరుమాసముల కును తృతీయయామమందలివి మూడు మాసములకును చతుర్థయామ మందలివి ఆరుణోదయ వేళయందలివి పదినాళ్ళకును ఫలమునిచ్చును ;ఒకే రాత్రి యందు రెండు విధములగు కలలు వచ్చినచో వానిలో తరువాత వచ్చినదే ఫలము నిచ్చును; కావున మంచికల వచ్చిన తరువాత మరల నిద్రించుట మంచిది కాదు.

పర్వతములను మేడలను గజాశ్వ వృషభములను ఆరోహించుట తెల్లని పూవులుగాని వృక్షముల నెక్కుట తన నాభియందు వృక్షములుగాని గడ్డిగాని మొలచుట తనకు అనేక శిరస్సులు కలుగుట బహుబాహులేర్పడుట జుట్టునరయుట మిగుల తెల్లని వస్త్రములనో మాల్యములనో ధరించుట చంద్రుని ఆర్కుని తారలను అందుకొనుట వానిని చేతితో తుడచుట ఇంద్రధ్వజమును కౌగిలించికొనుట దానిని పైకెత్తుట భూమిని సముద్రములను మ్రింగుట శత్రువులను వధించుట వివాద ద్యూత యుద్ధములందు జయము పచ్చిమాంసమునో చేపలనో పాయసమునో భక్షించుట రుదిరపాన స్నానములు సురా రుధిరమద్య క్షీరపానములు ప్రేవులు చుట్టుకొని నేలపై దొరలుట ఆకాశము నిర్మలమగుట గేదెల- ఆడు ఏనుగుల - సింహ ముల- గుర్రముల - పాలను తన నోటిలోనికి పిదుకుకొనుట దేవవిప్రగురువులనుండి ప్రసాదము( అనుగ్రహము) పొందుట- ఇవి శుభస్వప్నములు; గోశృంగము నుండియో చంద్రుని నుండియో స్రవించునీటితో స్నానము రాజ్యప్రదము; రాజ్యా భిషేకము -న్వశిరశ్ఛేదము స్వమరమమును - తాను దహింపబడుట- గృహాదికము దగ్ధమగుట రాజలాంఛనములు లభించుట తంత్రీ వాద్యములు మ్రోయించుట ఉదకమును దాటుట (ఈదుట) విషమ ప్రదేశములను లంఘించుట ఇంటియందు ఆడు ఏనుగులో గుర్రములో గోవులో ప్రసవమగుట అశ్వారోహణము రోదనము పరస్త్రీలాబాలింగనములు సంకెలలతో బంధన మందుట మలము పూసికొనుట కాలమున జీవించియున్న రాజులలో మిత్రులనో దర్శించుట దేవతార్చా మూర్తులను గాని విమల జలమును గాని చూచుట శూభములు ;అయత్నముగా ధనలాభము రోగికి రోగముక్తియు ఇట్టి శుభస్వప్నములకు ఫలములు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమువన రాజధర్మమున స్వప్నాను కీర్తనమను

రెండు వందల నలుబది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters