Sri Shankara Jayanti Mahotsavam to be celebrated at Mukkamla, AndhraPradesh

Sri Shankara Jayanti Mahotsavam to be celebrated at Mukkamla, AndhraPradesh

12-05-2024

Sri Shankara Jayanti Mahotsavam at Mukkamla, Andhra Pradesh
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం నుండి నవమి గురువారం వరకు (అనగా ది. 12/05/24 నుండి 16/05/24 వ తేది వరకు) ముక్కామల గ్రామం లో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆలయ ప్రాంగణము నందు శ్రీ శంకర భగవత్పాదుల జయంతి మహోత్సవములు జరుపబడును. కావున భక్తులందరు పాల్గొని తరించ ప్రార్థన.

కార్యక్రమ వివరములు:

12/05/24 - 16/05/24 : ప్రతిరోజూ ఉదయం స్వామి వారికి రుద్రాభిషేకము, అర్చన, పాఠశాల విద్యార్థులచే వేద పఠనము, సాయంత్రము పూజా కార్యక్రమములు, శ్రీమతి భమిడిపాటి లక్ష్మి గారిచే సౌందర్యలహరి పారాయణము, తదుపరి గ్రామోత్సవము జరపబడును.

12, 13 మరియు 14 వ తేదీలలో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, గౌ. శ్రీ శ్రీపాద రామబ్రహ్మం (సంస్కృత పండితులు, శ్రీరామపురం) వారిచే మూకపంచశతి పారాయణము జరపబడును

15 మరియు 16 వ తేదీలలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, ప్రముఖ ప్రవచనకర్త గౌ. ఆచార్య శ్రీ ధూళిపాళ రామకృష్ణ (సంస్కృత శాఖాధిపతి, మేరీ స్టెల్లా కాలేజ్, విజయవాడ) వారిచే మూకపంచశతిపై ప్రవచనము చెప్పబడును.

అందరూ ఆహ్వానితులే !! 




Back to news page