Bhakthi Rasaayanamu Chapters Last Page
తృతీయోల్లాసము
నను కేయం రసో నామ? కింనిష్ఠోవా భ##వే దసౌ?
అస్య ప్రత్యాయకః కోవా? ప్రతీతి రపి కీదృశీ?೧
భక్తియొక్క స్వరూపవిశేషములను జెప్పినతర్వాత భక్తిరసమును ప్రతిపాదింప గోరి మూడవ యుల్లాసమున మధుసూదను డారంభించు చున్నాడు. రసమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను వేసి, వాటి సమాధాన పూర్వకముగా భక్తిరసము ప్రతిపాదింప దలచినాడు.
రసమనగా నేమి? రసమున కాశ్రయమేమి? రసమెట్లు ప్రతీయమాన మగును? రసప్రతీతి యననేమి? ఈ నాలుగు ప్రశ్నలకు వరుసగా సమాధాము నీయ బోవుచున్నాడు.
విభావై రనుభావైశ్చవ్యభిచారభి రప్యుత,
స్థాయీభావః సుఖత్వేన వ్యజ్యమానో రసః స్మృతః.೨
చిత్తద్రుతిద్వారా కలుగు సంస్కారాత్మకమైన రతి యను భావము స్థాయిభావమై భక్తిరసముగా నిష్పన్నమగును. సజాతీయభావములచేగాని, విజాజాతీయభావములచే గాని తిరస్కృతము గాక, రననిష్పత్తి యగువరకు నుండు భావము స్థాయిభావమునకు విభావ, అనుభావ, సంచారిభావములతో సంయోగము కలుగగా, సుఖ రూపముగా ప్రతీయమానమగు రసము నిష్పన్నమగును.
వాసనాత్మకముగా నున్న స్థాయిభావమును అస్వాదాంకుర యోగ్యము గావించుటకు విభావింపబడునది విభావము. స్థాయిభావమును రగుల్కొలుపు కారణభూతము లగు విషయము లాలంబనవిభావములు. శత్రుదర్శన మను ఆలంబనవిభావము క్రోధ భయాది భావములను రగుల్కొలుపును. ఈ భావము నుద్దీపింపజేయు మలయానిలాదికము నుద్దీపనవిభావ మందురు. స్థాయిభావ ముద్దీపితము కాగా శరీరమునకు కన్పించు మార్పులను అనుభావములందురు. స్తంభ, స్వేద, రోమాంచ, స్వరభంగ, వేపథు, వైవర్ణ్య, అశ్రుపాత, ప్రలయములను సాత్త్వికానుభావములని పిలుతురు. స్మిత, గీత, కటాక్ష, భూజక్షేప, హుంకృత్యాదులు గూడ అనుభావములనబడుచున్నవి. విషయదర్శన భావనాదులచే మానసమునకొన్ని భావములు బయలుదేరి, స్థాయిభావమును ప్రవృత్తిపరముగా జేయుచున్నవి. ఇట్లొనరించు భావములను సంచారి భావములందురు. సంచారి భావములే శారీరకముగా సాత్త్వికా ద్యనుభావములు రూపమున నభివ్యక్తములగుచున్నవి. విభావములచే రగుల్కొలుపబడి, సంచారిభావములచే ప్రవృత్తి పరమై, అనుభావముల ద్వారా
అభివ్యక్తమై, పరిపుష్టమైన స్థాయిభావమును రసమని యనుచున్నాము. (రెండవ అనుబంధము చూడుడు).
సుఖ స్యాత్మస్వరూపత్వా త్తదాధారోన విద్యతే,
తద్వ్యంజికాయా వృత్తే స్తు సామాజిక మనఃప్రతి.3
రసము సుఖరూపముగా ప్రతీయమాన మగునదని యనినాము. ఈ సుఖ మైహికమగు వైషయికసుఖము గాక, లోకోత్త రాహ్లాదము, లోకోత్తరాహ్లాదము నానంద మని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. "ఏష హ్యేవానందయాతి" అని, "రసోవైసఃరసం హ్యోవాయం లబ్ధ్వా77నందీ భవతి" అను ఉపనిషద్వాక్యములలో రస మాత్మస్వరూపమగు సుఖ మనబడు రసమున కాధారములేదు. సర్వ జగదాధార మగు ఆత్మ కాధార ముండజాలదు. ఆధారశూన్య మైనను, ఆత్మకొన్ని ఉపాధులద్వారా వ్యక్తమగుచున్నది. ఇట్లే సర్వాధార మగు రసము నభివ్యక్తము జేయు ఉపాధులు గలవు. రసము నభివ్యంజకము చేయు చిత్తవృత్తికి సామాజికుల మానసమే ఆధారముగా కన్పించుచున్నది. సామాజిక మానస మనబడు ఉపాధి ద్వారా రస మభివ్యక్త మగును.
కావ్యార్థనిష్ఠా రత్యాద్యాః స్థాయినః సంతి లౌకికాః
తద్బోద్ధృనిష్ఠా స్త్వపరే తత్సమా అప్యలౌకికాః ೪
కావ్యమున వర్ణనీయముగా గాని, అభినేయముగా గాని యున్న విషయము నాధారముగా జేసికొనిన రత్యాది భావములు లౌకికములు. ఈ భావములు సుఖకారణ సహకృతము లైనచో సుఖజనన స్వభావము గలవి యని, దుఃఖకారణ సహకృతము లైనచో దుఃఖజననస్వభావము గలవి యని మనము వ్యవహరించుచున్నాము. కావున నివి లోకసిద్ధమగు నియమము ననుసరించునవి.
రసము నాస్వాదించు సామాజికులయందు ప్రతీయమానము లగు రత్యాది భావములు, సమానవిషయకతాద్వివశమున తత్తుల్యములై, అలౌకికము లనబడు చున్నవి. లౌకికభావములు రసాస్వాదమున అలౌకికములుగా నవగతము లగుచున్నవి.
బోధ్యనిష్ఠా యథాస్వంతే సుఖదుఃఖాదిహేతవః,
బోద్ధృనిష్ఠాస్తు సర్వే೭సి సుఖామాత్రైక హేతవః. ೫
వర్ణనీయ విషయమున, అభినేయ విషయమున గల రత్యాది భావములు లోకనియమము ననుసరించుచు సుఖదుఃఖాది జనన స్వభావము గల్గి యున్నవి. ఇవే భావమలు రసాస్వాద సమయమున సామాజిక నిష్ఠములై కేవలము సుఖమునే కలుగజేయు చున్నవిగాని, దుఃఖమును కలుగజేయ జాలకున్నవి. దుఃఖజనక మగు భావముగూడ రసాస్వాదమున సుఖమునే కలుగజేయు చున్నది.
అతో న కరుణాదీనాం రసత్వం ప్రతిహన్యతే,
భావానాం బోద్ధృనిష్ఠానాం దుఃఖా హేతుత్వనిశ్చయాత్.
సామాజికనిష్ఠము లగు స్థాయ్యాదిభావములు దుఃఖ జనకములు గాకపోవుటచేతనే దుఃఖాంశ గల కరుణ, భయానక, బీభత్సములు రసములు కాగల్గు చున్నవి. ఈ రసములు దుఃఖజనన స్వభావములను గల్గి యున్నచో నివి రసములుగా పతీయమానములు కాజాలవు. రసప్రతీతి యను ప్రవృత్తిలో ఇష్టసాధనత్వ జ్ఞానమే కారణమని, దుఃఖ మిష్టవిషయము కాదని మనకు తెలిసిన విషయమే.
తత్ర లౌకికరత్యాదేః కారణం లౌకికం తు యత్,
కావ్యోపదర్శితం తత్తు విభావ ఇతి కథ్యతే.`ò
లౌకిక వ్యవహారమున విషమయులతో మనకు సంబంధము కలుగగా రత్యాది భావములు బయలుదేరు చున్నవి. ఇట్టి విషయసంబంధముచే రగుల్కొపబడిన రత్యాదిభావములే కావ్యములయందు వర్ణింపబడు చున్నవి. విషయముతో సంబంధము కలుగగా విషయముచే మేల్కొలుపబడిన భావమవగత మగుటచే విషయమును కారణమని యెంచవలెను. కారణమునే కావ్యజగమున విభావ మందురు. కావ్యమున కలుగు హృదయసంవాదవశమున సాధారణీకరణము రాగా భావము విభావింపబడు చున్నది.
లౌకికసై#్యవ రత్యాదే ర్లోకే య త్కార్య మీక్షితమ్'
కావ్యోపదర్శితం తత్ స్యా దనుభావపదాస్పదమ్.8
లోకవ్యవహారమున రత్యాదు లనుభావము లైనచో భ్రూవిక్షేప, కటాక్షాదికములు బయలుదేరు చున్నవి. ఇట్లు త్పన్నములగు కార్యజాతములను అనుభావములని కావ్యములయందు వ్యవహరించు చున్నాము. అలౌకికానుభావన వ్యాపార వంతము లగుటచే నివి యనుభావము లనబడు చున్నవి.
లౌకిక సై#్యవ లరత్యాదేఃర్యే భావాః సహకారిణః,
కావ్యోపదర్శితాస్తే తు కధ్యంతే వ్యభిచారిణః.9
లోకవ్యవహారమున నుత్పన్నములగురత్యాది స్థాయి భావములకు నిమిత్తభావములై సహకారిణులైన భావములను కావ్యములయందు వ్యభిచారిభావమలు లేక సంచారిభావములు అని యందుము. నిర్వేద, వ్రీడాదు లిట్టివి.
అలౌకికన్య రత్యాదేః సామాజికనివాసినః,
ఉద్బోధే కారణం జ్ఞేయం త్రయ మేత త్సముచ్చితమ్. 1ం
సామాజికనిషములై అలౌకికములై రత్యాది స్థాయి భావములను మేల్కొలుప జేయువిభావానుభావ సంచారి భావములను మూటిని రసప్రతీతి కారణములని యెంచవలెను.
జ్ఞతస్యపరసంబంధా దన్యే సాధారణాత్మనా,
అలౌకికం బోధయంతి భావం భావా స్త్రయో7ప్యమీ.11
విభావ, అనభావ, వ్యభిచారి భావములను మూటియొక్క స్వరూపము, స్వభావము, ఆశ్రయము మొదలగు వాటిని తెలిసికొనినచో, వీచికి స్థాయిభావములకుగల సంబధబావము కేవల మేకవ్యక్తినిష్ఠమై, ఏకవ్యక్త్యను భూమతియోగ్యమై భాసించక, సర్వజనాను భవ యోగ్య మగుచున్నది. ఏవంవిధ మగు యోగ్యత్వమును సాధారణీకరణ మందురు. ఒకేఒక వ్యక్తిచే నసాధారణముగా ననుభూతమగుచున్న భావము సర్వజనకారణమై అలౌకికముగా ప్రతీయమాన మగు నని భావము. ఈ యలౌకిక సాధారణీకరణము భావనావ్యాపార సమాశ్రితమై వచ్చునది. స్థాయిభావ మలౌకిక సాధారణీభూతమై రసరూపమున పరిణమించును.
బావత్రితయ సంసృష్ట స్థాయిభావావగాహినీ,
సమూహాలంబనాత్మైకాజాయతే సాత్త్వికీ మతిః.12
విభా వానుభావ సంచారిభావములను మూటితోను సంసృష్టమై, ఉద్భోధితమై, ప్రత్యాయితమై, పరిపోషమును పొందునది స్థాయిభావము. నానాప్రకారతా నిరూపితము, నానావిశేష్యతానిరూపకము నగు స్థాయిభావవిషయిక మైన జ్ఞానముద్వారా సాత్త్వికమతి కల్గును. సముద్రిక్తమైన సత్త్వముగల చిత్తవృత్తి బయలుదేరునని తాత్పర్యము.
సా7నంతరక్షణ7 వశ్యం వ్యనక్తి సుఖ ముత్తమమ్,
త ద్రసః, కేచి దాచార్యాస్తామేవ తు రసం విదు.13
పైన చెప్పబడినసాత్త్వికమనోవృత్తి బయలుదేరిన వెంటనే ఉత్తమము, సంశయరహితము నగు లోకోత్త రానందము వ్యంజనా వ్యాపారవశమున అవగత మగుచున్నది. ఈ వ్యక్తికృత మగు సుఖమే రసమని చెప్పబడుచున్నది.
కాని కొందరు శాస్త్రజ్ఞులు పైన వివరించబడిన సమూహాలంబనాత్మక మగు చిత్తమునేరస మని యెంచుచున్నారు.
విభా వానుభావ సంచారి భావములకు స్థాయిభావ ముతో సంయోగము కలుగగా రసనిష్పత్తి కలదని భరతుడు సూత్రించెను. ఈ సూత్రమును పలువురు పలువిధముల వ్యాఖ్యానించిరి. మూడు విధముల భావముల సంయోగము రసనిష్పత్తికి హేతువుగా వ్యాఖ్యానించినవారు కొందరు గలరు. ఈసంయోగము కారణ హేతువుగాని, జ్ఞాపకహేతువు గాని కాదనుచు, విభావాదుల సంయోగ వశమున రసముత్పన్న మగుచున్నదని లొల్లటాదు లనినారు. భావనావశమున సముత్పన్నమైనట్లు ప్రతీయమానమగు అనిర్వచనీయస్థితియే రస మని మరికొంద రనినారు. రసమును మానసిక భ్రమ యనినవారు గూడ గలరు. విభావాది హేతువులచే ననుమేయ మగునది రస మని శంకుకాదులవాదము. భావనా వ్యాపారవశమున హృదయసంవాదము కలుగగా సంభవించు సాధారణీకరణమున సత్త్వోద్రేకము కలుగునని; ఈస్థితియందు భోగీకృతమగు నానందరూపమే రసమనిభట్టనాయకునివాదము గలదు. సాధారణీకరణమను వ్యాపారమహిమచే ఆవరణరూపమున నున్న ఉపాధులు భగ్నములు కాగా ప్రతీయమానమగు చిద్విశిష్ట స్థాయిభావమే రస మని అభినవ, మమ్ముటుల వాదసారాంశము. ఈ చివరివాదమును మధుసూదనుడు కేచిత్పక్షముగా నొసగినాడు. "రసోవైసః" ఇత్యాది శ్రుతి వాక్యములలో రసమును బ్రహ్మగా అంగీకరించినట్లు కన్పించుటచే చిద్విశిష్ట స్థాయిభావమును రసముగా నిర్వచింపరాదని నిర్విశేషమగు చిత్స ధార్థమునే రస మని తెలియవలెనని జగన్నాథు డనినాడు. జగన్నాథుని వాదమునకు మధుసూదనుని వాదమునకు భేదములేదు. ఈ రస ముపహితమై సవిశేషముగా మన కవగత మగుచున్నది. గనుక స్థాయిచే నుపహితమైన చిదాత్మను రస మని యెంచవలెను. ఇక్కడ చిదాత్మ యనగా సచ్చిదానందస్వరూపమగు పరమాత్మయని అర్థము.
తేషాం ప్రత్యేకవిజ్ఞానం కారణత్వేన త్తెర్మతమ్,
స్థాయీభావో రస ఇతి ప్రయోగ స్తూపచారతః.೧೪
విభావాదులు ప్రత్యేక విజ్ఞానము రసప్రతీతికి కారణమని, కార్య కారణములకు గల అభేదావస్థ నాశ్రయించుకొని స్థాయిభావమేరస మగుచున్నదని చెప్పుట కేవల మౌనచారిక ప్రయోగమని వాదించువారు సమూహాలంబనాత్మకమగు మతియే రస మనుచున్నారు.
ఏవ మ వ్యవధానేన క్రమో యస్మాన్న లక్ష్యతే,
అసంలక్ష్యక్రమవ్యంగ్య ధ్వనిం తస్మాదిమం విదుః.೧೫
సమూహాలంబనాత్మక మగు మతి యనగా నానాప్రకారతానిరూపితము, నానావిశేష్యతానిరూపకము నగుజ్ఞాన మని అర్థము. ఇట్టి జ్ఞానము కల్గినవెంటనే, అవ్యవహిత ముగా రసము వ్యక్త మగుచున్నదనినచో జ్ఞానము మొదట కల్గునని, తర్వాత రసవ్యక్తి యని క్రమము కన్పించవలెను. రెండును ఒకే ఒక కాలమున రాజాలవు. కావున విభా వానుభావ వ్యభిచారి భావములే రసము గావని, రసము వీటిచే వ్యంజింపబడుచున్నదని, ఇచట క్రమవివక్ష గలదని మమ్మటు డంగీకరించినాడు. కాని ఈ క్రమమును గుర్తించుట కష్టమగుటచే దీనిని అసంలంక్ష్యక్రమ మనుచున్నారు. సమూహాలంబనాత్మకమగు మతి, తదవ్యవహితోత్తర క్షణమున రసము, గలవు. ఇచట గన్పించు అవ్యవధానమున ఒకదాని తర్వాత నొకటి వచ్చుచున్నదను క్రమము గుర్తింపబడుట లేదు. దీనిని అసంలక్ష్యక్రమ వ్యంగ్యమగుధ్వని యనుచున్నారు.
శబ్దములకు సామాన్యముగా గల అర్థమును అభిదాయందురు. కొన్ని శబ్దములు కలియగా అన్వయము కుదిరినను అర్థమును మార్చి చెప్పుకొనుట గలదు. "గంగపైకుటీరముకలద"ని నపుడు "గంగయొడ్డున కుటీరము గల ద" ని చెప్పుచున్నాము. ఇట్టి అర్థమును లక్షణాయని, ఇది లక్షణాశక్తి ద్వారా శబ్దమునుండి గ్రహించబడిన అర్థమని తెలియవలెను. భుజించువేళ "సైంధవము" నడిగినవానికి సైంధవ మనగా గుఱ్ఱమును తెచ్చినచో నిష్ఫల మగును. ఏ సందర్భములో నిట్లడిగినాడో, ఏ ఉద్దేశముతో నడిగెనో, తెలిసికొని, సైంధవమనగా ఉప్పు అని తెలిసికొనుటలో శబ్దమునకు తాత్పర్యశక్తి గలదని గ్రహించవలెను. అభిధా, లక్షణా, తాత్పర్యముల ద్వారా శబ్దము లర్థవంతము లగుచున్నవి.
ఒక ప్రియుడు తన ప్రియురాలిని ఏకాంతముగా కలసి కొనుచోట ఒక సన్యాసి విడిది చేసెననుకొనుడు. ఇత డిచట్చనుండగా వీరు కలసికొని సంభాషించజాలరు. క్రమేణ ఈసన్యాసికి కుక్క లనిన భయమను సంగతి వారికి తెలియగా, ప్రియుడు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు "నీ ఇచ్చ వచ్చినట్లు ఇచట విహరించుము. నిన్న మొన్నటిదాకా ఇచట స్వేచ్ఛగా తిరుగు శునకమును నిన్న నే ఇచట సింహము చంపివేసినది. ఇక నీకు శునకభయము లేదు" అని యనెననుకొనుడు. శునకభయము గల సన్యాసికి అభయము పూర్తిగా తీరెననుట స్పష్టమే కాని శునకము పోయి, సింహమువచ్చుట మిక్కిలి ప్రాణసంకటము, కనుక స్వేచ్ఛగా దిరుగుటకు శునకభయము లేకపోయినను, ఆసన్యాసి అచట ఎంతమాత్రము నుండజాలడు. ఇచ్చట అన్వయము పూర్తిగా కుదురుచున్నది. లక్షణార్థమునకు సావకాశము లేదు. "స్వేచ్ఛగా తిరుగుము" అని తాత్పర్యము గూడ గలదు. కాని ఈతాత్పర్యార్థ మభిప్రేతము గాదు. "ఇచ్చటనుండి ఈసన్యాసి లేచిపోవలెను" అనునదియే అభిప్రేత మగు నర్థము. ఇట్టి యర్థమును ధ్వని యని, ఇది వ్యంజనా శక్తిచే నవగత మగుననియందురు. వ్యంజనావ్యాపారమును, తదర్థమును గూడ ధ్వనియని వ్యవహరింతురు.
అభిధావ్యాపారము నాశ్రయించుకొని వచ్చుధ్వనిని అభిధామూల మని, లక్షణావ్యాపారశ్రయ మైనది లక్షణామూలమని, పిలువబడు చున్నవి. ఏవంవిధ మగు వ్యంజన, వివక్షితాన్యపరవాచ్య మని, అవివక్షితవాచ్య మని రెండు తెరగుల గలదు. ఇట్లే అర్థాంతర సంక్రమిత వాచ్యమని, అత్యంత తిరస్కృత వాచ్యమని, మరియొక విభాగము గలదు. అభిధామూల మగు వివక్షితాన్యపరవాచ్య మగు ధ్వనియందు వ్యంగ్యప్రతీతక్రమము లక్ష్యమైన యొకవిధము, అలక్ష్యమైన మరియొక విధమురాగా సంలక్ష్యమక్రమ వ్యంగ్యము, అనంలక్ష్యక్రమ వ్యగ్యము, సిద్ధించగలవు.
వ్యవధానా త్కృమా లక్ష్యో వస్త్వలంకారయో ర్ధ్వనౌ,
లక్ష్యవ్యగ్యక్రమం తస్మాద్ ధ్వని మేతం ప్రచక్షతే.೧೯
వాచ్యార్థము తెలియబడిన తర్వాత వ్యవధానపూర్వకముగా వంగ్యార్థ మవగత మైనచో నట్టిదానిని సంలక్ష్యక్రమవ్యంగ్య మందురు.
అనేకార్థములు గల శబ్దము వాచకము కాగా ఈశబ్దమున కితరశబ్దములతో సంయోగాది సంబంధములు కల్గినపుడు, వాచ్యార్థముకంటె భిన్నమైన అర్థము ప్రతీయమానమైనచో నట శాబ్దీవ్యంజన గలదనవలెను. ఇట్లే ఒక అర్థము మరియొక అర్థస్ఫూర్తికి హేతువైనచో అర్థవ్యంజన గలదనవలెను. అప్పుడు శబ్దశక్తిజనితము, అర్థశక్తిజనితము, శబ్దార్థో భయశక్తి జనితము అను మూడు విధముల ధ్వని గలదు. ఈధ్వని మరల అలంకారాత్మకమని, వస్త్వాత్మక మని, రెండు తెరగుల గలదు. శబ్దమునుండి గాని, అర్థమునుండి గాని, అన్యవస్తుస్ఫూర్తి కలుగగా వస్తుధ్వని, అన్యాలంకారస్ఫూర్తి కలుగగా అలంకారధ్వని, సిద్ధమగునని భావము. సంలక్ష్యక్రమధ్వనియందు శబ్దధ్వని, అర్థధ్వని, శబ్దార్థధ్వని యను విభేదములు గలవు. ఈమూటినూండి ప్రత్యేక ప్రత్యేకముగా వస్తుధ్వని, అలంకారధ్వని వచ్చుచున్నవి.
రస భావ తదాభాస భావశాంత్యాది రక్రమః,
అనంతరక్షణ యస్మాద్ వ్యజ్యతే೭ వశ్య మేవ సః.೧`ò
ఇక అసంలక్ష్యక్రమ వ్యంగ్యము వివరించబడుచున్నది. అసంలక్ష్యక్రమ వ్యంగ్యమై ప్రతీయమాన మగు దానిని సర్వదా రసమని యెంచ వీలులేదు. ఈవ్యంగ్యమున రసాభాసము, భావభాసము, భావశాంతి, భావోదయము, భావసంధి, భావశబలత్వము, రసము, భావము నను ఎనిమిది పదార్థములు గలవు.
అనౌచిత్య సమాయోగమున రసము రసాభాసమగును; భావము భావాభాస యగును.
శ్రుతిదుష్ఠాదయో దోషా యో రసప్రతిబంధకాః,
తదభావో೭పి సామ్రగ్యాంనివిష్టో೭నిష్టహానికృత్.೧೮
శృంగారరసమున చెవికి కటువుగా నుండు శబ్దములు వినబడిన శృంగారము పరిణతము కాజాలదు. రౌద్రరసమును మృదుశబ్దములు పోషించ జాలవు. అనగా శ్రుతిదుష్టాది దోషములు రసపరిపోషణకు ప్రతిబంధకములు లేక విరోధులు. ఇట్టి దేషములు లేకపోయినను రసవ్యక్తికి తోడ్పడు సామగ్రి నొకచో చేర్చక తప్పదు. ఇట్టి సామగ్రీఘటనను చేయనిచో రసప్రతీతికి ప్రతిరోధము గొల్పు వస్తువు బయలుదేర గలదు.
యా రీతయో యే చ గుణ స్తజ్ఞాన మపి కారణమ్,
అలంకారాశ్చ విజ్ఞాతా భవంతి పరిపోషకాః೧೯
శబ్దసంఘటనాత్మక వ్యాపారవిశేషములగు భారత్యాదిరీతులు, రసోత్కర్షకము లగురస ధర్మములై మాధూర్యాది గుణములు, కావ్యశరీరమున గల వైచిత్ర్యమును భాసింపజేయు ఉపమా ద్యలంకారములు అనునవి సాక్షాత్పరంపరా సాధారణ్య వశమున రసోపకారకము లగుచున్నవి.
గుణాలు కారరీతీనాం భావానాం చ నివేదకః,
తస్య ప్రత్యాయకః శబ్దో వృత్త్యా వ్యంజనరూపయా.೨ం
గుణాలంకారరీతులకు, భావమలకు బోధక మగుశబ్దము వ్యంజనావృత్తిద్వారా రసమునకు వ్యంజకమగు చున్నది. అర్థబోధ కనుకూలము, శబ్దనిష్ఠమునైన శబ్దార్థసంబంధ విశేషమును వృత్తి యందురు. వ్యంజనారూపమగు వృత్తిద్వారా శబ్దము రసము నభివ్యక్తము చేయగల్గునని తాత్పర్యము.
వృత్తిః కార్యా೭పరోక్షా೭స్య శబ్దస్య సుఖగర్భీణీ
దశమ స్త్వ మనీ త్యాది వాక్యోత్థమతివృత్తివత్.೨೧
శబ్దముద్వారా రసము ప్రతీత మగుచున్నను. రసప్రతీతిని అపరోక్షానుభూతి యని చెప్పవలెను. రసప్రత్యాయకమగు శబ్దమునకు సుఖవిషయిక మగు అపరోక్షవృత్తిని అంగీరించవలెను. శబ్దప్రమాణమున కపరోక్షవృత్తియే ఫలాత్మికమగు ప్రమితియని గూడ జెప్పవచ్చును.
ఇందులకు కుదాహరణముగా "దశమస్త్వమసి" యను వాక్య మీయబడినది. పరమానందయ్యశిష్యులవంటి వా డొకడు తన సహాధ్యాయులగు తొమ్మిది మందిని మాత్రము లెక్కించి, పదియవవా డేమైనాడని వాపోవగా, దారిన బోవు వివేకు డొకడు వచ్చి మరల నందరను లెక్కించి, వెనుక లెక్కించినవానితో "నీవు పదియవవాడవు" అని నాడు. ఈవాక్యమును విని తనను పదియవవానినిగా సాక్షాత్కరింప జేసికొన గల్గినాడు. ఈయనుభూతి శబ్దజన్య మైనను ప్రత్యక్షముగా ప్రతీయమాన మైనది యని మరువరాదు. కావననే శాబ్దమగు రసాభివ్యక్తిని ప్రత్యక్షానుభూతిగా గ్రహించవలెను.
నిత్యం సుఖ మభివ్యక్తం "రసోవైస" ఇతి శ్రుతేః,
ప్రతీతిః స్వప్రకాశస్య నిర్వికల్పసుఖాత్మికా.೨೨
"రసోవైసః" అను తైత్తరీయోపనిషద్వాక్యమున బ్రహ్మను రసముగా నిర్వచించుట గలదు. "విజ్ఞాన మానందం బ్రహ్మ" యనుచో బ్రహ్మను ఆనందముగా గ్రహించినారు.లోకోత్తరానందము బ్రహ్మపదార్థము నగు రసమగు నిత్యము, శుద్ధము, బుద్దము, మక్తముగా నబివ్యక్తమగును. స్వయంప్రకాశము, స్వతఃసిద్ధము నగురసప్రతీతిని నిర్వికల్ప సుఖాత్మికమునవలెను సంసర్గరహిత మైనది నిర్వికల్పము. సంసర్గాసంగియై, అఖండార్థమరూపమును నున్నది నిర్వికల్పకజ్%ానము. ఇట్టి జ్ఞానావగతియే రసప్రతీతి. *(*మొదటి అనుబంధము చూడుడు)
ఆబాలగోచరమగు లౌకికసుఖము సత్త్వగుణ పరిణామ రూపము, దుఃఖానువిద్ధము, సాదర ముపాదేయమానము నైనది. లోకోత్తరమగుసుఖము నిత్య చిదానంతాత్మస్వరూపము, సుఖపదవాచ్యము, ఉపేయము నైనది. అవిద్యావృతమగు లోకోత్తరసుఖము ఆవరణభంగమైననే అనుభూతమగును. ఆవరణభంగమున అభివ్యజ్యమాన మగు అలౌకిక సుఖము రసముగా సాక్షాత్కృత మగుచున్నది. రసప్రతీతి యందు విభావాది జ్ఞానప్రయుక్త మగు సాధారణీవరణ నిబంధనమై ఆవరణభంగ మగుట గలదు. ఇట్టి సుఖప్రతీతి విగలిత వేద్యాంతరము.
కార్యజ్ఞాప్యాది వైధర్మ్శం యత్తుకైశ్చి న్నిరూపితమ్,
తదప్యేతేన మార్గేణ యోజ్యం శాస్త్రావిరోధతః ೨3
మట్టినుండి కుమ్మరి కుండను జేయునట్లు, విభావాదుల నుండి జన్మించునది రసమను వాద మొకటి గలదు. చీకటిలో నున్న వస్తువును దీపము బహిర్గతము చేయునట్లు, విభావాదు లచే జ్ఞాప్య మగునది రసమని మరియొక వాదము గలదు.
విభావాదులను రసకారణముగా గ్రహించ వీలులేదు కారణమే కార్యరూపమున పరిణమించుటచే కారణత్వస్వభావము కార్యమున కన్పించుటయేగాని, కార్య ముత్పన్నము కాగా కారణరూపముతో కారణ ముండజాలదు. పాలనుండి పెరుగురాగా పాలయొక్క స్వభావము పెరుగున గలదు; పాలు పాలుగా నిలచుటలేదు. కాని రసప్రతీతిలో విభావాదులు నశించుటలేదు. రసము నాత్మగా అంగీకరించవలెనని సిద్ధాంతించితిమి. ఈ యాత్మ కారణజన్యము గాదని స్పష్టము.
రసమును జ్ఞాప్యముగాగూడ నెంచ వీలులేదు. దీపమునకు, తదభివ్యక్త వస్తువునకు విషమసత్తాకస్థితి లేనిదే ఇచట జ్ఞాప్యత్వము సిద్ధించదు. జ్ఞాప్యమగువస్తువు వేరు. జ్ఞాపక మగు దీపము వేరు. ఇట్లు స్థాయిభావము వేరు, స్థాయిభావముతో సంయోగము నందని విభావాదులు వేరు అని చెప్పజాలము విభావాదులకు స్థాయితో సమసత్తాకత్త్వము గలదు.
పరమానంద ఆత్మైవ రన ఇత్యాహు రాగమాః,
శబ్దత స్తదభివ్యక్తి ప్రకారో೭యం ప్రదర్శితః.೨೪
పైన వివరించిన యుక్తులు, ఉపనిషద్వాక్యములు గూడ పరమానందస్వరూపమగు ఆత్మయే రసమను సిద్ధాంతమును ప్రతిపాదించుచున్నవి. చిదాత్మకుగల ఆవరణ భగ్నము కాగా ప్రతీయమానమగు పరమానత్మయే రసము,శబ్దరూపమున రస మెట్ల అభివ్యక్త మగుచున్నదో వివరించితిమి. శబ్దముద్వారా సుఖాభివ్యక్తియగు ప్రకారమును వివరించితిమి. మీమాసంకులు సహిత మిట్టి ప్రక్రియ నంగీరించు చున్నారని తర్వాతిశ్లోకమున చెప్పబోవుచున్నాడు.
అర్థవాదాధికరణ నవశైలాదివర్ణనమ్,
శ్రోతౄణాం సుఖమాత్రార్థ మితి భ##ట్టై రుదాహృతమ్.
పూర్వమీమాంసా దర్శనమున మొదటి అధ్యాయములో రెండవపాదమున అర్థవాదాధికరణము గలదు. ఇందు "విధినా త్వేకవాక్యత్వాత్ స్తుత్యర్థేవ విధీనాం స్యుః" అను సూత్రము గలదు. అర్థవాదములు విధులలో జెప్పబడిన ఉద్దిష్చవిషమును ప్రశంసించున వగుటచే,వీటికి విధులతో నేకవాక్యత్వము నంగీకరింపవలెనని అర్థము. ఈ సూత్రముపై గల శబరభాష్యమునువ్యాఖ్యానించుచు కుమారిలభట్టు "కేచిత్ స్వయమేవ శ్రూయమాణ గంధమాదన వర్ణక ప్రభృతయః ప్రీతిం జనయంతి" అని వ్రాసెను. గంధాది శబ్దములను వినగా శ్రోతలకు సుఖమాత్రార్థమే వ్రతీతమగు నని అర్థము. ఇచట శబ్దమునుండి సుఖవ్యక్తి కలుగగలదని అంగీకరింప బడినది.
కార్యాన్వితత్వవాదే೭పిన విరపోధో೭స్తి కశ్చన,
యస్మాత్ కృతీప్సితత్వేన కార్యం సుఖ మ పిష్యతే.೨೯
కార్యాన్విత పదార్థములకు మాత్రమే శాబ్దబోధగలదని వాదించు ప్రాభాకరమీమాంసకులకు గూడ కార్యపదార్ధముగా చెప్పబడ దగు సుఖాభివ్యక్తి సమ్మతమే యగు ననుట నిర్వివాదము.
అలౌకికనియోగే తు న కించి న్మాన మీక్షతే
లోకేవాచాం చ సర్వేషాం తత్పరత్వం న యుజ్యతే.೨`ò
లోకానవగత ప్రవర్తనా మగు వాక్యమే ప్రామాణికమని వాదించువారలు పై జెప్పిన సుఖాభివ్యక్తి నంగీకరించజాలరు. కాని వేదవాక్యములు ప్రవృత్తి నివృత్తి ప్రజయోజకములైనట్లు లౌకికవాక్యము లన్నియు ప్రవృత్తినివృత్తి ప్రయోజకములు కాజాలవనుట అనుభవసిద్ధము. కావున నీ వాదము ప్రామాణికముగాదు.
ప్రయోజనవ దజ్ఞాత జ్ఞాపకత్వం చ మానతా,
శబ్దస్య కార్యపరతా త్వాచార్యై రేవ ఖండితా.೧೮
అజ్ఞాతవిషయమును జ్ఞాపకము చేయుట ప్రమాణము యొక్కప్రజయోనము. ప్రమాణాంతరానధిగతమై అజ్ఞాతమైన విషయమును గూర్చిన జ్ఞానమును కలుగజేయుటయే ప్రవర్తక జ్ఞానముయొక్క ప్రమాణత. శబ్దము కార్యపరము గాదని, అజ్ఞాతజ్ఞాపక మని తాత్పర్యము. ప్రమాణభూతమగు శబ్దమునకు కార్యపరత్వమును వేదాంతసూత్రభాష్యమున సమన్వయాధికరణమున శ్రీశంకర భగవత్పాదులు ఖండించి యున్నారు. గనుక శబ్దమును కార్యపరముగా గ్రహించ వీలులేదు.
దేవతాధికృతిన్యాయాత్ పదై రన్యపరై రపి,
ప్రయోజనవ దజ్ఞాతా బాధితార్థమతి ర్భవేత్.೨೯
బ్రహ్మసూత్రములలో మొదటి యధ్యాయమున మూడవ పాదమున దేవతాధికరణలో "భావంతు బాదరాయణో೭ స్తిహి" అను సిద్ధాంతసూత్రము గలదు. ఈసూత్ర వాఖ్యానావసరమున అర్థవాదములకు విధిస్తావకత్వమును శ్రీ శంకర భగవత్పాదులు సిద్ధాంతించినారు. విధేయ స్తుతి తాత్పర్యము గలిగిన అర్థవాదములు విధివాక్యములను బాధించ జాలనివి, ప్రమాణాంత రాబాధితములై, ఫలభూతములగు నర్థవాదములకు ప్రవృత్యంగత్వమును చెప్పవలెను. అనగా అన్యవిషయపరము లగు శబ్దములు స్వీయార్థమును ముందు అప్పగించినతర్వాతనే అన్యార్థము నొసగ గలవని తాత్పర్యము.
తస్మాదన్యపరత్వే వా స్వాతంత్ర్యే వాపదానినః,
వ్యంజయంతి పరానందం సహకార్యానురూప్యతః. 30
ఇది శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమధు
సూదన సరస్వతీ విరచితే శ్రీ భగవద్భక్తిరసాయనే
భక్తిరస ప్రతిపాదకో నామ
తృతీయోల్లాసః
అర్థవాదములను వ్యాఖ్యానించినరీతిగా శబ్దముల నన్యపరములుగా గాని, స్వతంత్రములుగా గని గ్రహించవచ్చును. భక్తిరసమున గూడ శబ్దములు స్వఘటితవాక్యప్రతి పాద్వేతర తాత్పర్యకములు గావచ్చును. లేక స్వప్రయోజ్య తాత్పర్య పరములు గావచ్చును. విభా వానుభావ వ్యభిచారిభావములు వ్యాపారముతో నానుకూల్యము గలిగిన శబ్దములు సామ్యాతిశయ వినిర్ముక్త మగు పరానందమును వ్యంజనా వృత్తిద్వారా ప్రతిపాదించు చున్నవి. ఈ పరానంద మనబడురసమునే భక్తిరసమని వ్యవహరించవలెను. ఆలంకారికులు వ్యవహరించు శాంతరసము, భక్తులనుభవించు భక్తిరసము వేదాంతులు ప్రసంగించు రసముఅనున వన్నియు పర్యాయ పదములు.
బావై ర్యథా విలసితా నిజచిత్తవృత్తి
రాప్నో త్యలోకవిభ##వైశ్చ రసాదిరూపాన్
అస్వాదయోగ్యనుభగా೯ విశదీకృతో೭ హం
నిశ్శేష కుత్ర రసభావనికల్పమార్గే.
శ్రీపరమహంస పరివ్రజకాచార్య శ్రీ మధుసూదన
సరస్వతీ విరచిత శ్రీ భగవద్భక్తి రసాయననము,
ఆంధ్రవివృతియందు, భక్తిరస ప్రతిపాదక
మను మూడవ యుల్లాసము
సమాప్తము.
__