Sri Naradapuranam-3    Chapters    Last Page

త్రయోదశోధ్యాయః

త్రయోదశో7ధ్యాయః = పదమూడవఅధ్యాయము

మోహినీసంమోహనమ్‌

వసిష్ఠువాచ :-

ఉత్థాపయిత్వా రాజానం మోహినీ వాక్యమబ్రవీత్‌ | మా శంకాం కురు రాజేన్ద్ర! కుమారీం విద్ధ్యకల్మషామ్‌ || 1 ||
ఉద్వహాస్వ మహీపాల గృహ్యోక్తవిధినా హి మామ్‌ | అనూఢా కన్యకా రాజన్‌! యది గర్భం బిభర్తిచ || 2 ||
ప్రసూయతి దివా కీర్తిం సర్వవర్ణవిగర్హితమ్‌ | చాండలయోన స్తిస్రః పురాణకవయో విదుః || 3 ||
కుమారీసంభవా త్వేకా సగోత్రాపి ద్వితీయకా | బ్రాహ్మణ్యాం శూద్రజనితా తృతీయా నృపపుంగవ || 4 ||
ఏతస్మాత్కారణాద్రాజ న్కుమారీం మాం సముద్వహ | తతస్తాం చపలాపాంగీం నృపో రుక్మాంగదో గిరౌ || 5 ||
ఉద్వాహ్య విధినా యుక్తస్తస్థౌ రాజా హసన్నివ
వసిష్ఠమహర్షిపలికెను :- మోహినీదేవి రాజును లేపిఇటులపలికెను. ఓ రాజేన్ద్ర! సందేహించకుము. నేను పరిశుద్దయగుకన్యకనని తెలియుము. నన్ను గృహ్యవిధిచే వివాహామాడుము. కన్య వివాహములేకనే గర్భధారణచేసినచో అందరిచే నిందించబడును. పురాణమున ముగ్గురు చండాలస్త్రీలని పండితులు చెప్పిరి. కన్యకుపుట్టిన స్త్రీశిశువు, సగోత్రజాత, శూద్రునివలన బ్రాహ్మణస్త్రీయందు పుట్టినది. కావున కన్యనగు నన్ను వివాహమాడుము. ఇట్లు మోహిని పలుకగా రుక్మాంగదమహారాజు చపలేక్షణ యగు మోహినిని యధోక్తవిధితో వివాహమాడి మిక్కిలి సంతోషించెను.
రాజోవాచ :-
న తధా త్రిదివప్రాప్తిః ప్రీణయేన్మాం వరాననే || 6 ||

తవ ప్రాప్తిర్యధా దేవి! మన్దరేస్మిన్సుఖాయ వై| మన్యే పురందరాద్దేవి హ్యాత్మానమధికం క్షితౌ || 7 ||

త్రైలోక్యసుందరీం ప్రాప్య భార్య త్వాం చారులోచనే | తస్మాద్యదనుకూల తే తత్కరోమి ప్రశాధి మామ్‌ || 8 ||
ఇహైవ రమసే బాలే ఆధవా మందిరే మమ | మలయే మేరు శిఖరే వనే వా నందనే వద || 9 ||
తచ్ర్ఛుత్వా నృపతేర్వాక్యం మోహినీ మధురం నృప! ఉవాచానుశయం రాజ న్వచనం ప్రీతివర్దనమ్‌ || 10 ||
సపత్నీనాం కటాక్షాణాం క్షతాని నగరే మమ | భవిష్యంతి మహీపాల కధం గచ్ఛామి తే పురమ్‌ || 11 ||
మాస్మ సీమంతినీ కాచి ద్భవేద్ది క్షితిమండలే | యస్యాస్సపత్నీప్రభవం దుఃఖమామరణభ##వేత్‌ || 12 ||
సాహం లబ్దా మహీపాల మనసా వశగా తవ | జ్ఞాత్వా సపత్నీప్రభవం దుఃఖం భర్తా కృతో మయా || 13 ||
వత్స్యామి పర్వతశ్రేష్ఠే బహ్వాశ్చర్యసమన్వితే | న త్వం వససి రాజేన్ద్ర సంధ్యావల్యా వినా క్వచిత్‌ || 14 ||
తస్యాస్త్యం విరహే దుఃఖీ సపుత్రాయా భవిష్యసి | దుఃఖేన భవతో రాజన్‌ భూరి దుఃఖం భ##వేన్మమ || 15 ||
యత్రైవ భవత స్సౌఖ్యం తత్రాహమపి సంస్థితా | యత్ర త్వం రంస్యసే రాజం స్తత్ర మే మన్దరోగిరిః || 16 ||

భర్తృస్థానే హి వస్తవ్యం ఋద్దిహీనేపి భార్యయా | స మేరుః కాంచనమయః సన్నిధానే ప్రచక్షతే || 17 ||

మనోరధో నామ మేరు ర్యత్ర త్వం రంస్యసే విభో | భర్తృస్థానం పరిత్యజ్య స్వపితుర్వాపి వర్జితమ్‌ || 18 ||
పితృస్థానాశ్రయరతా నారీ తమసి మజ్జతి | సర్వధర్మవిహీనాపి నారీ భవతి సూకరీ1||19 ||
ఏవం జానామ్యహం దోషం కథం వత్స్యామి మందరే | గమిష్యామి త్వయా సార్ద మీశస్త్వం సుఖదుఃఖయోః || 20 ||
మోహిన్యాస్తద్వచశ్శ్రుత్వా రాజా సంహృష్టమానసః | పరిష్వజ్య వరారోహాం ఇదం వచనమబ్రవీత్‌ || 21 ||
భార్యాణాం మమ సర్వాసా ముపరిష్టాద్భవిష్యసి | మా శంకాం కురు వామోరు యతో దుఃఖం భవిష్యతి || 22 ||
జీవితాదధికా సుభ్రు భవిష్యసి గృహే మమ | ఏహి గచ్ఛావ తన్వంగి సుఖాయ నగరం ప్రతి || 23 ||
భుంక్ష్వభోగాన్మయా సార్థం తత్ర స్థాస్వేచ్ఛయా ప్రియే || 24 ||
సాత్వేవముక్తా శశిగౌరవక్త్రా రుక్మాంగదేనాత్మవినాశనాయ |
సంప్రస్థితా నూపురఘోషయుక్తా వికర్షయన్తీ గిరిజాత శోభామ్‌ || 25 ||
ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే మోహినీ సంమోహనం నామ త్రయోదశోధ్యాయః
రుక్మాంగదమహారాజుపలికెను :- దేవీ! ఈ మందరపర్వతమున నిన్ను పొందుట వలన కలుగు సంతోషము స్వర్గప్రాప్తితో కూడా కలుగదు. ఈభూమండలమున నేను ఇంద్రునికంటే అధికుడని భావించుచున్నాను. ఇంద్రునికి నీవంటి త్రైలోక్యసుందరియగు భార్య లేదు కదా. కావున నీకేది సమ్మతమో దానినే చేతును. నన్నాజ్ఞాపింపుమ. నీవిచటనే ఆనందింతువా? లేక నాభవనమున నుందువా? మలయ పర్వతమున కాని, మేరుశిఖరమునకాని, నందనవనమున కాని నివసింతువా తెలుపుము. ఇట్లు పలికిన రాజు మాటలను వినిన మోహిని మధురవచనముతో రాజును ఆనందింపచేయుచు ఇట్లు పలికెను. ఓ రాజా? సవతుల వాడిచూపుల గాయములు నాశరీరమును కూడా గాయపరుచును, ఏ స్త్రీ అయిననూ జవీతాంతము సవతిదుఃఖమును సహించజాలదు. అయిననూ నేను నామనసుతో నీవశ##మైతిని. నాకు సవతిపోరు తప్పదని తెలిసికూడా నిన్ను భర్తను చేసుకొంటిని. చాలా ఆశ్చర్యములుకల ఈ పర్వతమునందే నుండలయునునని నా కోరిక. కాని నీవు నీపట్టపురాణియగు సంధ్యావలి నివిడిచి ఉండజాలవుకదా? పుత్రవతియగు సంధ్యావలీ విరహము నిన్నెక్కువగా దుఃఖింపిచేయును. నీకు దుఃఖము కలిగినచో నాకు మరింత దుఃఖము కలుగును. కావున నీకెక్కడ ఆనందముగా నుండునో నేనచటనే యుండగలను. ఇష్టము లేకున్ననూ భార్య భర్తృస్థానముననే నుండవలయును. సమీపమున నున్న పతియే బంగారుమేరుపర్వతమని చెప్పెదరు. నీవెక్కడ ఆనందింతువో అదియే నాకోరికల మేరుపర్వతము కాగలదు. భర్తృ స్థానము కానిచో పితృస్థానమును కూడా విడువ వలయును. భర్తృస్థానమును వదిలి పితృస్థానమును ఆశ్రయించు స్త్రీ సౌకరస్త్రీ కాగలదు. కావున నేనీదోషములను తెలిసినదానను అయినపుడు మందరమున ఎట్లుండగలను. నీవెంటనే వత్తును. నాసుఖదుఃఖములకు నీవే ప్రభువు. ఇట్లు మోహినిమాటలు వినిన రాజు సంతుష్ట చిత్తుడాయెను. మోహినిని కౌగిలించుకొని ఇట్లు పలికెను. ఓమోహిని నీవు నాభార్యలందరిలో ఉన్నతస్థానమున నుందువు. నీకు దుఃఖము కలుగునని శంకించవలదు. నా ఇంటిలో నాప్రాణము కంటే నీవు మిన్నయగుదువు. కావున ఓ తన్వంగీ! మన ఆనందము కొఱకు నగరమునకు వెళ్ళుదము. నగరమున నుండి స్వేచ్ఛగా నాతో భోగముల ననుభవింపుము. ఇట్లు రుక్మాంగదమహారాజు ఆత్మ వినాశనము కొఱకు పలుకగా పార్వతిశోభను ఆకర్షించుచు నూపురనాదముతో బయలు దేరెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ సంమోహనమను పదమూడవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page