Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోనాశీత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః

హిరణ్యాశ్వదానవిధానమ్‌.

శ్రీ మత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి హిరణ్యాశ్వవిధిం పరమ్‌| యస్య ప్రదానా ద్భువనే చానన్త్యం ఫల మశ్నుతే. 1

పుణ్యాం తిథి మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్‌| లోకేశావాహనం కుర్యా త్తులాపురుషదానవత్‌. 2

ఋత్విఙ్మణ్డపసమ్భారభూషణాచ్ఛాదనాదికమ్‌| స్వల్పే త్వే కాగ్ని వత్కర్యా ద్దేమవాజిమఖం బుధః. 3

స్థాపయే ద్వేదిమధ్యేతు కృష్ణా జినతిలోపరి| కౌశేయవస్త్రం సంవీతం కారయే ద్ధేమవాజినమ్‌. 4

శక్తిత స్త్రిపలాదూర్ధ్వ మాసహస్రపలా త్తథా| పాదుకోపానహచ్ఛత్రం చామరాసనభాజనైః. 5

పూర్ణకుమ్భాష్టకోపేతం మాల్యేక్షుఫలసంయుతమ్‌| శయ్యాం సోపస్కరాం తద్వ ద్ధేమమార్తాణ్డసంయుతామ్‌. 6

తత స్సర్వౌషధీస్నాన స్నాపితకో విప్రపుఙ్గవైః| ఇమ ముత్తారయే న్మన్త్రం గృహీతకుసుమాఞ్జలిః. 7

నమస్తే సర్వదేవేశ వేదాహరణలమ్పట| వాజిరూపేణ మా మస్మా త్పాహి సంసారసాగరాత్‌. 8

త్వమేవ సప్తధా భూత్వా చన్ధోరూపేణ భాస్కర| యస్మా ద్ర్భమయసే లోకా నతః పాహి సనాతన. 9

ఏవ ముచ్చార్వ గురవే తమశ్వం వినివేదయేత్‌| దత్వా పాపక్షయా ద్భానో ర్లోక మభ్యేతి శాశ్వతమ్‌. 10

గోభి ర్విభవత స్సర్వా నృతిజశ్చాపి పూజయేత్‌| సర్వధాన్యోపకరణం గురవే వినివేదయేత్‌. 11

సర్వం హిరణ్యాశ్వవిధిం కరోతి య స్సమ్సూజ్యమానో దివి దేవసఙ్ఘైః | విముక్త పాప స్స పదం మురారేః ప్రాప్నోతి సిద్ధై రభిపూజిత స్స&. 13

ఇతి పఠతి య ఏత ద్ధేమవాజిప్రదానం సకలకలుషయుక్త స్సో7శ్వమేధేన యుక్తః

కనకమయవిమానేనా7 ర్కలోకం ప్రయాతి త్రిదశపతివధూభిః పూజితో యో 7భిపశ్యేత్‌. 14

యో వా శృణోతి పురుషో7 ల్పధన స్స్మరేద్వా హేమాశ్వదాన మభినన్దతి చేహ లోకే|

సో7పి ప్రయాతి హతకల్మషశుద్ధదేహ స్థ్సానం పురన్దరమహేశ్వరదేవజుష్టమ్‌. 15

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదాను కీర్తనే హిరణ్యా శ్వ ప్రదానికో

నామ ఏకోనాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

హిరణ్యాశ్వ దాన విధానము.

శ్రీ మత్స్యుడు మనువునకిట్లు చెప్పెను: ఇపుడిక షోడశమహాదాన క్రమ మునందలి హిరణ్యాశ్వదాన విధానమును తెలిపెదను; ఇది చాల ఉత్తమమయినది; దీని నిచ్చినందువలన దాత భువనములందు విలక్షణముగ అనంతమగు ఫలము నందును ; పుణ్య కరమగు శుభతిథియందు విప్రులచే పుణ్యాహవాచనమును లోకపాలనా వాహనమును ఋత్విజులను మండపమును సంభారములను భూషణములను వస్త్రములు మొదలగు వానిని తులా పురుష దానమునందువలెనే జరుపవలెను; స్వల్ప ప్రక్రియతో జరుపదలచిన వారు ఏకాగ్ని విధానముతోనే ఈ హిరణ్యాశ్వ దాన యక్షమును తరుపలెను; బంగరు గుర్రమును తన శక్తి ననుసరించి మూడు పలములకంటె ఎక్కువగ సహస్ర పలములకు మించిన బంగారుతో చేయించి దానిని వేదీ మధ్యమందు కృష్ణాజినముపై నూవులయందు వట్టువస్త్రములతో చుట్టి ఉంచవలయును; దాని దగ్గర పాదుకలు పాదరక్షలు ఛత్త్ర చామరాసన పాత్రములు ఎనిమిది పూర్ణ కుంభములు మాల్యములు చెరకు గడలు ఫలములు ఉపస్కరములతో కూడ శయ్య బంగరు సూర్యుడు- ఇవి యన్నియు ఉంచవలెను; తరువాత యజమానుడు బ్రాహ్మణులచే సర్వౌషధీ స్నానము జరిపించుకొని దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రముచ్చరించవలయును:

''సర్వదేవేశా! రూపమున వేదములను తెచ్చుటయందు ఆసక్తి కలవాడా! (హయగ్రీవ) అశ్వరూపముతో నీవును మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము; భాస్కరా నీవే చందోరూపమున ఏడుగానయి (వేదమునందలి ప్రధాన చందస్సులు ఏడు మాత్రమే )

లోకములను ప్రవర్తిల్లజేయుచున్నావు; కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము''.

ఇట్లుచ్చరించి ఆయశ్వమును గురువునకు అర్పించవలయును; దాని ఫలముగా పాపక్షమగుటవలన శాశ్వత మగు భాను లోకమును పొందును; తరువాత యథాశక్తిగా గోవులతో ఋత్వికులను పూజించవలయును; సర్వధాన్యోపతరణములను గురువునకు ఈయవలెను. శయ్య మొదలగునవి కూడ (పాత్రులకు) దానముచేసి తైలరహితముగు ఆహారమును భుజించవలయును; పురాణ శ్రవణమును భోజనాదికమును జరిపించవలెను.

ఈ హిరణ్యాశ్వ దాన మొనర్చినవాడు పాపముక్తుడై స్వర్గమున సిద్ధులచే ఇతర దేవసంఘములచే పూజితుడగుచు నారాయణపదప్రాప్తుడగును; దీనిని పఠించువాడును సకల పాపముక్తుడై అశ్వమేధఫలము నందును; కనకమందు విమానమున రవిలోకమేగి అట అప్సరః పూజితుడగును; అల్పధన పురుషుడు దీనిని వినను చూచినను స్మరించి మెచ్చి నను అట్టివాడును పాపనాశమున శుద్ధదేహుడై ఇంద్ర రుద్రాదులు వసించు లోకములందును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వ ప్రదానికమను రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters