నవరత్నమాలికా

 

హారనూపురకిరీటకుణ్డలవిభూషితావయవశొభినీం

కారణేశవరమౌళికొటిపరికల్ప్యమానపదపీఠికామ్|

కాలకాలఫణిపాశబాణధనురఙ్కుశామరుణమేఖలాం

ఫాలభూతిలకలొచనాం మనసి భావయామి పరదేవతామ్||౧||

 

హారములు-అందేలు-కిరీటము-కుండలములు అలంకరింపబడిన అవయవములతొ శొభించుచున్నదీ, ప్రపంచమునకు కారణమైన దేవతల కిరీటములే పాదపీఠముగా కలదీ, యముని సైతం సంహరించు నాగపాశము-బాణము-ధనుస్సు-అంకుశము ధరించినదీ, ఏర్రని ఒడ్డాణము పేట్టుకున్నదీ, నొసటి యందు తిలకము వంటి మూడవ కన్ను కలదీ, అగు పరదేవతను మనస్సు నందు ద్యానించుచున్నాను.

 

గన్ధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం

సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్|

మన్థరాయతవిలొచనామమలబాలచన్ద్రకృతశేఖరీం

ఇన్దిరారమణసొదరీం మనసి భావయామి పరదేవతామ్||౨||

 

కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యములతొ పరిమళించు తమలపాకుల రసముతొ సువాసనలు వేదజల్లు నొరు కలదీ, సంధ్యారాగము వలే ఏర్రనైన పేదవిపై చిరునవ్వే ఆభరణముగా కలదీ, మత్తైన విశాలనేత్రములు కలదీ, బాలచంద్రుడు శిరొభూషణముగా నున్నదీ, విష్ణుమూర్తికి సొదరియైనదీ, అగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను.

 

స్మేరచారుముఖమణ్డలాం విమలగణ్డలంబిమణిమణ్డలాం

హారదామపరిశొభమానకుచభారభీరుతనుమధ్యమామ్|

వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం

మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్||౩||

 

చిరున్నవ్వుతొ అందమైన ముఖము కలదీ, స్వచ్చమైన చేంపలపై వ్రేలాడుచున్న మణికుండలములు ధరించినదీ, హారములతొ, పూల దండలతొ శొభించుచున్న స్తనమండలములు - సన్నని నడుము కలదీ, వీరుల గర్వమును పొగొట్టు అందేలు కలదీ, వివిధ దేవతలచే సేవింపబడు సీంహాసనముపై అధిష్ఠించినదీ, శివుణి సహధర్మచారిణియగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను.

 

భూరిభారధరకుణ్డలీన్ద్రమణిబద్ధభూవలయపీఠికాం

వారిరాశిమణిమేఖలావలయవహ్నిమణ్డలశరీరిణీమ్|

వారి సారవహకుణ్డలాం గగనశేఖరీం చ పరమాత్మికాం

చారు చంద్రరవిలొచనాం మనసి భావయామి పరదేవతామ్||౪||

 

మిక్కిలి భారమును మొయు ఆదిశేషుని పడగల పై నున్న మణులతొ పొదగబడిన భూమండలమే పీఠముగా నున్నదీ, సముద్రము నందలి మణులు ఒడ్డాణముగా గల అగ్ని మండలమే శరీరముగా కలదీ, రత్న కుండలములు ధరించినదీ,ఆకాశమే కిరీటముగా కలదీ, పరమాత్మయైనదీ, అందమైన చంద్రుడు-సూర్యుడు-కన్నులుగా కలదీ అగు పరదేవతను మనస్సునందు ధ్యానించుచున్నాను.

 

కుణ్డలత్రివిధకొణమణ్డలవిహారషడ్దలసముల్లస-

త్పుణ్డరీకముఖభేదినీం తరుణచణ్డభానుతడిదుజ్జ్వలామ్|

మణ్డలేన్దుపరివాహితామృతతరఙ్గిణీమరుణరూపిణీం

మణ్డలాన్తమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్||౫||

 

కుండలము వలే ఉన్న త్రికొణమండలము నందు సంచరించు ఆరురేకుల పద్మమును వికసింపచేయునదీ, సూర్యునివలే-మేరుపువలే ప్రకాసించుచున్నదీ, చంద్రమండలము నందు ప్రవహించు అమృత నదియైనదీ, ఏర్రని రంగు కలదీ, శ్రీచక్రమునందు ప్రకాశించు మణిదీపమైనదీ అగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.

 

వారణాననమయూరవాహముఖదాహవారణపయొధరాం

చారణాదిసురసున్దరీచికురశేఖరీకృతపదామ్బుజామ్|

కారణాధిపతిపఞ్చకప్రకృతికారణప్రథమమాతృకాం

వారణాన్తముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్||౬||

 

వినాయక-సుబ్రమణ్యుల దాహమును తీర్చు పాలిండ్లు కలదీ, దేవతాస్త్రీల కేశము లందు అలంకారముగా నున్న పాదపద్మములు కలదీ, జగత్కారణులైన దేవతలకు కూడ మూలకారణమైనదీ, ఐశ్వర్యమును అనుభవింపచేయునదీ, అగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.

 

పద్మకాన్తిపదపాణిపల్లవపయొధరాననసరొరుహాం

పద్మరాగమణిమేఖలావలయనీవిశొభితనితమ్బినీమ్|

పద్మసమ్భవసదాశివాన్తమయపఞ్చరత్నపదపీఠికాం

పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్||౭||

 

పద్మముల వంటి పాదములు-చిగురుటాకుల వంటి చేతులు-తామరల వంటి స్తనములు ముఖము కలదీ, పద్మరాగమణుల ఒడ్డాణమును ధరించినదీ, బ్రహ్మ మొదలు సదాశివుని వరకు ఉన్న దేవతలు పాదపీఠముగా ఉన్నదీ, ఉత్తమ స్త్రీమూర్తియు, ఒంకారస్వరూపిణియగు పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.

 

ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం

ఆగమావయవశొభినీమఖిలవేదసారకృతశేఖరీమ్|

మూలమన్త్రముఖమణ్డలాం ముదితనాదమిన్దునవయౌవనాం

మాతృకాం త్రిపురసున్దరీం మనసి భావయామి పరదేవతామ్||౮||

 

వేదము లందలి ఒంకారము పీఠముగా కలదీ, స్వచ్చమైన మంగళ శరీరము కలదీ, వేదములే అవయవములుగా కలదీ, సమస్తవేదసారము శిరొభూషణముగా ధరీంచినదీ, మూలమంత్రమే ముఖముగా నున్నదీ, నాదబిందువులే నవయౌవనముగా నున్నదీ, జగన్మాతయైనదీ అగు త్రిపురసుందరిని మనస్సునందు ధ్యానించుచున్నాను.

 

కాలికాతిమిరకున్తలాన్తఘనభృఙ్గమఙ్గళవిరాజినీం

చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్|

వాలికామధురగణ్డమణ్డలమనొహరాననసరొరుహాం

కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్||౯||

 

మేఘములు-తుమ్మేదలు వంటి నల్లని కేశపాశముతొ విరాజిల్లుచున్నదీ, కొప్పులొ అలంకరించుకున్న మల్లేలు సువాసనలు కలదీ, అందమైన చేంపలున్న మనొహరమగు ముఖము కలదీ, సమస్తలొకములకు నాయకురాలగు కాళికా అను పరదేవతను మనస్సు నందు ధ్యానించుచున్నాను.

 

నిత్యమేవ నియమేన జల్పతాం

భుక్తిముక్తిఫలదామభీష్టదామ్|

శంకరేణ రచితాం సదా జపే-

న్నామరత్ననవరత్నమాలికామ్||౧౦||

 

భుక్తిని ముక్తిని కలిగించునదీ, అభీష్టములు నేరవేర్చునదీ, శంకరాచార్యునిచే రచించబడినదీ, అగు ఈ నామరత్న మాలికా అను స్తొత్రమును నిత్యము నియమముతొ పారాయణము చేయవలేను.

 

                        జయ జయ శఙ్కర హర హర శఙ్కర

  అన్నపూర్ణాస్తుతిః

భ్రమరామ్బాష్టకమ్ గౌరీదశకమ్
కల్యాణవృష్టిస్తవః శ్రీ లలితా పంచరత్నమ్ మంత్రమాతృకాపుష్పమాలాస్తవః
మీనాక్షీపఞ్చరత్నమ్ మీనాక్షీస్తోత్రమ్ నవరత్నమాలికా
త్రిపురసున్దర్యష్టకమ్