Sri Naradapuranam-3    Chapters    Last Page

సప్తదశో7ధ్యాయః = పదునేడవ అధ్యాయము

మోహినీ వచనమ్‌

పుత్ర ఉవాచ:-


తస్మా దీర్ష్యాం పరిత్య జ్య మోహినీ మనుభోజయ | న మాతరీదృశో ధర్మో లోకేషు త్రిషు లభ్యతే || 1 ||
స్వహస్తేన ప్రియాం భర్తు ర్భార్యాం యా తు ప్రభోజయేత్‌ | సపత్నీం తు సపత్నీ హి కించి దన్నం దదాతి చ || 2 ||
తదనన్తం భ##వేద్దేవి మాతరిత్యాహ నాభిజః | కురు వాక్యం మయోక్తం హి స్వామిని త్వం ప్రసీద మే || 3 ||
తాతస్య సౌఖ్యం కర్తవ్యం ఆవాభ్యాం వరవర్ణిని ! | భ##వేత్పా పక్షయ స్సమ్యక్‌ స్వర్గప్రాప్తి స్తధాక్షయా || 4 ||
పుత్రస్య వచనం శ్రుత్వా దేవీ సంధ్యావలీ తదా | అభిమంత్ర్య పరిష్వజ్య తనయం సా పునః పునః || 5 ||
మూర్థ్నిచైన ముపాఘ్రాయ వచనం చేదమబ్రవీత్‌ | కరిష్యే వచనం పుత్ర! త్వదీయం ధర్మసంయుతమ్‌ || 6 ||
ఈర్ష్యాం మానం పరిత్యజ్య భోజయిష్యామి మోహినీమ్‌ | శతపుత్రా హ్యహం పుత్ర త్వయైకేన సుతేన హి || 7 ||
నియమైర్భహుభిర్జాతో దేహక్లేశ కరై ర్బవాన్‌ | వ్రతరాజేన చీర్ణేన ప్రాప్త స్త్వమచిరాత్సుతః || 8 ||
నహీదృశం వ్రతం లోకే ఫలదాయి ప్రదృశ్యతే | సత్యః ప్రత్యయ కారీదం మహాపాతక నాశనమ్‌ || 9 ||
కిం జాతైర్బహుభిః పుత్రై శ్శోక సంతాప కారకైః | వరమేకః కులాలంబీ యత్ర విశ్రమతే కులమ్‌ || 10 ||

త్రైలోక్యాదుపరిష్ఠాహాం త్వాం ప్రాప్య జఠరే స్థితమ్‌ | ధన్యాని తాని శూలాని యై ర్జాతస్త్వం సుతో
నఘ || 11 ||
సప్తద్వీప పతి శ్శూర పితుర్వ చన కారకః | ఆహ్లాదయతి యస్తాతం జననీం వాపి పుత్రకః || 12 ||
తం పుత్రం కవయః ప్రాహు ర్వాచఖ్య మపరం సుతమ్‌ | ఏవముక్త్వాతు వచనం దేవీ సంధ్యావలీ తదా || 13 ||

వీక్షాం చక్రే
థ భాండాని షడ్రసస్య తు హేతవే | తస్యా వీక్షణమాత్రేణ పరిపూర్ణాని భూపతే || 14 ||
షడ్రసస్య సుఖోష్ణస్య మోహినీ భోజనేచ్ఛయా | అమృత స్వాదు కల్పస్య జనస్యంతు మహీపతే || 15 ||
తతో దర్వీం సమాదాయ కాంచనీం రత్న సంయుతామ్‌ | పరివేషయ దవ్యగ్రా మోహిన్యాశ్చారుహాసినీ || 16 ||
కాంచనే భాజనే శ్లక్షే మానభోజనవేష్టితే | శ##నైశ్శనైశ్చ ఋభుజే ఇష్టమన్నం సుసంస్కృతమ్‌ || 17 ||
ఉపవిశ్యాసనే దేవీ శాతకౌంభమయే శుభే | వీజ్యమానా వరారోహా వ్యజనేన సుగీతినా || 18 ||
ధర్మాంగదగృహీతేన శిఖిపుచ్ఛభ##వేన తు | సా భుక్తా బ్రహ్మతనయా తదన్నమామృతోపమమ్‌ || 19 ||
చతుర్గణన శీతేన కృత్వాశౌచమధాత్మనః | జగృహే పుత్రదత్తం తు తాంబూలం తుసుగంధిమత్‌ || 20 ||
వరచందనయుక్తేన హస్తేన వరవర్ణిని | తతః ప్రహస్య శనకైః ప్రాహ సంద్యావలీం నృప || 21 ||
పుత్రుడు పలికెను: - కావున ఓ తల్లీ! ఈర్ష్యను వదలి మోహినిని భుజింపచేయుము. ఇటువంటి ధర్మము మూడులోకములలో లభించదు. భర్తకు ప్రియురాలగు తన సవతిని ఏభార్య భుజింప చేయునో, లేదా కొంచెము అన్నమిచ్చునో అది అనన్తఫలమునిచ్చునని బ్రహ్మ చేప్పియున్నాడు. కావున మహారాణీ ! నీవు నామాటను అనుసరించుము. మన మిద్దరము తండ్రిసుఖమునే చూడవలయును. ఇట్లు చేసిన పాపములు నశించి స్వర్గము లభించును. ఇట్లు ధర్మాంగదుని మాటలను వినిన సంధ్యావలీ దేవి పుత్రుని అభినందించి పలుమార్లు ఆలింగనము చేసుకొని శిరస్సును మూర్కొని ఇట్లు పలికెను. ఓ కుమారా! ధర్మబద్ధమగు నీ మాటను తప్పక నాచరించెదను. ఈర్ష్యను అభిమానమును వదలి మోహినిని భుజింప చేసెదను. నీవంటి ఒక్కపుత్రుని చేతనే నేను నూర్గురు పుత్రులు కలదాననైతిని. దేహమునకు కష్టమును కలిగించు ఎన్నో నియమములనాచరించుటచే నీవు పుట్టితివి. వ్రతరాజములనెన్నింటినో చేసిన వెంటనే నీవు లభించితివి. లోకమున ఇంతటి ఫలము నీయగల ఇటువంటి వ్రతము మరియొకటి లేదు. ఈ వ్రతము వెంటనే విశ్వాసమును కలిగించునది. ఫలమును ప్రసాదించునదిగా చూడబడినది. శోకమును సంతాపమును కలిగించు పదిమంది పుత్రలకంటే కులమునకు ఆధారభూతుడగు ఒక పుత్రుడు చాలును. నిన్ను గర్భమున ధరించిన నేను మూడులోకములకంటే ఉన్నతస్థితిని పొందితిని. నీకు పుట్టుక నిచ్చిన నా నొప్పులు ధన్యములు. సప్తద్వీపాధిపతి, శూరుడు, పితృవాక్యపాలకుడు, తలిదండ్రులను ఆనందింపచేయువాడు మాత్రమే నిజమగు పుత్రుడని ఇతరులు కేవలము పుత్ర నామమమును మాత్రమే పొందుదురని పండితులు చెప్పియున్నారు. సంధ్యావలీదేవి ఇట్లు పలికి భాండములను షడ్రసపదార్థముల కొఱకు చూచెను. సంధ్యావలి చూపు పడిన వెంటనే ఆభాండములు షడ్రస యుక్తములుగా సఖోష్ణకములుగా మోహినిని భుజింప చేయవలయునని పరిపూర్ణములుగా మారెను. అమృతము వలె రుచికరములుగా నుండెను. అంతట సంధ్యావలీ దేవి రత్న ఖచితమగు బంగారు గరిటను తీసుకొని మోహినీ దేవికి చిరునవ్వుతో వడ్డించెను. మృదు స్పర్శమగు బంగారు పాత్రలో వడ్డించిన పదార్దములను ఇష్టము సుసంస్కృతమగు అన్నమును మోహినీ దేవి మెలమెల్లగా భుజించెను. మోహినీ దేవి శుభకరము స్వర్ణమయమగు ఆసనమున కూర్చొని, ధర్మాంగదుడు స్వయముగా నెమిలి పింఛముల వీవన వీచు చుండగా అమృతము వంటి ఆయన్నమును భుజంచినది. తరువాత నాలుగు విధముల శీత జలముచే శౌచము నాచరించి ధర్మాంగదుడిచ్చిన సుగంధియగు తాంబూలమును శ్రేష్ఠమగు చందనము నలదిన హస్తముచే స్వీకరించెను. అపుడు ఒక చిరునవ్వు నవ్వి సంధ్యావలితో ఇట్లు పలికెను.
జననీ కింతు దేవి త్వం వృషాంగద నృపస్య తు | న మయా హి పరిజ్ఞాతా శ్రమస్వేదితయా శుభే ! || 22 ||
వదత్యేవం బ్రహ్మసుతా యావత్సంధ్యావలీం నృప | తావత్ప్రణమ్య నృపతేః పుత్రో వచనమబ్రవీత్‌ || 23 ||
ఉదరే హ్యనయా దేవ్యా ధృత స్సంవత్సర త్రయమ్‌ | తవ భర్తుః ప్రసాదేన వృద్దిం సంప్రాప్త వానహమ్‌ || 24 ||
సంత్యనేకాని మాతౄణాం శతాని మమ సున్దరి ! | అస్యాః పీతం పయో భూరి కుచయో స్స్నేహ సంప్లుతమ్‌ || 25 ||
అనయా సా రుజా తీవ్రీ విధృతా ప్రాయశో జరా | ఇయం మాం జన యిత్వైవ జాతా శిధిల బంధనా || 26 ||
తన్నాస్తి త్రిషు లోకేషు యద్దత్వా చానృణోభ##వేత్‌ | మాతుః పుత్రస్య చార్వంగి సత్యమే తన్మయేరితమ్‌ || 27 ||

సో
హం ధన్యతరో లోకే నాస్తి మతోధికః పుమాన్‌ | ఉత్సంగే వర్తయిష్యామి మాతృసంఘస్య నిత్యశః || 28 ||
నోత్సంగే చే జ్జన న్యాహి తనయో విశతి క్వచిత్‌ | మాతృ సౌఖ్యం న జానాతి కుమారీ భర్తృజం యధా || 29 ||
మాతురుత్సంగ మారూఢః పుత్రో దర్పాన్వితో భ##వేత్‌ | హారముత్తమదేహస్థం హస్తే నాహర్తు మిచ్ఛతి || 30 ||
పాల్యమానో జనన్యాహి పితృహీనోపి దర్పితః | సమీహతే జగద్ధర్తుం సవీర్యం మాతృజం పయః || 31 ||
ఏతజ్జఠర సంసర్గీ భవత్యుత్సంగ శంకితః | అస్యాశ్చైవా పరాణాంచ వశేష యది మే నచేత్‌ || 32 ||
తేన సత్యే నమే తాతో జీవతా చ్ఛరదాం శతమ్‌ | ఏవం బ్రువాణ తనయే మోహినీ విస్మయం గతా || 33 ||
కధమస్య ప్రహర్తవ్యం మయా నిర్ఘృణ శీలయా | వినీతస్యహ్యపాపస్య ఔచిత్యం పాపినో గృహే || 34 ||
పితుశ్శు శ్రూషణం యస్య నతస్య సదృశం క్షితౌ | ఏవం గుణాధిక స్యాహం కర్తుం కర్మ జుగుప్సితమ్‌ || 35 ||
పుత్రస్య ధర్మ శీలస్య భూత్వా తు జననీ క్షితౌ | ఏవం విమృశ్య బహుధా మోహినీ లోక సుందరీ || 36 ||
ఉవాచ తనయం బాలా శీఘ్ర మానయ మే పతిమ్‌ | న శక్నోమి వినా తేన ముహూర్తమపి వర్తితుమ్‌ || 37 ||
తతస్స త్వరితం గత్వా ప్రణమ్య పితరం నృప | కనిష్ఠా జననీ తాత శీఘ్రం త్వాం ద్రష్టు మిచ్ఛతి || 38 ||
ప్రాసాదః క్రియతాం తస్యాః పూజ్యతాం బ్రహ్మణ స్సుతా | పుత్ర వాక్యేన నృపతి స్తత్‌క్షణా ద్గన్తుముద్యతః || 39 ||
ప్రహృష్ట వదనో భూత్వా సంధ్యా వల్యా నివేశనమ్‌ | సంప్రవిశ్య గృహే రాజా దదర్శ శయన స్థితామ్‌ || 40 ||
మోహినీం మోహ సంయుక్తాం తప్తకాం చన సప్రభామ్‌ | ఉపాస్య మానాం ప్రియయా సంధ్యావల్యా శ##నైశ్శనైః || 41 ||
పుత్రవాక్యా త్పరిత్యజ్య క్రోథం సాపత్న్యజం తధా | దృష్ట్వా రుక్మాంగదం ప్రాప్తం శయనే మోహ్య సుందరీ || 42 ||
ప్రహృష్ట వదనా ప్రాహ రాజానం భూరిదక్షిణమ్‌ | ఇహో పవిశ్యతాం కాంత! పర్యంకే మృదు తూలకే || 43 ||
సర్వం నిరీక్షితం భూప రాజ్యతంత్రం త్వయాచిరమ్‌ | అద్యాపి న హి తే వాంఛా రాజ్యే పరి నివర్తతే || 44 ||
మన్యే దుష్కృతినం భూప త్వామత్ర ధరణీతలే | యస్సమర్దం సుతం జ్ఞాత్వా స్వయం పశ్యే న్నృప శ్రియమ్‌ || 45 ||
తస్మాత్త్వత్తోధికో నాస్తి దుఃఖీ లోకేషు కశ్చన | సుపుత్రాణాం పితౄణాం హి సుఖం యాతి క్షణం నృప || 46 ||
దుఃఖేన పాపా భోక్తౄణాం విషయాసక్త చేతసామ్‌ | సర్వాశ్చ ప్రకృతీ రాజం స్తవేష్టాః పూర్ణ పుణ్యజాః || 47 ||

ధర్మాంగదే పాలయానే కధంత్వం వీక్షసే
ధునా | పరిత్యజ్య ప్రియాసౌఖ్యం కీనాశ ఇవ దుర్బలః || 48 ||
యది పాలయసే రాజ్యం మయా కిం తే ప్రయోజనమ్‌ | నిష్ర్పయోజన మానీతా క్షీర సాగర మస్తకాత్‌ || 49 ||
విడ్భోజ్యా హి భవిష్యామి పక్షినా మామిషం యధా | యో భార్యాం ¸°వనోపేతాం న సేవేదిహ దుర్మతిః || 50 ||
కృత్యా చరణ సక్తస్తు కుతస్తస్య భ##వేత్ప్రియా | అసేవితా వ్రజేద్భార్యా అదత్తం హి ధనం వ్రజేత్‌ || 51 ||
అరక్షితం వ్రజేద్రాజ్యం అనభ్యస్తం శ్రతుం వ్రజేత్‌ | నాలసైః ప్రాప్యతే విద్యా న భార్యావ్రత సంస్థితైః || 52 ||
నానుష్ఠానం వినా లక్ష్మీ ర్నాభ##కైః ప్రాప్యతే యశః | నోద్యమీ సుఖమాప్నోతి నాభార్యస్సంతతిం లభేత్‌ || 53 ||

నాశుచిర్దర్మ మాప్నోతి నవిప్రో
ప్రియ వాగ్ధనమ్‌ | అప్పచ్ఛన్నైవ జానాతి అగచ్ఛన్న క్వచిద్ర్వజేత్‌ || 54 ||
అశిష్యో న క్రియాం వేత్తిన భయం వేత్తి జాగరీ | కస్మాధ్భూపాల మాం త్యక్త్వా ధర్మాంగద గృహే శుభే || 55 ||
వీక్షసే రాజ్య పదవీం సమర్ధే తనయే విభో! || 56 ||
ఏవం బ్రువాణాం తనయాం విధేస్తు రతి ప్రియాం చారు విశాల నేత్రామ్‌ |
వ్రీడాన్వితః పుత్ర సమీప వర్తీ ప్రోవాచ వాక్యం నృపతిః ప్రియాం తామ్‌ || 57 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే మోహినీ చరితే మోహినీ వచనం నామ సప్త దశో
ధ్యాయః ఓదేవీ ! నీవు ధర్మాంగదుని తల్లివా? శ్రమచే చెమటపట్టి యుండుటచే నేను తెలియ జాలకపోయితిని. ఇట్లు బ్రహ్మ సుతయగు మోహిని పలుకుచుండగా ధర్మాంగదుడు మోహినీ దేవికి నమస్కరించి ఇట్లు పలికెను. ఓ తల్లీ! ఈ దేవి నన్ను తన కడుపులో మూడు సంవత్సరములు మోసినది. నీ భర్త యను గ్రహముచే నేను పెరగితిని. నాకు కొన్ని వందల మంది తల్లులు కలరు. కాని నేను ప్రేమతో పెల్లుబికి వచ్చిన ఈమె చను బాలనే త్రాగితిని. ఈ దేవియే నన్ను ప్రసవించునపుడు తీవ్రమగు ప్రసవవేదనను భవించినది. దానితో ఈమెకు బంథములుడిగి వార్ధక్యము సంకమ్రించినిది. ఈమె ఋణమును తీర్చుటకు ఈయగలదేదియు ఈ మూడు లోకములలో కనపడుట లేదు. మాతా పుత్రులకు ఋణవిమోచన మనునది లేదు. ఇది మూమ్మాటికీ నిజము. కావున నేను అందరికంటే ధన్యుడను. ఈ లోకమున నాకంటే అధిక పుణ్యశాలి లేడు. నేను చాలా మంది తల్లుల వడులలో ఆడుచున్నాను. తల్లివడిలో చేరని తనయుడు కన్య భర్తృ సౌఖ్యమును తెలియనట్లు మాతృసౌఖ్యమును తెలియజాలడు. తల్లి వడిని చేరిన తనయుడు దర్పముతో విలసిల్లును. తల్లి కంఠసీమలో నుండు హారమును చేతులతో హరింప జూచును. పితృహీనుడైననూ తల్లిచే పపోషించబడువాడు దర్పముతోనే యుండును. ఈ జగమును జయించు నాబలమంతయూ తల్లిచను బాలచలువే. ఈమె కడుపులో పుట్టినవాడు ఈమె వడిలో శంకలేకనే ఆడును. ఈమెకు ఇతర మాతలకు నేను భేదమును చూడలేను. కావున మా తండ్రి నూరు సంవత్సరములు జీవించనిమ్ము. ధర్మాంగదుడిట్లు పలుకగా విస్మయమును చెందిన మోహిని తన మనసులో నేను దయను వీడి, వినయ సంపన్నుడు పరమ పుణ్యుడు, పితృసేవా పరాయణుడు, సర్వగుణాధికుడు అగు పుత్రునికి తల్లినై ఎట్లు జుగుప్సితమగు శిరః ఖండనమును చేయించగలను. ఇట్లు పలువిధములుగా తనలో తాను పరిశీలించుకొని మోహినీదేవి పుత్రుడగు ధర్మాంగదుతో ! నా భర్తను త్వరగా తోడ్కొనిరమ్ము. భర్త లేనిదే ఒక ముహూర్తకాలము కూడా నేను నిలువ జాలను. అని పలికెను. అంతట ధర్మాంగదుడు త్వరగా తండ్రి వద్దకువెళ్ళి, తండ్రికి సమస్కరించి మా చిన్నతల్లి మిమ్ములను చూడగోరుచున్నది. ఆమెను అనుగ్రహించుడు. బ్రహ్మపుత్రికను ఆదరించుడు. అని పలికెను పుత్రుని మాటను విని వెంటనే సంతోషముచే బయలుదేరి సంధ్యావలీ గృహమున ప్రవేశించి తప్తకాంచన సన్నిభ మోహయుక్తయగు మోహిని శయ్యపై నుండగా చూచెను. సంధ్యావలిచేసేవించబడు చుండెను. సంధ్యావలి కూడా పుత్రుని మాటలతో సవతియను భావమును విడిచి యుండెను. వచ్చిన రుక్మాంగద మహారాజును చూచి శయ్యపై ఒక ప్రక్కకు తిరిగి సంతోషము నిండిన మోముతో రాజుతో ఇట్లు పలికెను. ప్రియా! మెత్తని ఈ పర్యంకమున కూర్చొనుడు. రాజా! రాజకార్యములను చాలా సేపు పరిశీలించితిరి. ఇప్పటికీ మీకు రాజ్యముపై కోరిక ఉడుగలేదు. సమర్ధుడగు పుత్రుడుండిననూ రాజకార్యములను మీరు స్వయముగా చూచుట వలన ఈ భూమండలమున మీరొక్కరే దుష్కృతి యని భావించుచున్నాను. కావున ఈ లోకమున మిమ్ములను మించిన దుఃఖి వేరొకడు లేడు. మంచి పుత్రుడు గల తండ్రికి జీవనము సుఖముగా సాగును. పాపమును దుఃఖరూపముగా ననుభవించువారైనను, విషయాసక్త చిత్తులైనను సత్పుత్రులు గల వారికి ఆనందమే మిగులును. పరిపూర్ణ పుణ్యముచే పుట్టిన ప్రజలందరూ నీ కిష్టులుగా నున్నారు. ధర్మాంగదుడు పరిపాలించుచుండగా మరల మీరెందుకు చూచుచున్నారు.? ప్రియా సౌఖ్యమును దుర్బలుడగు కీనాశునివలె ఏలవదులు కొనుచన్నారు? ఒక వేల మీరు రాజ్యపాలన చేయుచున్నచో నాతో మీకేమి ప్రయోజనము. మందర పర్వతము నుండి నన్ను నిప్రయోజనముముగా తోడ్కొని వచ్చితిరి. పక్షులకు మాంసమువలే నేను క్రిములకు ఆహారము కాగలను. ¸°వనవతి యగు భార్యను కార్యవ్రగ్రుడై సేవించని దుర్మతికి భార్య యొట్లుండును? సేవించనిచో భార్య వెళ్ళి పోవును. దానము చేయని ధనము నశించును. రక్షించబడని రాజ్యము తొలగును. అభ్యాసము చేయని శాస్త్రము నశించును. సోమరులకు చదువురాదు. వ్రతముల నాచరించువారికి భార్య యుండదు. అనుష్ఠానము లేనిదే లక్ష్మీరాదు. భక్తులు కాని వారికి కీర్తిరాదు. ప్రయత్నమును చేయనివాడు సుఖమును పొందజాలడు. భార్యలేనివాడు సంతానమును పొందజాలడు. అపవిత్రుడు ధర్మమును పొందజాలడు. అప్రియమును మాటలాడు బ్రాహ్మణుడు ధనమును పొందజాలడు. అడగనివాడు తెలియజాలడు. నడవనివాడు వెళ్ళజాలడు. శిష్యుడు కానివాడు చేయవలసిన పనిని తెలియజాలడు. మేలుకొని యుండు వానికి భయము కలుగదు. కావున ఓ రాజా నన్ను ధర్మాంగదుని ఇంటిలో విడిచి, సమర్థుడగు తనయుడుండి కూడా నీవేందుకు రాజ్యతంత్రమును చూచుచున్నావు? ఇట్లు మాటలాడు చున్న బ్రహ్మపుత్రిక. రతి యందు ప్రీతి కలది, చక్కని విశాలమగు నేత్రములు కలది యగు మోహినిని చూచి పుత్రుడు దగ్గరలో నున్నందున సిగ్గు పడుచు మోహినితో ఇట్లు పలికెను:
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున ఉత్తర భాగమున మోహినీ వచనమను పదునేడవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page