Sri Naradapuranam-3    Chapters    Last Page

షడ్వింశోధ్యాయః = ఇరువదియారవ అధ్యాయము

రాజోవాచ:-


కీర్తి ర్నశ్యతు మే పుత్ర హ్యనృతీ వా భవామ్యహమ్‌ | గతో వా నరకం ఘోరం కధం భోక్ష్యే హరేర్దినే || 1 ||
బ్రహ్మణో నిరయం యాతు దేవీయం మోహినీ సుత! | భూయో వదతి మాం దుర్మేధాశ్చ సుబాలిశా || 2 ||
నాపరం కామయే రాజ్యం వసుధాం వసు కించన | ముక్త్వైకం వాసరే విష్ణో ర్భోజనం పాపనాశ##నే || 3 ||
యద్యహం కుత్సితాం యోనిం వ్రజేయం క్రిమి సంజ్ఞితామ్‌ | తధా పి నైవ కర్తాహం భోజనం హరివాసరే || 4 ||
ఏషా గురుతార భూత్వా లోకానాం శిక్షయాన్వితా | దుందుభీ కుర్వతీ నాదం సా కథం వితధా భ##వేత్‌ || 5 ||
అభక్ష్య భక్షణం కృత్వా అగమ్యాగమనం తధా | అపేయం చైవ పీత్వాతు కిం జీవేచ్ఛర దశ్శతమ్‌ || 6 ||

అసత్యం వాపి కృత్వాహం త్యక్త రాజ్యనయః క్షితౌ | ధిక్కృతో
పి జనైస్సర్వై ర్న భోక్ష్యే హరి వాసరే || 7 ||
వియోగే చపలాపాంగ్యా యది చేన్మరణం మమ | తచ్చాపి వరమే వాత్ర నభోక్ష్యే హరి వాసరే || 8 ||
కథం హర్ష మహం కర్తా మార్తండ తనయస్యయ వై | వ్రజద్భి ర్మనుజై ర్మార్గే నిరయస్యాతి దుఃఖితైః || 9 ||
యాస్తు శూన్యాః కృతాస్తాత! మయా నరక పంక్తయః | జనైః పూర్ణా భవిష్యంతి మయి భుక్తేతు తాస్సుత || 10 ||
మాస్మ సీమంతినీ పుత్ర కుక్షౌ సంధారయే త్సుతమ్‌ | సమర్ధో యస్తు శత్రూణాం హర్షం సంజనయే ద్భువి || 11 ||

భోజనం వాసరే విష్ణోః ఏతదేవ హి యాచతే | తన్నదాస్యామి మోహిన్యా యాచితో
పి సురాసురైః || 12 ||
పిబేద్విషం విశేద్వహ్నిం నిపతే త్పర్వ తాగ్రతః | ఆకాశ భాసాస్వశిరశ్చింద్యాదేవ వరాసినా || 13 ||
న భోక్ష్యతే హరిదినే రాజా రుక్మాంగదః క్షితౌ | రుక్మాంగదేతి మన్నామ ప్రసిద్ధం భువనత్రయే || 14 ||
ఏకాదశ్యుప వాసేన తన్మయా సంచితం యశః | సకధం భోజనం కృత్వా నాశ##యే స్వకృతం యశః || 15 ||
మ్రియతే యదివా గచ్ఛతి నిపతతి నశ్యేచ్చ ఖండశోవాపి |
విరమతి తదపిన చేతో మామకమితి మోహినీ హేతోః || 16 ||
పరిత్యజామ్యేష నిజం హి జీవితం లోకైస్సమేత స్సహదార భృత్యైః |

నత్వేవ కుర్యాం మధుసూదనస్య దినే సుపుణ్య
న్న నిషేవణం హి || 17 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే షడ్వింశ్వోధ్యాయః
రుక్మాంగద మహారాజు పలికెను :-
ఓ పుత్రా ! నా కీర్తి నశించిన నశించనిమ్ము ! నేను అసత్యవాక్కును అయిన కానిమ్ము. ఘోరమగు నరకము వచ్చిన రానిమ్ము. కాని ఏకాదశి నాడు నేనెట్లు భుజించగలను? ఈ మోహనిదేవి బ్రహ్మలోకముకు వెళ్ళనిమ్ము. మూర్ఖురాలు, దుర్భుద్ధియగు ఈ మోహిని మాటి మాటికీ నాతో నాకే కోరిక లేదు. రాజ్యముతో పనిలేదు. రాజ్యముతో పనిలేదు. కేవలము ఏకాదశి నాడు రాజు భుజించుటయే కావలయును అని పలుకుచున్నది. నాకు క్రిమి జన్మ వచ్చిననూ రానిమ్ము. కాని నేను మాత్రము ఏకాదశినాడు భుజించజాలను. ఈ లోకమున చాలా పెద్ద దుందుభి ప్రజలను బోధించుచున్నది. ఆ దుందుభి ఎట్లు వ్యర్థమగును? తనిరాని దానిని తని, పొందరాని స్త్రీని పొంది, పానముచేయరాని దానిని పానము చేసి నూరు సంవత్సరములు బ్రతికిననేమి ప్రయోజనము? ఈ భూమంలమున రాజనీతిని వదిలి, రాజ్యధికారమునుకూడా వదిలెదను. అసత్యవాక్కునను అపనిందను కూడా భరించెదను. ప్రజలందరూ ధిక్కరించిననూ ఏకాదశినాడు మాత్రము భుజించును. మోహినీ వియోగముచే మరణము సంభవించిననూ మేలేకాని ఏకాదశినాడు మాత్రము భుజించను. అతి దుఃఖముతో యమలోక మార్గమున ప్రజలను పంపుచు యమధర్మరాజునకు సంతోషమెట్లు కలిగంచగలను? నేనీకాదశినాడు భుజించినచో ఇదివరకు శూన్యములుగా చేయబడిన నరకశ్రేణులు ఇపుడు పరిపూర్ణములగును. సమర్థడైకూడా శత్రువులకు ఆనందము కలిగించువానిని ఏ తల్లీ గర్భమున ధరించరాదు. ఈచ మోహిని ఏకాదశినాడు భుజించుటనే యాచించుచున్నది. సురాసురులు యాచించిననూ ఆ వరమును ఈయజాలను. విషమునైనను త్రాగెదను. అగ్నిలో కూడా దూకెదను. పర్వతాగ్రము నుండి క్రింద పడెదను. ఆకాశమున ప్రకాశించు ఖడ్గముచే నా శిరస్సును కూడా ఖండిచుకొందును. కాని రుక్మాంగద మహారజు మాత్రము ఏకాదశి నాడు భుజించడు. ఏకాదశ్యుపవాసము చేతనే రుక్మాంగద నామము మూడు లోకములలో ప్రసిద్ధి గాంచినది. అదియే నేను సంపాదించిన యశము. అట్టి నేను ఏకాదశినాడు భోజనము చేసి నేను సంపాదించిన కీర్తిని నేను ఎట్లు నశింప చేతును. ఈ మోహిని మరణించిననూ వెడలిపోయిననూ, పతనమైననూ, ఖండ ఖండములుగా నశించిననూ, ఇట నుండి విరమించననూ, నానిశ్చయము మాత్రము మోహినీ కారణమున మాత్రము మారజాలదు. నా ప్రజలతో భార్య పుత్రులతో నా జీవితమును కూడా విడిచెదను కాని పరమ పవిత్రగు ఏకాదశి దినమున మాత్రము నేను భోజనము చేయజాలను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున ఇరువది యారవ అధ్యయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page