Sri Laxmihrudayamu    Chapters   

:- ప్రశంసాశీస్సులు :-

కం. సిరికిరవై వెలసిన భా

సుర కాకానికులసంజ్ఞ శోభిలు కంజా

కరవరము సూర్యకాంతా

కర సద్గుణమహిమ క్రమ్మి క్రాలుతుఁజిరమ.&

గీ. విమలసత్కీర్తి తనువును వీడి స్వర్గ

గతి వరించిన విప్రుఁడౌ గంగరాజు

కాంత, పేరిట శ్రీసూర్యకాంత శివుని

ప్రేరణమ్మున నచ్చునఁబెట్టె దీని.

సి. స్త్రీయై జనించియు స్త్రీ శబ్దపరమార్థ

మేఱుఁగని కొలఁదొలగించుకొననొ

శ్రీ తనంతట వచ్చి చేరిన; దాని త

త్త్వమ్మెఱుంగని తప్పుఁబాచికొననొ

హ్రీభూషలాండ్రనియెడి సూక్తిలోఁగల

పరమార్థమును బట్టుపఱచుకొననొ

హ్రీశ్రీపతిత్వమ్ము నెనసెను బూరుషో

త్తముఁడను దాని సత్యమ్మెరఁగనొ

గీ. వృత్తిపుట్టంగ నన్నింట వృత్తి ¸°చుఁ

దనరు శ్రీదేవి"లక్ష్మీహృదయవివరణ"

మనెడి కృతిఁజూచి తత్ప్రకాశనభరమ్ముఁ

బూనుమని ప్రోత్సహించె నీ పుణ్యవతిని.

గీ. సోదరీకులవృద్ధికై సుగుణి పుత్త్రు

నప్పనము గొప్పకాదు; మాయప్పమనసు

శ్రీజననిపాదముల వైపె త్రిప్పెద నను

సోదరుని విశ్వనాథుని చోదన మిది.

చం. నరుఁడిల సత్తిరాజయిన నాఁడె యతండగు విశ్వనాథుఁడీ

పరమపదార్థము& దెలిసి భక్తిని శ్రీసుభ##గేశ్వరీలల

చ్చరణసమర్హణచ్ఛ గురుసన్నిధింజేరి గడించి విద్యభా

సురమతి నాప్తబుద్ధుల ప్రచోదనము& బొనరింపకుండనే.

సీ. పల్కెనా పల్కది పరదేవతా స్వరూ

పముఁదెల్పునదె ¸°చు వఱలుచుండు

పట్టెనా లేఖినా& భద్రాస్తవ మరంద

కణములె దాని యగ్రమున నుట్టు

కాంచెనా యొకదిన్సు కామేశ్యభిన్నవై

కారికమే యని గడనసేయు

తాకెనా చేతఁబుస్తకమది శ్రీమాతృ

తత్త్వవిచారసందర్భమగు

తే.గీ. అట్టి శ్రీవిశ్వనాథాఖ్యుఁడతని శక్తి

సత్యలక్ష్మియె పురికొల్ప సహజపుత్త్ర

బంధు మిత్రాది ముఖము నిర్బంధపెట్టి

శ్రీపదాభిముఖమ్మగఁ ద్రిప్పకున్న.

సీ. వేయిరూకలభృతి పెట్టు నుద్యోగమ్ము

సాధనమ్మున కెటు సమయమిచ్చే?

పదినాళు లింట నిల్వఁగనీని పని కదా

శ్రీ సపర్యల కెడ చిక్కుటెట్లు?

ఎడమొక గడెలేని యితఁడు శ్రీవిద్యను

గురుఁజేరి యెటు నేర్చుకొనఁగలిగెనో?

తనకె తీరిక లేదు తద్విద్య యర్థాంగి

కెపుడు నేర్పఁగఁదఱి నెన్నుకొనెనొ

గీ. అనుచు నచ్చెరుపడు వార లతని విధలు

కామ్యములు కామిచే మహాకాలశక్తి

తన సపర్యల కవకాశదాత్రి యగుచు

నేలుకొనుచుంట నింతయు నెన్నలేరు.

ఉ. క్షేత్రఫలంబు నెంచి పలుక్రేవలఁగాల్వలఁబాఱంజేసి స

స్యత్రయ లాభకారియగు నట్లతఁడారసి యెన్నో యూషర

క్షేత్రసమంబులైన జనచిత్తము లిట్టే ఫలింపఁగా జగ

ద్ధాత్రినిదెల్పు తెల్వి బహూధా ప్రవహింపఁగఁజేయు నద్దిరా!

కం. కులకరియు గోత్రకరియును

గులసుందరి; యామె ప్రితికొఱకే యని ని

ష్కలుషుండై తనసోదరి

కులవృద్ధికిఁ బత్త్రు నొసంగి కొఱ తీర్చె; బలే!

చం. ధరఁ బరవఁశవృద్ధికయి దానమొనర్తురు కన్యల& సహో

దరి కులవృద్ధికై తనయదానము చేయుట దానికంటెను&

వరఫలదాయియంచు హరినామక పుత్త్రునొసంగె నౌర! శ్రీ

హరికృప విశ్వనాథుని యనంతసుఖాప్తికి మూలమౌనటుల్‌

మం. తనకా ధాన్యధనమ్ము లింటను సమృద్ధమ్మింక మాసాంత వే

తనమా రూకలువేయి చూడఁగ బవిత్రంభైనసౌద్రయము&

ఘనధర్మంబు కతంబుగా నొకసుతు& దానమ్ముఁజేసె& సుధీ

ధనుఁడై; యొప్పదెవిశ్వనాథునిహద్ధర్మంబునగ్గింపఁగా&.

గీ. గ్రంథకర్తకు గ్రంథప్రకాశకునకు

సమఫలం బబ్బు నను రహస్యమ్ము నెఱిఁగి

యడిగినంతనె సూర్యకాంతమ్మ కిడితి

హృదయగతలక్ష్మి నను బ్రోత్సహింప దీని.

గీ. పుస్తకా లమ్ముకొని మను బుద్ధిలేని

వ్రతము చెడకుండ నేలు భారతికి మ్రొక్కు;

అచ్చుపని బర్వు నీ కేల యని యొకపుడు

భయము వాపిన సౌభాగ్యవతికి మ్రొక్కు.

కం. హరివంశము పగిదిని శ్రీ

హరివంశము వేఁగుదుళ్ళ కాదియగుచిల&

బరహిత దీక్షారతితోఁ

జిరకాలము వెలయుగాత శ్రీమాతృకృప.&

సీ. కాకాని వంశశాఖలు పెక్కులై సుమ

ఫలసంపద& బరోపకృతిఁజేయ

సూర్యకాంతాఘృణి శోభ నిత్యముగ; శ్రీ

హరియశోవ్యాప్తుల నడరుచుండ

శ్రీభూపతిత్విమ్ము శ్రీహరి కబ్బిన

ఫలము కాకానిసత్కులముఁదనుప

విశ్వనాథుని కృపావీక్షణజ్యోతిచే

నంతస్తమంబెల్ల నంతరింప

తే.గీ. అవని కాదర్శమై యశోవ్యాప్తి యడర

నిహపరసుఖానుభవమున కిక్క యుగుచు

వెలయుఁగావుతఁగాకానికులసమృద్ధి

శ్రీ శ్రియానందనాథు నాశీర్బలమున.

Sri Laxmihrudayamu    Chapters