Devi Kathalu         Chapters          Last Page

మహిషాసురుడు

'దనువు' అనే పేరుగల మహారాజునకు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరూ పెరిగి పెద్దవారైనారు. చాలకాలం వారిద్దరిలో సంతానం కలుగలేదు. సంతానం కోసం రంభుడు పంచాగ్ని మధ్యంలోను. కరంభుడు నీళ్ళలోను నిలిచి ఘోరమైన తపస్సులు చేశారు. దేవేంద్రుడు మొసలి రూపంలో నీటిలో ప్రవేశించి, కరంభుణ్ణి సంహరించాడు. రంభుడు తపస్సు కొనసాగించాడు. కొన్నాళ్ళకు రంభునికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహించాడు. అపుడు రంభుడు , "అగ్నిదేవా! ముల్లోకాలనూ జయించగల పుత్రుణ్ణి ప్రసాదించు. అతడు సమస్త లోకారాధ్యుడుగా ఉండాలని నా కోరిక" అని వరం కోరుకున్నాడు. అగ్ని దేవుడు "తథాస్తు!" అని వరమిచ్చాడు. మరోమాట కూడా చెప్పాడు. "రంభుడా! ఏరూపాన్ని చూచి నీ మనస్సు చలిస్తుందో ,ఆమె గర్భంలో నీవు కోరుకున్న వీరుడు నీకు కుమారుడుగా జన్మిస్తాడు" అని చెప్పి అంతర్థాన మయ్యాడు.

కొంత కాలానికి -ఒకనాడు గిరిశిఖరంపై యక్షగణ పరివారంతో రంభుడు విహరిస్తూ ఉండగా, ఒక మహిషి (గేదె) అతనికి కంటపడింది. నిగనిగలాడే ఆమహిషి రూపాన్ని చూచి రంభుడు మోహితుడయ్యాడు. దైవ సంకల్పమువల్ల ఆ మహిషి గర్భాన్ని ధరించింది. గర్భవతి అయిన మహిషిని వెంటబెట్టుకుని రంభుడు పాతాళలోకంలో విహరింప సాగాడు.అక్కడ ఒక మహిషము ఈ మహిషి వెంటపడింది, రంభుడు ఆ మహిషముతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. గర్భవతి అయిన మహిషి తన భర్త అయిన రంభునితో పాటు సహగమనం చేసింది. ఆ సమయంలో చితినుంచి వెలువడిన అగ్నిజ్వాలల తాకిడి వలన ఆ మహిషి గర్భం నుండి మహిషుడు ఉద్భవించాడు. అతడే భయంకరాకారుడైన మహిషాసురుడు.

ఇలా రూపు దాల్చిన మహిషాసురుడు సుదీర్ఘకాలం తీవ్రమైన తపస్సు చేసి పురుషులవల్ల తనకు మరణంలేకుండా వరం పొందాడు. వరబల గర్వితుడై ముల్లోకాలనూ జయించాలని బయలు దేరాడు. అసిలోముడు, భాస్కరుడు, ధూమ్రాక్షుడు మొదలైన వీరాధివీరులు మహిషునికి సేనాధిపతులుగా ఉన్నారు. వారిని వెంట పెట్టుకొని మహిషాసురుడు భూలోకాన్ని జయించాడు. ఇక, స్వర్గాన్ని జయించాలని సంకల్పంచి, మహాబలుడనే దూతను స్వర్గాధిపతి అయిన ఇంద్రుని వద్దకు పంపించాడు.

మహిషాసురుని రాయబారిగా మహాబలుడు దేవలోకానికి వెళ్ళి, తమ ప్రభువు బలపరాక్రమాలను, పొందిన వరమహిమను వివరించాడు. భూలోకంపై విజయం సాధంచిన తమ ప్రభువు స్వర్గాన్ని జయించడానికి రానున్నాడని చెప్పాడు. " దేవేంద్రా! స్వర్గాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళపో. లేదా మా ప్రభువైన మహిషాసురుణ్ణి శరణు పొందు. ఈ రెండూ కాదంటావా? యుద్ధానికి సిద్ధంగా ఉండు!" అని హెచ్చరించాడు.మహాబలుని మాటలతీరు చూచి మహేంద్రుడు మండిపడ్డాడు. ఆ మాటల చాటున దాగిన మహీషాసురుని దర్పాన్ని గుర్తించాడు. "మహాబలా! దూతవై వచ్చిన నిన్న శిక్షించరాదు. కనుక బ్రతికిపోయావు. నీ ప్రభువైన మహిషాసురుడు గడ్డి తినే జంతువు కదా! అతనికి ఇలాంటి అహంకారం సహజమే.కొమ్ము విసరాలని చూస్తున్నాడేమో, శృంగభంగం తప్పదని నా మాటగా చెప్పు. బుద్ధి కలిగి ప్రవర్తించమని ఇదే నా హెచ్చరిక" అని తీవ్రస్వరంతో హెచ్చరించాడు.

మహాబలుని నోట, మహేంద్రుని మాట విన్న మహిషాసురుడు ఉగ్రుడై, తన సేనానులను స్వర్గంపై దండయాత్రకు నియోగించాడు.

అంతట దేవేంద్రుడు దిక్పాలురను, సమస్త దేవతా గణాలను, ఆహ్వానించి, మహిషుని వృత్తాంతం అంతా తెలియ చెప్పి, అందరి అభిప్రాయాలూ సేకరించాడు. వారి సలహా ప్రకారం మహిషుని ఆనుపానులన్ని

తెలిసికొని రమ్మని ఒక గూఢచారిని నియమించాడు. ఆ గూఢచారి తిరిగివచ్చి, మహిషుని యుద్ధసన్నాహాలను, అతని బలపరాక్రమ విశేషాలను వివరించాడు. ఇంద్రుడు దేవగురువైన బృహస్పతితో సమాలోచన చేసి,గురువుగారి సూచన మేరకు బ్రహ్మ వద్దకుపోయి శరణుకోరాడు.దేవేంద్రాదులతో కలసి బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, పరిస్ధితిని పరమేశ్వరునకు విన్నవంచగా, శివుడు

వారందరితో కలసి వైకంఠానికి వచ్చి మహావిష్ణువును ప్రార్ధించాడు.

త్రిమూర్తులందరూ దేవతలకు అండగా నిలిచేందుకు సన్నద్ధులయ్యారు.

మహిషాసురుడు సకల దానవ సమూహాలను వెంట పెట్టుకొని సంగ్రామానికి వచ్చాడు. దేవతల శక్తి వల్ల మహిషుని సైన్యం అంతా భస్మీపటలమైంది. మహిషుడు మహోగ్రుడై తన మాయా ప్రభావంతో అనేక రూపాలను ధరిస్తూ, రణరంగాన్ని బీభత్సం చేశాడు. దేవతలు భయభ్రాంతులై త్రిమూర్తులను ఆశ్రయించారు. మహావిష్ణువు సుదర్శనచక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, బ్రహ్మ శక్తి ఆయుధాన్ని ధరించి మహిషునితో తలపడ్డారు. మహిషుడు గదను, ఖడ్గాన్ని చేతబూని సైన్యాన్ని కలవరపరుస్తూ, త్రిమూర్తులకు సైతం, లొంగక చిత్రవిన్యాసంతో యుద్ధం చేయసాగాడు. ఈ విధంగా దేవదానవులకు సుదీర్ఘకాలం యుద్ధం జరిగింది. మహిషుని అనంతశక్తికి కారణం ఆలోచించి. అతడు స్త్రీ చేతగాని పురుషుని చేత మరణించడని గుర్తించి, యుద్ధాన్ని విరమించాడు. త్రిమూర్తులంతా తమ తమ స్ధానాలకు తిరిగి వెళ్ళిపోయారు. మహిషుడు విజృంభించి ఇంద్రుణ్ణి తరిమివేసి, దేవతా నగరును ఆక్రమించి, స్వర్గభోగాలను అనుభవిస్తూ దేవతలకు నిలువ నీడలేని పరిస్ధితిని కల్పించాడు.

త్రిమూర్తులు, దేవతలు సమావేశ##మైం తమ తమ అంశల నుండి ఒక్కొక్క తేజో విశేషాన్ని ధ్యానరూపంలో వెలువరించారు. ఆ తేజో రాశి ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి,18 భుజాలు గల మహాలక్ష్మీ స్వరూపంగా దర్శనమిచ్చింది. ఆ పరాశక్తి దివ్వదేహానికి పరమేశ్వరాంశలో ముఖము, యముని అంశంలో కేశాలు, అగ్నివల్ల నేత్రాలు, సంధ్యవల్ల కనుబొమలు, వాయువు వల్ల కర్ణములు, ప్రజాపతి వలన పలువరుస, విష్ణుతేజస్సు వల్ల బాహువులు. ఇంద్రాంశతో నడుము, చంద్రాంశతో వక్షస్ఛలము, భూదేవి అంశతో నితంబ భాగము అమరి ఉన్నాయి. రాక్షస సంహారం సాగించి,

గగనంలో వెలుగుతున్న ఆ పరాశక్తిని చూచి దేవతలందరూ శిరములు వంచి, చేతులు జోడించి, పరిపరి విధాల ప్రార్థించారు. సర్వరాక్షస సంహారానికై ఆవిర్భవించిన ఆ శక్తికి క్షీరసాగరుడు దివ్యమూల్యాలను , విశ్వకర్మ చూడామణిని, త్వష్ట రత్నఖచితమైన నూపురాలను, వరుణుడు వాసన వీడని వైజయంతిమాలను, హిమవంతుడు సువర్ణ సింహాసనాన్ని కానుకలుగా సమర్పించారు.

ఆ దివ్యశక్తికి సహస్రార చక్రాన్ని విష్ణువు, త్రిశూలాన్ని శివుడు , శంఖాన్ని వరుణుడు, శక్తిని, అగ్ని , ధనుస్సును వాయుదేవుడు, వజ్రాయుధాన్ని , ఇంద్రుడు, దండాన్ని యముడు ఇచ్చారు. దేవతలంతా సమర్పించిన శక్తి సమూహాన్ని స్వీకరించి ప్రకాశింతే జగన్మాత పెద్ద వికటాట్టాహాసం చేసింది. ఆ నాదానికి దానవులందరూ భయభ్రాంతులయ్యారు. మహిషునకు దూతవల్ల ఈ వృతాతంతమంతా తెలిసింది. ఆకాశంలో కన్పించిన ఆమె సౌందర్యాన్ని గురించి దూతలవల్ల విని మహిషుడు భయభ్రాంతుడై, తన్ను తాను దిద్దుకోలేదు సరికదా కాముకుడై ప్రేలాపనలు ప్రారంభించాడు. "దూతలారా ! ఎలాగైనా సామోపాయంతో నచ్చచెప్పి ఆ సుందరిని నా దగ్గరకు తీసుకురండి . ఆమెను నేను భార్యగా స్వీకరిస్తాను " అన్నాడు. దూతలు ఆ దివ్య శక్తిని సమీపించి , మహిషుని వాక్యాలను విన్నవించారు.

మహిషుని మాటలు దూతలు విని, ఆ పరాశక్తి పక్కున నవ్వింది. "ఓయీ ! మీ ప్రభువైన మహిషాసురుడు వట్టి మందబుద్ధి, అతని దురాగతాలను సహించలేక దేవతలందరూ మొఱపెట్టుకోగా, మహిషుణ్ణి హతమార్చడానికే నేను ఆవిర్భవించాను. బ్రతుకు మీద తీపి ఉంటే, పాతాళానికి పోయి సుఖంగా ఉండమని చెప్పండి. లేకపోతే, యుద్ధానికి సిద్ధపడమని చెప్పండి. నా చేతిలో మీ ప్రభువు ప్రాణాలు వదలటం తథ్యం . "అని పరాశక్తి పలికింది. దూతలు మహిషుణ్ణి సమీపించి పరాశక్తి చెప్పిన మాటలు విన్నవించారు. మాహిషుడు మంత్రులతో సమాలోచన చేశాడు.

ఒకనాడు మహిషాసురుడు, విరూపాక్షుడు , దుర్ధరుడు అనే దూతలను పిలిచాడు. "అనుచరులారా! మీరు ఆ సుందరాంగి వద్దకు వెళ్ళి, నా వైభవాన్ని, పరాక్రమాన్ని ఆమెకు వివరించండి. నిష్కారణంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పండి. మీ ప్రభువునైన నేనుస్వర్గ మర్త్య

పాతాళాలోకాలను అధిపతినని ఆమెకు తెలియ చెప్పండి. నాభార్యగా సమస్త లోకాలకూ అధిరాజ్ఞియై అందరిని శాసింప వచ్చునని, నేను ఆమెకు

అన్ని విధాలా సహకరించి ఆమెను సంతోషింప చేస్తానని చెప్పండి. " అని

వారిని పురమాయించాడు.

ఆ దూతలు పరాశక్తిని సమీపించి మహిషుని మాటలను ఆమెకు తెలియ చేశారు. అందుకు ఆమె "ఆ పశువుకు తగిన మంత్రులే మీరు. పశుబుద్ధి కాక మంచి బుద్ధి మీ కెలా కలుగుతుంది? మీ ప్రభువు కోరుకున్న వరం వల్ల అతడికి స్త్రీ చేతిలో మరణం తథ్యం. గర్వంతో విఱ్ఱ వీగే మీ రాజుకు మరణకాలం సమీపించింది. మారుమాటాడకుండా నన్ను శరణు వేడుకుంటాడో, మరణానికి సిద్ధపడుతాడో తేల్చుకోమని చెప్పండి " అని హెచ్చరించింది.

దూతల ద్వారా ఆ మాటలు విన్న మహిషుడు కర్తవ్యం తోచక పరిపరి విధాల ఆలోచనల్లో మునిగి పోయాడు. అపుడు విరూపాక్షుడనే సేనాని "కామినికి భయపడడం పిరికితనం. కామినుల మాటలను వ్యంగ్య వైభవంతో అర్థం చేసుకోవాలి. " అంటూ ఆమె మాటలకు వక్రోక్తిని ఆరోపించి , శృంగార పరమైన వ్యాఖ్యలు తేసి, ప్రలాపాలు పలికాడు. ఆ మాటలు విన్న తామ్రుడనే మంత్రి "మహారాజా! అష్టాదశ భుజాలతో ఆకాశంలో ఆవిర్భవించిన దివ్యశక్తిని చూచి సామాన్య కామినిగా భావించడం కంటే వెఱ్ఱితనం ఇంకేముమటుంది. ఆమె సామాన్యురాలు గా తోచడంలేదు. ఆమెతో మీరు రాయబారాలు సాగించడం ప్రారంబించిన నాటి నుండి మన ఇళ్ళలో అనేక ఉత్పాతాలు కన్పిస్తున్నాయి. అంతులేని దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. రాత్రివేళల్లో పక్షులు వికృతంగా అరుస్తున్నాయి. అందుచేత ఆమెతో యుద్ధం చేసి విజయమో, వీరస్వర్గమో తేల్చుకుందాం "అన్నాడు.

మహిషుడు పరాశక్తితో యుద్ధం ప్రారంభించాడు. ముందుహా బాష్కల, దుర్ముఖులనే వారిని ఆ శక్తి పైకి యుద్ధానికి పంపాడు. వాళ్ళిద్దరూ దేవి చేతిలో మరణించారు. ఆ తరువాత ఆసిలోముడు, ధూమ్రాక్షుడు అనే వారిని యుద్ధానికి పంపగా, వారు కూడా దేవి చేతిలో మరణించారు. విధిలేక చివరకు మహిషుడే, స్వయంగా మనోహరుడైన ఆ మహిషుడు సుందర మానవరూపం ధరించి, సర్వాలంకార శోభితుడై దివ్యశస్త్రాస్త్రాలతో ప్రకాశిస్తూ సహస్ర సేవా సమేతుడై దేవి సన్నిధికి వచ్చాడు.

"దేవీ! " సంసార చక్రంలో ఎవరైనా సుఖాన్నే కోరుకుంటారు. అలాంటి సుఖం ప్రకృతి పురుషుల సంబంధం వల్లనే కలుగుతుంది. మాతా పితరులకు పుత్రులతో సంబంధం, అన్నదమ్ముల చెలిమి ఉత్తమ , మధ్యమములు. అన్నింటి కంటె మన సంబంధం ఉత్తమోత్తమం. ఇంద్రాది దేవతలు నాకు భయపడి పారిపోయారు. సర్వలోక సామ్రాజ్ఞివై నా వైభవాన్ని పరిపాలించు. నీ ఆజ్ఞకు బద్ధుడనై నీ దాసుడనై వ్యవహరిస్తాను. మహాబలశాలినైన నేను అబలవైన నీతో యుద్ధం చేయడం సముచితందా కనిపించడం లేదు. నాతో వైరము మాని నన్ను అనుసరించు "- అని దేవిని కోరాడు.

దేవి మహిషుని మాటలకు ఆగ్రహించింది, కనులెఱ్ఱ చేసి, ఉగ్ర దృష్టితో చూచింది. "ఓరీ మూర్ఖా! రూపం మార్చినా , నీ పశుప్రవృత్తిని మార్చుకోలేదు నువ్వు. పరాత్పరుడైన పురుషుడే నాకు భర్త . అతని సంకల్పాన్ని అనుసరించి నేను సృష్టి స్థితి సంహారాలను నిర్వహిస్తూ ఉంటాను. ఆ పరాత్పరునికి తప్ప నా నిజరూపం ఎవ్వరికీ తెలియదు. మందబుద్ధి వైన నీకు ఎలా తెలుస్తుంది? ప్రాణాలపై తీపి ఉంటే, నన్ను శరణు వేడి, నీ తప్పును దిద్దుకొని, పాతాళానికి పోయి సుఖంగా బ్రతుకు లేని పక్షంలో నీకు నా చేతిలో చావు తప్పదు - "అని హుంకరించింది.

మహిషుడు ఆమెను సామ, దాన భేద వాక్యములతో మరల్చడానికి ప్రయత్నించాడు. కాని పరాశక్తి వాని మాటలను లెక్కచేయలేదు.

"ఓరీ మహిషా! నిన్ను సంహరించడానికే నేను ఈ రూపంలో వచ్చాను. అనవసర ప్రసంగాలతో వృధా కాలయాపన తేయక నా ఆయుధానికి నీ ప్రాణాలను ఆర్పించు. " అని హెచ్చరికలు చేసింది. ఆమె వరుసగా మహిషునిపై శస్త్రాస్త్రాలు ప్రయోగించ సాగింది. మహిషుడు భిన్న భిన్న రూపాలు ధరించి, మాయా వేషుడై చిత్ర విచిత్ర విన్యాసాలతో యుద్ధం చేయసాగుడు. జగన్మాత తన క్రీగంటి చూపులతో ప్రసారంతోనే మహిషుని మాయలను అంతం చేసింది. లీలా విలాసంగా త్రిశూలాన్ని మహిషుని వక్షస్థలంపై ప్రయోగించింది. మహిషాసురుడు, అతనితో పాటు అతని అనుచరులు మరణించానీ.

మహిషాసుర సంహార వార్త తెలిసి ఇంద్రాది దేవతలు ఎంతో సంతోషించారు. జగన్మాతను ఆనంద పారవశ్యంతో స్తోత్రం చేశారు. వారి భక్తికి ఆమె సంతోషించింది. "మీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా నన్ను స్మరించండి. నేను మీ శత్రువులను సంహరించి, మీ ఆపదలను నివారిస్తాను. నన్ను ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే నా కర్తవ్యం." అని తల్లి పలికింది. పరాశక్తి మాటలకు దేవగణం పరవశించి పోయింది. దేవతలందరూ ఆమె పాదాల చెంత మోకరిల్లి, "అమ్మా! నీయందు అచంచలమైన భక్తిని మాకు ప్రసాదించు. సర్వకాల సర్వావస్థలలో నీ పాదసేవయే మాకు కర్తవ్యం, కన్నబిడ్డల అపరాధాలను క్షమించగల దయా స్వరూపిణివి నువ్వు, దుర్లభ##మైన నీ దర్శనం మాకు అనుగ్రహించావు." అని వేడుకున్నారు. వారి కోరికలు విని పరాశక్తి వారిని అనుగ్రహించి, అంతర్థాన మయింది.

ఈ కథలో- మహీషుడు అంటే దున్నపోతు స్వబావమని అర్థం. కరడుగట్టిన తమోగుమ ప్రవృత్తి పసుస్వభావమై, మానవత్వాన్ని మంటగలిపి, దానవత్వాన్ని విజృంభింపజేసి, లభించిన జీవితాన్ని నిరర్థకం చేస్తుంది. మానవులలో యుక్తాయుక్త విచక్షణ నశించినపుడు పశువు వలె మూర్ఖుడవుతాడు. మానవుని ఆవహించిన పశుత్వమే మహీషాసురుడు. "వాడు దున్నపోతు "అని, "వాడి బుద్ధి గడ్డి తిన్నది" అని మూర్ఖుడి విషయంలో పెద్దలు మందలించడం మనం చూస్తూ ఉంటాం.

మానవునిలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు. పశుప్రవృత్తి హద్దులు మీరినపుడు ఇంద్రియాలు బుద్ధికి లోబడి ఉండక, ప్రవృత్తిని అనుసరించి విచ్చల విడిగా విహరిస్తాయి. అంటే ఇంద్రియాధి దేవతల అనుగ్రహానికి దూరమవుతాయన్న మాట. మహిషాసురుడు దేవతలను బాధించాడనే మాటకు అర్థమిదే.

ఈ దశలో మానవుడు పతనోన్ముఖుడు అవుతాడు. అపుడు మానవుడు సాధన ప్రారంభించి, తనలో జ్యోతిస్స్వరూపిణిగా దాగిఉన్న శక్తిని ఉద్ధీపింపచేసి పశుప్రవృత్తిని నిర్మీలింప చేసుకొని సక్రమమైన ప్రవర్తనతో సుఖశాంతులను పొందుతాడు. దేవతలందరూ పరాశక్తిని ప్రార్థించగా, ఆమె అవతరించి, మహిషాసురుని సంహరించి, దేవతలను రక్షించడం ఈ అధ్యాత్మిక సత్యానికి కథారూపం మాత్రమే.

తనలో దాగిన శక్తిని మానవుడు ఉద్దీపింప చేసుకోవాలంటే యోగసాధన, ప్రాణాయామ ప్రక్రియ ఎంతగానో సహకరిస్తాయి. సత్సాంగత్యం ద్వారా, సత్ర్పవర్తనను అలవరచుకున్న సాధకుడు సత్యాన్ని దర్శింప గలడు.

అపుడే మానవునిలో దాగిన పశుస్వభావం అంతరించి, అతడు దైమానుగ్రహానికి పరిపూర్ణంగా అర్హుడవుతాడు. కనుక, మానవుడు అజ్ఞానం చేత ఆవరించిన తమోగుణాన్ని జ్ఞానస్వరూపిణి అయిన పరాశక్తి ప్రభావంతో అంతరింప చేసుకుని మానవత్వాన్ని సార్థకం చేసుకుంటూ, దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడని ఈ కథ మనలను ప్రబోధిస్తోంది.

Devi Kathalu         Chapters          Last Page