Sri Naradapuranam-3    Chapters    Last Page

అష్టాదశోధ్యాయః = పదునెనిమిదవ అధ్యయము

మాతృ సన్మానమ్‌

రాజో వాచ:-


నాధికారో మయా భీరు కృతో నృప పరిగ్రహే | శ్రమాతురస్య నిద్రా మే ప్రవృత్తా సుఖదాయినీ || 1 ||
ధర్మాంగతం సమాభాష్య మోహినీం నయ మందిరమ్‌ | పూజయస్వ యధాన్యాయ మేషా పత్నీ ప్రియా మమ || 2 ||
నిజం కమల పత్రాక్ష సర్వరత్న విభూషితమ్‌ | నిర్వాత వాత సంయుక్తం సర్వర్తు సుఖదాయకమ్‌ || 3 ||
ఏవమాదిశ్య తనయ మహం నిద్రాముపాగతః | శయనం ప్రాప్య కష్టా త్తే అభాగ్యో హి ధనం యధా || 4 ||
విబుద్ధమాత్ర స్సహసా త్వత్సమీపము పాగతః | యద్ర్బవీషి వచో దేవి | తత్కరోమి న సంశయః || 5 ||
రాజు పలికెను : -
ఓ భయశీలా ? నేను రాజరికమును గ్రహించుటకు ప్రయత్నము చేయుటలేదు. శ్రమచే అలసిన నాకు ఆనందమును కలిగించు నిద్ర వచ్చినది. మోహినిని సర్వరత్న విభూషితము, తగినంతగాలి వెలుతురు కల, అన్ని ఋతువుల అనుభూతిని కలిగించు నీ మందిరమునకు తోడ్కొని పొమ్ము. ఈమె నాకు అత్యంత ప్రియమగు భార్య. కావున యధావిధిగా పూజించుము. అని పుత్రుని ఆదేశించి నేను శయ్యను చేరి దరిద్రుడు ధనమును పొందినట్లుగా, ఏ ప్రయత్నము లేకనే నిద్రను పొందితిని. మెలకువ రాగానే నీ వద్దకు వచ్చుచున్నాను. నీవెట్లు చెప్పిన అట్లే చేసెదను. అని పలికెను.
మోహిన్యువాచ: -
పరిసాన్త్వయ రాజేన్ద్ర ! ఇమాన్దారాన్సు దుఃఖితాన్‌ | మమోద్వాహేన నిర్వణ్ణా న్నిరాశాన్కామభోగయోః || 6 ||
జ్యేష్ఠానాం రూపయుక్తానాం కులత్రాణాం విశాంపతే | మూర్ద్ని కీలం కనిష్ఠాఖ్యం యో హి రాజన్ని ఖానయేత్‌ || 7 ||
న సద్గతి ర్భవేత్తస్య న చ సా విందతే పరమ్‌ | పతివ్రతాశ్రుదగ్థాయాః కా శాంతిర్మే భవిష్యతి || 8 ||
జనితారం హి మే భస్మ కుర్యేర్దేవ్యః పతివ్రతాః | కిం పునం ప్రాకృతం భూప త్వాదృశం మాదృశీం తధా || 9 ||
సంధ్యావలీ సమా నారీ త్రైలోక్యే నాస్తి భూమిప | తవస్నేహనిబద్దాంగీ సంభోజయతి షడ్రసైః || 10 ||
ప్రియాణి చాటు వాక్యాని వదతీ తవ గౌరవాత్‌ | ఏవం విధాహి శతశో నార్య స్సన్తి గృహే తవ || 11 ||
యాసాం న పాదర జసా తుల్యాహం భూపతే క్వచిత్‌ | మోహినీ వచనం శ్రుత్వా వ్రీడితో హ్య భవన్నృపః || 12 ||
సపుత్రాయా స్సమీపే తు జ్యేష్ఠాయా నృపతి స్తదా | ఇంగిత జ్ఞ స్సుతో జ్ఞాత్వా దశావస్ధాగతం నృపమ్‌ || 13 ||
పితరం కామ సంతప్తం మోహిన్య ర్థే విమోహితమ్‌ | మాతౄస్సర్వా స్సమాహూయ సంధ్యావలి పురోగమాః || 14 ||
కృతాంజలి పుటో భూత్వా ఏవమాహ ప్రియం వచః| విమోహినీ మే జననీ నవోఢా బ్రహ్మణ స్సుతా || 15 ||
సా చ ప్రార్థయతే దేవ్యో రాజనం రహసి స్థితమ్‌ | ఆత్మనా సహ ఖేలార్థం తన్మో దధ్వం సహర్షితాః || 16 ||
మోహిని పలికెను : -
ఓ రాజేన్ద్రా ! నన్ను వివాహ మాడినందు వలన దుఃఖితులై కామభోగములందు నిరాశ##లైన నీ భార్యలను మొదట ఓదార్చుము. ఓ రాజా రూపవతులగు పెద్ద భార్యల శిరమున చిన్న భార్య యనెడు మొలను నాటిన వాడు సద్గతిని పొదజాలడు. ఆనందమును పొందజాలడు. పతివ్రతల కన్నీటితో దహించబడు నాకు శాంతియెట్లు కలుగును? పతివ్రతా స్త్రీలు నన్ను పుట్టించిన బ్రహ్మను కూడ భస్మము చేయగలరు. ఇక సామాన్యులైన మన విషయమున ఏమి చెప్పవలయును. ఓ రాజా? సంధ్యావలి వంటి స్త్రీ ఈ మూడు లోకములలో లేదు. నీ మీది ప్రేమతో నన్ను షడ్రసములతో భుజింప చేసెను. నీ మీది గౌరవముతో నాతో ప్రియముగా మితముగా మాటలాడుచున్నది. ఇటువంటి పతివ్రతలు వందల మంది నీ ఇంటిలో కలరు. నేను వారి కాలి దుమ్ముతో సరికా జాలను. అంతట రుక్మాంగద మహారాజు మోహని మాటలను విని బిడియ పడెను. పుత్రునితోనున్న పెద్ద భార్యయగు సంధ్యావలిని చూచి మరి కొంత సంకోచించెను. అంతట ఇంగితము నెరిగిన ధర్మాంగదుడు తండ్రి దశావస్థలను పొందుట, కామ సంతప్తుడగుట, మోహిని యందు మోహము కలిగి యుండుట తెలిసి సంధ్యావలి మొదలగు తల్లులందరిని పిలిచి చేతులు జోడించి ఇట్లు పలికెను. తల్లులార? నా తల్లియగు మోహిని కొత్తగా పెళ్ళి యాడినది. బ్రహ్మపుత్రిక. ఆమె తనతో క్రీడించుటకు రాజును రహస్యముగా ఉండవలయునని కోరుచున్నది. కావున మీరు సంతోషముతో ఆమోదించుడు.
మాతర ఊచుః :-
కో ను మోదయతే పుత్ర! సర్వ భక్షణ మాత్మనః | కోహి దీపయతే వహ్నిం స్వదేహే దేహినాం వర ! || 17 ||
కో భక్షయే ద్విషం ఘోరం కశ్ఛిన్ద్యా దాత్మన శ్శిరః | కస్తరేత్సాగరం బద్ద్వా గ్రీవాయాం దారుణాం శిలామ్‌ || 18 ||
కోగచ్చే ద్ద్వీపి వదనం కఃకేశాన్సు హరే ర్హరేత్‌ | కో నిషీదతి ధారాయాం ఖడ్గస్యా కాశ భాసినః || 19 ||
కాను మోదయతే భర్త్రా సపత్న్యాః క్రీడనం కిల | సర్వస్యాపి ప్రదానేన నైతన్మనసి వర్తతే || 20 ||
వరం హి ఛేదనం మూర్థ్న స్తత్‌క్షణాత్తు వరాసినా | కా దృష్ట్యా దయితం కాన్తం నిరేక్షేదన్యయా దృతమ్‌ || 21 ||
కాసా సీమంతినీ లోకే భ##వేదేతా దృశీ క్వచిత్‌ | ఆత్మ ప్రాణ సమం కాంత మన్య స్త్రీకుచ పీడనమ్‌ || 22 ||
సంశ్రుత్య సహతే యాతు కింపునస్స్వేన చక్షుషా | సర్వేషా మేవదుఃఖానాం దుఃఖమేత దనన్తకమ్‌ || 23 ||
యద్భర్తాన్యాంగ నాసక్తో దృశ్యతే స్వేన చక్షుషా | వరం సర్వా మృతాః పుత్ర యుగపన్మాతర స్తవ || 24 ||

న తు మోహిని సంయుక్తో దృశ్యో
యం నృపతిః పతిః |
తల్లులు పలికిరి: -
ఓ పుత్రా ! తనను సంపూర్ణముగా భక్షించుటకు ఎవరు అంగీకరింతురు? తన దేహమున తామే అగ్నిని ఎవరు వెలిగింతురు? ఘోరమగు విషయమునెవరు భక్షించెదరు? తన శిరమును తానుగా ఎవరు ఖండించు కొందురు. మెడకు పెద్ద శిలను కట్టుకొని ఎవరు సముద్రమును దాటగరు? పులినోటిలోనికి ఎవరు ప్రవేశించెదరు. సింహము కేశముల నెవ్వరు లాగెదరు? ఆకాశమున ప్రకాశించు ఖడ్గము అంచుపై ఎవరు కూర్చుందురు? అట్లే తమ భర్త సవతితో క్రీడించుటకు ఏ స్త్రీ ఆమెదించును? అన్నిటిని ఈయవచ్చును కాని భర్తను ఈయజాలము. దీనికన్నా ఖడ్గముతో శిరము ఛేదించుకొనుటమేలు. మరొక స్త్రీచే ఆదరించబడిన ప్రియుడగు భర్తను ఏ యువతి ప్రేమతో చూడజాలదు. తన ప్రాణసముడగు భర్త అన్యస్త్రీ కుచపీడనమును చేయుటకు ఏ స్త్రీ అంగీకరించ జాలదు. ఈ విషయమును వినియే సహించజాలదు. ఇక కంటితో ఎట్లు చూడగలదు? తన భర్త పర స్త్రీ యందు అసక్తుడగుటను తన కంటితో చూచుటయే అన్ని దుఃఖములలో గొప్ప దుఃఖము. ఈ దుఃఖమున కంటే నీ తల్లులందరూ ఒకేసారి చనిపోవుట మేలు. అంతే కాని మా భర్త మోహినితో కలిసి యుండగా చూడజాలము.
ధర్మాంగద ఉవాచ: -
యది మేహి పితు స్సౌఖ్యం కరిష్యథ శుభాననాః || 25 ||
విషమాలోడ్య పాస్యామి యుష్మత్సౌఖ్యం మృతే మయి | కర్మణా మనసా వాచా యా పితుర్ధుఃఖ మాచరేత్‌ || 26 ||
సా మే శత్రు ర్వధార్హాస్తి యది సంధ్యావలీ భ##వేత్‌ | సర్వాసాం సాధికా దేవీ మోహినీ జనక ప్రియా || 27 ||
క్రీడార్ధ మాగతా బాలా మందరా చలమందిరాత్‌ | తత్పుత్ర వచనం శ్రుత్వా వేపమానా హి మాతరః || 28 ||
ఊచు స్స గద్గదాం వాచం హితార్థం తనయస్య హి | అవశ్యం తవ వాక్యం హి కర్తవ్యం న్యాయ సంయుతమ్‌ || 29 ||
కింతు దానప్రదో భూత్వా మోహినీం యా తు తే పితా | యో భార్యా ముద్వహేద్భర్తా ద్వితీయా మపరా మపి || 30 ||
జ్యేష్ఠా యై ద్విగుణం తస్యా దద్యా చ్ఛైవాన్యధా ఋణీ | అను జ్ఞాప్య యదా భర్తా జ్యేష్ఠా మన్యాం సముద్వహేత్‌ || 31 ||
తదా జ్యేష్ఠా భిలషితం దేయ మాహుః పురావిదః | జ్యేష్ఠయా సహితః కుర్యా దిష్టా పూర్తం నరోత్తమః || 32 ||

ఏష ధర్మో
న్యధా న్యాయో జాయతే ధర్మ సంక్షయః | శ్రుత్వా తు మాతృవచనం ప్రహృష్టే నాన్త రాత్మనా || 33 ||
ఏకైక సై#్య దదౌ సాగ్రాం కోటిం కోటిం సుతస్తదా | సహస్రం నగరాణాంచ గ్రామాణాం ప్రదదౌ తధా || 34 ||
చతురశ్వ తరీభిశ్చ పృధగ్యుక్తా నృపాత్మజాః | ఏకైకసై#్య దదావష్టౌ రధాన్కాంచన మాలినః || 35 ||
వాససా మయుతం ప్రాదా ద్యేషాం మూల్యం శతాధికమ్‌ | శుద్దస్య మేరు జాతస్య అక్షయస్య నృపాత్మజః || 36 ||
కాంచనస్య దదౌ లక్ష మేకైకం ప్రతి మాతరమ్‌ | దాసానాం చ శతం సాగ్రం దాసీనాం చ నృపాత్మజః || 37 ||
ధేనూనాం ఘట దోగ్ద్రీణా మేకైకసై#్య తధాయుతమ్‌ | యుగంధరాణాం భద్రాణాం శతాని దశ వై పృధక్‌ || 38 ||
దశప్రకారం నృపతే ధాన్యంచ ప్రదదౌ సుతః | వాటీనాంతు సహస్రాణాం శతం ప్రాదాద్ధ సన్నివ || 39 ||
కుంభీయుతం సర్పిషస్తు తైలస్య చ పృధగ్దదౌ | అజావిక మసంఖ్యాత మేకైకసై#్య న్యవేదయత్‌ || 40 ||
సహస్రేణ సహస్రేణ సువర్ణస్య వ్యభూషయత్‌ | ఆఖండ లాస్త్రయుక్తస్య భూషణస్య సుభక్తిమాన్‌ || 41 ||
ధాత్రీ ప్రమాణౖ ర్హారైశ్చ మౌక్తి కైర్దీప్తి సంయుతైః | ప్రదదౌ సంహతా న్కృత్వా వలయా న్పంచ సప్తచ || 42 ||
పంచాశచ్చ శ##తే ద్వే తు మౌక్తి కాని మహీపతే | సంధ్యావల్యాం స్థితానీహ శీతాంశు ప్రతిమాని చ || 43 ||
ఏకైకసై#్య దదౌ పుత్రో హారయుగ్నం మనోహరమ్‌ | కుంకుమం చందనం భూరి కర్పూరం ప్రస్థ సంఖ్యయా || 44 ||
కస్తూరికాం తధా తాభ్యో భూయసీం ప్రదదౌ సుతః | మాతౄణా మవిశేషేణ పితు స్సుఖమభీప్సయన్‌ || 45 ||
భోజనాని విచిత్రాణి జలపాత్రాణ్య నేకశః | ఘృత క్షీరస్య పాత్రాణి పేయస్య వివిధస్య చ 46 ||
చతుర్దశ శతం ప్రాదా త్సహస్రేణ సమన్వితమ్‌ | స్థాలీనాం కాంచనీనాం హి స కుంభానాం నృపాత్మజః || 47 ||
ఏకైకసై#్య దదౌ భూప శతాని త్రీణి పంచ చ | కరేణూనాం సవేగానాం మాంస విక్రాంత కంధరామ్‌ || 48 ||
వింశతిం వింశతిం ప్రాదా దుష్ట్రీణాం చ శతం శతమ్‌ | శిబికానాం సవేషాణాం పుంసాం పీవరగామినామ్‌ || 49 ||
ప్రదదౌ దశ సప్తా శ్వా న్మాతౄణాం సుఖయాయినః | ఏవం దత్వా బహుధనం బహ్వీభ్యో నృప నన్దనః || 50 ||
ధన్యో ధనపతి ప్రఖ్య శ్చక్రే తాసాం ప్రదక్షిణాః | కృతాంజలి పుటో భూత్వా ఇదం వచన మబ్రవీత్‌ || 51 ||
మమోపరోధాత్ర్పణతస్య మూర్ధ్నా పతిం సముద్దిశ్య యధా భవత్యః |
బ్రువంతు సర్వాః పితరం మమాద్య సై#్వరేణ సంభుంక్ష్వ నరేశ మోహినీమ్‌ || 52 ||
న చాస్మదీయా భవతా కీలేర్ష్వా స్వల్పాపి కార్యా మనసి ప్రతీతా |
విమోహినీం బ్రహ్మసుతాం సుశీలాం రమస్వ సౌఖ్యేన రహశ్శతాని || 53 ||
తత్పుత్ర వాక్యం హి ని శమ్య సర్వా స్సంహృష్ట లోమ్న్యో నృప నాధ మూచుః
స్వభుదుహిత్రా సుచిరం రమస్వ విదేహ పుత్య్రేవ రఘు ప్రవీరః || 54 ||

న శల్య భూతా కుశ##కేతు పుత్రీ త్వత్సంగమా ద్విద్ధి న సంశయో
త్ర|
పుత్రౌజసా దుఃఖ విముక్త భావా త్సమీరితం వాక్యమిదం ప్రతీహి || 55 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే మాతృసన్మానం నామ అష్టాదశో
ధ్యాయః ధర్మాంగదుడు పలికెను: -
ఓ తల్లులారా? మీరు నా తండ్రికి సౌఖ్యమును కలిగించనిచో విషమును బాగా కలిపి త్రాగ గలను. నేను మరణించిన తరువాత మీరు ఆనందించుడు. నా తండ్రికి కర్మచే కాని, మనసుచే కాని, వాక్కుచే కాని దుఃఖమును కలిగించు వారు సంధ్యావలీ దేవి అయిననూ నాకు వధించదగిన శత్రువే యగును. మీ అందరిలో నా తండ్రికి మోహిని ఎక్కువగా ప్రియమైనది. చిన్న వయసులో నున్నది. నా తండ్రితో క్రీడించుటకు మందర పర్వత శిఖరము నుండి వచ్చియున్నది. ఇట్లు పలికిన ధర్మాంగదుని మాటలు వినిన తల్లులందరూ భయముచే కంపించుచు తనయుని హితమును కోరి డగ్గుత్తికతో ఇట్లు పలకిరి. పుత్రా ! నీ మాటను న్యాయ సమత్మము కావున తప్పక పాటించ వలయును. కాని మాకు తగిన విధముగా సంపదలనిచ్చి నీ తండ్రి మోహినితో క్రీడించవచ్చును. భర్త ఒక భార్య యుండగా రెండవ దానిని పెళ్ళి యాడినచో పెద్ద భార్య రెండు రెట్లు సంపదల నీయవలయును. లేనిచో ఋణగ్రస్తుడగును. పెద్ద భార్య అనుమతిని పొంది మరొక యువతిని పెళ్ళి యాడినచో పెద్ద భార్య రెండు రెట్లు సంపదల నీయవలయును. లేనిచో ఋణగ్రస్తుడగును. పెద్ద భార్య అనుమతిని పొంది మరొక యువతిని వివాహమాడినచో పెద్ద భార్య కోరినదానిని ఈయవలయునని పెద్దలు చెప్పెదరు. ఇష్టా పూర్తములను మాత్రము తల్లుల మాటలను విని సంతోషము నిండిన మనసుతో ఒక్కొక్క తల్లికి కోటి కోటిని సువర్ణములను సహస్ర నగరములను, గ్రామములను ప్రదానము చేసేను. నాలుగశ్వములతో కూర్చిన ఎనిమిది రధములను కాంచనమాలలు కలవాటినిచ్చెను. శతాధిక మూల్యము గల పదివేల వస్త్రములను ఇచ్చెను. పరిశుద్దము, మేరు పర్వత సంజాతము, అక్షయము అగు లక్షబంగారు ముద్రలను ఒక్కొక్క తల్లికిచ్చెను. నూరుమంది దాసులను, నూరుమంది దాసీ జనమును అర్పించెను. కుంభము నిండపాలు నిచ్చెడు పదివేల ఆవులను ఒక్కొక్కరి కిచ్చెను. యుగంధర గజములన వేయి ఒక్కొక్కరికిచ్చెను. పది విధముగు ధాన్యములను ఇచ్చెను. లక్ష వాటులను నూనే కుండలను, నేతికుండలను ఇచ్చెను. సంఖ్యలేని మేకల నిచ్చెను. వేల కొలది స్వర్ణ భూషణముల నిచ్చెను. వజ్రములు పొదిగిన భూషణములను దానము చేసెను. ప్రకాశవంతములగు ధాత్రీ ప్రమాణములైన హారములను, అయిదు ఏడు చొప్పున కంకణములను ఇచ్చెను. చంద్రునివలే ప్రకాశవంతములైన రెండు వందల యాభై ముత్యములు కల రెండు హారములను ఒక్కొక్కరి కిచ్చెను. ప్రస్థ సంఖ్యతో కుంకుమను, చందనమును, కస్తూరిని ఎక్కువగా ఇచ్చెను. తండ్రి సుఖమును కోరి తల్లులందరికి భేద దృష్టిని విడిచి భోజన పాత్రలను, జలపాత్రలను, ఘృతక్షీర పాత్రలను, వివిధ పాన పాత్రులను వేలకొలది పదునాలుగు వందలను ఇచ్చెను. కాంచన స్థాలులను కుంభములతో ఎనిమిది వందలు ఇచ్చెను. బాగుగా బలిష్టములగు ఇరువది ఇరువది ఆడ ఏనుగులనిచ్చెను. వంద ఆడ ఒంటెల నిచ్చెను. బలిష్ఠులగు పురుషులచే మోయబడు పల్లకులను చాలా ఇచ్చెను. చాలా వేగము గల పదిఏడు అశ్వములను ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు తల్లులందరికి చాలా ధనములనిచ్చి ధన పతిసముడుగా ఖ్యాతి పొంది, ధన్యత నంది వారికి ప్రదక్షిణల నాచరించెను. చేతులు జోడించి ఇట్లు పలికెను. నేను శిరసు వంచి ప్రణామము నాచరించి ప్రార్థించితిని కావున మీరందరూ కలసి మా త్రండి గారితో యధేచ్ఛముగా మోహినిని అనుభవించుడు అని పలుకుడు. మా విషయమున మీరే మాత్రము సంకోచించ వలదు. మాకు ఈర్ష్య కొంచెము కూడ లేదు. సుశీల బ్రహ్మ సుతయగు మోహినిని రహస్యముగా చాలా కాలము ఆనందముగా రమించుము. అని చెప్పుడు. అట్లు ధర్మాంగదుని మాటలను విని తల్లులందరు ఆనందముతో పులకించి భర్తతో సీతాదేవితో రామచంద్రునివలె బ్రహ్మ పుత్రికతో చాలా కాలము రమించుము అని పలికిరి. నీ సంగమమును పొందు మోహిని మాకు ప్రతికూల కాదు. పుత్రుని తేజస్సుచే మా దుఃఖము తొలగి ఇట్లు చెప్పుచున్నాము అని పలికిరి.
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున ఉత్తరభాగమున మాతృ సన్మానమను పదునెనిమిదవ అధ్యయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page