Sri Naradapuranam-3 Chapters Last Page
సప్తవింశో೭ధ్యాయః = ఇరువదియేడవ అధ్యాయము
కాష్ఠీలోపాఖ్యానమ్
వసిష్ఠ ఉవాచ :-
తత్పితుర్వచనం శ్రుత్వా పుత్రో ధర్మంగదాస్తదా | అహూయ జననీం శీఘ్రం నామ్నా సంధ్యావలీ శుభామ్ || 1 ||
సూర్యాయుత సమప్రఖ్యాం తేజసా రుచిరస్తనామ్ | పాలయంతీం ధరాం సర్వం పాద విన్యాస విక్రమామ్ || 2 ||
పుత్రస్య వచనాత్ప్రాప్తా తత్‌క్షనం నృప సన్నిధౌ | శ్రావితా మోహినీ వాక్యం పితుర్వాక్యం తధైవచ || 3 ||
ఉభ##యే స్సంవిదం కృత్వా పరిసాన్త్వయ్య మోహినీమ్ | భోజనాయ స్థితామేనాం నృపస్య హరివాసరే || 4 ||
యధా నో చ్యవతే సత్యా ద్యధా భుంక్తే న మే పితా | తధా విధీయతా మేవం కుశలం చోభ##యేర్భవేత్ || 5 ||
తత్పుత్ర వచనం శ్రుత్వా దేవీ సంధ్యావలీ నృప ! | మోహినీం శ్లక్షయా వాచా ప్రాహ బ్రహ్మసుతాం తదా || 6 ||
మా గ్రహం కురు వామోరు ! కధం చిదపి భూపతిః | నాస్వాదయతి పాపాన్నం సంప్రాప్తే హరివాసరే || 7 ||
అనువర్తయ రాజానం గురురేష సనాతనః | సదా భవతి యా నారీ భర్తు ర్వచన కారిణీ || 8 ||
తస్యాస్స్యు రక్షయాలోకాః సావిత్ర్యాస్తు యధా మలాః | యద్యనేన పురా దేవి! తవ దత్తః కరో గిరౌ || 9 ||
కామార్తేన విమూఢేన తన్నయోగ్యం విచింతితుమ్ | యద్దేయం తద్దదాత్యేష హ్యదేయం ప్రార్ధయస్వ మా || 10 ||
విపత్తి రపి భ##ద్రైవ సన్మార్గే సంస్థితస్య తు | న భుక్తం యేన సుభేగే | శైశ##వే೭పి హరేర్దినే || 11 ||
సకధం భోక్ష్యతే పుణ్య మాధవస్య దినే೭ధునా | కామం వరయ వామోరు వరమన్యం సుదుర్లభమ్ || 12 ||
తం దదాత్యేవ ఊపాలో నివృత్తా భవభోజనే | మన్యసే యది మాం దేవి ! ధర్మాంగ విరోహిణీమ్ || 13 ||
అస్మజ్జీవిత సయుతక్తం రాజ్యం వరయ సువ్రతే! | సప్తద్వీప సమేతం హి ససరిద్వన పర్వతమ్ || 14 ||
కనిష్ఠాయా వరిష్ఠాహం కరిష్యే పాదవందనమ్ | భర్తురర్థే విశాలాక్షి! ప్రసీద తనుమధ్యమే || 15 ||
వాచా శపథ దోషైస్తు సన్నిరుధ్య పతిం హి యా | అకార్యం కారయే త్పాపా సా నారీ నిరయే వసేత్ || 16 ||
సా చ్యుతా నరకా ద్ఘోరా త్సప్త జన్మాని పంచ చ | సూకరీం యోని మాప్నోతి చాండలీం చతతః పరమ్ || 17 ||
ఏవం జ్ఞాత్వా మయా దేవి ! విక్రియాం పాప సంభవామ్ | నివారితాసి వామోరు ! సఖీభావేన సుందరి ! || 18 ||
విపక్షస్యాపి సద్బుద్ది ర్దాతవ్యా ధర్మమిచ్ఛతా | కింపునస్సఖి సంస్థాయా స్తవ పద్మ నిభాననే || 19 ||
సంధ్యవలీ వచ శ్శ్రుత్వా మోహినీ మోహకారిణీ | ఉవాచ కనకాభాంతాం భర్తుర్జేష్ఠాం ప్రియాం తదా || 20 ||
వసిష్ఠి మహర్షి పలికెను :-
ఇట్లు పలికిన తండ్రి మాటలను వినిన ధర్మాంగద మహారాజు త్వరగా పరమ పవిత్రురాలగు తల్లియగు సంధ్యవలీ దేవిని పిలిచెను. ఆ సంధ్యావలీ దేవి పదివేల సూర్యల కాంతి గలది. రుచిరస్తన. పాద విన్యాసములచే ఈ భూమండలమంతటిని పాలించుచున్నది. పుత్రుని పిలుపుతో వెంటనే రాజు సమీపమునకు వచ్చెను. మోహినీ వాక్యమును, రుక్మాంగద మహారాజు వాక్యమును తల్లికి వినిపించెను. రాజునకు మోహినికి సంధిని చేయుము. మోహినిని ఓదార్చుము. ఏకాదశినాడు భుజించవలయునని పట్టుపట్టుచున్నది. రాజు సత్యభ్రష్టుడు కాకూడదు. ఏకాదశినాడు భుజించకూడదు. మోహిని కోరిక తీరవలయును. ఇట్లు ఇద్దరికి కుశథలమగునట్లు చేయుము. అని ధర్మాంగదుడు తల్లిని ప్రార్థించెను. అపుడు సంధ్యావలీ దేవి పుత్రుని మాటలను విని బ్రహ్మపుత్రికయగు మోహినతో మృదువుగా ఇట్లు పలికెను. ఓ సుందరీ! పట్టు పట్టకుము. రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు ఎట్టి పరిస్థితులలోనూ పాపాన్నమును భుజించడు కావున రాజును అనుసరించుము. ఇతను సనాతనుడగు గురువు. భర్త మాటను పాలించు స్త్రీకి సావిత్రీ దేవికివలె పవిత్రములగు పరలోకములు అక్షయములగును. పూర్వము కామార్తుడై మోహితుడై ఈ రాజు ఇచ్చిన దక్షిణ హస్తమును గూర్చి ఆలోచించరాదు. ఈయదగిన దానిని ఇతను తప్పక ఇచ్చును. ఈయరాని దానిని కోరకుము. సన్మార్గమున నున్న వానికి ఆపదలు కలిగిననూ మేలేకాని సన్మార్గమును వీడరాదు. శిశువుగా నున్నపుడు కూడా ఈ రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు భుజించలేదు. ఇక ఇపుడెట్లు పుణ్య ప్రదమగు ఏకాదశినాడు భుజించును. కావున నీవు నీకు వచ్చిన పరమ దుర్లభమగు మరొక వరమును కోరుకొనుము. ఆ వరమును రాజు తప్పక ఇచ్చును. కావున ఏకాదశీ భోజనమును కోరకుము. ధర్మాంగదుని తల్లిగా నున్న తలచినచో మా ప్రాణములతో పాటు ఈ రాజ్యమును కోరుము. సప్త ద్వీప సహితముగా నదీవన పర్వత సమేతముగా భూమండలమునంతటిని కోరుము. పెద్ద దాననగు నేను చిన్నదానవగునీకు భర్త కొరకు పాదవందనమును చేతును. ప్రసన్నురాలవు కమ్ము. శపథములను చేసి కఠిన వాక్కుచే పతిని నర్బంధించి ఆ కార్యమును చేయించిన స్త్రీ నరకమును పొందును. నరకము నుండి వచ్చి పన్నెండు జన్మలు సూకరముగా పుట్టును. తరువాత చండాల జన్మను పొందును. ఈ విషయమును తెలిసి నీపై స్నేహముతో నిన్ను పాప కార్యము నుండి వారించుచుచున్నాను. ఓ పద్మముఖీ ! ధర్మమును కోరువారు శత్రువలుకైననూ సద్భుద్ధిని నేర్పవలయును. ఇక మిత్రురాలవు నీకేల బోధించరాదు. సంధ్యావలి మాటలను వినిన మోహయుక్తయగు మోహినీదేవి భర్తకు ప్రియురాలు పెద్దభార్య కనక సన్నిభయగు సంధ్యావలితో ఇట్లు పలికెను.
మాననీయాసి మే సుభ్రు కరోమి వచనం తవ | విద్వద్భిర్మునిభిర్యత్తు గీయతే నారదాదిభిః || 21 ||
యది తన్నాచరేద్రాజా భోజనం హరి వాసరే | క్రియతామాపరం దేవి మరణాదధికం తవ || 22 ||
మమాపి దుఃఖదం హ్యేత ద్దేవాజ్జల్పామ్యహం శుభే! | కస్యేష్టమాత్మహననం కస్యేష్టం విషభక్షణమ్ || 23 ||
పతనం వా గిరేర్మూర్థ్నః క్రీడావాపి బలే శ##యైః | వ్యాఘ్రసింహాభిగమనం సముద్రతరణం తథ్రా || 24 ||
దురుక్తానృతవాక్యం వా పరదారాభిమర్శనమ్ | అపథ్యభక్షణం లోకే తథాభక్ష్యస్యభక్షణమ్ || 25 ||
మృగాటన మధాక్షై ర్వా క్రీడనం సాహసం తథా | ఛేదనం తృణ కాష్ఠానాం లోష్టానామవమర్దనమ్ || 26 ||
హింసనం సూక్ష్మదేహానం జలపావక ఖేలనం | దైవావిష్ఠో వరారోహే నరస్సర్వం కరోతి వై 27
త్రివర్గవిచ్యుతం ఘోరం యశో దేహహరం క్షితౌ | నరకార్హో నరో దేవి! కరోత్యశుకర్మ తత్ 28
సాహం పాపా దురాచారా వక్తుకామా సునిర్ఘృణమ్ | యాదృశేన హి భావేన యోనౌ శుక్రంస ముత్సృజేత్ 29
తాదృశేన హి భావేన సంతానం సంభ##వేదితి | సాహం వివాదభావేన రాజ్ఞో రుక్మాంగదస్య హి 30
జాతా జలజజాతేన స్త్రీరూపా వర వర్ణిని | దుష్టభావా తథాజాతా కర్త్రీ దుష్టం నృపస్యతు 31
నలగ్నం నగ్రహా దేవి! న హోరా పుణ్యదర్శినీ | తత్కాలభావనా గ్రాహ్యా తద్భావో జాతయే సుతః 32
తేన భావేన జాతస్య దాక్షిణ్యం నోపపద్యతే | న చ వ్రీడా నచ స్నేహో న ధర్మో దేవి విద్యతే 33
జానన్నపి యథాయుక్త స్తం భావమనువర్తతే 34
వక్ష్యేవచః ప్రాణహరం తవాధువా భర్తస్స లోకస్య వధూజనస్య | ధర్మాపహం వాచ్యకరం మమాపి కర్తు న శక్యం మనసాపి భీరు 35
కరోషి వాక్యం యది మామకం హి భ##వేచ్ఛ కీర్తిర్మహతీహ లోకే | భర్తుర్యశస్స్యాత్త్రిదివే గతిస్తే పుత్రే ప్రశంపా మమ ధిగ్వివాదః 36
ఓ సుందరీ! నీవు నాకు గౌరవించదగినదానవు నీ మాటను పాటింతును. పండితులు నారదాదిమునులు చెప్పిననూ రుక్మాంగదమహారాజు ఏకాదశినాడు భోజనము చేయనిచో నీకు మరణముకంటె ఎక్కువ దుఃఖమును కలిగించు మరియొక దానిని చేయమనుము ఇది నాకు కూడా దుఃఖప్రదమే. కాని నేను దైవవశమున పలుకు చున్నాను. ఆత్మహత్య ఎవరికి ఇష్టముండును. విషభక్షణము గిరిశిఖరమునుండి పడుట సర్పములతో క్రీడించుట, వ్యాఘ్రసింహములకు ఎదురుగా వెళ్ళుట సముద్రమును దాటుట దురుక్తములను, అసత్యములను పలుకుట, పరదారాభబిమర్శనము, అపధ్యభిక్షణము, అభక్ష్యభక్షణము, వేట, ద్యూతము సాహసము తృణకాష్ఠచ్ఛేదనము, లోష్టమర్దనము, సూక్ష్మజీవుల హింస, జలాగ్నిక్రీడ ఎవరికీ ఇష్టముండును. దైవవశమున మానవుడు వీటిని చేయును. త్రివర్గ చ్యుతములు ఘోరములు యశోహరములు, దేహహారములు అగువాటిని దైవవశమున చేయును. నరకార్హుడై అశుభకర్మలను చేయును. కావున నేను పాపురాలను దురాచార పరురాలను నిర్దయగా చెప్పదలుచుచున్నాను. ఏ భావముతో యోనియందు శుక్రమును విడుచునో భావముతోనే సంతానము కలుగును కావుననేను రుక్మాంగదమహారాజుతో కలహించుటకే బ్రాహ్మచే స్త్రీ రూపముగా సృజించబడితిని. దుష్టభావముచే పుట్టితిని. రాజునకు అపకారములే చేయుచున్నాను. లగ్నము, గ్రహములు, హోర ఇవేవిము పనికిరావు. సమాగమకాలమున నుండు భావననే గ్రహించవలయును ఆ భావముతోనే నరుడు పుట్టును. అట్టి భావముతో పుట్టిన వారికి దయ యుండదు. బిడియము, స్నేహము, ధర్మము ఉండవు. అయుక్తమని తెలిసి కూడా అ భావమునే అనుసరించును. కావున ఇపుడు నేను నీవు ప్రాణహరము, నీతోటి స్త్రీలకు నీభర్తకు ప్రజలకు దుఃఖప్రదము మనసులో కూడా ఆలోచించలేనిది నాకు కూడా చెప్పరానిదియగు మాటను చెప్పెదను, నా మాటను నీవు చేసినచో నీకు ఈ లోకమున గొప్పకీర్తి కలుగును. నీ భర్తకు యశస్సు వచ్చును నీకు స్వర్గగమనము లభించును. నీ పుత్రునికి ప్రశంస కలుగును. నాకు నింద వచ్చును.
వసిష్ఠ ఉవాచ-
మోహిని వచనం శ్రుత్వా దేవీ సంధ్యావలీ విభో | ధైర్య మాలంబ్య తాం తన్వీం బ్రూహి బ్రూహీత్యచోదయత్|| 37
కీదృశం వదసే వాక్యం యేన దుఃఖం వే న్మమ | భర్తుర్మే సత్యకరణ న దుఃఖం జాయతే క్వచిత్ ||38
ఆత్మనో నిధనే వాపి పుత్రస్య నిధనే`òపి వా | భర్తురర్ధే ప్రకుర్వంత్యా రాజ్యనాశే న మే వ్యధా || 39
యస్యా దుఃఖీ భ##వేద్భర్తా భార్యాయా వరవర్ణిని! సమృద్ధాయా స్స పాపాయా స్తస్యాః ప్రోక్తా హ్యధోగతిః 40
సా యాతి నరకం పాపా పూయాఖ్యం యుగసప్తతిమ్ | తతశ్ఛుఛున్దరీ స్యాచ్చ సప్త జన్మని భారతే41
తతః కాకీ తత శ్శ్యాలీ గోధా గోత్వేన శుద్ధ్యతి | భర్తురర్ధే తు యా విత్తం విద్యమానం న యచ్ఛతి 42
జీవితం వా వరారోహో విష్టాయాం సా భ##వేత్క్రిమిః | క్రిమి యోనివినిర్ముక్తా కాష్టీలా జాయతే శుభా 43
మమ కౌమార భావేతు మత్పితుః కాష్ఠ పాటకః| అగ్ని ప్రజ్వల నార్ధం హి కాష్టం పాటయతే చిరమ్ 44
సఖీఖీ స్సహితా చాహు క్రీడా సంసక్త మనసా | కాష్ఠం పాటయతస్తస్య సమీప మగమం తదా 45
తత్ర దృష్టా మయా సుభ్రు కాష్టీలా దారునిర్గతా | నవనీత నీభం దేహం బిభ్రాణా చాం జన త్విషమ్|| 46
కనిష్ఠికాంగులిసమా స్థాల్యే హంగులి మానికా | తాం దృష్ట్యా పతితాం భుమౌ హంతుం ధ్వాంక్షస్సమాగతః 47
యావద్గృహ్ణాతి వక్త్రేణ కాష్ఠీలాం క్షుధిత స్సతు | తావన్నివారిత స్సద్యో మాయా లోష్టేన తత్‌క్షణాత్ 48
సా ముక్తా వాయసేనేత్ధం తాడితేన వరాననే | సక్షతా తుండ సంస్పృష్టా న చ శక్తా పలాయితుమ్ 49
తత స్సా వేపమానా తు ప్రాణత్యాగ ముపాగమత్ | సిక్తా కించి జ్జలేనైవ తతస్స్వాస్థ్య ముపాగమత్ 50
తతస్సా మానుషీవాచా మామాహ వరవర్ణినీ| సంధ్యావలీతి సంబోధ్య సఖీమధ్యసమాస్థితామ్ 51
సుమంతు నామ్నోహి మునే స్సర్వజ్ఞస్య సుతా భవమ్| పూర్వ జన్మని పత్నీ చ కౌండిన్యస్యశుభాననే 52
న్యవసం కాన్యకుబ్జేతు సుసమృద్ధా సుదర్పితా | జనన్యా బంధువర్గస్య పితురిష్ట తమాహ్యహమ్ 53
పిత్రా దత్తా తతశ్చాహం కౌండిన్యాయ మహాత్మనే | కులీనాయ సురూపాయ స్త్రీ సంగరహితాయ చ 54
శయ నీయాదికం దత్తం ¸°తుకం జనకేన మే | శశ్వురేణాపి మే దత్తం సువర్ణస్యాయుతం
పురా 55
పితృశ్వశుర విత్తాభ్యాం పరిపూర్ణాభవం తదా | గోహహిష్యాది సంయుక్తా ధనధాన్య సమనిత్వా 56
ఇష్టాశ్వశురయో శ్చాహం సౌశీల్యేన జనస్య చ | కాలేన సంచతాం ప్రాప్త శ్శ్వ శురో వేదతత్త్వ విత్ 57
తం మృతం పతిమాదాయ శ్వశ్రూ రగ్నిం వివేశా సా | తతో భర్తాం జలిం దత్త్వా పిత్రో శ్శ్రాద్ధమథాకరోత్ 58
గతే మాసద్వయే దేవి! భర్తా మేరాజ మందిరం | గతః కౌతుక భావేన హృచ్ఛయేన ప్రపీడితః 59
తత్ర వేశ్యా స్సురూపాఢ్యా ¸°వనేన సమన్వితా | ప్రవిశంత్యో నృపగృహే దృష్ట స్తేన ద్విజన్మనా60
తాసాం మధ్యాత్తు ద్వే గృహ్య విత్తదానేన భూరిణా | స్వగృహే ధారయా మాస క్రీడార్ధం దుర్మతిః పతిః 61
తాభ్యాం విత్తమశేషం తు క్షయం నీతం నిషేవణాత్ |వర్షత్రయే గతే దేవి నిస్స్యో జాతః పతిర్మమ62
తతో మాం ప్రార్దయామాస దేహి మేంగ విభూషణమ్ | తన్మయా న హి దత్తం తు భ##ర్త్రే వ్యసనినే తదా 63
సుభ##గే సర్వమాదాయ గతాహం మందిరం పితుః | తతః పితీ గృహే విత్తం భృత్యాదిక మశేషతః 64
విక్రీయ దత్తం వేశ్యా భ్యాం తచ్చాపి క్షయామాగతమ్ | క్షేత్రధాన్యాది కం యచ్చ స భాండం సపరిచ్ఛదమ్ 65
స్వల్ప మూల్యేన విక్రీయ గతో నద నదీపతిమ్ | నావ మారుహ్య మే భర్తా వివే శాంతర్మహోదదేః 66
సగతో దూరమధ్వానం పశ్యమానోద్భుతాని చ | శుభే సముద్ర జాతాని జీవ చేష్టాంకితాని చ 67
ప్రభంజన వశం ప్రాప్తా సా నౌకా శతయోజనమ్ | గతా విశీర్ణతో తత్ర మృతాస్తే నావమాశ్రితాః 68
మత్పృతిర్ణైవయోగేన చలం దేవి రత్నశృంగ విభూషితమ్ | బహు నిర్ఘరణోపేతం బహు పక్షి సమన్వితమ్ 70
బహు వృక్షైస్సమా కీర్ణం నానాపుష్ప ఫలోపగైః| ఉల్లిఖంతం హి శిఖరైః ఖమధ్యం స్వాత్మన స్త్రిభిః 71
తం దృష్ట్వా పర్వతం దివ్యం త్యక్త్వా నౌకాష్ఠ మద్భుతమ్ | ఆరురోహముదాయుక్తో విత్త కాంక్షీ సులోచనే 72
వసిష్ఠ మహర్షి పలికెను:-
మోహినీ దేవి మాటలను వినిన సంధ్యావలీదేవిని ధైర్యమును వహించి ఆమెను చెప్పుము చెప్పుము అని ప్రెరేపించెను .నాకు దుఃఖమను కలిగించుమాటను ఏమి చెప్పెదవు? నాభర్తను అసత్యమునుండి కాపాడుటలో నాకు దుఃఖము కలుగదు. నా మరణమున నాపుత్ర మరణమున కూడా భర్త కొరకు చేయునపుడు రాజ్యనాశనమున కూడా నాకు బాధ కలుగదు. సర్వసంపదలున్ననూ పాపాత్మురాలగు స్త్రీవలన భర్త దుఃఖించినచో ఆస్త్రీకి అధోగతియే లభించును. అట్టి స్త్రీ డెబ్బదియుగములు వూయమను నరకమును చేరును. తరువాత ఏడు జన్మలు ఛండాలురాలుగా జన్మించును. తరువాత కాకిగా, ఎలుకగా, బల్లిగా పుట్టి చివరికి గోజన్మతో శుద్ధిపొందును. భర్త కొరకు తన వద్ద ఉన్న ధనమును ఈయని స్త్రీ ప్రాణములను అర్పించని స్త్రీ మలమున క్రిమిగా పుట్టును. క్రిమిజన్మనుండి కట్టెలో పుట్టు పురుగుగా పుట్టును. నా చిన్నతనమున నా తండ్రి వద్ద కట్టెలను కొట్టువాడు అగ్నిని చేయుటకు కట్టెను చీల్చు చుండెను. నేను చెలికత్తెలతో ఆడుచు కట్టెలను కొట్టుచున్న ఆతని దగ్గరకు చేరితిని. ఆచట నేను ఆతను చీల్చిన కట్టెనుండి బయటకు వచ్చిన కాష్ఠీలా అను పురుగును చూచితిని. వెన్నవలెమెత్తనిది, కాటుకవలె నల్లని దేహమును ధరించునదిగా యుండెను. కనిష్ఠ మంత పొడుగు, బొటనవేటు లావుగా యున్నది. అట్లు పడిన ఆ పురుగును చూచి చంపుటకు ఒక కాకి వచ్చెను ఆకలిగొన్న ఆ కాకి ఆ పురుగును గ్రహించుటకు రాగానే నేను రాయి విసిరి కాకిని పారద్రోలితిని. ఇట్లు కాకినుండి విడువబడినది. కాని కాకి ముక్కు దెబ్బతిని గాయ పడినందున పరుగెత్త జాలకపోయెను. వణుకుచు ప్రాణములు విడుచు స్థితికి చేరెను. అపుడు నేను కొన్ని చల్లని నీటిని చల్లగా స్వాస్థ్యమును పొందెను. అంతట ఆకాష్ఠీలా చెలికత్తెల మధ్యనున్న నన్ను మనుష్యవాక్కుచే సంధ్యావలీ అని పిలచి ఇట్లు పలికెను. నేను పూర్వ జన్మలో సర్వజ్ఞుడగు సుమంతుడను మహర్షికి పుత్రికగా యుంటిని. కౌండిన్యుడను బ్రాహ్మణోత్తమునకు భార్యనైతిని కాన్యకుబ్జ నగరమున సర్వసంపత్సమృద్ధురాలనై దర్పముతో జీవించుచుంటిని తల్లికి బంధువర్గమునకు తండ్రికి అత్యంతము ఇష్టురాలినైతిని. తండ్రి న్ను కౌండిన్యునకు భార్యగా ఇచ్చెను. ఆ కౌండిన్యుడు మహానుభావుడు, కులీనుడు, రూపవంతుడు, స్త్రీ సంగరహితుడు, కూడా. నా తండ్రి అల్లునికి కానుకగా శయ్యాదులనిచ్చెను నా మామాగారు కూడా నాకు పదివేల బంగారు నాణముల నిచ్చెను. అపుడు నేను తండ్రి మామలు ఇచ్చిన ధనముతో పరిపూర్ణురాలనైతిని గోమషిష్యాదులతో ధనధ్యానములతో సమృద్ధిగా నుంటిని. అత్త మామలకు ఇష్టురాలనుగా ఉంటిని. సౌశీల్యముతో జనులకు ఇష్టురాలనైతిని కొంతకాలమునకు వేద తత్వజుడ్ఞగు మా మామగారు మృతి చెందిరి. మరణించిన భర్తను తీసుకొని అత్తగారు కూడా అగ్నిలో ప్రవేశించెను. తరువాత నా భర్త తిలజలమును తర్పణమును చేసి శ్రాద్ధమును చేసెను. రెండునెలల తరువాత నా భర్త కామపీడుతుడై కుతూహాలముతో రాజమందిరమునకు వెళ్ళెను. అచట ¸°వన వతులు రూప వతులు అగు వేశ్యలను రాజగృహమున ప్రవేశించువారిని చూచెను. వారిలో ఇద్దరిని డబ్బిచ్చి తీసుకొని క్రీడించుటకు తన ఇంట్లో ఉంచుకొనెను. ఆ ఇద్దరు వేశ్యలు ధనమునంతటిని వ్యయము చేసిరి. మూడు సంవత్సరములలో నా భర్త ధనహీనుడాయెను. అంతట నా భర్త నన్ను ఆభరణములను రాయమని యడిగెను. కాని నేను వ్యసన పరుడైన నా భర్తకు ఆభరణముల నీయలేదు. నా సంపదనంతా తీసుకొని తల్లిగారిల్లు చేరితిని. తరువాత నా భర్త తండ్రి సంపదనంతా అమ్మి ఆ వేశ్యలకిచ్చెను అది కూడా వ్యయ మాయెను. భూమిని ధ్యానమును పాత్రలను వస్త్రములను చాలా తక్కువ వెలకు అమ్మి సముద్రములనకు వెళ్ళెను. సముద్రమున అద్భుతములను చూచుచు చాలాదూరము వెళ్ళెను. సముద్రములో పుట్టిన ప్రాణుల చేష్టలను చూచుచుండెను. వాయువేగమున ఆనౌక నూరుయోజనముల దూరము పయనించెను గాలివేగమునకు నౌక పగిలి అందులోని వారందరూ చనిపోయిరి. నా భర్త మాత్రము దైవవశమున ఒకపెద్ద కాష్ఠము నాశ్రయించెను. అతని పూర్మజన్మ కర్మవశమున గొని పో బడుచు రత్నశిఖర విభూషితమగు చాలా కొండవాగులు కలది, బహుపక్షిసమన్వితము, బహువృక్షసమాకీర్ణము, నానాపుష్ప ఫల సంయుతము, తమ శిఖరములచే ఆకాశము నంటుచున్న పర్వతమును చేరెను. ఆ పర్వతములను చూచి నౌకాష్ఠమును విడిచి సంతోషముతో ధనకాంక్షియై పర్వతమునధిరోహించెను.
విశశ్రామ ముహుర్తం తు క్షుత్పిపాసా సమన్వితః | తత ఉత్థాయ భక్ష్యార్థం వృక్షాంస్తత్ర వ్యలోకయత్ 73
సుపక్వాస్తత్ర మృద్వీకా దృష్ట్యా భుక్త్వా ముదాన్వితః 74
ఘన చ్ఛాయం మేఘ నిభం పంచాశత్పురుషోచ్ఛ్రయమ్ | తస్యాధస్తాత్స సుష్వాప స్వొత్తరీయం ప్రసార్య చ 75
మోహి న్యా నిద్రయాచైవ సంప్రఘార్ణిత లో చనః | తావత్సుప్తో`òతిఖిన్నో`òసౌ యావత్సూర్య్వోస్త తాం గతః 76
సూర్య్వోస్త ంసమనుప్రాప్తే సమాయాతే నిశాముఖే | అభ్యగా ద్రాక్షసో ఘోరో గర్జమానోయధా ఘనః 77
అంకేనాదాయ తన్వంగీం సీతామివదశాననః | శుభాం కాశీపతేఃపుత్రీం నామ్నా రత్నావలీం శుభామ్ 78
అధౌత పాదాం సుశ్రోణీం సౌమ్యదిక్శీర్షశాయినీమ్ | పతికామా కుమారీ సా నా విందత్సదృశం పతిమ్ 79
సర్వయోషిద్వరా బాలా రుదతీ నిద్రయాకులా | పితా తస్యాః ప్రదానే తు చింతా విష్టోహ్యహర్నిశమ్ 80
దీపచ్ఛాయాశ్రితే తన్వి శయనే సా వ్యవస్థితా | అటమానేవ పాపేన దృష్టా సా రూప శాలినీ 81
దీపరత్నై స్సుఖచితే ధారయన్తీ చ కంకణ | ఉభయోర్ధశ రత్నాని నిష్కే చ దశ పంచ చ 82
సీమన్తే సప్తరత్నాని కేయుర్వే`òష్టౌ చ పంచచ | ఏవం రత్నాంచితాం బాలాం శాతకుంభ సమప్రభామ్ 83
జహార రాజభవనా త్తాం తదా చారుహాసినీమ్ | వాయు మార్గం సమాశ్రిత్య క్షణాత్ప్రాప్తస్స్వ మాలయమ్ 84
తత్ పర్వతం స యత్రాస్తే పతిర్మే శాలమాశ్రితః | తత్ర తస్య గుహాం దృష్ట్యా సువర్ణ సదృశ్యప్రభామ్ 85
తద్భయస్యాసహా తత్ర ప్రవివేశాస్యపశ్యతః | అనేకైర్మణివిన్యాసై స్సంయుక్తాం చిత్రమందిరామ్ 86
నానాద్రవ్యసమాకీర్ణాం శయనానసంయుతామ్ | భోజనైః పాదపాత్రైశ్చ భక్ష్యభోజ్యైరనేకధా 87
ప్రవిశ్య తత్ర శయ్యాయాం ముమోచోత్పలలోచనామ్ | రుదతీ మతి సంత్రప్తాం పీన శ్రోణీ వయోధారమ్ 88
తస్యాస్తు రుదితం శ్రుత్వా తస్య భార్యాతు రాక్షసీ | అజగామ త్వరాయుక్తా యత్రాసౌ రాక్షసస్థ్సితః 89
తాం దృష్ట్వా చారుసర్వాంగీం తప్తకాం చన సప్రభామ్ | పప్రచ్ఛ నిజ భర్తారం క్రుద్ధా నిర్భర్సతీ సతీ 90
కిమర్ధమాహృతా చేయం జీవన్త్యాం మయి నిర్ఘృణ! | అన్యాం సమీహసే భార్యం నాహం భార్యా భవామితే 91
ఏవం ఋవాణాం తాం భర్తా రాక్షసీమసితేక్షణామ్ | ఉవాచ రాక్షసో హర్షా త్స్వాం ప్రియాం చారులోచనమ్ 92
త్వదర్ధ మాహృతం భక్ష్యం మయాకాశ్యాశ్శుభాననే | దైవోపపాదితం ద్వారి ద్వితీయం మమ తిష్ఠతి 93
శాల వృక్షాశ్రిత శ్శేతే విప్రశ్చైకో వరాననే | తమానయ త్వరాయుక్తా యేనాహం భక్ష్యమాచరే 94
రాక్షసస్య వచ శ్శ్రుత్వా కుమారీ సాబ్రవీదిదమ్ | మిధ్యా రాక్షసి భర్తా తే భాషతే త్వద్భయా దయమ్ 95
జ్ఞాత్వా త్వాం జరయోపేతాం విరూపామతి జిహ్మగామ్ | సుప్తాం పితృగృహే రాత్రౌ మాం సమాసాద్య కామతః 96
అనూఢాం రుదతీం భ##ద్రే భార్యార్ధం సమాపానయేత్ | ఇతీరితముపాకర్ణ్య వచనం రాజ కన్యయా 97
క్రోధయుక్తాతిమాత్రం వై బభూవ క్షిపతి వచః | తస్యాశ్చ రూప మాలోక్య సత్యమేవావధా రయత్ 98
చింతయామాస చాప్యేవం భార్యార్ధేహ్యాహృతేతి చ | అవశ్యం మూర్ధ్ని కీలం మే రోపయిష్యతి రాక్షసః 99
మాస్మ సీమంతినీ కాచయి ద్భవేత్సా భువనత్రయే | యా సాపత్న్యేన దుఃఖేన పీడ్యమానా హి జీవతి 100
సర్వేషా మే వదుఃఖానాం మహచ్చేదం న సం శయః | సామాన్య ద్రవ్యభోగాది నిష్ఠా చైవాపరా భ##వేత్ ఏవం సా బహుసంచిన్త్య భర్తారం వాక్యమ్రవీత్101
ఆకలి దప్పులతో ముహుర్తకాలము విశ్రమించెను. తరువాత ఆకలిని తీర్చుకొనుటకు లేచి అచటి వీక్షములను చూచెను. ఆ చెట్లకు చక్కగా పండిన ద్రాక్షపండ్లను చూచి చక్కగా ఆరగించి సంతోషముతో శాంతిని పొంది ఒక నిర్మలమగు సాలవృక్షమును చూచెను. దట్టమైన నీడ గలది మేఘసన్నిభము, యాభైమంది పురుషప్రమాణము కలదిగా నుండెను. ఆ చెట్టు క్రింద తన ఉత్తరీయమును పరుచుకొని నిదురించెను. మోహమును కలింగించు నిదురతో మూసుకొని పోయిన కనులుగలవాడై బాగా అలసి నందున సూర్యాస్తమయము వరకు నిదురించెను. సూర్యుడస్తమించి రాత్రి రాగా మేఘమువలె గర్జించుచు ఒక రాక్షసు డొచ్చెను. రావణాసురుడు సీతను తెచ్చునట్లుగా ఒక యువతిని తీసుకొని వచ్చెను. ఆ యువతి కాశీరాజు పుత్రిక రత్నావళి కాళ్ళు కడుగకనే ఉత్తరదిక్కున తలచేసి పడుకొని యున్న దాననుతెచ్చెను. ఆ కన్య పతిని కోరుచుండెను. కాని అనురూపుడగు పతి లభించలేదు. స్త్రీలందరిలో ఉత్తమురాలు నిద్రాకులురాలై ఏడ్చుచుండెను. కాశీరాజు తన పుత్రికా వివాహము గూర్చి రాత్రింబవళ్ళు చితించుచుండెను. దీపపు నీడ నాశ్రయించియున్న శయ్యపై పరుండియుండెను. అంతటా తిరుగుచున్న పాపియగు రాక్షసుడు చూచెను. దీపరత్నములు పొదిగిప కంకణములను ధరించియుండెను. ఆ రెండు కంకణములను పదిరత్నములను పదిహేను నిష్కములు కలది. సీమంతమున ఏడురత్నములు, కేయూరమున పదమూడురత్నములు కలవు. ఇట్లు రత్నములచే పొదగ బడిన ఆభరణములను దాల్చిన కాంచనసమాన ప్రతిభగల చారుహాసినియగు బాలను రాజభవనము నుండి అపహరించెను. ఆకాశ మార్గముననుసరించి క్షనకాలమున తన గృహమును చేరెను. నా భర్త పడుకొనియున్న సాలవృక్షముగల పర్వతమును చేరెను. ఆ పర్వతమున అతని గుహ సువర్ణ సదృశకాంతి గలది గానుండెను. ఆ రాక్షసుని భయమును సహించజాలక నా భర్త చూచుచుండగానే గుహలో ప్రవేశించెను. ఆ గుహలో చాలా మణులరాశులు కలవు. చిత్రమందిరములు కలవు. నానా ద్రవ్యసమాకీర్ణము, శయానాసనసంయుతము, భోజనములచే పాన పాత్రలచే బహువిధ భక్ష్యభోజ్యములచే కూడి యున్నది. ఇట్లు గుహలో ప్రవేశించి ఆ యువతిని శయ్యపై విడిచెను. ఆ యువతి మిక్కిలి భయముచే రోదించుచుండెను. బలిసిన పిరుదులు బలిసిన చన్నులు కలది ఆ యువతిరోదనమును విని రాక్షసుని భార్యత త్వరగా రాక్షసుడున్న ప్రదేశమున కొచ్చెను. తప్త కాంచన, సన్నిభ చారుసర్వాంగి యగు యువతిని చూచి కోపముచే భర్తను బెదిరించుచు నేను బ్రతికియుండగా ఈ యువతి నెందుకు కొనివచ్చితివి? నేను నీకు భార్యను కానా ఇంకొక భార్యను కొరుచున్నావా? అని అడిగెను ఇట్లు పలుకుచున్న తన భార్యను చూచి సంతోషముతో ఇట్లు పలికెను. ఓ శుభాననా, నీ ఆహారము కొరకు కాశీనగరము నుండి కొని వచ్చితిని. దైవముసమాకూర్చిన రెండవ ఆహారము నా కొఱకు ద్వారమున సిద్దముగా నున్నది. ఓ వరాననా ఒక బ్రాహ్మణుడు శాలవృక్షమునాశ్రయించి యున్నాడు. నీవు త్వరగా వెళ్ళి అతనిని కొనిరమ్ము. అతనిని నేను భక్షించెదను రాక్షసుని మాటలివి ఆకుమారి ఇట్ల పలికెను. ఓ రాక్షసీ! నీ భయముతో నీ భర్త అసత్యమును చెప్పుచున్నాడు. నీవు వృద్ధురాలవని కూరుపివని, కుటిలస్వభావురాలవని తెలిసి రాత్రిపూట తండ్రి గారింట్లో నిదురించి యున్న నన్ను కామార్తుడై చేరి, వావాహము కాని దానినని ఏడ్చుచున్న దానిని తన భార్య చేసుకొనుటకొరకు కొని తెచ్చెను. అని ఇట్లు రాజకుమారి చెప్పిన మాటలను విని మిక్కిలి కోపముకలదై మాటలుతబడుచుండగా ఆరాజకన్య సౌందర్యమును చూచి ఆమె మాటలు నిజమే యని నిశ్చయించుకొనెను. ఈ యువతిని భార్యగా చేసుకొనుటకే తెచ్చుకొనెను. ఇతను తప్పక నా శిరమున కీలనునాటగలడు. ఈ మూడులోకములలో సవతిదుఃఖముతో పీడించ బడుచుకూడా బ్రతికి యుండు స్త్రీ ఉండకూడదు. అన్ని దుఃఖములలో సపత్నీదుఃఖము సహించజాలని గొప్ప దుఃఖము ఈ విషయమున సంశయముతో పని లేదు. సామాన్యద్రవ్యములు భోగములు కోరుట లభించకపోవుట వేరు. దుఃఖము. ఇట్లు చాలా విషయముల నాలోచించి భర్తతో ఇట్లు పలికెను.
మదీయా భక్ష్యార్ధం త్వయానీతా సులోచనా 102
తం విప్రమానయిష్యామి భక్ష్యార్ధం తవ సువ్రత | తతస్స రాక్షసః ప్రాహ గచ్ఛ సత్వరమ్ 103
సృక్కి ణీ స్ర పతే`òత్యర్ధం తస్య భక్షణకామ్యయా | తతస్సా రాక్షసీ ఘోరా శ్రుత్వా పతిసమీరితమ్ 104
నిర్జగామ దురంతాశా దదర్శ ద్విజసత్తమమ్ | రూప ¸°వనసవయుక్తం విద్యారత్న విభూషితమ్ 105
తం దృష్ట్వా మాయయా భూత్వా సుందరీ షోడ శాబ్దికా | హృచ్ఛయేన సమావిష్టా తదంతికముపాగమత్ 106
అబ్రవీత్సా పృధుశ్రోణీ తం విప్రం ప్రీతిసంయుతా | కస్త్వం కస్మాదిహాయాతః కి మర్ధమిహ తిష్ఠతి 107
పృచ్ఛామి పతికామాహం రాక్షసీ హృచ్ఛయాతురా | స్వ భర్త్రా హం సరిత్యక్తా త్వాం పతిం కర్తుమాగతా 108
తఛ్ఛ్రుత్వా వచనం తస్యా భర్తా మే భయసంయుతః | ఉవాచ వచనం ప్రాజ్ఞో ధైర్యమాలంబ్య తాం శుభే 109
రక్షో మానుషసంయోగః కధం రాక్షసి సంభ##వేత్ | మానుషాస్తు స్మృతా భక్ష్యా రాక్షసానాం న సంశయః 110
తచ్ఛ్రుత్వా వచనం సాతు పునన్తం ప్రాహ సాదరమ్ | అసంభావ్యం చ జగతి సంభ##వేదైవయోగతః 111
పురాణ శ్రూయతేహ్యేత ద్భవిష్యం భారతే స్థితమ్| హిడంబా రాక్షసీ విప్ర భీమ భార్యా భవిష్యతి 112
మానుషోత్పాదితః పుత్రో భవిష్యతి ఘటోత్కచః | అ వధ్య స్సర్వశస్త్రాణాం శక్త్వా మృత్యుమవాప్స్యతి 113
తస్మాద్విషాదం మా విప్ర కురు త్వం దైవ యోగతః | భార్యా తవాహం సంజాతా దైవం హి బలవత్తరమ్ 114
మర్త్యలోకం గతే శ##క్రే వైరోచని నిరీక్షణ | తదన్తరం సమాసాద్య భర్తా మే ఘోర రాక్షసః 115
తద్గృహా చ్ఛక్తిమహర ద్దీప్తా శిఖామివ | సే యం సమాశ్రితాచాత్ర శాల వృక్షేతు వాసవీ 116
అహత్వైకం ద్విజశ్రేష్ఠ న గచ్ఛతి పురందరమ్ | యద్వధాయ ప్రక్షిపేత్తాం సా`òమరో`òపి వినశ్వనితి 117
సాహ మారుహ్య శాలాగ్రం శక్తి మానీయ భాస్వరామ్ | త్వత్కరే సంప్రదాస్యామి భర్తుర్నిధనకామ్యయా 118
యది త్వ మనయా శక్త్వా న హింససి నిశాచరమ్ | ఖాదయిష్యతి దుర్మేథ్రా స్త్వాం చ మాం చ న సంశయః 119
తవ శత్రు ర్మహానేష మమాపి చ పరంతప! | యేనాహృతా కుమారీహ భార్యార్ధం మందబుద్ధినా 120
సపత్న భావో జనితో మమ భర్త్రా దురాత్మనా| వ్యాపాదితే`òస్మిన్నుభయోః క్రీడనం సంభవిష్యతి 121
యద్యన్యధా వదేర్వాక్యం త్వామహం రతివర్ధన! | తదాత్మకృతపుణ్యస్య న భ##వేయం హి భాగినీ 122
యాగతిర్బ్రహ్మహత్యాయాం కుత్సితా ప్రాప్యతే నరైః | తాం గతిం హి ప్రపద్యాహం యద్యేత దనృతం భ##వేత్ 123
మద్యం హి పిబతో బ్రహ్మన్ బ్రహ్మణ్యస్య దురాత్మనః | యా గతిర్విహితా ఘోరా తాం గతిం ప్రాప్నుయామ్యహమ్ 124
గురుదార ప్రసక్తస్య జంతోః పాపనిషేవిణః | యాగతిస్తాం ద్విజశ్రేష్ఠ మిధ్యాప్రోచ్య సమాప్నుయామ్ 125
స్వర్ణన్యాసా పహరణ మేదినీ హరణ చ యా | ఆత్మనో హననే యా హి విహితా మునిభిర్ధ్విజ 126
గతిస్తా మునుగచ్ఛామి యద్యేతదనృతం వదే | పంచమ్యాం చ తధాష్టమ్యాం యత్పాపం మాంస భక్షణ 127
స్త్రీ సంగమే తురు చ్ఛేదే యత్పాతం శశినఃక్షయే | యదు చ్చిష్టే ఘృతం భోక్తు ర్మైధునేన దివాచయత్ 128
వైశ్వదేవమకర్తుశ్చ గృహిణో హి ద్విజస్య యత్ | భిక్షా మదాతుర్భిక్షుభ్యో విధవాయా ద్విభోజనాత్ 129
తైలం భోక్తుశ్చ సంక్రాంతౌ గోభిస్తీర్ధం చ గచ్ఛతః | తధా మృద మనుద్దృత్య స్నాతుః పరజలాశ##యే 130
నిషిద్ధ వృక్ష జనితం దంతకాష్ఠం చ ఖాదతః గామసేవయతో బద్దా పాఖండ పధగామినః 131
పితృదేవార్చనం కర్తుం కాష్ఠగ్రావస్థితస్య యత్ | గోహీనాం మహిషీం భర్తు ర్భిన్నకాంస్యే చ భుంజతః 132
అధౌత భిన్న పారక్య వస్త్ర సంవీత కర్మిణః | నగ్నస్త్రీ ప్రేక్షణం కర్తు రభక్ష్యస్యచ భోజినః 133
కధాయాం శ్రీ హరేర్విఘ్నం కర్తుర్యత్పాతకం ద్విజ | తేన పాపేన లిప్య్సేహం యది వచ్మి తవానృతమ్ 134
ఉక్తాన్యేతాని పాపాని యాన్యనుక్తాన్యపి ద్విజ | సర్వేషాం భ్మాగినీ చాహం యద్యేత దనృతం వదే 135
ఏవం సంబోధితో దేవి భర్తా మే పాపయా తయా | తధేతి నిశ్చయం చక్రే భవితవ్యేన మోహితః 136
నిర్ధ్రవ్యోవ్యసనాసక్తో మద్వాక్యకలుషీకృతః | ఉవాచ రాక్షసీం వాక్యం సర్వసిద్ది ప్రదాయకమ్ 137
శోఘ్ర మానయ తాం శక్తిం కరోమి వచనం తవ | సర్వమే తత్ప్రదేయం హి త్వయా మే రాక్షసే హతే138
ద్రవ్యాశయా ప్రవిష్టో`òహం సగరం తిమి సంకులమ్ | తచ్ఛ్రుత్వా రాక్షసీ శక్తిం సమానీయ నగస్థితామ్139
దదౌ మద్భర్తృ సిద్ధ్యర్ధం విముంచంతీం మహార్చిషమ్ | ఏతస్మిన్నేవ కాలే తు రాక్షసః కామమోహితః 140
గమనాయోద్యతః కన్యాం సా భీతా వాక్యమబ్రవీత్ | కుమారీసేవనే రక్షో మహాసాపం విధీయతే 141
ఛలేనాహం హృతా కాశ్యా స్సుప్తా పితృగృహాత్త్వయా | తవ దోషో న చేహాస్తి భవితవ్యం మమేదృశమ్ 142
గుహామధ్యగతాయాస్తు కో మే త్రాతా భవిష్యతి | విధియోగాద్భవేద్భర్తా విధియోగాద్భవేత్ప్రియా143
భ##వేద్విధివ శాద్విద్యా గృహాం సౌఖ్యం ధనం కులమ్ | విధినా ప్రేర్య మాణస్తు జనస్సర్వత్ర గచ్ఛతి 144
అవశ్యం భవితా భర్తా త్వమేవ రజనీచర! | విధినా విహితే మార్గే కిం కరిష్యతి పండితః 145
తస్మాదానయ తం విప్రం శాలవృక్షాశ్రితం త్విహ | ఘృతం జలం కుశానగ్నిం వివాహం విధినా కురు 146
వినాపి దర్భతో యాగ్నీ న్యధోక్త విధి మంతరా | బ్రాహ్మణసై#్యవ వాక్యేన వివాహ స్సఫలో భ##వేత్ 147
న హతో యది విప్రస్తు భార్యయా తవ రాక్షస | వృత్తే హో మస్య కార్యే తు తం భవాన్భక్షయిష్యతి 148
ఏవ ముక్తే తు వచనే తయా వై రాజకన్యయా | విశ్వస్తమానసో దర్పా న్నిర్జగామ స రాక్షసః 149
సత్వరం హృచ్ఛ యావిష్టస్తమానేతుం బహిస్థితః 150
తస్య నిర్గచ్చతో దేవి క్షుతమసీత్స్యయం కిల | సవ్యం చాప్యస్ఫురన్నేత్రం స్వవస్త్రం స్థలితం తదా 151
అనాదృత్య తు తత్సర్వం నిర్గతో`òసౌ దరీము ఖాత్ | బిభ్రాణాం మానుషం రూపం స్వామప శ్యన్నితంబినీమ్ 152
ఘటయన్తీం తు సంబంధం భార్యా భర్తృ సముద్భవమ్ | పరిత్యజామి త్వాం పాపం రాక్షసం క్రూర కర్మిణమ్ 153
మానుషీ ప్రమదాసక్తం మచ్ఛరీరస్య దూషకమ్ | తచ్ఛ్రుత్వా దారుణం వాక్యం భార్యయా సముదీరితమ్ 154
ఈర్ష్యా కోప సమాయుక్త స్త్వభ్యధావన్ని శాచరః |
ఉతిక్షప్యబాహూ ప్రవిదార్య వక్త్రం సంప్రస్థితో భక్షయితుం స చోభే 155
కాలేనలే గాత్పవనో యధైవ సముచ్చర న్వాక్య మనర్ధయుక్తమ్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ
ఉత్తరభాగే మోహినీ చరితే
కాష్ఠీలోపాఖ్యానం నామ సప్తవింశో`òధ్యాయః :156
ఓనాధా! నా ఆహారము కొరకు నీవుతెచ్చితివి. నీ ఆహారముకొరకు ఆ బ్రాహ్మణుని నేను తెచ్చెదను అని పలికెను. అంతట ఆ రాక్షసుడు నీవు వెళ్ళుము త్వరగా వెళ్ళుము నా నోరూరుచున్నది అని పలికెను అపుడు ఆ రాక్షసి భర్త మాటను విని దురాశగలదై బయలుదేరి వెళ్ళి బ్రాహ్మణోత్తముని చేరెను. ఆ బ్రాహ్మాణోత్తముని చేరెను. ఆ బ్రాహ్మణుడు అతిలోకసౌందర్యయుక్తుడు విద్యారత్న విభూషితుడుగా కనిపించెను. ఆ బ్రాహ్మణయువకుని చూచి మాయచే పదునారు సంవత్సరముల సుందరిగా మారి కామపీడితురాలై బ్రాహ్మణుని సమీపమున చేరెను. ఎంతో ప్రీతితో ఆ సుందరి బ్రాహ్మణునితో ఇట్లు పలికెను నీవెవరవు? ఎచటినుండి వచ్చితివి? ఇచటెందుకున్నావు? నేను రాక్షసిని పతిని కోరుదానను. కామాతురను. నా భర్త న్ను విసర్జించెను. నిన్ను భర్తను చేసుకొన గోరుచున్నాను. అపుడు రాక్షసి మాటలను వినిన నా భర్త ఎటులో ధైర్యమును కూడగట్టుకొని ఇట్లు పలికెను. రాక్షసమానవ సంయోగము ఎట్లు సంభవించును? రాక్షసులకు మానవులు భోజనములు. ఆ మాటలను వినిన రాక్షసి ఇట్లు మరల పలికెను. అసంభవములగు కార్యములు దైవయోగమువలన సంభవించును. భారతమున ఇట్లు జరుగునని పురాణమున వినబడుచున్నది. హిడింబ యను రాక్షసి భీమునికి భార్య కాగలదు. ఆ దంపతులకు ఘటోత్కచుడను పుత్రుడు కలుగగలడు. ఏ శస్త్రములచే వధ్యుడు కాడు. శక్తిచే చనిపోవును అని కావున నీవు విచారించకుము. దైవయోగమును అంగీకరించుము. నేను నీకు దైవయోగమున భార్యనైతినిద్రు దైవము బలవత్తరము పూర్వము ఇంద్రుడు బలిచక్రవర్తిని చూచుటకు మానవలోకమునకు వెళ్లగా ఆ సమయమున ఘోర రాక్షసుడగు నాభర్త ఇంద్రుని ఇంటినుండి జ్వలించు అగ్ని శిఖవలె నున్న శక్తి అపహరించెను. ఆశక్తిని ఈ శాలవృక్షమున దాచి ఉంచెను. ఆ శక్తి ఎవరినో ఒకరిని చంపనిదే ఇంద్రుని చేర జాలదు. శక్తి ప్రయోగించినచో అమరుడు కూడా మరణించును. కావున నేను శాలవృక్షమునధి రోహించి ప్రకాశించు శక్తిని తీసి నా భర్తకు మరణమును కోరి నీ చేతికందించగలను. ఒకవేళ నీవీ శక్తి చే రాక్షసుని చంపజాలనిచో ఆ శక్తి నిన్ను నన్ను భక్షించగలదు. ఈ రాక్షసుడు నీకు నాకు మహాశత్రువు. నా భర్త భార్యను చేసుకొనుటకు ఒక కన్యను అపహరించి తెచ్చెను. దుర్మార్గుడగు నా భర్త నాకు సవతిపోరును కలిగించెను. అతనిని చంపినచో మనము అనందముతో క్రీడించవచ్చును. ఓ రతివర్ధనా! నీవు నామాటను కాదన్నచో నేను చేసియున్న పుణ్యముల ఫలితములు నాకు చేరవు. నా మాట అబద్ధమైనచో నాకు బ్రాహ్మహత్యాపాతకము సంక్రమించును. మద్యపానమనుచేయు బ్రాహ్మణునకు కలుగు దుర్గతి నాకు సంక్రమించును. గురుదారరతునకు కలుగు పాపము నాకు సంక్రమించును. దాచి ఉంచిన బంగారమును హరించినచో కలుగు పాపము, భూమిని హరించుటలో కలుగు పాపము ఆత్మహత్యాపాపము నేనబద్దము పలికినచో నాకు సంక్రమించును పంచమీ, అష్టమీతిధిన మాంసభక్షణ వలన కలుగు పాపము, అమావాస్య నాడు స్త్రీసంగమముచేసిన చెట్టును కొట్టిన కలుగు పాపము, ఉచ్చిష్టఘృతభోజనునకు కలుగు పాపము దివామైధునము వలన కలుగు పాపము భిక్షుకులకు భిక్షపెట్టనివారికి కలుగు పాపము, విధవకు రెండుపూటల భోజనము వలన కలుగు పాపము, సంక్రాన్తి సమయమున తైలభోజికి కలుగు పాపము, గోవులతో తీర్ధమునకు వెళ్లుటలో కలుగు పాపము ఇతర జలాశయమున మన్ను నుద్ధరించక స్నానము చేసిన వానికి కలుగు పాపము నిషేధించబడిన వృక్షము యొక్క దంతకాష్ఠమునుపయోగించువానికి కలుగు పాపము, గోవును సేవించినవానికి కలుగు పాపము, పాషాండమార్గముననుసరించువానికి కలుగు పాపము కాష్ఠమునందు శిలయందు పితృదేవతనర్చించువానికి కలుగు పాపము, గోవులు లేకుండగా మహిషములను పోషించువానికి కలుగు పాపము నగ్నస్త్రీని వీక్షించిన వారికి కలుగు పాపము అభక్ష్యభోజికి కలుగు పాపము. శ్రీహరికధకు విఘ్నము చేయువానికి కలుగు పాపము పాతకము నేను అబద్ధమునుచెప్పినచో నాకు కలుగును. ఇట్లు చెప్పిన పాపములు చెప్పని పాపములుకూడా అబద్దము చెప్పినచో నాకు కలుగును. ఇట్లు పాపురాలగు రాక్షసి బోధించగా నా భర్త దైవము చే మోహితుడై అట్లు చేయుటకు నిశ్చయించెను. ద్రవ్యహీనుడు వ్యసనాసక్తుడు. నా మాటలచే బాధపడినవాడు కావున రాక్షసితో కార్యసిద్ధి ప్రదాయక మగు మాటలను పలికెను. ఆ శక్తిని త్వరగా తెమ్ము. నీ మాటనాచరించెదను. నేను రాక్షసుని చంపెదను. కాని నాకు ఈ సంపదనంతా ఈయవలయును. ద్రవ్యమును సంపాదింవలయునను ఆశతోనే నేను సముద్రమున ప్రవేశించితిని నా భర్తమాటను వినిన రాక్షసి వృక్షముపై నున్న శక్తిని తీసి నాభర్తకు కార్య సిద్ధికొరకిచ్చెను. ఇంతలో కామమోహితుడగురాక్షసుడు కన్యను పొందుటకు సిద్ధపడెను. అంతట భీతిచెందిన రాజకుమారి ఇట్లు పలికెను. కన్యను పొందినచో మహాపాపము సంక్రమించును. తండ్రి గృహమున నిదురించియున్న నన్ను కాశీ నుండి మోసముతో అపహరించితివి. ఇందులో నీ దోషమేమియులేదు. నాకిట్లు జరుగవలసియున్నది. గుహమధ్యలో నున్న నన్ను రక్షించువారెవ్వరు? దైవయోగమువలననే భర్త లభించును. దైవయోగమువలననే ప్రియురాలు లభించును. విధి ప్రేరణచేతనే ప్రాణులు అంతటా తిరుగు చుందురు. ఓ రాక్షసా నీవే నాకు భర్తవు కావలసియున్నది. దైవ విహిత విధానమున పండితుడేమి చేయగలడు? కావున శాలవృక్షమునాశ్రయించియున్న యీ బ్రాహ్మణుని తెమ్ము, ఘృతమును, జలమును, దర్భలను అగ్నిని తెచ్చి శాస్త్రోక్త విధిచే వివాహమును చేసుకొనుము. దర్భాదులులేకున్ననూ యధోక్త విధిననుసరించకున్ననూ బ్రాహ్మణ వాక్యముచే వివాహము సఫలమగును. నీ భార్య ఆ బ్రాహ్మణుని చంపనిచో అతనితో హోమమును జరిపించుము హోమసమాప్తి తరువాత అతనిని నీవు భక్షించుము. ఆ రాజకన్య ఇట్లు పలుకగా మనసున విశ్వాసము కలిగి దర్పముతో బయలుదేరెను. కామర్తుడై త్వరగా ఆ బ్రాహ్మణుని తెచ్చుటకు బయట నిలిచెను. అట్లు బయటకు వెడలుచున్న రాక్షసునకు తుమ్ము వచ్చెను. ఎడమ కన్ను అదిరెను. వస్త్రము జారెను. ఆశకునములను లెక్కించకనే గుహ నుండి బయలువెడలెను. బయట మానుషస్త్రీ రూపమును ధరించి యున్న తన భార్యను చూచెను. ఆ బ్రాహ్మణునితో భార్యభర్త సంబంధమును కూర్చుట చూచెను. అంతట ఆ రాక్షసీ క్రూరకర్ముడవు పాపివి, మనుష్యకన్యాసక్తుడవు నా శరీరమును దూషింపచేసిన నిన్ను విడుచున్నాను. అని పలికెను. ఆ కఠిన వాక్యములను విని ఈర్ష్యాకోపములచే వారిని చంపుటకు పరుగుతీసెను. చేతులను చాచి నోరు తెరిచి కాలవశముతో వచ్చు వాయు వేగముతో అనర్ధవాక్యములను పలుకుచు వారిని భక్షించుటకు పరుగుతీసెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
ఉత్తర భాగమున మోహినీ చరితమున
కాష్ఠీలోపాఖ్యానమను
ఇరువదియేడవ అధ్యాయము