Sri Naradapuranam-3    Chapters    Last Page

త్రయోవింశోధ్యాయః = ఇరువది మూడవ అధ్యాయము

రుక్మాంగద సంలాపః

మోహిన్యువాచ :-


వాక్యముక్తం త్వయా సాధు కార్తికే యదుపోషణమ్‌ | వ్రతాది కరణం రాజ్ఞాం నోక్తం క్వాపి నిదర్శనే || 1 ||
ముక్త్వైకం బ్రాహ్మణం లోకే నోక్తం శూద్ర విశోరపి | దానం హి పాలనం యుద్ధం తృతీయం భూభుజాం స్మృతమ్‌ || 2 ||
న వ్రతం హి త్వయా కార్యం యది మామిచ్చసి ప్రియామ్‌ | ముహూర్త మపి రాజేన్ద్ర శక్నోమి త్వయా వినా || 3 ||
స్థాతుం కమల గర్భాభ కింపునర్మాస సంఖ్యయా | యత్రోపవాస కరణం మన్యసే వసుధాధిప || 4 ||
తత్ర వై భోజనం దేయం విప్రాణాం చ మహాత్మనామ్‌ | అధవా జ్యేష్ఠ పత్నీ యా సా కరోతు వ్రతాదికమ్‌ || 5 ||
ఏవ ముక్తేతు వచనే మోహిన్యా రుక్మభూషణః | ఆజుహావ ప్రియాం భార్యాం నామ్నా సంధ్యావలీం శుభామ్‌ || 6 ||
ఆహూతా తత్‌క్షణా త్ర్పాప్తా రాజానం భూరి దక్షిణమ్‌ | ఆసీనం శయనే దివ్యే మోహినీ బాహు సంవృతమ్‌ || 7 ||
సంఘుష్టం హి కు చాగ్రేణ స్వర్ణకుంభ నిభేన హి | శయనే వామనేత్రాయాః సకామాయా మహీపతే || 8 ||
కృతాంజలి పుటా భూత్వా భర్తుర్నమిత కంధరా | సంధ్యావలీ ప్రాహ నృపం కిమాహూతా కరోమ్యహమ్‌ || 9 ||
తవ వాక్యే స్థితా కాంత ! దుస్సాపత్న్య వివర్జితా | యధా యధా హి రమసే మోహిన్యా సహ భూపతే || 10 ||
తధా తధా మమ ప్రీతి ర్వర్ధతే నాత్ర సంశయః | భర్తు స్సౌఖ్యేన యా నారీ దుఃఖయుక్తా ప్రజాయతే || 11 ||
సాతు శ్యేనీ భ##వేద్రాజన్‌ త్రీణి వర్షాణీ పంచ చ | ఆజ్ఞాం మే దేహి రాజేన్ద్ర! మా వ్రీడాం కామికాం కురు || 12 ||
మోహిని పలికెను :-
ఓ రాజా! కార్తిక మాసమున ఉపవాసమును గురించి చక్కగా చెప్పితిరి. కాని రాజులకు వ్రతాచరణము విధించబడినట్లు ఎక్కడా నిదర్శనము కానరాదు. వ్రతాచరణము బ్రాహ్మణులకు తప్ప శూద్రవైశ్యులకు కూడా విధించబడలేదు. రాజులకు దానము, ప్రజాపాలనము, యుద్ధము అను మూడు కర్మలు విధించబడియున్నవి. కావున నా మీద నీకు కోరిక యున్నచో నీవు వ్రతమును చేయరాదు. నీవు లేనిదే ఒక ముహూర్తకాలము కూడా నిలువ జాలను. ఇక ఒక నెల ఎట్లుండగలను? ఉపవాసమును చేయదలచిన సమయమున బ్రాహ్మణులకు భోజనమునిమ్ము. లేదా నీ పెద్ద భార్యయగు సంధ్యావలీ దేవి ఈ వ్రతమును ఆచరించనిమ్ము. మోహిని ఇట్లు పలుకగా రుక్మాంగద మహారాజు సంధ్యావలీ దేవిని పిలిచెను. సంధ్యావలీ దేవి భర్త పిలుపు నందుకొని వెంటనే రాజును చేరెను. మోహినీ దేవి బాహు పంజరములో నుండి మోహినీ స్తనాగ్రా ఘర్ణణతో సకామయగు మోహినీ శయ్యపై నున్న భర్తను చూచి తలవంచుకొని చేతులు జోడించి రుక్మాంగద మహారాజుతో నన్నెందుకు పలిపించితిరి? నేనేమి చేయవలయును? నాధా! నేను సవతిమీద ఈర్ష్యను వదలియున్నాను. నీ మాటను పాటించెదను. నీవు మోహినీదేవిచే రమించుచున్న విధానముతో సమముగా నీయందు నీకు ప్రీతి కలుగుచున్నది. భర్త సుఖించుచున్నపుడు దుఃఖించు భార్య ఎనిమిది సంవత్సరములు డేగగా నుండును. నన్ను ఆజ్ఞాపించుము. కాముకత్వముతో బిడియపడుకుము.
రుక్మాంగద ఉవాచ :-
జానామి తన శీలంతు కులం జానామి భామిని ! | తవ వాక్యేన హి చిరం మోహినీ రమితా మయా || 13 ||
రమమాణస్య సుచిరం బహవః కార్తికా గతాః | ప్రియా సౌఖ్యేన ముగ్థస్య నగతో హరి వానరః || 14 ||

సో
హం తృప్తి మనుప్రాప్తః కామ భోగాత్పునః పునః | జ్ఞాతోయం కార్తికో మాస స్సర్వ పాప క్షయంకరః || 15 ||
కర్తుకామో వ్రతం దేవి! కార్తికాఖ్యం సుపుణ్యదమ్‌ | ఇయం వారయతే మాం చ వ్రతాద్బ్రహ్మ సుతా శుభే || 16 ||
అస్యా న విప్రియం కార్యం సర్వధా వరవర్ణిని ! మామకం వ్రత మాధత్స్వ కృచ్ఛ్రాఖ్యం కాయ శోషకమ్‌ || 17 ||
సా చైవ ముక్తా నవహేమ వర్ణా భర్త్రా తధా పీన పయోధరాంగీ |
ఉవాచ వాక్యం ద్విజరాజవక్త్రా వ్రతం చరిష్యే తవ తుష్టి హేతుః || 18 ||
యే నైవ కీర్తిస్తు యశో భ##వేచ్చ తధైవ సౌఖ్యం తవ కీర్తియుక్తమ్‌ |
కరోమి సౌఖ్యం నరదేవ నాథ | క్షిపామి దేహం జ్వలనే త్వదర్ధమ్‌ || 19 ||
అకార్యమేతన్నహి భూమిపాల వాక్యేన తే హన్మి సుతం స్వకీయమ్‌ |
కింత్వేవమే తద్ర్వత కర్మ భూయః కరోమి సౌమ్యం నరదేవ నాథ || 20 ||
ఇత్యేవ ముక్త్వా రవిపుత్ర శత్రుం ప్రణమ్య తం చారు విశాల నేత్రా |
వ్రతం చకా రాథ తధా హి దేవీ హ్యశేష పాపౌఘ వినాశనాయ || 21 ||
వ్రతే ప్రవృత్తే వరకృచ్ఛ్ర సంజ్ఞే ప్రియాకృతే హర్షమవాప రాజా|
ఉవాచ వాక్యం కుశ##కేతు పుత్రీం కృతం వచస్సుభ్రు సమీహితం తే || 22 ||
రమస్వ కామం మయి సన్నివిష్ట సంపూర్ణ వాంఛా కరభోరు హృష్టా |
విముక్త కార్యస్తవ సుభ్రు హేతో ర్నాన్యాస్తి నారీ మమసౌఖ్యహేతుః || 23 ||
సాత్వేవముక్తా నిజనాయకేన ప్రహర్ష మభ్యేత్య జగాద భూపమ్‌|
జ్ఞాత్వా భవన్తం బహుకామ యుక్తం త్రివిష్ట పాన్నాధ సమాగతాహామ్‌ || 24 ||
త్యక్తా మరా నైత్యగణాంశ్చ సర్వా న్గంధర్వ యక్షోరగ రాక్షసాంశ్చ |
సందృశ్య మానాన్మ మ నాథహేతోః స్నేహాన్వితాహం తవ మందరాధ్రౌ || 25 ||
ఏతత్కామఫలం లోకే యద్ద్వయోరేకచిత్తతా | అన్యచేతఃకృతఃకామ శ్శవయోరివ సంగమః
|| 26 ||
సఫలం హి వపుర్మేద్య సఫలం రూపమేవ హి | త్వయా కామవతా కాంత! దుర్లభం యజ్జగత్త్రయే || 27 ||
ప్రోన్నతాభ్యాం కుచాభ్యాం హి కామినో హృదయం యది | సంశ్లిష్టం న హి శీర్యేత మన్యే వజ్రసమం దృఢమ్‌ || 28 ||
తదేవ చామృతం లోకే యత్పురంధ్ర్యధరాసవమ్‌ | కుచాబ్యాం హృదాలీనాభ్యాం ముఖేన పరిపీయతే || 29 ||
ఏవముక్త్వా పరిష్వజ్య రాజానం రహసి స్థితమ్‌ | రమయామాస తన్వంగీ వాత్స్యాయనవిధానతః || 30 ||
తస్యేవం రమమాణస్య మోహిన్యా సహితస్య వై | రుక్మాంగదస్య కర్ణాభ్యాం పటహధ్వనిరాగతః || 31 ||
మత్తేభకుంభసంస్థస్తు ధర్మాంగదనిదేశతః | ప్రాతర్హరిదినం లోకా స్తిష్ఠధ్వంత్వేకభోజనాః || 32 ||
అక్షారాలవణాస్సర్వే హవిష్యాన్ననిషేవిణః | అవనీతల్పశయనాః ప్రియాసంగవివర్జితాః || 33 ||
స్మరధ్వం దేవదేవేశం పురాణం పురుషోత్తమమ్‌ | సకృద్భోజనసంయుక్తా ఉపవాసం కరిష్యధ || 34 ||
అకృతశ్రాద్ధనిచాయా ఆప్రాప్తాః పిండమేవచ | గయామగతపుత్రాశ్చ గచ్ఛధ్వంశ్రీహరేఃపదమ్‌ || 35 ||
ఏషా కార్తికశుక్లా వై హరేన్నిద్రావ్యపోహినీ | ప్రాతరేకాదశీ ప్రాప్తా మాకృధా భోజనం క్వచిత్‌
|| 36 ||
బ్రహ్మహత్యాది పాపాని కామకార కృతాని చ | తాని యాస్యంతి సర్వాణి ఉపోష్యేమాం ప్రభోధినీమ్‌ || 37 ||
ప్రబోధయే ద్దర్మపరా న్న్యాయాచార సమన్వితాన్‌ | హరేః ప్రబోధమాదత్తే తేనైషా బోధినీ స్మృతా || 38 ||
స కృచ్చోపేషితాం చేమాం నిద్రాచ్ఛేదకరీం హరేః | తనయో న భ##వేన్మర్త్యో న గర్భే జాయతే పునః || 39 ||
కురుధ్వం చక్రిణః పూజాం ఆత్మవిత్తేన మానవాః | వసై#్త్రః పుషై#్పర్దూప దీపై ర్వర చందన కుంకుమైః || 40 ||

సుహృద్యైశ్చ ఫలైర్గందై ర్యజధ్వం శ్రీహరేః పదమ్‌ | యో నకుర్యాద్వ చో మే
7ద్య ధర్మ్యం విష్ణుగతి ప్రదమ్‌ || 41 ||
సుహృద్యైశ్చ వధ్యశ్చ నిర్వాస్యో విషయాద్ద్రువమ్‌ | ఏవం విధే వాద్యమానే పటహే మేఘ నిస్స్వనే || 42 ||
హస్తాదముంచ త్తాంబూలం సకర్పూరం నృపోత్తమః మోహినీ కుచయోర్లగ్నం హృదయం స వికృష్య వై || 43 ||
ఉదతిష్ఠన్మహీపాల శ్శయ్యాయాం రతి వర్ధనః | మోహినీ మోహకామార్తాం సాంత్వయన్‌ శ్లక్షణ యా గిరా || 44 ||

దేవి! పాత్రర్హరిదినం భవిష్యత్యఘనాశనమ్‌ | సంయతో
7హం భవిష్యామి క్షమ్యతాం క్షమ్యతామితి || 45 ||
తవాజ్ఞయా మయా కృచ్ఛ్రం సంధ్యావల్యాతు కారితమ్‌ | ఇయమే కాదశీ కార్య ప్రబోధ కరణీ మయా || 46 ||
అశేష పాప బంధస్య ఛేదినీ గతి దాయినీ | త్రయాణా మపి లోకానాం మహోత్సవ విధాయినీ || 47 ||

తస్మాద్ధవిష్యం భోక్ష్యే
హం నియతో మత్తగామిని ! | మయా సహ విశాలాక్షి ! త్వం చాపి తమధోక్షజమ్‌ || 48 ||
ఆరాధయ హృషీకేశ ముపవాస పరాయణా | యే యాస్యసి నిర్వాణం దాహ ప్రలయ వర్జితమ్‌ || 49 ||
రుక్మాంగద మహారాజు పలికెను :-
ఓ ప్రియురాలా? నాకు నీ స్వభావము బాగుగా తెలియును. నేను నీ మాటతోనే చాలాకాలము మోహినితో రమించితిని. మోహినితో రమించుచుండగా చాలా కార్తిక మాసములు ప్రియాసౌఖ్యమోహములో గడిచినవి. ఒక్క హరివాసరమును మాత్రము విడువలేదు. ఇపుడునేను కామ భోగములతో తృప్తిని చెందితిని. సర్వపాప నాశకమగు కార్తికమాసము వచ్చినదని తెలుసుకొంటిని. పరమ పుణ్యప్రదమగు కార్తిక వ్రతము నాచరించదలచితిని. కాని ఈ బ్రహ్మసుతయగు మోహిని వ్రతము నుండి నన్ను వారించుచున్నది. ఎట్టి పరిస్థితులలోను ఈమెను బాధించరాదు. కావున కాయమును శుష్కింపచేయు. నేను చేయదలచిన కృచ్ఛ్రవ్రతమును నీవు ఆచరించుము. కొత్త బంగారము కాంతిగల, పీన పయోధరములు కల సంధ్యావలి భర్త మాటను విని సంతోషముచే పూర్ణచంద్రముఖియై నీ సంతోషము కొరకు వ్రతము నాచరించెదను. ఇటుల ఆచరించినచో కీర్తి యశము కలుగును. నీ కీర్తితో నాకానందము కలుగును. నీకానందమును కలిగించెదను. నీ కొఱకు నిప్పులో కూడా దూకుదును. అందులో ఇది చేయరాని కార్యము కూడా కాదు. నీ ఆజ్ఞతో కన్నకొడకును కూడా చంపెదను. ఇక ఇంత చక్కని వ్రతమునేల చేయను. తప్పక ఈ సద్వ్రతము నాచరించెదను. ఇట్లు విశాలనేత్రయగు సంధ్యావలీ దేవి యమ శత్రవగు రుక్మాంగద మహారాజుతో పలికి సకలపాప వినాశము కొఱకు వ్రతము నాచరించెను. ఇట్లు సంధ్యావలీదేవి వ్రతము నాచరించుటచే రుక్మాంగద మహారాజు సంతోషించెను. అపుడు బ్రహ్మపుత్రికయగు మోహినితో నీవు చెప్పినతట్లే చేసితిని అనెను. కావున నీవు సంతోషముతో నాయందు కలిగిన వాంఛపూర్తికై చక్కగా రమించుము. నీ సంతోషము కొఱకే నేను అన్ని పనులను వదలితిని. నా సౌఖ్యమునకు నీవు తప్ప మరోక స్త్రీ లేదు. రుక్మాంగద మహారాజు ఇట్లు పలుకగా సంతోషమును పొంది రాజుతో ఇట్లు పిలకెను. నీవు చాల కామముతో నున్న వాడవని తెలిసి నేను త్రివిష్టపము నుండి ఇటకు వచ్చితిని. దేవతలను, దైత్యులను, గంధర్వ యక్ష రాక్షస నాగులను నా కొరకు చూచువారి నందరిని విడిచి నీయందు ప్రీతితో మందరాద్రి యందు నిన్ను చేరితిని. లోకమున ప్రేయసీ ప్రియులిరువురు ఒకే మనసుతో నుండుటే కామఫలము. భేదాభిప్రాయములు గల వారి సంగమము శవముల సంగమము వంటిది. నా శరీరము, నా సౌందర్యము కాముకుడవగు నీచే సఫలమైనది. ఇట్లు మూడు లోకములలోను లభించదరు. ఉన్నతములగుస్తములతో ఆలింగనము చేసుకొనినపుడు ద్రవించని ప్రియుని హృదయము వజ్రమువలె కఠినమని తలచెదను. స్తనములు హృదయమున హత్తుకొని మదవతి అధరమును పానము చేయుటే ఈ లోకమున అమృతము. ఇట్లు పలికి ఏకాంతములో నున్న రాజును గాఢముగా ఆలింగనము చేసుకొని వాత్స్యాయన కామ శాస్త్రాను సారముగా రాజును రమింప చేసెను. ఇట్లు రుక్మాంగద మహారాజు మోహినితో రమించుచుండగా రాజు చెవులకు భేరిధ్వని వినిపించెను. ధర్మాంగద మహారాజుగారి ఆజ్ఞతో మత్తగజ కుంభస్థలముపై మ్రోగించు చుండెను. రేపు ఏకాదశి, కావున ఈ దినము ఏక భుక్తముగా నుండుడు. ఉప్పుకారములను విడిచి, హవిష్యమును భుజించుడు. భూమి మీద పరుండుడు. ప్రియా సంగమమును విడువుడు. పురాణ పురషోత్తముడగు శ్రీ మన్నారాయణుని స్మరించుడు. ఏక భుక్తముతో ఉపవాసము నాచరించుడు. ఇట్లు చేసినచో శ్రాద్ధమును చేయనివారు, పిండ ప్రదానమును చేయనివారు, గయకు వెళ్ళని పుత్రులు కలవారు కూడా శ్రీ హరి లోకమును వెళ్ళుడు. ఈ ఏకదశి కార్తిక శ్లు ఏకాదశి. శ్రీ హరిని నిద్ర నుండి మేల్కొల్పునది. ప్రాతః కాలమున ఏకాదశి వచ్చుచున్నది. భోజనమును చేయకుడు. ఈ ప్రబోధినిన ఉపవసించినచో బ్రహ్మహత్యాది పాపములు, కామ వశము చేసిన పాపములు అన్నియూ నశించును. ఈ ఏకాదశి ధర్మపరులను, న్యాయాచార యుక్తులను ప్రబోధింప చేయును. సాక్షాత్తుగా శ్రీహరినే ప్రబోధింప చేయును. కావుననే ఈ ఏకాదశి ప్రబోధిని యనబడును. శ్రీహరి నిద్రను తొలగించు ఈ ఏకాదశిన ఒకసారి ఉపసించిననూ మరలగర్భవాస దుఃఖమును అనుభవించడు. తమ తమ విభవాను సారముగా శ్రీహరిని పూజించుడు. వస్త్ర పుష్ప ధూప దీప చందన పుష్పములను, మధుర ఫలములను సమర్పించుడు. ఈ దినమున ధర్మకరము శ్రీ విష్ణులోక ప్రదమగు నా ఆజ్ఞను పాలించని వాడు దండించబడును. వధించబడును. ఈ దేశము నుండి బహిష్కరించబడును. ఇట్లు మేఘ గంభీరధ్వనిచే పటహము ధ్వనించుట వినిన రుక్మాంగద మహారాజు చేతినుండి కర్పూరముతో నున్న తాంబూలము జారిపడెను. మోహినీ దేవి స్తనములకు తగిలియున్న హృదయమును దూరముగా జరిపి రతి వర్ధనుడుగు మహారాజు శయ్య నుండి లేచెను. మోహకామార్తయగు మోహినీ దేవిని మధురమగు మాటలచే ఓదార్చుచు ఇట్లు పలికెను. ఓ దేవీ ! ఉదయము ఏకాదశి వచ్చుచున్నది. అది సర్వపాప నాశకము. నేను నియమ బద్ధుడనగుదును. క్షమింపుము. క్షమింపుము. క్షమింపుము. నీ యాజ్ఞతో నేను కృచ్ఛ్రవ్రతమును సంధ్యావలికి అప్పగించితిని. కాని ప్రబోధ కరణియగు ఏకాదశీ వ్రతమును నేనే ఆచరించవలయును. ఈ ఏకాదశి సమస్త సంసార బంధములను ఛేదించును. ఉత్తమగతిని ప్రసాదించును. కావున నియమపరుడనై నేను హవిష్యమును భుజించెదను. నాతో పాటు నీవు కూడా ఉపవాసము నాచరించి అధోక్షజుడు హృషీకేశుడగు శ్రీమన్నారాయణుని
ఆరాధించుము. ఇట్లు ఆచరించినచో దాహ ప్రలయ రహితమగు నిర్వాణమును పొందెదవు.
మోహిన్యువాచ : -

సాధూక్తం హి త్వయా రాజన్‌ ! పూజానం చక్రపాణినః | జన్మమృత్యుజరాఛేది కరిష్యే
హం తవాజ్ఞయా || 50 ||
ప్రతిజ్ఞా యా త్వయా పూర్వం కృతా మందర మస్తకే | కర ప్రదాన సహితా భవతా సుకృతాంకితా || 51 ||
తస్యాస్తు సమయ ప్రాప్తో దీయాతాం స హి మే త్వయా | జన్మ ప్రభృతి యత్పుణ్యం త్వయా యత్నేన సంచితమ్‌ || 52 ||
తత్సర్వం నశ్యతి క్షిప్రం న దదాసి వరం యది
మోహనీ దేవి పలికెను :-
ఓ రాజా? జన్మ మృత్యు జరాఛేదియగు చక్రపాణి పూజను చక్కగా బోధించితివి. నీ ఆజ్ఞచే నేను నాచరించెదను. కాని పూర్వము నీవు మందర పర్వత శిఖరమున దక్షిణకర ప్రదాన పూర్వకముగా నీసుకృతము పై శపథముతో ప్రతిజ్ఞచేసి యుంటివి. ఇపుడు ఆ సమయమొచ్చినది. ఇప్పుడు నేనడిగిన దానినిమ్ము. నేనడిగిన దానినీయనిచో నీవు పుట్టిన నాటి నుండి సంపాదించిన సమస్త పుణ్యము వెంటనే నశించును.
రుక్మాంగద ఉవాచ :-
ఏహి! చార్వంగి కర్తాస్మి యత్తే మనపి వర్తతే | నా దేయం విద్యతే కించిత్‌ తుభ్యం మే జీవితా వధి || 53 ||
కింపునర్గ్రామ విత్తాది ధరాయుక్తం చ భామిని !
రుక్మాంగద మహారాజు పలికెను :-
ఓ సుందరాంగీ ! రమ్ము. నీ మనసులోని మాటను చేయుదును. నా ప్రాణమును కూడా నీకిత్తును. నీకీయరానిదేది లేదు. ఇక గ్రామ ధన రాజ్యాదులెంతమాట!
మోహిన్యువాచ :-
నాథ ! కాస్త! విభో ! రాజన్‌ ! జీవితేశ ! రతిప్రియ ! || 54 ||

నోపోష్యం వాసరం విష్ణో ర్భోక్తవ్యా యద్యహం ప్రియా | న చతే
೭೭హం ప్రియా రాజన్‌ ! ముహూర్తమపి కామయే || 55 ||
త్వత్సంయోగం వినా భూతా భవిష్యామి వరం వినా | తస్మాన్నాం యది వాంఛేధా భోక్తుం సత్యపరాయణ || 56 ||
తదా త్యోజోపవాసం హి భుజ్యతాం హరివాసరే | ఏష ఏవ వరో దేయో యో మయా ప్రార్ధి తః పురా || 57 ||
న చేద్దాస్యసి రాజేన్ద్ర భూత్వానృతవచా భవాన్‌ | యాస్యతే నరకే ఘోరే యావదా భూత సంప్లవమ్‌ || 58 ||
రాజోవాచ :-
మైవం త్వం వద కళ్యాణి నేదంత్వ య్యుప పద్యతే | విధేశ్చ తనయా భూత్వా ధర్మ విఘ్నం కరోషి కిమ్‌ || 59 ||
జన్మ ప్రభృత్యహం నైవ భుక్త వాన్హరి వాసరే | స చాద్యహం కథం భోక్తా సంజాత పలితశ్శుభే || 60 ||
¸°వనాతీత మర్త్యస్య క్షీణంద్రియ బలస్యచ | స్వర్ణదీ సేవనం యుక్త మథవా హరి పూజనమ్‌ || 61 ||
న కృతం యన్మయా బాల్యే ! ¸°వనే న కృతం చ యత్‌ | తదహం క్షీణ వీర్యో
ద్య కథం కుర్యాం జుగుప్సితమ్‌ || 62 ||
ప్రసీద ! చపలాపాంగి! ప్రసీద వరవర్ణిని ! మా కురుష్వ వ్రతే భంగం దతాహం రాజ్య సంపదామ్‌ || 63 ||
అధవా నేచ్ఛసి త్వం త త్కరోమ్యన్య త్సులోచనే | ఆరోపయిత్వా శిబికాం విమాన ప్రతిమాం శుభామ్‌ || 64 ||
యత్రేచ్ఛసి నయిష్యామి పాదచారీ కలత్రయుక్‌ | యది తచ్చాపి నేచ్ఛేస్త్వం విమాన హి కృతం మయా || 65 ||
తర్హి స్వర్ణమ¸° స్తంభే కృత్వా విద్రుమ భూషితౌ | ముక్తా ఫలమయీం దోలాం కరిష్యే త్వ త్కృతే ప్రియే || 66 ||
తత్రత్వాం దోలయిష్యామి బహూన్మాసాన హర్నిశమ్‌ | వ్రత భంగం వరోరోహే మా కురుష్వ మమప్రియే || 67 ||
వరం శ్వపచమాంసం హి శ్వమాంసం వా వరాననే | ఆత్మనోవా నరై ర్భుక్తం యైర్భుక్తం హరివాసరే || 68 ||
త్రైలోక్యఘాతినః పాపం మైధునే శశినః క్షయే | నరస్య సంచరేత్పాపం భూతాయాం క్షార కర్మణి || 69 ||
భోజనే వాసరే విష్ణో సై#్తలే షష్ఠ్యాం వ్యవస్థితే | లవణతు తృతీయాయాం సప్తమ్యాం పిశితే శుభే || 70 ||
ఆజ్యేషు పౌర్ణమాస్యాం వై సురాయాం రవిసంక్రమే | గోచారస్య ప్రలోపే చ కూటసాక్ష్యప్రదాయకే || 71 ||
నిక్షేప హారకే వాపి కుమారీ విఘ్న కారకే | విశ్వస్త ఘాతకే చాపి మృతవత్సా ప్రదోగ్థరి || 72 ||
దదామీతి ద్విజాగ్య్రాయ ప్రతిశ్రుత్య నదాతరి | మణికూటే తులా కూటే కన్యానృత గవానృతే || 73 ||
తద్విద్వాం శ్చారునయనే ! కధం భోక్ష్యామి పాతకమ్‌ |
మోహినీ దేవి పలికెను :-
ఓ నాథా! ప్రియా? ప్రభో! రాజా? ప్రాణనాథ! రతిప్రియా! నన్ను అనుభవించదలచినచో నీవు ఏకాదశినాడు ఉపవసించరాదు. ఉపవసించినచో నేను నీకు ప్రియురాలను కాను. నేను నీ సంయోగము లేనిదే ఒక ముహూర్తము కూడా ఉండలేదు ఉండలేను. కావున నన్ను అనుభవించు కోరిక కలదేని ఏకాదశీ ఉపవాసమును త్యజించుము. ఏకాదశినాడు భుజించుము. నాకీయవలసిన వరమిదియే. దీనినే నేను పూర్వము కోరితిని. నీవు అసత్యపరుడవై నాకీ వరము నీయనిచో ప్రళయకాలము వరకు ఘోరమగు నరకమున నుందువు.
రాజు పలికెను :-
ఓ కళ్యాణీ ! నీవిట్లు పలుకకుము. ఇది నీకు తగదు. బ్రహ్మ పుత్రికవై ధర్మ విఘ్నమును చేతువా? నా పుట్టుక నుండి నేను ఏకాదశి నాడు భుజించలేదు. ఇక ఇపుడు పండిన తల కలవాడనై ఎట్లు భుజింతును? ¸°వనము తరిగి ఇంద్రియ బలము క్షీణించినవాడు గంగను సేవించుట, శ్రీహరిని పూజించుట ఉచితము. నేను బాల్యమున ¸°వనమున చేయని హీనకర్మను వార్ధక్యమును ఎట్లు చేతును? ఓ చపలా పాంగీ ! వర వర్ణినీ ! ప్రసన్నురాలవు. కమ్ము. వ్రతమును భంగ పరచకుము. నీకు నా రాజ్యమును సంపదల నిత్తును. ఇది వలదన్నచో మరొకటి ఇచ్చెదను. విమాన సమము శుభకరము అగు పల్లకిలో నిన్ను కూర్చుండబెట్టి నీవు చెప్పిన చోటికి భార్య యుక్తుడనై కొని పోదును. ఇది కూడా వద్దన్నచో పగడములు పొదిగిన బంగారు స్తంభములతో ఒక విమానమును నిర్మించి యుంటిని. ఆ విమానమున ఫలమయమగు ఊయల నేర్పరచి రాత్రింబవళ్ళు చాలా నెలలు ఆ ఊయలలో నిన్ను ఊపెదను. కావున నాకు ప్రియురాలవు కదా. వ్రత భంగమును చేయకుము. చండాల మాంసము కాని, శునక మాంసముకాని, తన మాంసము కాని ఏకాదశీ భోజనము కంటే మేలు. మూడు లోకములను సంహరించిన పాపము, అమావాస్యనాడు స్త్రీ సంగమ పాపము, షష్ఠీదినమున క్షురకర్మ పాపము ఏకాదశీ భోజనము వలన కలుగును. షష్ఠీ నాడు తైల భోజనము, తృతీయనాడు లవణ భోజనము సప్తమినాడు మాంస భోజనము, పూర్ణిమనాడు ఘృత భోజనము సూర్య సంక్రమణమున సురాపానము, గోచార లోపము, కపట సాక్ష్యము వలన కలుగు పాపము, నిక్షేపమును హరించుట వలన కలుగు పాపము, కన్యాత్వమును భంగపరిచిన పాపము, విశ్వాస ఘాతకునికి కలుగు పాపము, దూడ చనిపోయిన పశువునకు పాలు పితుకువాని పాపము, బ్రాహ్మణునకు ఇచ్చెదనని ప్రతిన చేసి ఈయని వాని పాపము, మణికూట పాపము, తులాకోటి పాపము, కన్యానృతము వలన కలుగు పాపము, గో అనృతము వలన కలుగు పాపము ఏకాదశీ భోజనము వలన కలుగును. కావున ఇవి అన్నియూ తెలిసిన నేను ఏకాదశి నాడు ఎట్లు భుజించగలను?
మోహిన్యువాచ :-
ఏక భుక్తేన నక్తేన తధైవాయా చితేన చ || 74 ||
ఉపవాసేన రాజేన్ధ్ర ! ద్వాదశీం న హి లంఘయేత్‌ | గుర్విణీనాం గృహస్థానాం క్షీణానాం రోగిణాం తధా || 75 ||
శిశూనాం వలిగాత్రాణాం న యుక్తం సముపోషణమ్‌ | యజ్ఞభోగోద్యతానాంచ సంగ్రామ క్షితిసేవినామ్‌ || 76 ||
పతివ్రతానాం రాజేన్ద్ర ! న యుక్తం సముపోషణమ్‌| ఏతన్మే గౌతమః ప్రాహ స్థితాయా మందరా చలే || 77 ||
నా వ్రతేన దినం విష్ణో ర్నేయం మనుజ సత్తమ ! | తే గృహస్థా ద్విజా జ్ఞేయా యేషా మగ్ని పరిగ్రహః || 78 ||
రాజన స్తేతు విజ్ఞేయా యే ప్రజాపాలనే స్థితాః | గుర్విణీ హ్యష్ట మాసీయా శిశవశ్చా ష్ట వత్సరాః || 79 ||
అతి లంఘనినః క్షీణా వలిగాత్రాస్తు వార్థకాఃః | యే వివాహాది మాంగల్య కర్తవ్యగ్రా మహోత్సవాః || 80 ||
నివృత్తాశ్చ ప్రవృత్తేభ్యో యజ్ఞానాం చోద్యతాహితే | త్రివిధేన పురాణన భర్తుర్యా స్త్రీహితే రతా || 81 ||
పతివ్రతా తుసాజ్ఞేయా యోని సంరక్షణా తధా | కి మన్యై ర్బహుభి ర్భూప వాక్యాలాప కృతైర్మయా || 82 ||
భోజనే తు కృతే ప్రీతి రేకాదశ్యాం త్వయా మమ | న ప్రీతిర్యది మే ఛిత్వా శిరః స్వంహి ప్రయచ్ఛసి || 83 ||
న కరిష్యసి చేద్రాజన్‌ భోజనం హరివాసరే | తదా హ్యసత్య వచసో దేహం న స్పర్శ యామి తే || 84||
వర్ణానా మాశ్రమాణాం హి సత్యం రాజేన్ద్ర పూజ్యతే | విశేషాద్భూమి పాలానాం త్వద్విధానాం మహీపతే || 85 ||
సత్యేన సూర్యస్తపతి శశీ సత్యేన రాజతే | సత్యే స్థితా క్షితిర్భూప! సత్యం ధారయతే జగత్‌ || 86 ||
సత్యేన వాయుర్వహతి సత్యేన జ్వలతే శిఖీ | సత్యాధారమిదం సర్వం జగత్ద్సా వరజంగమమ్‌ || 87 ||
న సత్యాచ్చలతే సిన్దు ర్నవింధ్యో వర్థతేనృప ! | న గర్భం యువతీ ధత్తే వేలాతీతం కదాచన || 88 ||
సత్యే స్థితా హి తరవః ఫల పుష్ప ప్రదర్శినః | దివ్యాది సాధనం నౄణాం సత్యాధారం మహీపతే || 89 ||

అశ్వమేధ సహస్రేభ్య స్సత్యమేవ విశిష్యతే | మదిరా పాన తుల్యేన కర్మణా లిప్యతే
నృతాత్‌ || 90 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే రుక్మాంగద సంలాపో నామ త్రయోవింశో
ధ్యాయః
మోహిని పలికెను : -
ఓ రాజేన్ద్ర! ఏక భుక్తవ్రతము కలవారు, అయాచిత వ్రతము కలవారు ఉపవాసముచే ద్వాదశిని లంఘించరాదు. గర్భవతులు, గృహస్థులు, బలహీనులు, రోగగ్రస్తులు, శిశువులు, వృద్ధులు ఉపవసించరాదు. ఈ విషయమును నేను మందర పర్వతముపై నున్నపుడే నాకు గౌతమ మహర్షి చెప్పెను. ఇతరులు విష్ణు వాసరమున వత్రమును ఆచరించవలయును. అగ్ని పరిగ్రహమున్న ద్విజులను గృహస్థులని, ప్రజాపరిపాలనమును చేయువారిని రాజులని, ఎనిమిది నెలలు నిండిన వారిని గర్భవతులని, ఎనిమిది సంవత్సరముల వరకు శిశువులని, ఎక్కువ లంఘణమును చేయువారు క్షీణగాత్రులని, ముడతలు పడిన శరీరము గలవారు వృద్ధులని, వివాహాది మంగల కర్మలలో, మహోత్సవములలో, ప్రవృత్తుల నుండి నివృత్తులగువారు యజ్ఞోద్యతులని, కాయిక వాచిక మానసికములతో భర్త హితమును కోరుచు యోని సంరక్షణా పరురాలు పతివ్రత యని శాస్త్రకోవిదులు చెప్పియున్నారు. వీరందరు ఉపవసించరాదని ధర్మ శాస్త్రము చెప్పుచున్నది. ఇవన్నియు నెందుకు? నీవేకాదశినాడు భుజించిననే నాకు నీయందు ప్రీతి నిలుచును. నీ శిరమును నీవే స్వయముగా ఖండిచి ఇచ్చిననూ నాకు ప్రీతికరము కాదు. నీవు ఏకాదశినాడు భుజించినచో అబద్ధవాక్కువగు నీశరీరమును నేను తాకను. వర్ణాశ్రమాచారములన్నింటిలో సత్యమొక్కటే పూజించబడును. విశేషించి నీ వంటి రాజులకు సత్యము పాటించదగినది. సత్యముచే సూర్యడు తపించును, చంద్రుడు ప్రకాశించును. సత్యము చేతనే భూమి నిలుచుచున్నది. జగత్తు సత్యము చేతనే ధరించబడుచున్నది. సత్యముచేతనే గాలి వీచుచున్నది. అగ్ని మండుచున్నది. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ సత్యాధారముగనే నిలిచి యున్నది. సత్యము వలననే సముద్రము హద్దు దాటుటలేదు. సత్యము వలననే వింధ్య పర్వతము పెరుగుట లేదు. యువతి గర్భధారణ చేయుట లేదు (వివాహము కాకుండా) కాలము నియమమును అతిక్రమించుట లేదు. సత్యమున నిలిచియే వృక్షములు పుష్పములను, ఫలములను చూపుచున్నవి. మానవులకు దివ్యాది భోగములన్నియూ సత్యము నాధారము చేసుకొనియే లభించుచున్నవి. వేయి అశ్వమేధ యాగములకంటే సత్యమే విశిష్టము. అసత్య వాక్యము వలన మద్యపానము వలన కలుగు పాపము సంభవించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున రుక్మాంగద సంలాపమను ఇరువది మూడవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page