Sri Matsya Mahapuranam-2    Chapters   

చతురశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

విశ్వచక్రదానవిధానమ్‌.

శ్రీమత్స్యః

 అథాత స్సమ్ర్పవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ | విశ్వచక్ర మితి ఖ్యాతం సర్వపాతకనాశనమ్‌. 1

తపనీయస్య శుద్ధస్య విషువాదిషు కారయేత్‌ | జ్యేష్ఠం పలసహస్రేణ తదర్ధేనతు మధ్యమమ్‌. 2

తదర్ధేన కనిష్ఠం స్యా ద్విశ్వచక్ర ముదాహృతమ్‌ | అన్య ద్వింశపలా దూర్ధ్వ మశక్తో7పి నివేదయేత్‌. 3

షోడశారం తతశ్చక్రం భూషణౖ రష్టధా పృతమ్‌ | నాభిమధ్యే స్థితం విష్ణుం యోగారూఢం చతుర్భుజమ్‌.

శఙ్ఖచక్రే7స్య పార్శ్వేతు దేవ్యష్టక సమావృతమ్‌ | ద్వితీయావరణ తద్వ త్పూర్వతో జలశాయినమ్‌. 5

అత్రి ర్భృగు ర్వసిష్ఠశ్చ బ్రహ్మా కశ్యప ఏవచ | మత్స్యః కూర్మో వరాహశ్చ నరసింహో7థ వామనః. 6

రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీతి తే దశ | తృతీయావరణ గౌరీ మాతృభి ర్బహుభి ర్యుతా. 7

చతుర్థే ద్వాదశాదిత్యా వేదా శ్చత్వార ఏవచ | పఞ్చమేపఞ్చభూతానిరుద్రాశ్చైకాదశైవ తు. 8

లోకపాలాష్టకం షష్ఠే దిఙ్మాతఙ్గా స్తథైవచ | సప్తమే7స్త్రాణి సర్వాణి మఙ్గళ్యాని చ కారయేత్‌. 9

అన్తరాన్తరతో దేవా న్విన్యసే దష్టమే పునః | తులాపురుషవ చ్ఛేషం సమన్తా త్పరికల్పయేత్‌. 10

ఋత్విఙ్మణ్డపసమ్భార భూషణాచ్ఛాదనాని చ | విశ్వచక్రం తతః కుర్యా త్కృష్ణాజినతిలోపరి.11

తథా7ష్టాదశ ధాన్యాని రసాంశ్చ లవణాదికా& | పూర్ణకుమ్భాష్టకం చైవ వస్త్రణి వివిధానచ. 12

శాలీక్షుఫలరత్నాని వితానం చాపి కారయేత్‌ | తతో మఙ్గళశ##బ్దేన స్నాత శ్శుక్లామ్బరో గృహీ. 13

హోమాధివాసనాన్తేతు గృహీతకుసుమాఞ్జలిః | ఇమ ముచ్చారయే న్మన్త్రం త్రిః కృత్వాతు ప్రదక్షిణమ్‌. 14

రెండు వందల ఎనుబది నాలుగవ అధ్యాయము.

విశ్వ చక్రదాన విధానము.

శ్రీ మత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను; ఇపుడిక అనుత్తమమును సర్వపాతకనాశనమును నగు విశ్వచక్ర ప్రదానిక మను ప్రఖ్యాత మహా దానమును తెలిపెదను; విషువాది పుణ్యదినములయందు ఈ దానమాచరించవలయును; అందులకై జ్యేష్ఠమైనచో వేయి - మధ్యమముగా ఐదు వందలు కనిష్ఠముగా రెండు వందల - ఏబది - పలముల శుద్ధ సువర్ణముతో - మరియు అశక్తుడు ఇరువది పలముల కెక్కువ - బంగరుతో విశ్వచక్రము (సమస్త ప్రపంచమండలము)ను చేయించవలయును; అనంతరము అందు పదునారు అరలు(ఆకులు)కల ఎనిమిది ఆవరణములుకల చక్రమును యంత్రరూపమున చేయించవలెను. ఆ చక్రపు నాభియం (కుండ అనబడు భాగమునం)దు ఉండునట్లు యోగారూడుడు చతుర్భుజుడునగు విష్ణుని చేయించవలెను; ఇతనికడ శంఖచక్రములును చుట్టును ఎనిమిది అరలయందు అష్ట(లక్ష్మీ) దేవులునుందురు. మిగిలిన ఎనిమిది అరలయందును వివిధ భూషణముల ఆవృతులు చిత్రించవలయును. (ఇదిలోపలినుండి ప్రథమావరణము); ఇక ద్వితీయావరణమున - తూర్పున జలశయనునకు కూర్పుగా అత్రి భృగువసిష్ఠ బ్రహ్మకశ్యపులను మత్స్య కూర్మవరాహనారసింహవామన రామ రామకృష్ణ బుద్ధ కల్కులను పదిమందిని మొత్తము పదునారుమందిని రూపొందించవలెను. తృతీయావరణమున బహు (15 మంది) మాతృకలతో *కూడి గౌరి యుండును; చతుర్థా వరణమున ద్వాదశాదిత్యులు చతుర్వేదములును పంచమావరణమున పంచభూతైకాదశ రుద్రాష్టలోకపాలురు అను పదునారుమంది యుందురు. షష్ఠావరణమున అష్టదిగ్గజములును అష్టదిక్పాలురును (16) ఉంరురు. సప్తమావరణ మున సర్వాస్త్రములను మంగళకరదేవతాదుల అన్నిటిని ఉంచవలెను; అష్టమావరణమున అంతరాంతర (నడుమ నడుమ ఉంచదగిన) దేవతలను పదునారుమందినెవరినైన నుంచవలెను; మిగిలినవన్నియు అన్నివైపులను తులాపురుష దానమందు వలె ఏర్పరచవలెను; అట్లే ఋత్విజులను మండపమును సంభారములను భూషణములను వస్త్రములను సమకూర్చుకొనవలెను. తరువాత విశ్వచక్రప్రతిమను కృష్ణాజినముపై తిలలపై నుంచవలెను; అష్టాదశధాన్యములను లవణాదిరస ద్రవ్యములను ఎనిమిది పూర్ణకుంభములను వివిధ వస్త్రములను శాలిధాన్యమును చెరకుగడలను ఫలములను రత్నములను ఉంచి వితానకమును ఏర్పరచవలయును; తరువాత యజమాన గృహస్థుడు మంగళవాద్య వేదధ్వనులతో స్నానమాడి శుక్లవస్త్రములను ధరించి హోమమును అధివాసనమును నైన తరువాత దోసిట పూవులు తీసికొని దేవతా ప్రతిమాదులను త్రిఃప్రదక్షిణించి ఈ మంత్రముచ్చరించవలయును.

నమో విశ్వమయాయేతి విశ్వచక్రాత్మనే నమః | పరమానన్దరూపీ త్వం పాహి సంసారసాగరాత్‌. 15

తేజోమయ మిదం యస్మా త్సదా పశ్యన్తి యోగినః |

హృది చక్రం గుణాతీతం విశ్వచక్రం నమా మ్యాహమ్‌. 16

వాసుదేవే స్థితం చక్రం చక్రమధ్యేతు మాధవః | అన్యోన్యాధారరూపేణ ప్రణమామి స్థితావిహ. 17

విశ్వచక్ర మిదం యస్మా త్సర్వపాపహరం పరమ్‌ | ఆయుధం చాధవాసశ్చ భవా దుద్ధర మామతః. 18

ఇత్యామన్త్ర్యచ యో దద్యా ద్విశ్వచక్రం విమత్సరః | విముక్త స్సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయతే.

వైకుణ్ఠలోక మాసాద్య చతుర్బాహు స్సనాతనః | సేవ్యతే7ప్సరసాం సఙ్ఘై స్తిష్ఠే త్కల్పశతత్రయమ్‌. 20

ప్రణమేద్‌ ద్వాదశ కృత్వో విశ్వచక్రం దినేదినే | తస్యాయు ర్వర్ధతే నిత్యం లక్ష్మీశ్చ విపులాభ##వేత్‌. 21

ఇతి సకలజగత్సురాధివాసం వితరతి య స్తపనీయషోడశారమ్‌ |

హరిభవన ముపాగత స్స సిద్ధైశ్చిర మధిగమ్య నమస్యతే శిరోభిః. 22

శుభదర్శనతాం ప్రయాతి శత్రోర్‌ మదనసుదర్శనతాంచ కామినీభ్యః |

స సుదర్శనకేశవానురూపః కనకసుదర్శన దానదగ్ధపాపః. 23

కృతగురుదురితాని షోడశార వ్రవితరణ ప్రవరాకృతి ర్మురారేః |

అభిభవతి భవోద్భవాతిభీతిం భవ మభితో భువనే భయాని భూయః. 24

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మహాదానానుకీర్తనే విశ్వచక్రప్రదానికో

నామ చతురశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

*ఈ పదునైదు మంది మాతృకలలో ఏడు మంది బ్రాహ్మీ మొదలగు చాముండ వరకు ఏడుమందియనుట తెలిసినదే; ఇంకను ఎనిమిది మందిని ఎవరినైనను అంధకానురవధ కథలో చెప్పిన వారి నుండి ఎన్నుకొనవచ్చును.

''విశ్వమయుడవగు నీకు నమః; విశ్వచక్రాత్ముడవగు నీకు నమస్కారము; పరమానందరూపుడవగునీవుమమ్ము సంసారసాగరము నుండి కాపాడుము; యోగులు సదా తమహృదయమందు త్రిగుణాతీతమగు ఈతేజోమయ చక్రమును దర్శించుచుందురు; కావున ఇట్టి ఈ విశ్వ చక్రమును నేను నమస్కరించుచున్నాను; వాసుదేవునియందు చక్రమున్నది; విశ్వచక్ర మధ్యమందు మాధవుడు ఉన్నాడు; ఇందు ఇట్లు అన్యోన్యాధార రూపమున నున్న ఈ ఇరువురను నమస్కరించుచున్నాను; ఈ విశ్వచక్రము సర్వపాపహరమును పరమము (ఉత్తమము)ను; ఇది విష్ణునకు ఆయుధమును అధివానస్థానమును ఐయున్నది. ఇంత గొప్పదానవు కావున ఓ విశ్వ చక్రమాః ఈ సంసారమునుండి నన్నుద్ధరించుము.''

ఇట్లామంత్రించి విశ్వచక్రమును విమత్పురుడై (మత్సరము - ఇతరులలో పోటీ - లేనివాడై) దానమొనగువాడు సర్వపాపవిముక్తుడై విష్ణులోకమందు పూజితుడై సుఖమందును; అతడు విష్ణులోకము చేరి సనాతనుడును చతుర్బాహుడు నగు విష్ణునిరూపముతోనుండి అప్సరఃసంఘములచే సేవింపబడుచు మూడు వందల కల్పములుండును; దినదిన మందును విశ్వచక్రమునకు పండ్రెండుమారులు నమస్కరించవలయును; అట్టి వానికి ఆయుర్వృద్ధియగును; నిత్యమును విపులయగు లక్ష్మియు కలుగును; ఇట్లు సకల జగత్తులకును సురలకును అధివాసమును పదునారు అరలుకలదియునగు ఈ స్వర్ణమయ విశ్వచక్రమును ఎవరు దానము చేయుదరో - అట్టివారు హరిలోకమును పొంది సిద్ధులచేతను శిరస్సులతో నమస్కరింపబడుచు చిరకాలము సుఖమందురు; అతడు కనక సుదర్శనదానము చేత దగ్ధపాపుడై సుదర్శన చక్రముతోను కేశవునితోను అనురూపుడు (వారిని పోలినవాడు) అయి తన శత్రువులకును శుభదర్శనుడు (వారికి శత్రువుగా కాక మిత్రుడుగా కనబడువాడు) అగును; స్త్రీలకు మన్మథునివలె అందుమగా కనబడువాడు అగును.

*ఇట్లు దానము ఈయబడు ఈ షోడశార విశ్వచక్రమునందలి మురారి యుత్తమ రూపము మానవులచే చేయబడిన మహా పాపములను సంసారమువలన జనించెడు అత్యంతభయమును భువనమునందు సంభవించెడు ఆయా భయములను మిక్కిలిగా అణగద్రొక్కి వేయును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశమహాదానామ కీర్తనమున విశ్వచక్రప్రదానికమను

రెండు వందల ఎనుబది నాలుగవ అధ్యాయము.

*మత్స్య-284 అ; 24 శ్లో.

భావ ప్రధానో నిర్దేశః :

కృత గురుదురితాని షోడశార -

ప్రవితరణ ప్రరాకృతిర్మురారేః |

అభిభవతి భవోద్భవాతి భీతిం |

భవమభితో భువనే భయాని భూయః.

షోడశారప్రవితరణ - ప్రవితీర్యమాణ - షోడశారే - వర్తమానా మురారేః ప్రవరా77కృతిః కృత గురుదురి తాని భవోద్భవాతి భీతిం - భవం అభితః (వర్తమానాని) భువనే భయాని భూయః అభిభవతి. తా. షోడశార పద్మపు దానమునందు (దానముగా ఈయబడుచున్న ఈ షోడశారము నందు) ఉన్నమురారి రూపము నేను చేసిన మహా పాపములను సంసారమువలన భయమును సంసారమునకు చుట్టును లోకమున మాకు కనబడు భయములనుకూడ నశింపజేయుగాక!

Sri Matsya Mahapuranam-2    Chapters