Sri Laxmihrudayamu    Chapters   

కృతజ్ఞత

చదువువ్రాతలకైనను శక్తిలేని యీ ముదిమియందు మూఁడేడ్లయి గురుపాధిని రేవగళ్ళు సంరక్షించుటయందుఁబ్రమాదపడక కనిపెట్టుచున్న బుద్ధిశాలిని, కన్యక, ప్రియశిష్య, శ్రీవిద్యారత యగుటచే నా చేయుచుండిన లక్ష్మీహృదయ వివరణమును వ్రాసి చి|| సౌ|| బులుసు సావిత్రమమ్మను బుత్త్రికానిర్విశేషస్నేహముతోను; ఆ వ్రాతను భ్రమ ప్రమాదాది దోషములు సవరించుచఁబరిశోధించి ముద్రణయోగ్యముగా వ్రాసిన చిరప్రియశిష్యుఁడు చి|| కళ్ళేపల్లి భోజరాజును శ్రీమాతృచరణములకడ

ఁబెట్టి వారి యాయురారోగ్యవిద్యా వివృద్ధికై దీవించుచున్నాను.

అవ్యాజప్రేమతో మున్న నాకొన్ని రచనములయెడ సదభిప్రాయము లిచ్చి, బాధ్యతానిర్వహణభారము బహుముఖములుగా నున్నను, శ్రమఁగొని వీలు కల్పించుకొనియిపుడు దీనియడ నభిప్రాయము లిచ్చి నన్నలరించిమహాశయలు (1) బ్రహ్మశ్రీ డా|| పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి, M.A.,M.Litt., Ph. D., Head of the Dept. of the English, Nagapur University, Nagapur. గారికిని, (2) బహుభాషా కవితాకళామృతనిష్ణాతులు, బ్రహ్మశ్రీ విద్వా&ఆకిలి శ్రీరామశ్రమ (ముత్తుకూరు, నెల్లూరుజిల్లా) గారికిని శ్రీమాత్రశీర్వాదములతోను గృతజ్ఞతాపూర్వక వందనముతను నపర్ణుఁడ నగుచున్నాను.

సాధనగ్రంథమండలి పేరు సార్థముచేయ శ్రమపడుచు లోకోపకారిదీక్షిదతులై నారచనముల నెన్నిఁటినో భక్తివిశ్వాసాగ్రములతో బయల్పెట్టుచు నిపుడీ "లక్ష్మీహృదయవివరణ" ప్రకాశనమునెడ లక్ష్యముంచి నన్ను ధన్యుని చేసిన బ్రహ్మశ్రీ విద్వా& బులుసు సూర్యప్రకాశ శాస్త్రిగారిని శ్రీ లక్ష్మీకటాక్షమున కొప్పగించి వారి సంవత్సమృద్ధికై వారక శ్రీమాత నర్థించుచున్నాను.

శ్రీకాకుళం ఇట్లు,

25-9-67 శాక్తబంధుఁడు

శ్రీ శ్రియానందనాథుఁడు

ఈశ్వర సత్యనారాయణశర్మ

Sri Laxmihrudayamu    Chapters