sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోనవింశో ధ్యాయః - విష్ణు శంకరుల స్తోత్రములు సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను- మాలావతీ ధనం దత్వా బ్రాహ్మణభ్యః ప్రహర్షితా | చకార వివిధం వేషం స్వాత్మనః స్వాత్మన ః స్వామిన ః కృతే || 1 భర్తుశ్చకార శుశ్రూషాం పూజాం చ సమయోచితాం | తేన సార్థం సురసికా రేమే సా సుచిరం ముదా|| 2 మహాపురుషస్తోత్రం చ పూజాం చ కవచం మనుం | వస్మృతం బోధయామాస స్వయం రహసి సువ్రతా || 3 పురాదత్తం వసిష్ఠేన స్తోత్రపూజాదికం హరేః | గంధర్వాయ చ మాలత్యై మంత్రమేకం చ పుష్కరే || 4 విస్మృతం స్తోత్రకవచం వసిష్ఠశ్చ కృపానిధిః | గంధర్వరాజం రహసి బోధయామాస శూలినః || 5 ఏవం చకార రాజ్యం చ కుబేరభవనోసమే | ఆశ్రమే పరమానందో గంధర్వో బాంధవైస్సహ || 6 యథాతథా గతాభిశ్చ స్త్రీభిరన్యాభిరేవచ | ఆగత్య తాభిః స్వస్వామీ సంప్రాప్తః పరయాముదా || 7 మాలావతి సంతోషముతో బ్రాహ్మణులకు ధనమును ఇచ్చి, తన భర్త కొరకు చక్కగా అలంకరించుకొని తన భర్తకు సమయోచితమైన శుశ్ష్రూష చేయుచు అతనితో చాలాకాలము సుఖముగాఉండెను. ఆమె విస్మృతి చెందిన తన భర్తకు మహాపురుషుడు స్తోత్రమును, పూజను, మంత్రమును, కవచమును, రహస్య ప్రదేశమున బోధించెను. శ్రీమన్నారయణుని పూజాస్తోత్ర కవచాదులను వసిష్ఠమహర్షి ఉపబర్హణ గంధర్వునకు, మాలావతికి, పుష్కరక్షేత్రమున ఉపదేశించెను. దయాసముద్రుడైన వసిష్ఠమహర్షి గంధర్వరాజైన ఉపబర్హణనకు ఆతడు మరచిపోయిన శంకరుని స్తోత్ర కవచములను తిరిగి రహస్య ప్రదేశమున బోధించెను. ఉపబర్హణుడు కుబేర భవనమువంటి ఇంటిలోనుండి రాజ్యము చేయుచుండగా ఆతనిని వదలిపెట్టి వెళ్ళిన ఇతర స్త్రీలు మరల తిరిగివచ్చి తమ స్వామితో సుఖముగా నుండిరి. శౌనక ఉవాచ- శౌనకమహర్షి ఇట్లనెను- కిం స్తోత్రం కవచం విష్ణోర్మంత్రపూజావిదిః పురా | దత్తో వసిష్ఠస్తాభ్యాం చ తం భవాన్ వక్తుమర్హసి || 8 ద్వాదశాక్షరమంత్రం చ శూలినః కవచాదికం | దత్తం గంధర్వరాజాయ వసిష్ఠేన చ కిం పురా || 9 తదపి బ్రూహి హేసౌతే శ్రోతుం కౌతూహలం మమ | శంకరస్తోత్రకవచం మంత్రం దుర్గతినాశనం || 10 ఓసౌతిమహర్షి! వసిష్ఠ మహర్షి ఆ గంధర్వ దంపతులకు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ మంత్రమును, స్తోత్రమును, కవచమును పూజావిధిని ఉపదేశించెను? అట్లే గంధర్వరాజైన ఉపబర్హణునకు శంకరునికి సంబంధించిన ఏ ద్వాధశాక్షర మంత్రమును, కవచాదికములను ఉపదేశించెనో వాటినన్నిటిని చెప్పుము. శంకరుని స్తోత్రకవచములు, మంత్రము పఠించువారి కష్టములన్నిటిని పోగొట్టును. కావున వాటినన్నిటిని వివరముగా నాకు తెలుపుము. సౌతిరువాచ - స్తౌతిమహర్షి ఇట్లు పలికెను- తుష్టావ యేన స్తోత్రేణ మాలతీ పరమేశ్వరం | తదేవ స్తోత్రం దత్తం చ మంత్రం చ కవచం శ్రుణు || 11 ఓం నమోభగవతే రాసమండలేశాయ స్వాహా | ఇమం మంత్రం కల్పతరుం ప్రదదౌ షోడశాక్షరం || 12 పురా దత్తం కుమారాయ బ్రహ్మణా పుష్కరే హరేః | పురా దత్తంచ కృష్ణేన గోలోకే శంకరాయ చ || 13 ధ్యానం చ విష్ణోర్వేదోక్తం శాశ్వతం సర్వదుర్లభం | మూలేన సర్వం దేయం చ నైవేద్యాదికముత్తమం || 14 అతీవ గుప్తకవచం పితుర్వక్రాన్మయా శ్రుతం | పిత్రే దత్తం పురా విప్ర గంగాయాం శూలినా ధ్రువం || 15 శూలినే బ్రహ్మణ దత్తం గోలోకే రాసమండలే | ధర్మాయ గోపీకాంతేన కృపయా పరమాధ్భుతం || 16 మాలావతి భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి చేసిన స్తోత్రమే శ్రీకృష్ణస్త్రోత్రము ఇక మంత్రము, కవచములను నీవు వినుము. ''ఓం నమో భగవతే రాసమండలేశాయ స్వాహా'' అను ఈ మంత్రము పదునారు అక్షరములు కలది. భక్తులకు కల్పతరువువంటి ఈమంత్రమును పుష్కర క్షేత్రమున బ్రహ్మదేవుడు కుమారునికి ఇచ్చెను. పూర్వకాలమున ఈ మంత్రమును శ్రీకృష్ణుడు, గోలోకమున శంకరునకుపదేశించెను. ఈ మంత్రస్తోత్రాదులందున్న శ్రీహరి ధ్యానము శాశ్వతమైనది. అందరకు దుర్లభ##మైనది. మంత్రస్తోత్రాదుల జపము తరువాత చక్కని నైవేద్యమును పెట్టవలెను. బహురహస్యమైన ఈ కవచము నాకు మాతండ్రివలన లభించినది. మాతండ్రికి శంకరుడే స్వయముగా గంగాతీరమున ఉపదేశించెను. గోపీ కాంతుడైన శ్రీకృష్ణుడు గోలోకమున రాసమండలమున బ్రహ్మకు, శంకరునికి, ధర్మదేవతకు పరమాధ్భుతమైన ఈమంత్రమును ఉపదేశించెను. బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లుపలికెను- రాధాకాంత మహాభాగ కవచం యత్ర్పకాశితం | బ్రహ్మాండపావనం నామ కృపయా కథయ ప్రభో || 17 మాం మహేశం చ ధర్మం భక్తం చ భక్తవత్సల | త్వత్ర్పసాదేన పుత్రేభ్యో దాస్యామి భక్తిసంయుతః || 18 ఓరాధాకాంతుడవగు శ్రీకృష్ణా! బ్రహ్మాండమును పవిత్రము చేయు నీకవచమును నాకు, మహేశ్వరునకు, ధర్మునకు తెలిపితివి. నేను నీ అనుగ్రహముతో ఈకవచరాజమును నా పుత్రులకుపదేశింతును. దీనికై మీరు అనుగ్రహించవలెను. శ్రీకృష్ణ ఉవాచ- శ్రీ కృష్ణుడిట్లనెను - శ్రుణు వక్ష్యామి బ్రహ్మేశ ధర్మేదం కవచం పరం | అహం దాస్యామి యుష్మభ్యం గోపనీయం సుదుర్లభం || 19 యసై#్మ కసై#్మ న దాతవ్యం ప్రాణతుల్యం మమైవహి | యత్తేజో మమ దేహేzస్తి తత్తేజః కవచేzసిచ || 20 కురు సృష్టిమిమం ధృత్యా ధాతా త్రిజగతాం భవ | సంహర్తా భవ హే శంభో మమ తుల్యో భ##వే భ##వే || 21 హే ధర్మ త్వమిమం ధృత్వా భవ సాక్షీ చ కర్మణాం | తపసాం ఫలదాతరో యూయం భవత మద్వరాత్ || 22 బ్రహ్మాండపావనస్యాస్య కవచస్య హరిః స్వయం | ఋషశ్ఛందశ్చ గాయత్రీ దేవోహం జగదీశ్వరః || 23 దర్మార్థ కామ మోక్షేషు వినియోగః ప్రకీర్తితః | త్రిలక్షవారపఠనాత్ సిద్ధిదం కవచం విధే || 24 యో భ##వేత్సిద్దకవచో మమ తుల్యో భ##వేచ్చ సః | తేజసా సిద్ది యోగేన జ్ఞానేన విక్రమేణ చ || 25 ఓ బ్రహ్మా, శివ, ధర్మదేవతలారా! నేను చెప్పు ఈ కవచము చాలా శ్రేష్ఠమైనది. రహస్యమైనది అందరికి లభించునది కాదు. అట్టి కవచమును అనర్హులకు చెప్పకూడదు. ఇది నా ప్రాణములతో సమానమైనది. నా శరీరములో ఉన్న తేజస్సు నా కవచమందు కూడ ఉన్నది. నా కవచమును ధరించి బ్రమ్మదేవుడా నీవు సృష్టికర్తవు కమ్ము. ఓ శంకరా! నీవు సంహారకారకుడవు కమ్ము. ఓధర్మా దేవతా! నీవు సమస్త ప్రాణులు చేయు సమస్త కర్మలకు సాక్షివి కమ్ము. నాయొక్క వరమువలన తపస్సు యొక్క ఫలితమును మీరు ఇవ్వగలరు. బ్రహ్మాండమునంతయు పవిత్రము చేయగలిగిన ఈ కవచమునకు శ్రీహరియే ఋషి, ఛందస్సు గాయత్రీ ఛందస్సు. నేనే దీనికి దేవతను, ధర్మ, అర్థ, కామ , మోక్షములలో దీనికి వినియోగము కలదు. దీనిని మూడు లక్షల మార్లు పఠించిన కవచము సిద్దించును. అట్లు పఠించినవాడు సిద్దకవచుడు, నాతో సమానమైనవాడు కాగలడు. ప్రణవో మే శిరః పాతు నమో రామేశ్వరాయ చ | ఫాలం పాయాన్నేత్రయుగ్మం నమో రాధేశ్వరాయ చ || 26 కృష్ణః పాయాత్ శ్రోత్రయుగ్మం హే హరే ఘ్రాణమేవ చ | జిహ్వికాం వహ్ని జాయా తు కృష్ణాయేతి చ సర్వతః || 27 శ్రీకృష్ణాయ స్వాహేతి చ కంఠం పాతు షడక్షరః | హ్రీం కృష్ణాయ నమో వక్త్రం క్తీం పూర్వశ్చ భుజద్వయం || 28 నమో గోపాంగనేశాయ స్కంధావష్టాక్షరోzవతు | దంతపంక్తిమోష్ఠయుగ్మం నమో గోపీశ్వరాయచ|| 29 ఓం నమోభగవతే రాసమండలేశాయ స్వాహా | స్వయం వక్షః స్థలం పాతు మంత్రోzయం షోడశాక్షరః || 30 ఐం కృష్ణాయ స్వాహేతి చ కర్ణయుగ్మం సదాzవతు | ఓం విష్ణవే స్వాహేతి చ కపోలం సర్వతోzవతు || 31 ఓం హరయే నమ ఇతి పృష్టం పాదం సదాzవతు | ఓం గోవర్ధనధారిణ స్వాహా సర్వశరీరకం || 32 ప్రాచ్యాం మాం పాతు శ్రీకృష్ణః ఆగ్నేయ్యాం పాతు మాధవః | దక్షిణ పాతు గోపీశో నౌఋత్యాం నందనందనః || 33 వారుణ్యాం పాతు గోవిందో వాయువ్యాం రాధికేశ్వరః | ఉత్తరే పాతు రాసేశః ఐశాన్యామచ్యుతః స్వయం || 34 సతతతం సర్వతః పాతు పరో నారాయణః స్వయం | ఇతి తే కథితం బ్రహ్మన్ కవచం పరమాద్భుతం || 35 ఓం నమో రామేశ్వరాయ అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక, ఓం నమో రాధేశ్వరాయ అనునది నానొసటిని కళ్ళను రక్షించుగాక, కృష్ణుడు చెవులను రక్షింపనిమ్ము. ఓ హరీ! నాసికను రక్షింపుము. స్వాహా అనుమంత్రము నా నాలుకకును, కృష్ణాయ అనునది నా సర్వమును రక్షింపనిమ్ము. ''ఓం కృష్ణాయ స్వాహా'' అను షడక్షరమంత్రము కంఠమును, హ్రీం క్లీం కృష్ణాయ నమః అను మంత్రము ముఖమును, భుజములను, నమో గోపాంగనేశాయ అను అష్టాక్షర మంత్రము స్కంధ భాగములను, నమో గోపీశ్వరాయ అను మంత్రము దంతములను, పెదవులను, ఓంనమో భగవతే రాసమండలేశాయ అనుషోడశాక్షర మంత్రము వక్షస్థలమును కాపాడుగాక. అట్లే ఐం కృష్ణాయ స్వాహా అనుమంత్రము చెవులను, ఓం విష్ణవే స్వాహా అను మంత్రము చెక్కిళ్ళను ఓం హరయేనమః అనుమంత్రము వీపును, పాదములను, ఓంగోవర్ధనధారిణ స్వాహా అను మంత్రము సమస్త శరీరమును రక్షింపనిమ్ము! తూర్పు భాగమున శ్రీకృష్ణుడు, ఆగ్నేయ దిశయందు మాధవుడు, దక్షిణ దిశయందు గోపీశుడు, నైఋతి దిశయందు నందనందనుడు, పశ్చిమ దిశయందు గోవిందుడు, వాయవ్యమున రాధికేశ్వరుడు, ఉత్తరమున రాసక్రీడాపతి, ఈశాన్యమున అచ్యుతుడు, నారాయణుడు నా శరీరమంతయు రక్షించుగాక. ఓ బ్రహ్మదేవుడా! పరమాద్భుతమైన నా కవచమును నీకిప్పుడు చెప్పితిని. మమజీవన తుల్యం చ యుష్మభ్యం దత్తమేవ చ | అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ || కళాం నార్హంతి తాన్యేప కవచసై#్యవ ధారణాత్ || 36 గురుమభ్యర్చ్య విధివత్ వస్త్రాలంకార చందనైః| స్నాత్వా తం చ నమస్కృత్య కవచం ధారయేత్సుధీః || 37 కవచస్య ప్రసాదేన జీవన్ముక్తో భ##వేన్నరః | యది స్యాత్సిద్దకవచో విష్ణురేవ భ##వేద్ద్విజ || 38 నా ప్రాణములతో సమానమైన ఈ కవచమును మీకొసగితిని. వేయి అశ్వమేధయాగములు వందల కొలది వాజపేయ యాగములు ఈ శ్రీకృష్ణ కవచముయొక్క ఒక అంశ##కైనను సరిపడవు. విజ్ఞుడైనవాడు ఈ కవచమును గురువునకు శాస్త్రపద్దతిననుసరించి బట్టలు, అలంకారములు చందనాదులతో గౌరవించి, అతనికి, కవచమునకు, నమస్కరించి కవచమును ధరించవలెను. ఈ కవచము యొక్క అనుగ్రహమువలను మానవుడు జీవన్ముక్తుడు కాగలడు. అతనికి కవచము సిద్దించినచో స్వయముగా విష్ణువే కాగలడు. సౌతి రువాచ - సౌతి మహర్షి ఇట్లు పలికెను- శివస్య కవచం స్తోత్రం శ్రూయతామిత శౌనక | వసిష్టేన చ యద్దత్తం గంధర్వాయ చ యో మనుః || 39 ఓం నమో భగవతే శివాయ స్వాహేతి చ మనుః | దత్తోవసిష్ఠేన పురా పుష్కరే కృపయావిభో || 40 అయం మంత్రో రావణాయ ప్రదత్తో బ్రహ్మణా పురా | స్వయం శంభుశ్చ బాణాయ తథా దుర్వాససే పురా || 41 మూలేన సర్వం దేయం చ నైవేద్యాదికముత్తమం | ధ్యాయేన్నిత్యాదికం ధ్యానం వేదోక్తం సర్వసమ్మతం || 42 శౌనక మహర్షి! శివుని యొక్క కవచము స్తోత్రము, మంత్రము, పూర్వము వసిష్టుడు గంధర్వరాజైన ఉపబర్హణనకుపదేశించెను. దానిని నీవు వినుము. ఓం నమో భగవతే శివాయ స్వాహా అను పన్నెండు అక్షరముల శివ మంత్రమును దయతో పుష్కర క్షేత్రమున వసిష్ఠుడు గంధర్వరాజునకుపదేశించెను. పూర్వము ఈ మంత్రమును బ్రహ్మదేవుడు రావణాసురునకుపదేశించెను. శంకరుడు దీనిని బాణాసురునకు దుర్వాస మహర్షికి ఉపదేశించెను. మంత్రమును ధ్యానించుటకు ముందు ఉత్తమ నైవేద్యమును సమర్పించవలయును. ఓం నమో మహాదేవాయ - మహాదేవునకు నమస్కారము . బాణాసుర ఉవాచ- బాణాసురుడిట్లనెను- మహేశ్వర మహాభాగ కవచం యత్ర్పకాశితం | సంసారపావనం నామ కృపయా కథయ ప్రభో || 43 ఓమహేశ్వర! సంసారమును పవిత్రము చేయు నీకవచమును కృపతో తెల్పుము. మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను - శ్రుణు వక్ష్యామి హే వత్స కవచం పరమాధ్భుతం | అహం తుభ్యం ప్రదాస్యామి గోపనీయం సుదుర్లభం || 44 పురా దుర్వాససే దత్తం త్రైలోక్యవిజయాయ చ || 45 మమైవేదం చ కవచం భక్త్యా యో ధారయేత్సుధీః | జేతుం శక్నోతి త్రైలోక్యం భగవన్నవలీలయా || 46 సంసారపావనస్యాస్య కవచస్య ప్రజాపతిః | ఋషిశ్చందశ్చ గాయత్రీ దేవోzహం చ మహేశ్వరః || 47 పంచలక్షజపేవైవ సిద్ధిదం కవచం భ##వేత్ | యో భ##వేత్సిద్ధకవచో మమ తుల్యో భ##వేద్భువి || తేజసాసిద్దియోగేన తపసా వక్రమేణచ || 48 ఓ బాణాసురుడా! పరమాద్భుతము, రహస్యముగా నుంచతగినది, దుర్లభ##మైనది అగు నా కవచమును ఇంతకుముందు దుర్వాసమహర్షికి త్రైలోక్య విజయమునకై ఉపదేశించితిని. ఈ నాకవచమును భక్తితో ఎవరు ధరింతురో వారు ముల్లోకములను అవలీలగా జయించగలరు. సంసారపావనమైన ఈ కవచమునకు ప్రజాపతి ఋషి, గాయత్రి ఛందస్సు. నేనే దేవతను. ఈకవచమును ఐదు లక్షల మార్లు చదివినచో సిద్ది కలుగును. ఈ కవచమును సిద్ది చేసికొనిన వాడు నాతో సమానమగును. శంభుర్మే మస్తకం పాతు ముఖం పాతు మహేశ్వరః | దంతపంక్తిం నీలకంఠోzప్యధరోష్ఠం హరః స్వయం || 49 కంఠం పాతు చంద్రచూడః స్కంధౌ వృషభవాహనః | వక్షస్థలం నీలకంఠః పాతు పృష్ఠం దిగంబరః || 50 సర్వాంగం పాతు విశ్వేశః సర్వదిక్షు చ సర్వదా | స్వప్నే జాగరణ చైవ స్థాణుర్మే పాతు సంతతం || 51 ఇతి తే కథితం బాణ కవచం పరమాద్భుతం | యసై#్మ కసై#్మ న దాతవ్యం గోపనీయం ప్రయత్నతః || 52 యత్ఫలం సర్వతీర్థానాం స్నానేన లభ##తే నరః | తత్ఫలం లభ##తే నూనం కవచసై#్యవ ధారణాత్ || 53 ఇదం కవచమజ్ఞాత్వా భ##జేన్మాం యః సుమందధీః | శతలక్షప్రజోప్తోzపి న మంత్రః సిద్ధిదాయకః || 54 శంభువు నాశిరస్సును, మహేశ్వరుడు నాముఖమును, నీలకంఠుడు నాదంతములను, హరుడు అధరోష్ఠమును, చంద్రశేఖరుడు కంఠమును, వృషభవాహనుడు స్కంధములను, నీలకంఠుడు వక్షస్థలమును, దిగంబరుడు పృష్ఠభాగమును, విశ్వేశుడు నా సర్వాంగములను అన్ని దిక్కులలోను రక్షించుగాక. అట్లే స్థాణువు స్వప్నమునందు జాగ్రదవస్థలోను నన్ను రక్షించుగాక. ఓ బాణాసురుడా! పరమాద్భుతమైన నా కవచమును నీకు చెప్పితిని. దీనిని జాగ్రత్తగా కాపాడవలెను. ఎవరికి బడితే వారికి ఇవ్వకూడదు. ఈకవచమువలన సర్వ పుణ్యతీర్థములందు చేసిన స్నానఫలము లభించును. ఈకవచమును తెలిసికొనక పఠించకుండ, నా మంత్రమును నూరు లక్షలమార్లు జపించినను ఆ మంత్రము సిద్ధిని పొందదు. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను - ఇదం చ కవచం ప్రోక్తం స్తోత్రం చ శ్రుణు శౌనక | మంత్రరాజః కల్పతరుః వసిష్ఠో దత్తవాన్ పురా || 55 కల్పతరువు వంటి మంత్ర రాజమును, శివకవచమును, స్తోత్రమును వసిష్ఠుడు గంధర్వరాజునకు పూర్వముపదేశించెను. ఓం నమశ్శివాయ - శివునకు నమస్కారము బాణాసుర ఉవాచ- బాణాసురు డిట్లనెను- వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితం | యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుం || 56 జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనం | తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం || 57 తపోరూపం తపోబీజం తపోధనధనం వరం | వరం వరేణ్యం వరదమీడ్యం సిద్ధగణౖర్వరైః || 58 కారణం భుక్తి ముక్తీనాం నరకార్ణవతారణం | ఆశుతోషం ప్రసన్నాస్యం కరుణామయసాగరం || 59 హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభం | బ్రహ్మజ్యోతిః స్వరూపం చ భక్తానుగ్రహ విగ్రహం || 60 విషయాణాం విభేదేన బిభ్రతం బహురూపకం | జలరూపమగ్నిరూపమాకాశరూపమీశ్వరం || 61 వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహత్ప్రభుం | ఆత్మనః స్వపదం దాతుం సమర్థమవలీలయా || 62 భక్తజీవనమీశం చ భక్తానుగ్రహకాతరం | వేదా న శక్తా యం స్తోతుం కిమహం స్తౌమి తం ప్రభుం || 63 అపరిచ్ఛిన్నమీశానమహో వాఙ్మనసోః పరం | వ్యాఘ్రచర్మాంబరధరం వృషభస్థం దిగంబరం || త్రిశూలపట్టిశధరం సస్మితం చంద్రశేఖరం || 64 ఇత్యుక్త్వా స్తవరాజేన నిత్యం బాణః సుసంయతః | ప్రాణమచ్ఛంకరం భక్త్వా దుర్వాసాశ్చ మునీశ్వరః || 65 ఇదం దత్తం వసిష్ఠేన గంధర్వాయ పురామునే | కథితం చ మహాస్తోత్రం శూలినః పరమాద్భుతం || 66 దేవతలలో శ్రేష్ఠుడు, దేవతలకు ఈశ్వరుడు, యోగీశ్వరుడు, యోగములకు కారణభూతుడు, యోగులకు, గురువులకు గురువైన ఆ మహాదేవుని నమస్కరింతును. అతడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానరూపి, జ్ఞాన కారణము, సనాతనుడు, తపః ఫలితముల నిచ్చువాడు, సమస్త సంపదల నిచ్చువాడు, తపః స్వరూపుడు, తపస్సు చేయుటకు కారణమైనవాడు, తపోధనులనే ధనముగా భావించువాడు అట్టి శంకరుని నమస్కరింతును. ఇంకను అతడు సర్వశ్రేష్ఠుడు, వరములనిచ్చువాడు, సిద్ధులందరిచే నమస్కరింపబడినవాడు, భుక్తికి ముక్తికి కారణభూతుడు, నరకమనే సముద్రమును దాటించువాడు. అతడు అల్పసంతోషి, శాంతుడు, కరుణాసాగరుడు, మంచు, చందనము, మల్లెపూవులవలె తెల్లనివాడు. బ్రహ్మస్వరూపము. జ్యోతిఃస్వరూపుడు. భక్తులననుగ్రహించుటకై దేహమును ధరించినవాడు. విషయ భేదములననుసరించి అనేక రూపములను ధరించువాడు, పంచభూత స్వరూపుడు సూర్యచంద్రరూపుడు, భక్తులకు తన స్థానమునైనా అవలీలగా నిచ్చువాడు. భక్తులకు ప్రాణము వంటివాడు. భక్తులననుగ్రహింపవలెనను కోరిక కలవాడు. అట్టి పరమేశ్వరుని వేదములే స్తుతింపలేవనిన అతనిని స్తుతించుటకు నేనెంతటివాడను. వాక్కులకు మనస్సునకు అతీతుడు, వ్యాఘ్ర చర్మాంబరధారి, వృషభవాహనుడు, దిగంబరుడు, త్రిశూలము, పట్టిశము అను ఆయుధముల ధరించు చంద్రశేఖరుని నేను నమస్కరింతును. ఈవిధముగా బాణుడు ఈ స్తోత్రముచే శంకరుని స్తుతించెను. దుర్వాసమహర్షి కూడ అతనిని స్తుతించెను. ఈ పరమేశ్వర స్తోత్రమును వసిష్ఠుడు గంధర్వరాజైన ఉపబర్హణునకు పూర్వము ఉపదేశించెను. ఇదం స్తోత్రం మహాపుణ్యం పఠేద్భక్త్యా చ యో నరః | స్నానస్య సర్వతీర్ధానాం ఫలమాప్నోతి నిశ్చితం || 67 అపుత్రో లభ##తే పుత్రం వర్షమేకం శ్రుణోతి యః | సంయతశ్చ హవిష్యాశీ ప్రణమ్య శంకరం గురుం || 68 గళత్కుష్ఠీ మహాశూలీ వర్షమేకం శ్రుణోతి యః | అవశ్యం ముచ్యతే రోగాద్వ్యాసవాక్యమితి శ్రుతం || 69 కారాగారే పి బద్ధో యో నైవ ప్రాప్నోతి నిర్వృతిం | స్తోత్రం శ్రుత్వా మాసమేకం ముచ్యతే బంధనాత్ ధ్రువం || 70 భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భక్త్యా మాసం శ్రుణోతి యః | మాసం శ్రుత్వా సంయతశ్చ లభేద్భ్రష్టధనో ధనం || 71 యక్ష్మగ్రస్తో వర్షమేకం ఆస్తికో యః శ్రుణోతి చేత్ | నిశ్చితం ముచ్యతే రోగాత్ శంకరస్య ప్రసాదతః || 72 యః శ్రుణోతి సదా భక్త్యా స్తవరాజమిమం ద్విజ | తస్యాసాధ్యం త్రిభువనే నాస్తి కించిచ్చ శౌనక || 73 కదాచిద్బంధువిచ్ఛేదో న భ##వేత్తస్య భారతే | అచలం పరమైశ్వర్యం లభ##తేనాzత్ర సంశయః || 74 సుసంయతోzతి భక్త్యా చ మాసమేకం శ్రుణోతి యః | అభార్యో లభ##తే భార్యాం సువినీతాం సతీం వరాం || 75 మహామూర్ఖశ్చ దుర్మేధా మాసమేకం శ్రుణోతి యః | బుద్ధిం విద్యా చ లభ##తే గురూపదేశమాత్రతః || 76 కర్మదుఃఖీ దరిద్రశ్చ మాసం భక్త్యా శ్రుణోతి యః | ధ్రువం విత్తం భ##వేత్తస్య శంకరస్య ప్రసాదతః || 77 ఇహలోకే సుఖం భుక్త్వా కృత్వా కీర్తిం సుదుర్లభాం | నానాప్రకారధర్మం చ యాత్యంతే శంకరాలయం || 78 పార్షదప్రవరో భూత్వా సేవతే తత్ర శంకరం | యః శ్రుణోతి త్రిసంధ్యం చ నిత్యం స్తోత్రమనుత్తమం || 79 మిక్కిలి పుణ్యప్రదమైన ఈ స్తోత్రమును భక్తితో చదివిన వాడు సర్వతీర్థములలో స్నానము చేసిన ఫలితమును పొందును. ఒక్క సంవత్సరము ఈ స్తోత్రమును భక్తితో పఠించినచో, విన్నచో పుత్రులు లేనివాడు పుత్రులను, కుష్ఠు, మహాశూలవంటి గొప్పవ్యాధులు కలవారు నిర్వ్యాధిత్వమును పొందగలరు. ఒక మాసము పర్యంతము ఈ స్తోత్రమును శ్రద్ధగా చదివినవాడు, విన్నవాడు కారాగారములో బద్ధుడైనచో బంధనిర్ముక్తుడగును. భ్రష్టరాజ్యుడు రాజ్యమును, ధనభ్రష్టుడు ధనమును పొందును. మూడు పూటలు ప్రతి దినము ఈ స్తోత్రమును చదివినచో లేన విన్నను అతనికి ముల్లోకములలో అసాధ్యమనునది ఉండబోదు. అతనికి బంధువుల వియోగము జరుగదు. అంతులేని ఐశ్వర్యము కూడ లభించును. భార్యారహితుడు ఒక నెలలోనే మంచి భార్యను పొందును. మహామూర్ఖుడైనను, తెలివి తక్కువాడైనను ఈ స్తోత్రపఠనమువలన మంచి బుద్ధిని విద్యను పొందును. పూర్వ కర్మలవల్ల దరిద్రుడైనను అధిక ధనమును పొందును. ఈ స్తోత్రమును ఎల్లప్పుడు పఠించువాడు ఇహలోకమున సుఖముననుభవించి, పరమున శంకరుని స్థానము చేరుకొని, ఆ మహాదేవునకు అనుచరుడై, అచ్చట ఎల్లప్పుడు శంకరుని సేవించుకొనుచుండును. ఇతిశ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే విష్ణు శంకరస్తోత్ర కథనం నామ ఏకోనవింశోzధ్యాయః | శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున బ్రహ్మ ఖండమున సౌతి శౌనక సంవాద సమయమున చెప్పబడిన విష్ణు శంకర స్తోత్రములు గల పందోమ్మిదవ అధ్యాయము సమాప్తము.