Kamakoti   Chapters   Last Page

 

9. శ్రీమదాదిశంకరభగవత్పాదకృత స్తోత్రరత్నములు

లక్ష్మీనరసింహపంచరత్నమ్‌

(ది. 8-5-71 శనివారం నృసింహజయంతి)

త్వత్ప్రభు జీవ ప్రియ మిచ్ఛసి చే

న్నరహరిపూజాం కురు! సతతం

ప్రతిబింబాలంకృతి దృశి కుశలో

బింబాలంకృతి మాతనుతే

చేతోభృంగ! భ్రమసి వృధా భవ

మరుభూమౌ విరసాయాం

భజ! భజ! లక్ష్మీనరసింహానఘ

పదసరసిజ మకరందమ్‌ || 1

ఓ మనోభృంగమా! రసహీనమైన సంసారమనెడి ఎడారి భూమిలో వ్యర్థముగా తిరిగెదవేల? శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాద పద్మములలోని మకరందము నాదరముతో సేవింపుము. ప్రతిబింబము (జీవుని) నలంకరించి చూచు నేర్పరి ముందుగా బింబము (భగవంతు) నలంకరించునుగదా! అట్లే నీప్రభువగు జీవునకు ప్రియమును కోరినచో ముందుగా శ్రీలక్ష్మీనరసింహస్వామిని విడువక పూజింపుము.

శుక్తౌ రజత ప్రతిభా జాతా

కటకాద్యర్ధ సమర్ధా చేత్‌

దుఃఖమయీ తే సంస్కృతి రేషా

నిర్వృతిదానే నిపుణా స్యాత్‌

చేతోభృంగ! భ్రమసి వృధా భవ

మరుభూమౌ విరసాయాం

భజ! భజ! లక్ష్మీనరసింహానఘ

పదసరసిజ మకరందమ్‌ || 2

భ్రమచే శుక్తియందుతోచిన వెండితో కడియాలు మురుగులు చేయించుకొనుట కుదిరినచో ఈ దుఃఖమయసంసారము నిక్కమయిన ఆనందము నిచ్చుటయున్నూ కుదరవచ్చును. కాని అట్లు జరుగదుగదా! ఓ మనోభృంగమా! రసహీనమయిన సంసార మనెడి ఎడారిభూమిలో వ్యర్ధముగా తిరిగెదవేల! శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాదపద్మములలోని మకరందము నాదరముతో సేవింపుము.

ఆకృతిసామ్యా చ్ఛాల్మలికుసుమే

స్థలనళినీత్వ భ్రమ మకరోః

గంధరసా విహ కిము విద్యేతే ?

విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్‌

చేతోభృంగ! భ్రమసి వృధా భవ

మరుభూమౌ విరసాయాం

భజ! భజ! లక్ష్మీనరసింహానఘ

పదసరసిజ మకరందమ్‌ || 3

ఆకారము సమముగానున్నదని బూరుగుపూవును చూచి మెట్టతామరపూవనుకొంటిని. విరసమగు బూరుగుపూవులో గంధముగాని మకరందరసముగాని కలదా? వ్యర్ధముగా భ్రమపడితిని. కనుక ఓ మనోభృంగమా! రసహీనమగు నీ సంసారమనెడి ఎడారిభూమిలో వ్యర్ధముగా తిరిగెదవేల ! శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాదపద్మములలోని మకరందము నాదరముతో సేవింపుము.

స్రక్చందన వనితాదీన్‌ విషయాన్‌

సుఖదాన్‌ మత్వా తత్ర విహరసే

గంధఫలీ సదృశా నను తేమీ

భోగానంతర దుఃఖకృతః స్యుః

చేతోభృంగ ! భ్రమసి వృధా భవ

మరుభూమౌ విరసాయాం

భజ ! భజ ! లక్ష్మీనరసింహానఘ

పదసరసిజ మకరందమ్‌ || 4

స్రక్చందనవనితాది విషయమును సుఖప్రదములనుకొని వానియందు విహరించుచున్నావు. కాని ఇవి నీకు సంపెంగపూవులవలె భోగానంతరము అనంత దుఃఖప్రదములగును సుమా ! ఓ మనోభృంగమా ! రసహీనమగు నీ సంసారమనెడి ఎడారిభూమిలో వ్యర్ధముగా తిరిగెదవేల ? శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాదపద్మములలోని మకరందము నాదరముతో సేవింపుము.

తవ హిత మేకం వచనం వక్ష్యే

శృణు ! సుఖకామో యది సతతం

స్వప్నే దృష్టం సకలం హి మృషా

జాగ్రతి చ స్మర ! తద్వ దితి

చేతోభృంగ ! భ్రమసి వృధా భవ

మరుభూమౌ విరసాయాం

భజ ! భజ ! లక్ష్మీనరసింహానఘ

పదసరసిజ మకరందమ్‌ ||

నీవు నిజముగా సుఖముకోరినచో నేనొక్క మంచిమాట చెప్పుచున్నాను వినుము. ''స్వప్నమున చూచినదెల్లయు యెట్లు మృష(కల్ల) యగుచున్నదో అట్లే జాగ్రదావస్థలోని సమస్తమున్ను మృష(కల్ల) యే యని స్మరింపుము. ఓ మనోభృంగమా ! రసహీనమగు నీ సంసారమనెడి ఎడారిభూమిలో వ్యర్ధముగా తిరిగెదవేల ? శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పాదారవిందములలోని మకరందరసము నాదరముతో సేవింపుము.

ఇతి శ్రీమచ్ఛంకర భగవత్పాద కృతం శ్రీలక్ష్మీనరసింహ

పంచరత్నమ్‌ సంపూర్ణమ్‌



Kamakoti   Chapters   Last Page