Nadichedevudu   Chapters  

 

55. బిడ్డకు సంతోషం - స్వామికి సంతృప్తి!

శ్రీ త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరులను స్వామి పూజిస్తున్నారు. వేలాది భక్తులు శ్రద్ధతో పూజను వీక్షిస్తున్నారు. అమ్మవారికి అలంకరించిన పట్టుచీరె అందరినీ ఆకర్షిస్తున్నది.

వేదికకు దూరంగా ఒకమూల తల్లి ఒడిలో కూచున్న చిన్నపిల్ల అమ్మ వారికి కట్టిన చీరె చూసింది. చూడ్డంతోనే తన కా చీరె కావాలని తల్లిని వేధించడం మొదలెట్టింది- అమాయకంగా. తల్లి కూతురును ఎంతో బుజ్జగించింది; మందలించింది. విన్నది కాదు కూతురు. పూజ ముగిసింది.

స్వామి అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడి జనమంతా తీర్థం పుచ్చుకుంటున్నారు. తల్లి పిల్లను ఎలాగో సముదాయించి, తీర్థం అందుకోడానికి అందరితోపాటు వేదిక దగ్గర కొచ్చింది.

హఠాత్తుగా స్వామి తీర్థం ఇవ్వడం ఆపేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. స్వామి లేచి అమ్మవారికి కట్టిన పట్టుచీరెను తెచ్చి, ఆ పిల్ల కిచ్చి, తరువాత తీర్థం ఇవ్వడం మొదలెట్టారు.

పిల్ల కెంత సంతోషమో, స్వామికి అంత సంతృప్తి!

తల్లి విస్తుబోయింది. ఎక్కడో అంతదూరాన కూచున్న తన బిడ్డ కోరిక స్వామికి ఎలా తెలిసింది!

Nadichedevudu   Chapters