Sri Naradapuranam-3    Chapters    Last Page

షోడశో7ధ్యాయః = పదునారవఅధ్యాయము

పతివ్రతోపాఖ్యానమ్‌

వసిష్ఠఉవాచ:-


ధర్మాంగదవచశ్శ్రుత్వా హృష్టో రుక్మాంగదో
7బ్రవీత్‌ | సత్యం తే జననీ పుత్ర! సంప్రాప్తా మందరే మయా || 1 ||
వేదాశ్రయ సుతాబాలా మదర్థం కృతనిశ్చయా | కుర్వంతీ దారుణం పుత్ర తపో దేవగిరౌ పురా || 2 ||
ఇతః పంచదశాదహ్నో హయగామీ గతోహ్యహమ్‌ | మందిరే పర్వతశ్రేష్ఠే బహుధాతుసమన్వితే || 3 ||
తస్య మూర్థని బాలేయం తోషయంతీ మహేశ్వరమ్‌ | స్థితా గానపరా దృష్టా మయా తత్ర సుదర్శనా || 4 ||

తతో
7హం మూర్ఛయా యుక్త పతితో ధరణీతలే | ఆనంగబాణసంవిద్ధో వ్యాధవిద్ధో యధా మృగః || 5 ||
తతో
7హమనయా దేవ్యా చాలితశ్చారునేత్రయా | వృతశ్చైవాపి భర్తృత్వే కించిత్ర్పార్ధనయా సహ || 6 ||
మయాచాపి ప్రతిజ్ఞాతం స్వదక్షిణ కరాన్వితమ్‌ | సేయం భార్యా విశాలక్షీ కృతా భూధరమస్తకే || 7 ||
అవరుహ్య ధరాపృష్ఠే సమారుహ్య తురంగమమ్‌ | దినత్రయేణ త్వరితః సంప్రాప్తస్తవసన్నిధౌ || 8 ||
పశ్యమానో గిరీన్దేశా స్సరాంసి సరితస్తధా | ఇయం హి జననీ పుత్ర తవ ప్రీతివివర్థినీ || 9 ||
అభివాదయ చార్వంగీం త్వం నిజామివమాతరమ్‌ | తత్పితుర్వచనం శ్రుత్వా హయసంస్థామరిందమః || 10 ||
శిరసా ధరణీం గత్వా ఇదం వచనమబ్రవీత్‌ | ప్రసీద దేవి మాతస్త్వం భృత్యో దాస స్సుతస్తవ || 11 ||
సమస్కరోమి జననీం బహుభూపాలసంయుతః | తం పుత్రమవనీం ప్రాప్తం మోహినీ ప్రేక్ష్య భూపతే || 12 ||
భర్తుర్దాక్షిణ్యయోగాచ్చ అవతీర్య తురంగమాత్‌ | అవగూహ్య చ బాహుభ్యాం ఉత్థాప్య పతితం సుతమ్‌ || 13 ||
పరిష్వక్తస్తదా మాత్రా పునరేవాభ్యనందయత్‌ | తతస్తాం సమనోజ్ఞెస్తు చారువసై#్త్రశ్చ భూషణౖః || 14 ||
భూషయిత్వా సమారోప్య పునరేవ హమోత్తమమ్‌ | స్వపృష్ఠే చరణం కృత్వా తస్యా రాజీవలోచనః || 15 ||
తేనైవ విధినా భూప పితరంచాన్వరోహయత్‌ | భూపాలైస్సంవృతో గచ్ఛన్‌ పద్భ్యాం ధర్మాంగదస్సతః || 16 ||
ప్రహర్షపులకోహ్యాసీ జ్జననీం ప్రేక్ష్య మోహినీమ్‌ | స్తూయమానస్స్వయం చాపి మేఘ గంభీరయా గిరా || 17 ||
ధన్యస్సతనయో లోకే మాతరో యస్య భూరిశః | నవా నవతరా భార్యా పితురిష్టా మనోహరాః || 18 ||
యసై#్యకా జననీ లోకే పితా తసై#్యవ దుఃఖభాక్‌ | పితుర్దుః ఖేన కిం సౌఖ్యం పుత్రస్యహృది వర్తతే || 19 ||
ఏకస్యా వందనే మాతుః పృధివీఫలమశ్నుతే | మాతౄణాం వందనే మహ్యం మహత్పుణ్యం భవిష్యతి || 20 ||

తస్మాదభ్యధికం పుణ్యం భవిష్యతి దినేదినే | ఏవముచ్చరమాణో
7సౌ రాజభిః పరివారితః || 21 ||
ప్రవిష్టం నగరం రమ్యం వైదిశం బుద్ధిసంయుతమ్‌ | హయస్థః ప్రయ¸° రాజా మోహిన్యా సహ తత్‌క్షణాత్‌ || 22 ||
వసిష్ఠమహర్షిపలికెను :- ధర్మాంగదుని మాటలను విని సంతోషించిన రుక్మాంగద మహారాజు ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఇది నిజమే. ఈ మోహిని నీ తల్లియె. నాకు మందర పర్వతమున లభించినది. ఈమె బ్రహ్మపుత్రిక. నన్ను భర్తగా పొందవలయునని దృఢనిశ్చయము చేసుకొని మందరపర్వతమున దారుణమగు తపమును చేయుచున్నది. నేను ఇటనుండి అశ్వముపై బయలుదేరి పదునైదు దినములలో బహుధాతుసమన్వితమగు మందరపర్వతమును చేరితిని. ఆపర్వత శిఖరమున ఈ బాల మహేశ్వరుని గానముచే సంతోషింపచేయు చున్నది. చూడముచ్చటగా నున్న ఈగానము చేయుచుండగా నేను చూచితిని. ఈమె సౌందర్యమును చూచి నేను మూర్ఛిల్లి భూమిపై పడితిని. వ్యాధుని చే కొట్టబడిన మృగమువలె మన్మధ బాణములచే కొట్టబడితిని. తరువాత చారునేత్రయగు ఈదేవి వచ్చి నన్ను కదిలించినది. నేను కొంచెము ప్రార్థిచంగా నన్ను భర్తగా వరించినది. నేను కూడా నాదక్షిణ హస్తమును చాచి ప్రతిజ్ఞ చేసితిని. అపుడు మందర పర్వత శిఖరమున ఈమెను వివాహము చేసుకొంటిని. పర్వతము నుండి దిగి అశ్వమునధిరోహించి మూడు దినములలో వేగముగా నీదగ్గరకి చేరితిని. దారిలో పర్వతములను, ప్రదేశములను, సరస్సులను, నదులను చూచుచు వచ్చితిని. ఇట్లు ఈమె నీకు తల్లి. నీకు ప్రీతిని పెంచును. నీవు ఈసుందరాంగిని నీతల్లిని నమస్కరించినట్లు నమస్కరించుము. అట్లు పలికిన తండ్రి మాటలను వినిన ధర్మాంగదుడు అశ్వము మీద నున్న మోహినికి భూమి మీద పడి సాష్టాంగ ప్రణామమును ఆచరించి ఇట్లు పలికెను. ఓతల్లీ! నాయెడ ప్రసన్నురాలవు కమ్ము. నీవు నాకు తల్లివి. నేను నీకు పుత్రుడను. భృత్యుడను, దాసుడను, చాలా మంది రాజులతో కలిసి నీకు నమస్కరించుచుంటిని. ఇట్లు భూమి మీద పడియున్న పుత్రుని మోహినీదేవి చూచి, భర్త ప్రేమననుసరించి అశ్వము నుండి దిగి, పడియున్న ధర్మాంగదుని లేపి, బాహువులచే ఆలింగనము చేసుకొనెను. అట్లు తల్లి ఆలింగనము చేసుకొనగా మరల అభివాదము చేసెను. తరువాత మోహినికి చక్కని వస్త్రాభరణములను సమర్పించి అలంకరింప చేసి మరల తన వీపుపై ఆమెపాదము నుంచి అశ్వముపై అధిరోహింపచేసెను. అదే విధముగా తండ్రిని కూడా అశ్వారోహణమును చేయించెను. ధర్మాంగదుడు మాత్రము రాజులతో కలిసి కాలినడకన సాగెను. తల్లియగు మోహినిని చూచి సంతోషముచే పులకించెను. తాను స్వయముగా మేఘగంభీరవాదముచే స్తోత్రము చేయుచుండెను. ఎక్కువ మంది తల్లులున్న పుత్రుడు ఈలోకమున ధన్యుడు. తండ్రికి కొత్త భార్యలు, కొంగ్రొత్త భార్యలు ఎక్కువ ప్రీతి పాత్రులుకదా? ఒకే తల్లియున్న పుత్రుడు, ఒకే భార్య యున్న తండ్రి కూడా దుఃఖభాజనులగుదురు. తండ్రి దుఃఖితుడైన చో పుత్రుని హృదయమున సౌఖ్యమెట్లు కలుగును? ఒక తల్లికి నమస్కరించిననే పృధీవీఫలము లభించును. చాలా మంది తల్లులకు నమస్కరించిన ఎంతో పుణ్యము లభించును కదా. కావున ప్రతిదినము చాలామంది తల్లులకు నమస్కరించుచుండువానికి కలుగు పుణ్యము అనంతముకదా? ధర్మాంగదుడు రాజులతో కలిసి ఇట్లు స్తుతించుచు సుందరము, అభివృద్ధి సహితము అగు విదిశానగరమును చేరెను. రుక్మాంగద మహారాజు కూడా మోహినితో కలిసి అశ్వముపై నగరమును చేరెను.
తతో గృహవరం ప్రాప్య పూజ్యమానో జనైర్నృపః | అవరుహ్య హయాత్తస్మా న్మోహినీం వాక్యమబ్రవీత్‌ || 23 ||
ధర్మాంగదస్య పుత్రస్య గృహే గచ్ఛ మనోహరే | ఏష తే గురుశుశ్రూషాం కరిష్యతి యధాగుణమ్‌ || 24 ||
న సఖీ నైవ దాసీ తే శుశ్రూషామాచరేదితి | సా చైవ ముక్తా పత్యా తు ప్రస్థితా సుతమందిరమ్‌ || 25 ||
ధర్మాంగదేన సా దృష్టా గచ్ఛన్తీ మందిరాయ వై | ఆత్మనో భర్తృవాక్యేన పరిత్యజ్య మహీపతీన్‌ || 26 ||
తిష్ఠధ్వం పితురాదేశా దిమాం శశ్రూషయేహ్యహమ్‌ | స ఏవముక్త్యా గత్వా తు బాహుభ్యాం పరిగృహ్య వై || 27 ||
క్రమే పంచదశే ప్రాప్తే పర్యంకే త్వవరోపయత్‌ | కాంచనే పట్టసూత్రేణ రచితే కోమలే దృఢే || 28 ||
మృద్వాస్తరణసంయుక్తే మణిరత్నవిభూషితే | రత్నదీపైశ్చ బహుశః ఖచితే సూర్యసప్రభే
|| 29 ||
తతః పాదోదకం చక్రే మోహిన్యా ధర్మభూసణః | సంధ్యావల్యా గురుత్వేన హ్యసశ్యత్తాం నృపాతజః || 30 ||

నైవమస్యాభవద్దుష్టం మనస్తాం మోహినీం ప్రతి | సుకుమారో
7పి తన్వంగీం పీనోరుజఘనస్తనీమ్‌ || 31 ||
మేనే వర్షాయుతసమా మాత్మానం చ త్రివత్సరమ్‌ | ప్రక్షాల్య చరణౌ
7తస్యా స్తజ్జలం శిరసా న్యధాత్‌ || 32 ||
ఉవాచావనతో భూత్వా సుకృతీ మాతరస్మ్వహమ్‌ | ఇత్యుక్త్వా నరనారీభిః స్వయం చ శ్రమనాశనమ్‌ || 33 ||
చకార సర్వభోగైస్తాం యుయోజ చ ముదాన్వితః | క్షీరోదమథనే జాతే కుండలే చామృత స్రవమ్‌ || 34 ||
యే లబ్థే దానవాఞ్జిత్వా పాతలే ధర్మమూర్తినా | మోహిన్యా కర్ణయోశ్చక్రే స్వయమేవ వృషాంగదః || 35 ||
అష్టోత్తరసహసై#్రశ్చ ధాత్రీఫలనిభై శ్శుభైః | మౌక్తికై రచితై శ్శుభ్రై ర్హారో దేవ్యాః కృతో హృది || 36 ||
నిష్కం పలశతం స్వర్ణం కులిశాయుతభూషితమ్‌ | హారం లఘూత్తరం చక్రే మాతుర్నృపసుతస్తదా || 37 ||
వలయావజ్రఖచితా ద్విరష్టౌకరయోర్ద్యయోః | ఏకైకేనిష్కకోటీభి ర్మూల్యవిద్భిర్నరైః కృతాః || 38 ||
కేయూరనూపురౌ తస్యాః అనర్ఘౌ స నృపాత్మజః | ప్రదదౌ పితురిష్టాయా భూషణార్థం రవిప్రభే || 39 ||
కటిసూత్రం తు శర్వాణ్యా యదాసీత్పావకప్రభమ్‌ | తధ్భ్రష్టం భయభీతాయా స్సంగ్రామే తారకమయే || 40 ||
కాలనేమౌ స్థితే రాజ్యే పతితం మూలపాచనే | తద్గృహీతం తు దెత్యైన మయేన లోకామాయినా || 41 ||
తం హత్వామలయే దైత్యం దైత్యకోటిసమావృతమ్‌ | సంవత్సరరణ ఘోరే పితుర్వచనకారణాత్‌ || 42 ||
అవాప కటిసూత్రంతు దైత్యరాజప్రియాస్థితమ్‌ | తద్దదౌ పితురిష్టాయా స్సానద్ధపులకో నృపః || 43 ||
హిరణ్యకశిపోః పూర్వం యా భార్యా లోకసున్దరీ | తస్యాస్సీమంతకశ్చాసీ సౌదామిని సమప్రభః || 44 ||
సా ప్రనిష్టా సమం పత్యా యదా పావకమంగలా | సముద్రే క్షిప్య సీమన్తం దుఃఖేన మహతాన్వితా || 45 ||
సాగరస్తత్తు సంగృహ్య రత్నశ్రేష్ఠయుగం కిల | దదౌ ధర్మాంగదయాధ తస్య వీరేణ్య తోషితః || 46 ||
జనన్యాః ప్రదదౌ హృష్టః సూర్యకోటి సమప్రభమ్‌ | అగ్నిశౌచే శుభే వస్త్రే కంచుకే సుమనోహరే || 47 ||
సహస్రకోటిమూల్యే తే మోహిన్యాస్సన్న్యవేదయత్‌ | దేవమాల్యం సుగంధాఢ్యం తధా దేవవిలేపనమ్‌ || 48 ||
సర్వదేవగురోః పూర్వం సిద్ధహస్తాత్సుదుర్లభమ్‌ | ధర్మాంగదేవ వీరేణ ద్వీపానాం విజయే తధా || 49 ||
లబ్థం తత్ప్రదదౌ దేవ్యా మోహిన్యాః కామవర్థనమ్‌ | సంభూష్య పరయా భక్త్యా పశ్చాత్సడ్రసభోజనమ్‌ || 50 ||
ఆనీతం మాతృహస్తేన భోజయామాస భూమిప | పురస్తాదేవ జననీం వాక్యైస్సంబోధ్య భూరిశః || 51 ||
మయా త్వయా చ కర్తవ్యం రాజ్ఞో వాక్యం న సంశయః | యా ఇష్టా నృపతేర్దేవి! సాస్మాకం హి గరీయసీ || 52 ||
ఇష్టాయా భూపతేర్భర్తు స్తస్యా యా దుష్టమాచరేత్‌ | సాపత్నభావం యా కుర్యాత్‌ యావదిన్ద్రాశ్చతుర్దశ || 53 ||
సా పత్నీభావం యాకుర్యా ద్భర్తృస్నేహెష్టయా సహ | తస్యాస్స్నేహ వియోగార్థం తప్యతే తామ్రభ్రాష్ట్రకే || 54 ||
యధాసుఖం భ##వేద్భర్తుస్తధా కార్యం హి భార్యయా | అనుకూలం హితం తస్యా ఇష్టాయా భర్తురాచరేత్‌ || 55 ||
యధా భర్తా తధా తాం హి పశ్యేత వరవర్ణిని! హీనాయాశ్చాపి శుశ్రూషాం కృత్వా యాతి త్రివిష్టపమ్‌ || 56 ||
పశ్చాత్థ్సానే భ##వేత్సాపి మనసా యా భ##వేత్ప్రియే | సర్వాన్ఖోగానవాప్నోతి భర్తురిష్టం ప్రగృహ్య హి || 57 ||
అపుడు ప్రజలచే పూజింపబడుచు తన భవనమును చేరి అశ్వమునుదిగి మోహినితో ఇట్లు పలికెను. ఓ సుందరీ పుత్రుడగు ధర్మాంగదుని ఇంటికి వెళ్ళుము. ఈ ధర్మాంగదుడు యధోచితముగా నీకు సేవలను చేయును. ధర్మాంగదుడు చేయు సేవలను నీకు నీ చెలి, నీ దాసి కూడా చేయజాలదు. ఇట్లు భర్తమాటతో తన గృహమునకు వెళ్ళుచున్న మోహినిని చూచి, రాజులతో మీరు ఇచటనేయుండుడు, తండ్రి ఆజ్ఞచే నే నీతల్లిని సేవించెదను. అని పలికి, ఆమెను చేతులతో తీసుకొని పదునైదవ మందిరమునకు తీసుకొని వెళ్ళి, బంగారముచే నిర్మించబడి, పట్టసూత్రము చుట్టబడి, కోమలము దృఢము అయిన, మెత్తని అస్తరణముగల, మణి రత్న విభూషితము, రత్నదీపఖచితము, సూర్యసమానకాంతి యుతము, అగు పర్యంకమున కూర్చుండబెట్టెను. అంతట ధర్మాంగదుడు మోహినీ దేవికి పాదప్రక్షాలనముగావించెను. సంధ్యావలీ దేవికంటే పూజ్యురాలుగా భావించెను. మోహినిని చూచిన ధర్మాంగదుని మనసు కలుషితము కాకపోయెను. ధర్మాంగదుడు సుకుమారుడు సుందరుడు యువకుడు అయిననూ తన్వంగి పీనోరు జఘనస్తని యగు మోహినిని పదివేల సంవత్సరముల దానినిగా బాలునిగా భావించెను. ఆమె తనను మూడుసంవత్సరముల పాదములను కడిగి ఆజలమును తలపై దాల్చెను. వినయముతో వంగి తల్లీ! నేను ధన్యుడనైతిని అని పలికెను. ఇట్లు పలికి ఇతర నరులతో నారీమణులతో పాటు తానుకూడా ఆమెకు అలసటను తొలగించును పచారములను చేసెను. సంతోషముతో ఆమెకు అన్ని భోగములను కూర్చెను. క్షీరసాగరమున మధన సమయమున సముద్రమునుండి ఉత్పన్నములై అమృతమును స్రవించుచున్న పాతాళము లోకమున దానవులను గెల్చిపొందిన కుండలములను మోహినీ దేవి కర్ణములకు అలంకరించెను. ధాత్రీఫలమువలె స్వచ్ఛమగు నూటా ఎనిమిది ముత్యములచే రచితమగు హారమును మోహినీదేవి హృదయమున అలంకరించెను. నిష్కము పలశతమితము, అనేక వజ్రఖచితము అగు లఘూత్తర హారమును ఆమె కంఠసీమలో నలంకరించెను. రెండు చేతులకు ఎనిమిది కంకణముల చొప్పున పదహారింటిని ఒక్కొక్కటి కోటి నిష్కములు కలిది, విలువ తెలిసిన వారిచే చేయబడినవాటిని తొడిగెను. వెలకట్టలేని కేయూరములను నూపురములను అలంకరించుకొనుట కిచ్చెను. తారకాసుర యుద్ధమున భయముచే పార్వతీ దేవినడుమునుండి జారిపడిన కాలనేమి రాజ్యముననది. దానిని లోకమయి యగు మయాసురుడు తీసుకొనెను. కోటిమంది దైత్యులచే కూడియున్న మయుని ధర్మాంగదుడు తండ్రి ఆజ్ఞచే సంవత్సరము యుద్ధముచేసి సంహరించెను. అతని ప్రియురాలి నడుమునకున్న కటి సూత్రమును హరించెను. ఆకటి సూత్రమును సంతోష పులకితుడగు ధర్మాంగదుడు తండ్రికిష్టురాలగు మోహినికి సమర్పించెను. పూర్వకాలమున లోకసుందరియగు హిరణ్యకశ్యపుని భార్యకు సౌదామిని సమప్రభమగు సీమంతకముండెను. ఆమెభర్త మరణించినపుడు ఆ సీమంతకమును సముద్రమున పడవేసి భర్తతో అగ్నిలో దగ్ధమాయెను. సముద్రుడు రెండు శ్రేష్ఠరత్నములతో కూడియున్న ఆ సీమంతకమును తీసికొని ధర్మాంగదుని పరాక్రమమునకు మెచ్చి ధర్మాంగదునికిచ్చెను. ఆ సీమంతకమును ఇపుడు ధర్మాంగదుడు మోహినికి సమర్పించెను. అగ్నివలె పరిశుద్ధములగు శుభకరములగు వస్త్రయుగ్మమును, మనోహరములు సహస్రకోటి మూల్యములు అగు కంచుకములను మోహినికి సమర్పించెను. దివ్యమాల్యములను, సుగంధాఢ్యములగు దివ్య విలేపనమును, సర్వదేవ విభునకు ఉపయోగించునది సుదర్లభము, పూర్వము ధర్మాంగదుడు ద్వీపముల విజయ సమయమున సిద్ధుల హస్తము నుండి స్వీకరించునది, కామ వర్ధకమగు గంధమును మోహినీదేవికి అర్పించెను. ఇట్లు చక్కగా మోహినీ దేవిని అలంకరించి తరువాత తల్లిచే తేబడిన షడ్రసోపేతమగు భోజనమును భుజింపచేసెను. మోహిని ఎదుటనే తన తల్లిని చక్కని మాటలతో బోధించెను. ఓ తల్లీ! నేను నీవు తండ్రిగారి మాటను పాటించవలయును. అట్టి రాజుకు ఇష్టురాలు ప్రియురాలు మనకు చాలా పూజ్యురాలు. భర్తకు ఇష్టురాలగు యువతిని సవతిగా చూచిన స్త్రీ పదునలుగురు ఇంద్రుల కాలము నరకమున నివసించును. అట్టి ఇష్టురాలిపై భర్తకు ద్వేషము కలిగించు స్త్రీ రాగి పెనముపై కాల్చబడును. కావున భర్తకు ఆనందము కలుగు విధానమునే భార్య అనుసరించవలయును. భర్తకు ఇష్టురాలగు యువతికి అనుకూలమును హితమును ఆచరించవలయును. భర్తను చూచినట్లు భర్త ప్రియురాలిని కూడా చూడవలయును. భర్త ప్రియురాలు హీనురాలైనను ఆమెను సేవించిన భార్య స్వర్గమును పొందును. తరువాత జన్మలో ఆమె కూడా భర్తకు ప్రియురాలుగా పుట్టును. భర్తకు ఇష్టమగు దానిని ఆచరించిన స్త్రీ సకల భోగములను అనుభవించగలుగును.
ఈర్ష్యా భావపరిత్యాగా త్సర్వేశ్వర పదం లభేత్‌ | సపత్నీ యా పపత్న్యాస్తు శుశ్రూషాం కురుతే సదా || 58 ||

భర్తురిష్టాం సంనిరీక్ష్య తస్యా లోకో
7క్షయో భ##వేత్‌ | భర్తురిష్టా పురా వేశ్యా హ్యభవత్సా కులేషు వై || 59 ||
శూద్రజాతేస్సుదుష్టస్య పరిత్యక్త క్రియస్యతు | ఆచరే ద్వేశ్యయా సార్థం సా భార్యా పరిరంజనీ || 60 ||
ప్రక్షాలనం ద్వయోః పాదౌ ద్వయోరు చ్ఛిష్ట భోజినీ | ఉభయోరప్య ధశ్శేతే ఉభయోర్వై హితే రతా || 61 ||
వేశ్యయా వార్యమాణాపి సదాచార పధే స్థితా | ఏవం శుశ్రూష యంత్యాహి భర్తారం వేశ్యయా సహ || 62 ||
జగామ సుమహాన్కాలో వర్తన్త్యా దుఃఖ సాగరే | అపరస్మిన్దినే భర్తా మాహిషం మూలకాన్వితమ్‌ || 63 ||
అభక్షయత నిష్పావం దుర్మేధాసై#్తలమిశ్రితమ్‌ | తదపధ్య భుజస్తస్య అవమన్య పతివ్రతామ్‌ || 64 ||

అభవద్దారుణో రోగో గుదే తస్య భగందరః | సందహ్య మానో
7తి తరాం దివారాత్రా స భూరిశః || 65 ||
తస్య గేహే స్థితం విత్తం సమాదాయ జగామ సా | వేశ్యాన్యస్త్మే దదౌ ప్రీత్యా యూనే కామ పరాయణా || 66 ||
తతస్స దీన వదనో వ్రీడయా చ సమన్వితః | ఉవాచ ప్రరుదన్భార్యాం శూద్రో వ్యాకుల చేతనః || 67 ||
పరిపాలయ మాం దేవి! వేశ్యా సక్తం సునిష్ఠురమ్‌ | న మయోపకృతం కించి త్తవ సుందరి పాపినా || 68 ||
రమతా వేశ్యయా సార్థం బహూనబ్దాన్సుమధ్యమే | యో భార్యాం ప్రణతాం పాపో నామ మన్యేత గర్వితః || 69 ||

సో
7శుభాని సమాప్నోతి జన్మాని దశపంచ చ | దివాకీర్తి ర్గృహే తస్మా ద్యోనిం ప్రాప్స్యామి గర్హితామ్‌ || 70 ||
తవాపమానతో దేవి! మనో న కలుషీకృతమ్‌ | ఇతి భర్తృవచ శ్శ్రుత్వా భార్యా భర్తారమ బ్రవీత్‌ || 71 ||
పురా కృతాని పాపాని దుఃఖాని ప్రభవన్తి హి | తాని స క్షమతే విద్యా న్స విజ్ఞేయో నృణాం వరః || 72 ||
తన్మయా పాపయా పాపం కృతం వై పూర్వ జన్మని | తద్భజంత్యా న మే దుఃఖం న విషాదః థంచన || 73 ||
ఏవముక్త్వా సమాశ్వస్య భర్తారమను శాస్య చ | ఆనీతం జనకా ద్విత్తం బంధుభ్యో వర వర్ణినీ || 74 ||
క్షీరోదనిలయా వాసం మన్యతే స్మ సతీ పతిమ్‌ | దివా దివా త్రిర్యత్నేన రాత్రౌ గుహ్య విశోధనమ్‌ || 75 ||
రజనీ కరవృక్షోత్థం గృహ్య నిర్యాసమంజసా | నఖేన పాతయే ద్భర్తుః క్రిమీ న్కుష్ఠా చ్ఛనైశ్శనైః || 76 ||
మయూర పుచ్ఛసంయుక్తం పవనం చాకరోత్తదా | న దేవి రాత్రౌ స్వపితి న దివా చ వరాననా || 77 ||
భర్తృదుఃఖేన సంతప్తా అసశ్య జ్జ్వలితం జగత్‌ | యద్యస్తి వసుధా దేవీ పితరో దేవతా స్తధా || 78 ||
కుర్వంతు రోగహీనం మే భర్తారం గతకల్మషమ్‌ | చండికాయై ప్రదాస్వామి రక్తం మాంస సముద్భవమ్‌ || 79 ||
నృచ్ఛాగ మహిషోపేతం భర్తురారోగ్య హేతనే | సాదరం కార యిష్యామి ఉపసాన్దశైవతు
|| 80 ||

శరీరం స్థాపయిష్యే
7హం సూక్ష్మకంటక సంస్తరే | నోప భోక్ష్యామి మధురం నోప భోక్ష్యామి వైఘృతమ్‌ || 81 ||
బాహ్యా భ్యంగ విహీనాహం సంస్థాస్యే దిన సంచయమ్‌ | జీవతాం రోగహీనో హి భర్తా మే శరదాం శతమ్‌ || 82 ||
ఏవం ప్రవ్యాహరంతీ సా వాసరే వాసరే గతా | అధ కాలేన చాల్పేన త్రిదోషో
7స్య వ్యజాయత || 83 ||
త్రికటుం ప్రదదౌ భర్తు ర్యత్నేన మహతా తదా | శీతార్తః కంప మానో
7సౌ పత్న్యం గులి మఖండయత్‌ || 84 ||
ఉభయోర్దంతయో శ్ల్శేష స్సహసా సమపద్యత | తత్కండ మంగులైర్వక్త్రే స్థితం నృపతి వల్లభే || 85 ||
అధ విక్రీయ వలయం క్రీత్వా కాష్ఠాని భూరిశః | చితాం సర్పిర్యుతాం చక్రే మధ్యే ధృత్వా పతిం తదా || 86 ||
అవరుహ్య బాహుభ్యాం పాదేనా కృష్య పావకమ్‌ | ముఖేముఖం సమాధాయ హృదయే హృదయం తధా || 87 ||
జఘనే జఘనం దేవి! ఆత్మన స్సన్నివేశ్యవై | దాహయా మాస కళ్యాణీ భర్తుర్దేహం రుజాన్వితమ్‌ || 88 ||
ఆత్మనా సహ చార్వంగీ జ్వలితే జాతవేదసి || 89 ||
విముచ్య దేహం సహసా జగామ పతిం సమాదాయ చ దేవలోకమ్‌ |
విశోధయిత్వా బహుపాపసంఘా న్స్వకర్మణా దుష్కర సాధనేన || 90 ||

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే పతివ్రతో పాఖ్యానం నామ షోడశో
7ధ్యాయః ఈర్ష్యా భావమును వదిలినచో సర్వేశ్వర లోకము లభించును. సవతి సేవ సేయు స్త్రీకి భర్త ప్రియమును చూచునదగును. కావున అక్షయ లోకములు లభించును. పూర్వకాలమున ఒక పురుషుడు శూద్రజాతి వాడు పరమదుష్టుడు, కర్మాచరణ హీనుడు ఉండెను. అతనికి ఒక వేశ్యపై ఇష్టము కలిగి వేశ్యను ఇంటికి తీసుకొని వచ్చెను. అపుడు భార్య వేశ్యను సంతోష పరిచెను. వేశ్య వారించుచున్ననూ ఇద్దరి ఉచ్ఛిష్టమును భుజించి, ఇద్దరికన్నా క్రింద పరుండి ఆ ఇద్దరికి హితమును ఆచరించు చుండెను. ఇట్లు వేశ్యతో పాటు భర్తను సేవించుచుండగా చాలాకాలము గడిచెను. ఒకనాడు భర్త మూలకములచే చేయుబడినది తైలమిశ్రితమగు మహిష నిష్పావమును (జున్నును) దుష్టబుద్ధి కలవాడై భుజించెను. ఇట్లు పతివ్రతను అవమానించి అపధ్యమును భుజించిన అతనికి గుదమున ఘోరమగు భగందరమను రోగము పుట్టెను. ఆరోగముతో అతను రాత్రింబవళ్ళు దహించబడుచుండెను. అంతట యావేశ్య అతనింటిలో నున్న ధనము నంతటిని అపహరించుకొని వెళ్ళి కామ పరాయణురాలు కావున మరియొక యువకునికిచ్చెను. అంతట అతను దీనమగు ముఖముచే సిగ్గుపడుచు వ్యాకులమగు మనస్సుచే రోదించుచు, భార్యతో ఇట్లు పలికెను. ఓదేవీ! పరమ కఠినుడను, వేశ్యాసక్త చిత్తుడనగు నన్ను కాపాడుము. నేను పరమపాపినై నీకు ఏ మాత్రము ఉపకారమును చేయలేకపోతిని. నేను చాలా సంవత్సరములు వేశ్యతో గడిపితిని. వినయ శీలురాలు పతివ్రత యగు భార్యను ఆదరించనివాడు పదునైదు జన్మల అశుభములను పొందును. తరువాత హీన జాతిలో పుట్టెదను. గాననీవు మాత్రము నన్ను ఆదరించుచు నీ మనసు స్వచ్ఛమైనదని తెలిపితివి. ఇట్లు భర్త మాటలను విని అతనితో ఇట్లు పలికెను. పూర్వ జన్మలలో చేసిన పాపములే దుఃఖములగును. జ్ఞాని ఆ దుఃఖములను సహించగలుగును. అట్లు సహించగలవాడే ఉత్తమ మానవుడు. కావున నేను పూర్వజన్మలో పాపములను చేసి యుంటిని. ఆ పాపములనే దుఃఖములనుగా అనుభవించు నాకు ఎట్టి పరితాపము లేదు. ఇట్లు పలికి భర్తను ఓదార్చి, తండ్రి నుండి బంధువుల నుండి ధనమును తెచ్చి, భర్తను శ్రీమన్నారయణునిగా భావించి పగలు మూడు మార్లు గుహ్యమును శుద్ధి చేయుచు, చంద్ర వృక్ష రసమును తీసి నఖముతో వ్రణములో వేయుచు, మెల్ల మెల్లగా వ్రణములోని క్రిములను తీసివేయుచు, నెమిలి పించముతో వీచుచుండెను. ఆమె పగలు, రాత్రి నిదురించలేదు. భర్త దుఃఖముతో పరితపించుచు జగత్తును దహించుచున్నట్లు తలచుచుండెను. ఈ భూదేవి, పితృదేవతలు, దేవతలు ఉన్నచో నా భర్తను రోగహీనునిగా చేయుడు. అట్లు చేసినచో చండికాదేవికి మేక యొక్క, మహిషము యొక్క మాంసమునుండి వచ్చు రక్తమును తర్పణ చేసెదను. ఆదరముతో పది యుపవాసములను చేయింతును. నేను నా శరీరమును చిన్నముళ్ళ పడకపై నుంచెదను. మధురమును ఘృతమును భుజించను. చాలా దినములు బాహ్యాభ్యంగ రహితముగా నుందును. నా భర్త రోగ రహితుడై నూరేండ్లు చల్లగా బ్రతుకనిమ్ము. ఇట్లు ప్రతిదినమూ పలుకుచు ఆమె గడిపెను. ఇంతలో కొద్దికాలమునకే అతనికి త్రిదోషము సంక్రమించెను. అపుడామె భర్తకు చాలా ప్రయత్నించి త్రికటువును ఇచ్చెను. శీతబాధచే వణకుచు అతను భార్య వేలును కొరికెను. రెండు పలువరుసలు ఒకటిగా కలిసి పోయెను. భార్యాంగులీ ఖండము. అతని నోటిలోనే ఉండి పోయెను. అట్లే అతను పంచత్వమును పొందెను. అంతట ఆమె కంకణమును అమ్మి కట్టెలను కొని చితిని పేర్చినేయి పోసి భర్తను చేతులలో ధరించి చితిపై కూర్చొని, పాదముతో అగ్నిని ఆకర్షించి, అతని ముఖమున ముఖమును, హృదయమున హదయమునుంచి, జఘనమున జఘనము నుంచి బాధాపీడితమగు భర్తృదేహమును తనతో పాటు కాల్చెను. అట్లు ఆమె దేహమును విడిచి భర్తను తీసికొని చాలా పాపరాశులను శుద్ధిచేసి దుష్కర సాధనమగు తన కర్మలచే దేవలోకమును చేరెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున పతివ్రతో పాఖ్యానమను పదునారవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page