Kamakoti   Chapters   Last Page

 

6. ఆదిశంకరుల గ్రంధములు

ఆదిశంకరు లేయే గ్రంధములు వ్రాసిరని సరిగా చెప్పుట కష్టము. శంకరకృత్యములుగా దాదాపు 200 గ్రంధములు ప్రసిద్ధములు, వీరి ప్రకరణ గ్రంధములు, భాష్యములు, స్తోత్రములు మున్నగునవి. అనేక వ్యాసములు అనునవి ఈ 200 లోనివే. శంకరనామధారులు అనేకులుండిరి. ఆదిశంకరులు స్థాపించిన మఠములలో ఆచార్యవనములన అభిషిక్తమైన వారందరు శంకరాచార్య నామముతోప్రసిద్ధులు. ఇప్పుడుకూడా ఈ పద్ధతియే. అందుచేత శంకరనామముగల అనేక వ్యక్తుల రచనలు ఏకము చేయబడినవి. అందుండి ఆదిశంకర రచనలను వేరు చేయుట చాలాకష్టము. ఇచట తెలియవలసినది. బ్రహ్మసూత్రములపై శారీరక భాష్య నిర్మాతయగు శంకరుడేయే గ్రంధములు వ్రాసెననియే.

ప్రస్తానత్రయముపై గూడ ఆయన భాష్యములున్నవని ప్రసిద్ధి. బ్రహ్మసూత్రము, శ్రీమద్భగవద్గీతా ప్రధానములగు కొన్ని ఉపనిషత్తులమీద కూడ వారి భాష్యమున్నది గౌడపాదకృతయగు మాండూక్య కారిక మీదకూడ వారి భాష్యమున్నది. విష్ణుసహస్రనామ భాష్యము, సనత్సుజాత భాష్యము కూడ ప్రాచీనకాలమునుండియు ఆదిశంకరకృతులని ప్రసిద్ధము. హస్తామలకముపై లభ్యమగు శంకరభాష్యము శంకరునిదా వారి శిష్యునిదా లేదా అన్యశంకరునిదా యని నిర్ణయించుట కష్టము.

సన్యాసి సాంప్రదాయమున ఈరచనము శంకరునిది గనే మన్నింపబడుతున్నది. వారి గాయత్రీభాష్యమున్ను ప్రసిద్ధము. మండల బ్రాహ్మణోపనిషత్తు రాజయోగభాష్యము అను నొక వ్యాఖ్యానము లభించుచున్నది. గ్రంధపరిశీలనచే ఇదియు ఆదిశంకర కృతమనియే తోచుచున్నది. ఇది మైసూరు నుండి ప్రకాశితము సాంఖ్యకారికలపై జయమంగళమను పేరనున్నటీక శంకరునిదని కొందరి తలంపు. కాని ఆ లేఖకు గ్రంధ భూమికయందు అన్యగ్రంధముల పైకూడ జయమంగళమను టీకలు వ్రాసిన శంకరాచార్య నామకుడగు పండితుడే ఈ టీక వాసెనని నిరూపింప ప్రయత్నించిరి. ఇది ఆదిశంకర కృతమని నమ్మజాలము. ఇవిగాక వివేకచూడామణి, సర్వవేదాంత సిద్ధాంత సంగ్రహము, ఉపదేశసాహస్రీ శంకరరచనములు, ప్రపంచసారము, సౌందర్యలహరి మున్నగు గ్రంధములతో పాటు శంకరనామము మిళితమైయున్నది. కాని ఇవి ఆదిశంకర కృతములా కావాయను విషయము అనేకకారణములచే చారిత్రకులు మిక్కిలి సన్దేహించుచున్నారు. గ్రంధపుష్పిక నుండి సర్వసిద్ధాంత సంగ్రమను గ్రంధము శంకరకృతమని తెలియుచున్నది. అదియును, ఆదిశంకరకృతము కాదు. ఏలయన, ఈ గ్రంధకారుని మతమున పూర్వమీమాంస, దేవతాకాండ (సంకర్షణకాండ) ఈ మూడుగ్రంధములు ఒక శాస్త్రములోనివి. కాని శారీరక భాష్యకారుడగు శంకరుడు (బ్ర.సూ. 1-1-1) ఉత్తర, పూర్వమీమాంస శాస్త్రము లభిన్నములు కావని చూపెను.

శంకరుడు చాల చిన్న చిన్న గ్రంధములు రచించెను. వానిలో వేదాంతాధికారసాధనము లగు వైరాగ్యము మున్నగు సంపదల వర్ణనమున్నది. కాని ప్రాచీనకాలమునుండి విభిన్న ప్రదేశములయందు విభిన్నలిపులందు వ్రాయబడిన గ్రంధములన్నియు గోవిందభగవత్పాద శిష్యులగు శంకరులచే రచితములని చెప్పబడినవి. యధాసంభవముగ వాని పట్టిక క్రింద నీయ యత్నింతును, ఇది సర్వవిధముల అపూర్ణమే. ఇందు సందేహము లేదు. విభిన్న గ్రంధాలయములందలి హస్త లిఖితగ్రంధముల నన్వేషించిన పిదప ఇట్టి ననేకములు లభింపవచ్చునని తోచుచున్నది. అయినప్పటికిని ప్రసిద్ధములగు చిన్నగ్రంధముల సంగ్రహ మేర్పడు నట్లులిఖింప యత్నింపబడెను. ఐతిహాసిక దృష్టితో ఈ సంగ్రహముపై ఆలోచించనక్కరలేదు. (శుద్ధ) కేవల శంకరనామమున ఈ గ్రంధములు సంసృష్టములు. అందుచే వీనిపేర్లు ఇచ్చట ఈయబడినవి.

1. ఏకశ్టోకీ ------ ఈపేరున వేర్వేరు రెండుశ్టోకములు వేదాంత

చరిత్రయందు ప్రసిద్ధములు. వానిలో నొకదానిపై గోపాల యోగీంద్రుని శిష్యుడగు స్వయం ప్రకాశయతి వ్రాసిన స్వాత్మాదీవనమను వ్యాఖ్యానమున్నది.

2. కౌపీనపంచకము ------ దీనికి యతిపంచకమన్నది మారుపేరు

3.అద్వైతపంచకరత్నములు, కొన్ని చోట్ల ఇది ఆత్మపంచకము, అద్వైతపంచకమనికూడా చెప్పబడినది. పంచకమను పేరున్నను ఒక్కొక్కచోట ఒక శ్లోకమధికముగ కన్పట్టును.

4. ఆత్మబోధ ----- గీర్వాణంద్రశిష్యుడగు బోధేంద్రుడు దీనిపై భావప్రకాశిక యను టీక వ్రాసెను. ఈ గీర్వాణంద్రుడు ఒక అద్వైతపీఠాధ్యక్షుడని తెలియుచున్నది. టీకాకారుడగు బోధేంద్రుడు త్రిపురసుందరీ ఉపాసకుడు, ఇతడు తన టీకలో ఇట్లు వ్రాసినాడు -----

''శ్రీచక్రమధ్యనియాసమస్త గుణసేవితాః

సాదేవీ త్రిపురాతుష్టా వీక్షతాం మత్కృతిం వరాం ||''

(చూ.తంజావూరు కేటలాగు సే 71-74)

5. అద్వైతానుభూతి

6. అద్వైతరసమంజరి --- సదాశివేంద్ర సరస్వతికూడా ఈ పేరున ఒక పుస్తకము వ్రాసెను.

7. అవరోక్షానుభూతి --- అవరోక్షానుభవామృత మనుపేర శంకరరచితమగు ప్రకరణము కన్పట్టుచున్నది.

8. నిర్వాణషట్కము --- దీని మారుపేర్లు; ఆత్మ షట్కము, చిదానందషట్కము

9. పంచరత్నము--దీనివేరుపేర్లు: ఉపదేశపంచకము, పంచరత్నమాలిక,సాధకపంచకము

10. నిరంజనాష్టకము

11. స్వాత్మప్రకాశిక

12. ఆర్యాపంచకము - దీనిపై సచ్చిదానందసరస్వతి యొక్క టీక కలదు.

13. విఙాననౌక , లేదా స్వరూపాను సంధానము

14. అనాత్మ శ్రీవిగర్హణ ప్రకరణము

15. జీవన్ముక్తానందలహరి

16. గుర్వష్టకము

17. కేవలొహమ్‌

18. పరా పూజా - దీని రెండవపేరు ఆత్మపూజ.

19. చర్పటపంజరిక - అచటచట శ్వేదశమంజరి, ద్వాదశపంజరిక అనుపేరున కూడ ప్రసిద్ధము, ఒక్కొక్కచోట మోహముద్గరమని కూడ చెప్పబడుచున్నది. కానికొన్ని చోట్ల ఈ శ్లోకములకు మారుగ ఇతర శ్లోకములు మోహముద్గరమున ప్రసిద్ధములు.

20. నిర్గుణపూజ

21. ప్రౌఢానుభూతి

22. తత్త్వోపదేశము

23. ప్రశ్నోత్తరమాలిక

24. బ్రహ్మ నామావళీమాల (లేదా మ్రహ్మఙానావళీమాల)

25. నిర్వాణమంజరి

26. ప్రాతఃస్మరణస్తోత్రము

27. ధన్యాష్టకము

28. మణిరత్నమాల

29. మఠామ్నాయము, ఇందు మొత్తం 65 శ్లోకములున్నవి.

30. బ్రహ్మానుచింతనము లేక ఆత్మానుచింతనము

31. మనీషాపంచకము -- ఇందు చండాలరూపుడగు శివుని (శంకరునితో సంభాషణ రూపమున) తత్త్వోపదేశమున్నది. దీనిపై సదాశివేంద్రుని ఒక టీక యున్నది. 'మధుమంజరి' యను పేరున గోపాల బాలయతి కృతమగు మరొక్క టీక యున్నది. అందతడు తన్ను జగన్నాధముని శిష్యుడనని చెప్పకొనియున్నాడు. ఈ జగన్నాధుడు కాశీప్రసిద్ధుడగు జగన్నాధాశ్రమమున కభిన్నుడైనచో ఆ టీకాకారులు నృసింహాశ్రమతీర్ధులై యుండియుండవచ్చును. ఈ మనీషాపంచకమునకు విలక్షణమగు మరియొక మనీషాపంచకము అచ్చట అచ్చట నున్నట్లు కనుపించును. మనీషాపంచకముపై హస్తామలకుని టీక కూడ ఒక్కొక్క సంగ్రహము (లైబ్రరీ) లో దొరకుచున్నది.

32. సదాచారము

33. సహజాష్టకము

34. స్వాత్మనిరూపణము - వేదాంతార్యా బోధార్యా, ఆత్మబోధ, అనుభూతిరత్న మాలయని దీనికి నామాంతరములు.

35. దశశ్లోకీ - లేక - నిర్వాణదశకము - దీనిపై ప్రసిద్ధ వేదాంతాచార్యులగు మధుసూదన సరస్వతి సిద్ధాంతబిందువను పేర వ్యాఖ్య వ్రాసెను.

36. సారతత్త్వోపదేశము

37. వేదవేదాంతతత్త్వసారము

38. వాక్యవృత్తి, దీనిపై మహాయోగి మాధవప్రాజ్ఞుని శిష్యుడగు విశ్వేశ్వరపండితుని ప్రకాశికయను టీక కలదు. రామానందయతియొక్క టీక కూడ కలదు.

39. యోగతారావళి, దీనికి భిన్నమగు మరియొక యోగతారావళి యను గ్రంధమున్నది. దాని రచయిత నందికేశ్వరుడు.

40. లఘువాక్యవృత్తి - దీనిపై పుష్పాంజలియను టీక కలదు. టీకాకారుని కాలము తెలియదు. కాని ఇతడు విద్యారణ్యుని నిర్దేశించి యుండుటచే అతని తర్వాత వాడనవచ్చును.

41. ఙానసన్యాసము

42. బాలబోధిని

43. చిదానందాత్మకస్తోత్రము

44. మహావాక్యమంత్రము

45. మహావాక్యవివరణము లేదా మహావాక్యదర్పణము

46. మహావాక్యవివేకము.

47. అష్టశ్లోకీ.

48. ద్వాదశమహావాక్యవివరణము.

49. పంచీకరణప్రకరణము, దీనికి గోపాలయతీంద్రుని శిష్యుడగు స్వయంప్రకాశుడు వివరణమను టీక వ్రాసెను. స్వయంప్రకాశుడు, శివరామ పూర్ణానంద పురుషోత్తమాచార్యులను తన గురువులుగ తలంచెను. శంకర శిష్యుడగు సురేశ్వరుడు దీనిపై ఒక వార్తికము వ్రాసెను. ఈ వార్తికముపై వివరణమను టీకను శివరామతీర్ధుడు వ్రాసెను. ఈ టీకపై ఆభరణమని మరొక టీక కూడ లభించుచున్నది.

50. ఆత్మానాత్మవివేకము

51. ప్రబోధసుధాకరము

52.దక్షిణామూర్తిస్తోత్రము. దీనిపై సురేశ్వరాచార్యుడు మానసోల్లాసమును వార్తికమును, కైవల్యానందశిష్యుడగు స్వయం ప్రకాశయతి ''తత్త్వసుధ'' యను టీకలు వ్రాసియున్నారు.

53.వాక్యసుధ - అసలిది శంకరకృతము కాదు. దీని టీకాకారుడగు మునిదానభూపాలుడు శంకరకృతమని మన్నించినను (తంజావూరు కేటలాగు పు. సం 7374) అది ప్రామాణికము కాదు. భారతీతీర్ధలు, విద్యారణ్యులిరువురు కలసి ఈ గ్రంధమును రచించెనని టీకాకారుడగు బ్రహ్మానందభారతి భావము (చూ. తంజావూరు 7368) కాని స్వయం ప్రకాశ ప్రశిష్యుడు, హయగ్రీవుని శిష్యుడగు విశ్వేశ్వరముని తన వాక్యసుధాటీకయందు దీని రచయిత విద్యారణ్యుడు ఒక్కడే యని వ్రాసెను.

54. పరమహంససంధ్యోపాసనము

55. గాయత్రీపద్ధతి, ఇందు విశ్వామిత్రసంహిత ఉల్లేఖింపబడినది.

56. అజ్ఞానబోధిని (ఆత్మబోధటీక) ఈ గ్రంధము 4వ సంఖ్యలో నున్న పైదానికి భిన్నమని తోచుచున్నది.

57. త్రిపుటీ ప్రకరణము - దీనికి ఆనంజ్ఞానుని టీకయున్నది.

58. దశనామాభిధానము - ఇందు కొన్ని విషయములలో మఠామ్నాయముతో సన్నిహితసంబంధమున్నట్లున్నది.

59. సర్వవేదాంత సిద్ధాంత సంగ్రహము

60. కేరళాచారసంగ్రహము

61. సామవేదమంత్రభాష్యము

62. వజ్రసూచ్యువనిషత్సారము

63. హరిత త్త్వముక్తావళి

64. జీవబ్రహ్మైక్యస్తోత్రము

65. మాయాపంచకము

66. జ్ఞానగంగాశతకము

67. శతశ్లోకీ

68. సంన్యాసపద్ధతి

69. సర్వసిద్ధాంతసంగ్రహము

70. నవరత్నమాల

71. సర్వప్రత్యయమాల

72. మంత్రార్ణస్తుతి

73. మంత్రమాతృకాపుష్పమాల

74. అవధూతషట్కము

75. జ్ఞానగీత

76. సిద్ధాంతపంజరము

శంకరులు చాల స్తోత్రగ్రంధములు వ్రాసిరని ప్రసిద్ధి. వారు పూర్తిగ అద్వైతవాదులయినను వ్యావహారికరంగములో దేవతోపాసనను, దాని సార్ధకతను బాగుగ నమ్ముచుండిరి. స్వయముగ కూడ లోకశిక్షణకై అట్టి ఆచరణ చేయుచుండిరి. వారి విశాల హృదయమున సంప్రదాయమునకు సంబంధించిన క్షుద్రభావములకు తావులేదు. అందుచే శివ, విష్ణు, శక్తి మున్నగు అనేకదేవతలు వారి విభిన్నరూపముల స్తోత్రములు వారి రచనలలో కన్పించుచున్నవి. అవశ్యము వీనిలో కొన్ని వారి తరువాతి శంకరులు వ్రాసినవి కావచ్చును. కాని ఇవన్నియు ఆదిశంకరుల కారోపింపబడినవి. ఈ విషయమును ఎక్కువ తరచినవారు ప్రతి స్తోత్రమునకు ప్రామాణ్య విచారపూర్వకమగు కాలనిర్ణయము, కర్తృనిశ్చయముకొరకు ప్రయత్నింతురు. శంకరనామమాత్రసంబంధ ముండుటచే వాని నిట జూసితిని. వీనిలో ఒకటి రెండు స్తోత్రముల పేర్లు పూర్వ సూచిక యందు కూడ వచ్చినవి. అందుచే వాని పునరుక్తి చేయబడలేదు.

శివస్తోత్రములు

1. శివ భుజంగ ప్రయాతస్తోత్రము

2. శివాష్టకమ్‌

3. ద్వాదశజ్యోతిర్లింగస్తోత్రము

4. దక్షిణామూర్త్యష్టకము(?)

5. శివపంచాక్షరీ

6. మృత్యుంజయమానసపూజ

7. కాలభైరవాష్టకము

8. శివపాదాది కేశాంతస్తోత్రము

9. శివకేశాది పాదాంతస్తోత్రము

10. దక్షిణామూర్తి వర్ణమాల

11. వేదసారశివస్తోత్రము

12. శివజ్ఞానద కారిక

శక్తి స్తోత్రములు

1. అంబాష్టకము

2. త్రిపురసుందర్యష్టకము

3. లలితాపంచరత్నములు

4. రాజరాజేశ్వరీ

5. మీనాక్షిస్తోత్రము

6. మీనాక్షీ పంచరత్నము

7. బాలాపంచరత్నము

8. త్రిపురసుందరీమానసపూజ

9. త్రిపురసుందరీ వేదపాదము

10. అన్నపూర్ణాస్తోత్రము

11. మాతంగీ

12. దేవీభుజంగప్రయాతము

13. దేవీపంచరత్నము

14. దేవీస్తుతి

15. గౌరీదశకము

16. భవాన్యష్టకము

17. భవానీభుజంగప్రయాతము

18. దుర్గాపరాధభంజనము

19. తారాపఙ్ఘటికా

20. గిరిజాదశకము

21. కాళికా

22. కాల్యపరాధభంజనము

23. దేవీచతుష్షష్ట్యుపచారపూజా

24. శారదాభుజంగప్రయాతము

25. కామాక్షి

26. శ్యామామానసార్చనము

27. భ్రమరాంబాష్టకము

విష్ణుస్తోత్రములు

1. కృష్ణాష్టకము (2 రకములు)

2. బాలకృష్ణాష్టకము

3. కృష్ణదివ్యస్తోత్రము

4. అచ్చుతాష్టకము

5. చక్రపాణి

6. విష్ణుషట్పదీ

7. నారాయణ

8. గోవిందాష్టకము

9. ఆర్తత్రాణ నారాయణాష్టాదశము

10. విష్ణుపాదాది కేశాంతము

11. హరిమీడే

12. జగన్నాధాష్టకము

13. జగన్నాధస్తోత్రము

14. భగవన్మానసపూజ

15. పాండురంగాష్టకము

16. ముకుందచతుర్దశ

17. హరినామావళీ

18. సంకటహరణ

19. రామాష్టకము

20. రాఘవాష్టకము

21. రామభుజంగప్రయాతము

22. రామతత్త్వరత్నము

గణశ స్తోత్రములు

1. గణశభుజంగప్రయాతము

2. వరదగణశము

3. గణశాష్టకము

4. గణశపంచరత్నము

యుగళ##దేవతాస్తోత్రములు

1. అర్ధనారీశ్వరము

2. ఉమామహేశ్వరము

3. లక్ష్మీనృసింహపంచరత్నము

4. హరిహరము

5. హరిగౌర్యష్టకమ్‌

6. సంకటనాశనలక్ష్మీనృసింహము

నదీతీర్ధవిషయకస్తోత్రములు

1. గంగాష్టకము

2. గంగాస్తోత్రము

3. యమునాష్టకము(2 రకములు)

4. నర్మదాష్టకము

5. కాశీ (విశ్వనాధ నగరీ)

6. కాశీ పంచకము

7. పుష్కరాష్టకము

8. త్రివేణీ

9. మణికర్ణికా

సాధారణ స్తోత్రములు

1. సుబ్రహ్మణ్య భుజంగప్రయాతము

2. దత్తభుజంగప్రయాతము

3. దత్తమహిమ్నము

4. కనకధారా

5. కళ్యాణవృష్టి

6. సువర్ణమాలా

7. మహాపురుష

8. బ్రహ్మానంద

9. హనుమత్పంచకము

10. అంజనీ స్తోత్రము

(గోపీనాధ్‌ కవిరాజు వ్రాసిన జగద్గురు శ్రీ ఆదిశంకరులు అను గ్రంధము నుండి)

Kamakoti   Chapters   Last Page