Aathmabodha         Chapters          Last Page

6. ప్రబోధ చంద్రం

సచ్చిదానంద స్వరూపుడే అయిన మానవుడు 84 లక్షల జీవరాసుల్లో శ్రేష్ఠుడు. మానవుడు ఆ శ్రేష్ఠత్వాన్ని సద్వినియోగం చేసుకోవటానికి గురువులు ఆత్మబోధను అందిస్తున్నారు. గురు మహారాజ్‌జీ ఆ విధంగా మానవోన్నతికి చేస్తున్న సేవను ఈ రచనలో ప్రతిఫలింపజేయటానికి చేసిన కృషి అనంతంగా కనిపిస్తుంది. మహారాజ్‌జీ ఇంటింటికీ వెళ్ళి జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది అనే దానికి అనుకూలంగా ఈ రచన కొనసాగింది. చాలాకాలంగా ఈ మార్గంలో ప్రసిద్ధిపొందిన తాత్త్విక చింతనాభిప్రాయాలను గురు మహారాజ్‌జీ ప్రబోధానికి అనుకూలంగా ఉన్నవాటిని ఆయా శ్లోకాల వద్ద పొందుపరచిన విధానం సుందరంగా ఉంది. గ్రంథం అంతా సులభ##శైలిలో సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు రాశారు. కాన జిజ్ఞాసువులు, ప్రేమీలు ఈ గ్రంథాన్ని చదివి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

ది. 2-6-96 చౌటిపల్లి దుగ్గిరాజు.

హైదరాబాదు ప్రేమీ,

Fs²T…ø¬s}qísûÉÓÁª±s A{mnsxqsL`i,

ఎగ్రికల్చరల్‌ యూనివర్శిటీ,

వెటర్నరీ సైన్స్‌ కాలేజీ,

హైదరాబాదు.

Aathmabodha         Chapters          Last Page