Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

హవిర్యజ్ఞములు; సోమయజ్ఞములు

గర్భగతుడైన జీవుని ఉద్దేశించి చేసే సంస్కారాలు మూడు. వివరాలు తెలిసిన తరువాత చేసే సంస్కారాలు కొన్ని-ఉపనయనం, వివాహంఇత్యాదులు. అవి తల్లిదండ్రులు చేసేవి. అటుపైపంచమహాయజ్ఞాలు. వానికి ఆధారం స్నానం, సంధ్య. ఉదయం కాకముందే సంధ్యావందనం చేయాలి.

ప్రతివారున్నూ ఒకపాత్ర ప్రత్యేకంగా ఉంచుకోవాలి; ఎక్కడికి వెళ్ళినా దానినేవాడుకొంటూఉండాలి. మరొకందుకు వాడే పాత్రలను ఉపయోగించరాదు. అన్నిటికీమూలం శౌచం (శుచిత్వం). శౌచరహినమైన ఏకర్మా ఫలించదు.

కరచరణాద్యంగాలకు ఆశుద్ధి ఏర్పడినప్పుడు కొన్నిమార్లు నీరు పుక్కిలించి శుద్ధిచేయాలని ధర్మశాస్త్రం నిర్దేశిస్తున్నది. గొడుగూ, చెప్పులూ ప్రత్యేకంగా ఉంచుకొన్నట్లే పాత్రను ప్రత్యేకంగా ఉంచుకోవాలి.

వృత్తికాస్నాన పూర్వకంగా స్నానంచేయాలి 'మృత్తికేహనమే పాపమ్‌' అని తైత్తరీయారణ్యకం చెపుతున్నది. మృత్తిక మేలయిన ద్రవ్యవిశేషం. ఓషధులు పుట్టేస్థానం మృత్తిక. 'భూ' శబ్దానికి పుట్టించేదని అర్థం. అన్ని ప్రాణులున్నూ భూమిలోనుంచే పుటుతున్నవి. 'మృత్తికతో దేహం శుద్ధిచేసుకోవాలి' అనే వైదికనిబంధన పురస్కరించుకొనే వైష్ణవులు తిరుమణి కల్పనచేశారు. ఔపాసన సందర్భంగా పుట్టినది విభూతి. అది ఔపాసనాగ్ని హోత్రరక్ష. మొట్టమొదట నామాలకు గోపీచందనం వాడేవారు. అదీ మృత్తికే. శ్రీరామానుజాచార్యుల అనంతరం నామధారణకు తెల్లమన్ను వినియోగమవుతున్నది.


్హనీరు నోటితో పుక్కిలిస్తే ఎన్నో గుణాలున్నవి. అన్నం తిన్న తరువాత పండ్లుతోముకొనేటప్పుడుకూడా ఇది చాలా ముఖ్యం. తిన్నగా శుభ్రంగా పలు దోముకోకపోవడంవల్ల వ్యాధులెన్నో వస్తున్నవని ఈ కాలపు డాక్టర్లు అంటున్నారు. ఆకాలంలో దంత శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. 'ముప్పది లేక నలుబదిమారులు పుక్కిలించాలి' అనేశాస్త్రీయ నిబంధనవల్ల ఈకార్యమే ఒక వ్యాయామమై, నోటిలో చిక్కుకొన్న ఆహారకణాలు బయటికి పోగొట్టడానికి తోడ్పడటమే కాక జీర్ణశక్తికిన్నీ తోడుపడుతుంది.

తర్వాత వస్త్రశుభ్రత-నారబట్టలు, కంబళివాడవచ్చు. వీనిని అమావాస్యనాడు శుద్ధంచేయాలి. మిగిలిన రోజులలోచేస్తే శుద్ధికాదు. పుక్కిలించకపోతే శాస్త్రీయ శుద్ధిలేదు. ఇవన్నీ స్నానానికిముందు చేయవలసినవి.

స్నానం పూర్తి చేసినపిదప శివపూజ పదినిమిషములలో చేసుకోవచ్చు. మంత్రాలు లఘువుగా ఉంచుకొని షోడశోపచారాలు పేరుకు చేయవచ్చును. అందరూ పంచాక్షరీ మంత్రోపదేశంపొంది ఉండాలి. 'ఆపోహిష్ఠా' మంత్రంతో అభిషేకంచేసి, అర్చన అక్షతలతో సరిపెట్టుకోవచ్చు. నైవేద్యానికి ద్రాక్షచాలు. శివపూజలేకుండా అన్నం తినడం ఒక విశేషంకాదు. ఈవిధంగా చేస్తూవస్తే అవసానకాలంలో శివరక్షణ మనకుండకపోదు.

''త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనమ్‌,

ఉర్వారుక మివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్‌''.

- శ్రీరుద్రము.

''త్రియాయుషం జమదగ్నేః

కశ్యపస్య త్రియాయుషమ్‌

అగస్త్య త్రియాయుషమ్‌

యద్దేవానాం త్రియాయుషమ్‌

తన్మే అస్తు త్రియాయుషమ్‌''.

- తైత్తరీయసంహిత.

విభూతిధారణకున్నూ, భస్మోద్ధూళనకున్నూ మంత్రాలున్నవి. మంత్రపూర్వకంగా స్నానం శాస్త్రీయమవుతుంది. భోజనంగూడా మంత్రపూర్వకంగా చేస్తున్నాము.

సంసారబంధాలన్నీ భస్మమైపోవాలనే మనం భస్మఅలదుకొంటున్నాం. భస్మం గ్రహించేటప్పుడు ''అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మవ్యోమేతి భస్మ సర్వగ్‌ం హవాఇదం భస్మ వాఙ్మన ఇత్యేతాని చక్షూగ్‌ంషి కరణాని భస్మాని'' అని పఠించాలని జాబాలోపనిషత్తులో ఉన్నది. మంత్రం చిన్నదే దాన్ని చెప్పుకొని విభూతిధరిస్తే ఉపయోగముంటుంది. లేకపోతే భస్మధారణ ఫలం దేహంవరకే. వీలు అయినంతవరకూ ఈవాడుకలను మనం అలవరచుకొంటే మరొక్కతరమునకైనా ఇవి ఉంటవి. లేకపోతే వాడుకలో నుంచి మాయమవుతవి.

ఏ అగ్నిని సాక్షిగాపెట్టుకొని వివాహం చేసుకొంటున్నామో ఆ అగ్నిని వదలకుండా ఉపాసన ప్రారంభించి ఆయుః పర్యంతమూ దానిని రక్షిస్తుండాలి. మంత్రవీర్యం తగ్గిపోకుండా పదిహేనురోజులకొకమారు స్థాలీపాకంచేయాలి. సంవత్సరానికి ఆరుకర్మలు ఔపాసనాగ్నిలో చేయాలి. చైత్రమాసంలో పరమేశ్వరుని ఉద్దేశించి ఈశానబలిని ఇవ్వాలి. తక్కినకాలములలో దేవతల నుద్దేశించి, బలులనివ్వాలి. అశ్వయుజి ఆశ్వీజమాసంలో చేయవలసినది. అపుడు క్రొత్తధ్యానం ఇండ్లకు వచ్చేసమయం. ఔపాసనాగ్నిలో మొదట వానిని ఆహుతిచేసి తర్వాత ఉపయోగించాలి. అగ్రహాయణము మార్గశిరంలో సాంబావడ్లు వచ్చేకాలంలో చేయాలి. శ్రావణమాసంలో పాములనుద్దేశించి పుట్టలలో బలివేయాలి. మార్గశిర, పుష్యమాఘ, షాల్గున మాసములలో అష్టమినాడు అష్టకాశ్రాద్ధం చేయాలి.

ఇట్లా చేయవలసిన కర్మలు స్మార్తాగ్నితో చేయాలి. స్మార్తాగ్ని అంటే ఔపాసనాగ్ని. అగ్నిహోత్రంపిదపచేయాలి. మగసంతు ఒకటికల్గిన తర్వాత వెండ్రుకలు తెల్లబడేటంతలో అగ్ని కార్యంచేయాలి. అపత్నీకునికి అగ్నిహోత్రంలేదు. అగ్న్యా ధానమని అత్నిహోత్రారంభంలో చెపుతారు. హవిర్యజ్ఞాలలో అది ఒకటి. వసంత కాలములో వివాహం చేయాలి. దాంతో ఔపాసనసిద్ధి కలుగుతుంది. అగ్న్యాధానం వల్ల అగ్ని హోత్రసిద్ధి స్థాలిపాకంవలె పదునైదురోజుల కొకమారు దర్శపూర్ణమాసేష్టి చేయవలెను.

ఔపాసనాగ్ని ఆరిపోతే అగ్నిసంధానం చేయాలి. అగనిహోత్రానికికూడా పునరాధానం చేయాలి. దానికోసంహవిర్యజ్ఞాలలోచేరిన పశుబంధం ఏడాది కొకసారిచేయాలి. ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నులుచేయాలి. మార్గశిరమున పిదప చతుర్మాస్యము. చతుర్మాస్యము సన్యాసులకున్నూ ఉన్నది. అదిఒకచోట ఉండిచేసేది. గృహస్థునకు అదిఒక యాగం. పై చెప్పిన అగ్న్యాధానం, అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాస, అగ్రహాయణం, చాతుర్మాస్య, పశుబంధం, సౌత్రామణి అనేవి ఏడున్నూ హవిర్యజ్ఞాలు.

చాతుర్మాస్య సౌత్రామణులను రెంటినీ ఒకపర్యాయంగానీ, అనేక పర్యాయములుగాని చేయవచ్చు. పునరాధానమున్నూ అట్లే.

యజ్ఞాలు మూడురకాలు. పాకయజ్ఞాలు ఏడు; సోమయజ్ఞాలు ఏడు; హవిర్యజ్ఞాలు ఏడు. వీనికి ప్రయోగాలు కల్పసూత్రాలలో ఉన్నవి.

సోమయజ్ఞాలు చేసేవారు సోమయాజులు. కడపటి సోమయజ్ఞంవాజపేయం. వాజపేయం చేసినవారికి, అవభృథస్నానకాలంలో రాజులు శ్వేతచ్ఛత్రంపట్టేవారు. సోమయాగంచేసేవారు సోమపానంచేస్తారు. నంబూద్రి బ్రాహ్మణులలో పది కుటుంబాలలో ఒక్కరైనా సోమయాగం చేసేవారు. బ్రాహ్మణులకున్న సొత్తు సోమయాగం చేయడానికే. వారిలో జ్యేష్ఠుడే సోమయాగం చేయడానికి అర్హుడు. ఆస్తికిన్నీ అతడే అర్హుడు.

సోమయాగ మెవరు చేసినప్పటికిన్నీ, సొమలమున్నూ, కృష్ణాజినమున్నూ కొల్లంగోడు రాజా ఇచ్చేవారట. సోమలత హిమాలయమం దున్నదనీ ఆయుర్వేదంచెబుతూంది. అగ్నిష్టోమానికే సోమయాగమని పేరొకటి ఉంది. జ్యోతిష్టోమం జన్మలో ఒకమారు చేయాలి. మూడుతరాలుగా వేదాధ్యయనమూ, యజ్ఞాలూ వదలినవానికి దౌర్ర్బాహ్మణ్యం ఏర్పడుతుంది.

ఈ యజ్జాలవల్ల ప్రయోజనం ఏమిటి ?

''త మేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి

యజ్ఞేన దానేన తపసా నాశ##కేన''

అని బృహదారణ్యకం అంటూంది.

పరమాత్మ స్వరూపాన్వేషణాపరులు ఉపవాస యజ్ఞాదులు పరమేశ్వర ప్రీతిగా చేస్తూఉండాలి. మోక్షకాములకు మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. పూర్వజన్మలో యోగాలు చేసినవానికి ఈ జన్మలో వివేకం కలుగుతుంది. తపోయజ్ఞ దానాదులచే చిత్తశుద్ధి ఏర్పడుతుందని ఆచార్యులు సెలవిచ్చియున్నారు.

యజ్ఞంచేయడం పాపమా? పుణ్యమా? మిశ్రమా? మధ్వాచార్యులవారు యాగాలలో పశుబలి ఉండరాదనీ, పిండితో ఆహుతిచేస్తే చాలుననీ ఏర్పాటు చేశారు.

బ్రహ్మసూత్ర కర్తలు వ్యాసులు. ఆత్మస్వరూపము చెప్పుటయే ఉపనిషత్తుల తాత్పర్యమని అన్నారు. యజ్ఞ ప్రయోగాలు పూర్వమీమాంస యందున్నవి. వాని ప్రయోజనం ఉత్తరమీమాంసలో ఉన్నది.

అశుద్ధమితి చేన్న శబ్దాత్‌ - బ్రహ్మసూత్రములు.

ఆత్మజ్ఞానాంగమే యజ్ఞం. అది ఎలా అశుద్ధం? శుద్ధాశుద్ధాలను తీర్మానించుటకు శాస్త్రమే ప్రమాణం. వేదముకంటే పెద్దప్రమాణమేమున్నది? ఆ వేదశబ్దమున్నందువల్లపాపంలేదు. శుద్ధా శుద్ధాలు శబ్దప్రమాణంచే తెలిసికోవాలి. సురాపానం చేయరాదన్న వైదిక నిర్ధేశమున్నందున, అది అశుద్ధమని తెలుస్తూంది. వేదాభిప్రాయం యజ్ఞములు అశుద్ధములని ఉంటే వ్యాసులు అట్టి యజ్ఞాన్ని ఆత్మజ్ఞానాంగంగా చెప్పిఉంటారా? మధ్వాచార్యులు చెప్పినట్లు పిండితో పశువునుచేసినా దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాంకదా! అందుచే దానికిన్నీ దోషముంది.

తిరుక్కురల్‌ లో యాగనింద ఉన్నదని కొందరంటారు. కాని ప్రాచీన గ్రంథకర్తలందరికిన్నీ వైదికానుష్ఠానాలలో నమ్మికుండేదని నా అభిప్రాయం. లోకోపకారమైన గ్రంథం వ్రాసినవారు తిరువళ్ళువరు. ''హవిస్సు అగ్నిలోవేసి వేయి యజ్ఞాలుచేయడంకంటె ఒక ప్రాణిని వధించకుండటం మంచిది'' అని ఆయన వ్రాశారు.

ధర్మంకోసం మనం ఏకార్యమైనా చేయాలి. హింస అని చూడరాదు. వేయియజ్ఞములకంటె ఒక ప్రాణిని హించించకుండా ఉండటం మంచిదని తిరుక్కురల్‌ చెపుతూంది. దానిచేత తిరువళ్ళువరు యాగనింద చేస్తున్నారని మనమంటున్నాము. వేయియజ్ఞాలకంటె, ఒక అశ్వమేధయజ్ఞం మంచిదని మనువు ఒకచోట చెప్పారు. వేయి అశ్వవేధాలకంటె ఒక సత్యం మంచిదనిన్నీ చెపుతున్నారు. యజ్ఞం పాపమయితే, వేయిపాపాలకంటె ఒకపుణ్యం ఉత్కృష్టమైనదని చెపుతామా? నూరు ఏకాదసులకంటె ఒక శివరాత్రి మేలని చెప్పవచ్చు. నూరు కసాయిదుకాణాలకంటె ఒక శివరాత్రి ఉపవాసం మేలు అని చెపుతామా? పుణ్యకర్మలను గూర్చి చెప్పవలసినప్పుడు ఒకటి మరిఒకదానికంటె ఉత్కృష్టమైనదనియే చెపుతారు. ఛాందోగ్యోపనిషత్తు చివర 'అహింస& సర్వభూతా న్యన్యత్ర తీర్థేభ్యః' అని ఉంది.

వైదికకర్మలలో తప్ప తక్కినచోట్ల అహింస అవలంబించాలి. యజ్ఞం, యుద్ధం ఈచోట్ల హింస అనిచూడరాదు. యజ్ఞంకంటె అహింస శ్రేష్ఠమయితే యజ్ఞమున్నూ శ్రేష్ఠమే. దానికంటె అహింస శ్రేష్ఠమనియే దానికి అర్థం. నూరు మురికి కాలువలకంటె ఒకగంగానది పవిత్రమైనది అని మనమనటంలేదు. నూరుకావేరులకంటె ఒక్కగంగ పవిత్రమైనదనియే ఆంటాం. అదేవిధంగా వేయియజ్ఞాలకంటె ఒక్క అహింస మేలైనదని కురల్‌ అంటూంది. ఆ కురయే గృహస్థుడు వేయియజ్ఞాలు చేయటంకంటే సన్యాసి ఒక ప్రాణిని హింసించకుండటం మంచిదని చెపుతూంది.

మనబుద్ధికి తోచినవే, మంచిచెడ్డలని తీర్మానించడం కంటె శాస్త్రమే ప్రమాణమని ఉండడం మంచిది. ఆనమ్మిక పూర్వకాలంలో అందరకిన్నీ ఉండేది. వేదములన్నా, ధర్మశాస్త్రాలన్నా అందరకూ నమ్మికే. ఆధానం, అగ్నిహోత్రం, దర్శపూర్ణ మాసం వీనిలో పశువులేదు. సోమసంస్కారాలకు మాత్రం పశువు అవసరం.

ఇవి సంస్కారాలకు చేరినవి. ఆత్మగుణములు ఎనిమిది. ఇవి దయ, క్షమ, అనసూయ, శౌచం, పిడివాదం చేయకుండా ఉండడం, ఆనందంగా ఉండడం, అలోభం, దురాశ లేకుండటం వీనిలోచేర్చి నలుబదిఎనిమిది సంస్కారాలను ధర్మశాస్త్రాలు చెపుతున్నవి.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page