మంత్రమాతృకాపుష్పమాలాస్తవః

 

కల్లొలొల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-

ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదమ్బవాట్యుజ్జ్వలే|

రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానొత్తమే

చిన్తారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే||౧||

 

ఒ జనని| కల్లొలమైన అమృత సముద్ర తరంగముల మధ్యలొ విరాజిల్లుచున్న మణి ద్వీపము నందు కల్పవృక్షముల తొటలతొ చుట్టి ఉన్న, కాదంబ (కడిమి చేట్లు) వృక్షముల తొటలతొ ప్రకాశించుచున్న , వేలాది రత్న స్తంబములచే నిర్మించబడిన సభాభవనమును నందలి విమానము నందు చింతామణులతొ నిర్మించబడిన నీ సింహాసనమును మనస్సు నందు భావించుచున్నాను.

 

ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం

బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాఙ్కుశౌ బిభ్రతీమ్|

చాపం బాణమపి ప్రసన్నవదనం కౌసుమ్భవస్త్రాన్వితాం

తాం త్వాం చన్ద్రకలావతంసమకుటాం చారుస్మితాం భవయే||౨||

 

చంద్రుడు-అగ్ని-సూర్యులతొ ప్రకాశించుచున్న శ్రీచక్రము యొక్క మధ్యలొ ఉన్న ధానవు, బాల సూర్యుని వంటి తేజస్సు కల దానవు, చేతులతొ పాశమును-అంకుశమును-ధనుస్సును-బాణమును ధరించిన దానవు, ప్రసన్నమైన ముఖమును కలదానవు, ఏర్రని వస్త్రములను ధరించిన దానవు, చంద్రకళను కిరీటముపై అలంకరించుకున్న దానవు, సొగసైన చిరునవ్వు కలదానవు అగు నిన్ను మనసునందు భావించుచున్నాను.

 

ఈశానాదిపదం శివైకఫలకం రత్నాసనం తే శుభం

పాద్యం కుఙ్కుమచన్దనాదిభరితైరర్ఘ్యమ్ సరత్నాక్షతైః|

శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం

కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్||౩||

 

ఈశానుడు-రుద్రుడు-విష్ణుమూర్తి-బ్రహ్మ అను నలుగురు నాలుగు కొళ్లుగా కలదీ, శివతత్త్వము ప్రధానమైన ఫలముగా నున్నదీ, శుభకరమైనదీ అగు రత్నాసనము, కుంకుమ-చందనము మొదలగు వాటితొ నిండిన నీటితొ ఆచమనము భక్తిగా నా చేత కల్పించబడినది.ఒ కరుణామృత సముద్రమా| ఇదంతా నీకు సంతొషము కల్గించుగాక.

 

లక్ష్యే యొగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే

ప్రాలేయామ్బుపటీరకుఙ్కుమలసత్కర్పూరమిశ్రొదకైః|

గొక్షీరైరపి నారికేళసలిలైః శుద్ధొదకైర్మన్త్రితైః

స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్||౪||

 

యొగులకు లక్ష్యమైన దానవు, జగత్తులనన్నిటినీ రక్షించు దానవు,విశాలమైన నేత్రములున్న దానవు, అగు దేవి| పన్నీరు-చందనము-కుంకుమ-కర్పూరము కలిగిన జలముతొనూ, ఆవుపాలతొనూ, కొబ్బరి నీళ్లతొనూ, మంత్రించబడిన స్వచ్చమైన నీటితొనూ నీకు స్నానమును నాభావన ద్వారా కల్పించితిని. ఇదంతా నీకు సంతొషము కల్గించుగాక.

 

హ్రీంకారాఙ్కితమన్త్రలక్షితతనొ హేమాచలాత్సఞ్చితైః

రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుమ్భవర్ణాంశుకమ్|

ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతన్తూద్భవం

దత్తం దేవి ధియా మయైతదఖిలం సన్తుష్టయే కల్పతామ్||౫||

 

హ్రీంకారముతొ కూడిన మంత్రముతొ తేలియబడు స్వరూపము కల ఒదేవి| బంగారు కొండ (మేరు పర్వతము) నుండి తేచ్చిన రత్నములతొ ఉజ్జ్వలమైన ఉత్తరీయముతొ కలిసి బంగారు వస్త్రమును, ముత్యములతొ కూర్చిన, బంగారు దారములతొ ఏర్పరచిన పరిశుద్దమైన యజ్ఞసూత్రమును ఒదేవి| నాభావన ద్వారా నీకై సమర్పించుచుంటిని ఇదంతా నీకు సంతొషము కల్గించుగాక.

 

హంసైరప్యతిలొభనీయగమనే హారావళీముజ్జ్వలాం

హిన్దొలద్యుతిహీరపూరితతరే హేమాఙ్గదే కఙ్కణే|

మఞ్జీరౌ మణికుణ్డలే మకుటమప్యర్ధేందుచూడామణిం

నాసామౌక్తికమఙ్గుళీయకటకౌ కాఞ్చీమపి స్వీకురు||౬||

 

హంసలకు కూడ ఆశ పుట్టించు నడక గల ఒ దేవి| ప్రకాశించుచున్న హారమును, వజ్రమును, కూర్చిన బంగారు భుజకీర్తులను, కంకణములను, అందేలను, మణికుండలమును, కిరీటమును, అర్ధచంద్రచూడామణిని, ముక్కు బులాకీని, ఉంగరములనుకడియములను, ఒడ్డాణమును స్వీకరించుము.

 

సర్వాఙ్గే ఘనసారకుఙ్కుమఘనశ్రీగన్ధపఙ్కాంకితం

కస్తూరీతిలకం చ ఫాలఫలకే గొరొచనాపత్రకమ్|

గణ్డాదర్శనమండలే నయనయొర్దివ్యాఞ్జనం తేఽఞ్చితం

కణ్ఠాబ్జే మృగనాభిపకమమలం త్వత్ప్రీతయే కల్పతామ్||౭||

 

ఒ దేవి| నీ శరీరమునందు కర్పూరము-కుంకుమలతొ కలిపిన మంచి గంధమును నొసటి యందు కస్తూరితిలకమును, చేంపలయందు గొరొచనా పత్రకములను, కన్నుల యందు కాటుకను, కంఠము నందు కస్తూరిపూతను నాభావనతొ కల్పించుచున్నాను.ఇదంతా నీకు సంతొషము కల్గించుగాక.

 

కల్హారొత్పలమల్లికామరువకైః సౌవర్ణపఙ్కేరుహై-

ర్జాతీచమ్పకమాలతీవకులకైర్మన్దారకుందాదిభిః|

కేతాక్యా కరవీరకైర్బహువిధైః క్లృప్తాః స్రజొమాలికాః

సఙ్కల్పేన సమర్పయామి వరదే సన్తుష్టయే గృహ్యతామ్||౮||

 

ఏర్రని-నల్లని కలువలు, మల్లేలు, మరువము, బంగారు తామర పూలు, జాజులు, సంపంగులు, మాలతీపుష్పములు, మొల్లలు, మొగలి పువ్వు, ఏర్రగన్నేరు పూలు ఇంకా అనేకవిధములైన పూలతొ దండలు గుచ్చి నాభావనతొ నీకు సమర్పించుచున్నాను. వరములనిచ్చు ఒ తల్లీ| సంతొషముగా స్వీకరించుము.

 

హంతారం మదనస్య నన్దయసి యైరఙ్గైరనఙ్గొజ్జ్వలై

ర్యైర్భృఙ్గావళినీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయమ్|

తానీమాని తవామ్బ కొమలతరాణ్యామొదలీలాగృహా

ణ్యామొదాయ దశాఙ్గగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే||౯||

 

మన్మథుని సంహరించిన శివుని కామొద్దీపకములైన నీ అవయవములతొ ఆనందింపచేయుచున్నావు. తుమ్మేదల వరుసల వంటి నల్లని కురులతొ శివుని హృదయమును బంధించుచున్నావు. సున్నితములైన- ఆనంద నిలయములైన నీ అవయవములకు సువాసనకొరకై దశాంగం-గుగ్గులు-ఆవునేయ్యి మొదలైన ద్రవ్యములతొ ధూపం వేయుచున్నాను.

 

లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహొద్భాస్వత్తరే మన్దిరే

మాలారూపవిలమ్బితైర్మణిమయస్తంభేషు సమ్భావితైః|

చిత్రైర్హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితై-

ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సన్తుష్టయే కల్పతామ్||౧౦||

 

రత్నముల రాశులతొ దేదీప్యమానముగా ఉండు మందిరమందు వరుసగానున్న మణిమయస్తంభములంద -లంకరించమడిన బంగారు బొమ్మలచేతులతొ పేట్టిన, ఆవునేతితొ వర్దిల్లుచున్న దివ్యదీపముల వరుసలతొ నాభావన ద్వారా కాంతిని పేంపొందించుచున్నాను. ఒ పార్వతీ| నీకు సంతొషము కల్గించుగాక

 

హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం

దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తదా|

దుగ్దాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం

మాషాపూపసహస్రమంబ సకలం నైవేద్యమావేదయే||౧౧||

 

ఒ హ్రీంకారేశ్వరీ| వేలాది బంగారు పాత్రలలొ నేయ్యి - పప్పు - కూరలు నిండిన దివ్యాన్నమును, వివిధ చిత్రాన్నములు, పాలన్నము, తేనే - పంచదార - పేరుగు కలిపిన అన్నము, మాణిక్యపాత్ర యందున్న వేలాది పిండివంటలు ఇవన్నీ నైవేద్యము పేట్టుచున్నాను.

 

సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తామ్బూలవల్లీదలైః

పూగైర్భూరిగుణైః సుగన్ధిమధురైః కర్పూరఖణ్డొజ్జ్వలైః|

ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామొదనైః

పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే||౧౨||

 

మొగలి పూలరేకుల వంటి తమలపాకులతొ, మంచి వక్కలతొ, సుగంధభరితములై మధురమైన కర్పూరఖండములతొ, ముక్తాచూర్ణముతొ, బహువిధములైన ముఖవాసనద్రవ్యములతొ నిండిన రత్న పేటిక నీ సంతొషము కొరకై ఏదుట ఉంచబడినది.

 

కన్యాభిః కమనీయకాన్తిభిరలఙ్కారామలారార్తికా-

పాత్రే మౌక్తికచిత్రపఙ్క్తివిలసత్కర్పూరదీపాలిభిః|

తత్తత్తాలమృదఙ్గగీతసహీతం నృత్యత్పదాంభొరుహం

మన్త్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్||౧౩||

 

అలంకరింపబడిన హారతి పళ్లేములొ కర్పూర దీపములుంచి సౌందర్యవతులగు కన్యలు నృత్యగీత వాద్యములతొ మంత్రారాధన పూర్వకముగా నీకు ఇచ్చుచున్న నీరాజనమును స్వీకరించుము.

 

లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్రం తు ధత్తే రసా-

దిన్ద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ|

వీణామేణవిలొచనాః సుమనసాం నృత్యన్తి తద్రాగవ-

ద్భావైరాఙ్గికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతామ్||౧౪||

 

లక్ష్మీదేవి నీపై అభిమానముతొ ముత్యములు కూర్చిన తేల్లని గొడుగును పట్టుకున్నది.శచీదేవి- రతీదేవి రేండు పక్కల చామరములను వీచుచున్నారు. సరస్వతీదేవి తానే వీణను వాదించుచున్నది. దేవతాస్త్రీలు ఆంగిక సాత్వికాభినయముతొ భక్తిగా నృత్యము చేయుచున్నారు. ఒ తల్లీ| వినుము.

 

హ్రీంకారత్రయసంపుటేన మనునొపాస్యే త్రయీమౌలిభి-

ర్వాక్యైర్లక్ష్యతనొ తవ స్తుతివిధౌ కొ వాక్ష మేతాంబికే|

సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సఞ్చార ఏవాస్తు తే

సంవేశొ నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్||౧౫||

 

మూడు హ్రీంకారములతొ సంపుటమైన మంత్రముచే ఉపాసింప దగినదానవు,

వేదాంతవాక్యములచే తేలుసుకొనదగిన స్వరూపము కలదానవు అగు ఒ తల్లీ| నిన్ను స్తుతించుటకు ఏవడు సమర్తుడు? నామాటలే నీ స్తొత్రములుగా, నానడకలే నీ ప్రదక్షిణములుగా, స్థితియే వేలాది నమస్కారములుగా అగుగాక. ఇదంతా నీకు సంతొషము కల్గించుగాక.

 

శ్రీమన్త్రాక్షతమాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా

సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః|

చిత్తామ్భొరుహమణ్టపే గిరిసుతానృత్తం విధత్తే రసా-

ద్వాణీ వక్త్రసరొరుహే జలధిజా గేహే జగన్మఙ్గళా||౧౬||

 

శ్రీ మంత్రాక్షతమాలికతొ పార్వతీ దేవిని ఏవడు నిశ్చలమైన మనస్సుతొ నియమవంతుడై ప్రతిదినము మూడు సంధ్యల యందు పూజించునొ వాని హృదయము నందు పార్వతీ దేవి ఆనందముతొ నృత్యము చేయును. సరస్వతీ దేవి ముఖమునందు నివసించును. జగన్మంగళకారిణియగు లక్ష్మీదేవి అతని గృహమునందు విలసిల్లును.

 

ఇతిగిరివరపుత్రీపాదరాజీవభూషా

భువనమమలయన్తీ సూక్తిసౌరభ్యసారైః|

శివపదమకరన్దస్యందినీయం నిబద్ధాం

మదయతు కవిభృంగాన్మాతృకాపుష్పమాలా||౧౭||

 

పార్వతీదేవి పాదపద్మములకు అలంకారమైనదీ, మంచి సూక్తులసారములతొ, లొకములను పవిత్రము చేయుచున్నదీ, శివపదమను మకరందమును ప్రవహీంపచేయుచున్నదీ, శంకరాచార్యునిచే రచించబడినదీ అగు మాతృకాపుష్పమాల కవులచే తుమ్మేదలను ఆనందబరచుగాక.

 

 

                        హర హర శంకర జయ జయ శంకర

 

                        హర హర శంకర జయ జయ శంకర