Aathmabodha         Chapters          Last Page

వందన నమస్కారం
 

1. ధ్యాన మూలం గురు మూర్తి

పూజా మూలం గురు పాదుకా

మంత్ర మూలం గురుర్వాక్యం

మోక్ష మూలం గురు కృపా ||

»yee µ³yùƒy¬sNTP ª«sVWÌÁLi gRiVLRiVª«sVWLjiò, xmspÇÁNRPV ª«sVWÌÁLi gRiVLRiVFyµR…VNRPÌÁV, ª«sVLiú»y¬sNTP ª«sVWÌÁLi gRiVLRiVªyNRPùLi, ®ªsWOSQ¬sNTP ª«sVWÌÁLi gRiVLRiVNRPXxms.

2. గురుర్బ్రహ్మో గురుర్విష్ణు

గురుర్దేవో మహేశ్వరః

గురు సాక్షాత్పరం బ్రహ్మ

తసై#్మ శ్రీ గురవే నమః ||

తా|| గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురుదేవుడే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి శ్రీ గురువునకు నమస్కారాలు ||

3. జయ గురుదేవ దయానిధి దీనన హితకారీ,

స్వామీ భక్తన సుఖకారీ |

జయ జయ మోహ వినాశక,

జయ - జయ తిమిర వినాశక,

భవ బన్ధనహారీ || జయదేవ్‌ జయసద్‌గురుదేవ్‌ ||

తా|| జయం గురుదేవా, దయకు నిలయమైనవాడా, ఆపదలో ఉన్నవారికి హితం చేయువాడా, స్వామీ భక్తులకు సుఖం చేకూర్చువాడా! మోహాన్ని వినాశం చేయువాడా, జయం జయం. అంధకారాన్ని వినాశం చేయువాడా! జయం జయం. భవ బంధాన్ని హరించువాడా! జయం దేవా! జయం సద్గురుదేవా !

4. బ్రహ్మా, విష్ణు, సదాశివ, గురుమూరతి ధారీ !

స్వామీ ప్రభు మూరతి ధారీ !

వేద, పురాణ బఖానత్‌, శాస్త్రపురాణ బఖానత్‌ ;

గురు మహిమా భారీ || జయదేవ్‌ జయ సద్‌గురుదేవ్‌ ||

తా|| బ్రహ్మ విష్ణు సదాశివులు గురురూపం ధరించినవాడా ! స్వామీ, పరబ్రహ్మరూపం ధరించినవాడా ! వేదాలు, పురాణాలు చాటి చెపుతున్నాయి. శాస్త్రపురాణాలు చాటి చెపుతున్నాయి. గురుమహిమ గొప్పదని. జయం గురుదేవా ! జయం సద్గురుదేవా!

5. జప, తప, తీరథ, సంయమ, దాన వివిధ దీన్హే;

స్వామీ దాన బహుత్‌ దీన్హే !

గురుబిన్‌ జ్ఞాన నహోవె, దాతాబిన్‌ జ్ఞాననహోవె;

కోటి యతన కీన్హే || జయదేవ్‌ జయ సద్‌గురుదేవ్‌ ||

తా|| జపం, తపం, తీర్థం, ఇంద్రియనిగ్రహం, దానాలవంటి రకరకాలైనవి కోటి ప్రయత్నాలు చేసినా గురువు లేకుండా జ్ఞానం కలుగదు, దాత లేకుండా జ్ఞానం కలుగదు, జయం దేవా! జయం సద్గురుదేవా!

6. మాయా మోహనదీజల, జీవ బహె సారె,

స్వామీ జీవ బహె సారె !

నామ్‌ జహాజ్‌ బిఠాకర్‌, శబ్ద్‌ జహాజ్‌ చఢాకర్‌ ;

గురు పలమే తారె || జయదేవ్‌ జయ సద్గురుదేవ్‌ ||

తా|| మాయా మోహనదీజలాలలో జీవాలన్నీ కొట్టుకుపోతున్నాయి, స్వామీ, జీవాలన్నీ కొట్టుకు పోతున్నాయి! నామ మనే ఓడలో కూర్చుండబెట్టి, శబ్దమనే ఓడలో ఎక్కించి, గురువు క్షణంలోతరింప చేస్తాడు || జయందేవా జయంగురుదేవా ||

7. కామ, క్రోధ, మద, మత్సర, చోర్‌ బడే భారె ;

స్వామీ చోర్‌ బడే భారె

జ్ఞాన ఖడగ్‌ దేకర్‌మే, శబ్ద ఖడగ్‌ దేకర్‌ మే ;

గురు సబ్‌ సంహారే || జయదేవ్‌ జయసద్‌గురుదేవ్‌ ||

తా|| కామ క్రోధ మద మత్సర మనే పెద్ద దొంగల నుండి, స్వామీ పెద్ద దొంగలనుండి, జ్ఞానమనే ఖడ్గాన్ని నాకిచ్చి, శబ్దమనే ఖడ్గాన్ని నాకిచ్చి గురువు అన్నిటిని సంహరించాడు || జయందేవా జయం సద్గురుదేవా!

8. నానా పంథ్‌ జగత్‌ మె, నిజ నిజ గుణగావె,

స్వామీన్యారె-న్యారె యశ్‌ గావె !

సబ్‌కా సార్‌ బతాకర్‌, సబ్‌కా భేద్‌ లఖాకర్‌ః

గురుమారగ్‌ లావె || జయ దేవ్‌ జయ సద్గురుదేవ్‌ ||

తా|| ఈ ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి. తమతమ గుణాల్ని గానం చేస్తాయి. వేరువేరుగా భగవంతుని కీర్తిని గానం చేస్తాయి. అన్నిటి సారాంశాన్ని తెలియజేసి, అన్నిటి భేదాల్ని చూపించి గురువు మార్గానికి తెస్తారు. || జయం దేవా | జయం సద్గుర దేవా ||

9. గురు చరణామృత నిర్మల, పబ్‌పాతక్‌ హారీ,

స్వామీ సబ్‌ దోషక్‌ హారీ !

వచన సునత్‌ తమ్‌నాశే, శబ్ద సునత్‌ భ్రమ నాశే ;

సబ్‌ సంశయ టారీ|| జయదేవ్‌ జయసద్గురుదేవ్‌ ||

తా|| గురుపాదోదకం నిర్మలమైంది. అన్ని పాపాల్ని హరిస్తుంది. అన్ని దోషాల్ని హరిస్తుంది. వచనం వినగానే అజ్ఞానం నశిస్తుంది. శబ్దం వినగానే భ్రమ నశిస్తుంది, అన్ని అనుమానాలు తొలగిపోయాయి. జయందేవా ! జయం సద్గురుదేవా !

10. తన, మన, ధన సబ్‌ అర్పణ్‌, గురు చరణన్‌ కీజె,

ప్రేమీ గురు అర్పణ్‌ కీజె !

బ్రహ్మానంద్‌ పరమ పద, బ్రహ్మానంద్‌ అచలపద;

మోక్ష గతి లీజె || జయదేవ్‌ జయ సద్గురుదేవ్‌ ||

తా|| తనువు, మనస్సు, ధనం అన్నింటినీ గురువుగారి పాదాలకు అర్పించు, ప్రేమీ గురువుగారికి అర్పించు. బ్రహ్మానందమనే పరమపథాన్ని, బ్రహ్మానందమనే అచంచలమైన పథాన్ని, మోక్షాన్ని తీసుకో || జయం దేవా! జయం సద్గురుదేవా !

11. జయ గురుదేవ దయానిధి దీవన హితకారీ,

స్వామీ భక్తన సుఖకారీ |

జయ జయ మోహ వినాశక,

జయ - జయ తిమిర వినాశక,

భవ బన్ధనహారీ || జయదేవ్‌ జయసద్‌ గురుదేవ్‌ ||

తా|| జయం గురుదేవా! దయకు నిలయమైనవాడా,మేలుచేయువాడా, భక్తులకు సుఖాన్ని ఇచ్చేవాడా,చీకటిని నశింప చేయువాడా, సంసార బంధాన్ని తొలగించువాడా ||జయం దేవా! జయం సద్గురు దేవా||

12. త్వమేవ మాతా చ పితా త్వమేవ,

త్వమేవ బన్ధుశ్చ సఖా త్వమేవ ||

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ,

త్వమేవ సర్వం మమ దేవ దేవః ||

త్వమేవ సర్వం మమదేవ దేవః,

త్వమేవ సర్వం మమదేవ దేవః ||

తా|| నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధువు నీవే సఖుడవు || నీవే విద్యవు (జ్ఞానానివి), నీవే ధనం, నీవే నా సర్వస్వానివి, నీవే నా దేవ దేవుడవు || నీవే నా సర్వస్వానివి, నీవే నా దేవ దేవుడవు|| నీవే నా సర్వస్వానివి, నీవే నా దేవ దేవుడవు||నీవే నాసర్వస్వానివి, నీవే నా దేవ దేవుడవు||

13. భక్తి దాన మొహె దీజిఎ

గురుదేవన్‌ కె దేవ్‌ |

ఔర్‌ నహీ కఛు చాహిఎ

నిశదిన్‌ తువ్హురీ సేవ్‌ ||

తా|| దేవతలకు దేవుడయిన గురుదేవా భక్తిదానం నాకు ఇవ్వండి. ఇతరమైంది ఏదీ అక్కరలేదు. రాత్రింబవళ్ళు నీ సేవా, నీ భక్తి నాకు దానం చేయి.

14. బార్‌ - బార్‌ వర్‌ మాంగ ఊ

హరషి దేహు శ్రీరంగ్‌ |

పద- సరోజ అనపాయనీ,

భగతి సదాసతసంగ్‌ ||

తా|| శ్రీరంగా! నీ పాదారవిందాలమీద విడువకుండా ఉండే భక్తిని, సత్సంగాన్ని అనే వరాన్ని మాటి మాటికి కోరుతుంటాను.

15. నాథ్‌ మొహి న బిసారి యో

లాఖ్‌ లోగ్‌ మిల్‌ జాహి

ముఝ సే ఆపకో బహుత్‌ హై

ఆప్‌ - సే ముఝకోనాహి |

ముఝసే ఆపకో బహుత్‌ హై

ఆప్‌-సే ముఝకో నాహి ముఝు-సే

ఆపకో బహుత్‌ హై, ఆప్‌ - సే ముఝుకో నాహి

తా|| స్వామి లక్షల మంది లభించి నప్పటికి నన్ను మీరు మరిచిపోవద్దు, నాలాటివాళ్ళు మీకు అనేక మంది ఉన్నారు, మీలాటి వాళ్ళు నాకు లేరు. నాలాటివాళ్ళు మీకు అనేక మంది ఉన్నారు, మీలాటి వాళ్ళు నాకు లేరు. నాలాటివాళ్ళు మీకు అనేకమంది ఉన్నారు, మీలాటి వాళ్ళు నాకు లేరు.

16. హే శ్రీ గురుమహారాజ్‌ జీ, ఆప్‌ సర్వ్‌ -

సమర్థ్‌ హై ! ఆప్‌ క్యా నహీ కర్‌సక్‌తే ?

మై ఆప్‌కీ శరణాగత్‌ హూ. ఆప్‌ మేరీ

లాజ్‌ రఖే, ఆప్‌ మేరీ లాజ్‌ రఖే,

ఆప్‌ మేరీ లాజ్‌ రఖే.

ప్రేమ్‌సె బోలిఎ శ్రీసద్గురు దేవ్‌ మహారాజ్‌కీ జై

ఓ గురుమహారాజా! మీరు సర్వసమర్థులు మీరు చేయలేని దేమున్నది. నేను మీ శరణాగతుణ్ణి. మీరు నన్ను కరుణించండి. మీరు నన్ను కరుణించండి. మీరు నన్ను కరుణించండి.

సద్గురు దేవుడైన మహారాజుకు ప్రేమతో జై అని పలకండి.

Aathmabodha         Chapters          Last Page