Sri Matsya Mahapuranam-2    Chapters   

షట్‌ చత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

వరాహావతారచరిత్ర ప్రారమ్భః.

అర్జునః ప్రాదార్బావా న్పురాణషు విష్ణో రమితతేజసః | సతాం కథయతాం విప్ర వారాహ ఇతి న శ్శ్రుతమ్‌. 1

జానే న తస్‌య చరితం న విధానం న విస్తరమ్‌ | న కర్మగుణసంస్థానం న వా7ప్యన్తం మనీషిణః. 2

కిమాత్మకో వరాహౌ7సౌ కా మూర్తిః కా7స్య దేవతా | కిం ప్రమాణం ప్రభావః కః కిం వా 7నేన పురా కృతమ్‌. 3

ఏత న్మేశంస తత్త్వేన వరాహోత్పత్తి విస్తరమ్‌ | యథార్థం చ సమేతానాం ద్విజాతీనాం విశేషతః. 4

శౌనకః ఏతత్తే కీర్తియిష్యామి పురాణం బ్రహ్మసమ్మితమ్‌ | మహావరాహచరితం కృష్ణస్యాద్బుత కర్మణః. 5

ఏష నారాయణో రాజ న్వారాహం వపు రాస్థితః | దంష్ట్రయా గాం సముత్రస్థా ముజ్జహారారిమర్ధనః. 6

ఛన్దోగీర్భి రుదారాభి శ్శ్రుతిభి స్సమలఙ్కృతః | మనః ప్రసన్నతాం కృత్వా నిభోధ విజయాధునా. 7

ఇదం పురాణం పరమం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్‌ | నానాశ్రుతిసమాయుక్తం వరాహచరితం మహాత్‌. 8

పురాణవేద మఖిలం సాఙ్ఖ్యయోగం చ వేద యః | కార్త్స్నేయేన విధినా ప్రోక్తం సో 7స్యార్థం వై వదిష్యతి. 9

రెండు వందల నలువదియారవ అధ్యాయము.

వరాహావతారము- దైనందిన ప్రళయ కథనము.

అర్జునుడు శౌనకునిట్లడిగెను; అమిత తేజస్కుడగు విష్ణుని ప్రాదుర్భావ (అవతార)ములను పురాణముల యందుండి చెప్పుచుండిన పెద్దలవలన 'వారాహ' మను దానిని కూడ వినియుంటిమి; మనీషి (సర్వజ్ఞుడు) అగు అవరాహుని చరితమును విధానమును విస్తరమును కర్మగుణ సంస్థానమును నేను ఎరుగను; వరాహుడు కిమాత్మకుడు? వరాహుని ఆత్మతత్త్వము మూర్తి దేవతా ప్రమాణము ప్రభావము ఈతడు పూర్వము చేసిన కృత్యములు ఈ మొదలగు వరాహోత్పత్తి విస్తరమును యాథార్థ్యముతో నాకును విశేషించి ఇట కూడియున్న బ్రాహ్మణులకును తెలియజెప్పుము. అనశౌనకుడిట్లెను; అద్భుత కర్ముడగు కృష్ణుడు మహా వరాహుడై చేసిన చరితములను తెలుపు వేదసమానమగు పురాణ కథను ఇదిగో! నీకు తెలుపుచున్నాను; రాజన్‌! ఈ నారాయణుడు ఉదారములగు శ్రుతులు అనబడు ఛందోమయ వాక్కులతో అలంకృతుడు; ఈతడు వారాహ దేహమాశ్రయించి సముద్రస్థయైయున్న భూమిని తన కోరితో పైకెత్తును; విజయా! ఇపుడు అది ప్రసన్నమగును మనస్సుతో విని ఎరుగుము; ఈ వరాహ వృత్తాంతము పురాణము (ప్రాచీనతమము) పరమము పుణ్యము వేదసమానము; నానా శ్రుతి ప్రతిపాదితార్థములతో సమాయుక్తము; ఈ మహా వరాహ చరితార్థమును అఖిల పురాణములతో కూడ వేదమును కృత్స్న (నిః శేషః) ముగ విధాన సహితముగా సాంఖ్యమును యోగమును ఎరిగినవాడు మాత్రమే చెప్పగలడు.

విశ్వదేవా స్తథా సాధ్యా రుద్రాదిత్యా స్తథా7శ్వనౌ | ప్రజానాం పతయ శ్చైవ సప్త చైవ మహర్షయః. 10

మనస్సఙ్కల్పజా శ్చైవ పూర్వజా ఋషయ స్తథా | వసవో మరుతశ్చైవ గన్ధర్వా యక్షరాక్షసాః. 11

దైత్యాః పిశాచా నాగాశ్చ భూతాని వివిధాని చ | బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యా శ్శూత్రా వ్లుెచ్ఛాశ్చ యే భువి. 12

చతుష్పదాని సత్త్వాని తిర్యగ్యోనిశతాని చ | జఙ్గమాని చ సత్త్వాని యచ్ఛాన్య జ్జీవసంజ్ఞితమ్‌. 13

పూర్ణే యుగసహస్రాన్తే బ్రాహ్మే7హని తథా గతే | నిర్వాణ సర్వభూతానం సర్వోత్పాత సముద్భవే. 14

హిరణ్య రేతా స్త్రిశిఖ స్తతో భూత్వా వృషాకపిః | శిఖాభి ర్వ్యధమ ల్లోకా న శేషా నిహ దేహినః. 15

దహ్యమానా స్తత స్తన్య తేజోరాశిభి రుచ్ఛ్రితైః | వివర్ణవర్ణా దగ్ధాఙ్గా హతార్చిష్మద్భి రాననైః. 16

సాఙ్గోపనిషదో వేదా స్సేతిహాస పురాణకాః | విద్యా స్సర్వాః క్రియాశ్చైవ సర్వధర్మపరాయణాః. 17

బ్రహ్మణ మగ్రతః కృత్వా ప్రభవం విశ్వతోముఖమ్‌ | సర్వదేవగణాశ్చైవ త్రయస్త్రింశచ్ఛ కోటయః. 18

తస్మి న్నహని సమ్ప్రాప్తే తం హంసం మహ దక్షరమ్‌ | ప్రవిశన్తి మహాత్మానం హరిం నారాయణం ప్రభుమ్‌. 19

విశ్వ దేవులు సాధ్యులు రుద్రులు అదిత్యులు అశ్వినులు ప్రజాపతులు సప్త మహర్షులు పసువులు మరుతులు గంధర్వ యక్షరాక్షస పిశాచ నాగులు పరమాత్ముని మనః సంకల్పమున కలిగిన పూర్వజులగు ఋషులు బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యశూద్రులు వ్లుెచ్ఛులు చతుష్పాత్తులు వందల కొలది తిర్యగ్యోవిగత ప్రాణులు జంగమములు (సంచారులు) అగు సకల ప్రాణులు జీవ సంజ్ఞగల ఇతర సకల ప్రాణి వర్గమున ఇందలి దేహులును-ఏది కలదో- దానినంతటిని దివ్య యుగ సహస్రాంత కాలాంతయు ముగియగానే బ్రహ్మ దినము గడువగానే సర్వభూత నిర్వాణ (నాశ)ము తెలుపు సర్వోత్పాతము లును కలుగగానే వృషా కపి (ధర్మ రక్షకుడు) అగు విష్ణుడు జ్వాలా త్రయ యుక్తుడగు అగ్నియు తన జ్వాలతో దహించును; అంతట ఉన్నతములగు అతని తేజోరాశులచే దహింపబడుచు వివిర్ణములును దగ్ధాంగములును జ్వాలా యక్తములగు ఆ అగ్ని నోళ్లతో హతములును నగుచు వేద వేదాంగో పనిషత్పురాణతిహాస ప్రముఖ సర్వ విద్యలును సర్వ క్రియలును సర్వ ధర్మ పరాయణులు త్రయస్త్రింశత్కోటి సర్వదేవ గణములును విశ్వతో ముఖుడును లోక ప్రభవ(జన్మ) హేతువునునగు బ్రహ్మను ముందుంచుకొని ఆ అహము ( సృష్టికాలావధియగు బ్రహ్మ దినము) ముగియగానే మహాతత్త్వ రూపుడును అక్షరుడును మహాత్ముడును ప్రభుడును నారాయణుడు (జీవువకు ఆశ్రయడు)ను నగుహరియందు ప్రవేశించును.

తేషాం భూయః ప్రవృత్తానాం నిధనోత్పత్తి రిష్యతే | యథా సూర్యస్య సతత ముదయాస్తమనే త్విహ. 20

పూర్ణే యుగసహస్రాన్తే కల్పో నిశ్శేష ఉచ్యతే | యస్మి న్జీవకృతం సర్వం నిశ్శేషం సమతిష్ఠతి. 21

సంహృత్య లోకా నఖిలా న్త్సదేవాసురపన్నగా& | కృత్వా77త్మసంస్థం భగవా నాస్త ఏకో జగత్పతిః. 22

య స్స్రష్టా సర్వభూతానాం కల్పాన్తేషు పునః పునః | అవ్యయ శ్శాశ్వతో దేవో యచ్చ సర్వమిదం జగత్‌. 23

నష్టార్కకిరణ లోకే చన్ద్రగ్రహ వివర్జితే | త్యక్తధూమాగ్నిపవనే త్యక్తయజ్ఞవషట్క్రియే. 24

అపక్షిగణసఙ్ఘాతే సర్వప్రాణిహరే పథి | అమర్యాదాకులే రౌద్రే సర్వత స్తమసా77వృతే. 25

అదృశ్యే సర్వలోకే77స్మి న్నభావే సర్వకర్మణామ్‌ | ప్రశాన్తే సర్వసమ్పాతే నష్టే వైరిపరిగ్రహే. 26

గతే స్వభావసంస్థానే లోకే నారాణాత్మకే | పరమేష్ఠీ హృషీకేశ శ్శయనాయోపచక్రమే. 27

పీతవాసా లోహితాక్షః కృష్ణో జీమూతసన్నిభః | శిఖాసహస్రవికచం జటాభారం సముద్వహ& . 28

శ్రీవత్సలక్ష్మసంయుక్తం రక్తచన్దనభూషితమ్‌ | వక్షో బిభ్ర స్మహాబాహు స్సవిద్యుదివ తోయదః. 29

పుణ్డరీకసహస్రేమ స్రగస్య శుశుభే శుభా | పత్నీ తస్య స్వయం లక్ష్మీ ర్దేహ మావృత్య తిష్ఠితి. 30

అవి మరల ప్రవృత్తినందగానే ఆ ప్రవృత్తి సృష్టియనబడును; ఇట్టి నిధనము (నాశము) ఉత్పత్తి ఈ రెండును సూర్యుని ఉదయాస్తమనముల వంటివి; దివ్య యుగ సహస్రాంతమగు కల్పము పూర్ణముకాగా సర్వమునిఃశేషమగును; అనగా నిఃశేషమగు జీవ జాతకర్మ జాతము పరమాత్మునందు ప్రవేశించు నిలుచును; అపుడు జగత్పతియగు భగవానుడు దేవాసురనాగాది సకల జీవులనుసంహరించి తన యందుంచుకొని తానొక్కడే ఉండును; సర్వభూత స్రష్ట అవ్యయుడు శాశ్వతుడునగు ఆ దేవుడు ఆయా కల్పాంతములందు పునః పునః ఈ జగమునంతటిని ఇట్లు చేయుచునే యుండును; ఇట్లు లోకమందు అర్క కిరణములు చంద్రాది గ్రహములు ధూమము అగ్ని పవనుడు యజ్ఞములు వషట్కారములు పక్షి గమ సంఘాతము లేకపోగా మార్గములన్నియు సర్వప్రాణి హారములుకాగా జగము రౌద్ర రూపమును మర్యాదా రహితమునై కల్లోలికముకాగా అంతయు అంధకారావృతముకాగా సర్వలోక మదృశ్యముకాగా సర్వకర్మలు అభావమందగా సర్వ సంఘర్షములు ప్రశాంతములుకాగా వైరములందుటయు నశించగా లోకమంతయు నారాయణాత్మకమయి తన స్వస్వ భావమున నిలిచి యుండగా పరమేష్ఠి (ఉన్నత స్థానమందుడువాడు) హృషేకేశుడునగు హరిశయనించ నారంభించె(చు)ను; అతడు పీతాంబరుడు రక్త నేత్రుడు మేఘ సమాన నీలవర్ణుడు జ్వాలా సహస్ర వికాసియగు జటా భారము కలవాడు శ్రీవత్స లాంఛనముతో రక్త చందనముతో భూషితము అగు వక్షము కలవాడు మహా బాహుడు మెరుపులతో అలంకృతమగు మేఘము వంటివాడు; అపుడతని శరీరము వేలకొలదిగ పద్మములతో కూర్చిన మాలతో ప్రకాశించు చుండును; అతని పత్నియగు లక్ష్మీదేవి అతని దేహ మావరించి యుండును.

తత స్స్వపితి శాన్తాత్మా సర్వలోకసుఖావహాః | కిమప్యమితయోగాత్మా నిద్రాయోగ

ముపాగతః. 31

తతో యుగసహస్రే తు పూర్ణే పురుషసత్తమః| స్వయమేవ విభు ర్భూత్వా బుధ్యతే విబుధాధిపః. 32

తత శ్చిన్తయతే భూయ స్సృష్టిం లోకస్య లోకకృతే | నరా న్దేవగాణాంశ్చవ పారమేష్ఠ్యేన కర్మణా. 33

తత స్సఞ్చిన్తయ న్కార్యం దేవేషు సమితిఞ్జయః | సమ్భవం సర్వలోకస్య విదధాతి సతాం గతిః. 34

కర్తా చైవ వికర్తా చ సంహర్తా చ ప్రజాపతిః | నారాయణః పరం సత్యం నారాయణః పరం పదమ్‌. 35

నారాయణః పరో యజ్ఞో నారాయణః పరా గతిః | స స్వయమ్భూరితి జ్ఞేయ స్స స్రష్టా భువనాధిపః. 36

స సర్వమితి విజ్ఞేయో హ్యేష యజ్ఞః ప్రజాపతిః | య ద్వేదితవ్యం త్రిదశై స్తదేష పరికీర్త్యతే. 37

యచ్ఛ వేద్యం భగవతో దేవా అపి న త ద్విదుః | ప్రజానాం పతయ స్సర్వే ఋషయశ్చ సహామరైః. 38

'నాస్యాన్త మధిగచ్ఛన్తి విచిన్వన్త 'ఇతి శ్రుతిః | యదస్య పరమం రూపం న తత్పశ్యన్తి దేవతాః. 39

ప్రాదుర్భావే తు యద్రూపం తత్పశ్యన్తి దివౌకసః | దర్శితం యదనేనైవ తదేవేక్షన్తి దేవతాః. 40

యన్న దర్శితవానేష కస్త దన్వేష్టు మర్హతి | గ్రామణీ స్సర్వభూతానా మగ్నిమారుతయో

ర్గతిః 41

తేజస స్తమసశ్చైవ నిధాన మమృతస్యచ | చతురాశ్రధర్మేశ శ్చాతుర్హోథ్రఫలాశనః. 42

చతుస్సాగరపర్యన్త శ్చతుర్యుగనివర్తకః | తదేష సంహృత్య జగ త్కృత్వా గర్భస్థ మాత్మనః. 43

ముమోచాణ్డం మహాయోగీ ధృతం వర్షసహస్రకమ్‌ | సురాసురద్విజభుజగాప్సరోగ

ణౖర్ద్రుమోషధిక్షితిధరయక్షగుహ్యకైః. 44

ప్రజాపతి శ్శ్రుతిభి రసజ్కులం తదా సవై7 సృజజ్జగదిద మాత్మనా ప్రభుః. 44u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ శౌనకార్జునసంవాదే వరాహచరిత్రే దైనందినప్రళయ é

కథనం నామ షట్‌ చత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

అంతట శాంతాత్మురు సర్వలోక సుఖావహుడు అమితయోగాత్ముడుఅగు అతడు

నిద్రారూపయోగ మాశ్రయించి నుప్తుడగును; అంతట మరల దివ్యయుగ సహస్రము ముగియగా విబుధులకు (దేవతలకు మహా జ్ఞానులకు) అధిపతియగు ఆవిభుడు స్వయముగానే వి-భుడు (విశేషముగా ప్రకాశించువాడు) అయి మేల్కాంచును; లోకకర్తయగు అతడు మరల లోకసృష్టి నాలోచించును; తన పరమేష్టికార్యమున కనువుగా సర్వదేవ గణములను నరులను సమితింజయుడు (సర్వ యుద్ధవిజేత)గా వారి విషయమున తాను చేయవలసిన కృత్యములను ఆలోచించి సజ్జనులకు గమ్యస్థానమగు ఆ ప్రభువు సర్వలోక సంభవమును (సృష్టిని) ఆచరించును; ఆ నారాయణుడే సృష్టి కర్త - వికర్త (మార్పునొందించువాడు) పోషించువాడు) సంహరించువాడు ప్రజాపతియు పరమసత్యమును పరమపదమును పరమయజ్ఞమును అతడేయని శాస్త్రప్రమాణములతోను అనుభవముతోను తెలియవలయును; దేవతలును ఎరుగవలసినదితనినేయనియు అతని ఏతత్త్వము నెరుగవలయునో దానిని ఎరుగకున్నారనియు దేవతలును సర్వప్రజాపతి ఋషులును అతని అంతము నెరుగకున్నారనియు వేదాదిశాస్త్రములు చెప్పుచున్నవి; ఈతని పరమ (తాత్త్విక) రూపమును దేవతలును చూడకున్నారు; వారును ప్రాదుర్భావముల (అవతారము) లందు అతడు చూపు రూపముననేకాని చూపని వాస్తవ రూపమును చూడజాలరు; అట్టిదానినెవరు వెదకి చూడగలరు? అతడు సర్వభూతగ్రామణి (శ్రేష్ఠుడు); అగ్ని వాయువులకును ఆశ్రయుడు- తేజమునకును అంధకారమునకును నిధానరూపుడు; అశ్రమచతుష్టయ ధర్మాధిపతి; చాతుర్హోత్రయజ్ఞ ఫలముననుభవించువాడు- అనుభవింపజేయువాడు- చతుస్సాగర పర్యంతుడు చతుర్యుగ (దివ్య మహాయుగ) నివర్తకుడు (సృష్టినిలయమందించువాడు); అట్టి ఇతడు జగత్సంహారమొనర్చి దానిని తనయందు నిలుపు కొని మాహాయోగియై తనయందట్లు దివ్యవర్ష సహస్రకారము నిలుపుకొన్న అండమును మరల వదలు(లె)ను; ఇదియేసృష్టి. ప్రజాపతియు ప్రభుడునగు అతడు తనకుతానై (అసహాయుడై) సురాసుర విప్రనాగాప్సరో వృక్షోషధి పర్వత యక్షగుహ్యక సంకులమగు ఈ జగమంతయు సృజించె(చు)ను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వరాహ చరిత్రమున ప్రళయ ప్రతిపాదనమను

రెండు వందల నలువదియారవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters