Sri Naradapuranam-3 Chapters Last Page
చతుర్వింశోధ్యాయః = ఇరువది నాలుగవ అధ్యాయము
మోహినీప్రశ్నః
రాజోవాచ :-
యత్త్వయా హ్యహృతం వాక్యం మమేదం గౌతమేరితమ్ | మందరే పర్వతశ్రేష్ఠ హరివాసర భోజనమ్ || 1 ||
అ మతేన పురాణానాం హ్యహృతం యద్ద్విజన్మనా | క్షుద్ర శాస్త్రో పదేశేన లోలుపేన వరాననే || 2 ||
పురాణ నిర్ణయోహ్యేష విద్వద్భి స్సముదాహృతః | న శంఖేన పిబేత్తోయం న హన్యా త్కూర్మ సూకరౌ || 3 ||
ఏకాదశ్యాం న భోక్తవ్యం పక్షయో రుభయోరపి | అగమ్యా గమనే దేవి ! అభక్ష్యస్య చ భక్షణ || 4 ||
అకార్య కరణ జన్తో ర్గో సహస్ర వధ స్స్మృతః | జానన్న పి కథం దేవి ! భోక్ష్యే೭హం హరివాసరే || 5 ||
పురోడా శో೭పి వామోరు ! సంప్రాప్తే హరివాసరే | అభ##క్ష్యేణ సమః ప్రోక్తః కిం పునశ్చాశన క్రియా || 6 ||
అనుకూలం నృణాం ప్రోక్తం క్షీణానాం వరవర్ణిని ! మూలం ఫలం పయస్తోయం ఉపభోజ్యం మునీశ్వరైః || 7 ||
నత్వత్ర భోజనం కైశ్చి దేకాదశ్యాం ప్రదర్శితమ్ | జ్వరిణాం లంఘనం శస్తం ధార్మికాణా ముపోషణమ్ || 8 ||
శుభం గతిప్రదం ప్రోక్తం సంప్రాప్తే హరివాసరే | జ్వర మధ్యే కృతం పధ్యం నిధానాయ ప్రకల్పతే || 9 ||
వైష్ణవేతు దినే భుంక్తే నరకాయైవ కేవలమ్ | మా గ్రహం కురువా మోరు ! వ్రతభంగో భ##వేన్మమ || 10 ||
యదన్య ద్రోచతే తుభ్యం తత్కర్తాస్మిన సంశయః |
రాజు పలికెను :-
మందర పర్వతము మీద నాకు గౌతము మహర్షి ఏకాదశినాడు భోజనము చేయువచ్చనని చెప్పనని చెప్పితివి కదా ! ఆ మాట పురాణములలో చెప్పనిది. క్షుద్రములగు శాస్త్రోపదేశముతో, రసలోలుపతే చెప్పినది మాత్రమే. పురాణములలో పండితులు ఈ నిర్ణయమును చేసిరి. శంఖముచే జలము త్రాగరాదు. కూర్మమును, సూకరమును వధించరాదు. శుక్ల కృష్ణ పక్షములలోని ఏకాదశులలో భుజించరాదు. పొందరాని స్త్రీని పొందుట, తినరాని దానిని తినుట, చేయరాని పనిని చేయుట వేయి గోవులను చంపుటతో సమానము. కావున తెలిసి తెలిసి నేనెట్లు ఏకాదశినాడు భుజించెదను? ఏకాదశినాడు పురోడాశము కూడా తినరాదే అయినపుడు భోజనమెట్లు చేతును? జీర్ణశరీరులకు కందమూలములు, ఫలములు, తినుటకు అనుకూలములు. మునీశ్వరులకు పాలు నీరు అనుకూలములని చెప్పిరి కాని భోజనము అనుకూలమని చెప్పియుండలేదు. జ్వరము వచ్చినవారు లంఘనము చేయవలయును. ధార్మికులు ఉపవాసము నాచరించవలయును. ఏకాదశినాడు భుజించిన నరకము ప్రాప్తించును. కావున నీవు పట్టు పట్టకుము. నాకు వ్రత భంగమగును. ఇది కాక నీకింకేది నచ్చిననూ దానిని తప్పక నాచరించెదను. సంశయముతో పనిలేదు.
మోహిన్యువాచ : -
న చాన్య ద్రోచత్ రాజన్ ! వినా వై భోజనం తవ || 11 ||
జీవితస్యాపి దానేవ నమే కించిత్ప్రయోజనమ్ | న చ వేదేషు దృష్టో೭య ముపవాసో హరేర్దినే || 12 ||
అగ్ని మన్తోన విప్రా హి మన్యన్తే సముపోషణమ్ | వేద బాహ్యం కథం ధర్మం భవాంశ్చరితు మిచ్ఛతి || 13 ||
వచో నిశమ్య మోహిన్యా రాజా వేద విదాం వరః | ఉవాచ మానసేక్రుద్దః ప్రహసన్నివ భూపతే || 14 ||
శృణు మోహిని మద్వాక్యం వేదో೭యం బహుధా స్థితః | యజ్ఞకర్మ క్రియావేదః స్మృతి ర్వేదో గృహాశ్రమే || 15 ||
స్మృతిర్వేదః క్రియావేదః పురాణషు ప్రతిష్ఠితః | పురాణ పురుషా జ్ఞాతం యదేదం జగదద్భుతమ్ || 16 ||
తధేదం వాఙ్మయం జాతం పురాణభ్యో నసంశయః| వేదార్దా దధికం మన్యే పురాణార్థం వరాననే ! || 17 ||
వేదాః ప్రతిష్ఠితా స్సర్వే పురాణష్వేవ సర్వదా | బిభేత్యల్ప శ్రుతా ద్వేదో మామయం ప్రహరిష్యతి || 18 ||
న వేదే గ్రహసంచారో నశుద్ధిః కాలబోధినీ | తిధి వృద్ధి క్షయో వాపి పర్వగ్రహ వినిర్ణయః || 19 ||
ఇతి హాస పురాణౖస్తు నిశ్చయో೭యం కృతః పురా | యన్న దృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మృతౌ || 20 ||
ఉభయో ర్యన్న దృష్టం హి తత్పురాణౖః ప్రగీయతే | ప్రాయశ్చిత్తం తు హత్యాయా మాతురస్యౌషధం ప్రియే || 21 ||
న చాపి పాప శుద్ధిస్స్వా దాత్మనశ్చ పరస్య వా | యద్వేదై ర్గీయతే సుభ్రు ! ఉపాంగైర్యత్ప్ర గీయతే || 22 ||
పురాణౖ స్స్మృతిభిశ్చైవ వేద ఏవనిగద్యతే | రటన్తీహ పురాణాని భూయో భూయో వరాననే || 23 ||
న భోక్తవ్యం న భోక్తవ్యం సంప్రాప్తే హరివాసరే | పురాణ మన్యధా మత్వా తిర్యగ్యో ని మవాప్నుయాత్ || 24 ||
సంస్రాతో೭పి సుదాంతో೭పి నగతిం ప్రాప్నుయాదితి | పితరం కో న వందేత మాతరం కో న పూజయేత్ || 25 ||
కోన గచ్చేత్సరిచ్ఛ్రేష్ఠాం కో భుంక్తే హరివాసరే | కో హి దుషయతే వేదం బ్రాహ్మణం కో నిపాతయేత్ || 26 ||
కో గచ్ఛేత్పర దారాన్హి కో భుంక్తే హరివాసరే || 27 ||
నహీదృశం పాప మిహాస్తి జన్తో ర్విమూఢ చిత్తస్య దినే హరేః ప్రియే|
యద్భోజనే నాత్మ నిపాత కారిణా యమస్య ఖాతేషు చిరం సులోచనే || 28 ||
మోహిని పలికెను :-
ఏకాదశినాడు భోజనము తప్పనాకు మరొకటి నచ్చదు. నీవు నీ జీవితము నిచ్చిననూ నాకు ప్రయోజనములేదు. ఏకాదశినాడు ఉపవసించవలయునని వేదములలో చెప్పలేదు. అగ్య్నాధనాము చేయు బ్రాహ్మణులు ఉపవాసమును అంగీకరించరు. ఇట్లు వేద బాహ్యమగు ధర్మమును నీవెట్లు ఆచరించదలచితివి? ఇట్లు మోహినీ దేవి మాటలను వినిన వేదవిదుడగు రాజు మనసులో కోపించిననూ పైకి నవ్వుచున్నవానివలె ఇట్లు పలికెను. ఓ మోహినీ ! నీ మాట నాలకించుము. ఈ వేదము పలువిధములుగా నున్నది. యజ్ఞకర్మ క్రియా వేదము. గృహస్థాశ్రమమున స్మృతి వేదము. ఇట్లు స్మృతి వేదము. క్రియావేదము. పురాణములలో చెప్పబడినది. ఈ జగత్తంతయు పురాణ పురుషుని నుండి పుట్టినట్లుగా ఈ వాఙ్మయమంతయూ పురాణముల నుండి పుట్టినది. కావున వేదార్థమునకంటే పురాణార్థము అధికము. వేదములన్నియచూ పురాణములందే ప్రతిష్ఠించబడియున్నవి. అల్పముగా తెలిసిన వానిని చూచి వీడు నన్ను మోసగించునని వేదము భయపడును. మరియు వేదములందు గ్రహ సంచారము చెప్పియుండలేదు. కాలశుద్ధి చెప్పబడలేదు. తిధి వృద్ధులు, తిధి క్షయము చెప్పబడలేదు. పర్వనిర్ణయము, గృహనిర్ణయములు చెప్పబడలేదు. వీటి విషయమున, పురాణములందే నిశ్చయము చేయబడినది. వేదములందు చూడబడని దంతయు స్మృతులందు కనపడును. శ్రుతు స్మృతులందు చూడబడనిది పురాణములలో చెప్పబడును. హత్యకు ప్రాయశ్చిత్తము, రోగార్తునకు జౌషధము తనకు కాని ఇతరులకు కాని పాపశుద్ధిని చేయజాలదు. వేదములలో చెప్పిన దానినే వేదాంగములు, ఉపాంగములు చెప్పును. పురాణములచే స్మృతులచే వేదమే చెప్పబడుచున్నది. అట్టి పురాణములు ఏకాదశినాడు భుజించరాదు, భుజించరాదు అని ఘోషించుచున్నవి. పురాణమును వేరుగా భావించువారు పశువుగా పుట్టెదరు. విజ్ఞుడైననూ, అంతర్నిగ్రహము కలవాడైననూ ఉత్తమగతిని పొందజాలడు. తండ్రిని నమస్కరించని వాడెవ్వడు? త్లలిని పూజించని వాడెవ్వడు? నదికెవ్వరు వెళ్ళరు? ఏకాదశినాడు ఎవడు భుజించును. వేదమునెవరు దూషించును. విప్రుని ఎవడు చంపును? పరదారలను ఎవడు కోరును. ఏకాదశినాడు ఎవరు భుజింతురు? ఏకాదశీ భోజనమంత పాపము మరియొకటి లేదు. ఏకాదశీ భోజనము ఆత్మనిపాత కారణము. నరక వాసము వచ్చును.
శీఘ్రమానమయ విప్రాంస్త్వం ఘూర్ణికే వేద పారగాన్ | యేషాం వాక్యేన యుక్తో೭యం రాజా కుర్యాద్ధి భోజనమ్ || 29 ||
స తద్వాక్య ముపాకర్ణ్య బ్రాహ్మణాన్వేద శాలినః | గౌతమాదీన్సమాహూయ మోహనీ పార్శ్వమానయత్ || 30 ||
తాన్విప్రానాగతా న్దృష్ట్యా వేద వేదాం గపారగాన్ | మోహినీ సహితా రాజ్ఞ వవందే కార్యతత్పరా || 31 ||
ఉప విష్టాస్తు తే సర్వే శాతకౌంభమయేషు చ | ఆసనేషు మహీపాల జ్వలదగ్ని సమప్రభాః || 32 ||
తేషాం మధ్యే వయోవృద్ధో గౌతమో వాక్యమబ్రవీత్ | వయం సమాగతా దేవి నానా శాస్త్ర విశారదాః || 33 ||
సర్వ సందేహ హర్తారో యదర్ధం తే సమాహుతాః | తచ్ఛ్రుత్వా వచనం తేషాం మోహినీ బ్రహ్మణ స్సుతా || 34 ||
సర్వసాధ్యకృతం కర్తుం ప్రవృత్తాం స్తానువాచహ |
అంతటా మోహనీ దేవి పరిచారకులతో వేద పారగులగు తీసుకొనిరమ్ము. వారి మాటతో రాజు భోజనము చేయును అనెను. అంతట పరిచారకుడు వేదజ్ఞులగు గౌతమాది బ్రాహ్మణులను మోహిని చెంతకు తెచ్చెను. ఆ వచ్చిన వేద వేదాంపారంగతులగు బ్రాహ్మణులను చూచి రాజుతో కలిసి మోహని కార్యతత్పరురాలై నమస్కరించెను. మండుచున్న నిప్పువంటి ఆ బ్రాహ్మణులందరూ బంగారు సింహాసనములపై కూర్చొనిరి. వారి మధ్యలో వయో వృద్ధుడగు గౌతముడిట్లు పలికెను. నానా శాస్త్ర విశారదులమగు మేము వచ్చితిమి. మేము అన్ని సందేహములను హరింతుము. మమ్ములనెందుకు పిలిచితిరి అని. వారి మాటలను వినిన మోహని వారితో ఇట్లు పలికెను.
మోహిన్యువాచ :-
సందేహస్తు జడో హ్యేష స్వల్పోవా స్వమతి ర్యధా || 35 ||
సో೭యం వదతి రాజా వై నాహం భోక్ష్యే హరేర్దినే | అన్నాధారమిదం సర్వం జగత్థ్సావర జంగమమ్ || 36 ||
మృతా హ్యపి తధాన్నేన ప్రీయేన్తే పితరో దివి | కర్కంధు మాత్ర ప్రహుతం పురోడాశం హి దేవతాః || 37 ||
కామయన్తి ద్విజిశ్రేష్ఠా స్తతో೭న్నం హ్యమృతం పరమ్ | పిపీలికాపి క్షుధితా ముఖే నాదాయ తండులమ్ || 38 ||
బిలం వ్రజతి దుఃఖేన కస్యాన్నం న హిరోచతే | అయం ఖాదతి నాన్నాద్యం సంప్రాప్తే హరి వాసరే || 39 ||
నిజ ధర్మం పరిత్యజ్య పరధర్మే వ్యవస్థితః | విధావానాం యతీనాంచ యుజ్యతే వ్రతసేవనమ్ || 40 ||
పరధర్మరతో యస్స్యాత్ స్వధర్మ విముఖో నరః| సోం೭ధే తమసి మజ్జేత యావదింద్రా శ్చతుర్దశ || 41 ||
ఉపవాసాది కరణం భూభుజం నోదితం క్వచిత్ | ప్రజా సంరక్షణం త్యక్త్వా చతుర్వర్గ ఫలప్రదమ్ || 42 ||
నారీణాం భర్తృ శుశ్రూషా పుత్రాణాం పితృసేవనమ్ | శూద్రాణాం ద్విజసేవా చ లోకరక్ష మహీభృతామ్ || 43 ||
స్వకం కర్మ పరిత్యజ్య య్యోన్యత్ర కురుతే శ్రమమ్ | ఆజ్ఞానాద్వా ప్రమాదాచ్చ పతితస్స నసంశయః || 44 ||
సో೭యమద్య మహీపాలో యతి ధర్మే వ్యవస్థితః | సుబుద్ధ్యాచార శీలశ్చ వేదోక్తం త్యజతి ద్విజాః || 45 ||
స్వేచ్ఛా చారు తు యా నారీ యో೭వినీత స్సుతో ద్విజాః | ఏకాంత శీలో నృపతి ర్భృత్యః కర్మ వివర్జితః || 46 ||
సర్వే తే నరకం యాన్తి హ్య ప్రతిష్ఠశ్చ యో ద్విజాః | అయం హి నియమోపేతో హరిపూజన తత్పరః || 47 ||
ఆక్రన్దే వర్తమానే తు నయద్యేష ప్రధావతి | వ్యపోహ్య హరిపూజాం వై బ్రహ్మ హత్యాంతు విందతి || 48 ||
క్షీణదేహే హరిదినే కధం సంయమయిష్యతి | అన్నాత్ప్ర భవతి ప్రాణః ప్రాణాద్దేహ విచేష్టనమ్ || 49 ||
చేష్ట యా రిపునాశశ్చ తద్ధీనః పరిభూయతే | ఏవం జ్ఞాత్వా మయా రాజా బోధ్య మానో న బుద్ధ్యతి || 50 ||
ఏతదేవ వ్రతం రాజ్ఞ యత్ప్ర జాపాలనం చరేత్ | న వ్రతం కించిదస్త్యన్యత్ నృపస్య ద్విజసత్తమాః || 51 ||
కిం దేవ కార్యేణ నరాధిపస్య కృత్వా హి మన్యు ర్విషయ స్థితానామ్ |
తద్దేవ కార్య స చయజ్ఞ హోమో యద్రక్త పాతో న భ##వేత్స్వరాష్ట్రే || 52 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరబాగే మోహినీ ప్రశ్నోనామ చతుర్వింశో೭ధ్యాయః
మోహినీ దేవి పలికెను :-
సందేహము స్వల్పమే కాని ఈ జడమతి తన బుద్ధికి తోచినట్లే చెప్పుచున్నాడు. ఈ రాజునేను ఏకాదశినాడు భోజనము చేయనను చున్నాడు. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రంపంచమంతయూ అన్నాధారమే కదా? చనిపోయిన పితృదేవతలు కూడా అన్నముతోనే తృప్తి చెందెదరు కదా? కరక్కాయంత పురోడాశమును హోమము గావించినచో దేవతలు భుజించగోరెదరు. కావున అమృతము వంటిది అన్నము గదా? ఆకలిగొన్న చీమ కూడా ముఖముచే బియ్యపు గింజను తీసుకొని కష్టపడుచు బిలము చేరును. కావున అన్నము ఎవరికి రుచించదు? కాని ఏకాదశి వచ్చిన ఈ రాజు అన్నాదులను భుజించడు. స్వధర్మమును విడిచి పరధర్మము నాశ్రయించుచున్నాడు. విధవలకు యతులకు వ్రతముల నాశ్రయించుట ఉచితము. స్వధర్మమున విముఖుడై పరధర్మములందు ఆసక్తి గలవాడు పదునాలుగు మంది ఇంద్రుల కాలము అంధకార బంధురమగు నరకమున నివసించును. రాజులకు ఉపవాసము ఎచటా విధించబడి యుండలేదు. చతుర్వర్గ ఫలప్రదమగు ప్రజా సంరక్షణము మాత్రమే చెప్పబడినది. స్త్రీలకు పతిసేవ, పుత్రులకు పితృసేవ, శూద్రులకు బ్రాహ్మణసేవ, రాజులకు ప్రజాపాలన విధించబడియున్నది. అజ్ఞానము వలన కాని, పొరబటు కాని స్వకర్మను పరిత్యజించి ఇతరుల కర్మనాచరించిన వాడు పతితుడగును. ఈ నాడీ మహారాజు యతి ధర్మము నాశ్రయించుచున్నాడు. ఇతను సుబుద్ధి ఆచార శీలుడే కాని వేదోక్త ధర్మమును విడుచుచున్నాడు. స్వేచ్ఛగా సంచరించు స్త్రీ, వినయ రహితుడగు పుత్రుడు, ఏకాంతమున ఉండగోరు రాజు, పనిచేయని సేవకుడు, ప్రితిష్ఠ లేనివాడు వీరందరూ నరకమును చేరుదురు. ఈ రాజు నియమము నాశ్రయించి శ్రీ హరిని పూజించుచున్నాడు. బ్రాహ్మణుడు ప్రాణాపాయమున నుండి ఆక్రోశించునపుడు ఇతను హరిపూజను విడిచి వెళ్ళనిచో బ్రహ్మహత్యా పాతకముఉ పొందును. క్షీణదేహుడైనపుడు ఏకాదశినాడు ఎట్లు పవశించును? అన్నము నుండియే దేహము పుట్టును. దేహము వలన చేష్టలు కలుగును. చేష్టలచే శత్రువులు నశింతురు. చేష్టారహితుడు అవమానించబడును. ఇట్లు తెలిసిన నేను ప్రబోధించుచున్ననూ ఇతను తెలియుట లేదు. ప్రజాపాలన మొక్కటే రాజులకు వ్రతము. రాజునకు మరియొక వ్రతమే చెప్పబడలేదు. సంసార విషయములలో నున్న రాజు
నకు దేవకార్యముతో నేమి పని? స్వరాజ్యమున రక్తపాతము లేకుండుటయే దేవకార్యము, యజ్ఞము, హోమము అన్నియూ.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహిని ప్రశ్నయను ఇరువది నాలుగవ అధ్యాయము.