Sri Naradapuranam-3    Chapters    Last Page

ద్వావింశోధ్యాయః = ఇరువదిరెండవ అధ్యాయము

కార్తిక మహాత్మ్యమ్‌

వసిష్ఠి ఉవాచ:-


ఏవం ధర్మాంగదో రాజ్యం చకార వసుధా తే | పితుర్ని యోగద్రాజేన్ద్ర పాలయన్హరివాసరమ్‌ || 1 ||
న బభూవ జనః కశ్చ ద్యోన ధర్మే వ్యవస్థితః | నాసుఖీ నా ప్రజః కశ్చి న్నవా కుష్ఠీ మహీపతే || 2 ||
హృష్ట పుష్ట జనే తస్మిన్‌ క్ష్మా చైవ నిధి దాయినీ | ఘట దోగ్ద్రీషు నృపతే తృప్త వత్సాసు ధేనుషు || 3 ||
పుటకే పుటకు క్షౌద్రం ద్రోణమాత్రు ద్రమే ద్రుమే | ప్రహృష్టా యాం తు మేదిన్యాం పర్వధాన్య సముద్భవః || 4 ||
కృతస్య స్పర్దిని యుదే త్రేతాన్తే ద్వాపరే యుగే | వ్యతీతే జలదాపాయే నిర్మలే చాంబరే గృహే || 5 ||
సుగంధి శాలి పక్వాఢ్యే కుంభో ద్రవ విలోకితే | మధ్య ప్రవాహ యుక్తాసు నిమ్నగాసు సమంతతః || 6 ||
తీరోత్తైః కాశపుషై#్పశ్చ శుక్లకే శైరివాంగనా | చంద్రాంశు ధవలే లోకే నాతి తీవ్రే ది వాకరే || 7 ||
తస్మిన్మునుష్య బహులై ర్జలస్నాన విచిత్రతైః | యాత్రోత్సుకైః ప్రయాతైస్తు భూమిపాలై స్సమంతతః || 8 ||
ప్రబోధ సమయే విష్ణో రాశ్వినాంతే జగద్గురోః | మోహినీ రమయామాస తత్కాలే హృచ్ఛయార్దితా || 9 ||
రాజానం వివిధై స్సౌఖ్యై స్సర్వ భావేన సుందరీ | వనేషు గిరి శృంగేషు నదీనాం సంగమేషు చ || 10 ||
పద్మినీ కుసుమాఢ్యేషు సరస్సు వివిధేషు చ | మలయే మందరే వింధ్యే మహేంద్రే విబుధాలయే || 11 ||
సహ్యే ప్రాలేయ సంజ్ఞేచ దిగంబర గిరౌ శుభే | అన్యేషు చైవ రాజానం స్వర్గ స్థానాదికేషు చ || 12 ||
రమయా మాస రాజేన్ద్ర దివ్యరూపా దినే దినే | రాజాపి మోహినీం ప్రాప్య సర్వం కృత్యం పరిత్యజన్‌ || 13 ||

త్యక్తం న వాసరం విష్ణోర్జన్మ మృత్యునికృంతకమ్‌ | వ్రతం నోపేక్షతే తత్తు అతి ముగ్ధో
పి పార్థివ || 14 ||
క్రీడాం త్య జతి భూపాలో దశమ్యాది దినత్రయే | ఏవం ప్రక్రీడత స్తస్య పూర్ణే సంవత్సరే గతే || 15 ||
కాలే కాల విదాం శ్రేష్ఠ స్సంప్రాప్తః కార్తిక శ్శుభః | నిద్రా ఛేదకరో విష్ణో స్సమాసః పుణ్య దాయకః || 16 ||
యస్మిన్కృతం హి సుకృతం వైష్ణవైర్మనుజై ర్నృప | అక్షయం హి భ##వేత్సర్వం విష్ణులోక ప్రదాయకమ్‌ || 17 ||
న కార్తిక సమో మాసో న కృతేన సమం యుగమ్‌ | న ధర్మస్తు దయాతుల్యో న జ్యోతిశ్చ క్షుషా సమమ్‌ || 18 ||
న వేదన సమం శాస్త్రం న తీర్థం గంగాయ సమమ్‌ | న భూమ్యా సదృశం దానం న సుఖం భార్యాయ సమమ్‌ || 19 ||

న కృష్యాతు సమం విత్తం నలాభ స్సురభీసమః | నతపో
న శానా దన్య న్నదమేన సమం శివమ్‌ || 20 ||
తృప్తిర్న రస నాతుల్యా న సమో
న్యో ద్విజేన చ | న ధర్మేణ సమం మిత్రం సత్యేన సమం యశః || 21 ||
నారోగ్య సమమైశ్వర్యం నదేవః కేవవాత్పరః | న కార్తిక సమం లోకే పానం కవయో విదుః || 22 ||
కార్తికః ప్రవరో మాసో విష్ణోశ్చాపి ప్రియస్సదా | అవ్రతో హి క్షిపేద్యస్తు మాసం దామోదర ప్రియమ్‌ || 23 ||
తిర్యగ్యోని మావాప్నోతి సర్వధర్మయ బహిష్కృతః || 24 ||
వసిష్ఠి మహర్షి పలికెను: -
ఇట్లు ధర్మాంగద మహారాజు తండ్రి ఆజ్ఞచే హరివాసరమును పాలించుచు రాజ్యమును చేయుచుండెను. ధర్మాంగదుని రాజ్యమున ధర్మమున నిలువని వాడొకడు కూడా లేకుండెను. సుఖము లేనవాడు కాని, సంతానము లేని వాడుకాని రోగికాని అతని రాజ్యమున లేకుండెను. ధర్మాంగదుని రాజ్యములోని ప్రజలందరూ సంతోషముతో నుండిరి. భూమి నిధులు నిచ్చుచుండెను. ఆవులు తన దూడలను తృప్తి పరిచి ఘటముల కొలది పాలనిచ్చుచుండెను. ప్రతి ఘలమున తేనె ద్రోణ మాత్రముగా ప్రతి వృక్షమున లభించుచెండెను. భూమి సంతోషముతో సర్వవిధ ధాన్యముల నిచ్చుచెండెను. త్రేతాంతమున ద్వాపర యుగమున కూడా కృత యుగముతో పోటీపడుచుండెను. వర్ష ఋతువు గడిచి ఆకాశము నిర్మలముగా నండెను. సుగంధము కలపైరులు పంటకొచ్చి ప్రకాశించుచుండెను. అంతటా నదులు మధ్యమ ప్రవాహములు కలిగి యుండెను. నదీ తీరములలో మొలచి పూచిన కాశపుష్పములచే తెల్లని వెంట్రుకలు గల స్త్రీవలె శోభించెను. లోకమంతయూ చంద్రకాంతవలె తెల్లనాయెను. దివాకరుడు ఎక్కువ తీవ్రముగా లేదు. ఆ సమయమున చాలా మంది ప్రజలు తీర్థ స్నానములను బయలు దేరిరి. అంతటా రాజులు విజయా యాత్రకు బలయుదేరిరి. ఆశ్వయుజ మాసాంతమున జగద్గురువగు శ్రీ మహా విష్ణువు యొక్క ప్రబోధ సమయమున మోహినీ దేవి కామ పీడితయై సర్వ భావముచే బాహు విధ సౌఖ్యములతో రుక్మాంగద మహారాజును రమింప చేసెను. వనములలో, పర్వత శిఖరములలో, నదీ సందమములలో పద్మములతో కూడియున్న సరస్సులలో, మలయ పర్వతమున, మందల పర్వతమున వింధ్యపర్వతమున, మహేన్ద్ర పర్వతమున, విబుధాలయమున, సహ్య పర్వతమున, హిమ వత్పర్వతమున, కైలాస పర్వతమున ఇతర పర్వత ప్రాంతములందు, స్వర్గ స్థానాదులలో దివ్య రూపము గల మోహిని ప్రతి దినము రాజును రమింప చేసెను. రుక్మాంగద మహారాజు కూడా మోహినిని పొంది అన్ని పనులను వదిలెను. కాని ఒక ఏకాదశీ వ్రతమును మాత్రమును ఉపేక్షించలేదు. దశమి నుండి మూడు దినలములు రాజు మోహినతో క్రీడించుట ఆపివేయును. ఇట్లు రుక్మాంగదుడు క్రీడించు చుండగా సంవత్సరము గడిచినది. అంతట కాలజ్ఞులకు శ్రేష్టము శుభప్రదమగు కార్తిక మాసము వచ్చినది. శ్రీ మహా విష్ణువునకు నిద్రను తొలగించునది కావున కార్తిక మాసము పుణ్యదాయకము. ఈ మాసమున విష్ణు భక్తులగు మానవులు చేయు సుకృత మంతయూ అక్షయ మగును. విష్ణులోక ప్రదాయక మగును. కార్తిక మాసముతో సమానమగు మాసము లేదు. కృతయుగముతో సమానమగు యుగము లేదు. దయా తుల్యమగు ధర్మము లేదు. కంటితో సమమగు వెలుగులేదు. వేద సమమగు శాస్త్రము, గంగా సమమగు తీర్థము, భూదాన సదృశమగు దానము, భార్యా సమమగు సుఖము, కృషి సమమగు ధనము కామధేనువు వంటి లాభము, ఉపవాసము కంటే వేరు తపము, అంతరింద్రియ నిగ్రము వంటి శుభము, జిహ్వ వలన పొందు తృప్తి, బ్రాహ్మణ సముడు, ధర్మముతో సమమగు మిత్రుడు, సత్యములతో సాటివచ్చు యశము, ఆరోగ్యముతో సమానమగు ఐశ్వర్యము, కేశవుని మించిన దైవము, కార్తికముతో సమానమగు పావనమైనది ఈ లోకమున ఇంకొకటి లేదు. కార్తికము చాల ఉత్తమమగు మాసము. విష్ణువులనకు కూడా ప్రియమగు మాసము. దామోదర ప్రియమగు కార్తిక మాసమును వ్రతరహితముగా గడిపిన వాడు సర్వధర్మ బహిష్కృతుడై పశువుగా జన్మించును.
మాంధాతో వాచ :-
సంప్పాప్య కార్తికే మాసే రాజా రుక్మాంగదో మునే | మోహినీం మోహ సంయుక్తాం కథం స బుభుజే వద || 25 ||
విష్ణు భక్త శ్శ్రుతి పరఃః ప్రవర స్స మహీక్షితామ్‌ | తస్మిన్పుణ్యతమే మాసే కిం చకార నృపోత్తమః || 26 ||
మాంధాత పలికెను : -
రుక్మాందగ మహరాజు కార్తిక మాసము రాగానే మోహముతో నున్న మోహినిని ఎట్లను భవించెను? విష్ణుభక్తుడు, శ్రుతిపరుడు, రాజులలో ఉత్తముడు, పుణ్యతమమగు కార్తిక మాసమున ఏమి చేసెను?
వసిష్ఠ ఉవాచ:-
సంప్రాప్తం కార్తికం దృష్ట్వా ప్రబోధకరణం హరేః | అతి ప్రముగ్దో రాజేన్ద్రో మోహినీం వాక్యమ బ్రవీత్‌ || 27 ||
రతం దేవి త్వయా సార్థం మయా సంవత్సరాన్బహూన్‌ | తవాపమాన భీతేన నోక్తం కించిదపి క్వచిత్‌ || 28 ||

సాంప్రతం వక్తు కామో
హం తన్నిభోధ శుభాననే | త్వయ్యా సక్తస్య మే దేవి! బహవః కార్తికా గతాః || 29 ||
న వ్రతీ కార్తికే జాతో ముక్వైకం హరి వాసరమ్‌ | సో
హం కార్తిక మిచ్ఛామి వ్రతేన పర్యుపాసితుమ్‌ || 30 ||
అవ్రతేన గతో యేషాం కార్తికో మర్త్య ధర్మిణామ్‌ | ఇష్టా పూర్తో వృధా తేసాం ధర్మో ద్రుహిణ సంభ##వే ! || 31 ||

మాంసా శినో
పి భూపాలా అత్యర్థం మృగయా రతాః | తే మాంసం కార్తికే త్యక్త్వా గతా విష్ణ్వాలయం శుభే || 32 ||
ప్రవృత్తా నాం హి భక్ష్యాణాం కార్తికే నియమే కృతే | అవశ్యం విష్ణు రూపత్వం ప్రాప్యతే సాధకేన హి || 33 ||
తిష్ఠన్తు బహువిత్తాని దానాని వరవర్ణిని ! | హృదయాయాస కర్తౄణి దీప దానద్ధివం వ్రజేత్‌ || 34 ||
తస్యాప్య భావత్సుభ##గే పరదీప ప్రబోధనమ్‌ | కర్తవ్యం భక్తి భావేన సర్వదానాధికం చ తత్‌ || 35 ||
ఏకత స్సర్వ దానాని దీపదానం హి చైకతః | కార్తికేన సమం ప్రోక్తం దీపదాన త్ప్రబోధనమ్‌ || 36 ||
కర్తవ్యం భక్తి భావేన సర్వదానధాకం స్మృతమ్‌ | కార్తికీం చ తిధిం కృత్వా విష్ణోర్నాభి సరోరుహే ||37 ||
ఆ జన్మ కృత పాపాత్తు ముచ్చతే నాత్ర సంశయః | వ్రతోప వాస నియమైః కార్తికో యస్య గచ్ఛతి || 38 ||
దేవో వైమానకో భూత్వా స యాతి పరమాం గతిమ్‌ | తస్మాన్మోహిని మోహం త్వం పరిత్యజ్మ మమో పరి || 39 ||
ఆజ్ఞాం విధేహి తత్కాలం కరిష్యే కార్తిక వ్రతమ్‌| తవ వక్షోజ పూజయా విరతో నీర జేక్షణ || 40 ||
అహం వ్రత ధరశ్చైవ భవిష్యే హరి పూజనే|
వసిష్ఠ మహర్షి పలికెను: -
హరిని మేల్కొల్పు కార్తిక మాసము వచ్చుట చూచిన ముగ్ధుడగు రాజేన్ద్రుడు మోహినితో ఇట్లు పలికెను. ఓ దేవి! నీతో చాలా సంవత్సరములు రమించితిని. నీ కవమానము కలుగునను భయముచే నేనేమియు అనలేదు కాని. ఇపుడు చెప్పదలుచుకున్నాను. తెలియుము. నీతో కలియున్న నాకు చాలా సంవత్సరములు చాలా కార్తికములు గడిచినవి. ఒక ఏకాదశీవ్రతము తప్ర కార్తిక మాసము వ్రత రహితముగా గడిచినది. కావున ఈ కార్తికమును వ్రతములో సేవించదలుచుకున్నాను. కార్తికమును వ్రత రహితముగా గడిపిన మానవులు ఆచరించు ఇష్టా పూర్త ధర్మముల కూడా వ్యర్థములు. వేట యందాసక్తి గల, మాంస భుజులగు రాజులు కూడా కార్తిక మాసమున మాంసమును విడి విష్ణులోకమును చేరిరి. సామాన్యముగా భుజించు వాటిని కార్తిక మాసమునవిడిచినచో విష్ణు రూపమును పొందెదరు. ఎంత ధనమున్ననూ, హృదయమునకు ఆయాసమును కలిగించు దానములెన్ని యున్ననూ కార్తిక మాసమున దీప దానముతో సర్గమును పొందును. ఆ దీపదానము చేయలేనివాడైనచో భక్తి భావముతో పరుల దీపమును వెలిగించవలయును. ఇట్లు పరదీప ప్రబోధనము సర్వదానధికమని జ్ఞానులు చెప్పుచున్నారు. అన్ని దానములు ఒకవైపు, దీపదానము మరియొక వైపుంచినచో దీపదానము సర్వశ్రేష్ఠము. కార్తీక మాసముతో సమానమగునది, దీప దానమున కంటె ఉత్తమగునది. పరదీప ప్రభోధనము. కావున భక్తి భావముచే పరదీప ప్రబోధనమును గావించిన సర్వదానాధిక ఫలమును పొందును. శ్రీ విష్ణు నాభి సరోరుహము నందు కార్తిక తిధిని గావించి జన్మ నుండి చేసిన అన్ని పాపముల నుండి విముక్తి పొందును. ఈ విషయమున సంశయముతో పనిలేదు. కార్తిక మాసమున వ్రతోపవాస నియమములతో గడుపువాడు దేవ విమానముచే ఉత్తమగతిని పొందును. కావు ఓ మోహినీ ! నీవు నా యందు మోహమును విడిచి వెంటనే నాకు అనుజ్ఞనొసగుము. కార్తిక వ్రతము నాచరించెదను. ఓ పంకజాక్షీ ! నీ స్తనముల పూజను విరమించి వ్రతధరుడనై శ్రీ హరిని పూజించెదను.
మోహిమ్యవాచ:-
విస్తరేణ సమాఖ్యాహి మహాత్మ్యం కార్తికస్యచ || 41 ||

సర్వపుణ్యాకరః ప్రోక్తో మాసో
యం రాజ సత్తమ | విశేషాత్కుత్ర కధిత స్తదాదిశ మహామతే || 42 ||
శ్రుత్వా కార్తిక మాహాత్మ్యం కరిష్యే
హం యధేప్సితమ్‌ || 43 ||
మోహిని పలికెను:-
ఓ రాజా సత్తమా? ఈ కార్తిక మాసము సర్వపుణ్యకరమని చెప్పితిని కదా? కావున కార్తిక మాస మాహాత్మ్యమును సవిస్తరముగా తెలుపుము. ఈ కార్తిక మాస వ్రతము, మహాత్మ్యము విశేషముగా ఎక్కడ చెప్పబడినదో చెప్పుము. కార్తిక మహాత్మ్యమును విని నా ఇష్ట ప్రకారముగా నాచరింతును.
రుక్మాంగద ఉవాచ:-
మాహాత్మ్య మభిధాస్యామి మాసస్యాస్య వరాననే | యేన భక్తిర్భవిత్రీ తే ప్రకర్తుం హరి పూజనమ్‌ || 44 ||

కార్తికే కృచ్ఛ్రపేవీ యః ప్రాజాపత్య చరో
పివా | ఏకరాత్రోపవాసీ వా త్రిరాత్రో పోషితోపి వా || 45 ||
యద్వాదశాహం పక్షం వా మాసం వా వరవర్ణిని | క్షపయిత్వా నరో యాతి స విష్ణోః పరమం పదమ్‌ || 46 ||
ఏక భుక్తేన నక్తేన తధైవాయాచితేన చ | అస్మిన్నరైర్దరాచైవ ప్రాప్యతే ద్వీప మాలినీ || 47 ||

విశేషా త్పుష్కరే తీర్థే ద్వారా వత్యాం చ సౌకరే | మసో
యం భక్తిదః ప్రోక్తో వ్రతదానార్చనాదిభిః || 48 ||
తస్మిన్హరిదినం పుణ్యం తధా వై భీష్మ పంచకమ్‌ | ప్రబోధినీం నరః కృత్వా జాగరేన సమన్వితామ్‌ || 49 ||
నమాతుర్జఠరే తిష్ఠే దపి పాపాన్వితో నరః | తస్మిన్దినే వరారోహే మండలం యస్తు పశ్యతి || 50 ||
వివా సాం ఖ్యేన యోగేన స యాతి పరమం పదమ్‌ | కార్తికే మండలం దృష్ట్వా సౌకరే స్సూకరం శుభే || 51 ||
దృష్ట్వా కోక వరాహం వా న భూయస్తనయో భ##వేత్‌ | త్రి విధస్యాపి పాపస్య దృష్ట్వా ముక్తిర్భవేన్నృణామ్‌ || 52 ||
మండలం చపలాపాంగి! శ్రీధరం కుబ్జకే తధా| కార్తికే వర్జయేన తైలం కార్తికే వర్జయేన్మధు || 53 ||
కార్తికే వర్జయే న్మాంపం కార్తికే వర్జయే త్త్బ్రియః | నిష్పావా న్కార్తికే దేవి! సంత్యజే ద్విష్ణు తత్పురః || 54 ||
సంవత్సర కృతాత్పాపా ద్బహిర్భవతి తత్‌క్షణాత్‌ | ప్రాప్నోతి రాజీకీం యోనిం సకృద్భక్షణ సంభావాత్‌ || 55 ||
కార్తికే సౌకరం మాంసం యస్తు భుంజీత దుర్మతిః | పుష్ఠి వర్ష సాహస్రాణి రౌరవే పరిపచ్యతే || 56 ||
తమ్మక్తో జాయతే పాపీ విష్ఠా శ్రీ గ్రామ్య సూకరః | మాత్స్యం మాంసం న భుంజీత న కౌర్మం నాపి హారిణమ్‌ || 57 ||
చాండాలో జాయతే దేవి ! కార్తికే మాంస భక్షణాత్‌ | కార్తిక స్వర్వ పాపఘ్నః కించి ద్వ్రత ధరస్య హి || 58 ||
కార్తికే తు కృతా దీక్షా వృణాం జన్మనికృంతనీ | తస్మాత్సరన్వ ప్రయత్నేన దీక్షాం కుర్వీత కార్తికే || 59 ||
అదీక్షితస్య వామోరు కృతం సర్వం నిరర్ధకమ్‌ | పశుయోని మవాప్నోతి దీక్షయా రహితో నరః || 60 ||
న గృహే కార్తికం కుర్యా ద్విశేషేణ తు కార్తికమ్‌ | తీర్థే హి కార్తికీం కుర్వ న్నరో యాతి హరేః పదమ్‌ || 61 ||
కార్తికే శుక్ల పక్షస్య కృత్వా హ్యే కాదశీం నరః | ప్రాతర్దత్వా శుభాన్కుంభా న్ప్రయాంతి హరి మందిరమ్‌ || 62 ||
సంవత్సర వ్రతానాం హి సమాప్తిః కార్తికం స్మృతా | వివాహా యత్ర దృశ్యంతే విష్ణోర్నాభి సరోరుహే || 63 ||
దినాని తత్ర చత్వారి యధైకం వర వర్ణిని | వినోత్తరాయణ కాలం లగ్న శుద్దిం వినాపి చ || 64 ||
దృశ్యంతే యత్ర సంబాన్దాః పుత్ర పౌత్ర వివర్ధనాః | తస్మాన్మోహిని కర్తాస్మి కార్తికే వ్రతసేవనమ్‌ || 65 ||
అశేష పాప నాశాయ తవ ప్రీతి వివృద్దయే |
రుక్మాంగద మమారాజు పలికెను: -
ఓ సుందరముఖీ ! కార్తిక మాస మహాత్మ్యమును తెలిపెదను. అపుడు నీకు శ్రీహరిని పూజించుటలో భక్తి కలుగును. కార్తీక మాసమున కృచ్ఛవ్రతము నాచరించువాడు, లేదా ప్రాజాపత్యము నాచరించువాడు, ఏకాంతరోపవాసమును చేయువాడు త్రిరాత్రములు పవసించువాడు, దశాహము కాని పక్షముకాని, మాసముకాని ఉపవాసముతో గడుపువాడు శ్రీ హరి యొక్క పరమ పదమును పొందును ఏక భుక్తము నాచరించుటచే అనగా రాత్రి మాత్రమే భోజనము చేయువాడు అయాచిత వ్రతము నాచరించువాడు కూడా శ్రీ హరి పదమును పొందును. ఈ మాసమున భూమియందు దీపమాలను చేయువాడు, విశేషించి పుష్కర తీర్థమున కాని, ద్వారవతి యందుకాని, వారాహ క్షేత్రమున కాని ఆచరించుట పరమ పదమును ప్రసాదించును. ఈ కార్తిక మాసము వ్రత దానార్చనాదులచే విశేషభక్తి ప్రదము. ఈ కార్తిమున ఏకదశి మరీ పుణ్య ప్రదము. భీష్మ పంచకము విశేష ఫల ప్రదము, జాగరణతో ఈ మాసమున ఏకాదశీ వ్రతము నాచరించువాడు ఎంత పాపము నాచరించిన వాడైననూ, మరల తల్లి కడుపులో నుండడు. ఈ ఏకాదశినాడు సాంఖ్య యోగము లేకనే మండలమును చూడగలవాడు పరమ పదమును పొందును. కార్తిక మాసమున మండలమును చూచి, లేదా వరహ క్షేత్రమున వరాహ స్వామిని దర్శించి, తేదా కోక వరాహమును దర్శించి, మరల జన్మ పొందడు. కాయిక వాచిక మానసిక పాపముల నుండి విముక్తుడగును. కుబ్జ క్షేత్రమున శ్రీధర మండలమును దర్శించవలయును. కార్తిక మాసమున తైలమును, తేనెను, మాంసమును, స్త్రీలను పరిత్యజించవలయును. విష్ణుతత్పరుడు కార్తిక మాసమున నిష్పావములను పరిత్యజించవలయును. ఇట్లు చేసినచో సంవత్సరకాలమున చేసిన పాపముల నుండి విముక్తుడగును. పొరబాటున ఒకమారు భుజించినచో రాజవంశమున పుట్టును. కార్తిక మాసమున సూకర మాంసమును భుజించువాడు అరువది వేల సంవత్సరములు రౌరవ నరకమున పాకము గావించడును. అటనుండి వెలువడి మలమును భుజించు గ్రామ సూకరిముగా పుట్టును. కార్తిక మాసమున మాంసమును భుజించిన వాడు చండాలునిగా పుట్టును. కొద్ది వ్రతమును స్వీకరించిననూ కార్తిక మాసము సర్వపాపములను నశింప చేయును. కార్తిక మాసమున వ్రతమును స్వీకరించినవానికి మరన జన్మయుండదు. కావున సర్వవిధ ప్రయత్నములచే కార్తిక మాసమున వ్రతమును స్వీకరించవలయును. వ్రతమును స్వీకరించనివాడు చేయునదంతయూ వ్యర్థమగును. కార్తిక మాసమున దీక్షను స్వీకరించని వాడు పశువుగా పుట్టును. కార్తిక మాస వ్రతమును గృహమున ఆచరించరాదు. కార్తికీతిధిని విశేషించి ఆచరించరాదు. తీర్థమున కార్తకీతిధిని ఆచరించినవాడు శ్రీహరి పదమును చేరును. కార్తిక శుక్ల ఏకాదశినాడు వ్రతము నాచరించి, ద్వాదశి ప్రాతః కాలమున శుభకరములగు కలశములను దానము గావించి, శ్రీహరి మందిరమును చేరును. సంవత్సర కాలము వ్రతముల నాచరించువారికి కూడా సమాప్తి చేయవలసిన కాలము కార్తికమాసమని చెప్పియుండిరి. శ్రీహరి నాభిసరోరుహము నందు, ఈ మాసమున అయిదు దినములు వివాహమునకు ప్రశస్తముల, ఉత్తరాయణ కాలముకాకున్ననూ, లగ్న శుద్ది లేకున్ననూ, వివాహములు జరిగినచో పుత్రపౌత్ర ప్రవర్థకమలు. కావున ఓ మోహినీ ! కార్తక మాసమున అశేష పాపనాశము కొరకు నీకు ప్రీతి పెరుగుట కొరకు వ్రతమును స్వీకరించెదను.
మోహిన్యు వాచ:-
అహా! మాహాత్మ్య మతులం కార్తికస్య త్వయేరితమ్‌ || 66 ||
చాతుర్మాస్య వ్రతానాం హి విధి ముద్యాపనం వద | పూర్ణతా యేవ భవతి వ్రతానాం పృధివీపతే || 67 ||
అవైకల్యం భ##వేచ్చైవ వ్రతం పుణ్యఫలస్య చ |
మోహినీ దేవి పలికెను : -
సాటిలేకి కార్తిక మాహాత్మ్యమును తెలిపితిని. అటులే చాతుర్మాస్య వ్రత విధిని ఉద్యాపనను కూడా తెలుపుము. ఓ రాజా? వ్రతములు ఏ విధానముచే పరిపూర్ణములగును. ఏ విధనముచే వ్రతము యొక్క పుణ్య ఫలము వ్యర్థము కాదో ఆ విధానమును కూడా తెలుపుము.
రాజోవాచ: -
నక్తవ్రతీ షడ్రసేన బ్రాహ్మణం భోజయే త్ప్రియే || 68 ||
అయాచితే త్వనడ్వాహం సహిరణ్యం ప్రదాపయేత్‌ | అ మాంసాశీ భ##వేద్యస్తు గాం ప్రదద్యాత్ప దక్షిణామ్‌ || 69 ||
ధాత్రీ స్నానే నరో దద్యా ద్దధి పాయసమే వచ | ఫలనాం నియమే సుభ్రు ఫలదానం సమాచరేత్‌ || 70 ||
తైలత్యాగే ఘృతం దద్యా ద్ఘృతం త్యాగే పయస్తధా | ధాన్యానాం నియమే శాలీం స్తత్తద్దాన్య మధాపినా || 71 ||
దద్యా ద్భూశయనే శయ్యాం తూలికా గండకాన్వితామ్‌ | పత్ర భోజీ నరోదద్యా ద్భాజనం ఘృత సంయుతమ్‌ || 72 ||
మౌనే ఘంటాం తిలాన్యాపి సహిరణ్యా న్ప్రదాపయేత్‌| దంపత్యో ర్భోజనం కార్య ముభయో శ్శయనాన్వితమ్‌ || 73 ||
సంభోగం దక్షిణోతపేతం వ్రతస్య పరిపూర్తయే | ప్రాతస్స్నానే హయం దద్యా న్నిస్స్నేహే ఘృత సక్తుకాన్‌ || 74 ||
నఖరాణాం చ కేశానాం ధారణ దర్పణం దదేత్‌ | ఉపానహౌ ప్రదద్యాత్తు పాదత్రాణ వివర్జనే || 75 ||
లవణస్య తు సంత్యాగే దాతవ్యా సురభిస్తధా | అమిషస్య పరిత్యాగే సవత్సాం కపిలాం దదేత్‌ || 76 ||

నిత్యం దీప ప్రదోయస్తు వ్రతే
೭೭ భీష్ట సురాలయే | సకాంచనం తధా తామ్రం సఘృతం దీపకం ప్రియే || 77 ||
ప్రదద్యా ద్వాససా ఛత్రం వైష్ణవే వ్రత పూర్తయే | ఏకాంతరోపవాసీతు క్షౌమం వస్త్రం ప్రదాపయేత్‌ || 78 ||
త్రిరాత్రే కాంచనోపేతం దద్యాచ్ఛయ్యాం స్వలం కృతమ్‌ | షడ్రాత్రా ద్యుప వాసేషు శిబికాం ఛత్ర సంయుతామ్‌ || 79 ||
సవాహ పురుషం మీనం అనడ్వాహ మధార్పయేత్‌ | అజావికం త్వేక భుక్తే ఫలాహరే సువర్ణకమ్‌ || 80 ||

శాకాహారే పలం దద్యా త్సౌవర్ణం ఘృత సంయుతమ్‌ | రసానాం చైవ సర్వేషాం త్యాగో
నక్తస్య వాపిచ || 81 ||
దాతవ్యం రాజతం పాత్ర సౌవర్ణం వాపి శక్తితః | యధోక్త స్యా ప్రదానేతు యధోక్త కరణ
పి నా || 82 ||
ప్రియవాక్యం చరేత్సుభ్రు విష్ణుస్మరణ పూర్వకమ్‌ | వృధా విప్రవచో యస్తు మన్యతే మనుజ శ్శుభే || 83 ||
దక్షిణాం నైవ దద్యాద్వా స యాతి నరకే ధ్రువమ్‌ | వ్రతవైకల్య మాసాద్య కుష్ఠీ చాంధః ప్రజాయతే || 84 ||
ధరా మరాణాం వచనే వ్యవస్థితా దివౌక సస్తీర్థగణా మఖాశ్చ |

కో లంఘయే త్సుభ్ర వచో హి తేషాం శ్రేయో
భికామో మనుజస్తు విద్వాన్‌ || 85 ||
ఇదం మయా ధర్మ రహస్య యుక్తం విరించయే శ్రీపతినా యదుక్తం |
ప్రకాశితం తుభ్య మనన్య వాచ్యం ఫలం ప్రదం మాధవ తుష్టి హేతుమ్‌ || 86 ||

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తర బాగే కార్తిక మాహాత్మ్యం నామ ద్వావింశో
ధ్యాయః
రుక్మాంగద మహారాజు పలికెను: -
ఓ ప్రియురాలా? ఏక భుక్తము చేయుచు రాత్రి భోజనము చేయువారు బ్రాహ్మణుని షడ్రసములచే భుజింప చేయవలయును. అయాచిత వ్రతము నాచరించినవారు బంగారుముతో వృషభమును దానము చేయవలయును. మాంసాహారమును త్యజించిన వారు దక్షిణతో గోదానమును గావించవలయును. ధాత్రీస్నాన వత్రమయు నాచరించిన వారు దధిపాయసములను దానము గావించవలయును. ఫలనియము వాచరించు వారు ఫలదానమును గావించవలయును. తైలమును త్యజించినవారు ఘృతమును, ఘృతమును త్యజించినవారు పాలను దానము చేయవలయును. ధాన్యమును పరిత్యజించినవారు శాలి దానమును కాని వదిలిన ధ్యానమును కాని దానము చేయవయలును. భూశయనము నాచరించినవారు తూలికా గండకాన్వితముగా శయ్యాదానమును చేయవలయును. పత్ర భోజన వ్రతము నాచరించినవారు ఘృత సహితమగు భోజన పాత్రను దానమును చేయవలయును. మౌన వ్రతము నాచరించినవాడు బంగారముతో ఘంటనుకాని తిలలను కాని దానము చేయవలయును. దంపతులను భుజింపచేసి ఇద్దరికి శయ్యను సకలభోగములతో దక్షిణతో వ్రత పరిపూర్తికి దానము గావించవలయును. ప్రాతస్న్సాన వ్రతముల నాచరించినవారు అశ్వాదానమును, స్నేహ వ్రతము నాచరించిన వారు ఘృతసక్తులను దానమును చేయవలయును. నఖములను కేశములను ధరించినవాడు దర్పణ దానమునుచేయవలయును. పాదరక్షలను త్యజించినవారు పాదత్రాణములనే దానమును చేయవలయును. లవణ త్యాగము చేసినవారు గోదానమును చేయవలయును. మాంసమును త్యజించినవారు దూడతోపాటు కపిలా దానమును చేయవలయును. చేయవలయును. మాంసమును త్యజించినవాడు దూడతోపాటు కలిలా దానమును. నిత్య దీప దాన వత్రము నాచరించినవాడు అభీష్ట వ్రత పరిపూర్తి కొరకు కాంచన దీప పాత్రనుకాని, తామ్ర దీప పాత్రను కాని ఘృత సహితముగా దీప దానమును చేయవలయును. వస్త్రమును ఛత్రమును కూడా శ్రీహరి భక్తునకు దానము చేయవలయును. ఏకాంతరోపవాస వ్రతము వాచరించినవారు క్షౌమ వస్త్రము దానము చేయవలయును. త్రిరాత్ర వ్రతము నాచరించినవారు కాంచన సహితముగా సాలంకృత శయ్యా దానమును చేయవలయును. షడ్రాతోపవాస వ్రతము నాచరించినవారు ఛత్ర సహితమగు శిబికను (పల్లకిని) వాహ పరుషులతో పాటు మీనమును వృషభమును దానమును చేయవలయును. ఏకభుక్త వ్రతమునారించినవారు అజావికాది దానములను చేయవలయును. ఫలహార వ్రతము నాచరించినవారు సువర్ణదానమును చేయవలయును. శాకాహార వ్రతము నాచరించినవారు సువర్ణ సహితముగా ఘృత దానమును చేయవలయును. సర్వరత్యాగమును చేసినవారు, చెప్పని వాటిన త్యజించిన వారు కూడా తమ శక్తి కొలది రజిత పాత్రను కాని, సువర్ణపాత్రను కాని దానము చేయవలయును. యధోక్త విధిగా దానమును చేయనివారు, యధోక్త విధి నాచరించని వారు కూడా విష్ణుస్మరణ పూర్వకముగా ప్రియ వాక్యములను పలకవలయును. బ్రాహ్మణ వాక్యములను వ్యర్థమని భావించువారు. దక్షినా దానము చేయని వారు కూడా నరకమును పొందెదరు. వ్రతలోపమును పొంది కుష్టురోగిగా కాని అంధునిగా కాని పుట్టును. బ్రాహ్మణుల వాక్యములలోనే దేవతలు పుణ్యతీర్థములు, యజ్ఞములు నిలిచియున్నవి. కావున విద్వాంసుడెవ్వడు బ్రాహ్మణ వాక్యమును లంఘించ జాలడు. శ్రేయస్కాముడు కూడా అతిక్రమిచంజాలడు. పూర్వకాలము శ్రీ హరి బ్రహ్మకు తెలిపిన పరమ రహస్యయుతమగు ఈ వ్రత విధానమును నీకు తెలిపితిని. ఈ విధానమును నీకు తెలిపితిని. ఈ విధనమును అందరికీ తెలుపరాదు. ఈ వ్రతము ఫల ప్రతము. శ్రీ హరి సంతోషకారణము.
ఇది శ్రీ బృహన్నరదీయ మహాపురాణమున ఉత్తరభాగమున కార్తిక మహాత్మ్యమును ఇరువది రెండవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page